AP 7th Class SA1 Science Question Paper 2026-27 – జవాబులతో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP 7th Class SA1 Science Question Paper 2026-27 ఇదిగో — 20 ప్రశ్నలు, ప్రతి దానికీ తెలుగులో వివరణ. 6 అక్టోబర్ ఏడో తరగతి FA2 సైన్స్ పేపర్ విద్యుత్ వలయాలు, లోహాలు – అలోహాలు, భౌతిక – రసాయన మార్పుల మీదే వచ్చింది. ఆమ్లాలు – క్షారాలు (Acids, Bases and Salts), కౌమారదశ (Adolescence), మొదటి పాఠం ఆ పేపర్‌లో ఒక్క ప్రశ్నగా కూడా రాలేదు. SA1 కి ఆరు పాఠాలూ ఉంటాయి కాబట్టి ఈ సాధన పేపర్ ఎక్కువ భాగం ఆ రెండు పెద్ద పాఠాల మీద పెట్టాం.

ప్రశ్నలు ఇంగ్లీష్‌లో ఉన్నాయి, FA2 అసలు పేపర్ లాగే. లిట్మస్, ఎర్ర గులాబీ, పసుపు సూచికల రంగులు, తటస్థీకరణ ఉదాహరణలు, మెగ్నీషియం రిబ్బన్ ప్రయోగం — అన్నీ ఏడో తరగతి సైన్స్ పుస్తకం Curiosity (Reprint 2026-27) తో సరిచూశాం. జవాబు సరిపోతే దాని కింద టిక్ పెట్టండి; పేజీ కింద బార్ 35 కి మీ స్కోర్ చూపిస్తుంది.

ఏడో తరగతి SA1 సైన్స్ అసలు ప్రశ్నపత్రం, కీ పరీక్ష రోజే ఇక్కడ పెడతాం. అప్‌డేట్ ఫోన్‌కి రావాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి

ఈ పేజీలో: పరీక్ష | సిలబస్ | సాధన పేపర్ | పాఠాల వారీ మార్కులు | సూచికల చార్ట్ | PDF | 10 రోజుల ప్లాన్ | FAQs

AP 7th Class SA1 Science Question Paper 2026-27 — ఒక్క చూపులో

అంశంవివరం
పరీక్షSA1 (సంగ్రహణాత్మక మూల్యాంకనం 1), విద్యా సంవత్సరం 2026-27
తరగతి, సబ్జెక్ట్ఏడో తరగతి — సైన్స్ (పాఠ్యపుస్తకం Curiosity)
SA1 పరీక్షల కాలం9 – 20 నవంబర్ 2026; SCERT క్యాలెండర్‌లో Tentative అని ఉంది
SA1 పాఠాలు6 — Wonderful World of Science, Acids Bases and Salts, Electric Circuits, Metals and Non-metals, Changes Around Us, Adolescence
FA2 పేపర్‌లో కనిపించనివిమొదటి పాఠం, Acids Bases and Salts, Adolescence
ఈ పేజీలోని పేపర్నాలుగు సెక్షన్లు, 20 ప్రశ్నలు, 35 మార్కులు — 75 నిమిషాలు

గమనిక: ఆరు నుంచి తొమ్మిది తరగతుల SA1 సబ్జెక్టు వారీ తేదీలు, ప్రశ్నపత్రం నమూనా ఇచ్చే SCERT ఉత్తర్వు 17 అక్టోబర్ 2026 నాటికి రాలేదు. ఆ ఉత్తర్వు వచ్చే వరకు 6 అక్టోబర్ ఏడో తరగతి FA2 సైన్స్ పేపర్ (Exam Code 721) రూపాన్నే ఇక్కడ పాటించాం.

ఏడో తరగతి ఇతర సబ్జెక్టుల SA1 సాధన పేపర్లు AP SA1 2026-27 – సిలబస్, టైమ్ టేబుల్, ప్రశ్నపత్రాలు పేజీలో వరుసగా ఉన్నాయి.

7వ తరగతి SA1 Science సిలబస్ 2026-27 — ఆరు పాఠాలు, FA2 తో పోలిక

అకడమిక్ క్యాలెండర్ నెలవారీ పట్టికలో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఆరు పాఠాలు ఉన్నాయి; Adolescence సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలల్లో, అక్టోబర్‌లో Integrating AI కూడా. క్యాలెండర్ పేర్లు, Curiosity పుస్తకంలోని అధ్యాయాల పేర్లు కొద్దిగా వేరు — రెండూ కింద ఇచ్చాం. చివరి కాలమ్ 6 అక్టోబర్ అసలు పేపర్ చూసి రాసినది.

