AP 7th Class SA1 English Question Paper 2026-27 – జవాబులతో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP 7th Class SA1 English Question Paper 2026-27 కోసం చూస్తున్నారా? 7 అక్టోబర్ FA2 English (ఏడో తరగతి) పేపర్‌లో passage Say the Right Thing నుంచి వచ్చింది; grammar Doctor Dolittle, A Funny Man, My Brother’s Great Invention పాఠాల నుంచి వచ్చింది. Unit 1 మొత్తం, Paper Boats, అక్టోబర్ పాఠం North, South, East, West ఆ పేపర్‌లో కనిపించలేదు. ఈ 20 ప్రశ్నల సాధన పేపర్ ఎక్కువగా వాటి మీదే.

ఏడో తరగతి English పుస్తకం Poorvi. ప్రశ్నలు ఇంగ్లీష్‌లో, ప్రతి జవాబు కింద తెలుగులో వివరణ. Three Days to See, Try Again, Paper Boats, Shaana పోస్ట్‌కార్డుల మీద passages మేమే సొంత మాటల్లో రాశాం. రెండు పద్యాల నుంచి (Try Again, Paper Boats) కొన్ని పంక్తులు మాత్రమే తీసుకున్నాం. ఏ జవాబైనా మీది సరిపోతే దాని కింద టిక్ పెట్టండి. కింద బార్‌లో 35 కి ఎన్ని వచ్చాయో కనిపిస్తుంది.

ఏడో తరగతి SA1 English అసలు పేపర్ కీ పరీక్ష జరిగిన రోజే ఇక్కడ ఉంటుంది. మెసేజ్ రావాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి

ఈ పేజీలో: పరీక్ష | సిలబస్ | సాధన పేపర్ | పాఠాల వారీ ప్రశ్నలు | Writing | PDF | 10 రోజుల ప్లాన్ | FAQs

AP 7th Class SA1 English Question Paper 2026-27 — పరీక్ష వివరాలు

అంశంవివరం
పరీక్ష పేరుSA1 (Summative Assessment 1), 2026-27
తరగతి7వ తరగతి — English, పాఠ్యపుస్తకం Poorvi
పరీక్షల తేదీలు9 – 20 నవంబర్ 2026, SCERT అకడమిక్ క్యాలెండర్ (Tentative)
సిలబస్Unit 1 Learning Together, Unit 2 Wit and Humour, Unit 3 Dreams and Discoveries — తొమ్మిది పాఠాలు, పద్యాలు
అక్టోబర్‌లో చేరిన పాఠంNorth, South, East, West (Unit 3)
ఈ పేజీలోని పేపర్Sections A, B, C, D — 20 ప్రశ్నలు, 35 మార్కులు, గంటా పదిహేను నిమిషాలు

ఇంకా రాలేదు: 6 – 9 తరగతుల SA1 సబ్జెక్టు వారీ టైమ్ టేబుల్, ప్రశ్నపత్రం నమూనాతో SCERT ఉత్తర్వు 17 అక్టోబర్ 2026 వరకు విడుదల కాలేదు. ఉత్తర్వు వచ్చే వరకు 7 అక్టోబర్ ఏడో తరగతి FA2 English పేపర్ నిర్మాణమే ఇక్కడ వాడాం.

ఏడో తరగతి మిగతా సబ్జెక్టుల SA1 సాధన పేపర్ల కోసం AP SA1 2026-27 – సిలబస్, టైమ్ టేబుల్, ప్రశ్నపత్రాలు చూడండి.

7వ తరగతి SA1 English సిలబస్ 2026-27 — Poorvi పాఠాలు, FA2 తో పోలిక

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ వరకు Unit 1, Unit 2, Unit 3 లో మొదటి రెండు పాఠాలు చెబుతారు; అక్టోబర్‌లో North, South, East, West. మూడో కాలమ్ ఏడో తరగతి FA2 అసలు పేపర్ (Exam Code 726) ఆధారంగా రాశాం.

