AP 7th Class SA1 Social Studies Question Paper 2026-27 (Essay 1) – Answer Key, జవాబులతో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

18 నవంబర్ 2026 SA1 Social Studies Answer Key (Key Paper) – పరీక్షలో వచ్చిన అసలు ప్రశ్నపత్రం, జవాబులు (7వ తరగతి, 80 మార్కులు)

ఏడో తరగతి SA1 సాంఘిక శాస్త్రం పరీక్ష (Exam Code 753, PS-12) 18 నవంబర్ 2026 న జరిగింది. 33 ప్రశ్నలు, 80 మార్కులు, 3 గంటలు: Section A 20 × 1, B 4 × 2, C 5 × 4, D 4 × 8. ప్రతి ప్రశ్న కిందే జవాబు ఉంది. Section D లో A, B రెండింటికీ, పటం ప్రశ్నకు రెండు జాబితాలకూ ఆనవాళ్లు ఇచ్చాము.

మీ మార్కులు లెక్కించుకోండి: ప్రతి జవాబు కింద ‘నా జవాబు సరైనదే’ టిక్ పెట్టండి. కింది బార్‌లో మీ మొత్తం మార్కుల అంచనా కనిపిస్తుంది.

18 నవంబర్ 2026 సాంఘిక శాస్త్రంతో SA1 ప్రధాన పరీక్షలు పూర్తయ్యాయి. 7వ తరగతి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ జవాబులు అన్నీ AP SA1 Key Papers 2026-27 పేజీలో ఉన్నాయి. తర్వాతి పరీక్ష FA3 (జనవరి 2027), దాని సాధన పేపర్లు త్వరలో ఇదే సైట్‌లో.

మన సాధన పత్రం నుంచి వచ్చినవి: ఈ పేజీ కింద ఉన్న సాధన పత్రంలోని అంశాలే అసలు పేపర్‌లో వచ్చాయి: శీతోష్ణస్థితిని నిర్ణయించే అంశాలు (సాధన 18 = పేపర్ 30 B), BEE స్టార్ లేబుల్ (సాధన 5 = పేపర్ 19), వాతావరణ పరికరాలు (సాధన 7 = పేపర్ 1), ఋతుపవనాలు (సాధన 10 = పేపర్ 2, 27), వాతావరణం – శీతోష్ణస్థితి తేడా (సాధన 16 = పేపర్ 32 A ప్రశ్న 4), మార్కెట్లు (సాధన 19, 20 = పేపర్ 24, 32 B).

Section A – బహుళైచ్ఛిక ప్రశ్నలు (20 × 1 = 20 మార్కులు)

1. Which instrument is used to measure wind direction and speed? / గాలి దిశ మరియు వేగాన్ని కొలిచే పరికరం ఏది?

A) Hygrometer / హైగ్రోమీటర్B) Barometer / బారోమీటర్C) Thermometer / థర్మామీటర్D) Anemometer / ఎనిమోమీటర్ (సరైన జవాబు)ఎనిమోమీటర్ గాలి వేగాన్ని కొలుస్తుంది; దానితో పాటు ఉండే వాతావరణ సూచిక (wind vane) గాలి దిశను చూపుతుంది. ఇచ్చిన ఎంపికల్లో గాలికి సంబంధించిన పరికరం ఇదొక్కటే. హైగ్రోమీటర్ తేమ, బారోమీటర్ వాయు పీడనం, థర్మామీటర్ ఉష్ణోగ్రత కొలుస్తాయి.

2. In Indian subcontinent the western slopes receive heavy rainfall mainly because of ____ / భారత ఉపఖండంలో పశ్చిమ వాలు ప్రాంతాలు ఎక్కువ వర్షపాతం పొందడానికి ప్రధాన కారణం

A) Perennial rivers / శాశ్వత నదులుB) Monsoon winds / ఋతుపవనాలు (సరైన జవాబు)C) Nearness to the equator / భూమధ్యరేఖకు సామీప్యతD) Proximity of the Bay of Bengal / బంగాళాఖాతానికి సామీప్యతఅరేబియా సముద్రం నుంచి వచ్చే నైరుతి ఋతుపవనాలు పశ్చిమ కనుమలను ఢీకొని పైకి లేచి, చల్లబడి పశ్చిమ వాలుల మీద భారీ వర్షం కురిపిస్తాయి.

3. In the Varna system, which group was mainly associated with the performance of rituals? / వర్ణ వ్యవస్థలో ఆచారాలను నిర్వహించడంతో ప్రధానంగా సంబంధం ఉన్న వర్గం ఏది?

A) Kshatriyas / క్షత్రియులుB) Vaishyas / వైశ్యులుC) Brahmins / బ్రాహ్మణులు (సరైన జవాబు)D) Shudras / శూద్రులుబ్రాహ్మణులు యజ్ఞాలు, ఆచారాలు, బోధన; క్షత్రియులు పాలన, యుద్ధం; వైశ్యులు వ్యవసాయం, వ్యాపారం; శూద్రులు సేవా పనులు.

4. Which metal was first used to make punch-marked coins in India? / భారతదేశంలోని పంచ్-మార్క్డ్ నాణేలను తయారు చేయడానికి మొదట ఏ లోహాన్ని ఉపయోగించారు?

A) Gold / బంగారంB) Copper / రాగిC) Bronze / కంచుD) Silver / వెండి (సరైన జవాబు)మహాజనపదాల కాలంలో (క్రీ.పూ. 6వ శతాబ్దం ప్రాంతం) మొదటి పంచ్ మార్క్ నాణేలు ఎక్కువగా వెండితో చేశారు; వాటిపై సూర్యుడు, చెట్టు, జంతువుల గుర్తులు ముద్రించారు.

5. Assertion (A): The rapid increase in greenhouse gases causes global warming and leads to climate change. Reason (R): Human activities such as industry, transportation and agriculture have sharply increased greenhouse gas emissions.

A) Both are true, R correctly explains A / రెండూ సరైనవి, R అనేది A కు సరైన వివరణ (సరైన జవాబు)B) Both are true, R doesn’t explain AC) A is true, R is falseD) A is false, R is trueపరిశ్రమలు, వాహనాలు, వ్యవసాయం వల్ల కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ వంటి హరితగృహ వాయువులు పెరిగాయి. అవి వేడిని బంధించి భూతాపం పెంచుతున్నాయి. కాబట్టి R అనేది A కు కారణం.

6. People near the coast suddenly observe strong winds blowing rapidly towards the ocean. What does this indicate about the air pressure over the ocean compared with the land? / భూమితో పోలిస్తే సముద్రంపై గాలి పీడనం గురించి ఇది ఏమి సూచిస్తుంది?

A) Low pressure / అల్ప పీడనం (సరైన జవాబు)B) High pressure / అధిక పీడనంC) Huge run-off waterD) Glacial burstగాలి ఎప్పుడూ అధిక పీడనం నుంచి అల్ప పీడనం వైపు వీస్తుంది. గాలి సముద్రం వైపు వేగంగా వీస్తోంది అంటే సముద్రంపై అల్ప పీడనం ఏర్పడింది (తుఫాను ముందు ఇలా జరుగుతుంది).

7. Who among the following was the first to come to India as a conqueror from a foreign land? / కింది వారిలో భారతదేశాన్ని జయించడానికి విదేశం నుండి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు?

A) Vasco da Gama / వాస్కోడగామాB) Amir Khusrau / అమీర్ ఖుస్రూC) Alexander / అలెగ్జాండర్ (సరైన జవాబు)D) Hiuen Tsang / హ్యూయెన్ త్సాంగ్మాసిడోనియా రాజు అలెగ్జాండర్ క్రీ.పూ. 327 – 326 లో వాయవ్య భారతంపై దండెత్తాడు. వాస్కోడగామా వ్యాపారి-నావికుడు, హ్యూయెన్ త్సాంగ్ యాత్రికుడు, అమీర్ ఖుస్రూ కవి.

8. Udayagiri and Khandagiri caves near Bhubaneswar are mainly associated with which ruler and religious tradition? / ఉదయగిరి, ఖండగిరి గుహలు ఏ పాలకుడు, మత సంప్రదాయానికి సంబంధించినవి?

A) Ashoka – Buddhism / అశోకుడు – బౌద్ధమతంB) Kharavela – Jainism / ఖారవేలుడు – జైనమతం (సరైన జవాబు)C) Chandragupta Maurya – JainismD) Harsha – Hinduismకళింగ రాజు ఖారవేలుడు జైన మునుల కోసం ఈ గుహలు తొలిపించాడు. ఉదయగిరిలోని హాథీగుంఫా శాసనం అతని పాలన గురించి చెబుతుంది.

9. India provided a universal adult franchise. This means ____ / భారతదేశం సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. అనగా

A) Only educated citizens could voteB) Only men could voteC) Every citizen could vote regardless of ageD) All adults could vote to choose their representatives / వయోజనులందరూ తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటు వేయవచ్చు (సరైన జవాబు)18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి కులం, మతం, లింగం, చదువు, ఆస్తి తేడా లేకుండా ఓటు హక్కు ఉంది. వయసు పరిమితి (18) ఉంది కాబట్టి C తప్పు.

10. The symbol (two hands holding a balance scale) represents which fundamental principle of democracy? / ఈ చిహ్నం ప్రజాస్వామ్యం యొక్క ఏ ప్రాథమిక సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది?

A) Freedom of speech / వాక్ స్వాతంత్ర్యంB) Equality before law / చట్టం ముందు సమానత్వం (సరైన జవాబు)C) Fundamental rights / ప్రాథమిక హక్కులుD) Universal adult franchiseత్రాసు (తక్కెడ) న్యాయానికి, సమానత్వానికి గుర్తు. రెండు పళ్లేలు సమానంగా ఉండటం అంటే చట్టం అందరినీ ఒకేలా చూస్తుంది.

11. Raju exchanges 4 bags of paddy for an ox. Padma exchanges 10 bags of paddy for silver coins. Who faces the problem of portability? / పోర్టబిలిటీ (తరలింపు) సమస్యను ఎవరు ఎదుర్కొంటారు?

A) Both / ఇద్దరూB) Raju only / రాజు మాత్రమే (సరైన జవాబు)C) Padma only / పద్మ మాత్రమేD) Neither of them / ఇద్దరూ కాదురాజు వస్తు మార్పిడి (barter) చేస్తున్నాడు: బరువైన ధాన్యం బస్తాలు, ఎద్దు వంటి వస్తువులను మోసుకెళ్లడం కష్టం. పద్మ డబ్బు (వెండి నాణేలు) తీసుకుంది; నాణేలు తేలికగా, సులభంగా మోసుకెళ్లవచ్చు.

12. Which of the following are causes for regions of an empire trying to become independent? a) The weak administration of the emperor b) Increasing pressure to pay higher tribute c) The opportunity to stop paying tribute / సామ్రాజ్యంలోని ప్రాంతాలు స్వతంత్రంగా మారడం కోసం ప్రయత్నించడానికి గల కారణాలు ఏవి?

