పదో తరగతి FA2 English సిలబస్‌లో పది పాఠాలు ఉన్నాయి — రెండు పాఠ్యపుస్తకాల నుంచి. మిగిలిన సబ్జెక్టుల్లో మూడు నాలుగు అధ్యాయాలుంటే ఇక్కడ పది. అందుకే విద్యార్థులు ఏది చదవాలో తెలియక గందరగోళపడతారు.
ఈ AP 10th Class FA2 English Question Paper ను ఒక నియమంతో తయారు చేశాం — పది పాఠాల నుంచీ ప్రశ్నలు ఉండాలి, ఒక్కటీ వదలకూడదు. SCERT ఇచ్చిన పదో తరగతి English నమూనా ప్రకారం 35 మార్కులు, 19 ప్రశ్నలు (11 × 1, 7 × 2, 1 × 10), ప్రతి ప్రశ్నకూ పూర్తి జవాబు.
ఈ పేజీలో ఏం మారింది: ఈ పేపర్ మొదట 20 మార్కుల నమూనాతో ఉండేది. SCERT 23.09.2026 ప్రొసీడింగ్స్ లో పదో తరగతి FA2 పేపర్లన్నీ 35 మార్కులని వచ్చింది. అందుకే ప్రశ్నలు 19 కి పెంచి, 10 మార్కుల diary entry ప్రశ్న చేర్చి, కొత్త PDF లు ఇచ్చాం.

పది పాఠాలు, రచయితలు, పుస్తకాలు ఒకే చిత్రంలో — ఫోన్‌లో సేవ్ చేసుకుని పరీక్షకు ముందు చూసుకోండి.
ఈ పేజీలో ఏమి ఉంది
- పరీక్ష వివరాలు, రెండు పుస్తకాల మార్కుల విభజన
- పది పాఠాల వారీ మార్కుల పంపిణీ, రచయితల జాబితా
- 19 ప్రశ్నల పూర్తి ప్రశ్నపత్రం, జవాబులతో
- ప్రశ్నపత్రం PDF (జవాబులతో, జవాబులు లేకుండా)
- సమాధానం ఎంత పొడవు రాయాలి
- ఈ ప్రశ్నల్లో మార్కులు ఎక్కడ పోతాయి
AP 10th Class FA2 English Question Paper 2026-27 — పరీక్ష వివరాలు
| పరీక్ష | Formative Assessment 2 (FA2 / Self Assessment-2) |
| తరగతి | 10వ తరగతి (AP SSC) |
| సబ్జెక్ట్ | English |
| పరీక్ష తేదీ | 07 అక్టోబర్ 2026 (బుధవారం) |
| సమయం | ఉదయం 11:00 నుంచి 12:15 వరకు (1 గం. 15 ని.) |
| మార్కులు | 35 (11 × 1 + 7 × 2 + 1 × 10) |
| ప్రశ్నలు | 19 |
| పాఠాలు | 10 — First Flight, Footprints without Feet |
అన్ని సబ్జెక్టుల FA2 సిలబస్ కోసం AP FA2 Syllabus 2026-27 – Class 6 to 10 Complete Subject-wise Guide, పదో తరగతి మిగిలిన ప్రశ్నపత్రాల కోసం AP 10th Class FA2 Question Papers 2026-27 PDF – All Subjects పేజీలు చూడండి.
గమనిక: పాఠాల జాబితా, తేదీ, సమయం, 11 × 1 / 7 × 2 / 1 × 10 విభజన — ఇవి SCERT ప్రొసీడింగ్స్ Rc.No.3426774/FA-2/SCERT/2026 నుంచి తీసుకున్నాం. ప్రశ్నలు, జవాబులు మాత్రం మా సొంతం; పరీక్ష హాల్‌లో ఇవే ప్రశ్నలు వస్తాయని అనుకోవద్దు.
