AP Class 7 Maths Important Questions – Half Yearly Exam (SA1) 2026

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP 7th Class SA1 Maths Question Paper 2026-27 సాధన కోసం ఏడో తరగతి Ganita Prakash పుస్తకంలోని SA1 అధ్యాయాలన్నింటిపై 20 ముఖ్యమైన ప్రశ్నలు (Important Questions) ఇక్కడ ఉన్నాయి. జవాబు ప్రతి ప్రశ్న కిందే, బటన్ నొక్కితే తెరుచుకుంటుంది. Half Yearly Exam అని పిలిచే SA1 కోసం, 5 అక్టోబర్ FA2 పేపర్‌లో అసలు కనిపించని Large Numbers Around Us, Arithmetic Expressions అధ్యాయాలకు ఈ పేపర్‌లో 16 మార్కులు కేటాయించాం.

ఈ ఏడాది FA1, FA2 పేపర్ల ఆకారాన్నే ఇక్కడ పాటించాం — 20 ప్రశ్నలు, 35 మార్కులు, చివరి ప్రశ్నలో A లేదా B. అసలు SA1 పేపర్ వచ్చిన రోజు సాయంత్రం దాని జవాబులు కూడా ఈ పేజీ మొదట్లో పెడతాం.

AP 7th Class SA1 Maths Question Paper 2026-27 — ముఖ్య వివరాలు

విషయంసమాచారం
పరీక్షSA1 (Half Yearly) — ఏడో తరగతి గణితం
పుస్తకంGanita Prakash (2026-27 కొత్త పుస్తకం)
SA1 తేదీలు9 – 20 నవంబర్ 2026 (SCERT క్యాలెండర్ ప్రకారం, Tentative)
అధ్యాయాలు7 — జూలై నుంచి సెప్టెంబర్ వరకు బోధించినవి
FA2 లో కనిపించనివిLarge Numbers Around Us, Arithmetic Expressions
దసరా సెలవులు12 – 21 అక్టోబర్ 2026
ఈ ప్రశ్నపత్రం20 ప్రశ్నలు | 35 మార్కులు | 1 గం. 15 ని.

ముఖ్య గమనిక: ఈ పేజీలో ఇంతకు ముందు పాత పుస్తకంలోని Integers, Fractions, Simple Equations వంటి అధ్యాయాల ప్రశ్నలు ఉండేవి. 2026-27 నుంచి ఏడో తరగతికి Ganita Prakash వచ్చింది, కాబట్టి ప్రశ్నలన్నీ కొత్త సిలబస్‌తో మార్చాం. 6 – 9 తరగతుల SA1 మార్కుల నమూనా, గణితం తేదీ SCERT ఉత్తర్వులో వస్తాయి; 11 అక్టోబర్ 2026 వరకు అది రాలేదు. క్యాలెండర్‌లో అక్టోబర్ కింద ఉన్న Integrated AI పై రాత ప్రశ్నలు ఉంటాయో ఆ ఉత్తర్వు చెప్పాలి — అందుకే దాన్ని ఈ పేపర్‌లో పెట్టలేదు.

6 నుంచి 10 తరగతుల SA1 వివరాలన్నీ ఒకే చోట కావాలంటే AP SA1 2026-27 – సిలబస్, టైమ్ టేబుల్, ప్రశ్నపత్రాలు పేజీ చూడండి.

Class 7 Maths Half Yearly (SA1) సిలబస్ — FA2 పేపర్‌తో పోల్చి

SCERT అకడమిక్ క్యాలెండర్‌లోని ఏడు అధ్యాయాలను 5 అక్టోబర్ FA2 అసలు పేపర్ (Exam Code 720) ప్రశ్నలతో పక్కపక్కన పెట్టి చూశాం. FA2 లో దశాంశాలు, బీజీయ సమాసాలు, కోణాలు, మాయా చదరం, త్రిభుజ భుజాల ప్రశ్నలు వచ్చాయి; పెద్ద సంఖ్యలు, అంకగణిత సమాసాలపై ఒక్క ప్రశ్నా రాలేదు.

