AP FA2 Syllabus 2026-27 – Class 1 to 10 Official Subject-wise Lessons (SCERT)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

FA2 అయిపోయిందా? తర్వాతి పరీక్ష SA1 (9 – 20 నవంబర్ 2026). 6 నుంచి 10 తరగతుల SA1 సిలబస్, అక్టోబర్‌లో కొత్తగా చేరే పాఠాలతో సహా, AP SA1 Syllabus 2026-27 – Class 6 to 10 పేజీలో ఉంది.

AP FA2 Syllabus 2026-27 ను SCERT, ఆంధ్రప్రదేశ్ తన 23.09.2026 ప్రొసీడింగ్స్ (Rc.No.3426774/FA-2/SCERT/2026) కు Annexure-I గా జత చేసింది. ఆ అధికారిక జాబితానే ఇక్కడ 6 నుంచి 10 తరగతులకు సబ్జెక్టు వారీగా, 1 నుంచి 5 తరగతులకు ఒకే పట్టికలో ఇచ్చాం. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బోధించిన పాఠాలే ఈ పరీక్షకు. పరీక్షలు 05 అక్టోబర్ 2026 నుంచి; ప్రతి రాత పరీక్ష 35 మార్కులు, 1 గంట 15 నిమిషాలు.

సవరణ: ఈ పేజీ పాత వెర్షన్‌లో 8 అధ్యాయాలు అధికారిక జాబితాలో లేనివి ఉన్నాయి, 3 అధ్యాయాలు లేవు, 9, 10 తరగతుల పరీక్ష సమయం కూడా తప్పుగా ఉంది. ఇప్పుడున్నది SCERT పత్రంతో ప్రతి పాఠం సరిచూసిన జాబితా. ఏం మారిందో కింద “పాత జాబితాతో తేడాలు” పట్టికలో చూడండి.


AP FA2 2026-27 ఒక్క చూపులో

అంశంవివరం
అధికారిక పేరుCBA-II / Self-Assessment Model Paper-II (FA2)
ఆధారంSCERT ప్రొసీడింగ్స్ Rc.No.3426774/FA-2/SCERT/2026, 23.09.2026
సిలబస్ కాలంఆగస్టు, సెప్టెంబర్ 2026 లో బోధించిన పాఠాలు
పరీక్ష తేదీలు1 నుంచి 5 తరగతులు: 05 – 07 అక్టోబర్; 6 నుంచి 10 తరగతులు: 05 – 08 అక్టోబర్
మార్కులుప్రతి సబ్జెక్టు రాత పరీక్ష 35 మార్కులు (1 నుంచి 10 అన్ని తరగతులకూ)
ప్రశ్నలు6 నుంచి 9: 20 ప్రశ్నలు; 10వ తరగతి: సబ్జెక్టును బట్టి 13 నుంచి 19

AP FA2 Syllabus 2026-27 — 6 నుంచి 10 తరగతులు, సబ్జెక్టు వారీగా

పాఠాల ముందున్న సంఖ్య పాఠ్యపుస్తకంలోని అధ్యాయం సంఖ్య. ఒక సబ్జెక్టులో 2 నుంచి మొదలైతే మొదటి అధ్యాయం FA1 లో అయిపోయిందని అర్థం, దాన్ని ఈసారి పక్కన పెట్టవచ్చు.

AP FA2 Syllabus 2026-27 class 6 to 10 official SCERT lessons subject wise


6వ తరగతి FA2 సిలబస్

సబ్జెక్టుFA2 పాఠాలు
తెలుగుఅమ్మ ఒడి, తృప్తి, మాకొద్దీ తెల్లదొరతనం, సమయస్ఫూర్తి
హిందీफल, तितली, हवा, ऋतु, बादल, पौधे लगाओ
English1. A Bottle of Dew, The Raven and the Fox (Poem), Rama to the Rescue; 2. The Unlikely Best Friends, A Friend’s Prayer (Poem)
గణితం1. Patterns in Mathematics, 2. Lines and Angles, 3. Number Play, 4. Data Handling and Presentation
సైన్స్2. Diversity in the Living World, 3. Mindful Eating, 4. Exploring Magnets
సోషల్1. Locating Places on the Earth, 2. Oceans and Continents, 3. Timeline and Sources of History, 4. India, That is Bharat, 5. India’s Cultural Roots, 6. Family and Community

