18 నవంబర్ 2026 SA1 Social Studies Answer Key (Key Paper) – పరీక్షలో వచ్చిన అసలు ప్రశ్నపత్రం, జవాబులు (6వ తరగతి, 80 మార్కులు)
ఆరో తరగతి SA1 సాంఘిక శాస్త్రం పరీక్ష (Exam Code 653, PS-6) 18 నవంబర్ 2026 న జరిగింది. 33 ప్రశ్నలు, 80 మార్కులు, 3 గంటలు: Section A 20 × 1, B 4 × 2, C 5 × 4, D 4 × 8. ప్రతి ప్రశ్న కిందే జవాబు ఉంది. Section D లో A, B రెండింటికీ, పటం ప్రశ్నకు రెండు జాబితాలకూ ఆనవాళ్లు ఇచ్చాము.
మీ మార్కులు లెక్కించుకోండి: ప్రతి జవాబు కింద ‘నా జవాబు సరైనదే’ టిక్ పెట్టండి. కింది బార్లో మీ మొత్తం మార్కుల అంచనా కనిపిస్తుంది.
18 నవంబర్ 2026 సాంఘిక శాస్త్రంతో SA1 ప్రధాన పరీక్షలు పూర్తయ్యాయి. 6వ తరగతి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ జవాబులు అన్నీ AP SA1 Key Papers 2026-27 పేజీలో ఉన్నాయి. తర్వాతి పరీక్ష FA3 (జనవరి 2027), దాని సాధన పేపర్లు త్వరలో ఇదే సైట్లో.
మన సాధన పత్రం నుంచి వచ్చినవి: ఈ పేజీ కింద ఉన్న సాధన పత్రంలోని అంశాలే అసలు పేపర్లో వచ్చాయి: ఆర్థిక – ఆర్థికేతర కార్యకలాపాలు (సాధన 1, 5, 16 = పేపర్ 20, 23, 30 A), ప్రతిఫలం లభించే మార్గాలు (సాధన 2, 4, 18 = పేపర్ 30 B), విలువ జోడింపు (సాధన 3 = పేపర్ 3), భారతదేశ పేర్లు (సాధన 13, 19 = పేపర్ 5, 6, 24), స్థానిక సమయం, IST (సాధన 7, 8, 17 = పేపర్ 15, 32 A), సమాజ భాగస్వామ్యం (సాధన 15, 20 = పేపర్ 9, 22).
Section A – బహుళైచ్ఛిక ప్రశ్నలు (20 × 1 = 20 మార్కులు)
1. The word ‘Veda’ is derived from the Sanskrit word ‘Vid’, which means ____ / ‘వేదం’ అనే పదం సంస్కృత పదమైన ‘విద్’ నుండి వచ్చింది, విద్ అనగా
2. Which organisation has prepared a set of standard symbols for maps of India? / భారతదేశ పటాల కోసం ప్రామాణిక చిహ్నాలను ఏ సంస్థ రూపొందిస్తుంది?
3. Rajesh brings wood and makes it into chairs. If the value of the wood increases, what is this process called? / ఈ ప్రక్రియను ఏమని పిలుస్తారు?
4. Vardhamana Mahavira was born in Vaishali. In which present-day state is Vaishali located? / ప్రస్తుతం వైశాలి ఏ రాష్ట్రంలో ఉంది?
5. Identify the reason that the ancient Chinese called India as ‘Tianzhu’. / ప్రాచీన చైనీయులు భారతదేశాన్ని ‘తియాన్ఝు’ అని పిలవడానికి కారణం
6. Who were the first foreigners to mention India? / భారతదేశాన్ని గురించి ప్రస్తావించిన మొదటి విదేశీయులు ఎవరు?
7. Where did the Toda tribals inhabit? / తోడా గిరిజన తెగవారు ఎక్కడ నివసించేవారు?
8. Why do people take part in economic activities? / ప్రజలు ఆర్థిక కార్యకలాపాలలో ఎందుకు పాల్గొంటారు?
9. Which of the following works require community participation? a) Using shared natural wealth and resources b) Celebrating festivals and organizing feasts c) Managing grazing lands and forest produce d) Self studying for professional development / కింది వాటిలో ఏ పనులకు సామాజిక భాగస్వామ్యం అవసరం?
10. According to Buddhist philosophy, which of the following is the main cause of human suffering? / బౌద్ధ తత్వశాస్త్రం ప్రకారం మానవ దుఃఖానికి ప్రధాన కారణం ఏది?
11. Why do historians use a timeline? / చరిత్రకారులు కాలరేఖను ఎందుకు ఉపయోగిస్తారు?
12. The picture shows the symbol of the Olympic Games (five rings). What do these rings symbolise? / ఒలింపిక్ క్రీడల చిహ్నం దేనిని సూచిస్తుంది?
13. Which of the following is not true about early humans? / ఆదిమానవుల గురించి సరికానిది ఏది?
14. In the Vedic period, which of the following terms referred to collective gatherings or assemblies? / వేద కాలంలో సామూహిక సమావేశాలను లేదా సభలను సూచించే పదాలు ఏవి?
15. Which of the following is used to calculate the local time of a particular place? / ఒక నిర్దిష్ట ప్రదేశం యొక్క స్థానిక సమయాన్ని దేని ఆధారంగా లెక్కిస్తారు?
16. Which type of disaster is tsunami? / సునామీ ఏ రకమైన విపత్తు?
17. Which latitude passes through the middle of India? / భారతదేశం మధ్య గుండా ఏ అక్షాంశం వెళ్తుంది?
18. Padma wants to identify the major mountains in her atlas. Which type of map should she use? / ఆమె ఏ రకమైన పటాన్ని ఉపయోగించాలి?
19. Riya found a stone tablet with a script that is unfamiliar to her. To understand what is written on it, whom should she approach? / దానిపై ఏమి రాసి ఉందో తెలుసుకోవడానికి ఆమె ఎవరిని సంప్రదించాలి?
20. Vinod’s grandmother is a retired employee. She helps him with his studies. What type of activity does this represent? / ఇది ఎలాంటి కార్యకలాపాన్ని సూచిస్తుంది?
Section B (4 × 2 = 8 మార్కులు)
21. Name any two sources used to study history. / చరిత్రను అధ్యయనం చేయడానికి ఉపయోగించే ఏవైనా రెండు ఆధారాలను పేర్కొనండి. [2 మార్కులు]
1) పురావస్తు ఆధారాలు (Archaeological sources): పనిముట్లు, కుండలు, నాణేలు, భవనాల శిథిలాలు, శాసనాలు, గుహ చిత్రాలు.
2) సాహిత్య ఆధారాలు (Literary sources): వేదాలు, ఇతిహాసాలు, తాళపత్ర గ్రంథాలు, విదేశీ యాత్రికుల రచనలు.
(ఇంకా: మౌఖిక సంప్రదాయాలు – పాటలు, కథలు.)
22. What is the importance of community? / సముదాయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? [2 మార్కులు]
1) సహకారం, సహాయం: కష్టాల్లో (వరదలు, అనారోగ్యం, పెళ్లిళ్లు) సభ్యులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు.
2) ఉమ్మడి వనరులు, సంస్కృతి: చెరువులు, మేత భూములు, అడవులను కలిసి కాపాడుకుంటారు; పండుగలు, ఆచారాలు, భాష, సంప్రదాయాలను కలిసి కొనసాగిస్తారు. మనిషికి భద్రత, గుర్తింపు సమాజం నుంచే వస్తాయి.
23. Read the following situations and identify which are economic activities and which are non-economic activities: 1. Parents cooking food for their children. 2. Ganesh volunteers to teach computer skills to young adults. 3. The maid cooking food for Rahul’s grandparents. 4. Rohan works for a software company. [2 మార్కులు]
| సందర్భం | కార్యకలాపం |
|---|---|
| 1) తల్లిదండ్రులు పిల్లల కోసం వంట చేయడం | ఆర్థికేతర (ప్రేమతో, డబ్బు లేకుండా) |
| 2) గణేష్ స్వచ్ఛందంగా కంప్యూటర్ నేర్పించడం | ఆర్థికేతర (సేవ, జీతం లేదు) |
| 3) పనిమనిషి రాహుల్ తాతయ్య నానమ్మల కోసం వంట చేయడం | ఆర్థిక (జీతం తీసుకుంటుంది) |
| 4) రోహన్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం | ఆర్థిక (జీతం వస్తుంది) |
ఒకే పని (వంట) డబ్బు కోసం చేస్తే ఆర్థికం, ప్రేమ / సేవ కోసం చేస్తే ఆర్థికేతరం.
24. How did India get its different names from ancient times to the present? / భారతదేశం ప్రాచీన కాలం నుంచి నేటి వరకు వివిధ పేర్లను ఎలా పొందింది? [2 మార్కులు]
1) భారత / భారతవర్ష: ఋగ్వేదంలోని ‘భరతులు’ అనే తెగ, పురాణాల్లోని భరతుడి పేరు నుంచి. ‘జంబూద్వీపం’ అనే పేరు కూడా ఉంది.
