AP SA1 2026-27 – Key Papers (Answer Keys), ప్రశ్నపత్రాలు, టైమ్ టేబుల్ (Class 6 to 10)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP SA1 2026-27 — SA1 (Summative Assessment-1) అంటే FA1, FA2 తర్వాత వచ్చే మొదటి పెద్ద పరీక్ష. జూన్ నుంచి అక్టోబర్ వరకు బోధించిన పాఠాలన్నీ ఒకేసారి వస్తాయి, ఒకటి నుంచి పది తరగతులకూ. 28 అక్టోబర్ 2026 న పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు (Rc. No. 3475819/SAT-I/2026-27) తో సబ్జెక్టు వారీ టైమ్ టేబుల్, మార్కుల విధానం అధికారికంగా వచ్చాయి. 6 నుంచి 10 తరగతుల సాధన పేపర్లు, అధికారిక టైమ్ టేబుల్, పరీక్షల రోజుల ప్రణాళిక — అన్నీ ఈ పేజీలో.

AP SA1 Key Papers 2026 – Answer Keys (Telugu, Hindi, English)

SA1 అసలు పేపర్ల జవాబులు — పరీక్ష రోజే ఇక్కడ

తెలుగు (9), హిందీ (10), ఇంగ్లీష్ (11 నవంబర్) పరీక్షల Answer Key (జవాబులు) వచ్చేశాయి – కింది పట్టికలో మీ తరగతి లింక్ నొక్కండి. 12 నవంబర్ గణితం: 6 నుంచి 10 తరగతుల Maths Answer Key అన్నీ వచ్చేశాయి. SA1 ను చాలా మంది విద్యార్థులు Essay 1 పరీక్ష అని కూడా అంటారు: Essay 1 Key Papers 2026, Essay 1 ప్రశ్నపత్రాలు, Essay 1 టైమ్ టేబుల్ అన్నీ ఈ పేజీలోనే. 16 నవంబర్ భౌతిక శాస్త్రం / సైన్స్: 6 నుంచి 10 తరగతుల Science / PS Answer Key అన్నీ వచ్చేశాయి. 17 నవంబర్ జీవ శాస్త్రం: 8, 9, 10 తరగతుల Biology Answer Key అన్నీ వచ్చేశాయి. 18 నవంబర్ సాంఘిక శాస్త్రం: 6 నుంచి 10 తరగతుల Social Answer Key అన్నీ వచ్చేశాయి.

తరగతిపేజీపరీక్ష సమయం
6వ తరగతి6th Telugu Key | 6th Hindi Key | 6th English Key | 6th Maths Key | 6th Science Key | 6th Social Keyమధ్యాహ్నం 1:15 – 4:15
7వ తరగతి7th Telugu Key | 7th Hindi Key | 7th English Key | 7th Maths Key | 7th Science Key | 7th Social Keyమధ్యాహ్నం 1:15 – 4:15
8వ తరగతి8th Telugu Key | 8th Hindi Key | 8th English Key | 8th Maths Key | 8th PS Key | 8th Bio Key | 8th Social Keyఉదయం 9:15 – 12:30
9వ తరగతి9th Telugu Key | 9th Hindi Key | 9th English Key | 9th Maths Key | 9th PS Key | 9th Bio Key | 9th Social Keyఉదయం 9:15 – 12:30
10వ తరగతి10th Telugu Key | 10th Hindi Key | 10th English Key | 10th Maths Key | 10th PS Key | 10th Bio Key | 10th Social Keyఉదయం 9:15 – 12:30

జవాబులు వచ్చిన వెంటనే తెలియాలంటే మా WhatsApp Channel ను follow అవ్వండి.


AP SA1 2026-27 — ముఖ్య వివరాలు

అంశంవివరాలు
పరీక్ష పేరుSAT-1 MP / Summative Assessment-1 (SA1)
తరగతులు1 నుంచి 10 (ఈ పేజీలో 6 – 10 తరగతుల సాధన పేపర్లు)
సిలబస్ పరిధిజూన్ నుంచి అక్టోబర్ వరకు బోధించిన పాఠాలు
2026-27 తేదీలు9 – 20 నవంబర్ 2026 (అధికారిక ఉత్తర్వు, 28-10-2026)
గత సంవత్సరం (2025-26)10 నవంబర్ – 19 నవంబర్ 2025
పరీక్ష సమయం (2026-27)8 నుంచి 10 తరగతులు — ఉదయం 9:15 నుంచి 12:30; 6, 7 తరగతులు — మధ్యాహ్నం 1:15 నుంచి 4:15; 1 నుంచి 5 తరగతులు — ఉదయం 9:30 నుంచి 12:30
మార్కులు3 – 9 తరగతులు: 80 (33 ప్రశ్నలు); 8, 9 తరగతుల PS, BS: 40 చొప్పున; 10వ తరగతి: 100
మూల్యాంకనం, ప్రోగ్రెస్ కార్డులు25 నవంబర్ లోపు మూల్యాంకనం; 30 నవంబర్ లోపు ప్రోగ్రెస్ కార్డులు
ఉత్తర్వుDirector of School Education, AP — Rc. No. 3475819/SAT-I/2026-27, తేదీ 28-10-2026

