AP 9th Class FA3 Biology Question Paper 2026-27 – Model Paper with Answers (35 Marks)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తొమ్మిదో తరగతి జీవశాస్త్రం FA3 కు సిద్ధమవుతున్నారా? AP 9th Class FA3 Biology Question Paper 2026-27 నమూనాలో Improvement in Food Resources అధ్యాయంపై 20 ప్రశ్నలు, 35 మార్కులు ఇక్కడ ఉన్నాయి. ఖరీఫ్, రబీ, పోషకాలు, ఎరువులు, పంటల విధానాలు, ధాన్యం నిల్వ అన్నీ జవాబులతో.

9th Biology FA3 అసలు పేపర్ జవాబులు (Key Paper) జనవరిలో పరీక్ష రోజే ఇక్కడ పెడతాం. లింక్ నేరుగా రావాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి.

ఈ పేజీలో: పేపర్ విధానం | FA3 అధ్యాయం | 20 ప్రశ్నలు | FAQs

AP 9th Class FA3 Biology 2026-27: 20 ప్రశ్నల విధానం

8 అక్టోబర్ 2026 న జరిగిన 9వ తరగతి FA2 జీవశాస్త్రం అసలు పేపర్ విభాగాలే ఇక్కడ.

విభాగంప్రశ్నలుమార్కులు
A (బహుళైచ్ఛికాలు)15 × 115
B2 × 24
C2 × 48
D (A లేదా B)1 × 88
మొత్తం2035

FA2 అసలు ప్రశ్నలు, జవాబులు AP 9th Class FA2 Biology Question Paper లో, FA3 వివరాలు AP FA3 Syllabus 2026-27 లో ఉన్నాయి.

9th Class FA3 Biology Syllabus 2026-27 (అంచనా)

SA1 లో వచ్చిన రెండు అధ్యాయాల అసలు పేపర్ AP 9th Class SA1 Biology Key Paper లో ఉంది. FA3 కు Improvement in Food Resources లోని మూడు భాగాలు:

భాగంముఖ్యాంశాలుఈ పేపర్‌లో
పంట రకాల మెరుగుదలసంకరణం, మెరుగుదల కారకాలు, ఖరీఫ్, రబీ1, 2, 9, 13, 14, 18
పంట ఉత్పత్తి నిర్వహణపోషకాలు, ఎరువులు, నీటిపారుదల, పంటల విధానాలు3 – 8, 15, 16, 17, 20
పంట రక్షణ నిర్వహణకలుపు, కీటకాలు, తెగుళ్ళు, ధాన్యం నిల్వ10, 11, 12, 19

AP 9th Class FA3 Biology Question Paper 2026-27 సిలబస్ – Improvement in Food Resources

AP 9th Class FA3 Biology Model Paper: 20 ప్రశ్నలు, జవాబులతో

1 గంట 15 నిమిషాలు టైమ్ పెట్టుకుని రాయండి. తర్వాత జవాబు తెరిచి పోల్చుకుని టిక్ పెట్టండి.

Section A: (15 × 1 = 15)

1. Kharif crops are grown in
(A) the rainy season (June to October)   (B) winter (November to April)   (C) summer only   (D) all seasons equally   [1 మార్కు]

జవాబు చూడండి
(A) the rainy season (June to October)
ఖరీఫ్ పంటలు వర్షాకాలంలో, జూన్ నుంచి అక్టోబర్ వరకు. ఉదా: వరి, సోయాబీన్, పెసర, మినుము, పత్తి.

2. Which of the following is a rabi crop?
(A) Paddy   (B) Wheat   (C) Soyabean   (D) Cotton   [1 మార్కు]

జవాబు చూడండి
(B) Wheat
రబీ పంటలు శీతాకాలంలో (నవంబర్ నుంచి ఏప్రిల్): గోధుమ, శనగ, బఠానీ, ఆవాలు. వరి ఖరీఫ్ పంట.

3. How many macro-nutrients do plants get from the soil?
(A) 3   (B) 6   (C) 7   (D) 13   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 6
నేల నుంచి 6 స్థూల పోషకాలు (N, P, K, Ca, Mg, S), 7 సూక్ష్మ పోషకాలు (Fe, Mn, B, Zn, Cu, Mo, Cl).

4. Which nutrient is supplied to plants by air?
(A) Nitrogen   (B) Carbon   (C) Potassium   (D) Calcium   [1 మార్కు]

జవాబు చూడండి
(B) Carbon
గాలి నుంచి కార్బన్, ఆక్సిజన్; నీటి నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్.

5. Compost prepared by using earthworms is called
(A) green manure   (B) vermicompost   (C) fertiliser   (D) fodder   [1 మార్కు]

జవాబు చూడండి
(B) vermicompost
వానపాముల సహాయంతో మొక్కలు, జంతువుల వ్యర్థాలను త్వరగా కుళ్ళబెట్టి తయారుచేసేది వర్మీకంపోస్ట్.

6. Green manure is prepared by
(A) burning crop residue   (B) ploughing green plants like sun hemp into the soil   (C) mixing urea with water   (D) drying cow dung   [1 మార్కు]

జవాబు చూడండి
(B) ploughing green plants like sun hemp into the soil
సన్‌హెంప్, గోరుచిక్కుడు వంటి మొక్కలను పెంచి, పూత ముందే దున్ని నేలలో కలపడం.

7. Growing two or more crops simultaneously on the same field in a definite row pattern is
(A) mixed cropping   (B) intercropping   (C) crop rotation   (D) monoculture   [1 మార్కు]

జవాబు చూడండి
(B) intercropping
నిర్దిష్ట వరుసల్లో రెండు లేదా ఎక్కువ పంటలు: అంతర పంట (Intercropping). నిర్దిష్ట వరుసలు లేకుండా కలిపి వేస్తే మిశ్రమ పంట.

8. Growing different crops on a piece of land in a pre-planned succession is called
(A) crop rotation   (B) mixed cropping   (C) hybridisation   (D) irrigation   [1 మార్కు]

జవాబు చూడండి
(A) crop rotation
పంట మార్పిడి (Crop rotation). ఉదా: వరి తర్వాత పప్పుధాన్య పంట; నేలలో నత్రజని పెరుగుతుంది.

9. Crossing between genetically dissimilar plants to get better varieties is
(A) hybridisation   (B) fumigation   (C) irrigation   (D) weeding   [1 మార్కు]

జవాబు చూడండి
(A) hybridisation
జన్యుపరంగా భిన్నమైన మొక్కల మధ్య సంకరణం: Hybridisation (intervarietal, interspecific, intergeneric).

10. Which of the following is a weed?
(A) Wheat   (B) Parthenium   (C) Maize   (D) Gram   [1 మార్కు]

జవాబు చూడండి
(B) Parthenium
Xanthium (గోక్షురం), Parthenium (వయ్యారి భామ), Cyperinus rotundus (తుంగ) కలుపు మొక్కలు.

11. Chemicals used to kill weeds are called
(A) fungicides   (B) weedicides   (C) fertilisers   (D) manures   [1 మార్కు]

జవాబు చూడండి
(B) weedicides
కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనాలు కలుపు నాశనులు (Weedicides).

12. Which of these is an abiotic factor causing loss of stored grains?
(A) Rodents   (B) Insects   (C) Moisture   (D) Fungi   [1 మార్కు]

జవాబు చూడండి
(C) Moisture
తేమ, ఉష్ణోగ్రత నిర్జీవ కారకాలు. కీటకాలు, ఎలుకలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా జీవ కారకాలు.

13. Tallness and profuse branching are desirable characters for
(A) fodder crops   (B) cereals   (C) pulses   (D) oil seeds   [1 మార్కు]

జవాబు చూడండి
(A) fodder crops
పశుగ్రాస పంటలకు ఎత్తు, ఎక్కువ కొమ్మలు కావాలి; ధాన్య పంటలకు పొట్టిగా ఉండటం మేలు (తక్కువ పోషకాలు ఖర్చు).

14. Which group of crops provides us mainly carbohydrates?
(A) Cereals   (B) Pulses   (C) Oil seeds   (D) Vegetables   [1 మార్కు]

జవాబు చూడండి
(A) Cereals
వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న వంటి ధాన్యాలు (cereals) పిండిపదార్థాలు; పప్పుధాన్యాలు ప్రోటీన్లు; నూనెగింజలు కొవ్వులు.

15. Which structure helps to increase groundwater level by collecting rainwater?
(A) Check-dams   (B) Tube wells   (C) Canals from rivers   (D) River lift systems   [1 మార్కు]

జవాబు చూడండి
(A) Check-dams
చెక్‌డ్యాములు వర్షపు నీటిని ఆపి భూమిలోకి ఇంకేలా చేస్తాయి; భూగర్భ జలమట్టం పెరుగుతుంది.

Section B: (2 × 2 = 4)

16. Write any two differences between mixed cropping and intercropping.   [2 మార్కులు]

జవాబు చూడండి
మిశ్రమ పంట (Mixed cropping)అంతర పంట (Intercropping)
రెండు లేదా ఎక్కువ పంటల విత్తనాలు కలిపి ఒకే పొలంలో వేస్తారు; నిర్దిష్ట వరుసలు ఉండవు.పంటలను నిర్దిష్ట వరుసల క్రమంలో (ఉదా: 1 వరుస : 3 వరుసలు) వేస్తారు.
ఒక పంట పోయినా మరోటి దక్కుతుందనే భద్రత ముఖ్య ఉద్దేశం. ఉదా: గోధుమ + శనగ.రెండు పంటలకూ పోషకాలు పూర్తిగా అందేలా, ఎక్కువ దిగుబడి కోసం. ఉదా: సోయాబీన్ + మొక్కజొన్న.

17. Why is manure considered better than fertilisers for the soil in the long run? Give two reasons.   [2 మార్కులు]

జవాబు చూడండి
1. ఎరువు (manure) నేలకు సేంద్రియ పదార్థాన్ని చేర్చి నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది; ఇసుక నేలలో నీటి నిల్వ సామర్థ్యం, బంకమట్టి నేలలో గాలి ప్రసరణ పెరుగుతాయి.
2. రసాయన ఎరువులను అతిగా వాడితే నేల సారం తగ్గి, నేలలోని సూక్ష్మజీవులు నశిస్తాయి, నీరు కలుషితమవుతుంది; ఎరువుతో అలాంటి హాని ఉండదు.

Section C: (2 × 4 = 8)

18. What are the factors for which crop variety improvement is done? Explain any four.   [4 మార్కులు]

జవాబు చూడండి
1. ఎక్కువ దిగుబడి: ఒక ఎకరానికి పంట ఉత్పత్తి పెంచడం.
2. మెరుగైన నాణ్యత: గోధుమలో రొట్టె నాణ్యత, పప్పుధాన్యాల్లో ప్రోటీన్, నూనెగింజల్లో నూనె నాణ్యత.
3. జీవ, నిర్జీవ ఒత్తిడుల నిరోధం: తెగుళ్ళు, కీటకాలు, నులిపురుగులు (జీవ) మరియు కరువు, లవణత, వరద, వేడి, చలి (నిర్జీవ) తట్టుకునే రకాలు.
4. పక్వానికి వచ్చే కాలం తగ్గడం: త్వరగా పండితే ఖర్చు తగ్గుతుంది, ఏడాదిలో ఎక్కువ పంటలు వేయవచ్చు, ఒకేసారి కోతకు వస్తుంది.
ఇంకా: విస్తృత అనుకూలత (వేర్వేరు వాతావరణాల్లో పెరగడం), కోరుకున్న వ్యవసాయ లక్షణాలు (పశుగ్రాసానికి ఎత్తు, ధాన్యాలకు పొట్టితనం).

19. How can the loss of grains during storage be prevented? Write the preventive and control measures.   [4 మార్కులు]

జవాబు చూడండి
నష్టానికి కారణాలు: జీవ కారకాలు (కీటకాలు, ఎలుకలు, శిలీంధ్రాలు, పురుగులు, బ్యాక్టీరియా), నిర్జీవ కారకాలు (సరిపడని తేమ, ఉష్ణోగ్రత). దీనివల్ల నాణ్యత తగ్గి, బరువు తగ్గి, మొలకెత్తే శక్తి పోయి, రంగు మారుతుంది.
నివారణ, నియంత్రణ చర్యలు:
1. నిల్వ చేసే ముందు ధాన్యాన్ని శుభ్రం చేయడం.
2. ముందుగా ఎండలో, తర్వాత నీడలో బాగా ఆరబెట్టడం (తేమ తగ్గించడం).
3. గోదాములను శుభ్రం చేసి, పగుళ్లు లేకుండా చూడడం; ఎలుకలు రాకుండా జాగ్రత్తలు.
4. కీటకాలను చంపే రసాయనాలతో ధూమీకరణ (fumigation).

Section D: (1 × 8 = 8)

20. (A) Explain nutrient management in crop production. Differentiate between manure and fertilisers.
OR
(B) Explain the different kinds of irrigation systems used in India. How do cropping patterns help to get maximum benefit?   [8 మార్కులు]

జవాబు చూడండి
(A) మొక్కలకు 16 పోషకాలు అవసరం: గాలి నుంచి C, O; నీటి నుంచి H, O; నేల నుంచి 13 (6 స్థూల పోషకాలు N, P, K, Ca, Mg, S; 7 సూక్ష్మ పోషకాలు Fe, Mn, B, Zn, Cu, Mo, Cl). ఇవి లోపిస్తే పెరుగుదల, పునరుత్పత్తి దెబ్బతిని వ్యాధులు వస్తాయి. అందుకే నేలకు ఎరువులు, రసాయన ఎరువులు ఇస్తాం.

ఎరువు (Manure)రసాయన ఎరువు (Fertiliser)
జంతువుల వ్యర్థాలు, మొక్కల వ్యర్థాలు కుళ్ళి తయారవుతుందికర్మాగారాల్లో తయారయ్యే రసాయనాలు
పోషకాలు తక్కువ మొత్తంలో, కానీ సేంద్రియ పదార్థం ఎక్కువN, P, K ఎక్కువ మొత్తంలో అందిస్తాయి
నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుందిఅతిగా వాడితే నేల సారం, సూక్ష్మజీవులు దెబ్బతింటాయి
ఉదా: కంపోస్ట్, వర్మీకంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువుఉదా: యూరియా, DAP

సేంద్రియ వ్యవసాయంలో రసాయనాలు వాడకుండా ఎరువులు, జీవ ఎరువులు (నీలి-ఆకుపచ్చ శైవలాలు), వేప ఆకుల వంటి జీవ కీటకనాశనులు వాడతారు.

(B) నీటిపారుదల వ్యవస్థలు:
1. బావులు: తవ్విన బావులు (లోతులేని నీటి పొరల నుంచి), గొట్టపు బావులు (లోతైన పొరల నుంచి, మోటార్ పంపులతో).
2. కాలువలు: నది నుంచి లేదా జలాశయం నుంచి ప్రధాన కాలువ, శాఖ కాలువల ద్వారా పొలాలకు.
3. నది ఎత్తిపోతల వ్యవస్థ: జలాశయం నుంచి కాలువ ప్రవాహం సరిపోని చోట నది నుంచి నేరుగా నీటిని ఎత్తిపోస్తారు.
4. చెరువులు: చిన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని నిల్వ చేసే చిన్న జలాశయాలు.
5. కొత్త పద్ధతులు: వర్షపు నీటి సేకరణ, చెక్‌డ్యాములు, వాటర్‌షెడ్ నిర్వహణ; భూగర్భ జలమట్టం పెరుగుతుంది.
పంటల విధానాలు: మిశ్రమ పంట (నష్ట భయం తగ్గుతుంది), అంతర పంట (పోషకాల పూర్తి వినియోగం, తెగుళ్ళ వ్యాప్తి తగ్గుతుంది), పంట మార్పిడి (నేల సారం పెరుగుతుంది, ఏడాదిలో ఎక్కువ పంటలు). దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుంది.