యూనిట్పాఠం, పద్యంFA2 పేపర్‌లో
Unit 1 — Learning TogetherThe Day the River Spoke (Kamala Nair); Try Again (పద్యం, Eliza Cook); Three Days to See (Helen Keller)కనిపించలేదు
Unit 2 — Wit and HumourAnimals, Birds, and Dr. Dolittle (Hugh Lofting)కథ passage గా రాలేదు; countryside, compound words, present perfect, notice వచ్చాయి
Unit 2A Funny Man (పద్యం, Natalie Joan)phrasal verbs మాత్రమే
Unit 2Say the Right Thingpassage వచ్చింది
Unit 3 — Dreams and DiscoveriesMy Brother’s Great Invention (Anita Rau Badami)binomials, onomatopoeia, past perfect, rearrange వచ్చాయి
Unit 3Paper Boats (పద్యం, Rabindranath Tagore)కనిపించలేదు
Unit 3 (అక్టోబర్)North, South, East, West (C. G. Salamander)కొత్తది

AP 7th Class SA1 English Question Paper 2026-27 సిలబస్ — Poorvi Units 1 – 3, FA2 లో రాని పాఠాలు

ఫోన్ గ్యాలరీలో ఉంచుకోండి: నారింజ కార్డులు FA2 లో రాని పాఠాలు, “కొత్తది” బ్యాడ్జ్ అక్టోబర్ పాఠం — మొదట వీటినే చదవండి.

Say the Right Thing passage, Dolittle compound words, notice ప్రశ్నల అసలు జవాబులు AP 7th Class FA2 English Question Paper 2026-27 పేజీలో ఉన్నాయి. Unit 1 పాఠాల నోట్స్ AP 7th Class English Unit 1 Learning Together Notes లో దొరుకుతాయి.

AP 7th Class SA1 English Question Paper — 20 ప్రశ్నలు, model answers

Instructions: There are 20 questions and four sections. Time allowed: 1 hour 15 minutes. Total marks: 35. Section D has a choice — attempt only A or only B. ప్రతి ప్రశ్నకు ముందు మీ జవాబు పేపర్ మీద రాసి, ఆ తర్వాతే జవాబు చూడండి.

Section A — Vocabulary, Grammar and a Passage (15 × 1)

1. In ‘The Day the River Spoke’, the river talks, laughs and gives advice like a person. This figure of speech is called
(A) simile   (B) personification   (C) alliteration   (D) rhyme   [1 మార్కు]

జవాబు చూడండి
(B) personification.
నది మనిషిలా మాట్లాడుతుంది, నవ్వుతుంది, సలహా ఇస్తుంది. అందుకే రచయిత “River” ను పెద్ద అక్షరం R తో రాశారు. రచయిత్రి Kamala Nair.

2. Choose the correct meaning of the underlined word: Jahnavi was startled, because she was sure she had been quite alone.
(A) surprised   (B) sleepy   (C) angry   (D) bored   [1 మార్కు]

జవాబు చూడండి
(A) surprised.
startled = ఉలిక్కిపడటం, అనుకోకుండా ఆశ్చర్యపోవడం. చుట్టూ ఎవరూ లేరనుకున్నప్పుడు ఒక గొంతు వినిపించింది.

3. In the sentence “She rang me up”, the word ‘up’ is used as
(A) a preposition   (B) an adverb   (C) a noun   (D) a conjunction   [1 మార్కు]

జవాబు చూడండి
(B) an adverb.
up తర్వాత నామవాచకం (object) లేదు; అది rang అనే క్రియ గురించి చెబుతుంది కాబట్టి adverb. “She ran up the stairs” లో up తర్వాత the stairs ఉంది — అక్కడ preposition. (The Day the River Spoke — Let us learn)

4. In the poem ‘Try Again’, the word ‘Bravo’ is an example of
(A) a conjunction   (B) an interjection   (C) an adjective   (D) a preposition   [1 మార్కు]

జవాబు చూడండి
(B) an interjection.
ఒక్కసారిగా వచ్చిన భావాన్ని (ఇక్కడ మెచ్చుకోలు) చూపే పదం interjection. సాలీడు చివరికి గూడు చేరగానే King Bruce “Bravo!” అని అరిచాడు.

5. Which of the following sentences contains a metaphor?
(A) He ran as fast as a cheetah.   (B) The classroom was a zoo.   (C) He sang like an angel.   (D) The baby slept like a log.   [1 మార్కు]

జవాబు చూడండి
(B) The classroom was a zoo.
like, as పదాలు లేకుండా ఒకటి మరొకటే అని పోలిస్తే metaphor. like / as … as తో పోలిస్తే simile — మిగతా మూడూ simile. Try Again పద్యంలో సాలీడు ప్రయత్నాన్ని రాజు పోరాటంతో పోల్చడం కూడా metaphor అని పుస్తకం చెబుతుంది.