అధ్యాయం (Ganita Prakash)FA2 లోఈ పేపర్‌లో మార్కులు
Large Numbers Around Us (పెద్ద సంఖ్యలు)రాలేదు6 (20A ఎంచుకుంటే 14)
Arithmetic Expressions (అంకగణిత సమాసాలు)రాలేదు10
A Peek Beyond the Point (దశాంశాలు)వచ్చింది2 (20B తో ఎక్కువ)
Expressions using Letter-Numbers (బీజీయ సమాసాలు)వచ్చింది2 (20B తో ఎక్కువ)
Parallel and Intersecting Lines (సమాంతర, ఖండన రేఖలు)వచ్చింది5
Number Play (సంఖ్యలతో ఆట)వచ్చింది1
A Tale of Three Intersecting Lines (త్రిభుజాలు)వచ్చింది1

AP 7th Class SA1 Maths Question Paper 2026-27 సిలబస్ — Ganita Prakash 7 అధ్యాయాలు, FA2 లో రానివి

నారింజ రంగు రెండు అధ్యాయాలకు FA2 లో సాధన దొరకలేదు — సెలవుల మొదటి రోజులు వాటికే ఇవ్వండి.

మిగతా ఐదు అధ్యాయాల FA2 అసలు ప్రశ్నలు, జవాబులు AP 7th Class FA2 Maths Question Paper 2026-27 లో ఉన్నాయి. పుస్తకంలోని అధ్యాయాల జాబితా, సాధనల కోసం AP 7th Class Maths Solutions 2026-27 – Ganita Prakash తెరవండి.

AP 7th Class SA1 Maths Important Questions — 20 ప్రశ్నల పేపర్

ఎలా వాడాలి: గంటా పావు సమయం పెట్టుకుని నోట్‌బుక్‌లో రాయండి. 20వ ప్రశ్నకు A లేదా B లో ఒకటే. రాసిన తర్వాతే “జవాబు చూడండి” నొక్కి సరిచూసుకోండి.

విభాగం A  —  బహుళైచ్ఛిక ప్రశ్నలు (15 × 1 = 15)

1. ఒక కోటి (1 crore) ఎన్ని లక్షలకు సమానం?
(A) 10 లక్షలు   (B) 100 లక్షలు   (C) 1000 లక్షలు   (D) 10,000 లక్షలు   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 100 లక్షలు.
1 లక్ష = 1,00,000. 1 కోటి = 1,00,00,000 = 100 × 1,00,000.

2. 7,05,30,000 ను భారతీయ పద్ధతిలో ఎలా చదువుతాం?
(A) ఏడు కోట్ల యాభై మూడు వేలు   (B) ఏడు కోట్ల ఐదు లక్షల ముప్పై వేలు   (C) డెబ్బై లక్షల ఐదు వేల మూడు వందలు   (D) ఏడు కోట్ల ముప్పై లక్షల ఐదు వేలు   [1 మార్కు]

జవాబు చూడండి
(B) ఏడు కోట్ల ఐదు లక్షల ముప్పై వేలు.
కామాలు కుడి నుంచి: మొదట 3 అంకెలు (వందలు), తర్వాత 2 – 2. 7 | 05 | 30 | 000 = 7 కోట్లు, 5 లక్షలు, 30 వేలు.

3. అంతర్జాతీయ పద్ధతిలో 10 లక్షలను ఏమంటారు?
(A) 1 million   (B) 10 million   (C) 100 thousand   (D) 1 billion   [1 మార్కు]

జవాబు చూడండి
(A) 1 million.
10,00,000 = 1,000,000 = one million. అదే విధంగా 1 కోటి = 10 million.

4. 4,89,756 ను దగ్గరి లక్షకు సవరిస్తే (round off) ఎంత?
(A) 4,00,000   (B) 4,90,000   (C) 5,00,000   (D) 4,89,000   [1 మార్కు]

జవాబు చూడండి
(C) 5,00,000.
లక్షల స్థానం తర్వాత భాగం 89,756. ఇది 50,000 కంటే ఎక్కువ కాబట్టి పై లక్షకు వెళ్తాం.

5. 25 − 10 + 5 విలువ ఎంత?
(A) 10   (B) 20   (C) 30   (D) 40   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 20.
పదాలు: +25, −10, +5. మొత్తం 25 − 10 + 5 = 20. (25 − 15 = 10 అని చేయడం తప్పు — మైనస్ గుర్తు 10 కి మాత్రమే.)

6. 7 × (10 + 3) కి సమానమైనది ఏది?
(A) 7 × 10 + 3   (B) 7 × 10 + 7 × 3   (C) 7 + 10 × 3   (D) 70 × 3   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 7 × 10 + 7 × 3.
బ్రాకెట్‌లోని ప్రతి పదాన్ని 7 తో గుణించాలి (విభాగ న్యాయం). 70 + 21 = 91 = 7 × 13.