రెండు పుస్తకాలు — ఎంతెంత మార్కులు
English కి రెండు పాఠ్యపుస్తకాలు ఉన్నాయని చాలామంది మర్చిపోతారు. First Flight ప్రధాన పుస్తకం (గద్యం + పద్యం); Footprints without Feet అనుబంధ పుస్తకం (కథలు మాత్రమే). FA2 సిలబస్‌లో రెండింటి నుంచీ పాఠాలు ఉన్నాయి:
| పాఠ్యపుస్తకం | మార్కులు |
|---|---|
| First Flight | 18 |
| Footprints without Feet | 17 |
Footprints without Feet ను “అనుబంధం కదా” అని వదిలేయకూడదు — ఈ పేపర్‌లోనే దాని నుంచి 17 మార్కులు ఉన్నాయి.
పది పాఠాలు, రచయితలు, మార్కుల పంపిణీ
English లో 1 మార్కు ప్రశ్నలు దాదాపు ఎప్పుడూ రచయిత పేరు, పాత్ర పేరు, ప్రదేశం మీదే ఉంటాయి. ఈ పట్టిక ఒక్కసారి చదివితే Section A లోని 11 మార్కులు సులభమవుతాయి:
| పాఠం | రచయిత | పుస్తకం | మార్కులు | ప్రశ్న సంఖ్యలు |
|---|---|---|---|---|
| The Thief’s Story | Ruskin Bond | Footprints without Feet | 11 | 1, 19 |
| The Midnight Visitor | Robert Arthur | Footprints without Feet | 3 | 8, 14 |
| A Question of Trust | Victor Canning | Footprints without Feet | 3 | 9, 15 |
| From the Diary of Anne Frank | Anne Frank | First Flight | 2 | 2, 11 |
| A Baker from Goa (Glimpses of India) | Lucio Rodrigues | First Flight | 3 | 3, 18 |
| Coorg (Glimpses of India) | Lokesh Abrol | First Flight | 3 | 4, 17 |
| Tea from Assam (Glimpses of India) | Arup Kumar Datta | First Flight | 3 | 10, 12 |
| The Ball Poem | John Berryman | First Flight | 3 | 7, 13 |
| Amanda! | Robin Klein | First Flight | 3 | 5, 16 |
| The Trees | Adrienne Rich | First Flight | 1 | 6 |
పది పాఠాలూ ఈ పేపర్‌లో ఉన్నాయి — ఒక్కటీ మిగల్లేదు. బోర్డ్ పరీక్ష వెయిటేజీ కోసం AP 10th Class English Blueprint 2027 & Model Papers PDF – Weightage పేజీ చూడండి.
AP 10th Class FA2 English Question Paper — 19 ప్రశ్నలు, జవాబులతో
Time: 1 hour 15 minutes Max. Marks: 35
Instructions: Answer all the questions. Write the answers in your own words. Marks are indicated against each question.
ముందు మీరే ప్రయత్నించండి — ఆ తర్వాతే “జవాబు చూడండి” నొక్కండి.
SECTION — A — 11 × 1 = 11 Marks
Answer each question in one sentence or a few words.
1. Who is the author of the story The Thief’s Story? [1 Mark]
జవాబు చూడండి
2. What name did Anne Frank give her diary? [1 Mark]
జవాబు చూడండి
3. What is the traditional Goan baker locally called? [1 Mark]
జవాబు చూడండి
4. In which state is Coorg located? [1 Mark]
జవాబు చూడండి
5. Who wrote the poem Amanda!? [1 Mark]
జవాబు చూడండి
6. Who wrote the poem The Trees? [1 Mark]
జవాబు చూడండి
7. Who wrote The Ball Poem? [1 Mark]
జవాబు చూడండి
8. Who is the secret agent in The Midnight Visitor? [1 Mark]
జవాబు చూడండి
9. Why did Horace Danby rob one safe every year? [1 Mark]
జవాబు చూడండి
10. In Tea from Assam, what was the job of Pranjol’s father? [1 Mark]
జవాబు చూడండి
11. What was the title of the first essay Mr Keesing gave Anne as a punishment for talking in class? [1 Mark]
జవాబు చూడండి
SECTION — B — 7 × 2 = 14 Marks
Answer in about 30 to 40 words each.
