AP 6th Class SA1 Science Question Paper 2026-27 జవాబులతో ఇక్కడ ఉంది. 6 అక్టోబర్ ఆరో తరగతి FA2 సైన్స్ పేపర్ మొక్కలు – జంతువుల వైవిధ్యం, ఆహారం, అయస్కాంతాల మీదే వచ్చింది. మొదటి పాఠం The Wonderful World of Science, అక్టోబర్‌లో చెప్పే Measurement of Length and Motion ఆ పేపర్లో అసలు లేవు. SA1 లో ఐదు పాఠాలూ ఉంటాయి కాబట్టి ఈ 20 ప్రశ్నల సాధన పేపర్లో సగానికి పైగా మార్కులు పొడవు కొలత, చలనం పాఠానికే.
ప్రశ్నలు సులభమైన ఇంగ్లీష్‌లో, ప్రతి జవాబు కింద తెలుగు వివరణ. విరిగిన స్కేలుతో కొలత, km – m – cm – mm మార్పిడులు, నిర్దేశ బిందువు, మూడు రకాల చలనం — అన్నీ ఆరో తరగతి సైన్స్ పుస్తకం Curiosity (Reprint 2026-27) లోని ఉదాహరణలతో సరిచూశాం. జవాబు సరిపోతే టిక్ పెట్టండి; కింది బార్లో 35 కి మీ మార్కులు కనిపిస్తాయి.
ఆరో తరగతి SA1 సైన్స్ అసలు పేపర్ జవాబులు పరీక్ష రోజే ఇక్కడ ఉంటాయి. ఆ సమాచారం మీ ఫోన్‌కే రావాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి
ఈ పేజీలో: వివరాలు | సిలబస్ | సాధన పేపర్ | మార్కుల పంపకం | కొలతల పట్టిక | PDF | 10 రోజుల ప్లాన్ | FAQs
AP 6th Class SA1 Science Question Paper 2026-27 — ముఖ్య సమాచారం
| అంశం | వివరం |
|---|---|
| పరీక్ష | SA1 — సంగ్రహణాత్మక మూల్యాంకనం 1, 2026-27 |
| తరగతి, పుస్తకం | ఆరో తరగతి సైన్స్ — Curiosity (Textbook of Science, Grade 6) |
| తేదీలు | SCERT అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 9 – 20 నవంబర్ 2026 (Tentative) |
| SA1 పాఠాలు | 5 — The World of Science, Diversity in the Living World, Mindful Eating, Exploring Magnets, Measurement of Length and Motion |
| అక్టోబర్‌లో కొత్తగా | Measurement of Length and Motion, Integrating AI |
| ఈ సాధన పేపర్ | Section A – D, 20 ప్రశ్నలు, 35 మార్కులు, 1 గంట 15 నిమిషాలు |
ఇంకా ఉత్తర్వు లేదు: ఆరు నుంచి తొమ్మిది తరగతుల SA1 సబ్జెక్టు వారీ టైమ్ టేబుల్, ప్రశ్నపత్రం రూపం తెలిపే SCERT ఉత్తర్వు 17 అక్టోబర్ 2026 నాటికి విడుదల కాలేదు. అది వచ్చే వరకు 6 అక్టోబర్ ఆరో తరగతి FA2 సైన్స్ పేపర్ (Exam Code 621) నిర్మాణాన్నే అనుసరించాం.
ఆరో తరగతి మిగతా సబ్జెక్టుల SA1 సాధన పేపర్లన్నీ AP SA1 2026-27 – సిలబస్, టైమ్ టేబుల్, ప్రశ్నపత్రాలు పేజీలో ఒకే చోట ఉన్నాయి.
6వ తరగతి SA1 Science సిలబస్ 2026-27 — ఐదు పాఠాలు, FA2 తో పోలిక
ఆరో తరగతిలో జూన్, జూలై నెలలు సంసిద్ధత కార్యక్రమానికి కేటాయించారు; సైన్స్ పాఠాలు ఆగస్టు నుంచి మొదలయ్యాయి. క్యాలెండర్ ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్‌లో నాలుగు పాఠాలు, అక్టోబర్‌లో పొడవు కొలత – చలనం. చివరి కాలమ్ 6 అక్టోబర్ FA2 అసలు పేపర్‌తో పోల్చి రాసినది.
| క్యాలెండర్లో పేరు (పుస్తకంలో అధ్యాయం) | ముఖ్య అంశాలు | FA2 పేపర్లో |
|---|---|---|
| The World of Science (అధ్యాయం 1 — The Wonderful World of Science) | సైన్స్ అంటే ఏమిటి; శాస్త్రీయ పద్ధతి దశలు | రాలేదు |
| Diversity in the Living World (అధ్యాయం 2) | గుల్మాలు, పొదలు, వృక్షాలు; ఈనెల వ్యాపనం, వేర్లు; ద్విదళ – ఏకదళ బీజాలు; ఆవాసం, అనుకూలనాలు | వచ్చింది |
| Mindful Eating (అధ్యాయం 3 — A Path to a Healthy Body) | పోషకాలు, లోప వ్యాధులు, ఆహార పరీక్షలు, సమతుల ఆహారం, చిరుధాన్యాలు | వచ్చింది |
| Exploring Magnets (అధ్యాయం 4) | అయస్కాంత, అయస్కాంతేతర పదార్థాలు; ధ్రువాలు; దిక్సూచి; ఆకర్షణ – వికర్షణ | వచ్చింది |
| Measurement of Length and Motion (అధ్యాయం 5, అక్టోబర్) | ప్రామాణిక ప్రమాణాలు, స్కేలుతో సరైన కొలత, నిర్దేశ బిందువు, చలనం రకాలు | రాలేదు — కొత్త పాఠం |

ఫోన్లో దాచుకోండి: నారింజ కార్డులు FA2 లో కనిపించని పాఠాలు — SA1 చదువు అక్కడి నుంచే మొదలుపెట్టండి.
మొక్కల రకాలు, పోషకాలు, అయస్కాంత ధ్రువాల ప్రశ్నలకు 6 అక్టోబర్ అసలు పేపర్ జవాబులు AP 6th Class FA2 Science Question Paper 2026-27 పేజీలో ఉన్నాయి. రెండు పేపర్లూ రాస్తే ఐదు పాఠాలకూ సాధన పూర్తవుతుంది.
AP 6th Class SA1 Science Question Paper — 20 ప్రశ్నలు, జవాబులతో
సూచనలు: 20 ప్రశ్నలు, 35 మార్కులు, సమయం 75 నిమిషాలు. Section D లో A, B లలో ఏదో ఒక్కటే రాయాలి. కొలతలు రాసేటప్పుడు సంఖ్యతో పాటు ప్రమాణం (cm, m, km) తప్పనిసరి.
Section A — 15 × 1 = 15 మార్కులు
1. Ritu’s pen stopped writing. She guessed that the ink was over, so she opened the pen and checked the refill. Which step of the scientific method is she doing now?
(A) Observing (B) Asking a question (C) Testing the guess (D) Writing the summary [1 మార్కు]
జవాబు చూడండి
శాస్త్రీయ పద్ధతి: పరిశీలించడం, ప్రశ్న అడగడం, సాధ్యమైన జవాబు ఊహించడం, ఆ ఊహను ప్రయోగం లేదా పరిశీలనతో పరీక్షించడం, ఫలితాలను విశ్లేషించడం. రీఫిల్ తెరిచి చూడడం ఊహను పరీక్షించడమే. సిరా ఉంటే మరో ఊహ (సిరా ఎండిపోయిందేమో) చేసి మళ్ళీ పరీక్షిస్తుంది.
2. The SI unit of length is
(A) centimetre (B) kilometre (C) metre (D) handspan [1 మార్కు]
జవాబు చూడండి
అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి (SI) లో పొడవుకు ప్రమాణం మీటరు, గుర్తు m. జాన (handspan), మూర, అడుగు వంటివి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి కాబట్టి ప్రామాణిక ప్రమాణాలు కావు.
3. The distance between Deepa’s home and school is 1.5 km. In metres, this distance is
(A) 15 m (B) 150 m (C) 1500 m (D) 15000 m [1 మార్కు]
జవాబు చూడండి
1 km = 1000 m. కాబట్టి 1.5 km = 1.5 × 1000 = 1500 m. గుర్తుంచుకోండి: 1 m = 100 cm, 1 cm = 10 mm.
4. The smallest length that can be measured correctly with a common 15-cm scale is
(A) 1 cm (B) 1 mm (C) 0.1 mm (D) 1 m [1 మార్కు]
జవాబు చూడండి
15-cm స్కేలులో ప్రతి 1 cm భాగం 10 చిన్న భాగాలుగా విభజించి ఉంటుంది; ఒక్కో చిన్న భాగం 1 మిల్లీమీటరు. 1 mm = 0.1 cm.
5. The zero mark of Anish’s scale is broken. He places one end of a pencil at the 1.0 cm mark, and the other end reaches 10.4 cm. The length of the pencil is
(A) 10.4 cm (B) 11.4 cm (C) 9.4 cm (D) 9.0 cm [1 మార్కు]
జవాబు చూడండి
సున్నా గుర్తు కనిపించకపోతే వేరే పూర్తి గుర్తు (ఇక్కడ 1.0 cm) నుంచి కొలవాలి. పొడవు = చివరి రీడింగ్ − మొదటి రీడింగ్ = 10.4 cm − 1.0 cm = 9.4 cm.
6. While reading the length of a pencil placed along a scale, the eye should be
(A) to the left of the pencil’s tip (B) directly above the pencil’s tip (C) to the right of the pencil’s tip (D) far away at any angle [1 మార్కు]
జవాబు చూడండి
కన్ను కొలిచే చివర గుర్తుకు నేరుగా పైన ఉండాలి — పుస్తకంలోని పటంలో “B” స్థానం. పక్కకు వంగి చూస్తే రీడింగ్ తప్పుగా వస్తుంది. స్కేలును వస్తువు పొడవు వెంట దానికి తగిలేలా ఉంచాలి.
7. Padma reads ‘Delhi 70 km’ and later ‘Delhi 60 km’ on kilometre stones during her bus journey. Here the reference point is
(A) the bus (B) Padma’s seat (C) Delhi (D) the kilometre stone [1 మార్కు]
జవాబు చూడండి
దూరాన్ని ఏ స్థిర వస్తువు లేదా బిందువు నుంచి చెబుతున్నామో అదే నిర్దేశ బిందువు (reference point). కిలోమీటరు రాళ్ళు ఢిల్లీ నుంచి దూరం చూపుతున్నాయి. 70 నుంచి 60 కి తగ్గింది — అంటే పద్మ ఢిల్లీకి దగ్గరవుతోంది, ఆమె స్థానం కాలంతో మారుతోంది.
8. Assertion (A): Passengers sitting in a moving bus can be said to be at rest as well as in motion. Reason (R): Whether an object is at rest or in motion depends on the reference point chosen.
(A) Both A and R are true and R is the correct explanation of A. (B) Both A and R are true but R is not the correct explanation of A. (C) A is true but R is false. (D) A is false but R is true. [1 మార్కు]
జవాబు చూడండి
బస్సునే నిర్దేశ బిందువుగా తీసుకుంటే ప్రయాణికుల స్థానం మారడం లేదు — వారు నిశ్చల స్థితిలో ఉన్నారు. బయటి భవనాన్ని నిర్దేశ బిందువుగా తీసుకుంటే వారి స్థానం మారుతోంది — చలనంలో ఉన్నారు. దీపకు బస్సులో అనిపించిందీ ఇదే.
9. The to-and-fro movement of a swing is an example of
(A) linear motion (B) circular motion (C) oscillatory motion (D) no motion [1 మార్కు]
జవాబు చూడండి
ఒక స్థిర స్థానం చుట్టూ ముందుకీ వెనక్కీ కదిలే చలనం డోలన చలనం (oscillatory motion). ఉయ్యాల, దారానికి వేలాడదీసి వదిలిన రబ్బరు, బల్లకు నొక్కి పెట్టిన లోహపు పట్టీ చివర ఉదాహరణలు.
10. Which of the following is an example of linear motion?
(A) A merry-go-round (B) An eraser whirled on a thread (C) Students marching on a straight road (D) A swing [1 మార్కు]
జవాబు చూడండి
సరళరేఖ వెంట కదిలితే సరళరేఖా చలనం (linear motion). కవాతు, చెట్టు నుంచి కిందపడే నారింజ, సరళ రోడ్డుపై కారు ఉదాహరణలు. రంగులరాట్నం, దారానికి కట్టి తిప్పిన రబ్బరు వృత్తాకార చలనం; ఉయ్యాల డోలన చలనం.
11. A soaked maize seed does not split into two parts because it has
(A) no seed coat (B) one cotyledon (C) two cotyledons (D) no root [1 మార్కు]
జవాబు చూడండి
మొక్కజొన్న విత్తనంలో ఒకే బీజదళం — ఏకదళ బీజం (monocot). నానబెట్టిన శనగ రెండుగా విడిపోతుంది — రెండు బీజదళాలు, ద్విదళ బీజం (dicot). ఏకదళాలకు సాధారణంగా సమాంతర ఈనెలు, పీచు వేర్లు; ద్విదళాలకు జాలాకార ఈనెలు, తల్లివేరు.
12. Camels found in the cold desert of Ladakh have
(A) one hump and long legs (B) two humps and comparatively shorter legs (C) no hump (D) one hump and wide hooves only [1 మార్కు]
జవాబు చూడండి
లడఖ్ చల్లని ఎడారి ఒంటెలకు రెండు మూపురాలు; పొట్టి కాళ్ళు కొండ ప్రాంతంలో నడవడానికి; తల నుంచి మెడ వరకు పొడవాటి వెంట్రుకలు చలికి. రాజస్థాన్ వేడి ఎడారి ఒంటెకు ఒకే మూపురం, ఇసుకలో కూరుకుపోకుండా పొడవాటి కాళ్ళు, వెడల్పాటి గిట్టలు.