సైన్స్‌లో మొదటి అధ్యాయం లేదు — 2, 3, 4 మాత్రమే. సోషల్‌లో ఆరు అధ్యాయాలు, ఈ తరగతిలో అన్నిటికంటే పెద్ద భాగం అదే. ప్రతి సబ్జెక్టు వివరణ, పరీక్ష రోజుల క్రమం AP 6th Class FA2 Syllabus 2026-27 పేజీలో ఉంది.


7వ తరగతి FA2 సిలబస్

సబ్జెక్టుFA2 పాఠాలు
తెలుగుమాయాకంబళి, చిన్ని శిశువు, మర్రిచెట్టు
హిందీ3. चिड़ियाघर की सैर, 4. हम नन्हें बच्चे, 5. थाथू और मैं
English2. Animals, Birds and Dr. Dolittle, A Funny Man (Poem), Say the Right Thing; 3. My Brother’s Great Invention, Paper Boats (Poem)
గణితం1. A Peek Beyond the Point, 2. Expressions using Letter-Numbers, 3. Parallel and Intersecting Lines, 4. Number Play, 5. A Tale of Three Intersecting Lines
సైన్స్3. Electric Circuits and their Components, 4. Metals and Non-metals, 5. Changes Around Us
సోషల్5. The Rise of Empires, 6. The Age of Reorganisation, 7. How the Land Becomes Sacred?, 8. From the Rulers to the Ruled: Types of Governments, 9. From Barter to Money

గణితంలో ఐదు అధ్యాయాలు. సైన్స్ 3, 4, 5 అధ్యాయాలు; కౌమారదశ (Adolescence) అధ్యాయం ఈ జాబితాలో లేదు. ప్రతి సబ్జెక్టు వివరణ, పరీక్ష రోజుల క్రమం AP 7th Class FA2 Syllabus 2026-27 పేజీలో ఉంది.


8వ తరగతి FA2 సిలబస్

సబ్జెక్టుFA2 పాఠాలు
తెలుగుశతక సౌరభం, నా యాత్ర, సందేశం
హిందీ3. श्रीहरिकोटा, 4. किसान, 5. कूड़ेदान
English2. A Tale of Valour: Major Somanath Sharma and the Battle of Badgam, Somebody’s Mother (Poem), Verghese Kurien – I Too Had a Dream; 3. The Case of the Fifth Word, The Magic Brush of Dreams (Poem)
గణితం1. Quadrilaterals, 2. Number Play, 3. We Distribute, Yet Things Multiply, 4. Proportional Reasoning-1 (Exercise 7.4 వరకు)
భౌతిక శాస్త్రం3. Particulate Nature of Matter, 4. Pressure and its Effects
జీవ శాస్త్రంHealth
సోషల్4. The Colonial Era in India, 5. The Kakatiya Kingdom, 6. Universal Franchise and India’s Electoral System, 7. The Parliamentary System: Legislature and Executive

సైన్స్ ఇక్కడి నుంచి రెండు పేపర్లు. జీవ శాస్త్రంలో Health ఒక్కటే; భౌతిక శాస్త్రంలో రెండు అధ్యాయాలు. గణితంలో Proportional Reasoning-1 ను Exercise 7.4 దగ్గర ఆపండి. ప్రతి సబ్జెక్టు వివరణ, పరీక్ష రోజుల క్రమం AP 8th Class FA2 Syllabus 2026-27 పేజీలో ఉంది.