6. Choose the correct meaning of the underlined word: “That foolish thing will strive no more to climb.”
(A) to rest for a long time   (B) to try very hard to achieve something   (C) to fall down suddenly   (D) to make a loud noise   [1 మార్కు]

జవాబు చూడండి
(B) to try very hard to achieve something.
strive = గట్టిగా ప్రయత్నించడం. అలాంటి అర్థమే ఉన్న పదాలు endeavour, toil. ఇక సాలీడు ఎక్కదని రాజు అనుకున్నాడు, కానీ అది మళ్ళీ ఎక్కింది.

7. In the sentence “They might arrive late due to traffic,” the modal ‘might’ expresses
(A) ability   (B) possibility   (C) necessity   (D) permission   [1 మార్కు]

జవాబు చూడండి
(B) possibility.
might = జరగొచ్చు, జరగకపోవచ్చు. can – ability, must – necessity, may / could I – permission. (Three Days to See — modals)

8. In ‘Three Days to See’, which of these words is related to the sense of taste?
(A) panorama   (B) relish   (C) perfume   (D) rough   [1 మార్కు]

జవాబు చూడండి
(B) relish.
relish = ఇష్టంగా రుచి చూడటం. panorama చూపు, perfume వాసన, rough స్పర్శకు సంబంధించిన sensory words.

9. In ‘A Funny Man’, the phrases ‘sounding sight’ and ‘hopped home’ are examples of
(A) alliteration   (B) simile   (C) metaphor   (D) personification   [1 మార్కు]

జవాబు చూడండి
(A) alliteration.
దగ్గరగా ఉన్న పదాల మొదట ఒకే హల్లు శబ్దం (s – s, h – h) రావడం alliteration. తలపై బూటు, కాళ్ళకు టోపీలు వేసుకున్న ఆ వింత మనిషి చివరికి తలపై గెంతుతూ ఇంటికి వెళ్ళాడు.

10. Choose the correct verb: Neither the passengers nor the taxi driver ______ aware of the best route to the hotel.
(A) were   (B) was   (C) are   (D) have been   [1 మార్కు]

జవాబు చూడండి
(B) was.
neither … nor తో కలిసిన subjects లో verb దగ్గరగా ఉన్న subject ను అనుసరిస్తుంది. ఇక్కడ దగ్గరగా ఉన్నది the taxi driver (singular) కాబట్టి was. (North, South, East, West — subject-verb agreement)

Read the passage and answer questions 11 – 15. (Three Days to See ఆధారంగా మేము రాసిన passage)
Helen Keller, who could neither see nor hear, once imagined what she would most like to see if she were given her sight for just three days. On the first day, she would look at the people whose kindness and companionship had made her life worth living. She knew her friends only by feeling their faces with her fingertips, and she called the eye the ‘window of the soul’. On the second day, she would rise with the dawn to watch night turn into day, and then go to the museums to see the history of the earth and of man’s progress, including the huge remains of dinosaurs and mastodons. On the third day, she would stand at a busy corner of a city and watch people going about their daily lives. Her advice to those who can see is simple: use your eyes as if you would be blind tomorrow.

11. Whom would Helen Keller want to see on the first day?
(A) the busy people of the city   (B) the people whose kindness and companionship made her life worth living   (C) the animals in the museum   (D) the sunrise and the sunset   [1 మార్కు]

జవాబు చూడండి
(B) the people whose kindness and companionship made her life worth living.
అంటే తన స్నేహితులు, తనకు తోడుగా నిలిచినవారు. ఇప్పటివరకు వాళ్ళ ముఖాలను వేళ్ళతో తాకి మాత్రమే గుర్తుపట్టేది.

12. Where would she go on the second day to see the progress of man?
(A) to a busy corner   (B) to the museums   (C) to a forest   (D) to a theatre   [1 మార్కు]

జవాబు చూడండి
(B) to the museums.
భూమి చరిత్ర, డైనోసార్లు, mastodons (ఏనుగులా ఉండే బొచ్చు జంతువులు) అవశేషాలు అక్కడ చూస్తానని రాసింది.