AP SA1 Time Table 2026-27 — 6 నుంచి 10 తరగతులు

అధికారిక ఉత్తర్వులోని సబ్జెక్టు వారీ తేదీలు. 8 – 10 తరగతులకు ఉదయం 9:15 – 12:30, 6, 7 తరగతులకు మధ్యాహ్నం 1:15 – 4:15. 13, 14, 15 నవంబర్ తేదీల్లో పరీక్షలు లేవు.

తేదీపేపర్
9 నవంబర్ (సోమ)ప్రథమ భాష (తెలుగు)
10 నవంబర్ (మంగళ)ద్వితీయ భాష (హిందీ)
11 నవంబర్ (బుధ)తృతీయ భాష (English)
12 నవంబర్ (గురు)గణితం
16 నవంబర్ (సోమ)సైన్స్ (6, 7) / భౌతిక శాస్త్రం (8 – 10)
17 నవంబర్ (మంగళ)జీవ శాస్త్రం (8 – 10)
18 నవంబర్ (బుధ)సాంఘిక శాస్త్రం
19 నవంబర్ (గురు)Composite Course Paper-II (సంస్కృతం / హిందీ / అరబిక్ / పర్షియన్); OSSC Paper-I
20 నవంబర్ (శుక్ర)OSSC Paper-II

AP SA1 Time Table 2026-27 అధికారిక – 9 నుంచి 20 నవంబర్ 2026 సబ్జెక్టు వారీ తేదీలు

1 నుంచి 5 తరగతుల తేదీలు, ప్రతి తరగతి సబ్జెక్టు వారీ అధికారిక పాఠాల జాబితా AP SA1 Syllabus 2026-27 – Class 1 to 10 పేజీలో ఉన్నాయి.


SA1 సాధన ప్రశ్నపత్రాలు 2026-27 — తరగతి వారీగా

ప్రతి పేపర్ ఈ ఏడాది SA1 సిలబస్ ప్రకారం తయారైంది; ప్రతి ప్రశ్నకు “జవాబు చూడండి” బటన్‌తో జవాబు ఉంది. మీ తరగతి box లో సబ్జెక్టు ఎంచుకోండి.

మీ తరగతికి వెళ్లండి: 10వ తరగతి | 9వ తరగతి | 8వ తరగతి | 7వ తరగతి | 6వ తరగతి

10వ తరగతి SA1 సాధన పేపర్లు (జవాబులతో)

ఏ పాఠాలు చదవాలో: 10వ తరగతి SA1 సిలబస్ 2026-27

9వ తరగతి SA1 సాధన పేపర్లు (జవాబులతో)

తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సాంఘిక శాస్త్రం పేజీల్లో 80 మార్కుల పూర్తి SA1 నమూనా పేపర్; భౌతిక, జీవ శాస్త్రాల్లో 40 మార్కుల పేపర్ — ఈ ఏడాది అధికారిక నమూనాలో, జవాబులతో.

ఏ పాఠాలు చదవాలో: 9వ తరగతి SA1 సిలబస్ 2026-27


SA1 కి, FA2 కి తేడా ఏమిటి

ఇప్పుడే FA2 ముగిసింది కాబట్టి ఈ తేడా తెలిసి ఉండటం ముఖ్యం. చాలామంది విద్యార్థులు SA1 ను FA లాంటిదే అనుకుని తక్కువ సమయం కేటాయిస్తారు.


అంశంFA2SA1
పరిధిరెండు నెలల పాఠాలుఐదు నెలల పాఠాలు
స్వభావంనిర్మాణాత్మక (Formative)సంగ్రహణాత్మక (Summative)
ప్రశ్నపత్రంచిన్నది, 35 మార్కులు (FA మొత్తం 50)పూర్తి స్థాయి ప్రశ్నపత్రం
సమయంఒక గంట స్థాయిమూడు గంటల స్థాయి
సిద్ధం కావడానికివారం చాలుఆరు ఏడు వారాలు కావాలి

ఇప్పుడే ముగిసిన FA2 వివరాలు, సిలబస్, ప్రశ్నపత్రాలు అన్నీ AP FA2 2026-27 – Syllabus, Model Papers & Question Papers పేజీలో ఉన్నాయి. ఆ పేపర్లు SA1 కి కూడా పనికొస్తాయి, ఎందుకంటే ఆ పాఠాలు SA1 పరిధిలోనూ ఉన్నాయి.


AP SA1 2026-27 syllabus coverage exam timeline and seven week plan


SA1 సిలబస్ 2026-27 — ఎంత చదవాలి

SA1 పరిధి జూన్ నుంచి అక్టోబర్ వరకు. అంటే FA1 సిలబస్, FA2 సిలబస్ రెండూ ఇందులో ఉన్నాయి, వాటితో పాటు అక్టోబర్‌లో చెప్పిన పాఠాలు. మొత్తం పుస్తకం కాదు — కానీ FA కంటే చాలా ఎక్కువ.

1 నుంచి 10 తరగతులకు సబ్జెక్టు వారీ పూర్తి జాబితా, అక్టోబర్‌లో కొత్తగా చేరిన పాఠాలతో సహా, AP SA1 Syllabus 2026-27 – Class 1 to 10 పేజీలో ఇచ్చాం. అది 28 అక్టోబర్ 2026 న వచ్చిన అధికారిక సిలబస్ అనుబంధం ప్రకారం. క్యాలెండర్‌లో ఉండి SA1 జాబితాలో లేని పాఠాలు (ఉదాహరణకు 9వ తరగతి గణితంలో Proofs in Mathematics, 10వ సోషల్‌లో The Age of Industrialisation) కూడా అక్కడ విడిగా చూపించాం.

ఈలోపు మీ తరగతికి ఏ పాఠాలు జరిగాయో తెలుసుకోవడానికి FA2 సిలబస్ పేజీలు ఉపయోగపడతాయి — 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి.


SA1 పరీక్షల రోజుల ప్రణాళిక — టైమ్ టేబుల్ ప్రకారం

ఇప్పుడు కొత్త పాఠాలు మొదలుపెట్టే సమయం కాదు. ప్రతి పేపర్ ముందు సాయంత్రం ఆ సబ్జెక్టుకే కేటాయించండి. 12 నవంబర్ గణితం తర్వాత మూడు రోజుల విరామం వస్తుంది — సైన్స్, సోషల్ ఎక్కువ భారం కాబట్టి ఆ రోజులు వాటికే.

ఎప్పుడుతర్వాతి పేపర్ఏమి చూడాలి
8 నవంబర్ (ఆది)తెలుగు (9)పద్యాలు, ప్రతిపదార్థం; సంధి, సమాసం, అలంకారం, ఛందస్సు; లేఖ ఒక్కటి రాసి చూడండి
9 నవంబర్ సాయంత్రంహిందీ (10)పాఠాల ముఖ్య ప్రశ్నలు, व्याकरण అంశాలు, పత్ర లేఖనం ఆకారం
10 నవంబర్ సాయంత్రంEnglish (11)Grammar, letter / diary / bio-sketch formats, పద్యాల central idea
11 నవంబర్ సాయంత్రంగణితం (12)సూత్రాల జాబితా ఒకసారి; ప్రతి అధ్యాయం నుంచి రెండు లెక్కలు
13 – 15 నవంబర్సైన్స్ / PS (16), BS (17), సోషల్ (18)మొదటి రోజు PS లెక్కలు, రసాయన సమీకరణాలు; రెండో రోజు జీవ శాస్త్రం పటాలు; మూడో రోజు సోషల్ అక్టోబర్ పాఠాలు, పటం గుర్తులు
16 నవంబర్ సాయంత్రంజీవ శాస్త్రం (17)పటాలు భాగాల పేర్లతో గీయడం, నిర్వచనాలు
17 నవంబర్ సాయంత్రంసోషల్ (18)పటం ప్రశ్న సాధన, ముఖ్య సంవత్సరాలు, పట్టికలు

SA1 లో మార్కులు ఎక్కడ పోతాయి

  • సమయ నిర్వహణ — FA పేపర్ చిన్నది కాబట్టి సమయం సరిపోతుంది. SA1 పొడవైనది. చివరి ప్రశ్నలకు సమయం మిగలకపోవడం ఇక్కడ సాధారణం.
  • పాత పాఠాలు — జూన్, జూలై పాఠాలు చాలామంది వదిలేస్తారు. ప్రశ్నపత్రంలో వాటికీ వాటా ఉంటుంది.
  • పొడవైన జవాబులు — FA లో చిన్న జవాబులు సరిపోతాయి. SA1 లో వివరణాత్మక జవాబులు అడుగుతారు, ఆ అలవాటు ముందే చేసుకోవాలి.
  • బొమ్మలు, పటాలు — సైన్స్, సాంఘికంలో వీటికి ప్రత్యేక మార్కులు. పేర్లు రాయకపోతే బొమ్మ గీసినా ప్రయోజనం లేదు.

