AP 9th Class FA2 Biology Question Paper 2026-27 – 35 మార్కులు, జవాబులతో (Plant Tissues)

AP 9th Class FA2 Biology Question Paper 2026-27 — 08 అక్టోబర్ అసలు పేపర్, జవాబులతో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తొమ్మిదో తరగతి FA2 జీవశాస్త్రం (Self Assessment Model Paper-2, Biological Science, Exam Code 922, PS-25) పరీక్ష 08 అక్టోబర్ 2026 న జరిగింది. ఈ పేపర్ దాదాపు పూర్తిగా మొక్కల కణజాలాలు (విభాజ్య, శాశ్వత కణజాలాలు) పాఠం నుంచే వచ్చింది. మొత్తం 20 ప్రశ్నలకు జవాబులు ఇక్కడ ఉన్నాయి.

పేపర్ నమూనా: Section A — 15 × 1 = 15. Section B — 2 × 2 = 4. Section C — 2 × 4 = 8. Section D — 1 × 8 = 8 (A లేదా B). మొత్తం 20 ప్రశ్నలు, 35 మార్కులు, సమయం 1 గం. 15 ని.

బహుళైచ్ఛిక జవాబులు — ఒక్క చూపులో (15 ప్రశ్నలు)

ప్రశ్నజవాబుప్రశ్నజవాబు
1(C) Cells divide continuously9(B) Lateral meristem
2(A) Both A and R are true and R correctly explains A.10(B) Xylem
3(D) 1, 2 and 3 only11(C) Cork cells possess large intercellular spaces.
4(A) P-2, Q-1, R-312(A) Sclerenchyma
5(D) Removal of apical meristem13(C) Reduce water loss
6(B) Collenchyma provides flexibility to young stems.14(D) 1, 2 and 3 only
7(C) Collenchyma15(B) Phloem
8(D) 3, 1, 2

8వ ప్రశ్న జవాబు (D) 3, 1, 2 — కొన్ని జవాబు కీల్లో (B) అని ఇచ్చారు, అది సరికాదు. విభాజ్య కణజాలం అతి తక్కువ ప్రత్యేకత, సంక్లిష్ట శాశ్వత కణజాలం అతి ఎక్కువ.

Section A — 15 × 1 = 15

1. Which characteristic best distinguishes meristematic tissue from permanent tissue?

(A) Cells are dead and lignified   (B) Cells possess large vacuoles   (C) Cells divide continuously   (D) Cells have intercellular spaces

జవాబు: (C) Cells divide continuously — విభాజ్య కణజాల కణాలు నిరంతరం విభజన చెందుతాయి; శాశ్వత కణజాల కణాలు విభజన సామర్థ్యం కోల్పోయి ఒక నిర్దిష్ట పనికి మారతాయి.

2. Assertion (A): Intercalary meristems help grasses grow quickly after grazing. Reason (R): Intercalary meristems are located at the bases of leaves or internodes.

(A) Both A and R are true and R correctly explains A.   (B) Both A and R are true but R does not explain A.   (C) A is true but R is false.   (D) A is false but R is true.

జవాబు: (A) Both A and R are true and R correctly explains A. — ఆకుల అడుగున, కణుపుల మధ్య ఉండే మధ్యస్థ విభాజ్య కణజాలం వల్లే మేసిన తర్వాత కూడా గడ్డి మళ్ళీ త్వరగా పెరుగుతుంది.

3. Which of the following are characteristics of meristematic cells? 1. Dense cytoplasm 2. Prominent nucleus 3. Thin primary cell walls 4. Large intercellular spaces

(A) 1 only   (B) 1 and 2 only   (C) 2 and 3 only   (D) 1, 2 and 3 only

జవాబు: (D) 1, 2 and 3 only — విభాజ్య కణాలు దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి — వాటి మధ్య కణాంతరావకాశాలు ఉండవు. కాబట్టి 4 తప్పు.

4. Match the tissues with their major functions. P. Parenchyma Q. Collenchyma R. Sclerenchyma — 1. Mechanical support 2. Storage of food 3. Strength and rigidity

(A) P-2, Q-1, R-3   (B) P-1, Q-2, R-3   (C) P-3, Q-2, R-1   (D) P-2, Q-3, R-1

జవాబు: (A) P-2, Q-1, R-3 — మృదు కణజాలం ఆహార నిల్వ; స్థూలకోణ కణజాలం యాంత్రిక ఆధారం, వంగే గుణం; దృఢ కణజాలం బలం, దృఢత్వం.

5. A gardener regularly trims the growing tips of a hedge plant. After some days, many side branches develop. What is the main reason for this observation?

(A) Removal of lateral meristem   (B) Cork cambium becomes active   (C) Intercalary meristem becomes active   (D) Removal of apical meristem

జవాబు: (D) Removal of apical meristem — కొమ్మ చివరి అగ్ర విభాజ్య కణజాలం పక్క మొగ్గల పెరుగుదలను అణచి ఉంచుతుంది. చివర్లు కత్తిరిస్తే పక్క మొగ్గలు పెరిగి గుబురుగా కొమ్మలు వస్తాయి.

6. Which statement is correct?

(A) Sclerenchyma cells are living at maturity.   (B) Collenchyma provides flexibility to young stems.   (C) Parenchyma lacks living cells.   (D) Xylem transports prepared food.