13. Sailors on long voyages long ago suffered from bleeding and swollen gums. Eating lemons and oranges cured them. The disease was due to lack of
(A) Vitamin A (B) Vitamin C (C) Vitamin D (D) Iodine [1 మార్కు]
జవాబు చూడండి
చిగుళ్ళ నుంచి రక్తం, వాపు స్కర్వీ వ్యాధి లక్షణాలు — విటమిన్ C లోపం. 1746 లో జేమ్స్ లిండ్ నిమ్మ, నారింజ తిన్న నావికులు కోలుకోవడం గమనించారు. ఉసిరి, జామ, పచ్చిమిర్చి కూడా విటమిన్ C ఇస్తాయి.
14. A few drops of dilute iodine solution are put on a slice of potato. The slice turns blue-black. This shows the presence of
(A) protein (B) fat (C) starch (D) vitamin C [1 మార్కు]
జవాబు చూడండి
అయోడిన్ ద్రావణంతో నీలి నలుపు రంగు వస్తే పిండిపదార్థం (starch) ఉన్నట్టు. కొవ్వుకు కాగితంపై నూనె మరక, ప్రొటీన్‌కు కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడాతో ఊదా రంగు. చక్కెర కూడా కార్బోహైడ్రేటే అయినా అయోడిన్‌తో నీలి నలుపు రాదు.
15. A bar magnet is broken into two pieces. Each piece will have
(A) only a North pole (B) only a South pole (C) both a North pole and a South pole (D) no poles [1 మార్కు]
జవాబు చూడండి
అయస్కాంత ధ్రువాలు ఎప్పుడూ జంటగానే ఉంటాయి. ఎంత చిన్న ముక్కగా విరిచినా ప్రతి ముక్కకు ఉత్తర, దక్షిణ ధ్రువాలు రెండూ ఉంటాయి; ఒక్క ధ్రువం గల అయస్కాంతం సాధ్యం కాదు.
Section B — 2 × 2 = 4 మార్కులు
16. Write the steps of the scientific method in the correct order. [2 మార్కులు]
జవాబు చూడండి
2. దాని గురించి ఆలోచించి ఒక ప్రశ్న అడగడం.
3. ఆ ప్రశ్నకు సాధ్యమైన జవాబును ఊహించడం.
4. ఆ ఊహను ప్రయోగాలతో లేదా మరిన్ని పరిశీలనలతో పరీక్షించడం.
5. ఫలితాలు ప్రశ్నకు జవాబు ఇచ్చాయో లేదో విశ్లేషించడం.
మార్కులు: వరుస సరిగ్గా ఉంటే 2. ఉదాహరణ: టైరులో గాలి ఎక్కడ పోయిందో వెతికే సైకిల్ రిపేర్ చేసే వ్యక్తి కూడా ఇదే పద్ధతి పాటిస్తాడు.
17. Tasneem wants to make her own metre scale. She has plywood, paper, cloth, stretchable rubber and steel. Which materials should she not use, and why? [2 మార్కులు]
జవాబు చూడండి
వాడదగినవి: ప్లైవుడ్, స్టీలు — గట్టిగా ఉండి ఆకారం, పొడవు మారవు; గుర్తులు స్థిరంగా ఉంటాయి. — 1 మార్కు
చెట్టు చుట్టుకొలత, ఛాతీ కొలత వంటి వంపు కొలతలకు మాత్రం దర్జీ టేపు లాంటి వంగే టేపు కావాలి — కానీ అది కూడా సాగకూడదు.
Section C — 2 × 4 = 8 మార్కులు
18. When is an object said to be in motion? Explain linear, circular and oscillatory motion with one example each. [4 మార్కులు]
జవాబు చూడండి
సరళరేఖా చలనం: వస్తువు సరళరేఖ వెంట కదలడం. ఉదా: పై నుంచి వదిలిన రబ్బరు కిందపడడం, బరువైన పెట్టెను నేరుగా నెట్టడం. — 1 మార్కు
వృత్తాకార చలనం: వస్తువు వృత్తాకార మార్గంలో కదలడం. ఉదా: రంగులరాట్నం, దారానికి కట్టి తలపై తిప్పిన రబ్బరు. — 1 మార్కు
డోలన చలనం: ఒక స్థిర స్థానం చుట్టూ ముందుకీ వెనక్కీ కదలడం. ఉదా: ఉయ్యాల, వేలాడదీసి పక్కకు లాగి వదిలిన రబ్బరు. — 1 మార్కు
అదనపు విషయం: నిర్ణీత కాలానికి ఒకసారి అదే మార్గం పునరావృతమైతే ఆవర్తన చలనం — వృత్తాకార, డోలన చలనాలు రెండూ ఆవర్తనమే.
19. Gourav fractured his leg. The doctor gave him calcium tablets, and on the next visit added Vitamin D syrup. (a) Why calcium? (b) Why Vitamin D along with calcium? (c) Name two sources of Vitamin D. (d) Which disease is caused by lack of Vitamin D, and what is its symptom? [4 మార్కులు]
జవాబు చూడండి
(b) విటమిన్ D శరీరం కాల్షియంను గ్రహించడానికి సాయపడుతుంది. అది లేకపోతే తీసుకున్న కాల్షియం ఎముకలకు పూర్తిగా అందదు. — 1 మార్కు
(c) ఎండ తగలడం (సూర్యరశ్మికి శరీరం విటమిన్ D తయారుచేసుకుంటుంది), పాలు, వెన్న, చేపలు, గుడ్లు — ఏవైనా రెండు. — 1 మార్కు
(d) రికెట్స్ (Rickets) — ఎముకలు మెత్తబడి వంగిపోతాయి. — 1 మార్కు
కాల్షియం వనరులు: పాలు / సోయా పాలు, పెరుగు, చీజ్, పనీర్. కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనమై దంతాలు పుచ్చుతాయి.
Section D — 1 × 8 = 8 మార్కులు
20. A) Describe the correct way of measuring length with a scale. How will you measure (i) when the zero mark of the scale is broken, and (ii) the length of a curved line? Why should a length always be written with a number and a unit?
(OR)
B) What are habitat and adaptation? Compare the camels of the hot desert of Rajasthan and the cold desert of Ladakh. How are cactus and deodar adapted to their surroundings? [8 మార్కులు]
జవాబు చూడండి
సరైన పద్ధతి: (1) కొలవాల్సిన దానికి తగిన స్కేలు ఎంచుకోవాలి — పెన్సిల్‌కు 15-cm స్కేలు, గది ఎత్తుకు మీటరు స్కేలు లేదా టేపు, చెట్టు చుట్టుకొలతకు వంగే టేపు. (2) స్కేలును వస్తువు పొడవు వెంట దానికి తగిలేలా ఉంచాలి. (3) కన్ను కొలిచే చివరకు నేరుగా పైన ఉండాలి, పక్కకు వంగి చదవకూడదు.
(i) సున్నా విరిగిన స్కేలు: వేరే ఏదైనా పూర్తి గుర్తు (ఉదా: 1.0 cm) వద్ద వస్తువు ఒక చివర ఉంచాలి. రెండో చివరి రీడింగ్ నుంచి ఈ రీడింగ్ తీసివేయాలి. ఉదా: 10.4 cm − 1.0 cm = 9.4 cm.
(ii) వంపు గీత: దారాన్ని వంపు గీత వెంట జాగ్రత్తగా పరిచి, ప్రారంభ, చివరి బిందువుల వద్ద గుర్తు పెట్టాలి. దారాన్ని నేరుగా చాపి మీటరు స్కేలుతో కొలవాలి. వంగే కొలత టేపు ఉంటే నేరుగా దానితోనూ కొలవవచ్చు.
ప్రమాణం ఎందుకు: కొలతకు రెండు భాగాలు — సంఖ్య, ప్రమాణం. కేవలం “13” అని రాస్తే 13 cm యో, 13 m యో తెలియదు. ప్రమాణాల గుర్తులు చిన్న అక్షరాల్లో, బహువచనానికి s లేకుండా, సంఖ్యకు ప్రమాణానికి మధ్య ఖాళీతో రాయాలి — ఉదా: 9.4 cm.
B) జవాబు (నిర్వచనాలు 2, ఒంటెల పోలిక 4, కాక్టస్ – దేవదారు 2):
ఆవాసం: మొక్కలు, జంతువులు నివసించే ప్రదేశం — ఆహారం, నీరు, గాలి, ఆశ్రయం ఇస్తుంది. ఉదా: సముద్ర తాబేలుకు సముద్రం. అనుకూలనాలు: ఒక ప్రాంతంలో బతకడానికి వీలు కల్పించే ప్రత్యేక లక్షణాలు.
| అంశం | రాజస్థాన్ వేడి ఎడారి ఒంటె | లడఖ్ చల్లని ఎడారి ఒంటె |
|---|---|---|
| మూపురం | ఒకటి — ఆహారం దొరకనప్పుడు నిల్వ ఆహారం | రెండు — చలికాలం చివర ఆహారం కొరతతో కుంచించుకుపోతాయి |
| కాళ్ళు | పొడవు, వెడల్పాటి గిట్టలు — ఇసుకలో కూరుకుపోకుండా | సాపేక్షంగా పొట్టి — కొండ ప్రాంతంలో సులభంగా నడవడానికి |
| ఇతర లక్షణం | తక్కువ మూత్రం, పొడి పేడ, చెమట పట్టదు — నీరు ఆదా | తల నుంచి మెడ వరకు పొడవాటి వెంట్రుకలు — చలి తట్టుకోవడానికి |
కాక్టస్: ఎడారిలో నీరు చాలా తక్కువ — మందమైన, కండగల కాండం నీటిని నిల్వ చేసి వేడిని తట్టుకోవడానికి సాయపడుతుంది. దేవదారు: హిమపాతం ఎక్కువ — శంఖు ఆకారం, వాలుగా వంగే కొమ్మల వల్ల మంచు సులభంగా జారిపోతుంది.
పాఠాల వారీ మార్కుల పంపకం
| పాఠం | ప్రశ్న సంఖ్యలు | మార్కులు |
|---|---|---|
| Measurement of Length and Motion | 2 – 10, 17, 18, 20A | 15 (20A రాస్తే 23) |
| The World of Science | 1, 16 | 3 |
| Mindful Eating | 13, 14, 19 | 6 |
| Diversity in the Living World | 11, 12, 20B | 2 (20B రాస్తే 10) |
| Exploring Magnets | 15 | 1 |
FA2 లో రాని రెండు పాఠాలకే 18 మార్కులు; Section D లో A ఎంచుకుంటే 26. ఆహారం, అయస్కాంతాలు, వైవిధ్యం పాఠాల్లో FA2 లో అడగని అంశాలే (స్కర్వీ, రికెట్స్, పిండిపదార్థ పరీక్ష, ఒంటెలు, బీజదళాలు) ఇక్కడ తీసుకున్నాం.
ఆరో తరగతి సైన్స్ — పేపర్ బయట 7 ముఖ్య ప్రశ్నలు
| ప్రశ్న | జవాబు |
|---|---|
| అంగుళ (angula) అంటే ఏమిటి? | వేలి వెడల్పు — ప్రాచీన భారతీయ పొడవు ప్రమాణం. అంగుళ గుణిజాలు, ధనుష, యోజన కూడా ప్రాచీన గ్రంథాల్లో ఉన్నాయి. వడ్రంగులు, దర్జీలు ఇప్పటికీ అంగుళ వాడతారు; హరప్పా తవ్వకాల్లో గుర్తులున్న స్కేళ్ళ వంటి వస్తువులు దొరికాయి. |
| దృష్టి లోపం ఉన్న విద్యార్థులు పొడవు ఎలా కొలుస్తారు? | ఉబ్బెత్తు గుర్తులు (raised markings) ఉన్న స్కేళ్ళతో — వేళ్ళతో తాకి గుర్తులను తెలుసుకుంటారు. |
| 1 inch ఎన్ని సెంటీమీటర్లు? | 1 inch = 2.54 cm. కొన్ని స్కేళ్ళకు రెండో వైపు inch గుర్తులు ఉంటాయి; inch, foot పాత ప్రమాణాలు, కొందరు ఇప్పటికీ వాడతారు. |
| ఆవర్తన చలనం (periodic motion) అంటే? | నిర్ణీత కాల వ్యవధి తర్వాత వస్తువు మళ్ళీ అదే మార్గంలో కదిలితే ఆ చలనం ఆవర్తనం. వృత్తాకార చలనం, డోలన చలనం రెండూ ఆవర్తన చలనాలే. |
| మత్స్య యంత్రం (matsya-yantra) ఏమిటి? | ఆధునిక దిక్సూచి రాకముందు భారతీయులు సముద్ర ప్రయాణంలో వాడిన పరికరం — నూనె నింపిన పాత్రలో ఉంచిన, అయస్కాంతీకరించిన చేప ఆకారపు ఇనుప ముక్క. |
| జానకి అమ్మాళ్ ఎవరు? | భారతీయ వృక్షశాస్త్రవేత్త (1897 – 1984). Save Silent Valley ఉద్యమంలో కీలక పాత్ర; Botanical Survey of India అధిపతిగా దేశ మొక్కల వైవిధ్యాన్ని నమోదు చేసే కార్యక్రమాలు ప్రారంభించారు. |
| ఫుడ్ మైల్స్ (food miles) అంటే? | ఒక ఆహార పదార్థం ఉత్పత్తిదారు నుంచి వినియోగదారుకు చేరేవరకు ప్రయాణించిన మొత్తం దూరం. తగ్గిస్తే రవాణా ఖర్చు, కాలుష్యం తగ్గుతాయి; స్థానిక రైతులకు మేలు, ఆహారం తాజాగా ఉంటుంది. |
పొడవు ప్రమాణాలు, చలనం రకాలు — ఒకే పట్టికలో
| మార్పిడి | ఎప్పుడు వాడతాం |
|---|---|
| 1 km = 1000 m | రెండు నగరాల మధ్య దూరం, రైలు పట్టా పొడవు |
| 1 m = 100 cm | బడి మైదానం, గది ఎత్తు |
| 1 cm = 10 mm | రబ్బరు, పెన్సిల్ పొడవు |
| 1 mm = 0.1 cm | నాణెం మందం; 15-cm స్కేలులో చిన్న కొలత |
| 1 inch = 2.54 cm | పాత ప్రమాణం — కొన్ని స్కేళ్ళలో రెండో వైపు |
| చలనం రకం | ఎలా కదులుతుంది | ఉదాహరణలు |
|---|---|---|
| సరళరేఖా చలనం | సరళరేఖ వెంట | కవాతు, కిందపడే నారింజ, నెట్టిన పెట్టె |
| వృత్తాకార చలనం | వృత్తాకార మార్గంలో | రంగులరాట్నం, దారానికి కట్టి తిప్పిన రబ్బరు |
| డోలన చలనం | స్థిర స్థానం చుట్టూ ముందుకీ వెనక్కీ | ఉయ్యాల, వేలాడే రబ్బరు, లోహపు పట్టీ చివర |
6వ తరగతి SA1 సైన్స్ సాధన పేపర్ PDF
ప్రింట్ తీసి ఇంట్లో పరీక్ష రాయాలంటే: Download PDF — AP 6th Class SA1 Science Practice Paper 2026-27. ముందు పేజీల్లో 20 ప్రశ్నలు, చివర్లో జవాబులు.
ఆరో తరగతి సైన్స్‌లో మార్కులు జారిపోయే 7 చోట్లు
- 1 km = 100 m అని రాయడం: సరైనది 1 km = 1000 m; 1 m = 100 cm.
- ప్రమాణానికి s, చుక్క పెట్టడం: 15 cms, 2 m. అని కాదు — 15 cm, 2 m.
- విరిగిన స్కేలు రీడింగ్‌ను నేరుగా రాయడం: మొదటి గుర్తు రీడింగ్ తీసివేయాలి.
- పక్కకు వంగి స్కేలు చదవడం: కన్ను కొలిచే చివరకు నేరుగా పైన ఉండాలి.
- ఉయ్యాలను వృత్తాకార చలనం అనడం: అది డోలన చలనం.
- నిర్దేశ బిందువు చెప్పకుండా “కదులుతోంది” అనడం: దేనికి సంబంధించి కదులుతోందో రాయాలి.
- చక్కెరపై అయోడిన్ పరీక్ష: చక్కెర కార్బోహైడ్రేట్ అయినా నీలి నలుపు రాదు — ఆ రంగు పిండిపదార్థానికే.
6వ తరగతి సైన్స్ — SA1 ముందు 10 రోజుల ప్లాన్
రోజుకు 40 నిమిషాలు. కొలత పాఠం చదివేటప్పుడు ఇంట్లోని స్కేలు, దారంతో నిజంగా కొలిచి చూడండి — లెక్కలు మర్చిపోరు.
| రోజు | చదవాల్సింది |
|---|---|
| 1 | మొదటి పాఠం — సైన్స్ అంటే ఏమిటి, శాస్త్రీయ పద్ధతి ఐదు దశలు, పెన్ను ఉదాహరణ |
| 2 | కొలత: జాన, మూర, అంగుళ; SI ప్రమాణాలు; km – m – cm – mm మార్పిడులు |
| 3 | స్కేలుతో సరైన కొలత, కన్ను స్థానం, విరిగిన స్కేలు, వంపు గీత — Activity 5.1 |
| 4 | నిర్దేశ బిందువు, కిలోమీటరు రాళ్ళు, చలనం – నిశ్చలస్థితి, బస్సు ఉదాహరణ |
| 5 | సరళరేఖా, వృత్తాకార, డోలన, ఆవర్తన చలనాలు; అధ్యాయం 5 చివరి ప్రశ్నలు |
| 6 | వైవిధ్యం: గుల్మాలు – పొదలు – వృక్షాలు, ఈనెలు, వేర్లు, బీజదళాలు, ఒంటెలు, ఆవాసం |
| 7 | ఆహారం: పోషకాలు, విటమిన్లు – ఖనిజాల చార్ట్, ఆహార పరీక్షలు, సమతుల ఆహారం |
| 8 | అయస్కాంతాలు: ధ్రువాలు, దిక్సూచి, ఆకర్షణ – వికర్షణ — FA2 అసలు పేపర్‌తో |
| 9 | పై 20 ప్రశ్నల పేపర్ — 75 నిమిషాల్లో, మధ్యలో ఆపకుండా |
| 10 | తప్పులు సరిదిద్దడం, కొలతల పట్టిక, 7 అదనపు ప్రశ్నలు మళ్ళీ |
ఆరో తరగతి పుస్తకాలు, నోట్స్, ప్రశ్నపత్రాల కోసం AP 6th Class Textbooks, Notes, Study Material & Question Papers చూడండి. అన్ని సబ్జెక్టుల SA1 పాఠాల జాబితా AP SA1 Syllabus 2026-27 – Class 6 to 10 లో ఉంది.
తర్వాత ఏం చదవాలి
- AP 6th Class FA2 Science Question Paper 2026-27 — మొక్కలు, ఆహారం, అయస్కాంతాల అసలు పేపర్
- AP 6th Class SA1 English Question Paper 2026-27 — Poorvi సాధన పేపర్
- AP 6th Class SA1 Maths Question Paper 2026-27 — గణితం సాధన పేపర్
- AP 6th Class SA1 Telugu Question Paper 2026-27 — తెలుగు సాధన పేపర్
FAQs
ఆరో తరగతి SA1 సైన్స్ పరీక్ష ఎప్పుడు?
SCERT క్యాలెండర్ SA1 పరీక్షలకు 9 – 20 నవంబర్ 2026 (Tentative) ఇచ్చింది. సైన్స్ తేదీ సబ్జెక్టు వారీ టైమ్ టేబుల్ వచ్చాకే తెలుస్తుంది.
6వ తరగతి SA1 Science సిలబస్‌లో ఏ పాఠాలు ఉన్నాయి?
ఐదు: The World of Science, Diversity in the Living World, Mindful Eating, Exploring Magnets, Measurement of Length and Motion. అక్టోబర్‌లో Integrating AI కూడా.
ఆరో తరగతి FA2 సైన్స్‌లో ఏ పాఠాల నుంచి ప్రశ్నలు వచ్చాయి?
6 అక్టోబర్ పేపర్ (Exam Code 621) మొక్కల రకాలు, ఈనెలు, ఆవాసాలు – అనుకూలనాలు, ఆహారం – పోషకాలు, అయస్కాంతాల మీద వచ్చింది.
Measurement of Length and Motion ఏ నెల పాఠం?
క్యాలెండర్లో అక్టోబర్ పాఠం. Curiosity పుస్తకంలో అధ్యాయం 5.
ఈ పేపర్ ప్రభుత్వం ఇచ్చిందా?
లేదు. ప్రశ్నలు, జవాబులు Curiosity పుస్తకం ఆధారంగా మేము తయారుచేశాం; తేదీలు, పాఠాలు SCERT క్యాలెండర్ నుంచి.
ఆరో తరగతి SA1 సైన్స్ ఎన్ని మార్కులకు?
SCERT ఉత్తర్వు వచ్చాకే ఖచ్చితంగా తెలుస్తుంది. FA2 సైన్స్ 20 ప్రశ్నలు, 35 మార్కులు — ఈ సాధన పేపర్ కూడా అంతే.
నిర్దేశ బిందువు (reference point) అంటే ఏమిటి?
దూరాన్ని లేదా స్థానాన్ని ఏ స్థిర వస్తువు, బిందువు నుంచి చెబుతామో అది. కబడ్డీ కోర్టు గీతలు గీసే ముందు దీప బృందం ఎంచుకున్న బిందువు ఒక ఉదాహరణ.
జాన (handspan) ప్రామాణిక ప్రమాణం ఎందుకు కాదు?
ఒక్కొక్కరి జాన పొడవు వేరు. ఒకే బల్లను కొలిచినా అనీష్, పద్మ, తస్నీమ్, దీప, హర్దీప్లకు వేర్వేరు సంఖ్యలు వచ్చాయి. అందుకే అందరికీ ఒకేలా ఉండే మీటరు వంటి ప్రమాణాలు అవసరం.
ఏకదళ, ద్విదళ మొక్కల తేడా ఏమిటి?
ఏకదళ బీజం (మొక్కజొన్న, గోధుమ): ఒక బీజదళం, సమాంతర ఈనెలు, పీచు వేర్లు. ద్విదళ బీజం (శనగ, మందార): రెండు బీజదళాలు, జాలాకార ఈనెలు, తల్లివేరు.
చిరుధాన్యాలను nutri-cereals అని ఎందుకు అంటారు?
జొన్న, సజ్జ, రాగి, ఊదలు (sanwa) వంటివాటిలో విటమిన్లు, ఇనుము, కాల్షియం, పీచు పదార్థాలు ఎక్కువ. వేర్వేరు వాతావరణాల్లో సులభంగా పండుతాయి.
అయస్కాంతాన్ని సురక్షితంగా ఎలా ఉంచాలి?
జంటగా, విజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండేలా, మధ్యలో చెక్క ముక్క పెట్టి, చివర్లకు మెత్తని ఇనుప ముక్కలు అడ్డంగా ఉంచాలి. వేడి చేయకూడదు, కింద పడేయకూడదు, సుత్తితో కొట్టకూడదు; మొబైల్, రిమోట్లకు దూరంగా ఉంచాలి.
స్కోర్ బార్ ఎలా వాడాలి?
జవాబు తెరిచాక కనిపించే చెక్‌బాక్స్‌ను మీ జవాబు సరిపోతేనే గుర్తించండి. Section D లో మీరు రాసిన ఒక్క భాగానికే టిక్. PDF కావాలంటే పైన ఉన్న డౌన్లోడ్ లింక్ వాడండి.
Official Sources
SA1 తేదీలు, నెలవారీ పాఠాలు: AP SCERT — High School Academic Calendar 2026-27. పాఠ్యాంశాలు: NCERT Curiosity — Textbook of Science for Grade 6 (Reprint 2026-27), అధ్యాయాలు 1 – 5.