7. లెక్క చేయకుండా గుర్తు నింపండి: 52 − 17 ___ 52 − 21
(A) <   (B) >   (C) =   (D) చెప్పలేం   [1 మార్కు]

జవాబు చూడండి
(B) >.
ఒకే సంఖ్య నుంచి తక్కువ తీసేస్తే ఎక్కువ మిగులుతుంది. 17 < 21 కాబట్టి 52 − 17 పెద్దది (35 > 31).

8. 12 − 5 × 2 + 8 సమాసంలో ఎన్ని పదాలు (terms) ఉన్నాయి?
(A) 2   (B) 3   (C) 4   (D) 5   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 3.
పదాలు: 12, −5 × 2, +8. గుణకారం ఒకే పదంలో ఉంటుంది. విలువ 12 − 10 + 8 = 10.

9. 0.5 + 0.05 = ?
(A) 0.10   (B) 0.55   (C) 0.505   (D) 5.5   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 0.55.
దశాంశ బిందువులు ఒకే వరుసలో: 0.50 + 0.05 = 0.55.

10. 2 m 35 cm ను మీటర్లలో రాస్తే?
(A) 2.035 m   (B) 23.5 m   (C) 2.35 m   (D) 0.235 m   [1 మార్కు]

జవాబు చూడండి
(C) 2.35 m.
100 cm = 1 m, కాబట్టి 35 cm = 0.35 m. మొత్తం 2.35 m.

11. x = 3 అయితే 4x − 5 విలువ?
(A) 7   (B) 12   (C) 17   (D) 2   [1 మార్కు]

జవాబు చూడండి
(A) 7.
4 × 3 − 5 = 12 − 5 = 7.

12. 5a + 3b − 2a + b ను సూక్ష్మీకరిస్తే?
(A) 3a + 3b   (B) 3a + 4b   (C) 7a + 4b   (D) 8ab   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 3a + 4b.
సజాతి పదాలు కలపాలి: 5a − 2a = 3a, 3b + b = 4b.

13. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండిస్తే, ఒక ఏకాంతర కోణం (alternate angle) 65° అయితే రెండోది?
(A) 25°   (B) 65°   (C) 115°   (D) 130°   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 65°.
సమాంతర రేఖల మధ్య ఏకాంతర కోణాలు సమానం.

14. మూడు బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడూ?
(A) సరి సంఖ్య   (B) బేసి సంఖ్య   (C) సున్న   (D) కొన్నిసార్లు సరి, కొన్నిసార్లు బేసి   [1 మార్కు]

జవాబు చూడండి
(B) బేసి సంఖ్య.
బేసి + బేసి = సరి; సరి + బేసి = బేసి. ఉదా: 3 + 5 + 7 = 15.

15. ఒక త్రిభుజంలో రెండు కోణాలు 40°, 75°. మూడో కోణం?
(A) 55°   (B) 65°   (C) 75°   (D) 85°   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 65°.
త్రిభుజ కోణాల మొత్తం 180°. 180 − (40 + 75) = 180 − 115 = 65°.

విభాగం B  —  రెండు మార్కుల ప్రశ్నలు (2 × 2 = 4)

16. 3,08,50,000 ను భారతీయ పద్ధతిలో, అంతర్జాతీయ పద్ధతిలో అక్షరాల్లో రాయండి.   [2 మార్కులు]

జవాబు చూడండి
భారతీయ పద్ధతి: 3,08,50,000 = మూడు కోట్ల ఎనిమిది లక్షల యాభై వేలు
అంతర్జాతీయ పద్ధతి: 30,850,000 = Thirty million eight hundred fifty thousand
అంతర్జాతీయ పద్ధతిలో కామాలు మూడు మూడు అంకెలకు ఒకటి.

17. విలువ కనుక్కోండి: 48 − 6 × 4 + 18 ÷ 3   [2 మార్కులు]

జవాబు చూడండి
పదాలు: 48, −6 × 4, +18 ÷ 3
ప్రతి పదం విలువ: 48, −24, +6
48 − 24 + 6 = 30

విభాగం C  —  నాలుగు మార్కుల ప్రశ్నలు (2 × 4 = 8)

18. రవి ఒక్కొక్కటి ₹35 చొప్పున 4 నోట్‌బుక్‌లు, ఒక్కొక్కటి ₹12 చొప్పున 3 పెన్నులు కొని దుకాణదారుకు ₹200 ఇచ్చాడు. i) మిగిలిన చిల్లరకు అంకగణిత సమాసం రాయండి. ii) విలువ కనుక్కోండి. iii) బ్రాకెట్ లేకుండా అదే సమాసం రాసి సరిచూడండి.   [4 మార్కులు]

జవాబు చూడండి
i) 200 − (4 × 35 + 3 × 12)
ii) 4 × 35 = 140, 3 × 12 = 36. 140 + 36 = 176. 200 − 176 = ₹24
iii) బ్రాకెట్ ముందు మైనస్ ఉంది కాబట్టి లోపలి ప్రతి పదానికి గుర్తు మారుతుంది: 200 − 4 × 35 − 3 × 12 = 200 − 140 − 36 = 24. రెండూ ఒకటే.

19. l, m సమాంతర రేఖలను t అనే తిర్యగ్రేఖ ఖండించింది. ఒక కోణం (2x + 10)°, దానికి సదృశ కోణం (corresponding angle) (3x − 20)°. x విలువ, ఆ కోణం, దానితో రేఖీయ ద్వయం ఏర్పరిచే కోణం కనుక్కోండి.   [4 మార్కులు]

జవాబు చూడండి
సమాంతర రేఖలకు సదృశ కోణాలు సమానం: 2x + 10 = 3x − 20
∴ 10 + 20 = 3x − 2x ∴ x = 30
కోణం = 2(30) + 10 = 70° (సరిచూడండి: 3(30) − 20 = 70°)
రేఖీయ ద్వయం మొత్తం 180°, కాబట్టి రెండో కోణం 180° − 70° = 110°

విభాగం D  —  ఎనిమిది మార్కుల ప్రశ్న (ఏదో ఒకటి)

20. A) ఒక పట్టణ జనాభా 12,45,680; పక్క పట్టణ జనాభా 9,87,450. i) రెండింటి మొత్తం జనాభా, తేడా కనుక్కోండి.   ii) మొత్తాన్ని దగ్గరి లక్షకు సవరించండి.   iii) మొత్తాన్ని అంతర్జాతీయ పద్ధతిలో కామాలతో రాసి, అక్షరాల్లో చదవండి.
(లేదా)
B) i) రాణి ఉదయం 2.75 km, సాయంత్రం 1.6 km నడిచింది. మొత్తం ఎంత? ఉదయం ఎంత ఎక్కువ?   ii) 3(2p + 5) − 4p + 7 ను సూక్ష్మీకరించి, p = 4 అయినప్పుడు విలువ కనుక్కోండి.   [8 మార్కులు]

జవాబు చూడండి
A) i) మొత్తం: 12,45,680 + 9,87,450 = 22,33,130. తేడా: 12,45,680 − 9,87,450 = 2,58,230
A) ii) లక్షల తర్వాత భాగం 33,130 < 50,000. కాబట్టి దగ్గరి లక్ష 22,00,000
A) iii) 2,233,130 = Two million two hundred thirty-three thousand one hundred thirty. (భారతీయంగా: ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల నూట ముప్పై.)
B) i) 2.75 + 1.60 = 4.35 km. 2.75 − 1.60 = 1.15 km ఎక్కువ.
B) ii) 3(2p + 5) = 6p + 15. 6p + 15 − 4p + 7 = 2p + 22
p = 4: 2(4) + 22 = 30. సరిచూడండి: 3(8 + 5) − 16 + 7 = 39 − 16 + 7 = 30.

మరో 7 ముఖ్యమైన ప్రశ్నలు — అధ్యాయానికి ఒకటి

అధ్యాయంప్రశ్నజవాబు
పెద్ద సంఖ్యలు — Large Numbers1 million లో ఎన్ని లక్షలు?1,000,000 = 10,00,000 = 10 లక్షలు.
అంకగణిత సమాసాలు — Arithmetic Expressions20 − (8 − 5), 20 − 8 − 5 — రెండూ సమానమా?20 − 3 = 17; 20 − 8 − 5 = 7. సమానం కాదు — బ్రాకెట్ ముందు మైనస్ గుర్తు ఉంటే లోపలి గుర్తులు మారతాయి: 20 − 8 + 5 = 17.
దశాంశాలు — A Peek Beyond the Point3.5 × 10 = ?దశాంశ బిందువు ఒక స్థానం కుడికి: 35.
బీజీయ సమాసాలు — Letter-Numbersభుజం s ఉన్న చతురస్రం చుట్టుకొలత; s = 6.5 cm అయితే?చుట్టుకొలత 4s = 4 × 6.5 = 26 cm.
కోణాలు — Parallel and Intersecting Linesరెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఒక కోణం 72°. మిగతా మూడు కోణాలు?శీర్షాభిముఖ కోణం 72°; రేఖీయ ద్వయ కోణాలు 180 − 72 = 108°, 108°.
సంఖ్యలతో ఆట — Number Play1 నుంచి 9 వరకు సంఖ్యలతో 3 × 3 మాయా చదరంలో మాయా మొత్తం?1 + 2 + … + 9 = 45. మూడు వరుసలు కాబట్టి 45 ÷ 3 = 15.
త్రిభుజాలు — Three Intersecting Lines3 cm, 4 cm, 8 cm భుజాలతో త్రిభుజం గీయగలమా?3 + 4 = 7 < 8. గీయలేం — చిన్న రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి.

7వ తరగతి SA1 గణితం ప్రశ్నపత్రం PDF

ప్రశ్నలు ఒక భాగంలో, జవాబులు చివర — ప్రింట్ తీసుకుని ఇంట్లో పరీక్షలా రాయండి: Download PDF — AP 7th Class SA1 Maths Practice Paper 2026-27

ఏడో తరగతి గణితంలో తరచూ జరిగే 6 పొరపాట్లు

  1. భారతీయ కామాలు: కుడి నుంచి మొదట మూడు అంకెలు, తర్వాత రెండేసి (3,08,50,000). అంతర్జాతీయంలో ప్రతి మూడు అంకెలకు (30,850,000). రెండు పద్ధతులు కలిపేయకండి.
  2. లక్ష, మిలియన్: 1 million = 10 లక్షలు; 10 million = 1 కోటి. 1 million = 1 లక్ష అనేది చాలా మంది రాసే తప్పు.
  3. పదం గుర్తు: 25 − 10 + 5 లో మైనస్ 10 కి మాత్రమే చెందుతుంది. ఎడమ నుంచి పదాలు విడదీసి కలపండి.
  4. బ్రాకెట్ ముందు మైనస్: 200 − (140 + 36) ను బ్రాకెట్ లేకుండా రాస్తే 200 − 140 − 36. బీజీయ సమాసాల్లోనూ ఇదే నియమం.
  5. దశాంశాల వరుస: 2.75 + 1.6 లో 1.6 ను 1.60 గా రాసి బిందువులు ఒకే వరుసలో పెట్టండి.
  6. కోణాల పేర్లు: సదృశ, ఏకాంతర కోణాలు సమానం అని కారణం రాయకుండా జవాబు మాత్రమే రాస్తే నాలుగు మార్కుల ప్రశ్నలో మార్కులు కోత పడతాయి.

దసరా సెలవుల్లో 7వ తరగతి గణితం — పది రోజుల ప్రణాళిక

తేదీఏం చదవాలి
12 అక్టోబర్Large Numbers: లక్ష, కోటి; భారతీయ, అంతర్జాతీయ కామాలు; అక్షరాల్లో రాయడం
13Large Numbers: సవరించడం (rounding), అంచనా, పెద్ద సంఖ్యల కూడిక, తీసివేత (20A లాంటివి)
14Arithmetic Expressions: పదాలు, విలువ కనుక్కోవడం, లెక్క చేయకుండా పోల్చడం
15Arithmetic Expressions: బ్రాకెట్లు, విభాగ న్యాయం, మాటల లెక్కలకు సమాసం రాయడం (18 లాంటివి)
16A Peek Beyond the Point: దశాంశ స్థాన విలువ, యూనిట్ మార్పిడి, కూడిక, తీసివేత
17Expressions using Letter-Numbers: సజాతి పదాలు, సూక్ష్మీకరణ, విలువ ప్రతిక్షేపణ
18Parallel and Intersecting Lines: రేఖీయ ద్వయం, శీర్షాభిముఖ, సదృశ, ఏకాంతర కోణాలు
19Number Play, త్రిభుజాలు: సరి – బేసి నియమాలు, మాయా చదరం, త్రిభుజ అసమానత, కోణాల మొత్తం
20ఈ పేజీలోని 20 ప్రశ్నల పేపర్ — సమయం పెట్టి 1 గం. 15 ని.
21తప్పులు సరిచేసుకోవడం; FA2 పేపర్, పై 7 అదనపు ప్రశ్నలు మళ్ళీ

గత పరీక్ష ప్రశ్నల కోసం AP 7th Class FA1 Maths Answer Key 2026 పేజీ ఉపయోగపడుతుంది.