9వ తరగతి FA2 సిలబస్

సబ్జెక్టుFA2 పాఠాలు
తెలుగుప్రియమైన నాన్నకు, ఆత్మకథ
హిందీतारे जमीं पर (उपवाचक), 4. प्रकृति की सीख, 5. फुटबाल
EnglishThe Little Girl, Rain on the Roof (Poem), The Adventures of Toto (SR-2); A Truly Beautiful Mind, The Lake Isle of Innisfree (Poem), Iswaran the Storyteller (SR-3)
గణితం1. Coordinate Geometry, 2. Linear Equations in Two Variables, 3. Introduction to Euclid’s Geometry, 4. Lines and Angles
భౌతిక శాస్త్రం3. Force and Laws of Motion, 4. Is Matter Around Us Pure?
జీవ శాస్త్రంTissues — 2.1, 2.2 ఉపాంశాలు మాత్రమే
సోషల్1. Physical Features of India, 2. Socialism in Europe and the Russian Revolution, 3. Constitutional Design, 4. People as Resource

జీవ శాస్త్రంలో Tissues అధ్యాయం సగమే — 2.1, 2.2. జంతు కణజాలాలు ఈసారి పరీక్షలో లేవు. హిందీలో तारे जमीं पर ఉపవాచకంగా ఉంది. ప్రతి సబ్జెక్టు వివరణ, పరీక్ష రోజుల క్రమం AP 9th Class FA2 Syllabus 2026-27 పేజీలో ఉంది.


10వ తరగతి FA2 సిలబస్

సబ్జెక్టుFA2 పాఠాలు
తెలుగుజలియన్ వాలా బాగ్, చేజారిన బాల్యం, ప్రకృతి సందేశం, జీవని; ఉపవాచకం: అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ
హిందీ6. अंतर्राष्ट्रीय स्तर पर हिन्दी, दो कलाकार (उपवाचक), 7. भक्ति पद, 8. स्वराज्य की नींव, 9. दक्षिणी गंगा गोदावरी
EnglishThe Ball Poem, From the Diary of Anne Frank, Amanda (Poem), Glimpses of India (A Baker from Goa, Coorg, Tea from Assam), The Trees (Poem), The Thief’s Story (SR-2), The Midnight Visitor (SR-3), A Question of Trust (SR-4)
గణితం1. Arithmetic Progressions, 2. Triangles, 3. Coordinate Geometry, 4. Statistics
భౌతిక శాస్త్రం10. The Human Eye and the Colourful World, 3. Metals and Non-metals, 11. Electricity
జీవ శాస్త్రంControl and Coordination
సోషల్1. Water Resources, 2. Agriculture, 3. The Making of a Global World (నాలుగో ఉపాంశం ప్రాజెక్టుకు మాత్రమే), 4. Gender, Religion and Caste, 5. Sectors of the Indian Economy, 6. Money and Credit

పదో తరగతికి ప్రతి సబ్జెక్టుకూ వేరే ప్రశ్నల నమూనా ఉంది — 13 నుంచి 19 ప్రశ్నలు, అన్నీ 35 మార్కులకే. హిందీలో మాత్రమే ఛాయిస్ ఉంది. ఏడు సబ్జెక్టుల పేపర్లు, నమూనా పట్టిక AP 10th Class FA2 Question Papers 2026-27 పేజీలో ఉన్నాయి.


పాత జాబితాతో తేడాలు

ఈ పేజీ పాత వెర్షన్ చూసి చదువుతున్నవారు ఈ మార్పులు గమనించండి. తీసేసిన అధ్యాయాలు FA2 రాత పరీక్షలో రావు; చేర్చినవి తప్పక చదవాలి.

తరగతిసబ్జెక్టుమార్పుఅధికారిక జాబితా
6సైన్స్The World of Science తీసేశాంఅధ్యాయాలు 2, 3, 4 మాత్రమే
6సోషల్India’s Cultural Roots చేర్చాంపాత జాబితాలో లేదు
7గణితంA Tale of Three Intersecting Lines చేర్చాంపాత జాబితాలో లేదు
7సైన్స్Adolescence తీసేశాంఅధ్యాయాలు 3, 4, 5 మాత్రమే
7తెలుగుమట్టిచెట్టు కాదు, మర్రిచెట్టుSCERT పత్రంలోని పేరు
8గణితంA Story of Numbers తీసేశాం; We Distribute, Yet Things Multiply చేర్చాంఅధ్యాయాలు 1 నుంచి 4
8భౌతిక శాస్త్రంSolutions తీసేశాంఅధ్యాయాలు 3, 4 మాత్రమే
8జీవ శాస్త్రంHarmony తీసేశాంHealth ఒక్కటే
9జీవ శాస్త్రంTissues 2.3 తీసేశాం2.1, 2.2 మాత్రమే
10జీవ శాస్త్రంHow do Organisms Reproduce? తీసేశాంControl and Coordination ఒక్కటే
10సోషల్The Age of Industrialisation తీసేశాంGlobal World నాలుగో ఉపాంశం ప్రాజెక్టుకు మాత్రమే
9, 10టైమ్ టేబుల్సమయం సరిచేశాంఉదయం 11:00, మధ్యాహ్నం 2:45

తెలుగు ఉపవాచకం గురించి

పదో తరగతి తెలుగుకు ఉపవాచకం (రామాయణం — అయోధ్యా, అరణ్య, కిష్కింధా కాండలు) SCERT పత్రంలో స్పష్టంగా ఉంది. 6 నుంచి 9 తరగతులకు పత్రం ప్రధాన పాఠాలు మాత్రమే పేర్కొంది. పాత జాబితాలో ఈ తరగతుల తెలుగుకు అదనంగా కొన్ని పాఠాలు ఉండేవి — ఉదాహరణకు 7వ తరగతికి కోటప్పకొండ ప్రభల తిరునాళ్లు, రొట్టెల పండుగ, అహోబిలం పార్వేట ఉత్సవం. ఆ పేర్లు అధికారిక జాబితాలో లేవు. ఉపవాచకం ప్రశ్నలు వస్తాయో లేదో పత్రం చెప్పలేదు కాబట్టి మీ తెలుగు ఉపాధ్యాయుడిని ఒకసారి అడిగి నిర్ధారించుకోండి.


1 నుంచి 5 తరగతుల FA2 సిలబస్

ప్రాథమిక తరగతులకు పరీక్షలు మూడు రోజులు: 05 అక్టోబర్ తెలుగు (ఉదయం 9:30), గణితం (మధ్యాహ్నం 1:15); 06 అక్టోబర్ English (ఉదయం), EVS (మధ్యాహ్నం); 07 అక్టోబర్ OSSC. 1, 2 తరగతుల పేపర్‌లో 10 బహుళైచ్ఛిక ప్రశ్నలు (ఒక్కొక్కటి 2 మార్కులు), 5 FR ప్రశ్నలు (ఒక్కొక్కటి 3 మార్కులు). 3, 4, 5 తరగతులకు 15 × 1, 2 × 2, 4 × 4 — మొత్తం 21 ప్రశ్నలు. ఈ మూడు తరగతులకు ఈసారి TaRL పరీక్ష కూడా FA2 తో కలిపి జరుగుతుంది.

తరగతితెలుగుగణితంEnglishEVS
1పడవ, చందమామ రావె, మేలుకొలుపు, ఉడత ఉడత హూచ్, తకధిమితోం, అరక1. Numbers (0 – 9)1.1 My Body Parts, 1.2 My Family, 2.1 My Actions—
2వాన, చిలకల్లారా చిలకల్లారా!, పూచిన పూలు, పరుగు పందెం, కొంటె కోతి, ఏ ఊరెళదాం1. Shall We Count, 2. Let Us Add1.1 Welcome to School, 1.2 Games We Play, 2.1 May I Help You?—
3మంచిబాలుడు, నా బాల్యం2. Addition, 3. Subtraction2. Tenali Rama and the Thieves, 3. The Loyal MongooseAnimals Around Us, Our Body
4దేశమును ప్రేమించుమన్నా, పరివర్తన1. Addition, 2. Subtraction2. Major Dhyan Chand, 3. A Trip of MemoriesAnimals Around Us, Sense Organs
5కొండవాగు, జయగీతం1. Addition and Subtraction, 2. Multiplication and Division2. My Sweet Memories, 3. The NecklaceClothes We Wear, Our Body Our Organ Systems

ప్రాజెక్టు అంశాల కోసం AP FA2 Project Works Class 1 to 5 చూడండి. Annexure-I లో 1, 2 తరగతులకు EVS పాఠాలు ఇవ్వలేదు.


AP FA2 Time Table 2026 — 6 నుంచి 10 తరగతులు

ఒకే రోజు ఒకే సబ్జెక్టు అయినా 6, 7, 8 తరగతులకు, 9, 10 తరగతులకు సమయం వేరు. 8వ తరగతి మాత్రం 08 అక్టోబర్ నాడు 9, 10 తరగతులతో కలిసి రాస్తుంది.

తేదీ6, 7, 8 తరగతులు9, 10 తరగతులు
05.10.2026
సోమవారం
తెలుగు 9:30 – 10:45
గణితం 1:15 – 2:30
తెలుగు 11:00 – 12:15
గణితం 2:45 – 4:00
06.10.2026
మంగళవారం
హిందీ 9:30 – 10:45
సైన్స్ (6, 7) / భౌతిక శాస్త్రం (8) 1:15 – 2:30
హిందీ 11:00 – 12:15
భౌతిక శాస్త్రం 2:45 – 4:00
07.10.2026
బుధవారం
English 9:30 – 10:45
సోషల్ 1:15 – 2:30
English 11:00 – 12:15
సోషల్ 2:45 – 4:00
08.10.2026
గురువారం
6, 7: OSSC-1 1:15 – 2:30
8: జీవ శాస్త్రం 9:30 – 10:45, OSSC-1 11:00 – 12:15, OSSC-2 2:45 – 4:00
జీవ శాస్త్రం 9:30 – 10:45
OSSC-1 11:00 – 12:15
OSSC-2 2:45 – 4:00

OSSC అంటే Oriental SSC — సంస్కృతం, అరబిక్ లేదా పర్షియన్ ప్రధాన భాషగా చదివే విద్యార్థులు. మిగిలిన విద్యార్థులకు 08 అక్టోబర్ నాడు జీవ శాస్త్రం (8, 9, 10) ఒక్కటే; 6, 7 తరగతుల్లో OSSC కాని వారికి ఆ రోజు పరీక్ష లేదు. FA2 కు సంబంధించిన మిగతా పేజీలన్నీ AP FA2 2026-27 పేజీలో ఒకచోట ఉన్నాయి.


ఇతర భాషా విభాగాల సిలబస్

Annexure-I లో ఇంకా CT&S (Composite Telugu and Sanskrit), Second Language Telugu, Composite Hindi, First Language Hindi, M.L. Sanskrit, Urdu, Kannada, Tamil, Odia విభాగాలకు వేర్వేరు జాబితాలు ఉన్నాయి. వాటిలో కొన్ని గడుల్లో అక్షరాలు స్పష్టంగా లేనందున ఇక్కడ ఇవ్వలేదు. ఈ విభాగాల విద్యార్థులు పాఠశాలకు వచ్చిన ప్రొసీడింగ్స్ ప్రతిని లేదా SCERT AP అధికారిక వెబ్‌సైట్ ను చూడండి.


AP FA2 Syllabus 2026-27 PDF Download

పై పట్టికలన్నీ ఒకే ఫైల్‌లో కావాలంటే — 1 నుంచి 10 తరగతుల జాబితా, పాత జాబితాతో తేడాలు, టైమ్ టేబుల్ — AP FA2 Syllabus 2026-27 Class 1 to 10 Download PDF. ఫోన్‌లో సేవ్ చేసుకుని, చదివిన పాఠం పక్కన టిక్ పెట్టుకుంటూ వెళ్లండి.

సిలబస్ తర్వాత: ప్రతి తరగతి, ప్రతి సబ్జెక్టుకు ఈ జాబితా ఆధారంగానే తయారైన సాధన పేపర్లు AP FA2 Question Papers Class 6 to 10 పేజీలో ఉన్నాయి. ప్రాజెక్టు పని మిగిలి ఉంటే AP FA2 Project Works 2026 చూడండి.


FAQs


1. AP FA2 Syllabus 2026-27 ఎక్కడి నుంచి తీసుకున్నారు?

SCERT, AP విడుదల చేసిన Rc.No.3426774/FA-2/SCERT/2026 (23.09.2026) ప్రొసీడింగ్స్‌కు జత చేసిన Annexure-I నుంచి. ఈ పేజీలోని ప్రతి పాఠం ఆ పత్రంతో సరిచూశాం.

2. SCERT పత్రం మీద “2025-26” అని ఉంది. ఇది పాత సిలబస్సా?

కాదు. Annexure-I శీర్షికలో ఆ సంవత్సరం ముద్రా దోషం. ప్రొసీడింగ్స్ తేదీ 23.09.2026, విషయం “Formative Assessment-2 for the year 2026-27” అని స్పష్టంగా ఉంది.

3. 10వ తరగతి జీవ శాస్త్రంలో ఎన్ని అధ్యాయాలు?

ఒక్కటే — Control and Coordination. పూర్తి వివరం AP 10th Class FA2 Biology Syllabus 2026-27 పేజీలో ఉంది.

4. 10వ తరగతి సోషల్‌లో ఏ భాగం రాత పరీక్షకు లేదు?

The Making of a Global World లోని నాలుగో ఉపాంశం (Rebuilding a World Economy: The Post-war Era) ప్రాజెక్టు పనికి మాత్రమే. The Age of Industrialisation జాబితాలోనే లేదు.

5. 9వ తరగతి జీవ శాస్త్రంలో Tissues పూర్తి అధ్యాయం చదవాలా?

అక్కరలేదు. 2.1, 2.2 ఉపాంశాలు మాత్రమే — మొక్కల కణజాలాల వరకు. జంతు కణజాలాల భాగం ఈ FA2 లో లేదు.

6. 8వ తరగతి సైన్స్ సిలబస్ ఏమిటి?

రెండు పేపర్లు. భౌతిక శాస్త్రం: Particulate Nature of Matter, Pressure and its Effects. జీవ శాస్త్రం: Health ఒక్కటే. Harmony, Solutions ఈ జాబితాలో లేవు.

7. 7వ తరగతి సైన్స్‌లో Adolescence ఉందా?

లేదు. 3, 4, 5 అధ్యాయాలు — Electric Circuits and their Components, Metals and Non-metals, Changes Around Us.

8. 6వ తరగతి సైన్స్‌లో The World of Science చదవాలా?

FA2 కు అక్కరలేదు. 2, 3, 4 అధ్యాయాలు మాత్రమే — Diversity in the Living World, Mindful Eating, Exploring Magnets.

9. Telugu Medium, English Medium కు సిలబస్ వేరా?

Annexure-I లో మాధ్యమాల వారీగా విడి జాబితా లేదు. ఒకే జాబితా రెండు మాధ్యమాలకూ వర్తిస్తుంది; పాఠాల పేర్లు మీ పుస్తకం భాషలో ఉంటాయి.

10. 6 నుంచి 9 తరగతుల తెలుగులో ఉపవాచకం చదవాలా?

పదో తరగతికి ఉపవాచకం స్పష్టంగా జాబితాలో ఉంది. 6 నుంచి 9 తరగతులకు SCERT పత్రం ప్రధాన పాఠాలు మాత్రమే పేర్కొంది, ఉపవాచకం గురించి ఏమీ చెప్పలేదు. మీ తెలుగు ఉపాధ్యాయుడిని ఒకసారి అడగండి.

11. 1, 2 తరగతులకు EVS పరీక్ష ఉందా?

Annexure-I లో 1, 2 తరగతులకు EVS సిలబస్ లేదు. EVS పాఠాలు 3, 4, 5 తరగతులకు మాత్రమే ఇచ్చారు. ప్రాథమిక తరగతుల EVS పరీక్ష 06 అక్టోబర్ మధ్యాహ్నం.

12. FA2 తర్వాత ఏ పరీక్ష?

SA1. దాని సిలబస్ పరిధి, సన్నాహ ప్రణాళిక AP SA1 2026-27 పేజీలో ఉన్నాయి.

ఆధారం: SCERT, ఆంధ్రప్రదేశ్ — Rc.No.3426774/FA-2/SCERT/2026, 23.09.2026, Annexure-I. పాఠశాల స్థాయిలో మార్పు ఉంటే మీ ప్రధానోపాధ్యాయుల సూచనే చివరిది.