జవాబు: (B) Collenchyma provides flexibility to young stems. — దృఢ కణజాల కణాలు పరిపక్వ దశలో మృత కణాలు; మృదు కణజాలం సజీవం; తయారైన ఆహారాన్ని రవాణా చేసేది పోషక కణజాలం.

7. A student observes a plant tissue with cells having uneven thickening at the corners. Identify the tissue.

(A) Parenchyma   (B) Sclerenchyma   (C) Collenchyma   (D) Xylem

జవాబు: (C) Collenchyma — కణాల మూలల్లో మాత్రమే సెల్యులోజ్, పెక్టిన్‌తో మందం — ఇదే స్థూలకోణ కణజాలం గుర్తు.

8. Arrange the following plant tissues in order of increasing specialization and complexity. 1. Parenchyma 2. Complex permanent tissue 3. Meristematic tissue

(A) 1, 2, 3   (B) 3, 2, 1   (C) 2, 1, 3   (D) 3, 1, 2

జవాబు: (D) 3, 1, 2 — విభాజ్య కణజాలం (ప్రత్యేకత లేదు), తర్వాత మృదు కణజాలం (సరళ శాశ్వత), చివర సంక్లిష్ట శాశ్వత కణజాలం (దారువు, పోషక కణజాలం). గమనిక: కొన్ని జవాబు కీల్లో (B) అని ఇచ్చారు — అది తప్పు. (B) లో క్రమం 3, 2, 1 — మృదు కణజాలాన్ని సంక్లిష్ట కణజాలం కంటే ఎక్కువ ప్రత్యేకత గలదిగా చూపుతుంది.

9. A farmer notices that the bark of a tree becomes thicker every year while the height increases only slightly. Which tissue is mainly responsible for the increase in girth?

(A) Apical meristem   (B) Lateral meristem   (C) Intercalary meristem   (D) Epidermis

జవాబు: (B) Lateral meristem — పార్శ్వ విభాజ్య కణజాలం (కేంబియం) కాండం, వేరు మందాన్ని (చుట్టుకొలత) పెంచుతుంది.

10. Which tissue mainly conducts water and minerals from roots to leaves?

(A) Phloem   (B) Xylem   (C) Epidermis   (D) Cork

జవాబు: (B) Xylem

11. Identify the incorrect statement.

(A) Epidermis protects internal tissues.   (B) Cork cells contain suberin.   (C) Cork cells possess large intercellular spaces.   (D) Epidermis reduces water loss.

జవాబు: (C) Cork cells possess large intercellular spaces. — బెరడు కణాలు కణాంతరావకాశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి.

12. A botanist discovers a plant with very thick-walled dead fibres providing mechanical strength. The tissue is most likely

(A) Sclerenchyma   (B) Collenchyma   (C) Parenchyma   (D) Phloem parenchyma

జవాబు: (A) Sclerenchyma — లిగ్నిన్‌తో మందమైన గోడలు గల మృత కణాలు — దృఢ కణజాలం (ఉదా: కొబ్బరి పీచు).

13. A desert plant has a thick waxy coating on its outer surface. The main function of this adaptation is

(A) Increase transpiration   (B) Increase photosynthesis   (C) Reduce water loss   (D) Increase respiration

జవాబు: (C) Reduce water loss — బాహ్యచర్మంపై మైనపు పొర (క్యూటికల్) బాష్పోత్సేకం ద్వారా నీరు పోకుండా కాపాడుతుంది.

14. Which tissues contain living cells? 1. Parenchyma 2. Collenchyma 3. Phloem parenchyma 4. Sclerenchyma

(A) 1 only   (B) 1 and 2 only   (C) 1, 2 and 4 only   (D) 1, 2 and 3 only

జవాబు: (D) 1, 2 and 3 only — దృఢ కణజాలం తప్ప మిగతా మూడూ సజీవ కణాలే.

15. A ring of bark is removed from the stem of a tree without damaging the wood. After several weeks, sugars accumulate above the cut. Which tissue has been interrupted?

(A) Xylem   (B) Phloem   (C) Cork   (D) Epidermis

జవాబు: (B) Phloem — బెరడుతో పాటు పోషక కణజాలం తొలగిపోయింది — ఆకుల నుంచి కిందికి వచ్చే చక్కెరలు కోత పైనే ఆగిపోతాయి. దారువు (కర్ర) దెబ్బతినలేదు కాబట్టి నీరు పైకి వెళ్తూనే ఉంటుంది.

Section B — 2 × 2 = 4

16. Differentiate between apical meristem and lateral meristem with respect to location and function.   [2]

అంశంఅగ్ర విభాజ్య కణజాలం (Apical)పార్శ్వ విభాజ్య కణజాలం (Lateral)
స్థానంకాండం, వేరు చివర్లలో (కొనల్లో) ఉంటుంది.కాండం, వేరు పక్కల్లో — బెరడు కింద (కేంబియం) ఉంటుంది.
విధిమొక్క పొడవు (ఎత్తు) పెంచుతుంది — ప్రాథమిక పెరుగుదల.కాండం, వేరు మందం (చుట్టుకొలత) పెంచుతుంది — ద్వితీయ పెరుగుదల.

17. Why are xylem and phloem called complex permanent tissues? Give one function of each.   [2]

ఇవి ఒకే రకం కాకుండా వేర్వేరు రకాల కణాలతో తయారై, అన్నీ కలిసి ఒకే పని చేస్తాయి. అందుకే సంక్లిష్ట శాశ్వత కణజాలాలు అంటారు. దారువులో దారు నాళికలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం, దారు నారలు; పోషక కణజాలంలో చాలనీ నాళాలు, సహ కణాలు, పోషక మృదు కణజాలం, పోషక నారలు ఉంటాయి.