9th Biology FA3 లో మార్కులు కోల్పోయే చోట్లు

  • మిశ్రమ పంట, అంతర పంట తారుమారు చేయడం (వరుసల క్రమం ఉంటేనే అంతర పంట).
  • ఖరీఫ్, రబీ నెలలు తప్పుగా రాయడం.
  • స్థూల, సూక్ష్మ పోషకాల సంఖ్య (6, 7) కలిపేయడం.
  • ఎరువు, రసాయన ఎరువుల తేడాల్లో ఉదాహరణలు రాయకపోవడం.

తర్వాత ఏం చదవాలి

FAQs

AP 9th Class FA3 Biology లో ఏ అధ్యాయం?

SA1 అధికారిక జాబితాలో The Fundamental Unit of Life, Tissues వచ్చాయి. పుస్తకంలో తర్వాతి అధ్యాయం Improvement in Food Resources. గత ఏడాది FA3 జాబితాలో ‘12.1 Improvement in crop yields’ అని ఉంది. ఇది అంచనా.

9th Bio FA3 పేపర్ విధానం?

35 మార్కులు, 20 ప్రశ్నలు, 1 గంట 15 నిమిషాలు: 15 × 1, 2 × 2, 2 × 4, 1 × 8 (A లేదా B). 8 అక్టోబర్ 2026 FA2 అసలు పేపర్ (Exam Code 922) నమూనా ఇదే.

ఖరీఫ్, రబీ పంటల మధ్య తేడా?

ఖరీఫ్: వర్షాకాలం (జూన్ నుంచి అక్టోబర్), వరి, పత్తి, సోయాబీన్. రబీ: శీతాకాలం (నవంబర్ నుంచి ఏప్రిల్), గోధుమ, శనగ, ఆవాలు.

స్థూల, సూక్ష్మ పోషకాలు ఎన్ని?

నేల నుంచి 13: 6 స్థూల (N, P, K, Ca, Mg, S), 7 సూక్ష్మ (Fe, Mn, B, Zn, Cu, Mo, Cl). గాలి, నీటి నుంచి C, H, O. మొత్తం 16.

Animal husbandry FA3 కు ఉందా?

ప్రస్తుత NCERT ఆధారిత పుస్తకంలో ఈ అధ్యాయంలో పంట దిగుబడి మెరుగుదల భాగమే ఉంది; పశుపోషణ, చేపలు, తేనెటీగల పెంపకం భాగాలు తగ్గించారు. ఉపాధ్యాయుల దగ్గర ఒకసారి సరిచూసుకోండి.

8 మార్కులకు ఏవి ముఖ్యం?

పోషక నిర్వహణ (ఎరువు, రసాయన ఎరువు తేడాలు), నీటిపారుదల రకాలు, పంటల విధానాలు, పంట రక్షణ, ధాన్యం నిల్వ.

కలుపు మొక్కల ఉదాహరణలు?

Xanthium (గోక్షురం), Parthenium (వయ్యారి భామ), Cyperinus rotundus (తుంగ).

ఇది అసలు FA3 పేపరా?

కాదు. పాఠ్యపుస్తకం ఆధారంగా మేము తయారు చేసిన సాధన పేపర్. FA3 రోజు అసలు పేపర్, జవాబులు ఇదే పేజీలో పెడతాం.

FA3 పరీక్షలు ఎప్పుడు?

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 4 నుంచి 7 జనవరి 2027. తేదీలు FA3 ఉత్తర్వు వచ్చాక AP FA3 Syllabus 2026-27 పేజీలో ఇస్తాం.

SA1 Biology జవాబులు ఎక్కడ?

17 నవంబర్ 2026 అసలు పేపర్, జవాబులు AP 9th Class SA1 Biology Question Paper పేజీలో ఉన్నాయి.

పాఠ్యపుస్తకాలు, ఉత్తర్వుల కోసం AP School Education Department, NCERT Textbooks. ప్రశ్నలు, జవాబులు మా సొంతం.