తల్లిదండ్రుల కోసం

SA1 మార్కులు పురోగతి నివేదికలో నమోదవుతాయి, కానీ అవే ఆఖరి తీర్పు కాదు. ఈ పరీక్ష అసలు ఉపయోగం — ఏ సబ్జెక్టులో పునాది బలహీనంగా ఉందో మార్చి లోపు తెలియడం. పిల్లవాడు ఏ ప్రశ్నలో తప్పు చేశాడో చూడండి, ఎన్ని మార్కులు వచ్చాయో కాదు. పదో తరగతి అయితే AP Mission March SSC 2027 Action Plan పేజీలో బోర్డు పరీక్ష వరకు ఉన్న ప్రణాళిక ఉంది.


FAQs


1. AP SA1 2026-27 పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?

28 అక్టోబర్ 2026 ఉత్తర్వు ప్రకారం 9 నుంచి 20 నవంబర్ 2026 వరకు, 1 నుంచి 10 తరగతులకు. 6 నుంచి 10 తరగతులకు: 9 తెలుగు, 10 హిందీ, 11 English, 12 గణితం, 16 సైన్స్ / భౌతిక శాస్త్రం, 17 జీవ శాస్త్రం, 18 సాంఘిక శాస్త్రం.


2. SA1 full form ఏమిటి?

SA1 అంటే Summative Assessment-1 — తెలుగులో సంగ్రహణాత్మక మూల్యాంకనం-1. ఇది ఏడాదిలో మొదటి పెద్ద రాత పరీక్ష (అర్ధ సంవత్సర పరీక్ష / Half Yearly). FA అంటే Formative Assessment — నిర్మాణాత్మక మూల్యాంకనం; ఇవి చిన్న, తరచుగా జరిగే పరీక్షలు (FA1, FA2). SA1 తర్వాత FA3, ఏడాది చివర SA2 వస్తాయి.


3. SA1 టైమ్ టేబుల్ ఎక్కడ దొరుకుతుంది?

ఈ పేజీ పైభాగంలోని పట్టికలో — అది పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు Rc. No. 3475819/SAT-I/2026-27 (28-10-2026) లోనిదే. 1 నుంచి 5 తరగతుల తేదీలు, తరగతుల వారీ సిలబస్ AP SA1 Syllabus 2026-27 – Class 1 to 10 పేజీలో. ఇంటర్నెట్‌లో కనిపించే పాత టైమ్ టేబుల్స్‌లో సంవత్సరం చూసుకోండి.


4. SA1 సిలబస్ ఎంత పరిధిలో ఉంటుంది?

జూన్ నుంచి అక్టోబర్ వరకు తరగతిలో బోధించిన పాఠాలు. FA1, FA2 సిలబస్ కూడా ఇందులో కలిసే ఉంటుంది — అదే SA1 ను FA కంటే పెద్దది చేసేది.


5. SA1, FA2 మధ్య తేడా ఏమిటి?

FA2 ఒక్కో సబ్జెక్టుకూ 35 మార్కుల చిన్న రాత పరీక్ష, రెండు నెలల పాఠాలు. SA1 ఐదు నెలల పాఠాలను కలిపి జరిగే పెద్ద పరీక్ష, పూర్తి ప్రశ్నపత్రంతో.


6. SA1 కి ఎన్ని మార్కులు?

28-10-2026 ఉత్తర్వు ప్రకారం 3 నుంచి 9 తరగతులకు ప్రతి సబ్జెక్టు పేపర్ 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). 8, 9 తరగతుల్లో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం వేర్వేరు పేపర్లు — ఒక్కొక్కటి 40 మార్కులు, 17 ప్రశ్నలు (10 × 1, 3 × 2, 2 × 4, 2 × 8). 1, 2 తరగతులకు 32 ప్రశ్నలు, 80 మార్కులు (20 × 2, 10 × 3, 2 × 5). పదో తరగతికి SSC పబ్లిక్ పరీక్ష నమూనాలో 100 మార్కులు (భౌతిక, జీవ శాస్త్రాలకు 50 చొప్పున). 9వ తరగతి పేజీల్లో ఈ నమూనాలోని పూర్తి పేపర్లు ఉన్నాయి.


7. పరీక్ష సమయం ఎంత?

