AP 8th Class SA1 Maths Question Paper 2026-27 – Answer Key, జవాబులతో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

12 నవంబర్ 2026 SA1 Maths Answer Key (Key Paper) – పరీక్షలో వచ్చిన అసలు ప్రశ్నపత్రం, జవాబులు (8వ తరగతి, 80 మార్కులు)

ఎనిమిదో తరగతి SA1 గణితం పరీక్ష (CD-16, 33 ప్రశ్నలు) 12 నవంబర్ 2026 న జరిగింది. అన్ని ప్రశ్నల జవాబులు ప్రతి ప్రశ్న కిందే ఉన్నాయి. Section D లో A, B రెండింటికీ జవాబులు ఇచ్చాము.

మీ మార్కులు లెక్కించుకోండి: ప్రతి జవాబు కింద ‘నా జవాబు సరైనదే’ టిక్ పెట్టండి. కింది బార్‌లో మీ మొత్తం మార్కుల అంచనా కనిపిస్తుంది.

తర్వాతి పరీక్ష: 16 నవంబర్ 2026 (సోమవారం) – భౌతిక శాస్త్రం. 8th Class SA1 Physical Science సాధన పేపర్ (జవాబులతో) రాసి చూడండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ జవాబులు AP SA1 Key Papers 2026-27 పేజీలో ఉన్నాయి.

Section A – బహుళైచ్ఛిక ప్రశ్నలు (20 × 1 = 20 మార్కులు)

1. Which of the following can not be the units digit of a perfect square?

A) 1B) 6C) 8 ✓D) 9పరిపూర్ణ వర్గాల ఒకట్ల స్థానంలో 0, 1, 4, 5, 6, 9 మాత్రమే వస్తాయి. 2, 3, 7, 8 ఎప్పుడూ రావు.

2. Observe X = (−7)−2 and Y = (−5)−3. What can you conclude about their signs?

A) Both X and Y are positive.B) Both X and Y are negative.C) X is positive and Y is negative. ✓D) X is negative and Y is positive.X = 1/(−7)² = 1/49 (సరి ఘాతం, ధనం). Y = 1/(−5)³ = −1/125 (బేసి ఘాతం, ఋణం).

3. Which of the following correctly represents 1222 in the Roman numeral system?

A) MCCXXII ✓B) MCCXIIC) MCCCXXIID) MCXXII1000 = M, 200 = CC, 20 = XX, 2 = II ⇒ MCCXXII

4. In square ABCD, diagonals AC and BD intersect at point O. What is the measure of ∠AOB?

A) 45°B) 60°C) 90° ✓D) 120°చతురస్రం కర్ణాలు ఒకదానినొకటి లంబంగా సమద్విఖండన చేసుకుంటాయి.

5. Which of the following numbers is exactly divisible by 11?

A) 158B) 841C) 5529D) 90904 ✓90904: బేసి స్థానాల అంకెల మొత్తం 4 + 9 + 9 = 22, సరి స్థానాల మొత్తం 0 + 0 = 0. తేడా 22, ఇది 11 యొక్క గుణిజం. (90904 = 11 × 8264)

6. A student expands (a − b)² as a² + b². Which term is missing from the expansion?

A) +abB) −abC) +2abD) −2ab ✓(a − b)² = a² − 2ab + b²

7. 1 hectare = ______ acres (approximately).

A) 1.471B) 2.471 ✓C) 3.471D) 4.471

8. A student listed the following as Taxicab numbers. Which number is incorrectly included?

A) 1729B) 4104C) 13832D) 1728 ✓1729, 4104, 13832 లను రెండు ఘనాల మొత్తంగా రెండు రకాలుగా రాయవచ్చు. 1728 = 12³ ఒక పరిపూర్ణ ఘనం మాత్రమే, ట్యాక్సీక్యాబ్ సంఖ్య కాదు.

9. Match Column A with Column B: 1. 2 × 10³   2. 7² × 2³   3. 3 × 4⁴   4. (−3)² × (−5)²  |  a. 225   b. 392   c. 2,000   d. 768

A) 1-c, 2-b, 3-d, 4-a ✓B) 1-b, 2-c, 3-a, 4-dC) 1-c, 2-d, 3-b, 4-aD) 1-a, 2-b, 3-c, 4-d2 × 1000 = 2000; 49 × 8 = 392; 3 × 256 = 768; 9 × 25 = 225

10. The diagonals of rectangle PQRS intersect at point O. If PO = 7 cm, what is the length of diagonal PR?

A) 7 cmB) 10.5 cmC) 14 cm ✓D) 21 cmదీర్ఘచతురస్రం కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి: PR = 2 × PO = 14 cm

11. Which of the following statements is correct?

A) The cube of an odd number is even.B) There is no perfect cube that ends with 8.C) The cube of a 2-digit number may have three digits.D) The cube of an odd number is odd. ✓ఉదా: 3³ = 27 బేసి. 2³ = 8 తో ముగుస్తుంది కాబట్టి B తప్పు. 10³ = 1000 కే 4 అంకెలు కాబట్టి C తప్పు.

12. If (x + k)² = x² + 14x + 49, what is the value of k?

A) 5B) 6C) 7 ✓D) 142k = 14 ⇒ k = 7 (k² = 49)

13. ₹4,500 is divided into two parts in the ratio 2 : 3. What is the smaller part?

A) ₹1,500B) ₹1,800 ✓C) ₹2,000D) ₹2,7004500 × 2/5 = ₹1,800

14. The world population of sheep is about 10⁹, and the population of goats is also 10⁹. What is the total population of sheep and goats?

A) 10¹⁰B) 2 × 10⁹ ✓C) 10¹⁸D) 20⁹10⁹ + 10⁹ = 2 × 10⁹ (కూడితే ఘాతాలు కలవవు)

15. In parallelogram ABCD, diagonals AC and BD intersect at O. Statement I: ∠A = ∠C and ∠B + ∠C = 180°. Statement II: AO = OC and BO = OD. Which option is correct?