దారువు (Xylem): వేర్ల నుంచి నీరు, ఖనిజ లవణాలను ఆకులకు రవాణా చేస్తుంది.

పోషక కణజాలం (Phloem): ఆకుల్లో తయారైన ఆహారాన్ని మొక్క అన్ని భాగాలకు రవాణా చేస్తుంది.

Section C — 2 × 4 = 8

18. Compare parenchyma and collenchyma under the following headings: Structure of cells, Cell wall, Function, Location   [4]

అంశంమృదు కణజాలం (Parenchyma)స్థూలకోణ కణజాలం (Collenchyma)
కణాల నిర్మాణంగుండ్రని లేదా అండాకార సజీవ కణాలు; వదులుగా అమరి ఉంటాయి, కణాల మధ్య కణాంతరావకాశాలు ఎక్కువ.పొడవైన సజీవ కణాలు; కణాంతరావకాశాలు చాలా తక్కువ.
కణ కవచంపలుచని, సమానమైన సెల్యులోజ్ కవచం.మూలల్లో మాత్రమే సెల్యులోజ్, పెక్టిన్‌తో అసమానంగా మందమైన కవచం.
విధిఆహారం నిల్వ; హరితరేణువులు ఉంటే కిరణజన్య సంయోగక్రియ (హరిత కణజాలం); గాలి గదులు ఉంటే నీటి మొక్కలు తేలడానికి సహాయం.యాంత్రిక ఆధారం, వంగే గుణం (flexibility) — గాలికి కాండం, ఆకులు విరగకుండా వంగుతాయి.
స్థానంమొక్క అన్ని మెత్తని భాగాల్లో — దవ్వ, వల్కలం, ఆకులు, పండ్లు.ఆకు కాడలు, ఆకు మధ్య ఈనె, లేత కాండాల్లో బాహ్యచర్మం కింద.

19. Describe the structure and functions of protective tissues in plants.   [4]

మొక్కల్లో రక్షక కణజాలాలు రెండు: బాహ్యచర్మం (Epidermis), బెరడు (Cork).

1. బాహ్యచర్మం — నిర్మాణం: మొక్క అన్ని భాగాలపై ఉండే బయటి ఒక్క వరుస కణాలు; కణాల మధ్య ఖాళీలు ఉండవు. దీనిపై మైనపు పొర (క్యూటికల్) ఉంటుంది. ఆకు బాహ్యచర్మంలో పత్రరంధ్రాలు (stomata), వేరు బాహ్యచర్మంలో మూలకేశాలు ఉంటాయి.

బాహ్యచర్మం — విధులు: లోపలి కణజాలాలను రక్షిస్తుంది; నీరు ఆవిరై పోకుండా తగ్గిస్తుంది; శిలీంధ్రాల దాడి, యాంత్రిక గాయాల నుంచి కాపాడుతుంది; పత్రరంధ్రాల ద్వారా వాయువుల మార్పిడి, బాష్పోత్సేకం జరుగుతాయి; మూలకేశాలు నీటిని పీల్చుకుంటాయి.

2. బెరడు — నిర్మాణం: చెట్లు పెద్దవయ్యే కొద్దీ బయటి కణజాలం స్థానంలో కార్క్ కేంబియం అనేక వరుసల బెరడు కణాలను ఏర్పరుస్తుంది. ఇవి మృత కణాలు, కణాంతరావకాశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి; వీటి గోడలపై సుబెరిన్ అనే పదార్థం ఉంటుంది.

బెరడు — విధులు: సుబెరిన్ వల్ల నీరు, వాయువులు లోపలికి వెళ్ళవు — కాండాన్ని నీటి నష్టం, సూక్ష్మజీవులు, గాయాల నుంచి రక్షిస్తుంది. బెరడు తేలికగా ఉండటంతో సీసా బిరడాల (cork) తయారీకి వాడుతారు.

Section D — 1 × 8 = 8

20. A) Plants and animals have different modes of life. Compare plants and animals with reference to: 1. Movement 2. Supportive tissue 3. Pattern of growth 4. Organisation of organs and organ systems
(లేదా)
B) How are simple tissues different from complex tissues in plants?   [8]

A) జవాబు:

అంశంమొక్కలుజంతువులు
1. చలనంఒకే చోట స్థిరంగా ఉంటాయి; ఆహారం కోసం కదలవలసిన అవసరం లేదు (స్వయం పోషకాలు). కాబట్టి తక్కువ శక్తి సరిపోతుంది.ఆహారం, నివాసం, రక్షణ, జతకోసం ఒక చోటు నుంచి మరో చోటుకు కదులుతాయి; ఎక్కువ శక్తి ఖర్చవుతుంది.
2. ఆధార కణజాలంచాలా కణజాలాలు మృత కణాలతో ఆధారం, బలం ఇస్తాయి (దృఢ కణజాలం, దారువు).చాలా కణజాలాలు సజీవ కణాలతో ఉంటాయి; ఎముకలు, మృదులాస్థి, కండరాలు ఆధారం, కదలికకు సహాయం చేస్తాయి.
3. పెరుగుదల విధానంజీవితాంతం పెరుగుతూనే ఉంటాయి; పెరుగుదల విభాజ్య కణజాలాలు ఉన్న కొన్ని ప్రదేశాలకే పరిమితం (కొనలు, కేంబియం).ఒక వయసు వరకే పెరుగుతాయి; పెరుగుదల శరీరం అంతటా సమానంగా జరుగుతుంది — ప్రత్యేక విభాజ్య ప్రదేశాలు ఉండవు.
4. అవయవాలు, అవయవ వ్యవస్థల వ్యవస్థీకరణనిర్మాణం సరళంగా ఉంటుంది — వేరు, కాండం, ఆకు, పుష్పం వంటి తక్కువ అవయవాలు; ప్రత్యేక అవయవ వ్యవస్థలు అంతగా అభివృద్ధి చెందవు.నిర్మాణం సంక్లిష్టం — జీర్ణ, శ్వాస, ప్రసరణ, నాడీ వంటి అనేక ప్రత్యేక అవయవ వ్యవస్థలు ఉంటాయి.

ముగింపు: మొక్కలు, జంతువుల జీవన విధానం వేరు కాబట్టి వాటి కణజాలాల వ్యవస్థీకరణ కూడా వేరుగా ఉంటుంది.

B) జవాబు:

సరళ కణజాలం (Simple tissue)సంక్లిష్ట కణజాలం (Complex tissue)
ఒకే రకమైన కణాలతో తయారవుతుంది.ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో తయారవుతుంది.
అన్ని కణాల నిర్మాణం, విధి ఒకేలా ఉంటాయి.వేర్వేరు కణాలు కలిసి ఒకే పనిని సమన్వయంతో చేస్తాయి.
ఉదాహరణలు: మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం.ఉదాహరణలు: దారువు (Xylem), పోషక కణజాలం (Phloem).
ఆహార నిల్వ, ఆధారం, బలం, కిరణజన్య సంయోగక్రియ వంటి పనులు చేస్తాయి.నీరు, ఖనిజాలు, ఆహారం రవాణా (ప్రసరణ కణజాలాలు) చేస్తాయి.
ఎక్కువగా వల్కలం, దవ్వ, ఆకులు, పండ్లు, విత్తన కవచాల్లో ఉంటాయి.వేరు, కాండం, ఆకులలో నాళికా పుంజాలుగా (vascular bundles) కలిసి ఉంటాయి.

దారువు భాగాలు: దారు నాళికలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం, దారు నారలు. పోషక కణజాలం భాగాలు: చాలనీ నాళాలు, సహ కణాలు, పోషక మృదు కణజాలం, పోషక నారలు.

తొమ్మిదో తరగతి మిగతా సబ్జెక్టుల FA2 పేపర్లు AP FA2 Question Papers 2026-27 – Class 6 to 10 లో ఉన్నాయి. తదుపరి పరీక్ష SA1 సిలబస్: AP SA1 Syllabus 2026-27.

AP 9th Class FA2 Biology Question Paper కణజాలాలు (Tissues) అధ్యాయంపై, అసలు రాత పరీక్ష నమూనాలో — 35 మార్కులు, 20 ప్రశ్నలు, ప్రతి జవాబుకూ మార్కుల విభజనతో. సిలబస్ 2.1, 2.2 విభాగాలు — అంటే మొక్కల కణజాలాలు. పరీక్ష 08 అక్టోబర్ 2026 ఉదయం 9:30 కు.

సవరణ: ఈ పేజీ ముందటి వెర్షన్‌లో సిలబస్‌ను “2.1 నుంచి 2.3” అనుకుని జంతు కణజాలాల నుంచి ఏడు ప్రశ్నలు (11 మార్కులు) ఇచ్చాం. SCERT 23.09.2026 ప్రొసీడింగ్స్ లో ఉన్నది “Tissues 2.1 and 2.2” మాత్రమే — జంతు కణజాలాలు 2.3, FA2 లో లేవు. ఆ ఏడు ప్రశ్నల స్థానంలో మొక్కల కణజాలాల ప్రశ్నలు పెట్టాం; రెండు PDF లూ కొత్తవి.


AP 9th Class FA2 Biology 2026-27 — పరీక్ష వివరాలు

విషయంBiology లో
Biology పరీక్ష రోజు08 అక్టోబర్ 2026, గురువారం, ఉదయం 9:30 నుంచి 10:45
పాఠంకణజాలాలు (Tissues), విభాగాలు 2.1, 2.2 మాత్రమే
ప్రశ్నలు / మార్కులు20 / 35 — పదిహేను బహుళైచ్ఛికాలు, రెండు తేడాల ప్రశ్నలు, రెండు 4 మార్కులవి, ఒక 8 మార్కుల ప్రశ్న
కాల వ్యవధిగంటా పావు
PDFతెలుగు మాధ్యమం, English Medium వేర్వేరుగా

అధ్యాయంలో 2.1 “మొక్కలు, జంతువులు ఒకే రకమైన కణజాలాలతో తయారయ్యాయా?”, 2.2 “మొక్కల కణజాలాలు”, 2.3 “జంతు కణజాలాలు”. FA2 కు మొదటి రెండే. FA మొత్తం 50 లో రాత పరీక్ష 35; మిగిలిన 15 తరగతి భాగస్వామ్యం, నోట్ పుస్తకం, ప్రాజెక్టుకు.


