AP 7th Class SA1 Science Question Paper 2026-27 (Essay 1) – Answer Key, జవాబులతో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

16 నవంబర్ 2026 SA1 Science Answer Key (Key Paper) – పరీక్షలో వచ్చిన అసలు ప్రశ్నపత్రం, జవాబులు (7వ తరగతి, 80 మార్కులు)

ఏడో తరగతి SA1 సైన్స్ పరీక్ష (Exam Code 751, PS-11) 16 నవంబర్ 2026 న జరిగింది. 33 ప్రశ్నలు, 80 మార్కులు, 3 గంటలు: Section A 20 × 1, B 4 × 2, C 5 × 4, D 4 × 8. ప్రతి ప్రశ్న కిందే జవాబు ఉంది. Section D లో A, B రెండింటికీ జవాబులు ఇచ్చాము.

మీ మార్కులు లెక్కించుకోండి: ప్రతి జవాబు కింద ‘నా జవాబు సరైనదే’ టిక్ పెట్టండి. కింది బార్‌లో మీ మొత్తం మార్కుల అంచనా కనిపిస్తుంది.

తర్వాతి పరీక్ష: 18 నవంబర్ 2026 (బుధవారం) – సాంఘిక శాస్త్రం. 7th Class SA1 Social సాధన పేపర్ (జవాబులతో) రాసి చూడండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం జవాబులు AP SA1 Key Papers 2026-27 పేజీలో ఉన్నాయి.

మన సాధన పత్రం నుంచి వచ్చినవి: ఈ పేజీ కింద ఉన్న సాధన పత్రంలోని అంశాలే అసలు పేపర్‌లో వచ్చాయి: మొటిమలకు కారణం (సాధన 11 = పేపర్ 6), ఆడమ్స్ ఆపిల్ (సాధన 10 = పేపర్ 20), కౌమారదశ వయస్సు, హార్మోన్లు (సాధన 9, 12 = పేపర్ 26), LED పొడవైన కాలు ధన ధ్రువానికి (సాధన 15 = పేపర్ 11, 15), తటస్థీకరణ (సాధన 18 = పేపర్ 25), పసుపు సూచిక రంగులు (సాధన 5, 20 = పేపర్ 8, 33 B), సూచికతో రహస్య సందేశం (సాధన 16 = పేపర్ 23), చింతపండులో టార్టారిక్ ఆమ్లం (సాధన 6 = పేపర్ 1).

Section A – బహుళైచ్ఛిక ప్రశ్నలు (20 × 1 = 20 మార్కులు)

1. Match the fruits with the acids naturally present in them. P: Orange, Q: Amla, R: Tamarind, S: Tomato. 1. Tartaric acid 2. Citric acid 3. Ascorbic acid and citric acid 4. Citric acid and oxalic acid / పండ్లను వాటిలో సహజంగా ఉండే ఆమ్లాలతో జతపరచండి.

A) P – 2, Q – 3, R – 1, S – 4 (సరైన జవాబు)B) P – 3, Q – 2, R – 1, S – 4C) P – 2, Q – 1, R – 3, S – 4D) P – 4, Q – 3, R – 2, S – 1నారింజలో సిట్రిక్ ఆమ్లం, ఉసిరిలో ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ C) మరియు సిట్రిక్ ఆమ్లం, చింతపండులో టార్టారిక్ ఆమ్లం, టమోటాలో సిట్రిక్ మరియు ఆక్సాలిక్ ఆమ్లాలు.

2. Assertion (A): The flame of a burning candle covered with a glass tumbler goes out after some time. Reason (R): Oxygen inside the glass tumbler gets gradually used up. / నిశ్చయం (A): గాజు గ్లాసుతో కప్పిన కొవ్వొత్తి మంట కొంతసేపటికి ఆరిపోతుంది. కారణం (R): గ్లాసులోని ఆక్సిజన్ క్రమంగా అయిపోతుంది.

A) Both A and R are true, and R is the correct explanation of A. (సరైన జవాబు)B) Both A and R are true, but R is not the correct explanation of A.C) A is true, but R is false.D) A is false, but R is true.మండడానికి ఆక్సిజన్ కావాలి. గ్లాసులోని ఆక్సిజన్ అయిపోగానే మంట ఆరిపోతుంది. కాబట్టి R, A ను సరిగ్గా వివరిస్తుంది.

3. A solution turns the red litmus paper to blue. Excess addition of which of the following solution would reverse the change? / ఒక ద్రావణం ఎరుపు లిట్మస్‌ను నీలిరంగులోకి మారుస్తుంది. కింది వాటిలో ఏ ద్రావణాన్ని అధికంగా కలిపితే ఆ మార్పు రద్దు అవుతుంది?

A) Lime water / సున్నపు నీరుB) Baking soda / బేకింగ్ సోడాC) Vinegar / వెనిగర్ (సరైన జవాబు)D) Common salt solution / సాధారణ ఉప్పు ద్రావణంఎరుపు లిట్మస్‌ను నీలిగా మార్చేది క్షారం. ఆమ్లం (వెనిగర్) ఎక్కువగా కలిపితే క్షారం తటస్థీకరణం చెంది, ద్రావణం ఆమ్లంగా మారి నీలి లిట్మస్ మళ్ళీ ఎరుపవుతుంది. సున్నపు నీరు, బేకింగ్ సోడా క్షారాలు; ఉప్పు ద్రావణం తటస్థం.

4. Identify the incorrect statement. / తప్పుగా ఉన్న ప్రకటనను గుర్తించండి.

A) A switch is the source of electric current in a circuit. / విద్యుత్ వలయంలో స్విచ్ విద్యుత్ ప్రవాహానికి మూలం. (సరైన జవాబు)B) A switch helps to complete or break the circuit. / వలయాన్ని పూర్తి చేయడానికి లేదా విచ్ఛిన్నం చేయడానికి స్విచ్ సహాయపడుతుంది.C) A switch helps us to use electricity as per our requirement. / అవసరానికి అనుగుణంగా విద్యుత్‌ను వాడుకోవడానికి స్విచ్ సహాయపడుతుంది.D) When the switch is in ‘OFF’ position, there is an air gap between its terminals. / స్విచ్ OFF లో ఉన్నప్పుడు టెర్మినల్స్ మధ్య గాలి ఖాళీ ఉంటుంది.విద్యుత్‌కు మూలం ఘటం (cell) లేదా బ్యాటరీ. స్విచ్ వలయాన్ని తెరవడం, మూయడం మాత్రమే చేస్తుంది.

5. Abdul focuses sunlight on a paper using a magnifying glass, and the paper starts burning. The same paper does not burn when kept in sunlight without the magnifying glass. Why? / భూతద్దంతో సూర్యకాంతిని కేంద్రీకరిస్తే కాగితం కాలింది, భూతద్దం లేకుండా కాలలేదు. ఎందుకు?

A) Paper melts before burning.B) The magnifying glass increases oxygen supply.C) A smaller illuminated area always produces a higher temperature.D) Focusing sunlight raises the paper to its ignition temperature. / సూర్యకాంతిని కేంద్రీకరించడం వల్ల కాగితం దాని జ్వలన ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. (సరైన జవాబు)భూతద్దం సూర్యకాంతిని ఒక చిన్న బిందువుపై కేంద్రీకరిస్తుంది. అక్కడ ఉష్ణోగ్రత కాగితం జ్వలన ఉష్ణోగ్రతను చేరగానే అది మండుతుంది.

6. …adolescence? (ఫోటోలో ఇంగ్లీష్ ప్రశ్న మొదటి వరుస కనిపించలేదు) / కౌమారదశలో ఉన్న యుక్తవయస్కుల ముఖంపై చిన్న మొటిమలు సాధారణంగా ఎందుకు వస్తాయి?

A) Due to lack of physical exercise and dehydrationB) Due to increased oily secretions from the skin that clog the pores / చర్మం నుంచి నూనె స్రావాలు పెరిగి రంధ్రాలు మూసుకుపోవడం వల్ల (సరైన జవాబు)C) Due to rapid growth in the long bones of the arms and legsD) Due to improper digestion of proteins and carbohydratesకౌమారదశలో హార్మోన్ల వల్ల చర్మంలోని తైల గ్రంథులు ఎక్కువ నూనె స్రవిస్తాయి. రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి. ముఖాన్ని రోజుకు రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.

7. Which of the following symbols represents a switch in the ‘ON’ position? (A: two equal parallel lines, B: one long and one short line, C: switch with a lifted lever and a gap, D: switch with the lever closed, no gap) / కింది గుర్తులలో ఏది ON స్థితిలోని స్విచ్‌ను సూచిస్తుంది?

A) రెండు సమాన సమాంతర గీతలుB) ఒక పొడవు, ఒక పొట్టి గీత (ఘటం గుర్తు)C) లివర్ పైకి ఎత్తి ఉన్న స్విచ్ (OFF)D) లివర్ మూసి ఉన్న స్విచ్ (ON) (సరైన జవాబు)ON స్థితిలో స్విచ్ లివర్ రెండు టెర్మినల్స్‌ను కలుపుతుంది, మధ్యలో ఖాళీ ఉండదు. C లో ఖాళీ ఉంది, అది OFF. B ఘటం (cell) గుర్తు.

8. Akhil dropped a curry stain (turmeric) on his white shirt while eating. When his mother washed the shirt with soap, the yellow stain turned reddish-brown. What does this observation indicate about soap? / పసుపు మరక సబ్బుతో ఉతకగానే ఎరుపు-గోధుమ రంగులోకి మారింది. ఇది సబ్బు గురించి ఏమి సూచిస్తుంది?

A) Soap is acidic in nature.B) Soap is neutral and bleaches the turmeric.C) Soap is basic in nature. / సబ్బు క్షార స్వభావం కలిగి ఉంటుంది. (సరైన జవాబు)D) Soap is an indicator that reacts with turmeric to form salt.పసుపు ఒక సూచిక. క్షారంతో అది ఎరుపు (ఎరుపు-గోధుమ) రంగుకు మారుతుంది. కాబట్టి సబ్బు క్షారం.

9. Ravi wants to use a cheap metal that can be made into thin sheets and easily folded to pack food. Which metal should he choose? / ఆహారం ప్యాక్ చేయడానికి సన్నని రేకులుగా చేయగలిగే, సులభంగా మడవగలిగే చౌకైన లోహం ఏది?

A) Aluminium / అల్యూమినియం (సరైన జవాబు)B) Copper / రాగిC) Iron / ఇనుముD) Gold / బంగారంఅల్యూమినియం అధిక స్తరణీయత (malleability) గల చౌకైన లోహం. అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారం ప్యాక్ చేస్తారు. బంగారం కూడా స్తరణీయమే కానీ చాలా ఖరీదు.