2) హిందు, హిందుస్థాన్: పర్షియన్లు సింధు నదిని ‘హిందు’ అని పిలిచారు; తర్వాత ‘హిందుస్థాన్’ వచ్చింది.
3) ఇండియా: గ్రీకులు ‘హ’ వదిలి ‘ఇండోయ్ / ఇండికే’ అన్నారు; దాని నుంచి ‘ఇండియా’. చైనీయులు ‘యిందు’, ‘తియాన్ఝు’ అన్నారు.
4) నేడు మన రాజ్యాంగం ‘India, that is Bharat’ అని రెండు పేర్లనూ గుర్తించింది.
Section C (5 × 4 = 20 మార్కులు)
25. Why do we need symbols and colours on a map? Give any four reasons. / పటంలో చిహ్నాలు మరియు రంగులు ఎందుకు అవసరం? ఏవైనా నాలుగు కారణాలు తెలపండి. [4 మార్కులు]
1) స్థలం ఆదా: పటంపై రోడ్లు, బడులు, ఆసుపత్రులు, గుడులను బొమ్మలుగా గీయలేము; చిన్న చిహ్నాలతో చూపవచ్చు.
2) సులభంగా అర్థం: చిహ్నాలు, రంగులు చూడగానే సమాచారం తెలుస్తుంది; ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు.
3) భాష అడ్డంకి లేదు: ప్రామాణిక చిహ్నాలను (సర్వే ఆఫ్ ఇండియా) ఏ భాష వారైనా అర్థం చేసుకోవచ్చు.
4) రంగుల అర్థం: నీలం – నీరు (సముద్రాలు, నదులు), ఆకుపచ్చ – మైదానాలు / వృక్షాలు, పసుపు – పీఠభూములు, గోధుమ రంగు – పర్వతాలు. ఎత్తు, లోతు తేడాలు రంగులతో తెలుస్తాయి.
5) పట సూచిక (legend / key) లో చిహ్నాల అర్థం ఇస్తారు; దాంతో పటం చదవడం సులభం.
26. Imagine you are a historian explaining the importance of history. State four reasons why knowing history is important. / చరిత్ర తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో నాలుగు కారణాలు తెలపండి. [4 మార్కులు]
1) మన మూలాలు: మన పూర్వీకులు ఎలా జీవించారో, మన సమాజం, సంస్కృతి ఎలా ఏర్పడ్డాయో తెలుస్తుంది.
2) ప్రస్తుతాన్ని అర్థం చేసుకోవడం: నేటి భాషలు, ఆచారాలు, నగరాలు, సంస్థలు ఎలా వచ్చాయో అర్థమవుతుంది.
3) తప్పుల నుంచి పాఠాలు: గతంలో యుద్ధాలు, విభజనలు, అన్యాయాల నుంచి నేర్చుకుని మంచి భవిష్యత్తు నిర్మించవచ్చు.
4) వారసత్వ గౌరవం, ఐక్యత: మన కట్టడాలు, కళలు, శాస్త్ర విజ్ఞాన సాధనలను గౌరవించి కాపాడతాం; వివిధ ప్రాంతాల ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుంది.
27. Write any four differences between latitudes and longitudes. / అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య ఏవైనా నాలుగు భేదాలను రాయండి. [4 మార్కులు]
| అంశం | అక్షాంశాలు | రేఖాంశాలు |
|---|---|---|
| దిశ | తూర్పు – పడమర దిశలో గీసిన ఊహా రేఖలు | ఉత్తర – దక్షిణ ధ్రువాలను కలిపే ఊహా రేఖలు |
| ఆకారం, పొడవు | పూర్తి వృత్తాలు; భూమధ్యరేఖ పొడవైనది, ధ్రువాల వైపు పొడవు తగ్గుతుంది | అర్ధ వృత్తాలు; అన్నీ సమాన పొడవు |
| మొదటి రేఖ | 0° భూమధ్యరేఖ | 0° ప్రధాన రేఖాంశం (గ్రీన్విచ్) |
| సంఖ్య | 90° ఉత్తరం + 90° దక్షిణం + భూమధ్యరేఖ = 181 | 180° తూర్పు + 180° పడమర = 360 |
| సమాంతరం | ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి (parallels) | ధ్రువాల వద్ద కలుస్తాయి |
| ఉపయోగం | ఉష్ణ మండలాలు (శీతోష్ణ స్థితి) తెలుసుకోవడానికి | స్థానిక సమయం, కాల మండలాలు లెక్కించడానికి |
(ఏవైనా నాలుగు రాస్తే చాలు.)
28. What is meant by a joint family and a nuclear family? As a member of a family, explain the roles and responsibilities of its members. / ఉమ్మడి కుటుంబం, చిన్న కుటుంబం అంటే ఏమిటి? కుటుంబ సభ్యుల పాత్రలు, బాధ్యతలు వివరించండి. [4 మార్కులు]
ఉమ్మడి కుటుంబం: తాతయ్య-నానమ్మ, తల్లిదండ్రులు, బాబాయిలు-పిన్నులు, వారి పిల్లలు అందరూ ఒకే ఇంట్లో కలిసి జీవించడం.
చిన్న (కేంద్రక) కుటుంబం: తల్లిదండ్రులు, వారి పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం.
పాత్రలు, బాధ్యతలు:
1) తల్లిదండ్రులు: సంపాదించడం, ఆహారం, బట్టలు, ఇల్లు, చదువు, ఆరోగ్యం చూసుకోవడం, మంచి విలువలు నేర్పడం.
2) తాతయ్య-నానమ్మ: అనుభవంతో సలహాలు, కథలు, సంప్రదాయాలు నేర్పడం, పిల్లలను చూసుకోవడం.
3) పిల్లలు: బాగా చదువుకోవడం, ఇంటి పనుల్లో సహాయం, పెద్దలను గౌరవించడం, వృద్ధులను చూసుకోవడం.
4) అందరూ: పనులు పంచుకోవడం, ఒకరినొకరు ప్రేమించి, కష్టాల్లో అండగా ఉండటం. ఈ పనులు ఎక్కువగా ఆర్థికేతర కార్యకలాపాలు.
29. Explain a few central ideas of Buddhism. Briefly comment upon them. / బౌద్ధమతం యొక్క కొన్ని ముఖ్యమైన భావనలను వివరించండి. వాటిపై క్లుప్తంగా వ్యాఖ్యానించండి. [4 మార్కులు]
గౌతమ బుద్ధుడు (సిద్ధార్థుడు) బోధించిన ముఖ్య భావనలు:
1) జీవితంలో దుఃఖం ఉంది; దానికి కారణం కోరికలు (తృష్ణ), అజ్ఞానం.
2) కోరికలు తగ్గించుకుంటే దుఃఖం పోతుంది; దానికి మధ్యే మార్గం (అతి సుఖం కాదు, అతి కఠోర తపస్సు కాదు), అష్టాంగ మార్గం (సరైన దృష్టి, మాట, పని, జీవనం మొదలైనవి) పాటించాలి.
3) అహింస, కరుణ: అన్ని జీవుల పట్ల దయ చూపాలి.
4) సమానత్వం: కుల, ధనిక-పేద భేదం లేకుండా అందరూ సంఘంలో చేరవచ్చు; బోధనలు ప్రజల భాష (పాళీ) లో.
వ్యాఖ్య: ఈ భావనలు నేటికీ ఉపయోగపడతాయి: అత్యాశ తగ్గించడం, శాంతి, ఇతరుల పట్ల దయ, అందరినీ సమానంగా చూడటం మంచి సమాజానికి పునాది.
Section D (4 × 8 = 32 మార్కులు)
30 నుంచి 32 ప్రశ్నల్లో A లేదా B ఒక్కటే రాయాలి. పోల్చుకోవడానికి రెండింటికీ జవాబులు ఇచ్చాం. 33వ ప్రశ్నలో A లేదా B జాబితాల్లో ఒకటి.
30. A) How are economic activities different from non-economic activities? (Or) B) What are the various ways in which people are compensated for economic activities? Give four examples. [8 మార్కులు]
A)
| అంశం | ఆర్థిక కార్యకలాపాలు | ఆర్థికేతర కార్యకలాపాలు |
|---|---|---|
| అర్థం | డబ్బు లేదా ప్రతిఫలం కోసం చేసే పనులు | ప్రేమ, సేవ, ఆనందం, బాధ్యత కోసం డబ్బు ఆశించకుండా చేసే పనులు |
| ఉద్దేశం | జీవనోపాధి సంపాదించడం | కుటుంబం, సమాజం సంక్షేమం, సంతృప్తి |
| విలువ కొలత | డబ్బుతో కొలవవచ్చు | డబ్బుతో కొలవలేము |
| ఆదాయం | దేశ ఆదాయంలో లెక్కిస్తారు | లెక్కించరు |
| ఉదాహరణలు | రైతు పంట అమ్మడం, ఉపాధ్యాయుడికి జీతం, దుకాణదారుడు, డ్రైవర్ | తల్లి వంట, తాతయ్య పిల్లలకు పాఠం, రక్తదానం, గుడి / గ్రామ శ్రమదానం (సేవ) |
రెండూ ముఖ్యమే: ఆర్థిక కార్యకలాపాలు కుటుంబానికి ఆదాయం ఇస్తే, ఆర్థికేతర కార్యకలాపాలు కుటుంబ, సమాజ బంధాలను బలపరుస్తాయి.