2.1, 2.2 విభాగాలు — ఏ ప్రశ్న ఏ భాగానిది

భాగంమార్కులుప్రశ్న సంఖ్యలు
2.1 మొక్కలు, జంతువులు — కణజాలాల తేడా411, 15, 17
2.2 మొక్కల కణజాలాలు (Plant Tissues)311, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 16, 18, 19, 20

AP 9th Class FA2 Biology Question Paper 2026-27 chapter wise marks 35 marks 20 questions


ఒక్క పేజీలో కణజాలాలు

  • 2.1 పోలిక: మొక్కలు — ఆధార కణజాలాలు, చాలావరకు మృతం, పెరుగుదల కొన్ని ప్రాంతాల్లోనే · జంతువులు — చాలావరకు సజీవం, పెరుగుదల ఏకరీతి.
  • విభాజ్య కణజాలం: అగ్ర — పొడవు · పార్శ్వ — మందం · అంతర్వేశిత — కణుపుల వద్ద.
  • సరళ శాశ్వత: పేరెన్‌కైమా (నిల్వ; ఏరెన్‌కైమా, క్లోరెన్‌కైమా) · కొలెన్‌కైమా (వంగే గుణం) · స్క్లెరెన్‌కైమా (దృఢత్వం, మృత కణాలు).
  • రక్షక కణజాలాలు: బాహ్యచర్మం, పత్రరంధ్రాలు, రక్షక కణాలు · బెరడు — మృత కణాలు, సుబరిన్.
  • సంక్లిష్ట శాశ్వత: దారువు — ట్రెకీడ్లు, నాళికలు, దారు పేరెన్‌కైమా, దారు ఫైబర్లు. పోషక — చాలనీ నాళాలు, సహ కణాలు, పోషక పేరెన్‌కైమా, పోషక ఫైబర్లు.

AP 9th Class FA2 Biology Question Paper — కణజాలాలపై ఇరవై ప్రశ్నలు

విభాగం — A — బహుళైచ్ఛిక ప్రశ్నలు

15 × 1 = 15 మార్కులు

1. కణజాలం అంటే ఏమిటి?
(A) ఒకే కణం
(B) ఒకే నిర్మాణం, ఒకే పని గల కణాల సముదాయం
(C) ఒక అవయవం
(D) ఒక జీవి

జవాబు చూడండి

(B) ఒకే నిర్మాణం, ఒకే పని గల కణాల సముదాయం — ఒకే నిర్మాణం కలిగి ఒకే పని చేసే కణాల సముదాయమే కణజాలం.

2. మొక్క పెరుగుదలకు కారణమయ్యే కణజాలం ఏది?
(A) విభాజ్య కణజాలం
(B) శాశ్వత కణజాలం
(C) దారువు
(D) పోషక కణజాలం

జవాబు చూడండి

(A) విభాజ్య కణజాలం — విభాజ్య కణజాలం (Meristematic) — దాని కణాలు నిరంతరం విభజన చెందుతాయి.

3. అగ్ర విభాజ్య కణజాలం ఎక్కడ ఉంటుంది?
(A) ఆకు అంచుల్లో
(B) కణుపుల వద్ద
(C) కాండం, వేరు కొనల వద్ద
(D) బెరడులో

జవాబు చూడండి

(C) కాండం, వేరు కొనల వద్ద — కాండం, వేరు కొనల వద్ద. మొక్క పొడవు పెరగడానికి ఇదే కారణం.

4. కాండం మందం (వ్యాసం) పెరగడానికి కారణమైన విభాజ్య కణజాలం ఏది?
(A) అగ్ర
(B) అంతర్వేశిత
(C) పోషక
(D) పార్శ్వ

జవాబు చూడండి

(D) పార్శ్వ — పార్శ్వ విభాజ్య కణజాలం (Lateral meristem).

5. మొక్కలో నీరు, ఖనిజ లవణాలను పైకి చేరవేసే కణజాలం ఏది?
(A) దారువు
(B) పోషక కణజాలం
(C) కొలెన్‌కైమా
(D) బాహ్యచర్మం

జవాబు చూడండి

(A) దారువు — దారువు (Xylem) — వేరు నుంచి ఆకుల వరకు.

6. ఆకుల్లో తయారైన ఆహారాన్ని ఇతర భాగాలకు చేరవేసేది ఏది?
(A) దారువు
(B) పోషక కణజాలం
(C) స్క్లెరెన్‌కైమా
(D) విభాజ్య కణజాలం

జవాబు చూడండి

(B) పోషక కణజాలం — పోషక కణజాలం (Phloem). ఇది ఆహారాన్ని రెండు దిశల్లోనూ ప్రసరింపజేస్తుంది.

7. మృత కణాలు, లిగ్నిన్‌తో మందమైన గోడలు గల కణజాలం ఏది?
(A) పేరెన్‌కైమా
(B) కొలెన్‌కైమా
(C) స్క్లెరెన్‌కైమా
(D) విభాజ్య కణజాలం

జవాబు చూడండి

(C) స్క్లెరెన్‌కైమా — స్క్లెరెన్‌కైమా — మొక్కకు దృఢత్వం ఇస్తుంది. ఉదా: కొబ్బరి పీచు.

8. ఆకు తొడిమ విరగకుండా వంగే గుణాన్ని ఇచ్చే కణజాలం ఏది?
(A) స్క్లెరెన్‌కైమా
(B) దారువు
(C) పేరెన్‌కైమా
(D) కొలెన్‌కైమా

జవాబు చూడండి

(D) కొలెన్‌కైమా — కొలెన్‌కైమా — కణ మూలల వద్ద గోడలు మందంగా ఉంటాయి.