10. Which of the following is more sonorous? / కింది వాటిలో అధిక ధ్వని గుణం కలిగినది ఏది?

A) Wood / చెక్కB) Plastic / ప్లాస్టిక్C) Copper / రాగి (సరైన జవాబు)D) Sulphur / గంధకంలోహాలను కొడితే మోగే శబ్దం వస్తుంది (ధ్వని గుణం). రాగి లోహం. చెక్క, ప్లాస్టిక్, గంధకం మోగవు.

11. Which of the following could be a reason for an LED glowing in a circuit containing wires, a switch, and battery with two dry cells? / వలయంలో LED వెలగడానికి కారణం ఏది కావచ్చు?

A) The switch is open.B) The circuit is open.C) One of the cells is exhausted.D) The longer wire of the LED is connected to the positive terminal of the battery. / LED పొడవైన వైర్ బ్యాటరీ ధన ధ్రువానికి కలపబడి ఉండటం. (సరైన జవాబు)LED ఒకే దిశలో ప్రవాహాన్ని అనుమతిస్తుంది. పొడవైన కాలు ధన (+) ధ్రువానికి, పొట్టి కాలు ఋణ (-) ధ్రువానికి కలిపితేనే వెలుగుతుంది. స్విచ్ లేదా వలయం తెరిచి ఉంటే వెలగదు.

12. One of your friends has been suffering from indigestion and heartburn after eating a spicy meal. To relieve the problem, he has taken a tablet. Which of the following could be the active ingredient in the tablet? / మసాలా ఆహారం తర్వాత అజీర్ణం, గుండెల్లో మంటకు తీసుకున్న టాబ్లెట్‌లో క్రియాశీల పదార్థం ఏది అయి ఉండవచ్చు?

A) Hydrochloric acid / హైడ్రోక్లోరిక్ ఆమ్లంB) Magnesium hydroxide / మెగ్నీషియం హైడ్రాక్సైడ్ (సరైన జవాబు)C) Common salt / సాధారణ ఉప్పుD) Soda Water / సోడా నీరుకడుపులో ఆమ్లం ఎక్కువైతే మంట వస్తుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ (మిల్క్ ఆఫ్ మెగ్నీషియా) ఒక క్షారం, అది ఆ ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది (antacid).

13. Which of the following metal catches fire when it comes in contact with water? / నీటితో స్పర్శ తగిలినప్పుడు మంటలు అంటుకునే లోహం ఏది?

A) Copper / రాగిB) Aluminium / అల్యూమినియంC) Zinc / జింక్D) Sodium / సోడియం (సరైన జవాబు)సోడియం చాలా చర్యాశీలత గల లోహం. నీటితో తీవ్రంగా చర్య జరిపి మంటలు అంటుకుంటుంది. అందుకే దాన్ని కిరోసిన్‌లో నిల్వ చేస్తారు.

14. Why are changes like change in voice, the growth of facial and chest hair in boys called secondary sexual characteristics? / అబ్బాయిలలో గొంతు మారడం, ముఖం, ఛాతీపై వెంట్రుకలు పెరగడం వంటి మార్పులను ద్వితీయ లైంగిక లక్షణాలు అని ఎందుకు అంటారు?

A) because they are directly involved in gamete formationB) because they occur only in adulthood after age 25C) because they are physical features that are not directly involved in reproduction / అవి ప్రత్యుత్పత్తిలో నేరుగా పాల్గొనని శారీరక లక్షణాలు కాబట్టి (సరైన జవాబు)D) because they stop occurring once puberty endsఇవి స్త్రీ, పురుషులను వేరు చేసే శారీరక లక్షణాలు మాత్రమే. ప్రత్యుత్పత్తి అవయవాలు నేరుగా చేసే పనిలో ఇవి పాల్గొనవు, అందుకే ద్వితీయ లక్షణాలు.

15. Observe the given experimental setup where an LED is glowing brightly when connected to two cells. Pole P is connected to the longer wire (positive lead) of the LED, and Pole Q is connected to the shorter wire (negative lead) of the LED. Identify the correct poles represented by P and Q. / LED వెలుగుతున్న అమరికలో P, Q ధ్రువాలను గుర్తించండి.

A) P = Positive pole, Q = Negative pole / P = ధన ధ్రువం, Q = ఋణ ధ్రువం (సరైన జవాబు)B) P = Negative pole, Q = Positive poleC) P = Positive pole, Q = Positive poleD) P = Negative pole, Q = Negative poleLED వెలుగుతోంది కాబట్టి దాని పొడవైన కాలు ధన ధ్రువానికే కలిసి ఉండాలి. P పొడవైన కాలుకు కలిసింది కాబట్టి P ధనం, Q ఋణం. గమనిక: SCERT విడుదల చేసిన మూల్యాంకన సూచికలో (Principles of Valuation) ఈ ప్రశ్నకు C అని ఉంది. కానీ ప్రశ్నలోనే P పొడవైన కాలుకు (ధన), Q పొట్టి కాలుకు (ఋణ) కలిసి ఉందని చెప్పారు, కాబట్టి శాస్త్రీయంగా A సరైనది. మీ ఉపాధ్యాయులు ఏది సరైనదిగా తీసుకుంటారో వారిని అడగండి.

16. Which Indian government initiative provides free weekly iron and folic acid tablets to adolescent students of classes 6-12 to prevent anemia? / రక్తహీనత నివారణకు 6-12 తరగతుల విద్యార్థులకు ప్రతి వారం ఉచిత ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు అందించే కార్యక్రమం ఏది?

A) MHSB) WIFS (సరైన జవాబు)C) SwechhaD) RKSKWIFS అంటే Weekly Iron and Folic Acid Supplementation. పాఠశాలల్లో వారానికి ఒకసారి ఈ టాబ్లెట్లు ఇస్తారు.

17. What is the main purpose of Prahari clubs in school? / పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌ల ప్రధాన ఉద్దేశం ఏమిటి?

A) to organise sports activities.B) to prevent drug abuse among children. / పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించడం. (సరైన జవాబు)C) to conduct academic competitions.D) to improve school infrastructure.ప్రహరీ అంటే కాపలాదారు. ఈ క్లబ్‌లు పిల్లలను మత్తు పదార్థాల నుంచి కాపాడేందుకు అవగాహన కల్పిస్తాయి.

18. Which of the following is an example of a physical change? / కింది వాటిలో భౌతిక మార్పుకు ఉదాహరణ ఏది?

A) digestion of food / ఆహారం జీర్ణం కావడంB) respiration in human / మానవులలో శ్వాసక్రియC) combustion of wood / కలప దహనం కావడంD) evaporation of water / నీరు ఆవిరి కావడం (సరైన జవాబు)నీరు ఆవిరైనా అది నీటి ఆవిరే, కొత్త పదార్థం ఏర్పడదు. చల్లబరిస్తే మళ్ళీ నీరు వస్తుంది. మిగతా మూడింటిలో కొత్త పదార్థాలు ఏర్పడతాయి (రసాయన మార్పులు).

19. A substance can be drawn into long wires used for electrical purposes. What property/properties do(es) that substance show? / విద్యుత్ అవసరాలకు వాడే పొడవైన తీగలుగా లాగగలిగే పదార్థం ఏ ధర్మాలను చూపిస్తుంది?

A) only ductilityB) only conductance of electricityC) both ductility and conductance of heatD) both ductility and conductance of electricity / తీగలుగా సాగే గుణం, విద్యుత్ వాహకత రెండూ (సరైన జవాబు)తీగలుగా సాగడం తాంతవత (ductility). విద్యుత్ పనులకు వాడతారు కాబట్టి విద్యుత్ వాహకత కూడా ఉండాలి.

20. What is the protruding bump in the throat of adolescent boys caused by the enlargement of the voice box called? / స్వరపేటిక పెద్దది కావడం వల్ల అబ్బాయిల గొంతు వద్ద ఉబ్బినట్లు కనిపించే భాగాన్ని ఏమంటారు?

A) Mammary gland / క్షీర గ్రంథిB) Adam’s apple / ఆడమ్స్ ఆపిల్ (సరైన జవాబు)C) Sebaceous gland / తైల గ్రంథిD) Epiglottis / ఉపజిహ్వకకౌమారదశలో అబ్బాయిల స్వరపేటిక (voice box) పెద్దదై గొంతు ముందు భాగంలో ఉబ్బినట్లు కనిపిస్తుంది. దాన్ని ఆడమ్స్ ఆపిల్ అంటారు. అందుకే గొంతు బొంగురుగా మారుతుంది.

Section B (4 × 2 = 8 మార్కులు)

21. What is an electric conductor? Give one example of a solid material that can be used to make connecting wires. / విద్యుత్ వాహకం అంటే ఏమిటి? సంధాన వైర్ల తయారీకి వాడే ఒక ఘన పదార్థానికి ఉదాహరణ ఇవ్వండి. [2 మార్కులు]

జవాబు

తనగుండా విద్యుత్ ప్రవాహాన్ని సులభంగా వెళ్ళనిచ్చే పదార్థాన్ని విద్యుత్ వాహకం (electric conductor) అంటారు.
ఉదాహరణ: రాగి (copper). అల్యూమినియం కూడా వాడతారు.

22. A student believes: ‘Every teenager experiences height gain and voice changes at the exact same age.’ Is this belief correct? Explain. / ప్రతి కౌమార విద్యార్థి ఒకే వయస్సులో ఎత్తు పెరగడం, గొంతు మార్పులను అనుభవిస్తారన్న నమ్మకం సరైనదేనా? వివరించండి. [2 మార్కులు]

జవాబు

కాదు, ఈ నమ్మకం సరైనది కాదు.
కౌమారదశ మార్పులు అందరిలో ఒకే వయస్సులో మొదలవ్వవు. కొందరిలో ముందుగా, కొందరిలో ఆలస్యంగా మొదలవుతాయి. ఇది హార్మోన్లు, వంశపారంపర్యం (తల్లిదండ్రుల లక్షణాలు), పోషకాహారం మీద ఆధారపడుతుంది. సాధారణంగా అమ్మాయిల్లో ఎత్తు పెరుగుదల అబ్బాయిల కంటే ముందుగా మొదలవుతుంది. కాబట్టి స్నేహితులతో పోల్చుకొని బాధపడాల్సిన అవసరం లేదు.