12. Write briefly about the two legends connected with the origin of tea. [2 Marks]
జవాబు చూడండి
The Indian legend: A Buddhist monk cut off his eyelids to stop himself from falling asleep during meditation. Ten tea plants are said to have grown from them, and their leaves kept away sleep when brewed. (1 mark)
13. What does the boy in The Ball Poem learn from losing his ball? [2 Marks]
జవాబు చూడండి
The poet does not offer him money or comfort, because the boy has to understand loss by himself. This teaches him responsibility and the sense of possession — a lesson everyone learns while growing up. (1 mark)
14. Why is The Midnight Visitor considered a story of presence of mind? [2 Marks]
జవాబు చూడండి
The frightened intruder tries to escape through the window to the ‘balcony’ and falls. Ausable defeats a man with a gun using nothing but a calm mind and a convincing story. (1 mark)
15. What is ironic about the ending of A Question of Trust? [2 Marks]
జవాబు చూడండి
The irony: she was not the owner’s wife but another thief. The man who lived by deceiving others was himself deceived, and his fingerprints on the safe sent him to jail. (1 mark)
16. What does Amanda imagine herself to be, and why? [2 Marks]
జవాబు చూడండి
Each dream stands for freedom and silence — the very things the constant nagging takes away from her. (1 mark)
17. Write about the people of Coorg and any two attractions of the place. [2 Marks]
జవాబు చూడండి
Attractions: coffee estates and spice gardens; the river Kaveri, home to the mahseer fish; and adventure sports such as river rafting, canoeing and trekking. (1 mark)
18. Describe the dress of the Goan baker and explain why bakers were important in Goan life. [2 Marks]
జవాబు చూడండి
Importance: Bread was a must at every occasion — sweet bread at marriages, cakes and bolinhas at Christmas, sandwiches at a daughter’s engagement. A village without a baker was unthinkable. (1 mark)
SECTION — C — 1 × 10 = 10 Marks
Write in about 150 to 180 words. Format, content and language are marked separately.
19. Imagine you are Hari Singh in The Thief’s Story. Write a diary entry describing the night you stole Anil’s money and why you decided to return it. (150–180 words) [10 Marks]
జవాబు చూడండి
Model answer:
Friday, 11 p.m.
Dear Diary,
Tonight I did the worst thing and then the best thing of my life. Anil had got money from a publisher and kept a wad of six hundred rupees under his mattress. When he was fast asleep, I slipped my hand under it and took the notes. I thought I would catch the Lucknow Express and never come back.
At the station the train began to move, but my feet would not climb in. I kept thinking of Anil. He had given me food, a roof and, above all, trust. He had started teaching me to write whole sentences. If I ran away, I would lose the one chance to become an educated man — something worth far more than six hundred rupees.
It began to rain. Soaked, I walked back and put the damp notes under his mattress. This morning Anil gave me a fifty-rupee note and said I could now earn money regularly. He must have noticed the wet notes, but he said nothing. I will never steal from him again.
Hari
Marks: format (date, salutation, closing) — 2; content (the theft, the station, the change of heart, the return) — 5; language, organisation and word limit — 3.
ఈ ప్రశ్నపత్రాన్ని PDF గా డౌన్‌లోడ్ చేసుకోవడం
35 మార్కుల కొత్త పేపర్‌కు రెండు PDF లు ఉన్నాయి. మొదటిది ప్రశ్నలు మాత్రమే — 75 నిమిషాలు టైమర్ పెట్టుకుని, ముఖ్యంగా 10 మార్కుల diary entry ని పూర్తిగా రాసి చూడండి. రెండోదానిలో జవాబులు, మార్కుల విభజన ఉన్నాయి; దానితో మీ పేపర్‌ను మీరే దిద్దుకోండి.