9. నీటి మొక్కలు తేలడానికి సహాయపడే, గాలి ఖాళీలు గల పేరెన్‌కైమాను ఏమంటారు?
(A) ఏరెన్‌కైమా
(B) క్లోరెన్‌కైమా
(C) స్క్లెరెన్‌కైమా
(D) కొలెన్‌కైమా

జవాబు చూడండి

(A) ఏరెన్‌కైమా — ఏరెన్‌కైమా (Aerenchyma). హరిత రేణువులు ఉంటే క్లోరెన్‌కైమా.

10. దారువులోని నాలుగు మూలకాల్లో సజీవమైనది ఏది?
(A) ట్రెకీడ్లు
(B) నాళికలు
(C) దారు పేరెన్‌కైమా
(D) దారు ఫైబర్లు

జవాబు చూడండి

(C) దారు పేరెన్‌కైమా — దారు పేరెన్‌కైమా మాత్రమే సజీవం. మిగిలిన మూడూ మృతమైనవి.

11. మొక్కల్లో ఎక్కువ శాతం కణజాలాలు ఎలాంటివి?
(A) సజీవమైనవి, కదిలేవి
(B) ఆధారం ఇచ్చేవి, చాలావరకు మృతమైనవి
(C) నాడీ సంబంధమైనవి
(D) సంకోచించేవి

జవాబు చూడండి

(B) ఆధారం ఇచ్చేవి, చాలావరకు మృతమైనవి — మొక్కలు ఒకే చోట ఉంటాయి; నిలబడటానికి బలం కావాలి. అందుకే ఎక్కువ కణజాలాలు ఆధారం ఇచ్చేవి, వాటిలో చాలా మృతమైనవి.

12. ఆకు బాహ్యచర్మంపై ఉండే సూక్ష్మ రంధ్రాలను ఏమంటారు?
(A) కణుపులు
(B) రిక్తికలు
(C) పత్రరంధ్రాలు
(D) నాళికలు

జవాబు చూడండి

(C) పత్రరంధ్రాలు — పత్రరంధ్రాలు (Stomata). వాయువుల మార్పిడి, బాష్పోత్సేకం వీటి ద్వారానే.

13. పత్రరంధ్రాన్ని చుట్టి ఉండే రెండు మూత్రపిండాకార కణాలను ఏమంటారు?
(A) రక్షక కణాలు
(B) సహ కణాలు
(C) ట్రెకీడ్లు
(D) చాలనీ నాళాలు

జవాబు చూడండి

(A) రక్షక కణాలు — రక్షక కణాలు (Guard cells) — రంధ్రం తెరుచుకోవడం, మూసుకోవడం వీటి వల్లే.

14. సహ కణాలు (companion cells) ఏ కణజాలంలో ఉంటాయి?
(A) దారువు
(B) స్క్లెరెన్‌కైమా
(C) కొలెన్‌కైమా
(D) పోషక కణజాలం

జవాబు చూడండి

(D) పోషక కణజాలం — పోషక కణజాలం (Phloem) — చాలనీ నాళాల పక్కన ఉంటాయి.

15. మొక్కల్లో పెరుగుదల ఎక్కడ జరుగుతుంది?
(A) శరీరమంతా సమానంగా
(B) విభాజ్య కణజాలం ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే
(C) ఆకుల్లో మాత్రమే
(D) పూలలో మాత్రమే

జవాబు చూడండి

(B) విభాజ్య కణజాలం ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే — కొన్ని ప్రాంతాలకే పరిమితం — విభాజ్య కణజాలం ఉన్న చోట. జంతువుల్లో ఇలా స్పష్టమైన విభజన ఉండదు.

విభాగం — B — తేడాలు

2 × 2 = 4 మార్కులు

16. విభాజ్య కణజాలం, శాశ్వత కణజాలం మధ్య రెండు తేడాలు రాయండి. (2 మార్కులు)

జవాబు చూడండి

1. విభాజ్య కణాలు నిరంతరం విభజన చెందుతాయి; శాశ్వత కణాలు విభజన సామర్థ్యం కోల్పోయి ఒక నిర్దిష్ట పనికి మారిపోతాయి. (1 మార్కు)
2. విభాజ్య కణాలు చిన్నవి, గోడలు పలుచన, కేంద్రకం పెద్దది, రిక్తికలు దాదాపు ఉండవు; శాశ్వత కణాలకు నిర్దిష్ట ఆకారం, తరచుగా పెద్ద రిక్తిక ఉంటాయి. (1 మార్కు)

17. మొక్కల కణజాలాలకూ జంతు కణజాలాలకూ మధ్య రెండు తేడాలు రాయండి. (2 మార్కులు)

జవాబు చూడండి

1. మొక్కలు ఒకే చోట ఉంటాయి; వాటి కణజాలాలు చాలావరకు ఆధారం ఇచ్చేవి, వాటిలో చాలా మృతమైనవి. జంతువులు ఆహారం, ఆశ్రయం కోసం కదులుతాయి, ఎక్కువ శక్తి ఖర్చు చేస్తాయి; వాటి కణజాలాలు చాలావరకు సజీవమైనవి. (1 మార్కు)
2. మొక్కల్లో పెరుగుదల విభాజ్య కణజాలం ఉన్న కొన్ని ప్రాంతాలకే పరిమితం. జంతువుల్లో కణాల పెరుగుదల శరీరమంతా ఒకే విధంగా ఉంటుంది; విభజన చెందే, చెందని ప్రాంతాలు అని స్పష్టమైన తేడా ఉండదు. (1 మార్కు)