క్యాలెండర్ పేరు (Curiosity అధ్యాయం)ముఖ్య అంశాలుFA2 పేపర్‌లో
The Wonderful World of Science (అధ్యాయం 1 — The Ever-Evolving World of Science)సైన్స్ ఒక ప్రక్రియ; ప్రశ్నలు అడగడం; Activity 1.1 Question the Answerరాలేదు
Acids, Bases and Salts (అధ్యాయం 2 — Exploring Substances: Acidic, Basic, and Neutral)లిట్మస్, ఎర్ర గులాబీ, పసుపు సూచికలు; ఆమ్ల, క్షార, తటస్థ పదార్థాలు; తటస్థీకరణరాలేదు
Electric Circuits and their Components (అధ్యాయం 3)ఘటం, బ్యాటరీ, బల్బు, LED, స్విచ్, వాహకాలు – బంధకాలువచ్చింది
Metals and Non-metals (అధ్యాయం 4)లోహాల ధర్మాలు, లోహ – అలోహ ఆక్సైడ్లు, తుప్పువచ్చింది
Changes Around Us (అధ్యాయం 5 — Physical and Chemical)భౌతిక, రసాయన మార్పులు; దహనం; శైథిల్యంవచ్చింది
Adolescence (అధ్యాయం 6 — A Stage of Growth and Change)కౌమారదశ మార్పులు, హార్మోన్లు, పోషణ, పరిశుభ్రత, సోషల్ మీడియా, మత్తు పదార్థాలకు NOరాలేదు

AP 7th Class SA1 Science Question Paper 2026-27 సిలబస్ — ఆరు పాఠాలు, FA2 లో రానివి

ఈ చార్ట్ ఫోన్‌లో సేవ్ చేసుకోండి: నారింజ కార్డుల మూడు పాఠాలు FA2 లో రాలేదు — రివిజన్ అక్కడి నుంచే మొదలుపెట్టండి.

విద్యుత్, లోహాలు, దహనం ప్రశ్నలకు జవాబులు AP 7th Class FA2 Science Question Paper 2026-27 పేజీలో ఉన్నాయి. ఆ పేపర్, ఈ పేపర్ రెండూ రాస్తే ఆరు పాఠాలకూ ఒకసారి సాధన అయిపోతుంది.

AP 7th Class SA1 Science Question Paper — 20 ప్రశ్నలు, జవాబులు

సూచనలు: మొత్తం 20 ప్రశ్నలు, 35 మార్కులు, సమయం గంటా పదిహేను నిమిషాలు. Section D లో A లేదా B — ఏదో ఒక్కటే రాయాలి. ప్రయోగ ప్రశ్నల్లో చేసే పద్ధతి, పరిశీలన, నిర్ధారణ మూడూ రాస్తేనే పూర్తి మార్కులు.

Section A  —  15 × 1 = 15 మార్కులు

1. Litmus, a natural acid-base indicator, is obtained from
(A) red roses   (B) lichens   (C) turmeric   (D) beetroot   [1 మార్కు]

జవాబు చూడండి
(B) lichens.
లిట్మస్ లైకెన్ల నుంచి వస్తుంది. లైకెన్ అంటే శిలీంధ్రం (fungus), శైవలం (alga) కలిసి జీవించే జీవి — వర్షం ఎక్కువ, గాలి శుభ్రంగా ఉండే చోట రాళ్ళు, చెట్ల బెరడుపై పెరుగుతుంది. లిట్మస్ ద్రావణంగానూ, ఎరుపు – నీలం కాగితాలుగానూ దొరుకుతుంది.

2. Which of these samples turns red litmus paper blue?
(A) Lemon juice   (B) Vinegar   (C) Lime water   (D) Sugar solution   [1 మార్కు]

జవాబు చూడండి
(C) Lime water.
ఎరుపు లిట్మస్‌ను నీలంగా మార్చేవి క్షార పదార్థాలు — సున్నపు నీరు, సబ్బు నీరు, వంట సోడా ద్రావణం, వాషింగ్ పౌడర్ ద్రావణం. నిమ్మరసం, వెనిగర్ ఆమ్లాలు (నీలం లిట్మస్ ఎరుపు అవుతుంది); చక్కెర ద్రావణం తటస్థం.

3. A sample does not change the colour of either red or blue litmus paper. The sample could be
(A) tamarind water   (B) salt solution   (C) soap solution   (D) amla juice   [1 మార్కు]

జవాబు చూడండి
(B) salt solution.
రెండు లిట్మస్ కాగితాల రంగూ మారకపోతే ఆ పదార్థం తటస్థం — ఆమ్లమూ కాదు, క్షారమూ కాదు. పుస్తకంలో కుళాయి నీరు, చక్కెర ద్రావణం, ఉప్పు ద్రావణం ