AP 8th Class Textbooks PDF 2026-27 – New Books (Ganita Prakash, Curiosity, Exploring Society), Telugu & English Medium

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP 8th Class Textbooks PDF 2026-27 కోసం వచ్చారా? ఎనిమిదో తరగతి గణితం, సైన్స్, సోషల్, English పాఠాలు మారాయి. AP పాఠశాలల్లో ఇచ్చే AP SCERT సెమిస్టర్ పుస్తకాల్లోని పాఠాలు NCERT కొత్త పుస్తకాల అధ్యాయాలే: Ganita Prakash, Curiosity, Exploring Society: India and Beyond. ఈ మూడింటికీ NCERT అధికారిక తెలుగు ప్రతులు కూడా ఉన్నాయి. కింది పట్టికలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం డౌన్‌లోడ్ లింకులు ఉన్నాయి.

AP స్టేట్ సిలబస్ విద్యార్థులు గమనించండి: బడిలో మీ చేతిలో ఉండేది AP SCERT ముద్రించిన SEM-1 (సెమిస్టర్-1) పుస్తకం. అందులోని అధ్యాయాలు, ఈ NCERT పుస్తకాల అధ్యాయాలు ఒకటే. 28-10-2026 పాఠశాల విద్యా సంచాలకుల SA1 సిలబస్ ఉత్తర్వులో 8వ తరగతి గణితానికి Ganita Prakash అధ్యాయాలు (A Square and A Cube, Power Play, A Story of Numbers…), సైన్స్‌కు Curiosity అధ్యాయాలు (Particulate Nature of Matter, Pressure, Types of Forces…) ఉన్నాయి. అక్టోబర్‌లో జరిగిన FA2 అసలు పేపర్లు కూడా ఇవే అధ్యాయాల నుంచి వచ్చాయి. AP SCERT అధికారిక సెమిస్టర్ పుస్తకాలు cse.ap.gov.in వెబ్‌సైట్‌లోని Textbooks విభాగంలో ఉంటాయి.
8th Class Telugu Textbook PDF with Answers కోసం వచ్చారా? తెలుగు సబ్జెక్ట్ పుస్తకం, పాఠాల వారీ జవాబులు వేరే పేజీలో ఉన్నాయి: 8th Class Telugu Textbook PDF, AP Board Solutions Class 8 Telugu Solutions.

Part 2 పుస్తకాలు, FA3 సిలబస్ వచ్చిన వెంటనే తెలియాలంటే మా WhatsApp గ్రూప్‌లో చేరండి

ఈ పేజీలో: పుస్తకాల పట్టిక | ఏం మారింది | తెలుగు మీడియం | సోషల్ అధ్యాయాలు | డౌన్‌లోడ్ ఎలా | SA1 పేపర్లు | FAQs

AP 8th Class Textbooks PDF 2026-27 – సబ్జెక్టుల వారీ పట్టిక

గణితం, సైన్స్, సోషల్, English లింకులు NCERT అధికారిక వెబ్‌సైట్ (ncert.nic.in) లోని పూర్తి పుస్తకం ZIP ఫైళ్లకు నేరుగా వెళ్తాయి. తెలుగు, Hindi రాష్ట్ర పుస్తకాల ఫైళ్లు Google Drive లో ఉన్నాయి.

సబ్జెక్ట్పుస్తకంEnglish మీడియంతెలుగు మీడియం
గణితంGanita Prakash, Grade 8, Part 1English Download (24 MB)తెలుగు Download
సైన్స్Curiosity – Textbook of Science, Grade 8English Download (48 MB)తెలుగు Download
సోషల్Exploring Society: India and Beyond, Grade 8, Part 1English Downloadతెలుగు Download (222 MB)
అధ్యాయాల వారీగా: కింద
EnglishPoorvi, Grade 8NCERT పేజీలో (కింద విధానం చూడండి)(English పుస్తకం ఒక్కటే)
తెలుగు (ప్రథమ భాష)రాష్ట్ర పాఠ్యపుస్తకంDownload PDFDownload PDF
తెలుగు (ద్వితీయ భాష)రాష్ట్ర పాఠ్యపుస్తకంDownload PDFDownload PDF
Hindiరాష్ట్ర పాఠ్యపుస్తకంDownload PDFDownload PDF

AP 8th Class Textbooks PDF 2026-27 – 8వ తరగతి కొత్త పుస్తకాలు Ganita Prakash, Curiosity, Exploring Society తెలుగు, ఇంగ్లీష్ మీడియం

తెలుగు, Hindi ఫైళ్లు ఈ పేజీలో ముందు నుంచీ ఉన్నవి. వాటిని 2026-27 ముద్రణతో ఇంకా సరిచూడలేదు. డౌన్‌లోడ్ చేశాక పుస్తకం మొదటి పేజీలోని సంవత్సరాన్ని, బడిలో ఇచ్చిన పుస్తకంతో ఒకసారి పోల్చుకోండి.

8వ తరగతిలో ఈ ఏడాది ఏ పుస్తకాలు మారాయి

ఇంటర్నెట్‌లో దొరికే పాత “8th Class Maths Sem-1” PDF డౌన్‌లోడ్ చేసి, అందులో పాఠాలు క్లాసులో చెబుతున్నవాటితో సరిపోక ఇబ్బంది పడుతున్నారా? కారణం ఇదే. AP లో పుస్తకాలు ఇప్పుడూ సెమిస్టర్ల వారీగానే (SEM-1, SEM-2) వస్తాయి, కానీ లోపలి పాఠాలు మారాయి:

సబ్జెక్ట్పాత పుస్తకాల్లో పాఠాలుఇప్పటి పాఠాలు (2026-27)
గణితంRational Numbers, Linear Equations వంటి పాత అధ్యాయాలుGanita Prakash అధ్యాయాలు
సైన్స్పాత Physical Science, Biological Science పాఠాలుCuriosity అధ్యాయాలు (భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలు)
సోషల్Geography, History, Politics వేర్వేరు పుస్తకాలుExploring Society: India and Beyond
Englishపాత English Textbook, Supplementary ReaderPoorvi

పాత పాఠాల ఫైళ్లను ఈ పేజీ నుంచి తీసేశాం. FA, SA ప్రశ్నపత్రాలు ఇప్పటి పాఠాల నుంచే వస్తాయి. సైన్స్‌లో పరీక్షకు Physical Science, Biology పేపర్లు వేర్వేరుగా ఉంటాయి; రెండింటి అధ్యాయాలూ Curiosity లోనివే.

తెలుగు మీడియం విద్యార్థులకు: NCERT తెలుగు పుస్తకాలు

ఇది చాలామందికి తెలియని విషయం: Ganita Prakash, Curiosity, Exploring Society మూడు పుస్తకాలకూ NCERT అధికారిక తెలుగు అనువాదాలు ఉన్నాయి. తెలుగు మీడియంలో చదివే పిల్లలు ఇంగ్లీష్ పుస్తకంతో తంటాలు పడాల్సిన అవసరం లేదు. పై పట్టికలో “తెలుగు Download” లింకులు ఆ తెలుగు పుస్తకాలే. NCERT ఫైల్ పేర్లలో “htl” అని ఉంటే అది తెలుగు ప్రతి (ఉదాహరణ: htles101.pdf).

పాఠశాలలో ఇచ్చిన పుస్తకానికీ, ఈ తెలుగు ప్రతికీ పాఠాల క్రమం ఒకటే. ఏదైనా పదం అర్థం కాకపోతే ఇంగ్లీష్ ప్రతిలో అదే పేజీ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. రెండూ పక్కపక్కనే ఉంచుకుని చదవడం మంచి అలవాటు.

8వ తరగతి సోషల్ తెలుగు పుస్తకం – అధ్యాయాల వారీ PDF

తెలుగు సోషల్ పుస్తకం పూర్తి ZIP 222 MB, మొబైల్ డేటాకు భారం. కావాల్సిన అధ్యాయం ఒక్కటే డౌన్‌లోడ్ చేసుకోండి:

అధ్యాయం (తెలుగు ప్రతి)PDFపరిమాణం
1. సహజ వనరులు, వాటి వినియోగంDownload PDF27 MB
2. భారతదేశ రాజకీయ పటం పునఃరూపకల్పనDownload PDF74 MB
3. మరాఠా సామ్రాజ్య విస్తరణDownload PDF35 MB
4. భారతదేశంలో వలస పాలనDownload PDF26 MB
5. సార్వత్రిక ఓటు హక్కు, భారతదేశ ఎన్నికల వ్యవస్థDownload PDF17 MB
6. పార్లమెంట్ వ్యవస్థDownload PDF11 MB
7. ఉత్పత్తి కారకాలుDownload PDF25 MB

అధ్యాయాల పేర్లు NCERT తెలుగు ప్రతి కవర్ పేజీల నుంచి రాశాం, పరిమాణాలు మేము డౌన్‌లోడ్ చేసినప్పటివి.

NCERT వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసే విధానం

AP SCERT సెమిస్టర్ పుస్తకం కోసం: cse.ap.gov.in వెబ్‌సైట్‌లోని Textbooks విభాగంలో 8వ తరగతి పుస్తకాలు చూడండి.

NCERT పుస్తకం కోసం: పై లింకులు పనిచేయకపోతే, లేదా English (Poorvi), Part 2 పుస్తకాలు కావాలంటే NCERT పేజీ నుంచి నేరుగా తీసుకోండి:

  1. NCERT Textbooks పేజీ తెరవండి.
  2. Select Class: 8 ఎంచుకోండి.
  3. Select Subject: Mathematics / Science / Social Science / English ఎంచుకోండి. తెలుగు ప్రతుల కోసం Subject లిస్ట్‌లో తెలుగు ఎంపిక చూడండి.
  4. Select Book Title: పుస్తకం పేరు ఎంచుకుని Go నొక్కండి.
  5. మొత్తం పుస్తకం కావాలంటే Download complete book, ఒక అధ్యాయం చాలంటే ఆ అధ్యాయం పేరు నొక్కండి.

ZIP ఫైల్ తెరవడానికి ఫోన్‌లో Files యాప్ లేదా Google Drive యాప్ చాలు. ZIP లోపల ఒక్కో అధ్యాయం విడి PDF గా ఉంటుంది.

కొత్త పుస్తకాల నుంచి మా 8వ తరగతి ప్రశ్నపత్రాలు, జవాబులు

పుస్తకం చదివాక సాధన కోసం: AP 8th Class SA1 Maths Question Paper 2026-27 (Ganita Prakash), AP 8th Class SA1 Physical Science Question Paper, AP 8th Class SA1 Biology Question Paper (Curiosity), AP 8th Class SA1 Social Studies Question Paper (Exploring Society), AP 8th Class SA1 English Question Paper (Poorvi). భాషా పేపర్లు: AP 8th Class SA1 Telugu Question Paper, AP 8th Class SA1 Hindi Question Paper.

Ganita Prakash అధ్యాయాల వారీ జవాబులు AP 8th Class Maths Solutions 2026-27 పేజీలో ఉన్నాయి. అన్ని తరగతుల పుస్తకాల జాబితా APSCERT Textbooks 2026-27 (Class 1 to 10) పేజీలో ఉంది.

FAQs

AP 8th Class 2026-27 లో ఏ పుస్తకాలు నడుస్తున్నాయి?

బడిలో AP SCERT సెమిస్టర్ పుస్తకాలు ఇస్తారు. వాటిలోని పాఠాలు: గణితం Ganita Prakash, సైన్స్ Curiosity, సోషల్ Exploring Society: India and Beyond, English Poorvi అధ్యాయాలు. తెలుగు, Hindi రాష్ట్ర పాఠ్యపుస్తకాలు.

ఇది స్టేట్ సిలబస్సేనా, CBSE పుస్తకాలు ఇస్తున్నారా?

ఇది AP స్టేట్ సిలబస్సే. AP SCERT తన సెమిస్టర్ పుస్తకాల్లో NCERT కొత్త అధ్యాయాలను తీసుకుంది. 28-10-2026 అధికారిక SA1 సిలబస్ ఉత్తర్వులో ఇవే అధ్యాయాల పేర్లు ఉన్నాయి. అందుకే NCERT PDF, బడి పుస్తకం రెండింటిలో పాఠాలు ఒకటే.

8వ తరగతి కొత్త పుస్తకాలు తెలుగు మీడియంలో దొరుకుతాయా?

దొరుకుతాయి. Ganita Prakash, Curiosity, Exploring Society మూడింటికీ NCERT అధికారిక తెలుగు ప్రతులు ఉన్నాయి. లింకులు ఈ పేజీ పట్టికలోని “తెలుగు మీడియం” నిలువు వరుసలో ఉన్నాయి.

8th Class Physical Science, Biology పాఠాలు ఏ పుస్తకంలో ఉంటాయి?

రెండింటి పాఠాలూ NCERT Curiosity పుస్తకంలోని అధ్యాయాలే. FA, SA పరీక్షల్లో Physical Science, Biology పేపర్లు వేర్వేరుగా ఉంటాయి. ఏ అధ్యాయం ఏ పేపర్‌కో మా SA1 Physical Science, Biology పేజీల్లోని సిలబస్ పట్టికల్లో ఉంది.

8th Class Maths Semester 1, Semester 2 పుస్తకాలు ఇంకా ఉన్నాయా?

ఉన్నాయి. AP లో పుస్తకాలు సెమిస్టర్ల వారీగానే వస్తాయి. కానీ ఇప్పటి SEM-1 పుస్తకంలో Ganita Prakash అధ్యాయాలు ఉంటాయి. ఇంటర్నెట్‌లో Rational Numbers తో మొదలయ్యే పాత Sem-1 PDF దొరికితే అది పాత సిలబస్.

8th Class Telugu Textbook PDF with Answers ఎక్కడ?

తెలుగు సబ్జెక్ట్ పుస్తకానికి 8th Class Telugu Textbook PDF పేజీ, పాఠాల వారీ జవాబులకు AP Board Solutions Class 8 Telugu Solutions పేజీ చూడండి. లింకులు ఈ పేజీ పైభాగంలో ఉన్నాయి.

ZIP ఫైల్ ఫోన్‌లో ఎలా తెరవాలి?

ఫోన్‌లో Files యాప్ లేదా Google Drive యాప్‌లో ZIP నొక్కితే లోపలి PDF ల జాబితా వస్తుంది. కావాల్సిన అధ్యాయం PDF తెరవండి. పెద్ద ఫైళ్లకు Wi-Fi వాడండి.

NCERT లింక్ Error చూపిస్తే ఏం చేయాలి?

NCERT వెబ్‌సైట్ కొన్నిసార్లు నెమ్మదిగా ఉంటుంది. కొద్దిసేపాగి మళ్లీ ప్రయత్నించండి, లేదా ఈ పేజీలోని “డౌన్‌లోడ్ విధానం” ప్రకారం NCERT Textbooks పేజీ నుంచి తీసుకోండి.

ఈ పుస్తకాలు ఉచితమా?

అవును. NCERT అధికారిక వెబ్‌సైట్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, లాగిన్ అక్కరలేదు.

8వ తరగతి సోషల్ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?

Exploring Society Part 1 లో 7 అధ్యాయాలు: సహజ వనరులు, రాజకీయ పటం పునఃరూపకల్పన, మరాఠాలు, వలస పాలన, ఎన్నికల వ్యవస్థ, పార్లమెంట్, ఉత్పత్తి కారకాలు. అధ్యాయాల వారీ తెలుగు PDF లు ఈ పేజీలో ఉన్నాయి.

పాత పుస్తకం, కొత్త పుస్తకం ఏది చదవాలి?

బడిలో ఇచ్చిన కొత్త పుస్తకమే చదవాలి. పరీక్ష ప్రశ్నలు దాని నుంచే వస్తాయి. పాత Semester పుస్తకాల PDF లు ఇప్పుడు ఉపయోగపడవు.

Official Sources

గణితం, సైన్స్, సోషల్, English పుస్తకాలు, తెలుగు ప్రతులు: NCERT Textbooks. రాష్ట్ర పాఠ్యపుస్తకాలు: AP School Education Department. 8వ తరగతిలో ఏ అధ్యాయం ఏ పరీక్షకు అనేది మా SA1 ప్రశ్నపత్రాల పేజీల్లోని సిలబస్ పట్టికల నుంచి.