విభాగం — C — విభాజ్య, రక్షక కణజాలాలు

2 × 4 = 8 మార్కులు

18. విభాజ్య కణజాలం ఎన్ని రకాలు? ఒక్కోదాని స్థానం, పని రాయండి. (4 మార్కులు)

జవాబు చూడండి

మూడు రకాలు — స్థానం ఆధారంగా విభజన. (1 మార్కు)
అగ్ర: కాండం, వేరు కొనల వద్ద; పొడవు పెరుగుదల. (1 మార్కు)
పార్శ్వ: కాండం, వేరు పార్శ్వ భాగాల్లో; మందం పెరుగుదల. (1 మార్కు)
అంతర్వేశిత: కణుపుల వద్ద, ఆకు అడుగున; కణుపు మధ్య భాగాల పొడవు పెరుగుదల — గడ్డి జాతుల్లో స్పష్టం. (1 మార్కు)

19. రక్షక కణజాలాలైన బాహ్యచర్మం, బెరడు (కార్క్) నిర్మాణం, పనులు రాయండి. పత్రరంధ్రాల రెండు పనులు పేర్కొనండి. (4 మార్కులు)

జవాబు చూడండి

బాహ్యచర్మం (Epidermis): మొక్క బయటి పొర, సాధారణంగా ఒకే వరుస కణాలు, కణాల మధ్య ఖాళీలు ఉండవు. మొక్క మొత్తాన్ని కప్పి రక్షిస్తుంది. పొడి ప్రాంతాల మొక్కల్లో మందంగా ఉండి, పైన మైనపు పొరతో నీరు పోకుండా కాపాడుతుంది. వేర్ల బాహ్యచర్మ కణాలకు ఉండే వెంట్రుకల వంటి భాగాలు నీటిని పీల్చే ఉపరితలాన్ని పెంచుతాయి. (1½ మార్కులు)
బెరడు (Cork): మొక్క ముదిరేకొద్దీ కాండం బయట ఏర్పడే, అనేక వరుసల మందమైన పొర. కణాలు మృతమైనవి, దగ్గరగా అమరి ఉంటాయి; వాటి గోడల్లో సుబరిన్ ఉండటం వల్ల గాలి, నీరు లోపలికి వెళ్లవు. (1½ మార్కులు)
పత్రరంధ్రాల పనులు: వాతావరణంతో వాయువుల మార్పిడి; బాష్పోత్సేకం (నీరు ఆవిరిగా బయటకు పోవడం). (1 మార్కు)

విభాగం — D — శాశ్వత కణజాలాలు

1 × 8 = 8 మార్కులు

20. శాశ్వత కణజాలాల గురించి:
(అ) సరళ, సంక్లిష్ట శాశ్వత కణజాలాల మధ్య తేడా, ఒక్కోదానికి ఉదాహరణలు.
(ఆ) దారువులోని నాలుగు మూలకాలు.
(ఇ) పోషక కణజాలంలోని నాలుగు మూలకాలు.
(ఈ) ఈ రెండింటిలో ఏ మూలకాలు సజీవం, ఏవి మృతం?
(8 మార్కులు)

జవాబు చూడండి

(అ) సరళ కణజాలం ఒకే రకమైన కణాలతో — పేరెన్‌కైమా, కొలెన్‌కైమా, స్క్లెరెన్‌కైమా. సంక్లిష్ట కణజాలం వేర్వేరు రకాల కణాలు కలిసి ఒకే పని చేసేవి — దారువు, పోషక కణజాలం. (2 మార్కులు)
(ఆ) ట్రెకీడ్లు, నాళికలు, దారు పేరెన్‌కైమా, దారు ఫైబర్లు. (2 మార్కులు)
(ఇ) చాలనీ నాళాలు (sieve tubes), సహ కణాలు (companion cells), పోషక పేరెన్‌కైమా, పోషక ఫైబర్లు. (2 మార్కులు)
(ఈ) దారువులో దారు పేరెన్‌కైమా మాత్రమే సజీవం. పోషక కణజాలంలో పోషక ఫైబర్లు తప్ప మిగిలినవన్నీ సజీవం. (2 మార్కులు)


Biology PDF డౌన్‌లోడ్

పటాలు గీసి సాధన చేయాలంటే కాగితంపై రాయడమే మేలు. ముద్రించుకోవడానికి ఈ రెండు ఫైళ్లు — జవాబులు చివర్లో.

AP 9th Class FA2 Biology Question Paper Telugu Medium — Download PDF
AP 9th Class FA2 Biology Question Paper English Medium — Download PDF


కణజాలాల ప్రశ్నల్లో తరచూ జరిగే తప్పులు

  • దారువు, పోషక కణజాలం — పనులు తారుమారు చేయడం. నీరు దారువు, ఆహారం పోషక కణజాలం.
  • సజీవ, మృత మూలకాలు — దారువులో అన్నీ మృతం అని రాయడం — దారు పేరెన్‌కైమా సజీవం.
  • సహ కణాలు, రక్షక కణాలు — పేర్లు కలిపేయడం. సహ కణాలు పోషక కణజాలంలో; రక్షక కణాలు పత్రరంధ్రం చుట్టూ.
  • ప్రశ్న 19 లో — బాహ్యచర్మం, బెరడు రెండింటినీ ఒకటే అనుకోవడం — బెరడు ముదిరిన కాండంపై, మృత కణాలతో.
  • ఉదాహరణలు — అడిగినప్పుడు ఇవ్వకపోవడం — ఉదా: స్క్లెరెన్‌కైమాకు కొబ్బరి పీచు.

మిగిలిన సామగ్రి

రెండు రోజుల ముందు Physical Science పరీక్ష — AP 9th Class FA2 Physical Science Question Paper. English పేపర్ AP 9th Class FA2 English Question Paper లో, గణితం AP 9th Class FA2 Maths Question Paper లో. మిగిలిన తరగతుల పేపర్లు AP FA2 Question Papers 2026-27 – Class 6 to 10 పేజీలో, అన్ని సబ్జెక్టుల పాఠాలు AP 9th Class FA2 Syllabus 2026-27 లో, తొమ్మిదో తరగతి మొత్తం సామగ్రి AP 9th Class Textbooks, Notes, Study Material & Question Papers లో, FA2 అంతా AP FA2 2026-27 హబ్‌లో.


FAQs


1. AP 9th Class FA2 Biology పరీక్ష ఎప్పుడు?

08 అక్టోబర్ 2026 (గురువారం), ఉదయం 9:30 నుంచి 10:45. అదే రోజు 11:00 కి OSSC-1 (OSSC విద్యార్థులకు మాత్రమే).

2. FA2 Biology సిలబస్‌లో ఏ భాగాలు ఉన్నాయి?

కణజాలాలు (Tissues) అధ్యాయంలో 2.1, 2.2 విభాగాలు మాత్రమే — SCERT 23.09.2026 ప్రొసీడింగ్స్ ఇలాగే ఇచ్చింది. 2.1 మొక్కల, జంతు కణజాలాల పోలిక; 2.2 మొక్కల కణజాలాలు.

3. జంతు కణజాలాలు FA2 లో ఉన్నాయా?

లేవు. అవి అదే అధ్యాయంలో తర్వాతి విభాగం (2.3), FA2 జాబితాలో లేదు. ఈ పేజీ ముందటి వెర్షన్‌లో జంతు కణజాలాల ప్రశ్నలు ఉండేవి; అవి తీసేసి మొక్కల కణజాలాల ప్రశ్నలు పెట్టాం.

4. రాత పరీక్ష ఎన్ని మార్కులు?

35 మార్కులు, 20 ప్రశ్నలు — 15 × 1, 2 × 2, 2 × 4, 1 × 8. 6 నుంచి 9 తరగతులకు ఇదే నమూనా.

5. Physical Science, Biology వేర్వేరు పేపర్లా?

అవును. Physical Science 06 అక్టోబర్ మధ్యాహ్నం 2:45 కి, Biology 08 అక్టోబర్ ఉదయం 9:30 కి.

6. దారువు, పోషక కణజాలం ఎలా గుర్తుంచుకోవాలి?

దారువు — నీరు, ఖనిజాలు, పైకి మాత్రమే, ఎక్కువ మృత మూలకాలు. పోషక కణజాలం — ఆహారం, రెండు దిశల్లో, పోషక ఫైబర్లు తప్ప మిగిలినవి సజీవం.

7. పత్రరంధ్రాలు ఏమి చేస్తాయి?

రెండు పనులు: వాతావరణంతో వాయువుల మార్పిడి, బాష్పోత్సేకం. వాటిని రక్షక కణాలు తెరుస్తాయి, మూస్తాయి.

8. బెరడు కణాల్లోకి నీరు ఎందుకు వెళ్లదు?

బెరడు కణాలు మృతమైనవి, దగ్గరగా అమరి ఉంటాయి; వాటి గోడల్లో సుబరిన్ అనే పదార్థం ఉంటుంది. అందుకే గాలి, నీరు లోపలికి వెళ్లవు.

9. పటాలు వస్తాయా?

రావచ్చు — పేరెన్‌కైమా, కొలెన్‌కైమా, స్క్లెరెన్‌కైమా కణాలు, పత్రరంధ్రం, దారువు మూలకాలు. పటం గీస్తే భాగాల పేర్లు తప్పనిసరి.

10. ఈ ప్రశ్నలే పరీక్షలో వస్తాయా?

రావు. సిలబస్ ఆధారంగా మేము తయారు చేసిన సాధన పత్రం ఇది.

11. English Medium లో ఉందా?

ఉంది. కింది PDF విభాగంలో English Medium ప్రశ్నపత్రం, జవాబులతో విడిగా ఉంది.

12. 15 MCQ లకు ఎంత సమయం?

పదిహేను నిమిషాలలోపు. 8 మార్కుల ప్రశ్నకు కనీసం పదిహేను నిమిషాలు ఉంచుకోండి.


Official Sources

అధ్యాయ విభాగాలు, పరీక్ష తేదీ, సమయం: AP SCERT ప్రొసీడింగ్స్ Rc.No.3426774/FA-2/SCERT/2026 (23.09.2026). తొమ్మిదో తరగతి Biological Science పాఠ్యపుస్తకం cse.ap.gov.in లో ఉచితం. ప్రశ్నలు మావి.