B) ఆర్థిక కార్యకలాపాలకు ప్రతిఫలం లభించే మార్గాలు:
1) జీతం (Salary): ప్రతి నెలా నిర్ణీత మొత్తం. ఉదా: ఉపాధ్యాయుడు, బ్యాంకు ఉద్యోగి.
2) కూలి (Wages): రోజు లేదా పని ఆధారంగా చెల్లింపు. ఉదా: వ్యవసాయ కూలీ, భవన నిర్మాణ కార్మికుడు.
3) లాభం (Profit): వ్యాపారంలో ఖర్చు పోగా మిగిలేది. ఉదా: దుకాణదారుడు, కుర్చీలు తయారు చేసి అమ్మే వడ్రంగి.
4) ఫీజు (Fees): వృత్తి సేవలకు. ఉదా: డాక్టర్, లాయర్.
5) అద్దె (Rent), వడ్డీ (Interest): ఇల్లు / భూమి అద్దెకు ఇస్తే అద్దె, డబ్బు అప్పుగా లేదా బ్యాంకులో ఉంచితే వడ్డీ.
6) వస్తు రూపంలో చెల్లింపు (Payment in kind): డబ్బుకు బదులు ధాన్యం, పండ్లు. ఉదా: కోతల కాలంలో కూలీకి వడ్లు.
31. A) Oceans are often called the planet’s ‘lungs’ and climate regulators. Evaluate this statement by explaining the role of oceans in the Earth’s water cycle and their importance to human life. Also justify why protecting oceans is essential for the future of humanity. (Or) B) A village is experiencing a shift from joint families to nuclear families. Using social, economic and educational factors, explain this change briefly. [8 మార్కులు]
A) ఈ ప్రకటన సరైనదే.
1) ఊపిరితిత్తులు: సముద్రాల్లోని సూక్ష్మ మొక్కలు (ఫైటోప్లాంక్టన్) భూమిపై ఆక్సిజన్‌లో సగానికి పైగా ఉత్పత్తి చేస్తాయి; వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను పెద్ద మొత్తంలో పీల్చుకుంటాయి.
2) శీతోష్ణస్థితి నియంత్రణ: సముద్రాలు సూర్యుడి వేడిని నిల్వ చేసి, సముద్ర ప్రవాహాల ద్వారా వేడిని పంచుతాయి; తీర ప్రాంతాల్లో వేసవి, చలి తీవ్రత తగ్గుతుంది.
3) జల చక్రం: సముద్ర నీరు ఆవిరై మేఘాలుగా మారి, ఋతుపవనాలతో వర్షం కురుస్తుంది; ఆ నీరు నదుల ద్వారా మళ్ళీ సముద్రానికి చేరుతుంది. మనకు తాగునీరు, సాగునీరు ఈ చక్రం వల్లే.
4) మానవ జీవితానికి: చేపలు, ఉప్పు, ఖనిజాలు, చమురు; జల రవాణా, వ్యాపారం; మత్స్యకారులకు, పర్యాటకానికి ఉపాధి.
రక్షణ ఎందుకు: ప్లాస్టిక్, మురుగు, చమురు కాలుష్యం, అతిగా చేపల వేట వల్ల సముద్ర జీవులు నశిస్తున్నాయి; భూతాపం వల్ల సముద్ర మట్టం పెరుగుతోంది. సముద్రాలు దెబ్బతింటే ఆక్సిజన్, వర్షం, ఆహారం అన్నీ తగ్గుతాయి. కాబట్టి ప్లాస్టిక్ తగ్గించడం, తీరాల శుభ్రత, కాలుష్య నియంత్రణ మానవాళి భవిష్యత్తుకు అవసరం.
B) ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలకు మార్పు:
1) ఆర్థిక కారణాలు: వ్యవసాయంలో ఆదాయం తగ్గడం, ఉద్యోగాల కోసం యువకులు పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లడం; భూమి పంపకాలు; ప్రతి ఒక్కరికీ సొంత ఆదాయం రావడంతో వేరుగా ఉండగలగడం.
2) విద్యాపరమైన కారణాలు: పిల్లల మంచి చదువు కోసం పట్టణాలకు మారడం; చదువుకున్నవారు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం; స్వతంత్ర ఆలోచనలు పెరగడం.
3) సామాజిక కారణాలు: వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత కోరుకోవడం; పట్టణాల్లో చిన్న ఇళ్లు; కుటుంబంలో అభిప్రాయ భేదాలు; చిన్న కుటుంబాలను ఆధునికంగా భావించడం.
ప్రభావం: స్వేచ్ఛ, ఖర్చు నియంత్రణ పెరిగాయి; కానీ వృద్ధులు ఒంటరిగా మిగలడం, పిల్లలకు పెద్దల తోడు తగ్గడం వంటి సమస్యలు వచ్చాయి. ఫోన్లు, పండుగల సమయంలో కలవడం ద్వారా బంధాలు కాపాడుకోవాలి.
32. A) Mark the following statements as true or false; explain your answers with a sentence or two: 1. All parallels of latitude have the same length. 2. The length of a meridian of longitude is half of that of the Equator. 3. In Assam, the local time and IST are identical. 4. The lines separating time zones are identical with longitudes. (Or) B) While observing the globe, answer the following questions: 1. Which parallel of latitude divides the Earth into two equal halves? 2. What is the total number of latitudes? 3. Which continents are very near the North Pole? 4. Which ocean lies to the western side of Africa? [8 మార్కులు]
A)
1) తప్పు (False). భూమధ్యరేఖ అత్యంత పొడవైన అక్షాంశం; ధ్రువాల వైపు వెళ్లేకొద్దీ అక్షాంశ వృత్తాలు చిన్నవవుతాయి; ధ్రువాలు కేవలం బిందువులు.
2) ఒప్పు (True). ప్రతి రేఖాంశం ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉండే అర్ధ వృత్తం; భూమధ్యరేఖ పూర్తి వృత్తం. కాబట్టి రేఖాంశం పొడవు భూమధ్యరేఖలో సగం.
3) తప్పు (False). IST 82½° తూర్పు రేఖాంశం (ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ దగ్గర) ఆధారంగా ఉంటుంది. అస్సాం సుమారు 90° – 96° తూర్పున ఉంది; అక్కడ సూర్యుడు ముందే ఉదయిస్తాడు కాబట్టి స్థానిక సమయం IST కంటే సుమారు 30 – 50 నిమిషాలు ముందు ఉంటుంది.
4) తప్పు (False). కాల మండలాల సరిహద్దులు దేశాలు, రాష్ట్రాల సరిహద్దులను అనుసరించి వంకరగా ఉంటాయి; ఒక దేశం మధ్యలో సమయం మారకుండా ఉండాలని రేఖాంశాలను ఖచ్చితంగా అనుసరించవు.
B)
1) భూమధ్యరేఖ (0°) భూమిని ఉత్తర, దక్షిణ అర్ధగోళాలుగా రెండు సమాన భాగాలు చేస్తుంది.
2) మొత్తం 181 అక్షాంశాలు (90 ఉత్తరం + 90 దక్షిణం + భూమధ్యరేఖ, 1° దూరంలో గీస్తే).
3) ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నాయి.
4) అట్లాంటిక్ మహాసముద్రం ఆఫ్రికాకు పశ్చిమాన ఉంది.
33. A) Locate and label the following places on the map of India: 1. Odisha 2. Rajasthan 3. Tamil Nadu 4. Bay of Bengal (Or) B) 5. Bihar 6. River Ganga 7. Andhra Pradesh 8. Arunachal Pradesh [8 మార్కులు]
| ప్రదేశం | పటంలో ఎక్కడ |
|---|---|
| 1) ఒడిశా | తూర్పు తీరంలో బంగాళాఖాతం వెంట; ఆంధ్రప్రదేశ్‌కు ఈశాన్యంగా, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణాన, ఛత్తీస్‌గఢ్‌కు తూర్పున |
| 2) రాజస్థాన్ | వాయవ్య భారతంలో అతి పెద్ద రాష్ట్రం; పాకిస్తాన్ సరిహద్దులో, గుజరాత్‌కు ఉత్తరాన, పంజాబ్ – హర్యానాకు దక్షిణాన (థార్ ఎడారి ఇక్కడే) |
| 3) తమిళనాడు | దేశానికి దక్షిణ కొనలో తూర్పు తీరం; కేరళకు తూర్పున, కర్ణాటక – ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణాన; కన్యాకుమారి దీని దక్షిణ కొన |
| 4) బంగాళాఖాతం | ద్వీపకల్పానికి తూర్పున ఉన్న సముద్రం; ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను తాకుతుంది (నీలం రంగుతో) |
| 5) బీహార్ | తూర్పు భారతంలో గంగా నది వెంట; ఉత్తర ప్రదేశ్‌కు తూర్పున, పశ్చిమ బెంగాల్‌కు పశ్చిమాన, నేపాల్‌కు దక్షిణాన, ఝార్ఖండ్‌కు ఉత్తరాన |
| 6) గంగా నది | ఉత్తరాఖండ్ గంగోత్రి (హిమాలయాలు) నుంచి ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది (నీలి గీతతో) |
| 7) ఆంధ్రప్రదేశ్ | తూర్పు తీరంలో బంగాళాఖాతం వెంట; తెలంగాణకు తూర్పు-దక్షిణంగా, తమిళనాడుకు ఉత్తరాన, ఒడిశాకు దక్షిణాన |
| 8) అరుణాచల్ ప్రదేశ్ | దేశానికి ఈశాన్య కొనలో; అస్సాంకు ఉత్తరాన, చైనా (టిబెట్), భూటాన్, మయన్మార్ సరిహద్దుల్లో |
పటం మీద ప్రతి ప్రదేశాన్ని సంఖ్యతో గుర్తించి, పక్కన పేరు స్పష్టంగా రాయండి. రాష్ట్రాలను షేడ్ చేయండి, నదిని నీలి గీతతో, సముద్రాన్ని నీలం రంగుతో చూపండి.
ఈ జవాబులు 6వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకం (Exploring Society: India and Beyond, AP SCERT) ఆధారంగా మేము తయారు చేసినవి. అభిప్రాయ ప్రశ్నలకు (26, 28, 31) మీ సొంత మాటల్లో సరైన కారణాలు రాస్తే మార్కులు వస్తాయి. అసలు మార్కులు మీ ఉపాధ్యాయుల మూల్యాంకనం ప్రకారమే. మిగతా పరీక్షల కోసం AP SA1 2026-27 చూడండి.
మీ మార్కుల అంచనా: 0 / 80
ఈ అసలు ప్రశ్నపత్రం, మా జవాబులు PDF గా కావాలా? ప్రింట్ తీసుకోవడానికి, స్నేహితులతో పంచుకోవడానికి (15 పేజీలు, సుమారు 500 KB).
AP 6th Class SA1 Social Studies Question Paper 2026-27 జవాబులతో సిద్ధంగా ఉంది. 7 అక్టోబర్ ఆరో తరగతి FA2 సోషల్ పేపర్లో అక్షాంశాలు, కుటుంబం, ఆది మానవులు, జైన – బౌద్ధ మతాలు, సునామీ ప్రశ్నలు వచ్చాయి. SA1 కి అక్టోబర్‌లో కొత్తగా చేరిన పాఠం The Value of Work (పని విలువ) — ఆర్థిక, ఆర్థికేతర కార్యకలాపాలు, జీతం, కూలి, విలువ జోడింపు. ఈ 20 ప్రశ్నల సాధన పేపర్లో ఆ పాఠానికే ఎక్కువ మార్కులు; మిగతా ఆరు పాఠాల్లో FA2 లో అడగని అంశాలు మాత్రమే తీసుకున్నాం.
ప్రశ్నలు సులభమైన ఇంగ్లీష్‌లో, ప్రతి జవాబు కింద తెలుగు వివరణ. మ్యాప్ స్కేలు, IST, BCE – CE లెక్కలు, విదేశీయులు భారతదేశానికి పెట్టిన పేర్లు — అన్నీ ఆరో తరగతి సోషల్ పుస్తకం Exploring Society: India and Beyond (Reprint 2026-27) తో సరిచూశాం. జవాబు సరిపోతే టిక్ పెట్టండి; పేజీ కింద బార్ 35 కి మీ స్కోర్ చూపిస్తుంది.
6వ తరగతి SA1 సాంఘిక శాస్త్రం (సోషల్) పరీక్ష: 18 నవంబర్ 2026 (బుధవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. SA1 ను చాలా మంది విద్యార్థులు Essay 1 పరీక్ష అని కూడా అంటారు. 6th Class Social Essay 1 Question Paper కోసం వెతికినా ఇదే పేజీ: సాధన పేపర్, జవాబులు, పరీక్ష తర్వాత అసలు పేపర్ Key అన్నీ ఇక్కడే. 18 నవంబర్ 2026 న జరిగిన అసలు ప్రశ్నపత్రం, మా జవాబులు (Answer Key) ఇదే పేజీ పైభాగంలో ఉన్నాయి.
ఇప్పటికే వచ్చిన 6వ తరగతి SA1 Answer Keys: 6th Telugu Key | 6th Hindi Key | 6th English Key | 6th Maths Key. అన్ని తరగతులు: AP SA1 Key Papers 2026-27.
జవాబులు రాగానే తెలియాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి
ఈ పేజీలో: వివరాలు | సిలబస్ | సాధన పేపర్ | మార్కుల పంపకం | లెక్కల పట్టిక | PDF | 10 రోజుల ప్లాన్ | FAQs
AP 6th Class SA1 Social Studies Question Paper 2026-27 — పరీక్ష సమాచారం
| అంశం | వివరం |
|---|---|
| పరీక్ష | SA1 — మొదటి సంగ్రహణాత్మక మూల్యాంకనం, 2026-27 |
| తరగతి, పుస్తకం | ఆరో తరగతి సాంఘిక శాస్త్రం — Exploring Society: India and Beyond (Grade 6) |
| పరీక్ష తేదీ | 18 నవంబర్ 2026 (బుధవారం), మధ్యాహ్నం 1:15 – 4:15 (అధికారిక టైమ్ టేబుల్) |
| SA1 పాఠాలు | 7 — Locating Places on the Earth, Oceans and Continents, Timeline and Sources of History, India That Is Bharat, India’s Cultural Roots, Family and Community, The Value of Work |
| అక్టోబర్ కొత్త పాఠం | The Value of Work (అధ్యాయం 13) |
| ఈ సాధన పేపర్ | A నుంచి D నాలుగు Sections, 20 ప్రశ్నలు, 35 మార్కులు, 75 నిమిషాలు |
అధికారిక ఉత్తర్వు వచ్చింది: 28-10-2026 పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు (Rc. No. 3475819/SAT-I/2026-27) ప్రకారం 6వ తరగతి SA1 సాంఘిక శాస్త్రం పరీక్ష 18 నవంబర్ 2026 (బుధవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. అసలు పేపర్ 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). ఈ పేజీలోని 20 ప్రశ్నల పేపర్ FA ఆకారంలో (35 మార్కులు) ఉంది — పాఠాల వారీ సాధనకు, అసలు పేపర్లోని 1, 2, 4 మార్కుల ప్రశ్నలకు సరిపోతుంది.
ఆరో తరగతి ఇతర సబ్జెక్టుల SA1 పేపర్లు కూడా AP SA1 2026-27 – సిలబస్, టైమ్ టేబుల్, ప్రశ్నపత్రాలు పేజీలో ఉన్నాయి.
6వ తరగతి SA1 Social Studies సిలబస్ 2026-27 — ఏడు పాఠాలు
ఆరో తరగతి పాఠాలు ఆగస్టు నుంచి మొదలయ్యాయి (జూన్, జూలై సంసిద్ధత కార్యక్రమం). క్యాలెండర్లో ఆగస్టు – సెప్టెంబర్‌కు ఆరు పాఠాలు, అక్టోబర్‌కు The Value of Work. పుస్తకంలోని అధ్యాయ సంఖ్యలు, 7 అక్టోబర్ FA2 పేపర్లో ఏం అడిగారో కింది పట్టికలో ఉన్నాయి.
| పాఠం (అధ్యాయం) | ముఖ్య అంశాలు | FA2 పేపర్లో అడిగినది |
|---|---|---|
| Locating Places on the Earth (1) | పటం భాగాలు — దూరం (స్కేలు), దిక్కులు, గుర్తులు; అక్షాంశాలు, రేఖాంశాలు; స్థానిక కాలం, IST, కాల మండలాలు | ప్రధాన రేఖాంశం, అక్షాంశాలు, కాల తేడా, పటం గుర్తులు |
| Oceans and Continents (2) | ఐదు మహాసముద్రాలు, ఏడు ఖండాలు, దీవులు, సునామీ, సముద్రాలు – జీవం | ఆస్ట్రేలియా, సునామీ, ప్రపంచ పటం |
| Timeline and Sources of History (4) | BCE – CE, శతాబ్దం, సహస్రాబ్ది; చరిత్ర ఆధారాలు; ఆది మానవులు, తొలి పంటలు | పురావస్తు శాస్త్రవేత్తలు, ఆది మానవుల ఆహారం, చరిత్రకారులు – డిటెక్టివ్లు |
| India, That Is Bharat (5) | సప్త సింధవ, భారతవర్షం, జంబూద్వీపం; విదేశీయులు పెట్టిన పేర్లు | జంబూద్వీపం, సప్త సింధవ, భారతదేశానికి ప్రయాణాలు |
| India’s Cultural Roots (7) | వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధం, జైనం, చార్వాకులు, జానపద – గిరిజన మూలాలు | అపరిగ్రహం, సిద్ధార్థుడు, చార్వాకులు |
| Family and Community (9) | ఉమ్మడి – చిన్న కుటుంబాలు, పాత్రలు – బాధ్యతలు, సమాజం, హల్మా | కుటుంబం ఒక బడి, ఉమ్మడి కుటుంబం, నియమాలు |
| The Value of Work (13, అక్టోబర్) | ఆర్థిక, ఆర్థికేతర కార్యకలాపాలు; జీతం, కూలి, ఫీజు, వస్తురూప చెల్లింపు; విలువ జోడింపు; సేవ | కొత్త పాఠం — రాలేదు |

ఈ చార్ట్ ఫోన్లో ఉంచుకోండి: నారింజ కార్డు అక్టోబర్ పాఠం — SA1 కి కొత్తగా చదవాల్సింది అదే.
అక్షాంశాలు, సునామీ, జైన – బౌద్ధ ప్రశ్నల అసలు జవాబులు AP 6th Class FA2 Social Studies Question Paper 2026-27 పేజీలో ఉన్నాయి. ఆ పేపర్‌తో పాటు ఇదీ రాస్తే ఏడు పాఠాల్లో ముఖ్యమైన అంశాలన్నీ ఒకసారి తిరగేసినట్టే.
AP 6th Class SA1 Social Studies Question Paper — 20 ప్రశ్నలు, జవాబులతో
సూచనలు: 20 ప్రశ్నలు, 35 మార్కులు, సమయం 1 గంట 15 నిమిషాలు. Section D లో A లేదా B లో ఒక్కటే రాయండి. లెక్కల ప్రశ్నల్లో (సమయం, సంవత్సరాలు, దూరం) దశలు చూపిస్తేనే పూర్తి మార్కులు.
Section A — 15 × 1 = 15 మార్కులు
1. Which of the following is an economic activity?
(A) Parents cooking food for the family (B) A youth taking care of a grandparent (C) A truck driver transporting goods for payment (D) Family members helping to renovate their house [1 మార్కు]
జవాబు చూడండి
డబ్బు లేదా డబ్బు విలువకు బదులుగా చేసే పని ఆర్థిక కార్యకలాపం. మిగతా మూడూ ప్రేమ, శ్రద్ధ, గౌరవంతో చేసేవి — ఆదాయం రాదు, కాబట్టి ఆర్థికేతర కార్యకలాపాలు.
2. Sahil, a farm labourer, gets part of his payment in cash and the rest as mangoes of equal value. The mangoes are called
(A) salary (B) fee (C) payment in kind (D) profit [1 మార్కు]
జవాబు చూడండి
చేసిన పనికి నగదు కాకుండా వస్తువుల రూపంలో ఇచ్చే చెల్లింపు వస్తురూప చెల్లింపు (payment in kind). సాహిల్ రోజువారీ కూలి (daily wage) కూడా తీసుకుంటాడు.
3. Rajesh buys wood for ₹600 and sells a chair made from it for ₹1,000. The ₹400 difference mainly shows
(A) the cost of the wood (B) value addition by his skill, time and effort (C) a fee paid to a lawyer (D) money lost in the market [1 మార్కు]
జవాబు చూడండి
₹1,000 − ₹600 = ₹400. కలపను కుర్చీగా మార్చడంలో రాజేశ్ నైపుణ్యం, సమయం, శ్రమకు ఉన్న డబ్బు విలువ ఇది. ఒక వస్తువును మరో రూపంలోకి మార్చే ప్రతి దశలో విలువ పెరగడాన్ని విలువ జోడింపు (value addition) అంటారు.
4. A fixed regular payment, generally made every month by an employer to an employee, is called
(A) wage (B) salary (C) fee (D) payment in kind [1 మార్కు]
జవాబు చూడండి
జీతం (salary) నెలనెలా వచ్చే స్థిర చెల్లింపు — ఎయిర్‌ఫోర్స్ పైలట్ గీతా ఆంటీ, పోస్టాఫీసు ఉద్యోగి కావ్య అత్త. కూలి (wage) ఒక నిర్ణీత కాలానికి (ఉదా: రోజు) ఇచ్చేది; ఫీజు వృత్తిపరమైన సలహా, సేవకు (డాక్టర్, లాయర్).
5. Assertion (A): Rohan teaching computer skills free of cost at a college on weekends is a non-economic activity. Reason (R): Non-economic activities do not generate income but are done out of feelings like care and respect.
(A) Both A and R are true and R is the correct explanation of A. (B) Both A and R are true but R is not the correct explanation of A. (C) A is true but R is false. (D) A is false but R is true. [1 మార్కు]
జవాబు చూడండి
సాఫ్ట్వేర్ కంపెనీలో జీతానికి పనిచేయడం రోహన్ ఆర్థిక కార్యకలాపం. వారాంతంలో ఉచితంగా నేర్పడం సేవ — ఆర్థికేతర కార్యకలాపం. ఒకే వ్యక్తి రెండు రకాల పనులూ చేయవచ్చు.
6. The scale of a map is 1 cm = 500 m. Two places are 4 cm apart on the map. The real distance between them is
(A) 500 m (B) 2 km (C) 4 km (D) 20 km [1 మార్కు]
జవాబు చూడండి
4 × 500 m = 2,000 m = 2 km. పటంలో దూరం, దిక్కులు, గుర్తులు — ఈ మూడూ పటం ముఖ్య భాగాలు. పటంలోని దూరానికి భూమిపై అసలు దూరం ఎంతో స్కేలు చెబుతుంది.
7. Centuries before Greenwich, India had its own prime meridian, the madhya rekhā. It passed through
(A) Varanasi (B) Ujjayinī (Ujjain) (C) Pataliputra (D) Kanyakumari [1 మార్కు]
జవాబు చూడండి
ఉజ్జయిని శతాబ్దాల పాటు ఖగోళ శాస్త్ర కేంద్రం; ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు సుమారు 1,500 ఏళ్ళ క్రితం అక్కడ నివసించారు. భారతీయ ఖగోళ గ్రంథాల లెక్కలన్నింటికీ ఈ మధ్య రేఖ ఆధారం.
8. When it is 12 noon at Greenwich (London), the Indian Standard Time (IST) is
(A) 6:30 am (B) 12 noon (C) 5:30 pm (D) 7:30 pm [1 మార్కు]
జవాబు చూడండి
IST, గ్రీన్విచ్ మీన్ టైమ్ (GMT) కంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది. 12:00 + 5:30 = సాయంత్రం 5:30.
9. The International Date Line lies approximately along
(A) 0° longitude (B) 90° longitude (C) 180° longitude (D) the Equator [1 మార్కు]
జవాబు చూడండి
ప్రధాన రేఖాంశానికి ఎదురుగా ఉండే రేఖ ఇది. తూర్పు దిశగా దాటితే ఒక రోజు తీసివేయాలి, పడమర దిశగా దాటితే ఒక రోజు కలపాలి. కొన్ని దేశాలు రెండు తేదీలుగా విడిపోకుండా ఈ రేఖ అక్కడక్కడ వంగుతుంది.
10. In 1983, India set up its first scientific base station in Antarctica. It was named
(A) Bharati (B) Maitri (C) Dakshin Gangotri (D) Himadri [1 మార్కు]
జవాబు చూడండి
1981 నుంచి భారత అంటార్కిటికా కార్యక్రమం నడుస్తోంది; 1983 లో దక్షిణ గంగోత్రి స్థాపించారు, తర్వాత మరో రెండు స్థావరాలు వచ్చాయి. అక్కడి శాస్త్రవేత్తల నివాసంలో గ్రంథాలయం, పోస్టాఫీసు కూడా ఉన్నాయి.
11. Taking the birth of the Buddha as 560 BCE, how many years ago was it from 2024 CE?
(A) 2,584 (B) 2,583 (C) 1,464 (D) 2,024 [1 మార్కు]
జవాబు చూడండి
గ్రెగోరియన్ క్యాలెండర్లో సున్నా సంవత్సరం లేదు — 1 BCE తర్వాత వెంటనే 1 CE. అందుకే BCE, CE తేదీల మధ్య తేడా = రెండూ కలిపి 1 తీసివేయాలి: 560 + 2024 − 1 = 2,583.
12. Scientists who study fossils — remains of plants and animals preserved in layers of soil or rocks — are called
(A) Geologists (B) Palaeontologists (C) Anthropologists (D) Epigraphists [1 మార్కు]
జవాబు చూడండి
భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు (Geologists) నేల, రాళ్ళు, కొండలు; మానవ శాస్త్రవేత్తలు (Anthropologists) మానవ సమాజాలు, సంస్కృతులు; శాసన శాస్త్రవేత్తలు (Epigraphists) ప్రాచీన శాసనాలు అధ్యయనం చేస్తారు.
13. The ancient Greeks called India ‘Indoi’ or ‘Indike’. They dropped the first letter of the Persian word ‘Hindu’ because
(A) they disliked the word (B) the letter ‘h’ did not exist in their language (C) the Chinese told them to (D) it was a religious word [1 మార్కు]
జవాబు చూడండి
పర్షియన్లు సింధు నది పేరు నుంచి “హిందు” అన్నారు; గ్రీకు భాషలో “హ” అక్షరం లేనందున గ్రీకులు “ఇండోయ్ / ఇండికే” అన్నారు. ప్రాచీన పర్షియన్లో “హిందు” ఒక భౌగోళిక పదం మాత్రమే, మతానికి సంబంధించినది కాదు.
14. The Jain idea of anekāntavāda means
(A) owning nothing (B) truth has many aspects and cannot be fully described by one statement (C) not hurting any living being (D) giving up the authority of the Vedas [1 మార్కు]
జవాబు చూడండి
అనేకాంతవాదం = సత్యానికి ఒక్కటి కాదు, అనేక కోణాలు. అపరిగ్రహం = అవసరానికి మించి కూడబెట్టకపోవడం; అహింస = ఏ ప్రాణికీ హాని చేయకపోవడం (ఆలోచనలో కూడా).
15. The Bhil community of the Jhabua region (Madhya Pradesh) planted trees and dug trenches to save rainwater without any payment. This tradition of coming together in a crisis is called
(A) Langar (B) Halma (C) Van Mahotsav (D) Sabha [1 మార్కు]
జవాబు చూడండి
కష్టకాలంలో ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి అందరూ కలిసి సాయం చేసే భిల్లుల సంప్రదాయం హల్మా — లక్ష్యం భూమాతకు సేవ. శివగంగ ఉద్యమానికి చెందిన మహేశ్ శర్మకు ఈ పనికి 2019 లో పద్మశ్రీ వచ్చింది.
Section B — 2 × 2 = 4 మార్కులు
16. Distinguish between economic and non-economic activities with one example each. [2 మార్కులు]
జవాబు చూడండి
| ఆర్థిక కార్యకలాపాలు | ఆర్థికేతర కార్యకలాపాలు |
|---|---|
| డబ్బు లేదా డబ్బు విలువకు బదులుగా చేసే పనులు; ఆదాయం వస్తుంది | ఆదాయం రాదు; కృతజ్ఞత, ప్రేమ, శ్రద్ధ, గౌరవంతో చేసే పనులు |
| ఉదా: రైతు పంటను మార్కెట్లో అమ్మడం, లాయర్ ఫీజు తీసుకుని కేసు వాదించడం | ఉదా: అమ్మానాన్నలు ఇంట్లో వంట చేయడం, పిల్లల హోంవర్క్‌లో సాయం |
మార్కులు: తేడాకు 1, సరైన ఉదాహరణలకు 1.
17. Porbandar (Gujarat) and Tinsukia (Assam) differ in longitude by about 30°. Find the difference in their local times. Why does the sun set earlier in Tinsukia? [2 మార్కులు]
జవాబు చూడండి
కారణం: భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. తూర్పున ఉన్న తిన్సుకియాలో సూర్యోదయం, సూర్యాస్తమయం ముందుగా జరుగుతాయి; పడమరన ఉన్న పోర్బందర్లో అదే సమయానికి ఇంకా పగలే. — 1 మార్కు
కానీ రెండు చోట్లా గడియారాలు ఒకే సమయం చూపుతాయి — దేశమంతా ఒకే ప్రామాణిక కాలం IST పాటిస్తుంది.
Section C — 2 × 4 = 8 మార్కులు
18. What are the various ways in which people are paid for economic activities? Explain any four with examples. [4 మార్కులు]
జవాబు చూడండి
2. కూలి / వేతనం (Wage): ఒక నిర్ణీత కాలానికి చేసిన పనికి ఇచ్చేది. ఉదా: పొలం దున్నే సాహిల్ రోజు కూలి. — 1
3. ఫీజు (Fee): వృత్తిపరమైన సలహా, సేవకు ఇచ్చేది. ఉదా: డాక్టర్, లాయర్ ఫీజు; కావ్య అత్త ఆన్లైన్ క్లాసులకు వారానికోసారి తీసుకునే ఫీజు. — 1
4. వస్తురూప చెల్లింపు (Payment in kind): నగదు కాకుండా వస్తువుల రూపంలో ఇచ్చేది. ఉదా: సాహిల్‌కు కూలిలో కొంత భాగం సమాన విలువ గల మామిడి పండ్లు. — 1
19. How did people from outside India name our country? Explain the Persian, Greek and Chinese names and the term ‘Hindustān’. [4 మార్కులు]
జవాబు చూడండి
గ్రీకులు: పర్షియన్ ఆధారాలతో “ఇండోయ్” లేదా “ఇండికే” అన్నారు; వారి భాషలో “హ” లేనందున మొదటి అక్షరం వదిలేశారు. సింధు, హిందు, ఇండోయ్ – ఇండికే. — 1
చైనీయులు: “యింటు” లేదా “యిందు” అన్నారు; “సింధు” నుంచే వచ్చిన మరో పదం “తియాంఝు” — “స్వర్గ గురువు” అనే అర్థం కూడా వస్తుంది, బుద్ధుని దేశంగా భారత్‌పై వారి గౌరవాన్ని చూపుతుంది. — 1
హిందుస్తాన్: సుమారు 1,800 ఏళ్ళ క్రితం ఒక పర్షియన్ శాసనంలో మొదట కనిపించింది; తర్వాత భారతదేశంపై దండెత్తిన చాలామంది ఈ పదమే వాడారు. — 1
మన రాజ్యాంగం మొదట్లోనే “India, that is Bharat” అని ఉంది; హిందీ ప్రతిలో “భారత్ అర్థాత్ ఇండియా”.
Section D — 1 × 8 = 8 మార్కులు
20. A) Non-economic activities do not involve money, yet they have great value. Explain with examples of sevā, community participation and family life.
(OR)
B) Explain the life and main teachings of the Buddha and Mahāvīra. What ideas did Buddhism and Jainism share? [8 మార్కులు]
జవాబు చూడండి
పరిచయం: ఆర్థికేతర కార్యకలాపాలు ఆదాయం ఇవ్వవు; కానీ సమాజ సంక్షేమం, వ్యక్తిగత సంతోషం, జీవన నాణ్యతను పెంచుతాయి.
సేవ (నిస్వార్థ సేవ): గురుద్వారాల్లో లంగర్ — ప్రతి సందర్శకుడికీ ఉచిత భోజనం; ఆలయాల్లో ప్రసాదం. మనకు ఉన్నదానికి కృతజ్ఞత, ఏమీ ఆశించకుండా సమాజానికి ఇవ్వడం నేర్పుతాయి.
సామూహిక భాగస్వామ్యం: స్వచ్ఛ భారత్ అభియాన్ — ఇల్లు, వీధులు, పార్కులు అందరూ కలిసి శుభ్రం చేస్తే ఇల్లు, ఊరు, దేశం శుభ్రంగా ఉంటాయి. వన మహోత్సవం (అడవుల పండుగ) — చెట్ల విలువ తెలిపి సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం. కబీర్ తాతయ్య పిల్లలకు ఉచితంగా భూగోళ శాస్త్రం చెప్పడం, రోహన్ వారాంతాల్లో కంప్యూటర్ నేర్పడం కూడా ఇలాంటివే.
కుటుంబం, పండుగలు: అమ్మానాన్నలు వంట చేయడం, తాతయ్య – అమ్మమ్మల సేవ, ఇంటి మరమ్మత్తులో అందరూ చేయి వేయడం; పండుగల్లో కలిసి అలంకరించి వండినది పంచుకోవడం — ఇవి డబ్బుతో కొలవలేని అనుబంధాన్ని, సంతోషాన్ని ఇస్తాయి.
B) జవాబు (బుద్ధుడు 3, మహావీరుడు 3, సామాన్య అంశాలు 2):
బుద్ధుడు: సిద్ధార్థ గౌతముడు లుంబినిలో (నేటి నేపాల్) రాజకుమారుడిగా పుట్టాడు. 29 ఏళ్ళ వయసులో వృద్ధుడు, రోగి, శవం, ప్రశాంతంగా ఉన్న సన్యాసిని చూసి రాజభవనం వదిలాడు. బోధ్‌గయలో రావి చెట్టు కింద ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడు — దుఃఖానికి కారణం అవిద్య (అజ్ఞానం), మమకారం అని గ్రహించాడు. అహింస, అంతర్గత క్రమశిక్షణ బోధించాడు; భిక్షువులు, భిక్షుణుల సంఘం స్థాపించాడు.
మహావీరుడు: వర్ధమానుడు వైశాలి (నేటి బిహార్) దగ్గర రాజ కుటుంబంలో క్రీ.పూ. 6వ శతాబ్దం మొదట్లో పుట్టాడు. 30 ఏళ్ళకు ఇల్లు వదిలి 12 ఏళ్ళ తపస్సుతో పరమ జ్ఞానం పొంది “మహావీరుడు” అయ్యాడు. బోధనలు: అహింస, అనేకాంతవాదం (సత్యానికి అనేక కోణాలు), అపరిగ్రహం (అవసరానికి మించి కూడబెట్టకపోవడం). “జిన” అంటే అజ్ఞానాన్ని, మమకారాన్ని జయించినవాడు.
సామాన్య అంశాలు: రెండూ వేదాల అధికారాన్ని అంగీకరించలేదు. ధర్మం, కర్మ, పునర్జన్మ, దుఃఖానికి – అజ్ఞానానికి ముగింపు వెతకడం, అహింస (ఆలోచనలో కూడా) రెండింటిలో ఉన్నాయి. భిక్షువులు దేశమంతా తిరిగి బోధనలు వ్యాపింపజేశారు.
పాఠాల వారీ మార్కుల పంపకం
| పాఠం | ప్రశ్న సంఖ్యలు | మార్కులు |
|---|---|---|
| The Value of Work (అక్టోబర్) | 1 – 5, 16, 18, 20A | 11 (20A రాస్తే 19) |
| Locating Places on the Earth | 6 – 9, 17 | 6 |
| India, That Is Bharat | 13, 19 | 5 |
| Timeline and Sources of History | 11, 12 | 2 |
| India’s Cultural Roots | 14, 20B | 1 (20B రాస్తే 9) |
| Oceans and Continents | 10 | 1 |
| Family and Community | 15 | 1 |
కొత్త పాఠం The Value of Work కే 11 మార్కులు, Section D లో A ఎంచుకుంటే 19. మిగతా పాఠాల్లో FA2 లో అడగనివే — పటం స్కేలు, IST, అంతర్జాతీయ తేదీ రేఖ, దక్షిణ గంగోత్రి, BCE – CE లెక్క, విదేశీ పేర్లు, హల్మా.
ఆరో తరగతి సోషల్ — పేపర్లో లేని 7 ముఖ్య ప్రశ్నలు
| ప్రశ్న | జవాబు |
|---|---|
| క్రీ.పూ. 3వ శతాబ్దం ఏ సంవత్సరాల మధ్య? | 300 BCE నుంచి 201 BCE వరకు. BCE శతాబ్దాలు 1 BCE నుంచి వెనక్కి లెక్కిస్తారు. ప్రస్తుత 21వ శతాబ్దం CE — 2001 నుంచి 2100; 3వ సహస్రాబ్ది CE — 2001 నుంచి 3000. |
| ఒలింపిక్ వలయాలు ఐదు ఎందుకు? | మనుషులు నివసించే ఐదు ఖండాలకు — ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్ — గుర్తు. ప్రపంచం నలుమూలల క్రీడాకారులు కలవడాన్ని సూచిస్తాయి. |
| సముద్రాలను “భూమి ఊపిరితిత్తులు” అని ఎందుకు అంటారు? | ప్రపంచ ఆక్సిజన్‌లో సగానికి పైగా సముద్ర వృక్షజాలం నుంచే వస్తుంది. ఐక్యరాజ్యసమితి జూన్ 8 ని ప్రపంచ సముద్రాల దినోత్సవంగా ప్రకటించింది; ప్లాస్టిక్ వ్యర్థాలు, అతిగా చేపల వేట సముద్ర జీవానికి ముప్పు. |
| నచికేతుడు యముడిని ఏం అడిగాడు? | “శరీరం మరణించాక ఏమవుతుంది?” — యముడు తప్పించుకోవాలని చూసినా పట్టు వదలలేదు. ఆత్మ అన్ని ప్రాణుల్లో ఉంటుంది, అది పుట్టదు, చావదు అని యముడు వివరించాడు (కఠోపనిషత్తు). |
| తోడా గిరిజనులు ఏ కొండలను పవిత్రంగా భావిస్తారు? | తమిళనాడు నీలగిరుల్లోని ముప్పైకి పైగా శిఖరాలను దేవతల నివాసాలుగా భావిస్తారు — వాటిని వేలితో కూడా చూపించరు. గిరిజన, జానపద విశ్వాసాలు కొండలు, నదులు, చెట్లను పవిత్రంగా చూస్తాయి. |
| కమల్ పర్మార్ ఏం చేశారు? | అహ్మదాబాద్‌లో చిన్న వర్క్‌షాప్ యజమాని; పని తర్వాత సాయంత్రం 5:30 నుంచి 9:30 వరకు వీధి పిల్లలకు ఉచితంగా ట్యూషన్, భోజనం. త్వరలో 150 మంది పిల్లలు క్రమం తప్పకుండా వచ్చారు — పట్టణ సమాజ సేవకు ఉదాహరణ. |
| పంచాంగం అంటే ఏమిటి? | సూర్యచంద్రుల స్థానాల ఆధారంగా నెలలోని రోజులు, ఖగోళ వివరాలు ఇచ్చే పట్టికల పుస్తకం — గ్రహణాలు, సూర్యోదయ – సూర్యాస్తమయ సమయాలు, పండుగల తేదీలు ముందుగానే చెబుతుంది. భారతదేశంలో ఇప్పటికీ విస్తృతంగా వాడతారు. |
సోషల్ లెక్కలు — సమయం, సంవత్సరాలు, దూరం ఒకే చోట
| లెక్క | నియమం | ఉదాహరణ |
|---|---|---|
| రేఖాంశం – స్థానిక కాలం | 15° కు 1 గంట; తూర్పుకు వెళ్తే కలపాలి, పడమరకు తీసేయాలి | గ్రీన్విచ్ మధ్యాహ్నం 12 అయితే 30°E వద్ద మధ్యాహ్నం 2 |
| IST – GMT | IST = GMT + 5 గం. 30 ని. | లండన్ 12 నూన్ = భారత్ సాయంత్రం 5:30 |
| ఒకే రేఖాంశం | అక్షాంశం మారినా స్థానిక కాలం మారదు | ఢిల్లీ 29°N, బెంగళూరు 13°N — రెండూ 77°E, తేడా సున్నా |
| BCE నుంచి CE వరకు | రెండు సంఖ్యలు కలిపి 1 తీసేయాలి | 560 BCE నుంచి 2024 CE = 2,583 ఏళ్ళు |
| శతాబ్దం | CE: 1 నుంచి 100 వరకు 1వ శతాబ్దం; BCE: వెనక్కి | 1828 = 19వ శతాబ్దం CE |
| పటం స్కేలు | పటంలో దూరం × స్కేలు విలువ | 1 cm = 500 m అయితే 4 cm = 2 km |
6వ తరగతి SA1 సోషల్ సాధన పేపర్ PDF
ప్రింట్ తీసుకుని పరీక్షలా రాయడానికి: Download PDF — AP 6th Class SA1 Social Studies Practice Paper 2026-27. ముందు 20 ప్రశ్నలు, చివరి పేజీల్లో జవాబులు.
ఆరో తరగతి సోషల్‌లో తరచూ జరిగే 7 తప్పులు
- జీతం, కూలి కలిపేయడం: జీతం నెలవారీ స్థిర చెల్లింపు; కూలి నిర్ణీత కాలానికి (రోజు, వారం).
- ఉచిత బోధనను ఆర్థిక కార్యకలాపం అనడం: డబ్బు లేకుండా సేవగా చేస్తే ఆర్థికేతరం; బడిలో టీచర్ జీతానికి చెప్పడం ఆర్థికం.
- BCE – CE లెక్కలో 1 తీసేయడం మర్చిపోవడం: సున్నా సంవత్సరం లేదు.
- IST ని 5 గంటలు అనడం: సరైనది 5 గంటల 30 నిమిషాలు ముందు.
- పర్షియన్ “హిందు” ను మతంగా రాయడం: అది సింధు నది నుంచి వచ్చిన భౌగోళిక పదం.
- అనేకాంతవాదం, అపరిగ్రహం తారుమారు: అనేకాంతం = సత్యానికి అనేక కోణాలు; అపరిగ్రహం = కూడబెట్టకపోవడం.
- పటం స్కేలు లెక్కలో ప్రమాణం వదిలేయడం: జవాబు కేవలం “2,000” కాదు — 2,000 m లేదా 2 km అని ప్రమాణంతో రాయాలి.
6వ తరగతి సోషల్ — SA1 కి 10 రోజుల ప్లాన్
పరీక్ష 18 నవంబర్ 2026 (బుధవారం). రోజుకు 40 నిమిషాలు. మొదటి మూడు రోజులు కొత్త పాఠానికే ఇవ్వండి; ఇంట్లో ఎవరు ఏ పని చేస్తారో, అది ఆర్థికమా కాదా అని జాబితా రాస్తే పాఠం సులభంగా గుర్తుంటుంది.
| రోజు | చదవాల్సింది |
|---|---|
| 1 | The Value of Work — అను, కబీర్ కథ; ఆర్థిక, ఆర్థికేతర కార్యకలాపాలు |
| 2 | కావ్య కథ — జీతం, కూలి, ఫీజు, వస్తురూప చెల్లింపు; రాజేశ్ కుర్చీ — విలువ జోడింపు |
| 3 | సేవ, లంగర్, స్వచ్ఛ భారత్, వన మహోత్సవం; అధ్యాయం 13 చివరి ప్రశ్నలు |
| 4 | పటం: స్కేలు, దిక్కులు, గుర్తులు; అక్షాంశాలు, రేఖాంశాలు, ఉజ్జయిని మధ్య రేఖ |
| 5 | స్థానిక కాలం, IST, కాల మండలాలు, అంతర్జాతీయ తేదీ రేఖ — లెక్కల పట్టిక |
| 6 | మహాసముద్రాలు, ఖండాలు, దీవులు, దక్షిణ గంగోత్రి; కాలరేఖ, BCE – CE, చరిత్ర ఆధారాలు |
| 7 | India, That Is Bharat — భారతీయులు, విదేశీయులు పెట్టిన పేర్లు |
| 8 | వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధం, జైనం, గిరిజన మూలాలు; కుటుంబం, సమాజం, హల్మా — FA2 పేపర్‌తో |
| 9 | పై 20 ప్రశ్నల పేపర్ — 75 నిమిషాల్లో, పుస్తకం చూడకుండా |
| 10 | తప్పులు సరిచేయడం; ప్రపంచ పటంలో ఖండాలు, మహాసముద్రాలు గుర్తించడం సాధన |
ఆరో తరగతి పుస్తకాలు, నోట్స్, ప్రశ్నపత్రాలు అన్నీ AP 6th Class Textbooks, Notes, Study Material & Question Papers లో ఉన్నాయి. మిగతా సబ్జెక్టుల SA1 పాఠాలు AP SA1 Syllabus 2026-27 – Class 1 to 10 పేజీలో చూడండి.
తర్వాత ఏం చదవాలి
- AP 6th Class FA2 Social Studies Question Paper 2026-27 — 7 అక్టోబర్ అసలు పేపర్, జవాబులు
- AP 6th Class SA1 Science Question Paper 2026-27 — కొలతలు, చలనం సాధన పేపర్
- AP 6th Class SA1 Maths Question Paper 2026-27 — Ganita Prakash అధ్యాయాల 20 ప్రశ్నలు
- AP 6th Class SA1 English Question Paper 2026-27 — Poorvi యూనిట్లు 1, 2 పై ప్రశ్నలు
ఒక విద్యార్థి మాట
“ChatGPT ద్వారా ఈ సైట్ దొరికింది. సోషల్ పరీక్షకు బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేశా, దాదాపు 20 బిట్స్ వచ్చాయి. మీ వెబ్సైట్ చాలా బాగుంది.”
6వ తరగతి విద్యార్థి, SA1 సోషల్ పరీక్ష తర్వాత మాకు చెప్పిన మాట (నవంబర్ 2026). పేరు వెల్లడించలేదు.
FAQs
ఆరో తరగతి SA1 సోషల్ పరీక్ష ఏ రోజు?
28-10-2026 అధికారిక టైమ్ టేబుల్ ప్రకారం 6వ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్ష 18 నవంబర్ 2026 (బుధవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. SA1 పరీక్షలు 9 నుంచి 20 నవంబర్ వరకు.
6వ తరగతి SA1 Social సిలబస్‌లో ఎన్ని పాఠాలు?
ఏడు: Locating Places on the Earth, Oceans and Continents, Timeline and Sources of History, India That Is Bharat, India’s Cultural Roots, Family and Community, The Value of Work. 28-10-2026 అధికారిక జాబితాలోనూ ఇవే ఏడు; Integrated AI సోషల్ జాబితాలో లేదు.
7 అక్టోబర్ FA2 సోషల్ పేపర్లో ఏం వచ్చాయి?
Exam Code 623 పేపర్లో అక్షాంశాలు – రేఖాంశాలు, కాల తేడా, పటం గుర్తులు, ఖండాలు, సునామీ, ఆది మానవులు, జంబూద్వీపం, సప్త సింధవ, బౌద్ధం, జైనం, చార్వాకులు, కుటుంబం ప్రశ్నలు వచ్చాయి.
The Value of Work పాఠం ఏ నెలది?
క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ పాఠం; పుస్తకంలో అధ్యాయం 13. FA2 తర్వాత చెప్పే పాఠం కాబట్టి SA1 లో దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు రావచ్చు.
ఈ సాధన పేపర్‌ను ప్రభుత్వం ఇచ్చిందా?
కాదు. పాఠ్యపుస్తకం ఆధారంగా మేము తయారుచేసిన సాధన పేపర్. పరీక్ష తేదీ, పాఠాలు 28-10-2026 అధికారిక ఉత్తర్వు నుంచి.
ఆరో తరగతి SA1 సోషల్ ఎన్ని మార్కులకు?
28-10-2026 అధికారిక ఉత్తర్వు ప్రకారం 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). ఈ పేజీలోని సాధన పేపర్ FA ఆకారంలో 20 ప్రశ్నలు, 35 మార్కులు — అసలు పేపర్‌కు ముందు పాఠాల వారీ సాధనకు.
విలువ జోడింపు (value addition) అంటే?
ఒక వస్తువును మరో రూపంలోకి మార్చే ప్రతి దశలో దాని డబ్బు విలువ పెరగడం. ₹600 కలపను ₹1,000 కుర్చీగా మార్చిన రాజేశ్ ₹400 విలువ జోడించాడు.
ఫీజు, జీతం తేడా ఏమిటి?
జీతం యజమాని ఉద్యోగికి నెలనెలా ఇచ్చే స్థిర చెల్లింపు. ఫీజు వృత్తిపరమైన సలహా లేదా సేవకు ఇచ్చేది — డాక్టర్, లాయర్, ట్యూషన్ టీచర్.
Bhārata అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది?
ఋగ్వేదంలోని భరతులు అనే వైదిక జనం పేరు నుంచి. మహాభారతంలో “భారతవర్షం”, విష్ణు పురాణంలో “సముద్రానికి ఉత్తరాన, మంచు కొండలకు దక్షిణాన ఉన్న దేశం భారతం” అని ఉంది.
అపరిగ్రహం అంటే ఏమిటి?
అవసరానికి మించి వస్తువులు కూడబెట్టకపోవడం, భౌతిక వస్తువులపై మమకారం వదలడం — జైన బోధనల్లో ఒకటి.
2004 సునామీ భారతదేశంలో ఎక్కడ ఎక్కువ నష్టం చేసింది?
26 డిసెంబర్ 2004 న ఇండోనేషియా భూకంపం వల్ల వచ్చిన సునామీ అండమాన్ – నికోబార్ దీవులు, తమిళనాడు, కేరళ తీరాలను తీవ్రంగా దెబ్బతీసింది. 14 దేశాల్లో రెండు లక్షలకు పైగా ప్రాణాలు పోయాయి.
స్కోర్ బార్‌ను ఎలా వాడాలి?
జవాబు తెరిచాక వచ్చే చెక్‌బాక్స్‌ను మీ జవాబు సరిపోతేనే గుర్తించండి; Section D లో మీరు రాసిన ఒక్క భాగానికే టిక్. PDF కావాలంటే పైన ఉన్న డౌన్లోడ్ లింక్ వాడండి.
Official Sources
SA1 టైమ్ టేబుల్, మార్కుల విధానం, సిలబస్: పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు Rc. No. 3475819/SAT-I/2026-27, తేదీ 28-10-2026 (SCERT సిలబస్ అనుబంధంతో); AP SCERT. నెలవారీ బోధన క్రమం: High School Academic Calendar 2026-27. పాఠ్యాంశాలు: NCERT Exploring Society: India and Beyond — Social Science Textbook for Grade 6 (Reprint 2026-27), అధ్యాయాలు 1, 2, 4, 5, 7, 9, 13.