13. What does she call the eye?
(A) the mirror of the mind   (B) the window of the soul   (C) the lamp of the body   (D) the door of the heart   [1 మార్కు]

జవాబు చూడండి
(B) the window of the soul.
కళ్ళలోకి చూసి మనిషి మనసు తెలుసుకోవచ్చు అనే భావం.

14. How did she know her friends?
(A) by hearing their voices   (B) by feeling their faces with her fingertips   (C) by reading their letters   (D) by their perfume   [1 మార్కు]

జవాబు చూడండి
(B) by feeling their faces with her fingertips.
ఆమెకు చూపు, వినికిడి రెండూ లేవు; స్పర్శ ద్వారానే నవ్వు, బాధ వంటి భావాలు గుర్తించేది.

15. What is her advice to people who can see?
(A) Close your eyes often.   (B) Use your eyes as if you would be blind tomorrow.   (C) Visit museums every day.   (D) Learn to read with your fingers.   [1 మార్కు]

జవాబు చూడండి
(B) Use your eyes as if you would be blind tomorrow.
మిగతా ఇంద్రియాలకూ ఇదే సలహా — రేపు పోతాయేమో అన్నంత శ్రద్ధగా ఈ రోజే వినండి, రుచి చూడండి, తాకండి. అన్నింటిలో చూపే అత్యంత ఆనందకరమని ఆమె అభిప్రాయం.

Section B — Two Poems (2 × 2)

Read the lines from ‘Paper Boats’ and answer question 16.
In big black letters I write my name on them and the name of the village where I live.
I hope that someone in some strange land will find them and know who I am.

16. (i) What does the child write on the paper boats? (A) a short poem (B) his name and the name of his village (C) the name of his school (D) a message for the fairies
(ii) The words ‘big black’ are an example of (A) simile (B) alliteration (C) metaphor (D) onomatopoeia   [2 మార్కులు]

జవాబు చూడండి
(i) (B) his name and the name of his village. ఏదో దూర దేశంలో ఎవరైనా ఆ పడవలు చూసి తానెవరో తెలుసుకోవాలని ఆశ.
(ii) (B) alliteration. big, black — రెండూ b శబ్దంతో మొదలవుతాయి.
కవి Rabindranath Tagore. పడవల్లో తోటలోని shiuli పూలు నింపుతాడు; ఆకాశంలోని మేఘాలు తన పడవలతో పోటీ పడే తెరచాపలని ఊహిస్తాడు; రాత్రి నిద్ర దేవతలు (fairies of sleep) కలల బుట్టలతో ఆ పడవల్లో ప్రయాణిస్తారని కలలు కంటాడు. భావం: బాల్యపు అమాయకత్వం, ఊహాశక్తి.

Read the summary of the poem ‘Try Again’ and answer question 17.
King Bruce of Scotland had tried again and again to do a great deed for his people, but he had failed. Lying down in despair, he decided to give it all up. Just then he noticed a spider hanging by a fine thread, trying to climb up to its cobweb near the ceiling. It fell again and again, and nine brave attempts were counted, but it did not stop. At last, inch by inch, it reached its home. The king cried, “Bravo!” and decided to try once more. This time he did not fail.

17. (i) What had King Bruce decided just before he saw the spider? (A) to fight at once (B) to give it all up (C) to leave Scotland (D) to build a new palace
(ii) What did the king learn from the spider? (A) Spiders are foolish. (B) We should keep trying till we succeed. (C) Kings need more rest. (D) Cobwebs are very strong.   [2 మార్కులు]

జవాబు చూడండి
(i) (B) to give it all up. “I’ll give it all up,” said he — నిరాశలో రాజు అన్న మాట.
(ii) (B) We should keep trying till we succeed. “All honour to those who try” — ప్రయత్నించేవారికే గౌరవం.
కవయిత్రి Eliza Cook. rhyme scheme ABAB. ఓటమి విజయానికి మెట్టు, పట్టుదలే విజయ రహస్యం — పద్యం సందేశం.

Section C — Sound Words and Reading (2 × 4)

18. Match the sound words from ‘The Day the River Spoke’ in Column A with their meanings in Column B.
A: 1. shrieked   2. splashed   3. rustle   4. gasped
B: (a) caused liquid to strike or fall on something   (b) took a short quick breath due to surprise or shock   (c) made a high-pitched piercing sound   (d) a soft dry sound, like leaves moving   [4 మార్కులు]

జవాబు చూడండి
1 – (c),   2 – (a),   3 – (d),   4 – (b) — ప్రతి సరైన జత ఒక మార్కు.
shrieked: చిలుకలు కీచుగా అరుస్తాయి, కానీ ఆ గొంతు నిద్రమత్తుగా ఉంది. splashed: జాహ్నవి కన్నీటి బొట్టు ముక్కు మీదుగా జారిపడింది. rustle: వెదురు ఆకులు గలగలలాడడం. gasped: బడికి వెళ్ళమని నది చెప్పగానే “నేను వెళ్ళలేను” అని జాహ్నవి ఊపిరి బిగబట్టింది.

Read the passage and answer question 19. (North, South, East, West ఆధారంగా)
Shaana lives on Rameswaram island. During the holidays she travels across India with her Amma and Appa and sends postcards to her classmates. At the Thajiwas glacier in Kashmir, her parents throw snowballs at each other. In Arunachal Pradesh, the family walks through a thick forest to reach a treehouse. In the Sundarbans of West Bengal, she is amazed to see mangrove trees growing in seawater. She goes rafting on the Narmada river and finds it wild and scary. On the way home, her train crosses the Pamban bridge with the ocean on both sides.

19. (1) Where does Shaana live? (A) Chennai (B) Rameswaram island (C) Goa (D) Kashmir
(2) Where did Shaana see mangroves growing in seawater? (A) Gujarat (B) the Sundarbans (C) Himachal Pradesh (D) Goa
(3) How did the family reach the treehouse in Arunachal Pradesh? (A) by boat (B) by walking through a thick forest (C) by train (D) by rafting
(4) Which bridge did her train cross on the way home? (A) Howrah bridge (B) Pamban bridge (C) Narmada bridge (D) Thajiwas bridge   [4 మార్కులు]

జవాబు చూడండి
(1) (B) Rameswaram island — 1 మార్కు
(2) (B) the Sundarbans — 1 మార్కు. ఇలాంటి ప్రదేశాలను wetlands అంటారని అమ్మ చెప్పింది.
(3) (B) by walking through a thick forest — 1 మార్కు
(4) (B) Pamban bridge — 1 మార్కు
పాఠంలో ఇంకా: గుజరాత్ ఎడారి (“సముద్రం లేని బీచ్”), గోవా పీఠభూములు, సొరంగాలు, చెన్నై నుంచి పుదుచ్చేరి దారిలో surfing, ఇంటికి ముందు Olaikaadu beach. రచయిత C. G. Salamander.

Section D — Writing (1 × 8)

20. Answer either A or B.
A) Leave Application: You have to travel to your hometown to attend your cousin’s wedding. Write an application to the Principal of your school requesting leave for three days. Mention how you will complete your school work.
(OR)
B) Letter to a Cousin: King Bruce was inspired by a spider that kept on trying. Write a letter to your cousin telling how you plan to overcome a difficult situation, and advise him or her never to quit.   [8 మార్కులు]

జవాబు చూడండి
A) Model answer — Leave Application
[House No.], [Street],
[City],
Andhra Pradesh.
[Date]

The Principal,
[Name of the School],
[City],
Andhra Pradesh.

Subject: Request for leave for three days

Dear Sir,
I am writing to request leave for three days with effect from [date] to [date] in order to attend my cousin’s wedding in my hometown, [name of the town]. My whole family will be travelling there, and the journey takes most of a day.
I would like to assure you that I will not fall behind in my studies. I will collect the class notes and homework from my friend [name] and complete all the work as soon as I return. I will also meet my subject teachers to clear any doubts.
I would be grateful if you could grant me the leave.

Yours sincerely,
[Name]Class VII, Section [ ], Roll No. [ ]Leave application: పంపేవారి చిరునామా, తేదీ, Principal చిరునామా, Subject, Dear Sir / Madam, ఎన్ని రోజులు – ఎప్పటి నుంచి ఎప్పటి వరకు – ఎందుకు, బడి పని ఎలా పూర్తి చేస్తారు, Yours sincerely, పేరు, తరగతి, సెక్షన్, రోల్ నంబర్. మార్కులు: format 2, విషయం 4, భాష 2.
B) Model answer — Letter to a Cousin
[House No.], [Street],
[Town].
[Date]

Dear Ravi,
Thank you for your letter. You wrote that you are worried about your Mathematics marks and feel like giving up. Let me share my plan for facing a difficult situation, because I faced the same problem last year.
To begin with, I stay calm and find out exactly where the problem lies. Next, I break the big task into small parts, like one chapter a week. After that, I ask my teacher or my parents for help with the parts I cannot understand. Then, I practise a little every day, even when I do not feel like it. Finally, I check my progress and do not lose heart if I fail once or twice.
Do you remember the poem ‘Try Again’? King Bruce was about to give up, but a small spider fell nine times and still climbed to its web. If a spider can do it, so can we. Please never quit, Ravi. I am sure you will do well.

Yours affectionately,
[Name]Informal letter: చిరునామా, తేదీ, Dear …, Subject అవసరం లేదు; To begin with, Next, After that, Then, Finally వంటి transition words తో దశలు; ముగింపు Yours affectionately, పేరు. ఇది Try Again పాఠంలోని writing పని.

పాఠాల వారీగా ప్రశ్నలు, మార్కులు

పాఠంప్రశ్నలుమార్కులు
The Day the River Spoke1, 2, 3, 187
Try Again (పద్యం)4, 5, 6, 17, 20B5 (20B ఎంచుకుంటే 13)
Three Days to See7, 8, 11 – 157
A Funny Man (పద్యం)91
Paper Boats (పద్యం)162
North, South, East, West (అక్టోబర్)10, 19, 20A5 (20A ఎంచుకుంటే 13)

Doctor Dolittle, Say the Right Thing, My Brother’s Great Invention పాఠాల grammar, passage FA2 పేపర్‌లోనే వచ్చాయి. అందుకే ఇక్కడ వాటికి ప్రశ్నలు పెట్టలేదు. వాటి కథల మీద ప్రశ్నలు కింది పట్టికలో ఉన్నాయి.

7th English — సాధన పేపర్‌లో లేని 7 ముఖ్య ప్రశ్నలు

QuestionAnswer
The Day the River Spoke: Why could Jahnavi not go to school at first?When she was small, her mother said she was too young. Later she had to mind her little brothers, Ramu and then Appu, while her mother went to the fields.
The Day the River Spoke: What did Jahnavi want to become when she grew up?A teacher. She wanted to go from house to house in her village and ask all the little girls to come to her school.
Three Days to See: What would Helen Keller see on the third day?She would spend the day in the city, stand at a busy corner and watch people, trying to understand their daily lives. Their smiles would make her happy, their determination proud and their suffering compassionate.
Animals, Birds, and Dr. Dolittle: Who taught Doctor Dolittle the language of animals?His parrot, Polynesia. She told him that animals can talk, and she gave him bird words to write down in his book.
Animals, Birds, and Dr. Dolittle: What did the plough horse need, and why?He needed green spectacles because he was going blind in one eye. The vet over the hill had only given him big pills and never looked at his eyes.
A Funny Man: What did the funny man offer the poet as a rose?A currant bun. He held it to the poet’s nose, and the poet said he had never seen a rose with such a funny-looking smell.
My Brother’s Great Invention: What happened to Boppa?He was never seen again. Only his green scarf was found near the time machine’s switch panel, and Anand believes his time machine sent Boppa into the past.

7వ తరగతి Poorvi Writing పనులు — ఏది ఎలా రాయాలి

Units 1 – 3 లో ఈ రకాల writing పనులు ఉన్నాయి. Section D లో వీటిలో ఏవైనా రెండు ఇవ్వొచ్చు.

రకంపాఠంముఖ్యమైన భాగాలు
Descriptive ParagraphThe Day the River Spoke, Three Days to Seeశీర్షిక, ఆకట్టుకునే మొదటి వాక్యం, ఐదు ఇంద్రియాల వివరాలు, చివర మీ అభిప్రాయం
Informal LetterTry Againచిరునామా, తేదీ, Dear …, transition words తో దశలు, Yours affectionately
NoticeAnimals, Birds, and Dr. Dolittleబాక్స్, బడి పేరు, NOTICE, తేదీ, శీర్షిక, తేదీ – సమయం – స్థలం, ఎవరిని సంప్రదించాలి, సంతకం (FA2 లో వచ్చింది)
LimerickA Funny Manఐదు పంక్తులు, rhyme scheme AABBA, చివర ఊహించని మలుపు
Paragraph on a VocationMy Brother’s Great Inventionఎందుకు ఇష్టం, శిక్షణ, పనిముట్లు, బృందంగా పని, వినియోగదారులతో ప్రవర్తన
Diary EntryPaper Boatsరోజు, తేదీ, సమయం, Dear Diary, భావాలు, చివర ఒక మాట
Leave ApplicationNorth, South, East, Westచిరునామా, తేదీ, Principal, Subject, ఎన్ని రోజులు – ఎందుకు, Yours sincerely, తరగతి, రోల్ నంబర్

7వ తరగతి SA1 English సాధన పేపర్ PDF

ఇంట్లో ప్రింట్ తీసుకుని రాయడానికి: Download PDF — AP 7th Class SA1 English Practice Paper 2026-27. మొదటి పేజీల్లో ప్రశ్నలు; చివరి పేజీల్లో leave application, letter model answers తో సహా అన్ని జవాబులు.

ఏడో తరగతి English లో సాధారణంగా పోయే 7 మార్కులు

  1. Neither … nor, either … or: verb దగ్గరగా ఉన్న subject ను బట్టి మారుతుంది — Neither the students nor the teacher was; Either the ticket or the bus passes need.
  2. Past perfect ఎక్కడ: రెండు గత పనుల్లో ముందు జరిగినదానికి had + V3. By the time we reached, the train had left.
  3. Preposition, adverb తేడా: తర్వాత నామవాచకం ఉంటే preposition (ran up the stairs), లేకపోతే adverb (rang me up).
  4. Simile, metaphor కలిపేయడం: like / as ఉంటే simile; లేకుండా నేరుగా పోలిస్తే metaphor.
  5. Leave application లో వివరాలు వదిలేయడం: Subject, తేదీలు (from – to), తరగతి, రోల్ నంబర్ లేకపోతే format మార్కులు పోతాయి.
  6. Informal letter లో formal ముగింపు: బంధువులకు Yours faithfully కాదు — Yours affectionately / lovingly.
  7. పేర్ల spelling: Jahnavi, Polynesia, Puddleby, Rameswaram, Pamban, shiuli, Thajiwas, Sundarbans — ఒకసారి రాసి చూసుకోండి.

SA1 కి 10 రోజుల English ప్లాన్ — 7వ తరగతి

రోజూ 40 నిమిషాలు: ముందు పాఠం చదవండి, తర్వాత పుస్తకంలోని “Let us think and reflect”, “Let us learn” ప్రశ్నలు చేయండి.

రోజుచదవాల్సింది
1The Day the River Spoke — కథ, sound words, prepositions, adverbs
2Try Again — సంఘటనల వరుస, ABAB, simile – metaphor, ఈ కవితతో letter
3Three Days to See — మూడు రోజుల ప్రణాళిక, sensory words, modals
4Animals, Birds, and Dr. Dolittle — Polynesia, plough horse; compound words, palindromes, tenses
5A Funny Man — alliteration, inversion, phrasal verbs; Say the Right Thing (FA2 పేపర్‌తో)
6My Brother’s Great Invention — onomatopoeia, binomials, idioms, past perfect (FA2 పేపర్‌తో)
7Paper Boats — imagery, symbols; North, South, East, West — ప్రదేశాల వరుస, subject – verb agreement
8Writing: leave application, informal letter, notice, descriptive paragraph — ప్రతిదీ ఒకసారి
9పై 20 ప్రశ్నల పేపర్ — ఒకే కూర్పులో, 75 నిమిషాలు
10తప్పులు సరిచూసుకోవడం; FA2 అసలు పేపర్; 7 ముఖ్య ప్రశ్నలు

ఏడో తరగతి అన్ని పుస్తకాలు, నోట్స్, పాత ప్రశ్నపత్రాలు AP 7th Class Textbooks, Notes, Study Material, Question Papers పేజీలో ఉన్నాయి. ప్రతి సబ్జెక్టు SA1 పాఠాల జాబితాకు AP SA1 Syllabus 2026-27 – Class 6 to 10 చూడండి.

తర్వాత ఏం చదవాలి

  1. AP 7th Class FA2 English Question Paper 2026-27 — 7 అక్టోబర్ అసలు పేపర్, జవాబులు
  2. AP 7th Class SA1 Telugu Question Paper 2026-27 — ఏడో తరగతి తెలుగు సాధన
  3. AP Class 7 Maths Important Questions – SA1 2026 — Ganita Prakash 20 ప్రశ్నలు

FAQs

ఏడో తరగతి SA1 English పరీక్ష ఏ తేదీన?

SCERT క్యాలెండర్‌లో SA1 పరీక్షలకు 9 – 20 నవంబర్ 2026 (Tentative) ఇచ్చారు. English ఏ రోజో సబ్జెక్టు వారీ టైమ్ టేబుల్ విడుదలయ్యాక తెలుస్తుంది.

7వ తరగతి SA1 English కి ఏ పాఠాలు చదవాలి?

Poorvi లో తొమ్మిది: The Day the River Spoke, Try Again, Three Days to See, Animals, Birds, and Dr. Dolittle, A Funny Man, Say the Right Thing, My Brother’s Great Invention, Paper Boats, North, South, East, West.

ఏడో తరగతి FA2 English లో ఏమేమి అడిగారు?

Exam Code 726 పేపర్‌లో tenses, suffix, onomatopoeia, binomials, phrasal verbs, Say the Right Thing passage, compound words, notice లేదా paragraph వచ్చాయి.

అక్టోబర్‌లో కొత్తగా ఏ పాఠం చేరింది?

Unit 3 లోని North, South, East, West — Shaana అనే అమ్మాయి కాశ్మీర్ నుంచి రామేశ్వరం వరకు రాసిన పోస్ట్‌కార్డులు.

ఈ పేపర్ ప్రభుత్వం ఇచ్చిన మోడల్ పేపరా?

కాదు. తేదీలు, పాఠాల జాబితా SCERT క్యాలెండర్ నుంచి తీసుకున్నాం. ప్రశ్నలు, passages, model answers మేము Poorvi పుస్తకం చూసి తయారుచేశాం.

ఏడో తరగతి SA1 English ఎన్ని మార్కులకు ఉంటుంది?

SCERT ఇంకా చెప్పలేదు. FA2 English 35 మార్కులకు, 20 ప్రశ్నలతో వచ్చింది — ఈ సాధన పేపర్ కూడా అదే లెక్కలో ఉంది.

Leave application ఏ format లో రాయాలి?

మీ చిరునామా, తేదీ, The Principal చిరునామా, Subject: Request for leave for … days, Dear Sir / Madam, ఏ తేదీల నుంచి ఏ తేదీల వరకు – ఎందుకు, బడి పని ఎలా పూర్తి చేస్తారు, Yours sincerely, పేరు, తరగతి, సెక్షన్, రోల్ నంబర్.

Try Again పద్యం సందేశం ఏమిటి?

పదే పదే ఓడిపోయినా ప్రయత్నం ఆపకూడదు. తొమ్మిది సార్లు పడిపోయినా సాలీడు గూడు చేరింది; అది చూసి King Bruce మళ్ళీ ప్రయత్నించి గెలిచాడు.

Paper Boats రాసింది ఎవరు?

Rabindranath Tagore. పిల్లవాడు రోజూ కాగితపు పడవలపై తన పేరు, ఊరి పేరు రాసి ప్రవాహంలో వదులుతాడు; ఎవరైనా తనను తెలుసుకోవాలని ఆశ.

Three Days to See లో రచయిత్రి ఏ ఇంద్రియం గొప్పదంటారు?

అన్ని ఇంద్రియాలనూ పూర్తిగా వాడుకోమంటారు, కానీ వాటిలో చూపే అత్యంత ఆనందకరమని Helen Keller అభిప్రాయం.

పేజీ కింద కనిపించే స్కోర్ ఎలా లెక్కిస్తుంది?

జవాబు తెరవగానే కనిపించే చెక్‌బాక్స్‌ను మీ జవాబు సరైతేనే గుర్తించండి. Section D లో మీరు రాసిన ఒక్క భాగానికే టిక్. letter, application లో format, విషయం, భాష మూడూ సరిగ్గా ఉంటేనే 8 వేసుకోండి.

PDF లో model answers ఉంటాయా?

ఉంటాయి — leave application, letter to a cousin రెండింటికీ పూర్తి model answers PDF చివర్లో ఉన్నాయి.

Official Sources

SA1 తేదీలు, నెలవారీ పాఠాలు: AP SCERT — High School Academic Calendar 2026-27. పాఠ్యాంశాలు: NCERT Poorvi — 7వ తరగతి English పాఠ్యపుస్తకం (Reprint 2026-27), Units 1 – 3.