23. Abhi wrote a secret message to her grandmother on her birthday using orange juice. Can you assist her grandmother in revealing the message? Which indicator would you use to make it visible? / నారింజ రసంతో రాసిన రహస్య సందేశాన్ని కనిపించేలా చేయడానికి ఏ సూచికను ఉపయోగిస్తారు? [2 మార్కులు]

జవాబు

నారింజ రసం ఆమ్లం. కాబట్టి ఆమ్లంతో రంగు మారే సూచిక కావాలి.
ఎర్ర మందార (china rose) సూచిక ద్రావణాన్ని కాగితంపై దూదితో పూయాలి లేదా స్ప్రే చేయాలి. ఆమ్లం ఉన్న అక్షరాలు ముదురు గులాబీ (ఎరుపు) రంగులో కనిపిస్తాయి. నీలి లిట్మస్ ద్రావణం పూసినా అక్షరాలు ఎరుపుగా కనిపిస్తాయి.
గమనిక: పసుపు సూచిక ఆమ్లంతో రంగు మారదు, కాబట్టి ఇక్కడ పనికిరాదు.

24. Observe the picture of the tea strainer. Why is metal wire suitable for making its fine mesh? Give two reasons. / టీ ఫిల్టర్ సన్నని జాలి తయారీకి లోహపు తీగ ఎందుకు అనుకూలం? రెండు కారణాలు. [2 మార్కులు]

జవాబు

1) తాంతవత (ductility): లోహాలను చాలా సన్నని తీగలుగా లాగవచ్చు, కాబట్టి సన్నని జాలి అల్లవచ్చు.
2) గట్టిదనం, మన్నిక: సన్నని తీగలైనా లోహం సులభంగా తెగదు, వేడి టీ పోసినా కరగదు, ఆకారం మారదు. స్టెయిన్‌లెస్ స్టీల్ తుప్పు పట్టదు, టీతో చర్య జరపదు, శుభ్రం చేయడం సులభం.

Section C (5 × 4 = 20 మార్కులు)

25. Complete the following. i) The reaction between an acid and a base is called a ______ reaction. ii) The two products formed in a neutralisation reaction are ______ and ______. iii) Heat is ______ during a neutralisation reaction. iv) Acid + ______ gives Salt + ______ + ______ / కింది వాటిని పూర్తిచేయండి. [4 మార్కులు]

జవాబు

i) తటస్థీకరణ (Neutralisation)
ii) లవణం (Salt) మరియు నీరు (Water)
iii) విడుదల (evolved / released) అవుతుంది
iv) ఆమ్లం + క్షారం (Base) = లవణం + నీరు (Water) + ఉష్ణం (Heat)

26. Answer the following questions. a) State the normal age span of adolescence in humans. b) Name the hormones responsible for physical changes in boys and girls. c) What is the average duration of a normal menstrual cycle, and how many days does menstruation usually last? / కింది ప్రశ్నలకు సమాధానమివ్వండి. [4 మార్కులు]

జవాబు

a) కౌమారదశ సాధారణంగా 10 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది.
b) అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్ (Testosterone); అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ (Estrogen) (ప్రొజెస్టిరాన్ కూడా).
c) ఋతుచక్రం సగటున సుమారు 28 రోజులు (కొందరిలో 21 నుంచి 35 రోజుల మధ్య మారవచ్చు). ఋతుస్రావం సాధారణంగా 3 నుంచి 5 రోజులు (2 నుంచి 7 రోజుల వరకు కూడా సహజమే) ఉంటుంది.

27. Mani is blindfolded. She is given two unknown solutions to test and determine whether they are acidic or basic. Which indicator should Mani use to test the solutions and why? / మణి కళ్లకు గంతలు కట్టబడ్డాయి. రెండు తెలియని ద్రావణాలు ఆమ్లాలా, క్షారాలా అని తెలుసుకోవడానికి ఆమె ఏ సూచికను వాడాలి, ఎందుకు? [4 మార్కులు]

జవాబు

మణి వాసన సూచిక (Olfactory indicator) వాడాలి. ఉదా: ఉల్లిపాయ రసం (ఉల్లి ముక్కలు నానబెట్టిన గుడ్డ ముక్క), వెనీలా ఎసెన్స్, లవంగ నూనె.
ఎందుకు: కళ్లకు గంతలు ఉన్నాయి కాబట్టి లిట్మస్, పసుపు, మందార లాంటి సూచికల రంగు మార్పును ఆమె చూడలేదు. వాసన సూచికల వాసన మాత్రం మారుతుంది: ఉల్లిపాయ వాసన క్షార ద్రావణంలో పోతుంది, ఆమ్ల ద్రావణంలో అలాగే ఉంటుంది. వాసన చూసి ఆమె ఆమ్లమా, క్షారమా అని చెప్పగలదు.

28. Answer the following. a) Give one example of a reversible physical change in your daily life. b) Give one example of an irreversible physical change. c) Is burning a firecracker a physical change or a chemical change? Give one reason. / కింది వాటికి సమాధానమివ్వండి. [4 మార్కులు]

జవాబు

a) పునరావృత భౌతిక మార్పు: ఐస్ కరిగి నీరుగా మారడం; ఆ నీటిని ఫ్రిజ్‌లో పెడితే మళ్ళీ ఐస్ అవుతుంది. (మైనం కరిగి మళ్ళీ గట్టిపడటం కూడా.)
b) పునరావృతం కాని భౌతిక మార్పు: కాగితాన్ని ముక్కలుగా కత్తిరించడం. కాగితం అదే, కానీ ముక్కలను మళ్ళీ అసలు కాగితంగా అతికించలేం. (గాజు గ్లాసు పగలడం కూడా.)
c) టపాసులు కాల్చడం రసాయన మార్పు. కారణం: కాల్చినప్పుడు బూడిద, పొగ, వాయువులు అనే కొత్త పదార్థాలు ఏర్పడతాయి, వేడి, కాంతి, శబ్దం విడుదలవుతాయి. ఆ మార్పును వెనక్కి తిప్పలేం.

29. Read the following situations faced by teenagers and answer the questions: a) A classmate receives misleading and teasing messages online from an unknown user. Name this harmful practice and suggest one correct action they should take. b) During a party, a friend pressurizes an adolescent to try a bad habit just once. Explain why they should firmly say NO. / టీనేజర్లు ఎదుర్కొనే కింది సందర్భాలను చదివి సమాధానమివ్వండి. (ఫోటోలో 29 (a), (b) భాగాలు కనిపించాయి) [4 మార్కులు]

జవాబు

a) ఈ హానికరమైన పద్ధతిని సైబర్ బుల్లీయింగ్ (Cyberbullying) అంటారు.
సరైన చర్య: ఆ సందేశాలకు జవాబు ఇవ్వకూడదు. ఆ వ్యక్తిని బ్లాక్ చేసి, సందేశాల స్క్రీన్‌షాట్లు దాచి, వెంటనే తల్లిదండ్రులకు లేదా టీచర్‌కు (నమ్మకమైన పెద్దలకు) చెప్పాలి. అవసరమైతే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు.
b) గట్టిగా వద్దు (NO) అనాలి, ఎందుకంటే:
1) ఒక్కసారి అని మొదలుపెట్టిన చెడు అలవాటు (పొగ, మద్యం, మత్తు పదార్థాలు) త్వరగా వ్యసనంగా మారుతుంది.
2) అవి మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం లాంటి అవయవాలను దెబ్బతీసి, చదువు, ఆటలు, భవిష్యత్తును పాడు చేస్తాయి.
3) నిజమైన స్నేహితులు మన నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఒత్తిడి పెరిగితే ఆ చోటు నుంచి వెళ్ళిపోయి, తల్లిదండ్రులకు లేదా టీచర్‌కు చెప్పాలి. (జాతీయ మత్తు విముక్తి హెల్ప్‌లైన్: 14446)

Section D (4 × 8 = 32 మార్కులు)

ప్రతి ప్రశ్నలో A లేదా B ఒక్కటే రాయాలి. పోల్చుకోవడానికి రెండింటికీ జవాబులు ఇచ్చాం.

30. A) Answer the following: a) What is an electric cell? Write its function. b) What is a switch? State its function in an electric circuit. c) Give two examples of materials used as electric insulators. Name two electrical instruments in which electric insulators are used. (Or) B) a) Give two examples each for metals and non-metals. b) What properties differ metals from non-metals? [8 మార్కులు]

జవాబు

A) a) విద్యుత్ ఘటం: రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి వలయానికి విద్యుత్‌ను అందించే పరికరం. దీనికి ధన (+), ఋణ (-) అనే రెండు టెర్మినల్స్ ఉంటాయి. ఉదా: టార్చ్, గడియారం, రిమోట్‌లో వాడే డ్రై సెల్.
విధి: వలయంలో విద్యుత్ ప్రవాహానికి మూలంగా పనిచేసి బల్బు, ఫ్యాన్ లాంటి పరికరాలు పనిచేసేలా చేస్తుంది.

b) స్విచ్: వలయాన్ని పూర్తి చేయడానికి (మూయడానికి) లేదా తెంచడానికి (తెరవడానికి) వాడే సరళ పరికరం.
విధి: స్విచ్ ON లో ఉంటే వలయం పూర్తై విద్యుత్ ప్రవహిస్తుంది, బల్బు వెలుగుతుంది. OFF లో టెర్మినల్స్ మధ్య గాలి ఖాళీ ఏర్పడి ప్రవాహం ఆగుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే పరికరాలను వాడుకోవచ్చు.

c) విద్యుత్ బంధకాలు (insulators): రబ్బరు, ప్లాస్టిక్ (పొడి చెక్క, గాజు కూడా).
వాడే పరికరాలు: 1) విద్యుత్ ఇస్త్రీ పెట్టె (ప్లాస్టిక్ హ్యాండిల్) 2) స్క్రూడ్రైవర్ / టెస్టర్ (ప్లాస్టిక్ హ్యాండిల్). విద్యుత్ తీగలపై ప్లాస్టిక్ పూత, స్విచ్ బోర్డులు కూడా ఉదాహరణలు. ఇవి మనకు షాక్ తగలకుండా కాపాడతాయి.

B) a) లోహాలు: ఇనుము, రాగి (అల్యూమినియం, బంగారం). అలోహాలు: గంధకం (sulphur), కార్బన్ (ఆక్సిజన్, అయోడిన్).

b)

ధర్మంలోహాలుఅలోహాలు
మెరుపుమెరుస్తాయి (lustrous)సాధారణంగా మెరవవు (అయోడిన్ తప్ప)
గట్టిదనంసాధారణంగా గట్టివిమెత్తనివి లేదా పెళుసైనవి
స్తరణీయతసన్నని రేకులుగా సాగుతాయికొడితే పొడి అవుతాయి
తాంతవతతీగలుగా లాగవచ్చుతీగలుగా లాగలేం
ధ్వని గుణంకొడితే మోగుతాయిమోగవు
వాహకతఉష్ణం, విద్యుత్‌ను బాగా ప్రసరిస్తాయిసరిగా ప్రసరించవు (గ్రాఫైట్ తప్ప)
ఆక్సైడ్లుక్షార స్వభావంఆమ్ల స్వభావం

31. A) Define Ignition temperature. Describe an activity to show that a material needs to receive a sufficient amount of heat to start burning. (Or) B) a) Define (i) Puberty (ii) Menopause. b) Mention two food sources rich in Iron. c) State the correct method to dispose of used sanitary pads safely. d) Name any two essential Life Skills. [8 మార్కులు]

జవాబు

A) జ్వలన ఉష్ణోగ్రత (Ignition temperature): ఒక పదార్థం మండటం మొదలయ్యే కనిష్ఠ ఉష్ణోగ్రత.

కృత్యం: కావలసినవి: రెండు కాగితపు కప్పులు, నీరు, కొవ్వొత్తి, స్టాండు లేదా దారం.
1) ఒక కాగితపు కప్పును ఖాళీగా ఉంచి కొవ్వొత్తి మంటపై పట్టాలి. అది వెంటనే మండిపోతుంది.
2) రెండో కప్పులో సగం వరకు నీరు పోసి అదే మంటపై పట్టాలి. కొంతసేపటికి నీరు వేడెక్కుతుంది కానీ కప్పు మండదు.
కారణం: మంట ఇచ్చే వేడిని నీరు తీసుకుంటుంది. అందువల్ల కప్పు ఉష్ణోగ్రత దాని జ్వలన ఉష్ణోగ్రతను చేరదు, కాబట్టి మండదు. ఖాళీ కప్పు త్వరగా జ్వలన ఉష్ణోగ్రత చేరి మండింది.
నిర్ధారణ: ఒక పదార్థం మండాలంటే అది తగినంత వేడి పొంది జ్వలన ఉష్ణోగ్రతను చేరాలి.

B) a) (i) యుక్తవయస్సు (Puberty): కౌమారదశలో ప్రత్యుత్పత్తి అవయవాలు పరిపక్వత చెంది శరీరం ప్రత్యుత్పత్తికి సిద్ధమయ్యే దశ.
(ii) మెనోపాజ్ (Menopause): స్త్రీలలో సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సులో ఋతుస్రావం శాశ్వతంగా ఆగిపోవడం.

b) ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం: ఆకుకూరలు (పాలకూర, గోంగూర), బెల్లం. ఖర్జూరం, ఉసిరి, రాగులు, పప్పులు, గుడ్లు కూడా.

c) వాడిన శానిటరీ ప్యాడ్‌ను కాగితంలో లేదా పాత వార్తాపత్రికలో బాగా చుట్టి, మూత ఉన్న చెత్త డబ్బాలో వేయాలి (పాఠశాలల్లో ఇన్సినరేటర్ ఉంటే అందులో). మరుగుదొడ్డిలో వేయకూడదు, బహిరంగంగా పారవేయకూడదు. తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి.

d) జీవన నైపుణ్యాలు: నిర్ణయం తీసుకోవడం, సమర్థవంతంగా మాట్లాడటం (communication). సమస్య పరిష్కారం, ఆత్మ అవగాహన, ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా.

32. A) You are given six cells marked A, B, C, D, E and F. Some of these cells are working and some are not. Design an activity to identify the working cells: i) List the items required to carry out the activity. ii) Draw a circuit diagram that can be used to test the cells. iii) Write the procedure you will follow to identify the working cells. (Or) B) Three iron nails are placed under different conditions to study the conditions required for rusting. Test tube A: An iron nail is half immersed in water. Test tube B: An iron nail is completely dipped in boiled water, which is covered with a layer of oil. Test tube C: An iron nail is kept in a dry test tube containing silica gel. After a few days, the nails are observed. a) Which nail is expected to show rusting? Give a reason. b) What is the purpose of boiling the water and covering it with oil in Test tube B? c) How does silica gel help in Test tube C? d) What are the conditions necessary for rusting of iron? [8 మార్కులు]

జవాబు

A) i) కావలసినవి: A నుంచి F వరకు ఆరు ఘటాలు, ఒక ఘటం హోల్డర్, టార్చ్ బల్బు (హోల్డర్‌తో) లేదా LED, ఒక స్విచ్, సంధాన తీగలు, సెల్లోటేప్.

ii) వలయ చిత్రం: ఘటం, స్విచ్, బల్బు శ్రేణిలో.

K+–బల్బు (లేదా LED)పరీక్షించే ఘటంస్విచ్

iii) విధానం:
1) ముందు బల్బు బాగుందో లేదో ఒక మంచి ఘటంతో సరిచూసుకోవాలి.
2) ఘటం A ను హోల్డర్‌లో పెట్టి, పటంలో చూపినట్లు స్విచ్, బల్బుతో వలయం కలపాలి.
3) స్విచ్ ON చేయాలి. బల్బు వెలిగితే ఘటం A పనిచేస్తోంది; వెలగకపోతే పనిచేయడం లేదు. (LED వాడితే పొడవైన కాలు ధన ధ్రువానికే కలపాలి.)
4) ఇలాగే B, C, D, E, F ఘటాలను ఒక్కొక్కటిగా పరీక్షించి, ఫలితాలను పట్టికలో రాయాలి.
5) బల్బు వెలిగించిన ఘటాలే పనిచేసే ఘటాలు.

B) a) పరీక్ష నాళిక A లోని మేకు తుప్పు పడుతుంది. ఎందుకంటే అక్కడ మేకుకు గాలి (ఆక్సిజన్), నీరు రెండూ తగులుతాయి.
b) నీటిని మరిగిస్తే అందులో కరిగి ఉన్న గాలి (ఆక్సిజన్) బయటకు పోతుంది. పైన నూనె పొర వేస్తే గాలి మళ్ళీ నీటిలో కరగదు. అంటే B లో నీరు ఉంది కానీ గాలి లేదు.
c) సిలికా జెల్ గాలిలోని తేమను పీల్చుకొని నాళికలోని గాలిని పొడిగా ఉంచుతుంది. అంటే C లో గాలి ఉంది కానీ తేమ (నీరు) లేదు.
d) ఇనుము తుప్పు పట్టాలంటే గాలి (ఆక్సిజన్), నీరు (తేమ) రెండూ ఉండాలి. B, C లో ఒక్కటే ఉంది కాబట్టి అక్కడ తుప్పు పట్టదు.

33. A) Describe an activity to demonstrate a chemical change using freshly prepared lime water and exhaled air. (Or) B) a) What color does turmeric indicator exhibit in: i) In acidic medium ii) In basic medium b) Predict the color when turmeric paper is dipped in each of the following substances: i) Lemon juice ii) Soap solution iii) Sugar solution iv) Vinegar c) Mention any two uses of bases in daily life. [8 మార్కులు]

జవాబు

A) కృత్యం:
కావలసినవి: సున్నం (చూనా), నీరు, పరీక్ష నాళిక, స్ట్రా లేదా గాజు గొట్టం.
సున్నపు నీరు తయారీ: కొంచెం సున్నాన్ని నీటిలో కలిపి కదపకుండా ఉంచాలి. పై భాగంలోని తేటగా ఉన్న ద్రవాన్ని వడపోసి తీసుకోవాలి. అదే తాజా సున్నపు నీరు (కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం).
విధానం: పరీక్ష నాళికలో సగం వరకు సున్నపు నీరు తీసుకొని, స్ట్రా ద్వారా మనం వదిలే గాలిని (నోటితో ఊది) కొన్ని నిమిషాలు పంపాలి.
పరిశీలన: తేటగా ఉన్న సున్నపు నీరు పాలలా తెల్లగా మారుతుంది.
కారణం: మనం వదిలే గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ సున్నపు నీటితో చర్య జరిపి నీటిలో కరగని కాల్షియం కార్బొనేట్ అనే కొత్త పదార్థం ఏర్పడుతుంది.
కాల్షియం హైడ్రాక్సైడ్ + కార్బన్ డై ఆక్సైడ్ = కాల్షియం కార్బొనేట్ + నీరు
నిర్ధారణ: కొత్త పదార్థం ఏర్పడింది కాబట్టి ఇది రసాయన మార్పు.

B) a) i) ఆమ్ల యానకంలో: పసుపు (రంగు మారదు) ii) క్షార యానకంలో: ఎరుపు (ఎరుపు-గోధుమ)

b) i) నిమ్మరసం: పసుపు (ఆమ్లం) ii) సబ్బు ద్రావణం: ఎరుపు (క్షారం) iii) చక్కెర ద్రావణం: పసుపు (తటస్థం) iv) వెనిగర్: పసుపు (ఆమ్లం)

c) 1) ఆమ్లత్వం (గుండెల్లో మంట) తగ్గించే యాంటాసిడ్లు (మిల్క్ ఆఫ్ మెగ్నీషియా). 2) సబ్బులు, డిటర్జెంట్లతో శుభ్రపరచడం. (ఆమ్ల నేలను సరిచేయడానికి సున్నం, చీమ కాటుపై బేకింగ్ సోడా కూడా.)

ఈ జవాబులు 7వ తరగతి సైన్స్ పుస్తకం (Curiosity, AP SCERT) ఆధారంగా మేము తయారు చేసినవి. రసాయన చర్యను ఈ పేజీలో = గుర్తుతో రాశాం; పరీక్షలో మీ పుస్తకంలో ఉన్నట్లే రాయండి. సరైన వేరే ఉదాహరణలు రాసినా పూర్తి మార్కులు వస్తాయి. అసలు మార్కులు మీ ఉపాధ్యాయుల మూల్యాంకనం ప్రకారమే. మిగతా పరీక్షల కోసం AP SA1 2026-27 చూడండి.

మీ మార్కుల అంచనా: 0 / 80

ఈ అసలు ప్రశ్నపత్రం, మా జవాబులు PDF గా కావాలా? ప్రింట్ తీసుకోవడానికి, స్నేహితులతో పంచుకోవడానికి (14 పేజీలు, సుమారు 520 KB).

AP 7th Class SA1 Science Answer Key PDF డౌన్‌లోడ్

AP 7th Class SA1 Science Question Paper 2026-27 ఇదిగో — 20 ప్రశ్నలు, ప్రతి దానికీ తెలుగులో వివరణ. 6 అక్టోబర్ ఏడో తరగతి FA2 సైన్స్ పేపర్ విద్యుత్ వలయాలు, లోహాలు – అలోహాలు, భౌతిక – రసాయన మార్పుల మీదే వచ్చింది. ఆమ్లాలు – క్షారాలు (Acids, Bases and Salts), కౌమారదశ (Adolescence) ఆ పేపర్‌లో ఒక్క ప్రశ్నగా కూడా రాలేదు. 28-10-2026 అధికారిక సిలబస్‌లో మొదటి పాఠం The Wonderful World of Science పరీక్షకు లేదు — SA1 కి ఐదు పాఠాలే. అందుకే ఈ సాధన పేపర్ ఎక్కువ భాగం ఆ రెండు పెద్ద పాఠాల మీద పెట్టాం.

ప్రశ్నలు ఇంగ్లీష్‌లో ఉన్నాయి, FA2 అసలు పేపర్ లాగే. లిట్మస్, ఎర్ర గులాబీ, పసుపు సూచికల రంగులు, తటస్థీకరణ ఉదాహరణలు, మెగ్నీషియం రిబ్బన్ ప్రయోగం — అన్నీ ఏడో తరగతి సైన్స్ పుస్తకం Curiosity (Reprint 2026-27) తో సరిచూశాం. జవాబు సరిపోతే దాని కింద టిక్ పెట్టండి; పేజీ కింద బార్ 35 కి మీ స్కోర్ చూపిస్తుంది.

7వ తరగతి SA1 సైన్స్ పరీక్ష: 16 నవంబర్ 2026 (సోమవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. SA1 ను చాలా మంది విద్యార్థులు Essay 1 పరీక్ష అని కూడా అంటారు. 7th Class Science Essay 1 Question Paper కోసం వెతికినా ఇదే పేజీ: సాధన పేపర్, జవాబులు, పరీక్ష తర్వాత అసలు పేపర్ Key అన్నీ ఇక్కడే. 16 నవంబర్ 2026 న జరిగిన అసలు ప్రశ్నపత్రం, మా జవాబులు (Answer Key) ఇదే పేజీ పైభాగంలో ఉన్నాయి.

ఇప్పటికే వచ్చిన 7వ తరగతి SA1 Answer Keys: 7th Telugu Key | 7th Hindi Key | 7th English Key | 7th Maths Key. అన్ని తరగతులు: AP SA1 Key Papers 2026-27.

జవాబులు రాగానే తెలియాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి

ఈ పేజీలో: పరీక్ష | సిలబస్ | సాధన పేపర్ | పాఠాల వారీ మార్కులు | సూచికల చార్ట్ | PDF | 10 రోజుల ప్లాన్ | FAQs

AP 7th Class SA1 Science Question Paper 2026-27 — ఒక్క చూపులో

అంశంవివరం
పరీక్షSA1 (సంగ్రహణాత్మక మూల్యాంకనం 1), విద్యా సంవత్సరం 2026-27
తరగతి, సబ్జెక్ట్ఏడో తరగతి — సైన్స్ (పాఠ్యపుస్తకం Curiosity)
పరీక్ష తేదీ16 నవంబర్ 2026 (సోమవారం), మధ్యాహ్నం 1:15 – 4:15 (అధికారిక టైమ్ టేబుల్)
SA1 పాఠాలు5 — Acids Bases and Salts, Electric Circuits, Metals and Non-metals, Changes Around Us, Adolescence (మొదటి అధ్యాయం పరీక్షకు కాదు)
FA2 పేపర్‌లో కనిపించనివిమొదటి పాఠం, Acids Bases and Salts, Adolescence
ఈ పేజీలోని పేపర్నాలుగు సెక్షన్లు, 20 ప్రశ్నలు, 35 మార్కులు — 75 నిమిషాలు

అధికారిక ఉత్తర్వు వచ్చింది: 28-10-2026 పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు (Rc. No. 3475819/SAT-I/2026-27) ప్రకారం 7వ తరగతి SA1 సైన్స్ పరీక్ష 16 నవంబర్ 2026 (సోమవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. అసలు పేపర్ 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). ఈ పేజీలోని 20 ప్రశ్నల పేపర్ FA ఆకారంలో (35 మార్కులు) ఉంది — పాఠాల వారీ సాధనకు, అసలు పేపర్‌లోని 1, 2, 4 మార్కుల ప్రశ్నలకు సరిపోతుంది.

ఏడో తరగతి ఇతర సబ్జెక్టుల SA1 సాధన పేపర్లు AP SA1 2026-27 – సిలబస్, టైమ్ టేబుల్, ప్రశ్నపత్రాలు పేజీలో వరుసగా ఉన్నాయి.

7వ తరగతి SA1 Science సిలబస్ 2026-27 — ఐదు పాఠాలు, FA2 తో పోలిక

అధికారిక జాబితా: 28-10-2026 ఉత్తర్వుతో వచ్చిన SCERT సిలబస్‌లో ఏడో తరగతి సైన్స్‌కు అధ్యాయం 2 నుంచి 6 వరకు ఐదు పాఠాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం పరీక్షకు కాదు; Integrating AI సైన్స్ జాబితాలో లేదు. అకడమిక్ క్యాలెండర్‌లో Adolescence సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలల్లో ఉంది. క్యాలెండర్ పేర్లు, Curiosity పుస్తకంలోని అధ్యాయాల పేర్లు కొద్దిగా వేరు — రెండూ కింద ఇచ్చాం. చివరి కాలమ్ 6 అక్టోబర్ అసలు పేపర్ చూసి రాసినది.

క్యాలెండర్ పేరు (Curiosity అధ్యాయం)ముఖ్య అంశాలుFA2 పేపర్‌లో
The Wonderful World of Science (అధ్యాయం 1 — The Ever-Evolving World of Science)సైన్స్ ఒక ప్రక్రియ; ప్రశ్నలు అడగడం; Activity 1.1 Question the AnswerSA1 పరీక్షకు కాదు
Acids, Bases and Salts (అధ్యాయం 2 — Exploring Substances: Acidic, Basic, and Neutral)లిట్మస్, ఎర్ర గులాబీ, పసుపు సూచికలు; ఆమ్ల, క్షార, తటస్థ పదార్థాలు; తటస్థీకరణరాలేదు
Electric Circuits and their Components (అధ్యాయం 3)ఘటం, బ్యాటరీ, బల్బు, LED, స్విచ్, వాహకాలు – బంధకాలువచ్చింది
Metals and Non-metals (అధ్యాయం 4)లోహాల ధర్మాలు, లోహ – అలోహ ఆక్సైడ్లు, తుప్పువచ్చింది
Changes Around Us (అధ్యాయం 5 — Physical and Chemical)భౌతిక, రసాయన మార్పులు; దహనం; శైథిల్యంవచ్చింది
Adolescence (అధ్యాయం 6 — A Stage of Growth and Change)కౌమారదశ మార్పులు, హార్మోన్లు, పోషణ, పరిశుభ్రత, సోషల్ మీడియా, మత్తు పదార్థాలకు NOరాలేదు

AP 7th Class SA1 Science Question Paper 2026-27 అధికారిక సిలబస్ — ఐదు పాఠాలు, FA2 లో రానివి

ఈ చార్ట్ ఫోన్‌లో సేవ్ చేసుకోండి: నారింజ కార్డుల రెండు పాఠాలు FA2 లో రాలేదు; బూడిద కార్డు పరీక్షకు లేని మొదటి అధ్యాయం — రివిజన్ అక్కడి నుంచే మొదలుపెట్టండి.

విద్యుత్, లోహాలు, దహనం ప్రశ్నలకు జవాబులు AP 7th Class FA2 Science Question Paper 2026-27 పేజీలో ఉన్నాయి. ఆ పేపర్, ఈ పేపర్ రెండూ రాస్తే ఐదు పాఠాలకూ ఒకసారి సాధన అయిపోతుంది.

AP 7th Class SA1 Science Question Paper — 20 ప్రశ్నలు, జవాబులు

సూచనలు: మొత్తం 20 ప్రశ్నలు, 35 మార్కులు, సమయం గంటా పదిహేను నిమిషాలు. Section D లో A లేదా B — ఏదో ఒక్కటే రాయాలి. ప్రయోగ ప్రశ్నల్లో చేసే పద్ధతి, పరిశీలన, నిర్ధారణ మూడూ రాస్తేనే పూర్తి మార్కులు.

Section A  —  15 × 1 = 15 మార్కులు

1. Litmus, a natural acid-base indicator, is obtained from
(A) red roses   (B) lichens   (C) turmeric   (D) beetroot   [1 మార్కు]

జవాబు చూడండి
(B) lichens.
లిట్మస్ లైకెన్ల నుంచి వస్తుంది. లైకెన్ అంటే శిలీంధ్రం (fungus), శైవలం (alga) కలిసి జీవించే జీవి — వర్షం ఎక్కువ, గాలి శుభ్రంగా ఉండే చోట రాళ్ళు, చెట్ల బెరడుపై పెరుగుతుంది. లిట్మస్ ద్రావణంగానూ, ఎరుపు – నీలం కాగితాలుగానూ దొరుకుతుంది.

2. Which of these samples turns red litmus paper blue?
(A) Lemon juice   (B) Vinegar   (C) Lime water   (D) Sugar solution   [1 మార్కు]

జవాబు చూడండి
(C) Lime water.
ఎరుపు లిట్మస్‌ను నీలంగా మార్చేవి క్షార పదార్థాలు — సున్నపు నీరు, సబ్బు నీరు, వంట సోడా ద్రావణం, వాషింగ్ పౌడర్ ద్రావణం. నిమ్మరసం, వెనిగర్ ఆమ్లాలు (నీలం లిట్మస్ ఎరుపు అవుతుంది); చక్కెర ద్రావణం తటస్థం.

3. A sample does not change the colour of either red or blue litmus paper. The sample could be
(A) tamarind water   (B) salt solution   (C) soap solution   (D) amla juice   [1 మార్కు]

జవాబు చూడండి
(B) salt solution.
రెండు లిట్మస్ కాగితాల రంగూ మారకపోతే ఆ పదార్థం తటస్థం — ఆమ్లమూ కాదు, క్షారమూ కాదు. పుస్తకంలో కుళాయి నీరు, చక్కెర ద్రావణం, ఉప్పు ద్రావణం ఈ గుంపులో ఉన్నాయి.

4. When soap solution is added to red rose extract, the extract turns
(A) red   (B) green   (C) yellow   (D) colourless   [1 మార్కు]

జవాబు చూడండి
(B) green.
ఎర్ర గులాబీ రేకుల సారం ఆమ్లంలో ఎరుపు, క్షారంలో ఆకుపచ్చ రంగు ఇస్తుంది. సబ్బు నీరు క్షారం కాబట్టి ఆకుపచ్చ. ఎర్ర మందార, బీట్‌రూట్, ఊదా క్యాబేజీ, నేరేడు కూడా సూచికలుగా పనిచేస్తాయి.

5. A drop of which liquid will turn turmeric paper red?
(A) Lemon juice   (B) Vinegar   (C) Washing powder solution   (D) Tap water   [1 మార్కు]

జవాబు చూడండి
(C) Washing powder solution.
పసుపు కాగితం క్షార పదార్థం తగిలితేనే ఎరుపు అవుతుంది. ఆమ్ల, తటస్థ పదార్థాలతో పసుపు రంగు మారదు — అందుకే పసుపు సూచిక ఆమ్లాన్ని, తటస్థాన్ని వేరు చేసి చూపలేదు.

6. The acid mainly present in tamarind is
(A) citric acid   (B) tartaric acid   (C) ascorbic acid   (D) formic acid   [1 మార్కు]

జవాబు చూడండి
(B) tartaric acid.
పుస్తకం చూపిన ప్రకారం: నిమ్మ — సిట్రిక్ ఆమ్లం; ఉసిరి — ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ C), సిట్రిక్ ఆమ్లం; చింతపండు — టార్టారిక్ ఆమ్లం. ఫార్మిక్ ఆమ్లం ఎర్ర చీమ కుట్టినప్పుడు చర్మంలోకి వెళ్ళేది.

7. Keerthi was bitten by a red ant. Which of the following will give her relief?
(A) Vinegar   (B) Lemon juice   (C) Moist baking soda   (D) Tamarind water   [1 మార్కు]

జవాబు చూడండి
(C) Moist baking soda.
చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లం చర్మంలోకి వెళ్తుంది. వంట సోడా క్షారం — తడి చేసి రుద్దితే ఆమ్లం తటస్థీకరణ చెంది మంట తగ్గుతుంది. మిగతా మూడూ ఆమ్లాలే, అవి ఉపశమనం ఇవ్వవు.

8. Assertion (A): A farmer adds lime to his field when the soil becomes too acidic. Reason (R): Lime is a base and neutralises the acidic nature of the soil.
(A) Both A and R are true and R is the correct explanation of A.   (B) Both A and R are true but R is not the correct explanation of A.   (C) A is true but R is false.   (D) A is false but R is true.   [1 మార్కు]

జవాబు చూడండి
(A) Both A and R are true and R is the correct explanation of A.
రసాయన ఎరువులు ఎక్కువగా వాడితే నేల ఆమ్లంగా మారి మొక్కలు సరిగ్గా పెరగవు. సున్నం (lime) క్షారం కాబట్టి దాన్ని చల్లి సరిచేస్తారు. నేల క్షారంగా ఉంటే పశువుల ఎరువు, కంపోస్ట్ వేస్తారు — అవి ఆమ్లాలు విడుదల చేస్తాయి.

9. Adolescence is the period of rapid growth that generally occurs between the ages of
(A) 3 and 8 years   (B) 10 and 19 years   (C) 20 and 30 years   (D) 45 and 55 years   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 10 and 19 years.
శరీరం పెద్దయ్యే దశకు సిద్ధమయ్యే కాలం కౌమారదశ. సుమారు 10 – 12 ఏళ్ళ వరకు మార్పులు ఎక్కువగా ఎత్తు, బరువులోనే; తర్వాత ఇతర మార్పులు మొదలవుతాయి. ఈ దశ ఎప్పుడు మొదలై ఎంత కాలం ఉంటుందో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.

10. The bump seen in the throat of many adolescent boys, called the Adam’s apple, is due to the growth of the
(A) food pipe   (B) voice box   (C) wind pipe only   (D) tongue   [1 మార్కు]

జవాబు చూడండి
(B) voice box.
మాట్లాడడానికి సాయపడే స్వరపేటిక (voice box) పెరగడం వల్ల గొంతు దగ్గర ఉబ్బు కనిపిస్తుంది — అదే Adam’s apple; గొంతు బొంగురుగా మారుతుంది. అమ్మాయిల్లోనూ స్వరపేటిక పెరుగుతుంది కానీ తక్కువ, అందుకే గొంతులో స్వల్ప మార్పు. ఇది అందరిలో కనిపించాలని లేదు.

11. Pimples (acne) on the face during adolescence mainly occur due to
(A) eating too much sugar   (B) an increase in oily secretions of the skin   (C) lack of sleep only   (D) drinking too much water   [1 మార్కు]

జవాబు చూడండి
(B) an increase in oily secretions of the skin.
కౌమారదశలో చర్మం నుంచి నూనె వంటి స్రావాలు పెరుగుతాయి. అవి చర్మ రంధ్రాలను మూసి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. మొటిమలు (acne) ఒక స్థితి; ఎర్రని చిన్న పొక్కులు దాని లక్షణం.

12. Most changes during adolescence are mainly caused by certain chemicals produced in our body. These are called
(A) enzymes   (B) hormones   (C) vitamins   (D) indicators   [1 మార్కు]

జవాబు చూడండి
(B) hormones.
హార్మోన్లు శరీరంలోని వేర్వేరు భాగాల్లో తయారై, మెదడు నుంచి వచ్చే సంకేతాలకు తగిన సమయంలో విడుదలవుతాయి. పెరుగుదల, అభివృద్ధిని నియంత్రిస్తాయి; కొన్ని హార్మోన్లు మానసిక స్థితి, ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతాయి.

13. The National De-addiction Helpline number launched by the Government of India is
(A) 100   (B) 108   (C) 14446   (D) 1098   [1 మార్కు]

జవాబు చూడండి
(C) 14446.
మత్తు పదార్థాల వ్యసనం నుంచి బయటపడడానికి సాయం చేసే జాతీయ హెల్ప్‌లైన్ 14446. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నడిపే Nasha Mukt Bharat Abhiyaan ప్రత్యేకంగా చిన్న వయసు పిల్లల్లో మత్తు అలవాటును నివారించడంపై దృష్టి పెడుతుంది.

14. The white powder formed on burning a magnesium ribbon is dissolved in warm water. The solution
(A) turns blue litmus red   (B) turns red litmus blue   (C) does not affect any litmus   (D) turns turmeric paper green   [1 మార్కు]

జవాబు చూడండి
(B) turns red litmus blue.
మండిన మెగ్నీషియం రిబ్బన్ తెల్లని పొడి మెగ్నీషియం ఆక్సైడ్. దాని ద్రావణం క్షారం — ఎరుపు లిట్మస్ నీలం అవుతుంది. సాధారణంగా లోహ ఆక్సైడ్లు క్షార స్వభావం, అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావం కలవి.

15. To make an LED glow in a circuit, its longer wire should be connected to the
(A) negative terminal of the cell   (B) positive terminal of the cell   (C) switch only   (D) either terminal; it does not matter   [1 మార్కు]

జవాబు చూడండి
(B) positive terminal of the cell.
LED లో ఫిలమెంట్ ఉండదు. దాని రెండు తీగల్లో పొడవైనది ధన (+), పొట్టిది ఋణ (–) టెర్మినల్. తిప్పి కలిపితే LED వెలగదు — విద్యుత్ దానిలో ఒకే దిశలో ప్రవహిస్తుంది.

Section B  —  2 × 2 = 4 మార్కులు

16. Ashwin applied turmeric paste on white paper, dried it and wrote a Guru Purnima message for his teacher with a colourless liquid. The words appeared red. Which liquid could he have used from among lemon juice, soap solution and sugar solution? Give a reason.   [2 మార్కులు]

జవాబు చూడండి
జవాబు: సబ్బు నీరు (soap solution). — 1 మార్కు
కారణం: పసుపు క్షార పదార్థం తగిలితేనే ఎరుపు అవుతుంది. సబ్బు నీరు క్షారం. నిమ్మరసం ఆమ్లం, చక్కెర ద్రావణం తటస్థం — ఈ రెండింటితో పసుపు రంగు మారదు, అక్షరాలు కనిపించవు. — 1 మార్కు
సైన్స్ ఫెయిర్‌లో “Welcome to the Wonderful World of Science” అక్షరాలు కనిపించిన రహస్యమూ ఇదే — కాగితంపై సబ్బు నీటితో రాసి, పసుపు ద్రావణం చల్లి ఉండవచ్చు అని పాఠం చివర్లో చెబుతారు.

17. Suggest any two healthy habits that adolescents should follow, with one reason for each.   [2 మార్కులు]

జవాబు చూడండి
ఏవైనా రెండు రాస్తే చాలు (ఒక్కోదానికి 1 మార్కు):
1. పోషకాహారం: పాలు, పెరుగు, చిరుధాన్యాలు, పనీర్ నుంచి కాల్షియం — ఎముకల పెరుగుదలకు; పాలకూర, రాజ్మా, కిస్మిస్, అంజీర నుంచి ఇనుము — రక్తం తయారీకి. వేగంగా పెరిగే ఈ దశలో పోషణ చాలా అవసరం.
2. వ్యక్తిగత పరిశుభ్రత: రోజూ స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే ఇన్ఫెక్షన్లు రావు.
3. వ్యాయామం, ఆటలు: శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి, శక్తి (stamina) పెరుగుతుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది.
4. మత్తు పదార్థాలకు NO: పొగాకు, గుట్కా, మద్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, వ్యసనంగా మారతాయి — మొదటిసారీ, ప్రతిసారీ వద్దనాలి.

Section C  —  2 × 4 = 8 మార్కులు

18. What is neutralisation? Explain how neutralisation helps in each of the following: (a) a red ant bite (b) acidic soil (c) basic soil.   [4 మార్కులు]

జవాబు చూడండి
తటస్థీకరణ: ఆమ్ల ద్రావణం, క్షార ద్రావణం తగినంత పరిమాణంలో కలిస్తే వచ్చే ద్రావణం ఆమ్లమూ కాదు క్షారమూ కాదు. ఈ చర్యలో లవణం, నీరు ఏర్పడి వేడి విడుదలవుతుంది. ఆమ్లం + క్షారం = లవణం + నీరు + వేడి. — 1 మార్కు
(a) ఎర్ర చీమ కాటు: చీమ ఫార్మిక్ ఆమ్లాన్ని చర్మంలోకి పంపుతుంది. తడి వంట సోడా (క్షారం) రుద్దితే ఆమ్లం ప్రభావం తటస్థమై నొప్పి తగ్గుతుంది. — 1 మార్కు
(b) ఆమ్ల నేల: రసాయన ఎరువుల అధిక వాడకంతో నేల ఆమ్లమైతే మొక్కలు బాగా పెరగవు. క్షారమైన సున్నం (lime) చల్లి సరిచేస్తారు. — 1 మార్కు
(c) క్షార నేల: పశువుల ఎరువు, కంపోస్ట్ చేసిన ఆకుల వంటి సేంద్రియ పదార్థాలు కలుపుతారు. అవి విడుదల చేసే ఆమ్లాలు నేల క్షార స్వభావాన్ని తటస్థం చేస్తాయి. — 1 మార్కు
అదనపు ఉదాహరణ: కర్మాగారాల ఆమ్ల వ్యర్థాలను సరస్సులోకి వదిలే ముందు క్షార పదార్థాలు కలిపి తటస్థం చేస్తే చేపలు బతుకుతాయి.

19. Your teacher burns a cleaned magnesium ribbon held with tongs. (a) What do you observe? (b) Name the product and write the word equation. (c) What is the nature of the product’s solution in water, and how will you test it? (d) Is this a physical or a chemical change? Why?   [4 మార్కులు]

జవాబు చూడండి
(a) పరిశీలన: మెగ్నీషియం రిబ్బన్ మిరుమిట్లు గొలిపే తెల్లని మంటతో మండి, తెల్లని పొడిగా మారుతుంది. — 1 మార్కు
(b) ఉత్పన్నం: మెగ్నీషియం ఆక్సైడ్ — గాలిలోని ఆక్సిజన్‌తో చర్య వల్ల. మెగ్నీషియం + ఆక్సిజన్ = మెగ్నీషియం ఆక్సైడ్ + వేడి + కాంతి. — 1 మార్కు
(c) స్వభావం: పొడికి కొద్దిగా గోరువెచ్చని నీరు కలిపి కలియబెట్టి ఎరుపు లిట్మస్ ముంచితే నీలం అవుతుంది — క్షార స్వభావం. లోహ ఆక్సైడ్లు సాధారణంగా క్షారాలు. — 1 మార్కు
(d) రసాయన మార్పు — మెగ్నీషియం ఆక్సైడ్ అనే కొత్త పదార్థం ఏర్పడింది, వేడి, కాంతి విడుదలయ్యాయి; తిరిగి రిబ్బన్‌గా మార్చలేం. — 1 మార్కు
జాగ్రత్త: ఈ ప్రయోగాన్ని ఉపాధ్యాయులే చేసి చూపాలి; రక్షణ కళ్ళద్దాలు పెట్టుకుని దూరంగా ఉండాలని పుస్తకం సూచిస్తుంది.

Section D  —  1 × 8 = 8 మార్కులు

20. A) What is an acid-base indicator? Describe how you would prepare (i) red rose extract and (ii) turmeric paper. Write the colour each shows with an acidic, a basic and a neutral substance.
(OR)
B) What is adolescence? Describe any four physical changes and two emotional changes that occur during adolescence. Why do these changes happen?   [8 మార్కులు]

జవాబు చూడండి
A) జవాబు (నిర్వచనం 1, ఎర్ర గులాబీ తయారీ 2, పసుపు కాగితం తయారీ 2, రంగుల పట్టిక 3):
ఆమ్ల – క్షార సూచిక: ఆమ్ల, క్షార ద్రావణాల్లో వేర్వేరు రంగులు చూపే పదార్థం. ఉదా: లిట్మస్, ఎర్ర గులాబీ సారం, పసుపు.
(i) ఎర్ర గులాబీ సారం: కింద రాలిన ఎర్ర గులాబీ రేకులు గుప్పెడు సేకరించండి (పూలు కోయకూడదు). నీటితో కడిగి రోలు – రోకలితో నూరండి. గ్లాసులో వేసి రేకులు మునిగేలా వేడి నీళ్ళు పోయండి (పెద్దల పర్యవేక్షణలో). మూత పెట్టి 5 – 10 నిమిషాలు ఉంచి, నీరు రంగు మారాక వడకట్టండి — ఆ ద్రవమే సూచిక.
(ii) పసుపు కాగితం: చెంచా పసుపులో కొంచెం నీరు కలిపి ముద్ద చేయండి. వడపోత కాగితాన్ని ఆ ముద్దలో ముంచి పసుపు రంగు పట్టాక తీసి ఆరబెట్టండి. సన్నని ముక్కలుగా కత్తిరించండి.

సూచికఆమ్లంలో (ఉదా: నిమ్మరసం)క్షారంలో (ఉదా: సబ్బు నీరు)తటస్థంలో (ఉదా: చక్కెర ద్రావణం)
ఎర్ర గులాబీ సారంఎరుపుఆకుపచ్చ—
పసుపు కాగితంమార్పు లేదు (పసుపు)ఎరుపుమార్పు లేదు (పసుపు)

పసుపు ఆమ్లాన్ని, తటస్థాన్ని వేరు చేసి చూపలేదు — ఈ వాక్యం రాస్తే జవాబు పూర్తవుతుంది.
B) జవాబు (నిర్వచనం 1, శారీరక మార్పులు 4, భావోద్వేగ మార్పులు 2, కారణం 1):
కౌమారదశ: సుమారు 10 – 19 సంవత్సరాల మధ్య వేగంగా పెరుగుదల, అభివృద్ధి జరిగే దశ. ఈ దశలో శరీరం పెద్దవారి దశకు సిద్ధమవుతుంది.
శారీరక మార్పులు (ఏవైనా నాలుగు): (1) ఎత్తు, బరువు, బలం పెరగడం; అబ్బాయిల్లో భుజాలు, ఛాతీ వెడల్పు కావడం. (2) స్వరపేటిక పెరిగి గొంతు మారడం — అబ్బాయిల్లో Adam’s apple. (3) శరీరంలో కొన్ని భాగాల్లో వెంట్రుకలు రావడం; అబ్బాయిలకు మీసం, గడ్డం. (4) చర్మంలో నూనె స్రావాలు పెరిగి మొటిమలు రావడం.
భావోద్వేగ మార్పులు: (1) మనసు తరచుగా మారడం (mood swings) — సంగీతం, నృత్యం, ఆటల్లో పాల్గొంటే సృజనాత్మకత పెరుగుతుంది. (2) బలమైన భావోద్వేగాలు, సున్నితత్వం పెరగడం — సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే కరుణ పెరుగుతుంది.
కారణం: ఈ మార్పులు ప్రధానంగా హార్మోన్ల వల్ల. ఈ మార్పులు ఎప్పుడు, ఎంత జరుగుతాయో ఒక్కొక్కరికి వేరుగా ఉంటుంది — అది పూర్తిగా సహజం.

ఏ పాఠం నుంచి ఎన్ని మార్కులు

పాఠంప్రశ్న సంఖ్యలుమార్కులు
Acids, Bases and Salts1 – 8, 16, 18, 20A14 (20A రాస్తే 22)
Adolescence9 – 13, 17, 20B7 (20B రాస్తే 15)
Metals and Non-metals, Changes Around Us14, 195
Electric Circuits and their Components151

Section D లో A రాసినా B రాసినా 35 లో 27 మార్కులకు పైగా FA2 లో రాని రెండు పాఠాల నుంచే వస్తాయి. విద్యుత్, లోహాలు, మార్పుల కోసం 6 అక్టోబర్ అసలు పేపర్‌ను మరోసారి రాసి చూడండి.

ఏడో తరగతి సైన్స్ — పేపర్‌లో లేని 7 ముఖ్య ప్రశ్నలు

ప్రశ్నజవాబు
విద్యుత్ ఘటం (cell) గుర్తులో పొడవు గీత, పొట్టి గీత దేన్ని సూచిస్తాయి?పొడవైన సన్నని గీత ధన (+) టెర్మినల్, పొట్టి మందమైన గీత ఋణ (−) టెర్మినల్. వలయ పటం గీసేటప్పుడు ఈ గుర్తు తారుమారు చేయకూడదు.
కౌమారదశలో పోషకాహారం ఎందుకు ఎక్కువ ముఖ్యం?ఈ దశలో శరీరం వేగంగా పెరుగుతుంది. ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ ఎక్కువగా కావాలి; ఐరన్ తక్కువైతే రక్తహీనత (anaemia) వస్తుంది. పప్పులు, ఆకుకూరలు, పాలు, పండ్లు రోజూ తీసుకోవాలి.
ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ (P.C. Ray) ఎవరు?“Father of Modern Indian Chemistry”. 1901 లో భారతదేశపు మొదటి ఔషధ (pharmaceutical) కంపెనీ స్థాపించారు. ప్రాచీన భారతీయ రసాయన శాస్త్రం గురించి రాశారు; మాతృభాషలో విద్యను సమర్థించారు.
హైడ్రేంజియా పూల రంగు ఎందుకు మారుతుంది?హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల చల్లని వాతావరణంలో పెరిగే ఈ మొక్క పూల రంగు నేలను బట్టి మారుతుంది — ఆమ్ల నేలలో నీలం, క్షార నేలలో గులాబీ లేదా ఎరుపు.
వాసన మార్చే సూచికలు (olfactory indicators) అంటే?ఆమ్ల లేదా క్షార మాధ్యమంలో వాసన మారే పదార్థాలు. ఉదా: సన్నగా తరిగిన ఉల్లిపాయలతో రాత్రంతా ఉంచిన గుడ్డ ముక్కలపై చింతపండు నీరు, వంట సోడా ద్రావణం వేసి వాసనలో తేడా చూడడం (Activity 2.6).
డోరతీ హాడ్కిన్ ఎవరు?విటమిన్ B12 నిర్మాణాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త. 1964 లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మూడో మహిళ. విటమిన్ B12 శరీరం తయారుచేసుకోలేదు — ఆహారం నుంచే రావాలి.
ఢిల్లీ ఇనుప స్తంభం ప్రత్యేకత ఏమిటి?చంద్రగుప్త II కాలంలో 1600 ఏళ్ళకు పైగా క్రితం తయారైంది; సుమారు 8 మీటర్ల ఎత్తు, 6000 కిలోలకు పైగా బరువు. ఇన్నేళ్ళు ఎండ, వాన తట్టుకున్నా దాదాపు తుప్పు పట్టలేదు — ప్రాచీన భారత లోహ నైపుణ్యానికి నిదర్శనం.

సూచికల రంగుల చార్ట్, ముఖ్య చర్యలు — పరీక్ష ముందు ఒక్కసారి

అంశంఆమ్లంక్షారంతటస్థం
నీలం లిట్మస్ఎరుపు అవుతుందిమార్పు లేదుమార్పు లేదు
ఎరుపు లిట్మస్మార్పు లేదునీలం అవుతుందిమార్పు లేదు
ఎర్ర గులాబీ సారంఎరుపుఆకుపచ్చ—
పసుపుమార్పు లేదుఎరుపుమార్పు లేదు
రుచి, స్పర్శపుల్లగాచేదు, జారుడుగా (సబ్బులా)—
ఉదాహరణలునిమ్మ, ఉసిరి, చింతపండు, వెనిగర్సబ్బు నీరు, వంట సోడా, సున్నపు నీరు, వాషింగ్ పౌడర్కుళాయి నీరు, చక్కెర, ఉప్పు ద్రావణాలు
చర్యపద సమీకరణం
తటస్థీకరణఆమ్లం + క్షారం = లవణం + నీరు + వేడి
మెగ్నీషియం దహనంమెగ్నీషియం + ఆక్సిజన్ = మెగ్నీషియం ఆక్సైడ్ + వేడి + కాంతి
వెనిగర్, వంట సోడావెనిగర్ + వంట సోడా = కార్బన్ డై ఆక్సైడ్ + ఇతర పదార్థాలు (వాయువు సున్నపు నీటిని పాలవలె చేస్తుంది)

7వ తరగతి SA1 సైన్స్ సాధన పేపర్ PDF

ప్రింట్ తీసి పరీక్షలా రాయాలనుకుంటే: Download PDF — AP 7th Class SA1 Science Practice Paper 2026-27. మొదటి పేజీల్లో ప్రశ్నలు మాత్రమే, జవాబులు చివర్లో.

ఏడో తరగతి సైన్స్‌లో తరచూ పోయే 7 మార్కులు

  1. లిట్మస్ రంగులు తారుమారు: ఆమ్లం నీలం లిట్మస్‌ను ఎరుపు చేస్తుంది; క్షారం ఎరుపు లిట్మస్‌ను నీలం చేస్తుంది.
  2. పసుపుతో ఆమ్లాన్ని గుర్తించడం: పసుపు క్షారంతో మాత్రమే ఎరుపు అవుతుంది — ఆమ్లం, తటస్థం రెండింట్లోనూ మారదు.
  3. చేదు అంటే క్షారం అనుకోవడం: కాకరకాయ చేదుగా ఉన్నా క్షారం కాదు అని పుస్తకమే చెబుతుంది.
  4. Lime water ను నిమ్మరసం అనడం: lime water అంటే సున్నపు నీరు (కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం) — క్షారం. నిమ్మ (lime పండు) ఆమ్లం.
  5. చీమ కాటుకు వెనిగర్ రాయడం: కాటులో ఉన్నది ఆమ్లం; ఉపశమనం క్షారం (వంట సోడా) తోనే.
  6. ఆక్సైడ్ల స్వభావం: మెగ్నీషియం ఆక్సైడ్ వంటి లోహ ఆక్సైడ్లు క్షారాలు; సల్ఫర్ వంటి అలోహ ఆక్సైడ్లు ఆమ్లాలు.
  7. LED తీగలు తిప్పి కలపడం: పొడవైన తీగ ధన టెర్మినల్‌కే; లేకపోతే LED వెలగదు.

7వ తరగతి సైన్స్ — SA1 కి 10 రోజుల ప్లాన్

పరీక్ష 16 నవంబర్ 2026 (సోమవారం), మధ్యాహ్నం 1:15. రోజుకు 45 నిమిషాలు చాలు. ఇంట్లో దొరికే నిమ్మ, సబ్బు, పసుపుతో Chapter 2 ప్రయోగాలు ఒకసారి చేసి చూస్తే రంగులు మర్చిపోరు.

రోజుఏం చదవాలి
1Chapter 2 కథ (సైన్స్ ఫెయిర్), ఆమ్లాలు – క్షారాల రుచి, స్పర్శ; సూచికల పరిచయం
2లిట్మస్, లైకెన్లు; ఆమ్ల, క్షార, తటస్థ గుంపులు (Activity 2.1); ఆమ్లాల పేర్లు
3ఎర్ర గులాబీ సారం, పసుపు కాగితం తయారీ, రంగులు; హైడ్రేంజియా, ఉల్లి సూచిక
4తటస్థీకరణ (Activity 2.7); చీమ కాటు, నేల, కర్మాగార వ్యర్థాలు; P.C. Ray
5కౌమారదశ — వయసు, శారీరక మార్పులు, స్వరపేటిక, మొటిమలు, హార్మోన్లు
6భావోద్వేగ మార్పులు; పోషణ (Table 6.3), పరిశుభ్రత, వ్యాయామం, సోషల్ మీడియా, మత్తుకు NO, 14446
7విద్యుత్ వలయాలు, LED; లోహాలు – అలోహాలు, మెగ్నీషియం రిబ్బన్ — FA2 అసలు పేపర్‌తో
8భౌతిక, రసాయన మార్పులు; వెనిగర్ – వంట సోడా; దహనం — FA2 పేపర్ జవాబులు మళ్ళీ
9పై 20 ప్రశ్నల పేపర్ — గడియారం పెట్టుకుని 75 నిమిషాల్లో
10తప్పులు దిద్దుకోవడం, సూచికల చార్ట్, 7 అదనపు ప్రశ్నలు, అధ్యాయాలు 2, 6 చివరి ప్రశ్నలు

ఏడో తరగతి పాఠ్యపుస్తకాలు, నోట్స్, వర్క్‌షీట్లు అన్నీ AP 7th Class Textbooks, Notes, Study Material, Question Papers పేజీలో దొరుకుతాయి. ఏ సబ్జెక్టుకు ఏ పాఠాలో తెలుసుకోవడానికి AP SA1 Syllabus 2026-27 – Class 1 to 10 చూడండి.

తర్వాత ఏం చదవాలి

  1. AP 7th Class FA2 Science Question Paper 2026-27 — విద్యుత్, లోహాలు, మార్పుల అసలు పేపర్
  2. AP 7th Class SA1 English Question Paper 2026-27 — Poorvi సాధన పేపర్
  3. AP 7th Class SA1 Telugu Question Paper 2026-27 — తెలుగు సాధన పేపర్
  4. AP Class 7 Maths Important Questions – SA1 2026 — గణితం 20 ప్రశ్నలు

FAQs

ఏడో తరగతి SA1 సైన్స్ పరీక్ష ఎప్పుడు?

28-10-2026 అధికారిక టైమ్ టేబుల్ ప్రకారం 7వ తరగతి సైన్స్ పరీక్ష 16 నవంబర్ 2026 (సోమవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. SA1 పరీక్షలు 9 నుంచి 20 నవంబర్ వరకు.

7వ తరగతి SA1 Science సిలబస్‌లో ఎన్ని పాఠాలు?

అధికారిక జాబితా ప్రకారం ఐదు: Acids Bases and Salts, Electric Circuits and their Components, Metals and Non-metals, Changes Around Us, Adolescence. మొదటి అధ్యాయం The Wonderful World of Science పరీక్షకు లేదు; Integrating AI సైన్స్ జాబితాలో లేదు.

6 అక్టోబర్ FA2 సైన్స్ పేపర్‌లో ఏ పాఠాలు వచ్చాయి?

Exam Code 721 పేపర్‌లో విద్యుత్ వలయాలు, లోహాలు – అలోహాలు, భౌతిక – రసాయన మార్పులు, దహనం మీద ప్రశ్నలు వచ్చాయి.

Acids, Bases and Salts పాఠం పుస్తకంలో ఏ పేరుతో ఉంది?

Curiosity లో అధ్యాయం 2 — “Exploring Substances: Acidic, Basic, and Neutral”. Adolescence అధ్యాయం 6 — “Adolescence: A Stage of Growth and Change”.

ఇది ప్రభుత్వ మోడల్ పేపరా?

కాదు. పరీక్ష తేదీ, పాఠాల జాబితా 28-10-2026 అధికారిక ఉత్తర్వు నుంచి; ప్రశ్నలు, జవాబులు మేము Curiosity పుస్తకం ఆధారంగా తయారుచేశాం.

ఏడో తరగతి SA1 సైన్స్ ఎన్ని మార్కులకు?

28-10-2026 అధికారిక ఉత్తర్వు ప్రకారం 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). ఈ పేజీలోని సాధన పేపర్ FA ఆకారంలో 20 ప్రశ్నలు, 35 మార్కులు — అసలు పేపర్‌కు ముందు పాఠాల వారీ సాధనకు.

ఆమ్ల – క్షార సూచిక అంటే ఏమిటి?

ఆమ్లంలో ఒక రంగు, క్షారంలో మరో రంగు చూపే పదార్థం. సహజ సూచికలు: లిట్మస్, ఎర్ర గులాబీ, ఎర్ర మందార, ఊదా క్యాబేజీ, బీట్‌రూట్, పసుపు, నేరేడు.

తటస్థీకరణలో ఏం ఏర్పడతాయి?

లవణం, నీరు — వేడి విడుదలవుతుంది. ఆమ్లం + క్షారం = లవణం + నీరు + వేడి.

సున్నపు నీరు ఎలా తయారుచేస్తారు?

సున్నం (చూనా — కాల్షియం ఆక్సైడ్) నీటిలో కలిపి సుమారు గంటసేపు కదలకుండా ఉంచి, ఆ ద్రవాన్ని మరో పాత్రలోకి వడకట్టాలి. అదే సున్నపు నీరు — కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం.

కౌమారదశ మార్పులు అందరికీ ఒకేలా ఉంటాయా?

లేదు. ఎత్తు, గొంతు, వెంట్రుకల పెరుగుదల ఎప్పుడు, ఎంత జరుగుతాయో వ్యక్తిని బట్టి మారుతుంది — ఆ తేడాలు పూర్తిగా సహజం అని పాఠం చెబుతుంది.

సైబర్ బుల్లీయింగ్ ఎదురైతే ఏం చేయాలి?

భయపడకూడదు. తెలివిగా వ్యవహరించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సాయం తీసుకోవాలి. అపరిచితులతో ఫోటోలు, వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదు.

స్కోర్ బార్‌లో మార్కులు ఎలా వస్తాయి?

ప్రతి జవాబు తెరిచాక కనిపించే చెక్‌బాక్స్‌ను మీ జవాబు సరిపోతేనే గుర్తించండి. Section D లో మీరు రాసిన భాగానికి మాత్రమే టిక్ పెట్టండి; బార్ 35 కి మీ మార్కులు చూపిస్తుంది. PDF కావాలంటే పై లింక్ వాడండి.

Official Sources

SA1 టైమ్ టేబుల్, మార్కుల విధానం, సిలబస్: పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు Rc. No. 3475819/SAT-I/2026-27, తేదీ 28-10-2026 (SCERT సిలబస్ అనుబంధంతో); AP SCERT. నెలవారీ బోధన క్రమం: High School Academic Calendar 2026-27. పాఠ్యాంశాలు: NCERT Curiosity — Textbook of Science for Grade 7 (Reprint 2026-27), అధ్యాయాలు 1 – 6.