AP School Holiday Tomorrow – రేపు స్కూళ్లకు సెలవు ఉందా? జిల్లాల వారీ List (Live)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP School Holiday Tomorrow — రేపు స్కూళ్లకు సెలవు ఉందా అని తెలుసుకోవాలంటే ఈ పేజీ చూడండి. వర్షాలు, తుపాన్లు, ఎన్నికల వల్ల జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వం ప్రకటించే సెలవులను జిల్లాల వారీగా ఇక్కడే ఇస్తాం. కలెక్టర్ ఉత్తర్వు లేదా నమ్మదగిన వార్తల్లో వచ్చిన వాటినే రాస్తాం; WhatsApp లో తిరిగే forwards ని కాదు.

తాజా సమాచారం — 3 నవంబర్ 2026, రాత్రి 10:45

రేపు (4 నవంబర్, బుధవారం) రాష్ట్రమంతా సెలవు లేదు. MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే 4, 5 నవంబర్ సెలవు. మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి.

వర్షాల సెలవు (4 నవంబర్): ఈ రాత్రి 10:45 వరకు ఏ జిల్లా కలెక్టర్ సెలవు ఉత్తర్వూ వార్తల్లో కనిపించలేదు. మురసు తుపాను ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. ఉదయం స్కూల్‌కు బయలుదేరే ముందు ఈ పేజీ మళ్లీ చూడండి.

ఈ రోజు (3 నవంబర్) మురసు తుపాను కారణంగా బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం — ఈ 6 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.


AP School Holidays — నవంబర్ 2026 జిల్లాల వారీ list

తేదీఎక్కడ, ఎవరికికారణం, ఉత్తర్వు
3 నవంబర్
(మంగళ)
బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం — అన్ని విద్యాసంస్థలుమురసు తుపాను; జిల్లా కలెక్టర్ల ఉత్తర్వులు
4, 5 నవంబర్
(బుధ, గురు)
MPTC, ZPTC పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు మాత్రమేఎన్నికల పోలింగ్ (5 నవంబర్); ముందు రోజు నుంచే సిబ్బంది కేంద్రాలను స్వాధీనం చేసుకుంటారు
7 నవంబర్
(శని)
ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా ఎంపిక చేసిన స్కూళ్లు, కాలేజీలు మాత్రమేMPTC, ZPTC ఓట్ల లెక్కింపు

మీ స్కూల్ పోలింగ్ కేంద్రమా కాదా అనేది మీ ప్రధానోపాధ్యాయులు చెబుతారు. పోలింగ్ కేంద్రం కాని స్కూళ్లు 4, 5 తేదీల్లో కూడా తెరిచే ఉంటాయి.


SA1 పరీక్షల మీద ప్రభావం ఉంటుందా?

SA1 పరీక్షలు 9 నుంచి 20 నవంబర్ 2026 వరకు (28-10-2026 అధికారిక ఉత్తర్వు). ఈ రోజు వరకు SA1 వాయిదా గురించి ఏ ఉత్తర్వూ రాలేదు. పై సెలవులన్నీ SA1 కి ముందే ఉన్నాయి. SA1 రోజుల్లో ఏ జిల్లాలోనైనా వర్షాల సెలవు వస్తే, ఆ పరీక్షకు కొత్త తేదీని జిల్లా విద్యాశాఖ ప్రకటిస్తుంది; అది వచ్చిన వెంటనే ఇక్కడ చేరుస్తాం. సబ్జెక్టు వారీ టైమ్ టేబుల్, సాధన పేపర్లు AP SA1 2026-27 – సిలబస్, టైమ్ టేబుల్, ప్రశ్నపత్రాలు పేజీలో ఉన్నాయి.