ఈ ఏడాది ఉత్తర్వు ప్రకారం ఎనిమిది నుంచి పది తరగతులకు ఉదయం 9:15 నుంచి 12:30, ఆరు, ఏడు తరగతులకు మధ్యాహ్నం 1:15 నుంచి 4:15, ఒకటి నుంచి ఐదు తరగతులకు ఉదయం 9:30 నుంచి 12:30.


8. SA1 Answer Key ఎప్పుడు వస్తుంది?

పరీక్ష ముగిసిన కొన్ని రోజుల్లో పాఠశాలల ద్వారా Principles of Evaluation విడుదలవుతుంది. అది వచ్చాక సబ్జెక్టు వారీగా ఈ పేజీ నుంచి లింక్ ఇస్తాం.


9. FA2 అయిపోయింది, ఇప్పుడు SA1 కి ఎప్పటి నుంచి చదవాలి?

ఇప్పుడు పరీక్షకు రోజులే మిగిలాయి. కొత్తగా ఏదీ మొదలుపెట్టకుండా పై “పరీక్షల రోజుల ప్రణాళిక” పాటించండి — ప్రతి పేపర్ ముందు రోజు ఏమి చూడాలో అక్కడ ఉంది. 13 – 15 నవంబర్ విరామాన్ని సైన్స్, సోషల్‌కు వాడుకోండి.


10. FA1, FA2 పేపర్లు SA1 కి పనికొస్తాయా?

బాగా పనికొస్తాయి. SA1 పరిధిలో ఆ పాఠాలు కూడా ఉన్నాయి. ఎక్కడ మార్కులు పోయాయో ఆ రెండు పేపర్లలోనే కనిపిస్తుంది — వాటిని పారేయకుండా దాచుకోండి.


11. SA1 లో ఫెయిల్ అయితే ఏమవుతుంది?

SA1 అనేది అంతర్గత మూల్యాంకనం. పదో తరగతిలో ఇది బోర్డు పరీక్ష కాదు, కానీ మార్కులు పురోగతి నివేదికలో నమోదవుతాయి, ఉపాధ్యాయులు బలహీన అంశాలు గుర్తించడానికి వాడతారు.


12. పదో తరగతికి SA1 ఎందుకు ముఖ్యం?

మార్చి బోర్డు పరీక్షకు ముందు వచ్చే మొదటి పూర్తి స్థాయి పరీక్ష ఇదే. ప్రశ్నపత్రం రూపం, సమయ నిర్వహణ రెండూ ఇక్కడే పరీక్షించబడతాయి.


13. ఆరు నుంచి తొమ్మిది తరగతులకూ SA1 ఉంటుందా?

ఉంటుంది. ఒకటి నుంచి పది తరగతులన్నిటికీ SA1 జరుగుతుంది, పరీక్ష సమయం మాత్రం తరగతిని బట్టి మారుతుంది — 6, 7 తరగతులకు మధ్యాహ్నం.


14. ఇంటర్‌నెట్‌లో కనిపించే SA1 ప్రశ్నపత్రాలు నమ్మవచ్చా?

సంవత్సరం చూసుకోండి. చాలా సైట్లలో ఉన్నవి 2017, 2018, 2024 పేపర్లు. సిలబస్ మారింది కాబట్టి పాత పేపర్లలోని పాఠాలు ఇప్పుడు ఉండకపోవచ్చు — ప్రశ్న రూపం చూడటానికి మాత్రమే వాడండి.


15. SA1 తర్వాత ఏమి వస్తుంది?

FA3, ఆ తర్వాత SA2. పదో తరగతికి మార్చిలో బోర్డు పరీక్ష.


16. ఈ పేజీ ఎప్పుడు నవీకరిస్తారు?

28 అక్టోబర్ 2026 ఉత్తర్వు వచ్చాక టైమ్ టేబుల్, మార్కుల విధానం ఇక్కడ చేర్చాం. పరీక్షల తర్వాత Principles of Evaluation వస్తే సబ్జెక్టు వారీ జవాబుల లింక్‌లు ఇక్కడ చేరుస్తాం.


Official Sources

SA1 టైమ్ టేబుల్, మార్కుల విధానం: Proceedings of the Director of School Education, Andhra Pradesh, Rc. No. 3475819/SAT-I/2026-27, తేదీ 28-10-2026, SCERT సిలబస్ అనుబంధంతో. SCERT వెబ్‌సైట్ AP SCERT; పాఠ్యపుస్తకాలు cse.ap.gov.in లో. గత సంవత్సరపు తేదీలు 2025-26 SCERT ఉత్తర్వు (Rc.No. ESE02/11021/19/2025-SCERT) నుంచి.