- ప్రశ్నపత్రం మాత్రమే (పరీక్షలా రాయడానికి) — Download PDF
- ప్రశ్నపత్రం + జవాబుల పత్రం — Download PDF
English సబ్జెక్ట్ కాబట్టి తెలుగు మాధ్యమం, English మాధ్యమం విద్యార్థులందరికీ ఇదే పేపర్.
సమాధానం ఎంత పొడవు రాయాలి
English లో మార్కులు పోవడానికి ఒక పెద్ద కారణం — పొడవు తప్పుగా అంచనా వేయడం. 1 మార్కు ప్రశ్నకు పేరా రాసి సమయం పోగొట్టుకుంటారు; చివరికి 10 మార్కుల రచనకు పది నిమిషాలు కూడా మిగలవు. 75 నిమిషాల్లో Section A కి 12, Section B కి 28, Section C కి 25 నిమిషాలు, చివరి 10 నిమిషాలు సరిచూసుకోవడానికి — ఇలా పంచుకోండి.
| మార్కులు | పొడవు | ఏమి ఉండాలి |
|---|---|---|
| 1 | ఒక వాక్యం లేదా కొన్ని పదాలు | నేరుగా జవాబు — పేరు, ప్రదేశం, రచయిత |
| 2 | 30–40 పదాలు | రెండు అంశాలు — ప్రశ్నలో అడిగిన ప్రతి భాగానికీ ఒకటి |
| 10 | 150–180 పదాలు | ఫార్మాట్ (తేదీ, Dear Diary, పేరు) + సంఘటనలు, భావాలు + సరైన భాష |
ఈ ప్రశ్నల్లో మార్కులు ఎక్కడ పోతాయి
- ప్రశ్న 17, 18 లో ఒక భాగం వదిలేయడం. ప్రశ్న 17 లో people, attractions; ప్రశ్న 18 లో dress, importance — రెండేసి భాగాలు అడిగారు. ఒక్కటే రాస్తే సగం మార్కులే. ప్రశ్నలో ఎన్ని భాగాలున్నాయో లెక్కపెట్టి, అన్నింటికీ రాయండి.
- ప్రశ్న 15 లో వ్యంగ్యం (irony) వివరించకపోవడం. కథ చెప్పి ఆగిపోతారు. “మోసం చేసేవాడే మోసపోయాడు” అని ఎందుకు వ్యంగ్యమో రాయకపోతే రెండో మార్కు రాదు.
- ప్రశ్న 13 లో బంతి గురించే రాయడం. కవిత బంతి గురించి కాదు — నష్టాన్ని మొదటిసారి అనుభవించడం గురించి. ఆ భావం రాయకపోతే మార్కు రాదు.
- ప్రశ్న 19 లో ఫార్మాట్ మర్చిపోవడం. తేదీ, Dear Diary, చివర పేరు లేకపోతే కథ ఎంత బాగా రాసినా 2 మార్కులు పోతాయి. Diary entry మొదటి వ్యక్తిలో (I, me) రాయాలి — “Hari Singh took the money” అని మూడో వ్యక్తిలో రాయకూడదు.
- పద్య పంక్తులను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం. పంక్తులు అడగరు — భావం అడుగుతారు. సొంత మాటల్లో రాయడం సాధన చేయండి.
- రచయిత పేరు తప్పు రాయడం. Glimpses of India లో మూడు భాగాలకూ మూడు వేర్వేరు రచయితలు. ఒకే రచయిత అనుకుంటే 1 మార్కు ప్రశ్న తప్పుతుంది.
- జవాబులో పేర్లు వాడకపోవడం. “ఆ అబ్బాయి”, “ఆ వ్యక్తి” కాదు — Hari Singh, Anil, Ausable, Horace Danby అని పేర్లతో రాస్తే జవాబు స్పష్టంగా ఉంటుంది.
పాఠాల వారీగా లోతైన సాధన
ఈ FA2 సిలబస్‌లోని రెండు పాఠాలపై మా సైట్‌లో ఇప్పటికే వివరమైన ప్రశ్నలు, జవాబులు ఉన్నాయి — AP 10th English The Thief’s Story Important Questions 2027 (with Answers) మరియు AP 10th English Amanda Important Questions 2027 (with Answers). ఈ పేపర్‌లో The Thief’s Story ఒక్కదాని నుంచే 11 మార్కులు ఉన్నాయి (10 మార్కుల diary entry తో కలిపి), కాబట్టి ఆ పేజీ ముందు చూడండి.
అన్ని యూనిట్ల నోట్స్, పదాల అర్థాల కోసం AP 10th Class English Complete Notes (All Units) – Glossary & Q&A, మరిన్ని సాధన ప్రశ్నల కోసం AP 10th English Mission March SSC 2027 Slip Test PDF with Answers పేజీలు ఉన్నాయి.
FA1 నుంచి FA2 కు — ఏమి మారింది
FA1 లో వేరే యూనిట్ల పాఠాలు వచ్చాయి. FA2 లో కొత్త పాఠాలతో పాటు 35 మార్కుల నమూనా వచ్చింది: 1 మార్కుకు రచయిత, పాత్ర, ప్రదేశం; 2 మార్కులకు సంఘటన లేదా భావం వివరణ; 10 మార్కులకు diary entry లాంటి రచన.
FA1 లో ఎక్కడ తప్పులు వచ్చాయో చూసుకోవడానికి AP 10th Class FA1 English Answer Key 2026 పేజీ ఉంది.
మోడల్ పేపర్ల కోసం AP FA2 English Model Papers 2026-27 – 6th to 10th Class, తొమ్మిదో తరగతి పేపర్ కోసం AP 9th Class FA2 English Question Paper 2026-27 with Answers చూడండి.
పదో తరగతి మొత్తం మెటీరియల్ AP 10th Class Textbooks, Solutions, Notes, Study Material & Question Papers పేజీలో ఉంది.
FA2 తర్వాత నవంబర్ SA1 లో రెండు పుస్తకాల నుంచి 18 పాఠాలు వస్తాయి. బోర్డ్ నమూనాలో 37 ప్రశ్నల పూర్తి పేపర్ AP 10th Class SA1 English Question Paper 2026-27 లో ఉంది.
FAQs
10వ తరగతి FA2 English సిలబస్‌లో ఏ పాఠాలు ఉన్నాయి?
పది పాఠాలు — The Ball Poem, From the Diary of Anne Frank, Amanda!, A Baker from Goa, Coorg, Tea from Assam, The Trees (First Flight), The Thief’s Story, The Midnight Visitor, A Question of Trust (Footprints without Feet). రెండు పుస్తకాలూ చదవాలి.
FA2 English పరీక్ష ఏ రోజు, ఏ సమయంలో?
07 అక్టోబర్ 2026 (బుధవారం), ఉదయం 11:00 నుంచి 12:15 వరకు — ఈ స్లాట్ 9, 10 తరగతులది. అదే రోజు మధ్యాహ్నం 2:45 నుంచి సోషల్ పరీక్ష ఉంటుంది, కాబట్టి English తర్వాత భోజన విరామంలో సోషల్ ముఖ్యాంశాలు చూసుకోండి.
పదో తరగతి FA2 English పేపర్ నమూనా ఏమిటి?
35 మార్కులు, 19 ప్రశ్నలు. 11 ప్రశ్నలు ఒక్కో మార్కు, 7 ప్రశ్నలు రెండేసి మార్కులు, ఒక ప్రశ్న 10 మార్కులు (11 + 14 + 10 = 35). ఈ విభజన SCERT 23.09.2026 ప్రొసీడింగ్స్ లో పదో తరగతి English కి ఇచ్చినది. ఈ పేపర్‌లో 10 మార్కుల ప్రశ్నను diary entry గా ఇచ్చాం.
First Flight, Footprints without Feet — తేడా ఏమిటి?
First Flight ప్రధాన పాఠ్యపుస్తకం — గద్యం, పద్యం రెండూ ఉంటాయి. Footprints without Feet అనుబంధ పాఠ్యపుస్తకం — కథలు మాత్రమే. FA2 సిలబస్‌లో రెండింటి నుంచీ పాఠాలు ఉన్నాయి.
ఈ ప్రశ్నపత్రం అధికారికమైనదా?
కాదు. మార్కుల విభజన, సిలబస్, తేదీ SCERT వి; ప్రశ్నలు, జవాబులు apboardsolutionsclass10.com తయారు చేసిన సాధన కోసం మాత్రమే. అసలు పేపర్‌లో ప్రశ్నలు వేరుగా ఉంటాయి.
1 మార్కు ప్రశ్నలకు ఎలా సిద్ధం కావాలి?
Section A లో 11 మార్కులు ఉన్నాయి — ఇవి ఎక్కువగా రచయిత పేరు, పాత్ర పేరు, ప్రదేశం మీద. పది పాఠాల రచయితల జాబితా ఒకసారి రాసుకుని గుర్తుంచుకుంటే ఈ విభాగం దాదాపు పూర్తిగా మీదే.
Glimpses of India లో ఎన్ని భాగాలు ఉన్నాయి?
మూడు — A Baker from Goa, Coorg, Tea from Assam. మూడింటినీ వేర్వేరు రచయితలు రాశారు, కానీ ఇవి ఒకే పాఠంలో భాగాలు. ఈ పేపర్‌లో ఈ మూడింటి నుంచి కలిపి 9 మార్కులు ఉన్నాయి.
Anne Frank తన డైరీకి పేరు ఎందుకు పెట్టింది?
తనకు నిజంగా మనసు విప్పి మాట్లాడే స్నేహితురాలు లేదని ఆమె భావించింది. అందుకే డైరీని Kitty అనే స్నేహితురాలిగా ఊహించుకుని, ప్రతి ఎంట్రీని ఉత్తరంలా రాసేది.
The Thief’s Story లో ప్రధాన సందేశం ఏమిటి?
శిక్ష కంటే నమ్మకం మనిషిని ఎక్కువగా మారుస్తుంది. అనిల్ డబ్బు గురించి ఏమీ అనకపోవడం, చదువు నేర్పిస్తానని చెప్పడం — ఇవే హరి సింగ్‌ను దొంగతనం నుంచి వెనక్కి మళ్లించాయి.
10 మార్కుల ప్రశ్నకు మార్కులు ఎలా వస్తాయి?
ఈ పేపర్‌లో మేము వాడిన విభజన — ఫార్మాట్ 2 (తేదీ, Dear Diary, పేరు), విషయం 5 (జరిగిన సంఘటనలు, భావాలు), భాష 3 (వాక్య నిర్మాణం, పద పరిమితి). విషయం బాగున్నా ఫార్మాట్ మర్చిపోతే రెండు మార్కులు ముందే పోతాయి.
సమాధానం ఎంత పొడవు రాయాలి?
1 మార్కుకు ఒక వాక్యం లేదా కొన్ని పదాలు; 2 మార్కులకు 30–40 పదాలు; 10 మార్కుల రచనకు 150–180 పదాలు. అడిగిన దానికంటే ఎక్కువ రాస్తే మార్కులు పెరగవు, సమయం మాత్రం తగ్గుతుంది.
ఈ పాఠాలు SSC బోర్డ్ పరీక్షలో వస్తాయా?
అవును, పదీ బోర్డ్ సిలబస్‌లో ఉన్నాయి. FA2 సాధనను బోర్డ్ సన్నద్ధతకు మొదటి అడుగుగా వాడుకోండి.
Official Sources
సిలబస్, పరీక్ష తేదీలు: AP SCERT, Vijayawada మరియు Board of Secondary Education, Andhra Pradesh. తేదీలు, మార్కుల విభజన మారే అవకాశం ఉంది — మీ పాఠశాల నుంచి వచ్చే తాజా సర్క్యులర్‌తో సరిచూసుకోండి.