సెలవు ఉందో లేదో ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి

  1. మీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు / క్లాస్ టీచర్: స్కూల్ WhatsApp గ్రూప్‌లో వచ్చే సమాచారమే అన్నింటికంటే నమ్మదగినది.
  2. జిల్లా కలెక్టర్ ప్రకటన: వర్షాల సెలవులు కలెక్టర్ పేరుతోనే వస్తాయి. సాధారణంగా ముందు రోజు సాయంత్రం లేదా అదే రోజు తెల్లవారుజామున ప్రకటిస్తారు.
  3. జిల్లా విద్యాశాఖ అధికారి (DEO): పరీక్షల వాయిదా, కొత్త తేదీలు DEO ద్వారా వస్తాయి.
  4. ఎవరో forward చేసిన పాత లిస్ట్‌ నమ్మకండి: గత సంవత్సరం లేదా వేరే రాష్ట్రం లిస్ట్‌లు చాలాసార్లు తిరుగుతుంటాయి. తేదీ, జిల్లా పేరు సరిచూడండి.

సెలవు ప్రకటన వచ్చిన వెంటనే తెలియాలంటే మా WhatsApp Channel ను follow అవ్వండి.


ఇక ముందు ఎన్నికల సెలవులు (వార్తల ప్రకారం)

వార్తల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మూడు దశల్లో 26 నవంబర్, 29 నవంబర్, 2 డిసెంబర్ తేదీల్లో జరిగే అవకాశం ఉంది; అప్పుడు కూడా పోలింగ్ కేంద్రాల స్కూళ్లకు సెలవు ఉంటుంది. ఇవి అధికారిక షెడ్యూల్ వచ్చాక మాత్రమే పై పట్టికలో చేరుస్తాం.


AP School Holiday Tomorrow — FAQs


1. రేపు (4 నవంబర్) AP లో అన్ని స్కూళ్లకు సెలవా?

కాదు. MPTC, ZPTC పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే 4, 5 నవంబర్ సెలవు. మిగతా స్కూళ్లు నడుస్తాయి. వర్షాల కారణంగా ఏ జిల్లాకైనా సెలవు ప్రకటిస్తే పై box లో update చేస్తాం.

2. 3 నవంబర్ ఏ జిల్లాల్లో సెలవు ఇచ్చారు?

మురసు తుపాను కారణంగా బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

3. 7 నవంబర్ సెలవు ఎవరికి?

MPTC, ZPTC ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా ఎంపిక చేసిన స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే.

4. SA1 పరీక్షలు వాయిదా పడ్డాయా?

ఇప్పటివరకు లేదు. SA1 పరీక్షలు 9 నుంచి 20 నవంబర్ వరకు అధికారిక టైమ్ టేబుల్ ప్రకారమే. ఏ మార్పు వచ్చినా ఈ పేజీలో, మా SA1 పేజీలో చేరుస్తాం.

5. వర్షాల సెలవు ఎవరు ప్రకటిస్తారు?

ఆ జిల్లా కలెక్టర్. వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా, సాధారణంగా ముందు రోజు సాయంత్రం లేదా తెల్లవారుజామున ప్రకటిస్తారు. ఒక జిల్లాలో సెలవు ఉంటే పక్క జిల్లాలో ఉండాలని లేదు.

6. సెలవు రోజు జరగాల్సిన స్లిప్ టెస్ట్ ఏమవుతుంది?

Mission March స్లిప్ టెస్టులు, స్కూల్ పరీక్షలు సాధారణంగా స్కూల్ తెరిచిన తర్వాతి రోజుకు మారుస్తారు. మీ స్కూల్ టీచర్‌ను అడిగి నిర్ధారించుకోండి.


ఆధారాలు

తుపాను సెలవులు: సంబంధిత జిల్లా కలెక్టర్ల ఉత్తర్వులు (Sakshi Education, Daily Jagran వార్తలు, 2–3 నవంబర్ 2026). ఎన్నికల సెలవులు: MPTC, ZPTC ఎన్నికలకు అధికారుల ఉత్తర్వులు (10TV, Asianet Telugu వార్తలు, 3 నవంబర్ 2026). SA1 తేదీలు: పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు Rc. No. 3475819/SAT-I/2026-27, తేదీ 28-10-2026.