A) a only / a మాత్రమేB) a and bC) a and cD) a, b and c / a, b మరియు c (సరైన జవాబు)చక్రవర్తి పాలన బలహీనపడినప్పుడు, ఎక్కువ కప్పం కట్టమని ఒత్తిడి పెరిగినప్పుడు, కప్పం ఆపే అవకాశం దొరికినప్పుడు సామంతులు, ప్రాంతాలు స్వతంత్రం ప్రకటించుకుంటాయి. మూడూ కారణాలే.

13. If Ravi wants to visit islands in the Arabian Sea, identify the group of islands he will visit. / రవి అరేబియా సముద్రంలో ఉన్న దీవులను సందర్శించాలనుకుంటే, అతను వెళ్లబోయే దీవుల సమూహాన్ని గుర్తించండి.

A) Lakshadweep / లక్షద్వీప్ (సరైన జవాబు)B) Andaman and Nicobar / అండమాన్ & నికోబార్C) Sri Lanka / శ్రీలంకD) Sumatra / సుమత్రాలక్షద్వీప్ దీవులు కేరళ తీరానికి పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న పగడపు దీవులు. అండమాన్ – నికోబార్ బంగాళాఖాతంలో ఉన్నాయి.

14. Which of the following statements describes an empire? / కింది వాక్యాలలో ఏది సామ్రాజ్యాన్ని వివరిస్తుంది?

A) It is ruled by a Feudal kingB) It is smaller than a kingdomC) It is a collection of smaller kingdoms / ఇది చిన్న రాజ్యాల సమాహారం (సరైన జవాబు)D) It pays tribute to other kingdomsసామ్రాజ్యం అంటే ఒక చక్రవర్తి కింద అనేక రాజ్యాలు, ప్రాంతాలు కలిసిన పెద్ద రాజ్యం. చిన్న రాజ్యాలే చక్రవర్తికి కప్పం కడతాయి, సామ్రాజ్యం కాదు.

15. A temple near a river receives thousands of visitors daily. Waste from shops and devotees affects the river. Which action best shows responsible behaviour? / కింది ఏ చర్య బాధ్యతాయుతమైన ప్రవర్తనను ఉత్తమంగా చూపుతుంది?

A) Continuing daily activities without changing practicesB) Waiting for the river to clean itself naturallyC) Setting up dustbins, awareness boards and cleaning groups / చెత్త కుండీలు, అవగాహన బోర్డులు, క్లీనింగ్ గ్రూపుల ఏర్పాటు (సరైన జవాబు)D) Closing the temple to prevent visitors

16. Which is not a form of digital money? / కింది వాటిలో డబ్బు యొక్క డిజిటల్ రూపం కానిది ఏది?

A) Credit cards / క్రెడిట్ కార్డులుB) Cheques / చెక్కులు (సరైన జవాబు)C) Debit cards / డెబిట్ కార్డులుD) UPI payments / UPI చెల్లింపులుచెక్కు కాగితం మీద రాసి బ్యాంకుకు ఇచ్చే ఆదేశం. కార్డులు, UPI ఎలక్ట్రానిక్ (డిజిటల్) చెల్లింపులు.

17. Where was a meteorological centre set up by IMD in Andhra Pradesh? / ఆంధ్రప్రదేశ్‌లో IMD ద్వారా వాతావరణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది?

A) Hyderabad / హైదరాబాద్B) Visakhapatnam / విశాఖపట్నంC) Vijayawada / విజయవాడD) Amaravathi / అమరావతి (సరైన జవాబు)భారత వాతావరణ విభాగం (IMD) రాష్ట్ర స్థాయి వాతావరణ కేంద్రం (Meteorological Centre) అమరావతిలో ఉంది. విశాఖపట్నంలో తుఫాను హెచ్చరికల కేంద్రం (Cyclone Warning Centre) ఉంది; హైదరాబాద్ తెలంగాణలో ఉంది.

18. Which country is an example of a theocracy? / మత రాజ్యానికి ఉదాహరణగా ఉన్న దేశం ఏది?

A) Vatican City / వాటికన్ సిటీ (సరైన జవాబు)B) United Kingdom / యునైటెడ్ కింగ్‌డమ్C) North Korea / ఉత్తర కొరియాD) South Korea / దక్షిణ కొరియావాటికన్ సిటీని క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ పాలిస్తారు: మత నాయకుడే పాలకుడు. UK రాజ్యాంగబద్ధ రాచరికం, ఉత్తర కొరియా నియంతృత్వం, దక్షిణ కొరియా ప్రజాస్వామ్యం.

19. Which government agency’s energy-efficiency label should you check when your family buys a Television? / మీ కుటుంబం టీవీ కొనుగోలు చేసేటప్పుడు ఏ ప్రభుత్వ సంస్థకు చెందిన ఇంధన సామర్థ్య లేబుల్‌ను పరిశీలించాలి?

A) ISI MarkB) AGMARKC) BEE STAR Rating (సరైన జవాబు)D) FSSAIBEE (Bureau of Energy Efficiency) స్టార్ లేబుల్ విద్యుత్ ఉపకరణాలు ఎంత కరెంటు ఆదా చేస్తాయో చూపుతుంది; ఎక్కువ స్టార్లు అంటే తక్కువ విద్యుత్ వినియోగం. (పేపర్‌లో ‘air Television’ అని ముద్రణ దోషం ఉంది.)

20. Which Mahajanapada became the foundation of India’s first empire? / భారతదేశపు మొట్టమొదటి సామ్రాజ్యానికి ఏ మహాజనపదం పునాదిగా నిలిచింది?

A) Magadha / మగధ (సరైన జవాబు)B) Avanti / అవంతిC) Kosala / కోసలD) Vajji / వజ్జిమగధ (నేటి బీహార్) సారవంతమైన నేల, ఇనుప గనులు, ఏనుగులు, నదుల రక్షణ వల్ల బలపడింది. తర్వాత మౌర్య సామ్రాజ్యం మగధ నుంచే ఏర్పడింది.

Section B (4 × 2 = 8 మార్కులు)

21. Why do mountain climbers sometimes need supplemental oxygen? Give two reasons. / పర్వతాలను అధిరోహించే వ్యక్తులకు కొన్నిసార్లు ఆక్సిజన్ అదనంగా ఎందుకు అవసరమో రెండు కారణాలు రాయండి. [2 మార్కులు]

జవాబు

1) ఎత్తుకు వెళ్లేకొద్దీ వాయు పీడనం తగ్గుతుంది; గాలి పలుచబడుతుంది (thin air).
2) అందువల్ల ప్రతి శ్వాసలో ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. దాంతో ఆయాసం, తలనొప్పి, తల తిరగడం (ఎత్తు వ్యాధి) వస్తాయి. అందుకే ఎవరెస్ట్ వంటి ఎత్తైన శిఖరాలు ఎక్కేవారు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్తారు.

22. Write any two limitations of the barter system. / వస్తు మార్పిడి విధానం యొక్క ఏవైనా రెండు పరిమితులను రాయండి. [2 మార్కులు]

జవాబు

1) అవసరాల ద్వంద్వ సమన్వయం లేకపోవడం (Lack of double coincidence of wants): నాకు కావలసిన వస్తువు ఉన్న వ్యక్తికి నా దగ్గరి వస్తువే కావాలి; అలాంటి వ్యక్తి దొరకడం కష్టం.
2) విలువను కొలిచే ఉమ్మడి ప్రమాణం లేకపోవడం: ఒక ఎద్దుకు ఎన్ని బస్తాల ధాన్యం అని నిర్ణయించడం కష్టం.
(ఇంకా: పెద్ద వస్తువులను విభజించలేము, ఎక్కువ కాలం నిల్వ చేయలేము, దూరం మోసుకెళ్లడం కష్టం.)

23. How were rulers chosen in early Vedic society? / తొలి వేదకాలపు సమాజంలో పాలకులను ఎలా ఎన్నుకునేవారు? [2 మార్కులు]

జవాబు

తొలి వేద కాలంలో ప్రజలు జనాలు (తెగలు)గా జీవించేవారు. జనానికి నాయకుడు రాజన్ (రాజు).
1) రాజును సభ, సమితి అనే ప్రజా సభలు ధైర్యం, యుద్ధ నైపుణ్యం, సామర్థ్యం చూసి ఎన్నుకునేవి లేదా ఆమోదించేవి.
2) రాజు ఈ సభలను సంప్రదించి నిర్ణయాలు తీసుకునేవాడు. కాలక్రమేణా ఈ పదవి వంశపారంపర్యంగా (తండ్రి నుంచి కొడుకుకు) మారింది.

24. Write any four features of a market. / మార్కెట్ యొక్క ఏవైనా నాలుగు లక్షణాలు రాయండి. [2 మార్కులు]

జవాబు

1) కొనుగోలుదారులు, అమ్మకందారులు ఉంటారు.
2) వస్తువులు లేదా సేవల మార్పిడి (కొనుగోలు, అమ్మకం) జరుగుతుంది, సాధారణంగా డబ్బు ద్వారా.
3) ప్రతి వస్తువుకు ఒక ధర ఉంటుంది; అది డిమాండ్, సప్లై మీద ఆధారపడి మారుతుంది.
4) మార్కెట్ ఒక ప్రదేశంలో (వారపు సంత, దుకాణం, మాల్) లేదా ఆన్‌లైన్‌లో ఉండవచ్చు; అమ్మకందారుల మధ్య పోటీ ఉంటుంది.

Section C (5 × 4 = 20 మార్కులు)

25. Write a note on the Sangam age. / సంగమ యుగం గురించి ఒక వ్యాసం రాయండి. [4 మార్కులు]

జవాబు

1) కాలం, పేరు: సుమారు క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 3వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశ (తమిళ ప్రాంతం) చరిత్ర కాలం. ‘సంగమం’ అంటే కవుల సభ; మదురైలో జరిగిన కవుల సభల్లో రచించిన తమిళ కవిత్వాన్ని సంగమ సాహిత్యం అంటారు.
2) రాజ్యాలు: చోళులు (కావేరి డెల్టా, ఉరైయూర్, పుహార్), చేరులు (కేరళ, వంజి), పాండ్యులు (మదురై) అనే మూడు రాజవంశాలు (మూవేందర్) పాలించాయి. చోళ రాజు కరికాలుడు కావేరిపై కల్లణై ఆనకట్ట కట్టించాడు.
3) సాహిత్యం: తొల్కాప్పియం (వ్యాకరణం), ఎట్టుత్తొగై, పత్తుప్పాట్టు; ప్రేమ (అకం), యుద్ధం, రాజులు (పురం) గురించి కవితలు. ఇవే ఆ కాలపు జీవితానికి ముఖ్య ఆధారాలు.
4) వ్యాపారం: ముజిరిస్, పుహార్ (కావేరిపట్టణం), కొర్కై రేవుల నుంచి రోమ్‌తో మిరియాలు, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాల వ్యాపారం; తమిళనాడులో రోమన్ నాణేలు దొరికాయి. వ్యవసాయం, పశుపోషణ, చేనేత ప్రధాన వృత్తులు.

26. Which type of government does India have? Give any three reasons why it’s called that. / భారతదేశంలో ఏ రకమైన ప్రభుత్వం ఉంది? దానిని అలా ఎందుకు అంటారో మూడు కారణాలు రాయండి. [4 మార్కులు]

జవాబు

భారతదేశంలో ప్రజాస్వామ్య (పార్లమెంటరీ) ప్రభుత్వం ఉంది; భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం.
1) ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు: 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు (సార్వత్రిక వయోజన ఓటు హక్కు); నిర్ణీత కాలానికి (5 ఏళ్లకు ఒకసారి) స్వేచ్ఛాయుత ఎన్నికలు.
2) ఎన్నికైన ప్రతినిధులు పాలిస్తారు: పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, ప్రభుత్వం (ప్రధానమంత్రి, మంత్రిమండలి) పార్లమెంట్‌కు జవాబుదారీ. దేశాధినేత (రాష్ట్రపతి) కూడా ఎన్నికైనవారే, వంశపారంపర్య రాజు కాదు (గణతంత్రం).
3) రాజ్యాంగం, చట్టబద్ధ పాలన: రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వం, ప్రాథమిక హక్కులు ఇస్తుంది; స్వతంత్ర న్యాయవ్యవస్థ వాటిని కాపాడుతుంది.

27. Observe the picture (map with arrows blowing from the Indian Ocean towards India) and give answers. 1. Which monsoon winds are shown? 2. Name the peninsular country shown in the above map. 3. Which ocean influences these winds? 4. From which direction do monsoon winds enter India? [4 మార్కులు]

జవాబు

1) నైరుతి ఋతుపవనాలు (South-West monsoon winds).
2) భారతదేశం (India).
3) హిందూ మహాసముద్రం (Indian Ocean); దాని రెండు శాఖలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం.
4) నైరుతి దిశ (South-West) నుంచి; జూన్ మొదట్లో కేరళ తీరం ద్వారా ప్రవేశిస్తాయి.

28. How has money as a medium of exchange transformed over time? / కాలక్రమేణా వినిమయ మాధ్యమంగా డబ్బు ఎలా రూపాంతరం చెందింది? [4 మార్కులు]

జవాబు

1) వస్తు మార్పిడి: మొదట ప్రజలు వస్తువుకు వస్తువు మార్చుకునేవారు (ధాన్యానికి బట్ట). అవసరాలు కలవకపోవడం వంటి సమస్యలు వచ్చాయి.
2) వస్తు రూప డబ్బు: పశువులు, ధాన్యం, ఉప్పు, గవ్వలు డబ్బుగా వాడారు.
3) లోహ నాణేలు: మహాజనపదాల కాలంలో వెండి పంచ్ మార్క్ నాణేలు; తర్వాత రాజుల బొమ్మలతో బంగారు, రాగి నాణేలు.
4) కాగితపు డబ్బు: కరెన్సీ నోట్లు; నేడు భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ (RBI) జారీ చేస్తుంది.
5) డిజిటల్ డబ్బు: డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, UPI. ప్రతి మార్పుతో డబ్బు మోసుకెళ్లడం, లెక్కించడం, దాచుకోవడం మరింత సులభమైంది.

29. Why was the development of iron metallurgy so important for the growth of urbanism in the 1st millennium BCE? / క్రీ.పూ. మొదటి సహస్రాబ్దిలో పట్టణీకరణ పెరుగుదలకు ఇనుము లోహశాస్త్ర అభివృద్ధి ఎందుకు ముఖ్యమైంది? [4 మార్కులు]

జవాబు

1) అడవుల నరికివేత: ఇనుప గొడ్డళ్లతో గంగా మైదానంలోని దట్టమైన అడవులను నరికి కొత్త భూమిని సాగులోకి తెచ్చారు.
2) ఎక్కువ పంట: ఇనుప నాగలి కర్రులు (ploughshares) గట్టి నేలను లోతుగా దున్నాయి; మిగులు ధాన్యం (surplus) పెరిగి, పొలంలో పని చేయని వారికి (చేతివృత్తుల వారు, వ్యాపారులు, అధికారులు) ఆహారం దొరికింది. అలా పట్టణాలు పెరిగాయి.
3) చేతివృత్తులు, వ్యాపారం: ఇనుప పనిముట్లతో కమ్మరి, వడ్రంగి వంటి వృత్తులు పెరిగాయి; వ్యాపారం, నాణేల వాడకం పెరిగాయి.
4) బలమైన రాజ్యాలు: ఇనుప ఆయుధాలతో రాజులు పెద్ద సైన్యాలు నిర్వహించి జనపదాలు, మహాజనపదాలు, నగరాలను (రాజగృహ, కౌశాంబి, ఉజ్జయిని) స్థాపించారు. దీనినే రెండో పట్టణీకరణ అంటారు.

Section D (4 × 8 = 32 మార్కులు)

30 నుంచి 32 ప్రశ్నల్లో A లేదా B ఒక్కటే రాయాలి. పోల్చుకోవడానికి రెండింటికీ జవాబులు ఇచ్చాం. 33వ ప్రశ్నలో A లేదా B జాబితాల్లో ఒకటి.

30. A) Write any four important geographical features of India and their importance. (Or) B) Explain any four factors that determine the climate of a region. [8 మార్కులు]

జవాబు

A) భారతదేశ భౌగోళిక లక్షణాలు, వాటి ప్రాముఖ్యత:

లక్షణంప్రాముఖ్యత
1) హిమాలయాలుఉత్తరాన ఎత్తైన పర్వతాలు; మధ్య ఆసియా చల్లని గాలులను అడ్డుకుంటాయి, ఋతుపవనాలను ఆపి వర్షం కురిపిస్తాయి; గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులకు జన్మస్థానం; సహజ రక్షణ గోడ
2) ఉత్తర మైదానాలు (గంగా మైదానం)నదులు తెచ్చిన ఒండ్రు మట్టితో సారవంతం; వ్యవసాయం ఎక్కువ, జనసాంద్రత ఎక్కువ; ఇక్కడే పురాతన నగరాలు, రాజ్యాలు ఏర్పడ్డాయి
3) ద్వీపకల్ప పీఠభూమిపురాతన శిలలతో ఏర్పడిన ఎత్తైన భూభాగం; బొగ్గు, ఇనుము వంటి ఖనిజాలు ఎక్కువ; నల్ల రేగడి నేలలు పత్తి సాగుకు అనుకూలం
4) థార్ ఎడారిరాజస్థాన్‌లో పొడి, ఇసుక ప్రాంతం; సౌర, పవన శక్తికి అనుకూలం; ఒంటెలు, ప్రత్యేక సంస్కృతి
5) తీర మైదానాలు, దీవులుపశ్చిమ, తూర్పు తీరాలు: రేవులు, చేపల వేట, వ్యాపారం; లక్షద్వీప్, అండమాన్ – నికోబార్ దీవులు: రక్షణ, పర్యాటకం

(ఏవైనా నాలుగు రాస్తే చాలు.)

B) ఒక ప్రాంతపు శీతోష్ణస్థితిని నిర్ణయించే అంశాలు:
1) అక్షాంశం (భూమధ్యరేఖ నుంచి దూరం): భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు వేడిగా, దూరంగా ఉన్నవి చల్లగా ఉంటాయి. ఉదా: కేరళ ఏడాదంతా వెచ్చగా, కాశ్మీర్ చల్లగా.
2) ఎత్తు: ఎత్తు పెరిగేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఉదా: మైదానంలో ఉన్న ఢిల్లీ కంటే కొండపై ఉన్న సిమ్లా, ఊటీ చల్లగా ఉంటాయి.
3) సముద్రం నుంచి దూరం: తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం వల్ల వేసవి, శీతాకాలాల మధ్య తేడా తక్కువ (సమశీతోష్ణం); లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ (విపరీత శీతోష్ణం). ఉదా: ముంబై, నాగపూర్.
4) గాలులు (ఋతుపవనాలు): సముద్రం నుంచి వచ్చే తేమ గాలులు వర్షం తెస్తాయి; భారతదేశ శీతోష్ణస్థితిని నైరుతి, ఈశాన్య ఋతుపవనాలే నిర్ణయిస్తాయి.
5) భూస్వరూపం (పర్వతాలు): పర్వతాల గాలి వీచే వైపు ఎక్కువ వర్షం, అవతలి వైపు (వర్షచ్ఛాయ ప్రాంతం) తక్కువ వర్షం. ఉదా: పశ్చిమ కనుమల పశ్చిమ వాలు, తూర్పు వైపు దక్కన్.

31. A) What were some of Kautilya’s key ideas? Which ones of these can you observe even today in the world around us? (Or) B) How do sacred places influence the culture and traditions of the people living near them? [8 మార్కులు]

జవాబు

A) కౌటిల్యుడి (చాణక్యుడు) ముఖ్య ఆలోచనలు: చంద్రగుప్త మౌర్యుని గురువు, మంత్రి; ‘అర్థశాస్త్రం’ రచించాడు.
1) రాజ్యానికి ఏడు అంగాలు (సప్తాంగ సిద్ధాంతం): రాజు (స్వామి), మంత్రులు (అమాత్య), ప్రజలు, భూభాగం (జనపద), కోట (దుర్గ), కోశాగారం (కోశ), సైన్యం (దండ), మిత్రులు.
2) ప్రజా సంక్షేమం: ‘ప్రజల సుఖమే రాజు సుఖం’; రాజు ప్రజల మేలు కోసం పనిచేయాలి.
3) సక్రమ పరిపాలన, పన్నులు: అధికారుల వ్యవస్థ, న్యాయమైన పన్నులు, కొలతలు-తూనికల తనిఖీ, వ్యాపారుల మోసాలకు శిక్ష.
4) గూఢచారులు, దౌత్యం: దేశ రక్షణకు గూఢచార వ్యవస్థ; ఇతర రాజ్యాలతో స్నేహం, ఒప్పందాలు (మండల సిద్ధాంతం).
నేటికీ కనిపించేవి: మంత్రిమండలి, అధికార యంత్రాంగం; ప్రభుత్వం పన్నులు వసూలు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం; నిఘా సంస్థలు (గూఢచార విభాగాలు); ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు; తూనికలు-కొలతల శాఖ, వినియోగదారుల రక్షణ; చట్టం ముందు అందరికీ శిక్ష.

B) పవిత్ర స్థలాల ప్రభావం:
1) పండుగలు, జాతరలు: తిరుమల బ్రహ్మోత్సవాలు, కుంభమేళా, పుష్కరాలు వంటి ఉత్సవాలు స్థానిక ప్రజల జీవితంలో భాగమవుతాయి.
2) ఆచారాలు, ఆహారం: పూజలు, ఉపవాసాలు, ప్రసాదాలు, శాకాహారం వంటి సంప్రదాయాలు అక్కడి ప్రజలు పాటిస్తారు.
3) కళలు: ఆలయ శిల్పం, సంగీతం, నృత్యం (కూచిపూడి, భరతనాట్యం), హస్తకళలు అభివృద్ధి చెందాయి.
4) ప్రకృతి రక్షణ: పవిత్ర వనాలు (sacred groves), నదులు, కొండలను ప్రజలు పూజించి కాపాడతారు.
5) ఆర్థిక జీవనం: యాత్రికుల వల్ల దుకాణాలు, హోటళ్లు, రవాణా, పూలు-ప్రసాదాల అమ్మకంతో ఉపాధి.
6) ఐక్యత: దేశం నలుమూలల నుంచి యాత్రికులు వచ్చి కలవడం వల్ల భాషలు, సంస్కృతులు కలుస్తాయి; దేశ ఐక్యత పెరుగుతుంది (చార్ ధామ్, జ్యోతిర్లింగాలు).

32. A) Read the paragraph (Air is a layer of gases surrounding the Earth. The layer closest to the Earth’s surface is the troposphere, where all land-based plants and animals live and breathe and almost all weather phenomena take place. It extends 6 to 18 km from the ground; it is less thick at the poles and thicker in the tropical zone. Words like hot, cold, rainy, cloudy, humid, snowy and windy describe the elements of weather) and answer: 1. What is the first layer of the atmosphere? 2. Where is the troposphere thinner? 3. In which layer can all living beings survive? 4. Do the words like hot, cold, rainy, etc. describe weather or climate? (Or) B) Read (A family bargains with a cart seller for beans from ₹30 to ₹25 per kg; he refuses; they buy beans neatly packed in a plastic bag at a super bazaar for ₹40 per kg) and answer: 1. Which type of market did the family first visit to buy vegetables? 2. Are the prices fixed in the first shop? Give reasons. 3. What are the reasons the family chose to buy vegetables in the super bazaar? 4. What factors influence buying and selling that are not directly connected to price? [8 మార్కులు]

జవాబు

A)
1) ట్రోపోస్ఫియర్ (Troposphere) – భూమికి దగ్గరగా ఉన్న మొదటి పొర.
2) ధ్రువాల వద్ద (at the poles) పలుచగా (సుమారు 6 కి.మీ.), ఉష్ణమండల ప్రాంతంలో మందంగా (సుమారు 18 కి.మీ.) ఉంటుంది.
3) ట్రోపోస్ఫియర్లోనే జీవులన్నీ జీవించగలవు, శ్వాసించగలవు.
4) అవి వాతావరణాన్ని (weather) వివరిస్తాయి. ఒక రోజు లేదా కొద్ది కాలపు గాలి స్థితి వాతావరణం; చాలా ఏళ్ల సగటు స్థితి శీతోష్ణస్థితి (climate).

B)
1) వీధి వ్యాపారి (బండి) మార్కెట్ – street vendor / తోపుడు బండి మీద అమ్మే చిన్న వ్యాపారి.
2) లేదు, ధరలు స్థిరంగా లేవు. ఆ మహిళ ₹30 నుంచి ₹25 కి తగ్గించమని బేరమాడగలిగింది; అమ్మకందారు తన నష్టం చూసుకుని ధర నిర్ణయిస్తాడు. వీధి మార్కెట్లలో బేరసారాలు సాధారణం.
3) సూపర్ బజార్‌లో కూరగాయలు శుభ్రంగా ప్యాక్ చేసి ఉన్నాయి; ధరలు స్థిరం (బేరం అవసరం లేదు); ఒకే చోట అనేక రకాలు దొరుకుతాయి; సౌకర్యం, శుభ్రత.
4) ప్యాకింగ్, నాణ్యత, శుభ్రత, సౌకర్యం, దుకాణ వాతావరణం, బ్రాండ్, మంచి సేవ, దుకాణం ఉన్న ప్రదేశం, అమ్మకందారుపై నమ్మకం.

33. A) Locate and label the following places on the India map: 1) Punjab 2) Aravalli Hills 3) Uttar Pradesh 4) Cold Desert (Or) B) 5) Arunachal Pradesh 6) Narmada River 7) Bihar 8) Himalayas. [8 మార్కులు]

జవాబు

ప్రదేశంపటంలో ఎక్కడ
1) పంజాబ్వాయవ్య భారతంలో; పాకిస్తాన్ సరిహద్దులో, జమ్మూ కాశ్మీర్‌కు దక్షిణాన, హర్యానా, రాజస్థాన్‌కు ఉత్తరాన
2) ఆరావళి పర్వతాలురాజస్థాన్‌లో నైరుతి నుంచి ఈశాన్యం వైపు (గుజరాత్ దగ్గర నుంచి ఢిల్లీ వరకు) సాగే వాలు రేఖ; థార్ ఎడారికి తూర్పు అంచు (పర్వత గుర్తు ^^^ తో చూపండి)
3) ఉత్తర ప్రదేశ్గంగా మైదానంలో; నేపాల్‌కు దక్షిణాన, ఢిల్లీ, హర్యానాకు తూర్పున, బీహార్‌కు పశ్చిమాన; మధ్యప్రదేశ్‌కు ఉత్తరాన
4) శీతల ఎడారిదేశానికి ఉత్తర కొనలో లడఖ్ ప్రాంతం (జమ్మూ కాశ్మీర్‌కు తూర్పున, హిమాలయాల వెనుక)
5) అరుణాచల్ ప్రదేశ్దేశానికి ఈశాన్య కొనలో; అస్సాంకు ఉత్తరాన, చైనా (టిబెట్), భూటాన్, మయన్మార్ సరిహద్దుల్లో
6) నర్మదా నదిమధ్యప్రదేశ్ అమర్‌కంటక్ నుంచి పడమరకు, వింధ్య – సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించి గుజరాత్ దగ్గర అరేబియా సముద్రంలో (కాంబే సింధుశాఖ) కలుస్తుంది
7) బీహార్తూర్పు భారతంలో గంగా నది వెంట; ఉత్తర ప్రదేశ్‌కు తూర్పున, పశ్చిమ బెంగాల్‌కు పశ్చిమాన, నేపాల్‌కు దక్షిణాన, ఝార్ఖండ్‌కు ఉత్తరాన
8) హిమాలయాలుదేశానికి ఉత్తర సరిహద్దు వెంట జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వంపు తిరిగిన పర్వత శ్రేణి (పర్వత గుర్తు ^^^ తో)

పటం మీద ప్రతి ప్రదేశాన్ని సంఖ్యతో గుర్తించి, పక్కన పేరు స్పష్టంగా రాయండి. రాష్ట్రాలను షేడ్ చేయండి, నదిని నీలి గీతతో, పర్వతాలను ^^^ గుర్తుతో చూపండి.

ఈ జవాబులు 7వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకం (Exploring Society: India and Beyond, AP SCERT) ఆధారంగా మేము తయారు చేసినవి. అభిప్రాయ ప్రశ్నలకు (31, 32 B) మీ సొంత మాటల్లో సరైన కారణాలు రాస్తే మార్కులు వస్తాయి. అసలు మార్కులు మీ ఉపాధ్యాయుల మూల్యాంకనం ప్రకారమే. మిగతా పరీక్షల కోసం AP SA1 2026-27 చూడండి.

మీ మార్కుల అంచనా: 0 / 80

ఈ అసలు ప్రశ్నపత్రం, మా జవాబులు PDF గా కావాలా? ప్రింట్ తీసుకోవడానికి, స్నేహితులతో పంచుకోవడానికి (14 పేజీలు, సుమారు 500 KB).

AP 7th Class SA1 Social Studies Answer Key PDF డౌన్‌లోడ్

AP 7th Class SA1 Social Studies Question Paper 2026-27 జవాబులతో ఇక్కడ ఉంది. 7 అక్టోబర్ ఏడో తరగతి FA2 సోషల్ పేపర్ శాతవాహనులు, సామ్రాజ్యాలు, ప్రభుత్వ రకాలు, వస్తు మార్పిడి – డబ్బు చుట్టూనే తిరిగింది. భారతదేశ భౌగోళిక వైవిధ్యం, వాతావరణం (Weather), శీతోష్ణస్థితి (Climate), జనపదాలు – మహాజనపదాలు, అక్టోబర్ కొత్త పాఠం Understanding Markets — ఈ ఐదింటి నుంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదు. SA1 కి ఎక్కువ ప్రశ్నలు అక్కడి నుంచే రావచ్చు; అందుకే ఈ 20 ప్రశ్నల సాధన పేపర్ పూర్తిగా ఆ ఐదు పాఠాలపైనే.

ప్రశ్నలు సులభమైన ఇంగ్లీష్‌లో, ప్రతి జవాబు కింద తెలుగు వివరణ. ఉష్ణోగ్రత వ్యాప్తి లెక్క, బారోమీటర్ రీడింగ్, FSSAI – ISI – AGMARK – BEE గుర్తులు, రుతుపవనాలు ఎలా ఏర్పడతాయో — అన్నీ ఏడో తరగతి సోషల్ పుస్తకం Exploring Society: India and Beyond (Reprint 2026-27) తో సరిచూశాం. జవాబు సరిపోతే టిక్ పెట్టండి; పేజీ కింద బార్ 35 కి మీ స్కోర్ లెక్కిస్తుంది.

7వ తరగతి SA1 సాంఘిక శాస్త్రం (సోషల్) పరీక్ష: 18 నవంబర్ 2026 (బుధవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. SA1 ను చాలా మంది విద్యార్థులు Essay 1 పరీక్ష అని కూడా అంటారు. 7th Class Social Essay 1 Question Paper కోసం వెతికినా ఇదే పేజీ: సాధన పేపర్, జవాబులు, పరీక్ష తర్వాత అసలు పేపర్ Key అన్నీ ఇక్కడే. 18 నవంబర్ 2026 న జరిగిన అసలు ప్రశ్నపత్రం, మా జవాబులు (Answer Key) ఇదే పేజీ పైభాగంలో ఉన్నాయి.

ఇప్పటికే వచ్చిన 7వ తరగతి SA1 Answer Keys: 7th Telugu Key | 7th Hindi Key | 7th English Key | 7th Maths Key. అన్ని తరగతులు: AP SA1 Key Papers 2026-27.

జవాబులు రాగానే తెలియాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి

ఈ పేజీలో: వివరాలు | సిలబస్ | సాధన పేపర్ | మార్కుల పంపకం | పరికరాలు, గుర్తులు | PDF | 10 రోజుల ప్లాన్ | FAQs

AP 7th Class SA1 Social Studies Question Paper 2026-27 — పరీక్ష సమాచారం

అంశంవివరం
పరీక్షSA1 — మొదటి సంగ్రహణాత్మక మూల్యాంకనం, 2026-27
తరగతి, పుస్తకంఏడో తరగతి సాంఘిక శాస్త్రం — Exploring Society: India and Beyond (Grade 7)
పరీక్ష తేదీ18 నవంబర్ 2026 (బుధవారం), మధ్యాహ్నం 1:15 – 4:15 (అధికారిక టైమ్ టేబుల్)
SA1 పాఠాలు10 — తొమ్మిది జూన్ – సెప్టెంబర్ పాఠాలు, అక్టోబర్‌లో Understanding Markets
FA2 లో అడగని పాఠాలుGeographical Diversity of India, Understanding the Weather, Climates of India, New Beginnings: Cities and States, Understanding Markets
ఈ సాధన పేపర్నాలుగు Sections (A – D), 20 ప్రశ్నలు, 35 మార్కులు, 75 నిమిషాలు

అధికారిక ఉత్తర్వు వచ్చింది: 28-10-2026 పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు (Rc. No. 3475819/SAT-I/2026-27) ప్రకారం 7వ తరగతి SA1 సాంఘిక శాస్త్రం పరీక్ష 18 నవంబర్ 2026 (బుధవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. అసలు పేపర్ 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). ఈ పేజీలోని 20 ప్రశ్నల పేపర్ FA ఆకారంలో (35 మార్కులు) ఉంది — పాఠాల వారీ సాధనకు, అసలు పేపర్‌లోని 1, 2, 4 మార్కుల ప్రశ్నలకు సరిపోతుంది.

ఏడో తరగతి మిగతా సబ్జెక్టుల SA1 పేపర్లు, టైమ్ టేబుల్ అప్‌డేట్ కోసం AP SA1 2026-27 – సిలబస్, టైమ్ టేబుల్, ప్రశ్నపత్రాలు చూడండి.

7వ తరగతి SA1 Social Studies సిలబస్ 2026-27 — పది పాఠాలు

SCERT క్యాలెండర్ ప్రకారం జూన్ – సెప్టెంబర్‌లో తొమ్మిది పాఠాలు, అక్టోబర్‌లో Understanding Markets. 28-10-2026 అధికారిక సిలబస్‌లోనూ ఇవే పది పాఠాలు; Integrated AI సోషల్ జాబితాలో లేదు. మొదటి ఐదు వరుసల పాఠాలు FA2 లో రాలేదు; కింది ఐదు పాఠాల నుంచి FA2 లో ఏం అడిగారో మూడో నిలువు వరుసలో ఉంది.

పాఠంముఖ్య అంశాలుFA2 పేపర్‌లో
Geographical Diversity of India (1)హిమాలయాలు – మూడు శ్రేణులు, లడఖ్ శీతల ఎడారి, గంగా మైదానాలు, థార్, ఆరావళి, ద్వీపకల్ప పీఠభూమి, తీరాలు, దీవులు, సుందర్‌బన్స్రాలేదు
Understanding the Weather (2)వాతావరణ అంశాలు ఐదు, వాటిని కొలిచే పరికరాలు, ఉష్ణోగ్రత వ్యాప్తి – సగటు, IMD, AWSరాలేదు
Climates of India (3)వాతావరణం – శీతోష్ణస్థితి తేడా, శీతోష్ణస్థితి రకాలు, నిర్ణయించే అంశాలు, రుతుపవనాలు, విపత్తులు, వాతావరణ మార్పురాలేదు
New Beginnings: Cities and States (4)రెండో పట్టణీకరణ, జనపదాలు, 16 మహాజనపదాలు, గణ – సంఘాలు, ఇనుము, పంచ్ మార్క్ నాణేలు, ఉత్తరాపథం – దక్షిణాపథంరాలేదు
Understanding Markets (12, అక్టోబర్)మార్కెట్, ధర, డిమాండ్ – సప్లై, హోల్‌సేల్ – రిటైల్, ప్రభుత్వ పాత్ర, నాణ్యత గుర్తులుకొత్త పాఠం — రాలేదు
The Rise of EmpiresFA2 పేపర్ జవాబులతో రివిజన్సామ్రాజ్య లక్షణాలు, అశోకుని సింహ శీర్షం
The Age of ReorganisationFA2 పేపర్ జవాబులతో రివిజన్శాతవాహనులు — గౌతమీ బాలశ్రీ శాసనం, భూదానాలు, తల్లి పేర్లు
How the Land Becomes Sacred?FA2 పేపర్ జవాబులతో రివిజన్అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం
From the Rulers to the Ruled: Types of GovernmentsFA2 పేపర్ జవాబులతో రివిజన్అధ్యక్ష తరహా, రాజ్యాంగబద్ధ రాచరికం, న్యాయవ్యవస్థ స్వతంత్రత
From Barter to MoneyFA2 పేపర్ జవాబులతో రివిజన్కాగితపు డబ్బు, వస్తు మార్పిడి, UPI

AP 7th Class SA1 Social Studies Question Paper 2026-27 సిలబస్ — పది పాఠాలు, FA2 లో రాని ఐదు పాఠాలు

ఫోన్‌లో సేవ్ చేసుకోండి: నారింజ రంగు కార్డులు FA2 లో రాని పాఠాలు, ముదురు నారింజ అక్టోబర్ కొత్త పాఠం.

శాతవాహనులు, ప్రభుత్వ రకాలు, వస్తు మార్పిడి ప్రశ్నల అసలు జవాబులు AP 7th Class FA2 Social Studies Question Paper 2026-27 పేజీలో ఉన్నాయి. ఆ పేపర్ ఐదు పాఠాలను, ఈ పేపర్ మిగతా ఐదింటిని కవర్ చేస్తాయి — రెండూ రాస్తే SA1 సిలబస్ మొత్తం ఒకసారి తిరిగినట్టే.

AP 7th Class SA1 Social Studies Question Paper — 20 ప్రశ్నలు, జవాబులతో

సూచనలు: మొత్తం 20 ప్రశ్నలు, 35 మార్కులు, సమయం 1 గంట 15 నిమిషాలు. Section D లో A లేదా B — ఏదో ఒకటే రాయాలి. ఉష్ణోగ్రత లెక్కల్లో °C ప్రమాణం తప్పక రాయండి.

Section A  —  15 × 1 = 15 మార్కులు

1. The Portuguese traveller Domingos Paes called a city of the Vijayanagara Empire “the best-provided city in the world” because of its market. The city was
(A) Surat   (B) Hampi   (C) Imphal   (D) Jaipur   [1 మార్కు]

జవాబు చూడండి
(B) Hampi.
విరూపాక్ష ఆలయానికి ఎదురుగా ఉన్న హంపి బజార్‌లో ధాన్యాలు, విత్తనాలు, పాలు, నూనె, పట్టు, గుర్రాలు, పక్షులు కూడా అమ్మేవారు. మరో పోర్చుగీస్ యాత్రికుడు ఫెర్నావో నూనిజ్ అక్కడి వజ్రాలు, ముత్యాలు, బంగారు నగల గురించి రాశాడు.

2. Which certification mark is given to agricultural products like pulses, spices and honey?
(A) ISI   (B) FSSAI   (C) AGMARK   (D) BEE Star   [1 మార్కు]

జవాబు చూడండి
(C) AGMARK.
AGMARK లో “Ag” అంటే Agriculture. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, మసాలాలు, తేనె వంటి వ్యవసాయ ఉత్పత్తులకు ఈ గుర్తు. ISI విద్యుత్ ఉపకరణాలు, నిర్మాణ సామగ్రికి; FSSAI ఆహార ప్యాకెట్లకు.

3. Traders who buy grains, vegetables and fruits in large quantities directly from farms and store them in godowns are called
(A) retailers   (B) consumers   (C) wholesalers   (D) aggregators   [1 మార్కు]

జవాబు చూడండి
(C) wholesalers.
హోల్‌సేల్ వ్యాపారులు ఉత్పత్తిదారుల నుంచి పెద్ద మొత్తంలో కొని గోదాముల్లో (త్వరగా పాడయ్యే వాటికి కోల్డ్ స్టోరేజీ) నిల్వ చేసి మండీలకు తెస్తారు. వారి నుంచి కొని తక్కువ మొత్తంలో మనకు అమ్మేవారు రిటైలర్లు.

4. The government sets a minimum price at which wheat, paddy and maize can be sold. This is mainly to
(A) help foreign buyers   (B) ensure that farmers do not incur losses   (C) make food costlier for consumers   (D) stop online shopping   [1 మార్కు]

జవాబు చూడండి
(B) ensure that farmers do not incur losses.
ప్రభుత్వం కొన్ని వస్తువులకు గరిష్ఠ ధర (ఉదా: ప్రాణాధార మందులు), కొన్నింటికి కనీస ధర నిర్ణయిస్తుంది. కనీస వేతనాలు కూడా అలాగే — ఉద్యోగులకు న్యాయమైన చెల్లింపు కోసం.

5. Assertion (A): Buying a refrigerator with more BEE stars is good for a family. Reason (R): Higher BEE stars show that the appliance uses less energy and electricity.
(A) Both A and R are true and R is the correct explanation of A.   (B) Both A and R are true but R is not the correct explanation of A.   (C) A is true but R is false.   (D) A is false but R is true.   [1 మార్కు]

జవాబు చూడండి
(A) Both A and R are true and R is the correct explanation of A.
BEE = Bureau of Energy Efficiency. ఎక్కువ నక్షత్రాలు అంటే తక్కువ కరెంటు వాడకం — కరెంటు బిల్లు తగ్గుతుంది, పర్యావరణానికీ మంచిది.

6. Ima Keithal, a unique market where about 3,000 women own and run all the shops, is in
(A) Imphal, Manipur   (B) Surat, Gujarat   (C) Jaipur, Rajasthan   (D) Bengaluru, Karnataka   [1 మార్కు]

జవాబు చూడండి
(A) Imphal, Manipur.
మెయితీ భాషలో “అమ్మల మార్కెట్”. వేల కుటుంబాలకు ఆదాయ మార్గం; వేర్వేరు సమాజాల ప్రజలు కలిసే సాంస్కృతిక కేంద్రం కూడా. మార్కెట్‌కు ఆర్థికేతర ప్రాముఖ్యత కూడా ఉంటుందనడానికి ఇది ఉదాహరణ.

7. The instrument used to measure the relative humidity of the air is
(A) barometer   (B) hygrometer   (C) anemometer   (D) rain gauge   [1 మార్కు]

జవాబు చూడండి
(B) hygrometer.
తేమ (humidity) = గాలిలోని నీటి ఆవిరి పరిమాణం. పొడి వాతావరణంలో సాపేక్ష ఆర్ద్రత సుమారు 20 – 40%, తేమ వాతావరణంలో 60 – 80%. ఆహార శుద్ధి పరిశ్రమలు, మ్యూజియాలు కూడా తేమను గమనిస్తాయి.

8. A barometer at a coastal town reads 994 mb. This most likely indicates
(A) normal pressure   (B) a depression (low-pressure system)   (C) a heat wave   (D) very high pressure   [1 మార్కు]

జవాబు చూడండి
(B) a depression (low-pressure system).
సముద్ర తీరంలో సాధారణ వాయుపీడనం సుమారు 1013 mb; 1000 mb కంటే తక్కువ అయితే అల్పపీడనం (depression). అది తుఫానుగా, కొన్నిసార్లు సైక్లోన్‌గా మారవచ్చు.

9. In one week, the highest maximum temperature of a town in Madhya Pradesh was 32°C and the lowest minimum was 14°C. The range of temperature for the week is
(A) 46°C   (B) 23°C   (C) 18°C   (D) 14°C   [1 మార్కు]

జవాబు చూడండి
(C) 18°C.
వ్యాప్తి (range) = గరిష్ఠం − కనిష్ఠం = 32 − 14 = 18°C. రోజువారీ సగటు ఉష్ణోగ్రత = (గరిష్ఠం + కనిష్ఠం) ÷ 2 — 23°C ఆ పొరపాటు జవాబు.

10. The word ‘monsoon’ comes from the Arabic word mausim, which means
(A) rain   (B) wind   (C) season   (D) cloud   [1 మార్కు]

జవాబు చూడండి
(C) season.
నిజానికి “మాన్‌సూన్” అంటే హిందూ మహాసముద్రం, చుట్టుపక్కల ప్రాంతాలపై వీచే రుతువారీ పవనాలు. ఆ గాలులు తెచ్చే వర్షాలనే సాధారణంగా మాన్‌సూన్ అంటున్నాం.

11. Which place receives the highest average annual rainfall in the world, about 11,000 mm?
(A) Cherrapunjee   (B) Mawsynram   (C) Mumbai   (D) Kochi   [1 మార్కు]

జవాబు చూడండి
(B) Mawsynram.
మేఘాలయలోని మాసిన్‌రామ్‌లో ఏటా సగటున సుమారు 11,000 mm — అంటే 11 మీటర్ల వర్షం. మేఘమల్హార్, అమృతవర్షిణి వంటి రాగాలకు కూడా రుతుపవనాలే ప్రేరణ.

12. Mumbai and Nagpur lie at a similar latitude, but Mumbai’s temperature range is about 14°C while Nagpur’s is about 34°C. The main reason is
(A) altitude   (B) proximity to the sea   (C) latitude   (D) the Himalayas   [1 మార్కు]

జవాబు చూడండి
(B) proximity to the sea.
సముద్రం నెమ్మదిగా వేడెక్కి నెమ్మదిగా చల్లబడుతుంది — తీరాన్ని మితంగా ఉంచుతుంది. ముంబై: వేసవి సుమారు 32°C, శీతాకాలం సుమారు 18°C. సముద్రానికి దూరంగా ఉన్న నాగ్‌పూర్: 44°C, 10°C.

13. The only active volcano in India is on
(A) Lakshadweep   (B) Barren Island   (C) Pulicat   (D) Majuli   [1 మార్కు]

జవాబు చూడండి
(B) Barren Island.
బారెన్ ఐలాండ్ అండమాన్ – నికోబార్ దీవుల్లో ఉంది; అప్పుడప్పుడు పొగ, లావా వెదజల్లుతుంది. అండమాన్ – నికోబార్‌లో 500 కు పైగా అగ్నిపర్వత దీవులు; లక్షద్వీప్‌లోని 36 దీవులు పగడాలతో ఏర్పడినవి.

14. Evidence from the ancient Zawar mines in the Aravallis shows that, over eight centuries ago, Indians were the first in the world to master the extraction of
(A) iron   (B) copper   (C) zinc   (D) gold   [1 మార్కు]

జవాబు చూడండి
(C) zinc.
సుమారు 250 కోట్ల ఏళ్ళ నాటి ఆరావళి ప్రపంచంలోని అతి ప్రాచీన పర్వతాల్లో ఒకటి; పాలరాయి, గ్రానైట్, జింక్, రాగి నిక్షేపాలు ఉన్నాయి. ఎత్తైన శిఖరం మౌంట్ అబూ (1700 m కు పైగా). థార్ ఎడారి తూర్పుకు విస్తరించకుండా అడ్డుకుంటుంది.

15. Which two mahājanapadas were gaṇas or sanghas, often called ‘early republics’, because their assembly selected the rājā?
(A) Magadha and Kosala   (B) Vajji (Vṛijji) and Malla   (C) Avanti and Vatsa   (D) Anga and Gandhāra   [1 మార్కు]

జవాబు చూడండి
(B) Vajji (Vṛijji) and Malla.
వీటిలో సభ లేదా సమితి చర్చ ద్వారా, అవసరమైతే ఓటు ద్వారా నిర్ణయాలు తీసుకునేది — రాజును ఎన్నుకోవడం కూడా. మగధ, కోసల, అవంతిలో రాజు వంశపారంపర్యంగా వచ్చేవాడు (రాచరికం).

Section B  —  2 × 2 = 4 మార్కులు

16. Distinguish between weather and climate.   [2 మార్కులు]

జవాబు చూడండి
వాతావరణం (Weather)శీతోష్ణస్థితి (Climate)
ఒక ప్రదేశంలో ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితిఒక ప్రాంతం చాలా ఏళ్ళుగా అనుభవించే వాతావరణ నమూనా
గంట గంటకు, రోజు రోజుకు మారుతుందికనీసం మూడు దశాబ్దాల సమాచారంతో వర్ణిస్తారు; సాధారణంగా స్థిరంగా ఉంటుంది
ఉదా: ఈ రోజు వర్షం, గాలి, ఎండఉదా: థార్ — శుష్క; పశ్చిమ తీరం — ఉష్ణమండల తేమ

మార్కులు: రెండు సరైన తేడాలకు 2.

17. The relative humidity in Delhi is 52% and in Kochi it is 84%. Where will wet clothes dry faster? Where are you likely to sweat more? (Assume the same temperature.)   [2 మార్కులు]

జవాబు చూడండి
బట్టలు త్వరగా ఆరేది: ఢిల్లీలో. గాలిలో తేమ తక్కువగా ఉంటే నీరు వేగంగా ఆవిరవుతుంది. — 1 మార్కు
ఎక్కువ చెమట అనిపించేది: కొచ్చిలో. గాలిలో తేమ ఇప్పటికే ఎక్కువ కాబట్టి చెమట నెమ్మదిగా ఆవిరవుతుంది; ఆవిరై చల్లబరిచే ప్రభావం తగ్గి శరీరం తడిగా, ఉక్కగా ఉంటుంది. — 1 మార్కు

Section C  —  2 × 4 = 8 మార్కులు

18. Explain any four factors that determine the climate of a place, with examples from India.   [4 మార్కులు]

జవాబు చూడండి
1. అక్షాంశం (Latitude): భూమధ్యరేఖ దగ్గర సూర్యకిరణాలు దాదాపు నిలువుగా పడి తక్కువ విస్తీర్ణంలో శక్తి కేంద్రీకృతమవుతుంది — వేడి ఎక్కువ. ధ్రువాల వైపు ఏటవాలుగా పడతాయి. కన్యాకుమారి, నికోబార్ ఏడాదంతా వేడి; శ్రీనగర్ చల్లగా ఉంటుంది. — 1
2. ఎత్తు (Altitude): ఎత్తు పెరిగే కొద్దీ గాలి సాంద్రత తగ్గి చల్లగా ఉంటుంది. ఊటీ, కోయంబత్తూర్ దాదాపు ఒకే అక్షాంశంలో ఉన్నా వేసవిలో ఊటీ 10 – 25°, కోయంబత్తూర్ 25 – 38°. — 1
3. సముద్రానికి దగ్గరగా ఉండటం: సముద్రం ఉష్ణోగ్రతను మితంగా ఉంచుతుంది. ముంబై వ్యాప్తి సుమారు 14°C, లోతట్టున ఉన్న నాగ్‌పూర్ వ్యాప్తి 34°C. — 1
4. పవనాలు (Winds): అరేబియా ఎడారుల మీదుగా పడమటి నుంచి వచ్చే పొడి, వేడి గాలులు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వడగాలులు తెస్తాయి; సముద్రం నుంచి వచ్చే గాలులు తేమ తెచ్చి వర్షం కురిపిస్తాయి. — 1
ఐదో అంశం భూస్వరూపం (Topography): హిమాలయాలు, కారకోరం మధ్య ఆసియా శీతల గాలుల నుంచి కాపాడతాయి; చదునైన థార్‌కు అలాంటి రక్షణ లేదు. నాలుగింటిలో దీన్నీ రాయవచ్చు.

19. Markets do not always work well on their own. Explain any four ways in which the government plays a role in markets.   [4 మార్కులు]

జవాబు చూడండి
1. ధరల నియంత్రణ: ప్రాణాధార మందులకు గరిష్ఠ ధర; గోధుమ, వరి, మొక్కజొన్నకు కనీస ధర — రైతులకు నష్టం రాకుండా; ఉద్యోగులకు కనీస వేతనాలు. ధర మరీ తక్కువైతే ఉత్పత్తిదారులకు, మరీ ఎక్కువైతే వినియోగదారులకు నష్టం. — 1
2. నాణ్యత, భద్రత ప్రమాణాలు: మందుల అనుమతి విధానాలు, శాంపిల్ పరీక్షలు — వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు లేకుండా. — 1
3. మార్కెట్ల బాహ్య ప్రభావాల నియంత్రణ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వంటి వాటి తయారీ కాలుష్యం, ఆరోగ్య ముప్పు తెస్తే కఠిన నిబంధనలు; ప్యాకెట్లలో నికర పరిమాణం సరిగా ఉందో తూనికలు – కొలతల తనిఖీ. — 1
4. ప్రజా వస్తువులు (Public goods): లాభం ఆశించి ఎవరూ ఇవ్వని పార్కులు, రోడ్లు, పోలీసు వ్యవస్థను ప్రభుత్వమే అందిస్తుంది. — 1
కౌటిల్యుని అర్థశాస్త్రం కూడా నెయ్యి కొలతపాత్రకు అంటుకుపోయే నష్టానికి కొనుగోలుదారుకు 1/50 భాగం ఎక్కువ ఇవ్వాలని చెప్పింది — వినియోగదారుల రక్షణ కొత్త ఆలోచన కాదు.

Section D  —  1 × 8 = 8 మార్కులు

20. A) What is a market? Explain how goods move from producers to consumers through wholesalers, distributors and retailers, and how online markets differ. Use the example of the Surat textile market.
(OR)
B) What were janapadas and mahājanapadas? Describe their system of governance and the new technologies of the Second Urbanisation.   [8 మార్కులు]

జవాబు చూడండి
A) జవాబు (నిర్వచనం 1, సరఫరా గొలుసు 3, ఆన్‌లైన్ 1, సూరత్ ఉదాహరణ 3):
మార్కెట్: కొనుగోలుదారు, అమ్మకందారు ఒక ధరకు అంగీకరించి వస్తువులు, సేవలు మార్చుకునే చోటు — భౌతికంగా గానీ ఆన్‌లైన్‌లో గానీ. ధర గిరాకీ (demand), సరఫరా (supply) మధ్య పరస్పర చర్యతో నిర్ణయమవుతుంది.
సరఫరా గొలుసు: (1) ముడి పదార్థాలు తయారీదారు దగ్గరకు; (2) తయారైన వస్తువులు హోల్‌సేల్ వ్యాపారికి — పెద్ద మొత్తాల్లో కొని గోదాములు, కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసి మండీలకు; (3) డిస్ట్రిబ్యూటర్ — దూరం, భూభాగం వల్ల హోల్‌సేల్ వ్యాపారి చేరలేని రిటైలర్లకు అందిస్తాడు; (4) రిటైలర్ — తక్కువ మొత్తాల్లో, వాడుకోడానికి అమ్ముతాడు; (5) చివరగా వినియోగదారు.
ఆన్‌లైన్ మార్కెట్: తయారీదారులు పెద్ద మొత్తాలను యాప్ / వెబ్‌సైట్ నడిపే వ్యాపార సంస్థ (aggregator) గోదాముకు పంపుతారు; అది ప్యాక్ చేసి కొనుగోలుదారు ఇంటికి చేరుస్తుంది. వేల కిలోమీటర్ల దూరం నుంచి కూడా కొనవచ్చు.
సూరత్ ఉదాహరణ: ఆసియాలో అతి పురాతన వస్త్ర మార్కెట్. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి పత్తి మండీల ద్వారా ముడి పత్తి వస్తుంది; పవర్‌లూమ్‌లపై నేత, ప్రాసెసింగ్ యూనిట్లలో రంగులు — ప్రతి దశ ఒక మార్కెట్ ద్వారా తర్వాతి దశకు. తయారైన చీరలు, దుస్తులు హోల్‌సేల్ మార్కెట్‌లో అమ్ముడై దేశమంతా, విదేశాలకూ వెళ్తాయి. రిటైలర్లకు ఎంత కావాలో హోల్‌సేల్ వ్యాపారులు అంచనా వేస్తారు కాబట్టి సరఫరా ఆగదు.
B) జవాబు (జనపదం 2, మహాజనపదాలు 2, పాలన 2, సాంకేతికత 2):
జనపదం: “జన (ప్రజలు) పాదం మోపిన చోటు” — స్థిరపడిన ప్రాంతం. రెండో సహస్రాబ్ది BCE చివరికి ఒకే భాష, ఆచారాలు ఉన్న తెగలు ఒక్కో భూభాగంతో, రాజు నాయకత్వంలో జనపదాలుగా ఏర్పడ్డాయి.
మహాజనపదాలు: 8వ – 7వ శతాబ్దం BCE నాటికి కొన్ని జనపదాలు కలిసి పెద్ద రాజ్యాలయ్యాయి. తరచూ కనిపించే జాబితాలో 16 — వాయవ్యాన గాంధార నుంచి తూర్పున అంగ, గోదావరి దగ్గర అశ్మక వరకు. బలమైనవి: మగధ, కోసల, వత్స, అవంతి. రాజధానుల చుట్టూ కోట గోడలు, కందకాలు, ఇరుకైన ద్వారాలు.
పాలన: ప్రతి జనపదానికి సభ / సమితి; రాజు దాని సలహా తీసుకోవాలి. మగధ, కోసల, అవంతి రాచరికాలు — వంశపారంపర్య రాజు పన్నులు వసూలు, శాంతిభద్రతలు, సైన్యం చూసుకునేవాడు. వజ్జి, మల్ల గణ – సంఘాలు: సభ చర్చ, ఓటుతో రాజును ఎన్నుకునేది — “తొలి గణతంత్రాలు”.
సాంకేతికత: రెండో సహస్రాబ్ది BCE చివరికి ఇనుప పనిముట్లు విస్తృతమై పెద్ద ఎత్తున వ్యవసాయం సాధ్యమైంది; కాంస్యం కంటే తేలికైన, పదునైన ఆయుధాలు. పెరుగుతున్న వ్యాపారం కోసం మొదటి నాణేలు — వెండి పంచ్ మార్క్ నాణేలు; తర్వాత రాగి, బంగారం నాణేలు.

పాఠాల వారీ మార్కుల పంపకం

పాఠంప్రశ్న సంఖ్యలుమార్కులు
Understanding Markets (అక్టోబర్)1 – 6, 19, 20A10 (20A రాస్తే 18)
Climates of India10 – 12, 16, 189
Understanding the Weather7 – 9, 175
Geographical Diversity of India13, 142
New Beginnings: Cities and States15, 20B1 (20B రాస్తే 9)
FA2 లో వచ్చిన ఐదు పాఠాలు—FA2 పేపర్‌తో రివిజన్

కొత్త పాఠం Understanding Markets కే 10 మార్కులు; Section D లో A తీసుకుంటే 18. వాతావరణం, శీతోష్ణస్థితి కలిపి 14 — ఈ రెండు పాఠాల్లో లెక్కలు, పరికరాలు, కారణాలు అడిగే అవకాశం ఎక్కువ.

ఏడో తరగతి సోషల్ — పేపర్‌లో లేని 7 ముఖ్య ప్రశ్నలు

ప్రశ్నజవాబు
“హిమాలయ” అనే పదానికి అర్థం ఏమిటి?హిమ (మంచు) + ఆలయ (నివాసం) = మంచుకు నిలయం. పొడవు సుమారు 2500 km, ఆరు దేశాల్లో విస్తరించాయి. గంగ, సింధు, బ్రహ్మపుత్రలకు నీరు అందిస్తాయి కాబట్టి “ఆసియా నీటి గోపురం” అంటారు.
హిమాలయాల మూడు శ్రేణులు ఏవి?హిమాద్రి (అత్యున్నత — ఎవరెస్ట్, కాంచనజంగా), హిమాచల్ (నైనిటాల్, డార్జిలింగ్, సిమ్లా, ముస్సోరీ వంటి హిల్ స్టేషన్లు), శివాలిక్ కొండలు (అత్యల్ప, బయటి శ్రేణి — మైదానాలకు సరిహద్దు).
ద్వీపకల్ప పీఠభూమి నదులు తూర్పుకు ఎందుకు ప్రవహిస్తాయి?పీఠభూమి కొద్దిగా తూర్పుకు వాలి ఉంది. గోదావరి, కృష్ణ, మహానది బంగాళాఖాతంలో కలుస్తాయి; నర్మద, తపతి మాత్రం పడమరకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి.
దక్షిణాపథం ఎక్కడి నుంచి మొదలైంది?ప్రయాగ్‌రాజ్ దగ్గరి కౌశాంబి (వత్స మహాజనపద రాజధాని) నుంచి వింధ్య పర్వతాలు దాటి దక్షిణానికి. ఉత్తరాపథం వాయవ్య ప్రాంతాన్ని గంగా మైదానాల మీదుగా తూర్పు భారతదేశంతో కలిపింది.
సైక్లోన్ “కన్ను” అంటే ఏమిటి?అల్పపీడన కేంద్రం వైపు తేమ గాలులు సుడులు తిరుగుతూ మేఘాలు ఏర్పరుస్తాయి; ఆ మధ్యలో మేఘాలు లేని భాగమే కన్ను. తూర్పు తీరానికి ఏటా సైక్లోన్లు వస్తాయి; IMD వాటిని గమనిస్తుంది, NDRF బెటాలియన్లు 12 చోట్ల ఉన్నాయి.
పట్టణ ఉష్ణ ద్వీపం (urban heat island) అంటే?భవనాలు, కాంక్రీటు ఎక్కువై పచ్చదనం తక్కువైన నగరాలు వేడిని పట్టి ఉంచి చుట్టుపక్కల ప్రాంతం కంటే చాలా వేడిగా ఉంటాయి. ఇది ఒక సూక్ష్మ శీతోష్ణస్థితి (microclimate).
శనగపిండి ప్యాకెట్ లేబుల్‌పై ఏమేం చూడాలి?నికర పరిమాణం, తయారీ తేదీ, బ్యాచ్ నంబర్, Best before తేదీ, MRP, తయారీదారు పేరు – చిరునామా, పదార్థాల జాబితా, పోషక విలువల పట్టిక, అలర్జెన్ ప్రకటన, FSSAI గుర్తు – లైసెన్స్ నంబర్.

వాతావరణ పరికరాలు, నాణ్యత గుర్తులు — ఒకే చోట

జతపరచండి (Match the following), ఒక మార్కు ప్రశ్నల్లో తరచూ అడిగేవి ఇవే. పరికరం – అది కొలిచేది – ప్రమాణం మూడూ కలిపి గుర్తుంచుకోండి.

పరికరంకొలిచేదిప్రమాణం / గుర్తుంచుకోవాల్సింది
థర్మామీటర్ఉష్ణోగ్రత°C / °F; 15°C = 59°F; వ్యాప్తి = గరిష్ఠం − కనిష్ఠం
రెయిన్ గేజ్వర్షపాతంmm; గరాటు, కొలత స్థూపం; అడ్డులు లేని ఖాళీ, చదునైన చోట పెట్టాలి
బారోమీటర్వాయుపీడనంమిల్లీబార్ (mb); తీరంలో సుమారు 1013; ఖర్దుంగ్ లా వద్ద సుమారు 650
విండ్ వేన్ / విండ్ సాక్గాలి దిశవిమానాశ్రయాల్లో విండ్ సాక్
అనిమోమీటర్గాలి వేగం, దిశkm/h; 3 – 4 కప్పులు తిరుగుతాయి
హైగ్రోమీటర్సాపేక్ష ఆర్ద్రత%; పొడి 20 – 40, తేమ 60 – 80

మార్కెట్ పాఠంలోని నాలుగు ధ్రువీకరణ గుర్తులు — ప్యాకెట్ మీద ఇవి కనిపిస్తే ఆ వస్తువు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించిందని అర్థం.

గుర్తుఇచ్చే సంస్థఏ వస్తువులపై
FSSAIFood Safety & Standards Authority of Indiaఆహార ప్యాకెట్లు — పరీక్షించి తినడానికి సురక్షితం
ISIBureau of Indian Standards (BIS)విద్యుత్ ఉపకరణాలు, నిర్మాణ సామగ్రి, టైర్లు, కాగితం
AGMARKప్రభుత్వ ధ్రువీకరణ (Ag = Agriculture)కూరగాయలు, పండ్లు, పప్పులు, మసాలాలు, తేనె
BEE StarBureau of Energy EfficiencyTV, ల్యాప్‌టాప్, AC, ఫ్రిజ్ — ఎక్కువ నక్షత్రాలు = తక్కువ కరెంటు

7వ తరగతి SA1 సోషల్ సాధన పేపర్ PDF

ప్రింట్ తీసి గడియారం పెట్టుకుని రాయండి: Download PDF — AP 7th Class SA1 Social Studies Practice Paper 2026-27. మొదటి పేజీల్లో 20 ప్రశ్నలు, జవాబులు చివర్లో.

ఏడో తరగతి సోషల్‌లో తరచూ జరిగే 7 తప్పులు

  1. వాతావరణం, శీతోష్ణస్థితి ఒకటే అనుకోవడం: ఈ రోజు వర్షం వాతావరణం; దశాబ్దాల నమూనా శీతోష్ణస్థితి.
  2. వ్యాప్తి బదులు సగటు రాయడం: వ్యాప్తి = తేడా; సగటు = మొత్తం ÷ 2.
  3. గాలి దిశ తిరగేసి రాయడం: గాలి అధిక పీడనం నుంచి అల్ప పీడనం వైపు వీస్తుంది.
  4. “నైరుతి రుతుపవనాలు” అర్థం: ఆ పేరు గాలి ఏ దిక్కు నుంచి వస్తుందో చెబుతుంది, ఎటు వెళ్తుందో కాదు.
  5. హోల్‌సేల్, రిటైల్ తారుమారు: హోల్‌సేల్ పెద్ద మొత్తాలు, తిరిగి అమ్మడానికి; రిటైల్ తక్కువ మొత్తాలు, వాడుకోడానికి.
  6. లక్షద్వీప్‌ను అగ్నిపర్వత దీవులు అనడం: లక్షద్వీప్ పగడపు దీవులు; అండమాన్ – నికోబార్ అగ్నిపర్వత దీవులు.
  7. మహాజనపదాలన్నీ రాచరికాలే అనడం: వజ్జి, మల్లలో సభే రాజును ఎన్నుకునేది.

7వ తరగతి సోషల్ — SA1 కి 10 రోజుల ప్లాన్

పరీక్ష 18 నవంబర్ 2026 (బుధవారం). రోజుకు 40 నిమిషాలు. మొదటి మూడు రోజులు అక్టోబర్ పాఠానికే. ఇంట్లో ఉన్న ఐదు ప్యాకెట్ల లేబుళ్ళు, ఫ్రిజ్ – AC మీద BEE నక్షత్రాలు చూసి నోట్ చేస్తే ఆ పాఠం మర్చిపోరు.

రోజుచదవాల్సింది
1Understanding Markets — మార్కెట్, అవసరాలు – కోరికలు, హంపి బజార్, జామపండ్ల ధర ఉదాహరణలు
2భౌతిక – ఆన్‌లైన్, దేశీయ – అంతర్జాతీయ మార్కెట్లు; హోల్‌సేల్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్; సూరత్, ఇమా కైథెల్
3ప్రభుత్వ పాత్ర, FSSAI – ISI – AGMARK – BEE, ప్యాకెట్ లేబుల్; అధ్యాయం 12 చివరి ప్రశ్నలు
4భౌగోళిక వైవిధ్యం: హిమాలయాలు, లడఖ్, గంగా మైదానాలు, థార్, ఆరావళి
5ద్వీపకల్ప పీఠభూమి, పశ్చిమ – తూర్పు తీరాలు, దీవులు, సుందర్‌బన్స్, ఈశాన్య కొండలు — పటంలో గుర్తించడం
6వాతావరణం: ఐదు అంశాలు, పరికరాల పట్టిక, వ్యాప్తి – సగటు లెక్కలు
7శీతోష్ణస్థితి రకాలు, నిర్ణయించే ఐదు అంశాలు, రుతుపవనాలు
8విపత్తులు, వాతావరణ మార్పు; జనపదాలు – మహాజనపదాలు, ఇనుము, నాణేలు
9పై 20 ప్రశ్నల పేపర్ — 75 నిమిషాల్లో, పుస్తకం మూసి
10తప్పులు సరిచేయడం; FA2 లో వచ్చిన ఐదు పాఠాలు FA2 పేపర్ జవాబులతో రివిజన్

ఏడో తరగతి పాఠ్యపుస్తకాలు, నోట్స్, పాత ప్రశ్నపత్రాలు AP 7th Class Textbooks, Notes, Study Material & Question Papers పేజీలో ఉన్నాయి. 6 నుంచి 10 తరగతుల SA1 పాఠాల జాబితా AP SA1 Syllabus 2026-27 – Class 1 to 10 లో చూడవచ్చు.

తర్వాత ఏం చదవాలి

  1. AP 7th Class FA2 Social Studies Question Paper 2026-27 — 7 అక్టోబర్ అసలు పేపర్, మిగతా ఐదు పాఠాలు
  2. AP 7th Class SA1 Science Question Paper 2026-27 — ఆమ్లాలు, క్షారాలు, విద్యుత్ వలయాల సాధన
  3. AP 7th Class SA1 English Question Paper 2026-27 — Grammar, comprehension తో 20 ప్రశ్నలు
  4. AP 7th Class SA1 Telugu Question Paper 2026-27 — తెలుగు పాఠాలపై సాధన పేపర్

FAQs

ఏడో తరగతి SA1 సోషల్ పరీక్ష ఎప్పుడు?

28-10-2026 అధికారిక టైమ్ టేబుల్ ప్రకారం 7వ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్ష 18 నవంబర్ 2026 (బుధవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. SA1 పరీక్షలు 9 నుంచి 20 నవంబర్ వరకు.

7వ తరగతి SA1 Social సిలబస్‌లో ఎన్ని పాఠాలు?

పది: Geographical Diversity of India, Understanding the Weather, Climates of India, New Beginnings: Cities and States, The Rise of Empires, The Age of Reorganisation, How the Land Becomes Sacred?, From the Rulers to the Ruled: Types of Governments, From Barter to Money, Understanding Markets. అధికారిక జాబితాలోనూ ఇవే; Integrated AI సోషల్ జాబితాలో లేదు.

7 అక్టోబర్ ఏడో తరగతి FA2 సోషల్‌లో ఏ పాఠాల ప్రశ్నలు వచ్చాయి?

Exam Code 723 పేపర్‌లో శాతవాహనులు, సామ్రాజ్యాలు, స్వర్ణ దేవాలయం, ప్రభుత్వ రకాలు, న్యాయవ్యవస్థ, వస్తు మార్పిడి – డబ్బు ప్రశ్నలు వచ్చాయి. మూడు భూగోళ పాఠాలు, New Beginnings, Understanding Markets నుంచి ఏమీ రాలేదు.

Understanding Markets ఏ నెల పాఠం?

అక్టోబర్ పాఠం; పుస్తకంలో అధ్యాయం 12. FA2 తర్వాత బోధించేది కాబట్టి SA1 లో దీనికి ఎక్కువ మార్కులు ఉండే అవకాశం ఉంది.

ఇది ప్రభుత్వం ఇచ్చిన మోడల్ పేపరా?

కాదు. పాఠ్యపుస్తకం చదివి మేము తయారుచేసిన సాధన పేపర్. పరీక్ష తేదీ, పాఠాల జాబితా 28-10-2026 అధికారిక ఉత్తర్వు నుంచి.

7వ తరగతి SA1 సోషల్ ఎన్ని మార్కులకు ఉంటుంది?

28-10-2026 అధికారిక ఉత్తర్వు ప్రకారం 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). ఈ పేజీలోని సాధన పేపర్ FA ఆకారంలో 20 ప్రశ్నలు, 35 మార్కులు — అసలు పేపర్‌కు ముందు పాఠాల వారీ సాధనకు.

ఉష్ణోగ్రత వ్యాప్తి ఎలా లెక్కించాలి?

ఒక కాలంలో (సాధారణంగా 24 గంటలు) గరిష్ఠ ఉష్ణోగ్రత నుంచి కనిష్ఠాన్ని తీసేయాలి. గరిష్ఠం 32°C, కనిష్ఠం 14°C అయితే వ్యాప్తి 18°C.

నైరుతి, ఈశాన్య రుతుపవనాల తేడా ఏమిటి?

వేసవిలో భూమి వేడెక్కి అల్పపీడనం ఏర్పడి సముద్రం నుంచి తేమ గాలులు వస్తాయి — నైరుతి రుతుపవనాలు, జూన్ మొదట్లో దక్షిణ కొన నుంచి జూలై మధ్యకు దేశమంతా. శీతాకాలంలో గాలులు భూమి నుంచి సముద్రం వైపు వీస్తాయి; బంగాళాఖాతం మీదుగా వెళ్ళే భాగం తేమ తీసుకుని తూర్పు, దక్షిణ భారతంలో కొన్ని ప్రాంతాలకు వర్షం ఇస్తుంది — ఈశాన్య రుతుపవనాలు.

FSSAI పూర్తి పేరు ఏమిటి?

Food Safety & Standards Authority of India. ఈ గుర్తు ఉంటే ఆ ఆహారాన్ని ప్రభుత్వం పరీక్షించింది, తినడానికి సురక్షితం అని అర్థం.

రెండో పట్టణీకరణ అంటే?

హరప్పా నాగరికత మొదటి పట్టణీకరణ. దాని తర్వాత సుమారు వెయ్యేళ్ళకు, మొదటి సహస్రాబ్ది BCE లో గంగా మైదానాల్లో మొదలై దేశమంతా వ్యాపించిన కొత్త పట్టణాల దశను రెండో పట్టణీకరణ అంటారు.

2013 ఉత్తరాఖండ్ వరదలకు కారణం ఏమిటి?

చాలా రోజుల ఎడతెరిపి లేని భారీ వర్షంతో హిమానీనద సరస్సు గట్టు తెగింది (glacial burst); తర్వాత కొండచరియలు విరిగిపడ్డాయి. కేదార్‌నాథ్ పరిసరాలు ధ్వంసమై సుమారు 6,000 మంది చనిపోయారు.

టిక్ పెట్టిన మార్కులు ఎలా లెక్కిస్తారు?

ప్రతి జవాబు కింద ఉన్న చెక్‌బాక్స్‌ను మీ జవాబు సరిపోయినప్పుడే టిక్ చేయండి; కింది బార్ మొత్తం 35 కి చూపిస్తుంది. Section D లో మీరు రాసిన A లేదా B కి మాత్రమే టిక్ పెట్టండి.

Official Sources

SA1 టైమ్ టేబుల్, మార్కుల విధానం, సిలబస్: పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు Rc. No. 3475819/SAT-I/2026-27, తేదీ 28-10-2026 (SCERT సిలబస్ అనుబంధంతో); AP SCERT. నెలవారీ బోధన క్రమం: High School Academic Calendar 2026-27. పాఠ్యాంశాలు: NCERT Exploring Society: India and Beyond — Social Science Textbook for Grade 7 (Reprint 2026-27), అధ్యాయాలు 1, 2, 3, 4, 12.