A) Statement I is true, but Statement II is false.B) Statement I is false, but Statement II is true.C) Both Statement I and Statement II are true. ✓D) Both statements are false.సమాంతర చతుర్భుజంలో ఎదురు కోణాలు సమానం, ఆసన్న కోణాల మొత్తం 180°, కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి.

16. A number N is divisible by both 12 and 18. Which of the following must divide N?

A) 24B) 30C) 36 ✓D) 5412, 18 ల క.సా.గు (LCM) = 36. కాబట్టి N ఎప్పుడూ 36 యొక్క గుణిజం.

17. Which of the following is the correct product of (p − 1)(p + 11)?

A) p² + 10p − 11 ✓B) p² + 12p − 11C) p² − 10p − 11D) p² + 10p + 11p² + 11p − p − 11 = p² + 10p − 11

18. A car travels 80 km in 120 minutes. If it continues to travel at the same speed, how much distance will it cover in 3 hours?

A) 100 kmB) 120 km ✓C) 140 kmD) 160 km120 నిమిషాలు = 2 గంటలు, వేగం 40 km/h. 3 గంటల్లో 40 × 3 = 120 km

19. Which of the following squares will have 6 as the digit in the units place?

A) 108²B) 292²C) 64² ✓D) 135²ఒకట్ల అంకె 4 లేదా 6 అయితే వర్గం 6 తో ముగుస్తుంది: 64² = 4096

20. If 31z5 is a multiple of 9, where z is a non-zero digit, what is the value of z?

A) 3B) 6C) 9 ✓D) 8అంకెల మొత్తం 3 + 1 + z + 5 = 9 + z, 9 యొక్క గుణిజం కావాలి. z సున్నా కాదు కాబట్టి z = 9 (3195 = 9 × 355)

Section B (4 × 2 = 8 మార్కులు)

21. If 12² = 144, then find the value of (0.012)². [2 మార్కులు]

జవాబు

0.012 లో 3 దశాంశ స్థానాలు, వర్గంలో 6 దశాంశ స్థానాలు.
(0.012)² = 0.000144

22. A museum displays years in Roman numerals. Convert MCCXXII and MMCMXCIX into their corresponding numbers. [2 మార్కులు]

జవాబు

MCCXXII = 1000 + 200 + 20 + 2 = 1222
MMCMXCIX = 2000 + 900 + 90 + 9 = 2999

23. Using a suitable algebraic identity, find the value of 397 × 403. [2 మార్కులు]

జవాబు

(a − b)(a + b) = a² − b² వాడితే:
397 × 403 = (400 − 3)(400 + 3) = 400² − 3² = 160000 − 9 = 159991

24. Find the length of the side of a square whose area is 441 m². [2 మార్కులు]

జవాబు

భుజం = √441 = √(3 × 3 × 7 × 7) = 3 × 7 = 21 m

Section C (5 × 4 = 20 మార్కులు)

25. Find all the sides and angles of the quadrilateral obtained by joining two equilateral triangles along a side, each having a side of 4 cm. Show the steps and give reasons. [4 మార్కులు]

జవాబు

రెండు సమబాహు త్రిభుజాలు ABD, CBD లను ఉమ్మడి భుజం BD వెంట కలిపితే ABCD చతుర్భుజం వస్తుంది.
భుజాలు: AB = AD = BC = CD = 4 cm (సమబాహు త్రిభుజాల భుజాలు). నాలుగు భుజాలు సమానం కాబట్టి ఇది రాంబస్.
కోణాలు: ∠A = 60°, ∠C = 60° (సమబాహు త్రిభుజం కోణం). ∠B = 60° + 60° = 120°, ∠D = 60° + 60° = 120°.
కాబట్టి ∠A = 60°, ∠B = 120°, ∠C = 60°, ∠D = 120° (మొత్తం 360°). కర్ణం BD = 4 cm.

26. Express the following numbers in standard form: (i) 59,853 (ii) 70,04,00,00,000 [4 మార్కులు]

జవాబు

(i) 59,853 = 5.9853 × 10⁴
(ii) 70,04,00,00,000 = 7004000000 = 7.004 × 10⁹ (10 అంకెల సంఖ్య, కాబట్టి ఘాతం 9)

27. Find three positive integers that leave a remainder of 2 when divided by 3 and a remainder of 2 when divided by 4. Write an algebraic expression to describe all such numbers. [4 మార్కులు]

జవాబు

3, 4 ల క.సా.గు = 12. 12 యొక్క గుణిజానికి 2 కలిపితే రెండు భాగాల్లోనూ శేషం 2 వస్తుంది.
బీజగణిత సమాసం: 12n + 2 (n = 0, 1, 2, …)
n = 1, 2, 3 ⇒ 14, 26, 38 (సరిచూడడం: 14 = 3 × 4 + 2 = 4 × 3 + 2). n = 0 అయితే 2 కూడా సరిపోతుంది.

28. A mixture of 40 kg contains sand and cement in the ratio 3 : 1. How much cement should be added to the mixture to make the ratio of sand to cement 5 : 2? [4 మార్కులు]

జవాబు

ఇసుక = 40 × 3/4 = 30 kg, సిమెంట్ = 40 × 1/4 = 10 kg
x kg సిమెంట్ కలిపితే 30 : (10 + x) = 5 : 2 ⇒ 5(10 + x) = 60 ⇒ 10 + x = 12 ⇒ x = 2 kg

29. Observe the pattern (Step 1, Step 2, Step 3 made of basic square units). i) Draw the next figure. ii) How many basic units will be present in Step 10? iii) Find a rule or an algebraic expression for the number of basic units in Step n. iv) Use your rule to find the number of basic units in Step 25. [4 మార్కులు]

జవాబు

బొమ్మలను లెక్కిస్తే: Step 1 లో మధ్య వరుస 1 × 3 = 3, పైకి 3, కిందికి 3 ⇒ 9; Step 2 లో 2 × 4 = 8, పైకి 4, కిందికి 4 ⇒ 16; Step 3 లో 3 × 5 = 15, పైకి 5, కిందికి 5 ⇒ 25.
i) Step 4: మధ్యలో 4 × 6 దీర్ఘచతురస్రం, కుడి వైపు పైకి 6, ఎడమ వైపు కిందికి 6 గళ్ళు (మొత్తం 36):iii) Step n లో: n(n + 2) + 2(n + 2) = (n + 2)(n + 2) ⇒ నియమం (n + 2)² (9, 16, 25, 36, …)
ii) Step 10 ⇒ (10 + 2)² = 144 ప్రాథమిక యూనిట్లు
iv) Step 25 ⇒ (25 + 2)² = 27² = 729 ప్రాథమిక యూనిట్లు
వీడియోలో 2n + 5 అని రాశారు, కానీ అది Step 1 కు 7 ఇస్తుంది. బొమ్మలో Step 1 కు 9 గళ్ళు ఉన్నాయి, కాబట్టి (n + 2)² సరైనది.

Section D (4 × 8 = 32 మార్కులు)

ప్రతి ప్రశ్నలో A లేదా B ఒక్కటే రాయాలి. పోల్చుకోవడానికి రెండింటికీ జవాబులు ఇచ్చాం.

30. A) Use the given power line for 7 (7¹ = 7, 7² = 49, 7³ = 343, 7⁴ = 2401, 7⁵ = 16807) and the laws of exponents: i) Find the value of 2401 × 49. ii) Express 49² as a power of 7 and find its value. iii) Simplify 343 × 2401 and express the answer as a power of 7. iv) Simplify 16807 / 49. (Or) B) i) Find the units digit in the value of 2²²⁴ ÷ 4³². ii) The age of the oldest known living tree is 157,000,000,000 seconds. Express this number in the form a × 10ⁿ, where 1 ≤ a < 10. Find a and n and show the steps. [8 మార్కులు]

జవాబు

A) i) 2401 × 49 = 7⁴ × 7² = 7⁴⁺² = 7⁶ = 1,17,649
ii) 49² = (7²)² = 7²ˣ² = 7⁴ = 2401
iii) 343 × 2401 = 7³ × 7⁴ = 7³⁺⁴ = 7⁷ (= 8,23,543)
iv) 16807 / 49 = 7⁵ / 7² = 7⁵⁻² = 7³ = 343

B) i) 4³² = (2²)³² = 2⁶⁴. కాబట్టి 2²²⁴ ÷ 2⁶⁴ = 2²²⁴⁻⁶⁴ = 2¹⁶⁰
2 ఘాతాల ఒకట్ల అంకెలు 2, 4, 8, 6 గా ప్రతి 4 కి మళ్ళీ వస్తాయి. 160 ను 4 తో భాగిస్తే శేషం 0, కాబట్టి 2⁴ లాగే ఒకట్ల అంకె 6
ii) 157,000,000,000 లో దశాంశ బిందువును 1 తర్వాతకు జరపాలి: 1.57000000000 ⇒ 11 స్థానాలు ఎడమకు
157,000,000,000 = 1.57 × 10¹¹ ⇒ a = 1.57, n = 11

31. A) Using the diagonal properties of a rhombus, construct a rhombus whose diagonals are 4 cm and 5 cm. Write the construction steps. (Or) B) Using ruler and compass, construct a square ABCD whose diagonal is 6 cm without using a protractor. Write the construction steps. [8 మార్కులు]

జవాబు

A) ధర్మం: రాంబస్ కర్ణాలు ఒకదానినొకటి లంబంగా సమద్విఖండన చేసుకుంటాయి.
1) AC = 5 cm రేఖాఖండం గీయండి. 2) వృత్తలేఖినితో AC కి లంబ సమద్విఖండన రేఖ గీయండి, అది AC ని O వద్ద ఖండిస్తుంది (AO = OC = 2.5 cm). 3) O కేంద్రంగా 2 cm వ్యాసార్ధంతో లంబ రేఖకు రెండు వైపులా B, D బిందువులు గుర్తించండి (BD = 4 cm). 4) A–B, B–C, C–D, D–A కలపండి. ABCD కావలసిన రాంబస్. (ప్రతి భుజం సుమారు 3.2 cm)

B) ధర్మం: చతురస్రం కర్ణాలు సమానం, ఒకదానినొకటి లంబంగా సమద్విఖండన చేసుకుంటాయి.
1) AC = 6 cm రేఖాఖండం గీయండి. 2) A, C కేంద్రాలుగా AC లో సగం కంటే ఎక్కువ వ్యాసార్ధంతో రెండు వైపులా చాపాలు గీసి, వాటి ఖండన బిందువులను కలపండి. ఇది AC లంబ సమద్విఖండన రేఖ, AC ని O వద్ద ఖండిస్తుంది. 3) O కేంద్రంగా 3 cm (OA) వ్యాసార్ధంతో లంబ రేఖపై రెండు వైపులా B, D గుర్తించండి (BD = 6 cm). 4) AB, BC, CD, DA కలపండి. ABCD కావలసిన చతురస్రం. (ప్రతి భుజం సుమారు 4.24 cm)

32. A) If 48a23b is a multiple of 18, list all possible pairs of values for a and b. (Or) B) Write a 6-digit number that is divisible by 15, such that when the digits are reversed, it is divisible by 6. [8 మార్కులు]

జవాబు

A) 18 = 2 × 9. కాబట్టి సంఖ్య 2 తోనూ 9 తోనూ భాగించబడాలి.
2 తో: b సరి అంకె (0, 2, 4, 6, 8). 9 తో: అంకెల మొత్తం 4 + 8 + a + 2 + 3 + b = 17 + a + b, 9 యొక్క గుణిజం ⇒ a + b = 1 లేదా 10 (19 సాధ్యం కాదు, ఎందుకంటే b ≤ 8).
a + b = 1, b = 0 ⇒ (1, 0); a + b = 10 ⇒ (8, 2), (6, 4), (4, 6), (2, 8)
జతలు (a, b): (1, 0), (8, 2), (6, 4), (4, 6), (2, 8) ⇒ సంఖ్యలు 481230, 488232, 486234, 484236, 482238

B) 15 తో భాగించబడాలంటే: చివరి అంకె 0 లేదా 5, అంకెల మొత్తం 3 యొక్క గుణిజం. తిరగరాసిన సంఖ్య 6 తో భాగించబడాలంటే అది సరి సంఖ్య కావాలి, అంటే అసలు సంఖ్య మొదటి అంకె సరి. చివరి అంకె 0 అయితే తిరగరాసినప్పుడు 6 అంకెల సంఖ్య కాదు, కాబట్టి చివర 5 తీసుకుంటాం.
ఉదాహరణ: 234105. అంకెల మొత్తం 15, చివర 5 ⇒ 234105 ÷ 15 = 15607. తిరగరాస్తే 501432, సరి సంఖ్య, అంకెల మొత్తం 15 ⇒ 501432 ÷ 6 = 83572.
ఈ నియమాలు పాటించే వేరే సంఖ్య రాసినా (ఉదా: 200115) సరైనదే.

33. A) A tractor can plough the same area of a field 4 times faster than a pair of oxen. A farmer wants to plough his 20-acre field. A pair of oxen takes 6 hours to plough an acre of land. How much time would it take if the farmer used a pair of oxen to plough the field? How much time would it take him if he decides to use a tractor instead? (Or) B) Blue and yellow paints are mixed in the ratio 3 : 5 to produce green paint. A total of 40 ml of green paint is prepared. i) Find the quantity of blue paint and yellow paint used in the mixture. ii) To make the paint a lighter shade of green, 20 ml of yellow paint is added to the mixture. Find the new ratio of blue paint to yellow paint. [8 మార్కులు]

జవాబు

A) ఎద్దులతో: 1 ఎకరానికి 6 గంటలు ⇒ 20 ఎకరాలకు 20 × 6 = 120 గంటలు
ట్రాక్టర్ 4 రెట్లు వేగం ⇒ సమయం 4 వంతుల్లో ఒక వంతు: 120 ÷ 4 = 30 గంటలు (ఎకరానికి 1.5 గంటలు)

B) i) మొత్తం భాగాలు 3 + 5 = 8. నీలం = 40 × 3/8 = 15 ml, పసుపు = 40 × 5/8 = 25 ml
ii) కొత్త పసుపు = 25 + 20 = 45 ml. నీలం : పసుపు = 15 : 45 = 1 : 3

ఈ జవాబులు 8వ తరగతి గణితం (Ganita Prakash) పాఠ్యపుస్తకం ఆధారంగా మేము తయారు చేసినవి, ప్రతి లెక్కను మళ్ళీ సరిచూశాము. సరైన వేరే పద్ధతిలో చేసినా పూర్తి మార్కులు వస్తాయి. అసలు మార్కులు మీ ఉపాధ్యాయుల మూల్యాంకనం ప్రకారమే. మిగతా పరీక్షల కోసం AP SA1 2026-27 చూడండి.

మీ మార్కుల అంచనా: 0 / 100

AP 8th Class SA1 Maths Question Paper 2026-27 కోసం ఈ పేజీలో Ganita Prakash పుస్తకంలోని ఏడు SA1 అధ్యాయాలపై 20 ప్రశ్నల సాధన పత్రం ఉంది. ప్రతి ప్రశ్నకు దశలవారీ జవాబు ఇచ్చాం. 5 అక్టోబర్ FA2 పేపర్‌లో ఒక్క ప్రశ్న కూడా రాని మూడు అధ్యాయాలు — A Square and A Cube, Power Play, A Story of Numbers — ఈ పేపర్‌లో 19 మార్కులు తీసుకుంటాయి.

పేపర్ ఆకారం ఈ ఏడాది FA1, FA2 లో వచ్చిన Self Assessment పేపర్‌దే: 20 ప్రశ్నలు, 35 మార్కులు, చివరి ప్రశ్నకు A లేదా B ఎంపిక. 12 నవంబర్ 2026 అసలు SA1 పేపర్ ప్రశ్నలు, మా జవాబులు ఈ పేజీ మొదట్లో ఉన్నాయి.

AP 8th Class SA1 Maths Question Paper 2026-27 — ఒక్క చూపులో

అంశంవివరం
పరీక్షSA1 — ఎనిమిదో తరగతి గణితం (Ganita Prakash)
పరీక్ష తేదీ12 నవంబర్ 2026 (గురువారం), ఉదయం 9:15 – 12:30 (అధికారిక టైమ్ టేబుల్)
SA1 అధ్యాయాలు7 — అన్నీ జూన్ – సెప్టెంబర్‌లో మొదలైనవి; Proportional Reasoning-1 అక్టోబర్‌లో పూర్తవుతుంది
FA2 లో రానివిA Square and A Cube, Power Play, A Story of Numbers
SA1 పేపర్ (అధికారిక)80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8)
ఈ సాధన పత్రం20 ప్రశ్నలు, 35 మార్కులు, 1 గం. 15 ని.

అన్ని తరగతుల SA1 తేదీలు, సబ్జెక్టుల సమాచారం AP SA1 2026-27 – సిలబస్, టైమ్ టేబుల్, ప్రశ్నపత్రాలు పేజీలో ఒకే చోట ఉన్నాయి.

అధికారిక ఉత్తర్వు వచ్చింది: 28-10-2026 పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు (Rc. No. 3475819/SAT-I/2026-27) ప్రకారం 8వ తరగతి SA1 గణితం పరీక్ష 12 నవంబర్ 2026 (గురువారం), ఉదయం 9:15 – 12:30. అసలు పేపర్ 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). ఈ పేజీలోని 20 ప్రశ్నల పేపర్ FA ఆకారంలో (35 మార్కులు) ఉంది — పాఠాల వారీ సాధనకు, అసలు పేపర్‌లోని 1, 2, 4 మార్కుల ప్రశ్నలకు సరిపోతుంది. అధికారిక సిలబస్‌లో ఎనిమిదో తరగతి గణితానికి ఏడు అధ్యాయాలే; Integrated AI ఈ జాబితాలో లేదు.

8వ తరగతి SA1 గణితం సిలబస్ — FA2 తో పోలిక

మీ SA1 Syllabus పేజీలోని Ganita Prakash అధ్యాయాల జాబితాను 5 అక్టోబర్ FA2 అసలు పేపర్‌తో పోల్చాం. FA2 లో విభాజ్యత, అనుపాతం, సర్వసమీకరణాలు, చతుర్భుజాలపై మాత్రమే ప్రశ్నలు వచ్చాయి.

అధ్యాయంFA2 పేపర్‌లోఈ సాధన పత్రంలో మార్కులు
A Square and A Cube (వర్గాలు, ఘనాలు)లేవు7 (20A తో 15)
Power Play (ఘాతాలు)లేవు6
A Story of Numbers (సంఖ్యల చరిత్ర)లేవు6
Quadrilaterals (చతుర్భుజాలు)ఉన్నాయి5
Number Play (విభాజ్యత)ఉన్నాయి1
We Distribute, Yet Things Multiply (సర్వసమీకరణాలు)ఉన్నాయి1 (20B తో ఎక్కువ)
Proportional Reasoning-1 (అనుపాతం)ఉన్నాయి1 (20B తో ఎక్కువ)

AP 8th Class SA1 Maths Question Paper 2026-27 సిలబస్ — Ganita Prakash 7 అధ్యాయాలు, FA2 లో రానివి

నారింజ రంగు మూడు అధ్యాయాలు FA2 లో రాలేదు — పరీక్షకు ముందు వాటితోనే మొదలుపెట్టండి.

FA2 లో వచ్చిన నాలుగు అధ్యాయాల అసలు ప్రశ్నలు AP 8th Class FA2 Maths Question Paper 2026-27 పేజీలో ఉన్నాయి. అధ్యాయాల వారీ వివరణ కోసం AP 8th Class Maths Solutions 2026-27 – Ganita Prakash అధ్యాయాలు చూడండి.

AP 8th Class SA1 Maths Question Paper — 20 ప్రశ్నలు, జవాబులతో

సూచనలు: నాలుగు విభాగాలు, 35 మార్కులు, 1 గంట 15 నిమిషాలు. 20వ ప్రశ్నలో A లేదా B ఏదో ఒకటి మాత్రమే. ప్రతి ప్రశ్న ముందు సొంతంగా రాసి, తర్వాతే జవాబు బటన్ నొక్కండి.

విభాగం A  —  15 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 15 మార్కులు

1. కింది వాటిలో పూర్ణ వర్గం (perfect square) ఏది?
(A) 1000   (B) 1024   (C) 1210   (D) 1350   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 1024.
1024 = 32 × 32. 1000, 1210, 1350 ఏ పూర్ణ సంఖ్య వర్గమూ కావు (31² = 961, 32² = 1024, 33² = 1089, 34² = 1156, 35² = 1225, 36² = 1296, 37² = 1369).

2. పూర్ణ వర్గం ఒకట్ల స్థానంలో ఎప్పుడూ రాని అంకె ఏది?
(A) 1   (B) 4   (C) 6   (D) 7   [1 మార్కు]

జవాబు చూడండి
(D) 7.
పూర్ణ వర్గాల ఒకట్ల అంకె 0, 1, 4, 5, 6, 9 లలో ఒకటే. 2, 3, 7, 8 ఎప్పుడూ రావు.

3. మొదటి 10 బేసి సంఖ్యల మొత్తం (1 + 3 + 5 + … + 19) ఎంత?
(A) 55   (B) 100   (C) 110   (D) 121   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 100.
మొదటి n బేసి సంఖ్యల మొత్తం n². ఇక్కడ n = 10, కాబట్టి 10² = 100.

4. 3375 ఘనమూలం (cube root) ఎంత?
(A) 13   (B) 15   (C) 25   (D) 35   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 15.
15 × 15 × 15 = 225 × 15 = 3375. ఒకట్ల అంకె 5 కాబట్టి ఘనమూలం ఒకట్ల అంకె కూడా 5.

5. 1729 = 1³ + 12³ = 9³ + ___³. ఖాళీలో వచ్చే సంఖ్య ఏది?
(A) 8   (B) 10   (C) 11   (D) 13   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 10.
9³ = 729, 10³ = 1000. 729 + 1000 = 1729. రెండు వేర్వేరు విధాలుగా రెండు ఘనాల మొత్తంగా రాయగలిగే అతి చిన్న సంఖ్య 1729 — దీన్ని హార్డీ – రామానుజన్ సంఖ్య అంటారు.

6. 2³ × 2⁴ విలువ ఏ రూపంలో ఉంటుంది?
(A) 2¹²   (B) 2⁷   (C) 4⁷   (D) 2¹   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 2⁷.
ఒకే భూమి గల ఘాతాలను గుణిస్తే ఘాతాంకాలు కలుస్తాయి: 2³⁺⁴ = 2⁷ = 128.

7. (5²)³ = ?
(A) 5⁵   (B) 5⁶   (C) 5⁸   (D) 25⁵   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 5⁶.
ఘాతానికి ఘాతం: ఘాతాంకాలు గుణించబడతాయి. 2 × 3 = 6.

8. 7⁰ విలువ ఎంత?
(A) 0   (B) 1   (C) 7   (D) 70   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 1.
సున్న కాని ఏ సంఖ్య సున్న ఘాతమైనా 1. ఉదా: 7³ ÷ 7³ = 7⁰ = 1.

9. 38,00,000 ను ప్రామాణిక రూపంలో (scientific notation) రాస్తే?
(A) 38 × 10⁵   (B) 3.8 × 10⁶   (C) 3.8 × 10⁵   (D) 0.38 × 10⁷   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 3.8 × 10⁶.
ప్రామాణిక రూపంలో మొదటి భాగం 1 మరియు 10 మధ్య ఉండాలి. 38,00,000 = 3.8 × 10,00,000 = 3.8 × 10⁶. 38 × 10⁵ విలువ సరైనదే కానీ ప్రామాణిక రూపం కాదు.

10. రోమన్ సంఖ్య XLIX ఏ సంఖ్యను సూచిస్తుంది?
(A) 49   (B) 51   (C) 61   (D) 69   [1 మార్కు]

జవాబు చూడండి
(A) 49.
XL = 50 − 10 = 40, IX = 10 − 1 = 9. మొత్తం 49. చిన్న గుర్తు పెద్ద గుర్తుకు ముందు వస్తే తీసివేయాలి.

11. ప్రాచీన బాబిలోనియన్లు వాడిన సంఖ్యా పద్ధతి ఆధారం (base) ఎంత?
(A) 10   (B) 20   (C) 60   (D) 2   [1 మార్కు]

జవాబు చూడండి
(C) 60.
బాబిలోనియన్ పద్ధతి 60 ఆధారంగా ఉండేది. ఈనాటికీ గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకన్లు, వృత్తంలో 360° — ఈ అలవాటు అక్కడి నుంచే వచ్చింది.

12. ఒక చతుర్భుజంలో మూడు కోణాలు 80°, 95°, 105°. నాలుగో కోణం ఎంత?
(A) 70°   (B) 80°   (C) 90°   (D) 100°   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 80°.
చతుర్భుజం కోణాల మొత్తం 360°. 360° − (80° + 95° + 105°) = 360° − 280° = 80°.

13. కింది వాటిలో 8 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏది?
(A) 3214   (B) 5116   (C) 7104   (D) 9122   [1 మార్కు]

జవాబు చూడండి
(C) 7104.
8 నియమం: చివరి మూడు అంకెలు 8 చే భాగించబడాలి. 104 = 8 × 13. 214, 116, 122 — ఏదీ 8 చే భాగించబడదు.

14. సర్వసమీకరణం వాడి 102² విలువ ఎంత?
(A) 10404   (B) 10204   (C) 10044   (D) 10400   [1 మార్కు]

జవాబు చూడండి
(A) 10404.
(a + b)² = a² + 2ab + b². (100 + 2)² = 10000 + 400 + 4 = 10404.

15. ఒక పటంలో 1 cm = 5 km. పటంలో రెండు ఊళ్ళ మధ్య దూరం 7 cm అయితే అసలు దూరం ఎంత?
(A) 12 km   (B) 35 km   (C) 30 km   (D) 57 km   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 35 km.
పటం దూరం, అసలు దూరం అనుపాతంలో ఉంటాయి: 7 × 5 = 35 km.

విభాగం B  —  రెండు మార్కుల ప్రశ్నలు (2 × 2)

16. ప్రధాన కారణాంకాల పద్ధతిలో 2025 వర్గమూలం కనుక్కోండి.   [2 మార్కులు]

జవాబు చూడండి
2025 = 3 × 3 × 3 × 3 × 5 × 5 = 3⁴ × 5²
జతలుగా: (3 × 3) (3 × 3) (5 × 5). ప్రతి జత నుంచి ఒక కారణాంకం తీసుకోవాలి.
√2025 = 3 × 3 × 5 = 45
సరిచూడండి: 45 × 45 = 2025.

17. ఘాతాంక నియమాలు వాడి సూక్ష్మీకరించండి: (2³ × 3²) ÷ 6²   [2 మార్కులు]

జవాబు చూడండి
6² = (2 × 3)² = 2² × 3²
(2³ × 3²) ÷ (2² × 3²) = 2³⁻² × 3²⁻² = 2¹ × 3⁰ = 2 × 1 = 2
సరిచూడండి: (8 × 9) ÷ 36 = 72 ÷ 36 = 2.

విభాగం C  —  నాలుగు మార్కుల ప్రశ్నలు (2 × 4)

18. i) 1994 ను రోమన్ సంఖ్యల్లో రాయండి. ii) MMXXVI విలువ ఎంత? iii) రోమన్ పద్ధతిలో పెద్ద లెక్కలు (గుణకారం వంటివి) చేయడం ఎందుకు కష్టం? మన స్థాన విలువ పద్ధతిలో ఉన్న సౌకర్యం ఏమిటి?   [4 మార్కులు]

జవాబు చూడండి
i) 1994 = 1000 + 900 + 90 + 4 = M + CM + XC + IV = MCMXCIV
ii) MM = 2000, XX = 20, VI = 6. MMXXVI = 2026
iii) రోమన్ పద్ధతిలో సున్న (0) లేదు, స్థాన విలువ లేదు. ఒక్కో గుర్తుకు ఎక్కడ ఉన్నా ఒకే విలువ, కాబట్టి సంఖ్యలను నిలువు వరుసల్లో పెట్టి కూడటం, గుణించడం కుదరదు; పెద్ద సంఖ్యలకు గుర్తులు చాలా పొడవవుతాయి.
మన పద్ధతిలో 0 – 9 పది అంకెలతోనే ఏ సంఖ్యనైనా రాయవచ్చు. ఒకే అంకె స్థానం మారితే విలువ మారుతుంది (ఉదా: 25 లో 2 = ఇరవై, 205 లో 2 = రెండు వందలు). ఖాళీ స్థానాన్ని 0 చూపిస్తుంది — అందుకే లెక్కలు సులభం.

19. సమాంతర చతుర్భుజం ABCD లో ∠A = (3x + 10)°, ∠B = (2x + 20)°. x విలువ, నాలుగు కోణాలు కనుక్కోండి.   [4 మార్కులు]

జవాబు చూడండి
సమాంతర చతుర్భుజంలో పక్కపక్క కోణాల మొత్తం 180° (సంపూరకాలు).
(3x + 10) + (2x + 20) = 180 ∴ 5x + 30 = 180 ∴ 5x = 150 ∴ x = 30
∠A = 3(30) + 10 = 100°, ∠B = 2(30) + 20 = 80°
ఎదురెదురు కోణాలు సమానం: ∠C = ∠A = 100°, ∠D = ∠B = 80°
సరిచూడండి: 100 + 80 + 100 + 80 = 360°.

విభాగం D  —  ఎనిమిది మార్కుల ప్రశ్న (A లేదా B)

20. A) i) 1323 ను ఏ అతి చిన్న సంఖ్యతో గుణిస్తే పూర్ణ ఘనం వస్తుంది?   ii) ఆ లబ్ధం ఘనమూలం కనుక్కోండి.   iii) 1323 పూర్ణ వర్గమా? కారణం చెప్పండి.
(లేదా)
B) i) 4 మందికి వంట చేయడానికి 300 g బియ్యం కావాలి. అదే పద్ధతిలో 10 మందికి ఎంత కావాలి? 6 మందికి?   ii) (3x − 4y)² ను సర్వసమీకరణంతో విస్తరించి, x = 2, y = 1 తో సరిచూడండి.   [8 మార్కులు]

జవాబు చూడండి
A) i) 1323 = 3 × 441 = 3 × 3 × 147 = 3 × 3 × 3 × 49 = 3³ × 7²
మూడు 3 లు ఉన్నాయి — ఒక పూర్తి గుంపు. 7 లు రెండే ఉన్నాయి — ఘనం కావాలంటే మూడో 7 కావాలి. అతి చిన్న గుణకం 7.
1323 × 7 = 9261 = 3³ × 7³
A) ii) ∛9261 = 3 × 7 = 21. సరిచూడండి: 21 × 21 × 21 = 441 × 21 = 9261.
A) iii) 1323 = 3³ × 7². 3 కారణాంకం మూడుసార్లు ఉంది — జతలుగా విడదీయలేం. కాబట్టి 1323 పూర్ణ వర్గం కాదు (36² = 1296, 37² = 1369 మధ్యలో ఉంది).
B) i) ఒక్కరికి 300 ÷ 4 = 75 g. 10 మందికి 75 × 10 = 750 g. 6 మందికి 75 × 6 = 450 g. మనుషులు పెరిగితే బియ్యం అదే నిష్పత్తిలో పెరుగుతుంది — ఇది అనులోమ అనుపాతం.
B) ii) (a − b)² = a² − 2ab + b². a = 3x, b = 4y.
(3x − 4y)² = 9x² − 2(3x)(4y) + 16y² = 9x² − 24xy + 16y²
x = 2, y = 1: ఎడమ వైపు (6 − 4)² = 4. కుడి వైపు 36 − 48 + 16 = 4. రెండూ సమానం.

ఈ పేపర్‌లో లేని 7 ముఖ్య ప్రశ్నలు

అధ్యాయంప్రశ్నజవాబు
A Square and A Cube50, 100 మధ్య ఉన్న పూర్ణ వర్గాలు ఏవి?64, 81 (8², 9²). 49 = 7² చిన్నది, 100 = 10² పరిధిలోకి రాదు.
Power Play2¹⁰, 10³ — ఏది పెద్దది?2¹⁰ = 1024, 10³ = 1000. 2¹⁰ పెద్దది.
A Story of Numbers25, 205 లలో అంకె 2 విలువ ఏమిటి?25 లో ఇరవై, 205 లో రెండు వందలు. 0 ఖాళీ స్థానాన్ని చూపించడం వల్లే ఈ తేడా.
Quadrilateralsరాంబస్ కర్ణాలు 6 cm, 8 cm. భుజం పొడవు?కర్ణాలు లంబంగా సమద్విఖండన చేసుకుంటాయి: 3, 4 cm భుజాల లంబకోణ త్రిభుజం. భుజం = √(9 + 16) = 5 cm.
Number Play123456 ను 6 భాగిస్తుందా?సరి సంఖ్య (2 చే భాగం), అంకెల మొత్తం 21 (3 చే భాగం). అవును.
We Distribute, Yet Things Multiply98 × 102 విలువ?(100 − 2)(100 + 2) = 10000 − 4 = 9996.
Proportional Reasoning-15 పెన్నుల ధర ₹60. 8 పెన్నుల ధర?ఒక్కటి ₹12. 8 × 12 = ₹96.

8వ తరగతి SA1 గణితం సాధన పత్రం PDF

20 ప్రశ్నలు ముందు, జవాబులు చివర — ప్రింట్ తీసి రాయడానికి: Download PDF — AP 8th Class SA1 Maths Practice Paper 2026-27

8వ తరగతి గణితంలో మార్కులు జారిపోయే 6 చోట్లు

  1. వర్గమూలం, ఘనమూలంలో జతలు: వర్గమూలానికి కారణాంకాలను రెండేసి, ఘనమూలానికి మూడేసి గుంపులుగా చేయాలి. గుంపు పూర్తి కాకపోతే ఆ సంఖ్య పూర్ణ వర్గం / ఘనం కాదు.
  2. ఘాతాంకాలు కూడటం, గుణించడం: 2³ × 2⁴ లో ఘాతాంకాలు కూడాలి (2⁷); (2³)⁴ లో గుణించాలి (2¹²). రెండూ కలగలిపితే తప్పు.
  3. ప్రామాణిక రూపం: మొదటి భాగం 1 కంటే తక్కువ లేదా 10 కంటే ఎక్కువ ఉంటే అది ప్రామాణిక రూపం కాదు.
  4. రోమన్ సంఖ్యల తీసివేత నియమం: IV, IX, XL, XC, CD, CM — ఈ ఆరు జతలే. IL (49) అని రాయకూడదు; సరైనది XLIX.
  5. చతుర్భుజ కోణాల్లో కారణం: “పక్కపక్క కోణాలు సంపూరకాలు”, “ఎదురెదురు కోణాలు సమానం” అని కారణం రాయకపోతే మార్కులు తగ్గుతాయి.
  6. అనుపాతంలో యూనిట్లు: గ్రాములు, కిలోమీటర్లు, రూపాయలు — జవాబుతో యూనిట్ రాయడం మరిచిపోవద్దు.

12 నవంబర్ గణితం పరీక్షకు ముందు — రోజుకో అంశం

రోజుఅంశం
1పూర్ణ వర్గాలు: ఒకట్ల అంకె నియమాలు, బేసి సంఖ్యల మొత్తం, ప్రధాన కారణాంకాలతో వర్గమూలం
2ఘనాలు, ఘనమూలాలు; పూర్ణ ఘనం చేయడానికి గుణకం / భాజకం (20A లాంటివి)
3Power Play: ఘాతాంక నియమాలు, సున్న ఘాతం
4Power Play: పెద్ద సంఖ్యలు, ప్రామాణిక రూపం; 2¹⁰ వంటి పోలికలు
5A Story of Numbers: రోమన్ సంఖ్యలు, ఇతర సంఖ్యా పద్ధతులు, స్థాన విలువ, సున్న పాత్ర
6Quadrilaterals: సమాంతర చతుర్భుజం, రాంబస్, దీర్ఘచతురస్రం, చతురస్రం, గాలిపటం లక్షణాలు
7Number Play, సర్వసమీకరణాలు: 2, 3, 4, 6, 8, 9, 11 విభాజ్యత; (a ± b)², (a + b)(a − b)
8Proportional Reasoning-1: నిష్పత్తి, అనుపాతం, పటం స్కేలు, ఏకమాన పద్ధతి
9ఈ పేజీలోని 20 ప్రశ్నల పేపర్ — గడియారం పెట్టి 1 గం. 15 ని.
10తప్పుల సవరణ; FA2 పేపర్, పై 7 అదనపు ప్రశ్నలు

పాత పేపర్ల సాధనకు AP 8th Class FA1 Maths Answer Key 2026 పేజీ, అధ్యాయాల వారీ సాధనలకు AP Board Solutions Class 8 Maths Solutions ఉన్నాయి.

FAQs

8వ తరగతి SA1 గణితం పరీక్ష ఎప్పుడు?

28-10-2026 అధికారిక టైమ్ టేబుల్ ప్రకారం 8వ తరగతి గణితం పరీక్ష 12 నవంబర్ 2026 (గురువారం), ఉదయం 9:15 – 12:30. SA1 పరీక్షలు 9 నుంచి 20 నవంబర్ వరకు.

8వ తరగతి SA1 గణితంలో ఏ అధ్యాయాలు?

Ganita Prakash నుంచి ఏడు: A Square and A Cube, Power Play, A Story of Numbers, Quadrilaterals, Number Play, We Distribute, Yet Things Multiply, Proportional Reasoning-1.

FA2 లో ఏ అధ్యాయాల మీద ప్రశ్నలు రాలేదు?

A Square and A Cube, Power Play, A Story of Numbers. ఈ మూడూ SA1 లో ఉంటాయి కాబట్టి వీటికి ఇప్పుడే ఎక్కువ సమయం ఇవ్వండి.

Integrated AI పై ప్రశ్నలు వస్తాయా?

రావు. 28-10-2026 అధికారిక సిలబస్‌లో ఎనిమిదో తరగతి గణితానికి Integrated AI లేదు — పైన చెప్పిన ఏడు అధ్యాయాలే.

8వ తరగతి SA1 పేపర్‌కు ఎన్ని మార్కులు?

28-10-2026 అధికారిక ఉత్తర్వు ప్రకారం 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). ఈ పేజీలోని సాధన పేపర్ FA ఆకారంలో 20 ప్రశ్నలు, 35 మార్కులు — అసలు పేపర్‌కు ముందు పాఠాల వారీ సాధనకు.

ఈ ప్రశ్నపత్రం అసలు SA1 పేపరేనా?

కాదు. ఇది సాధన కోసం మేము తయారు చేసినది. సిలబస్, పరీక్ష తేదీ 28-10-2026 అధికారిక ఉత్తర్వు నుంచి.

1729 ను హార్డీ – రామానుజన్ సంఖ్య అని ఎందుకు అంటారు?

రెండు ఘనాల మొత్తంగా రెండు వేర్వేరు విధాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య ఇది: 1³ + 12³ = 9³ + 10³ = 1729. రామానుజన్ ఈ విషయాన్ని హార్డీకి చెప్పిన సంఘటనతో ఈ పేరు వచ్చింది.

పూర్ణ వర్గమో కాదో త్వరగా ఎలా తెలుసుకోవాలి?

ఒకట్ల అంకె 2, 3, 7, 8 అయితే పూర్ణ వర్గం కాదు. మిగతావాటికి ప్రధాన కారణాంకాలు తీసి, ప్రతి కారణాంకం జతలుగా ఉందో చూడండి.

ప్రామాణిక రూపం (scientific notation) అంటే?

ఒక సంఖ్యను (1 నుంచి 10 లోపు సంఖ్య) × 10 ఘాతంగా రాయడం. ఉదా: 38,00,000 = 3.8 × 10⁶.

రోమన్ సంఖ్యల్లో సున్న ఉందా?

లేదు. అందుకే రోమన్ పద్ధతిలో స్థాన విలువ లేదు, పెద్ద లెక్కలు కష్టం. మనం వాడే 0 – 9 స్థాన విలువ పద్ధతి భారతదేశం నుంచి ప్రపంచానికి వెళ్ళింది.

12 నవంబర్ పరీక్షకు ముందు ఎలా చదవాలి?

పై పది రోజుల పట్టిక పాటించండి: మొదటి ఐదు రోజులు FA2 లో రాని మూడు అధ్యాయాలు, తర్వాత మిగతా నాలుగు, చివరి రెండు రోజులు పూర్తి పేపర్, సవరణ.

అసలు SA1 పేపర్ జవాబులు ఎక్కడ?

పరీక్ష రోజు సాయంత్రం ఇదే పేజీ పైభాగంలో — FA2 కి చేసినట్లే.

ఎనిమిదో తరగతి తెలుగుకు కూడా స్కోర్ కార్డ్‌తో పేపర్ ఉంది: AP 8th Class SA1 Telugu Question Paper 2026-27

Official Sources

SA1 టైమ్ టేబుల్, మార్కుల విధానం, సిలబస్: పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు Rc. No. 3475819/SAT-I/2026-27, తేదీ 28-10-2026 (SCERT సిలబస్ అనుబంధంతో); AP SCERT. నెలవారీ బోధన క్రమం: High School Academic Calendar 2026-27. ఆరు నుంచి పది తరగతుల సబ్జెక్టు వారీ పాఠాలు AP SA1 Syllabus 2026-27 – Class 1 to 10 లో ఉన్నాయి.