FAQs

ఏడో తరగతి SA1 (Half Yearly) గణితం పరీక్ష ఎప్పుడు?

SCERT క్యాలెండర్ ప్రకారం SA1 పరీక్షలు 9 – 20 నవంబర్ 2026 మధ్య (Tentative). గణితం ఏ రోజో SCERT టైమ్ టేబుల్‌లో తెలుస్తుంది.

Class 7 Maths Half Yearly సిలబస్‌లో ఏ అధ్యాయాలు?

Large Numbers Around Us, Arithmetic Expressions, A Peek Beyond the Point, Expressions using Letter-Numbers, Parallel and Intersecting Lines, Number Play, A Tale of Three Intersecting Lines — Ganita Prakash నుంచి ఏడు.

పాత పుస్తకంలోని Integers, Simple Equations ఈ ఏడాది SA1 లో ఉంటాయా?

ఉండవు. 2026-27 లో ఏడో తరగతికి Ganita Prakash కొత్త పుస్తకం వచ్చింది. పై ఏడు అధ్యాయాలే SA1 సిలబస్.

FA2 పేపర్‌లో ఏ అధ్యాయాలకు ప్రశ్నలు రాలేదు?

Large Numbers Around Us, Arithmetic Expressions. ఇవి SA1 లో తప్పకుండా ఉంటాయి కాబట్టి సెలవుల్లో ముందుగా వీటిని చదవండి.

Integrated AI నుంచి ప్రశ్నలు వస్తాయా?

క్యాలెండర్‌లో అక్టోబర్ గణితం కింద Integrated AI ఉంది. రాత పరీక్షలో దానిపై ప్రశ్నలు ఉంటాయో SCERT SA1 ఉత్తర్వు వచ్చాకే తెలుస్తుంది.

7వ తరగతి SA1 పేపర్ ఎన్ని మార్కులకు?

అధికారిక మార్కుల నమూనా ఇంకా రాలేదు. ఈ ఏడాది FA పేపర్లు 35 మార్కులకు వచ్చాయి; ఈ సాధన పేపర్ అదే ఆకారంలో ఉంది.

ఇది అసలు SA1 ప్రశ్నపత్రమా?

కాదు. సిలబస్ ఆధారంగా మేము తయారు చేసిన సాధన పేపర్. అసలు పేపర్ జవాబులు పరీక్ష రోజు ఇదే పేజీలో పెడతాం.

లక్షకు, మిలియన్‌కు సంబంధం ఏమిటి?

1 million = 10 లక్షలు, 10 million = 1 కోటి, 1 billion = 100 కోట్లు.

అంకగణిత సమాసంలో “పదం” అంటే?

కూడిక, తీసివేత గుర్తులతో విడిపోయే భాగాలు. 12 − 5 × 2 + 8 లో పదాలు 12, −5 × 2, +8.

సదృశ కోణాలు, ఏకాంతర కోణాలు ఎప్పుడు సమానం?

రెండు రేఖలు సమాంతరంగా ఉండి, వాటిని ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు మాత్రమే.

సెలవుల్లో రోజుకు ఎంత సేపు గణితం చదవాలి?

కనీసం గంట. పై పది రోజుల పట్టికలో రోజుకు ఒక అంశం ఉంది; ఆ అంశంలో పుస్తకంలోని లెక్కలు, ఈ పేజీలోని ప్రశ్నలు చేయండి.

ఈ PDF ఫోన్‌లో తెరుచుకుంటుందా?

అవును. లింక్ నొక్కితే Google Docs నుంచి PDF డౌన్‌లోడ్ అవుతుంది; ఏ PDF రీడర్‌లోనైనా తెరవవచ్చు.

ఏడో తరగతి SA1 తెలుగు సాధన పేపర్: AP 7th Class SA1 Telugu Question Paper 2026-27

Official Sources

నెలవారీ పాఠాలు, SA1 తేదీలు: AP SCERT హైస్కూల్ అకడమిక్ క్యాలెండర్ 2026-27. అన్ని సబ్జెక్టుల SA1 పాఠాల జాబితా AP SA1 Syllabus 2026-27 – Class 6 to 10 పేజీలో ఉంది.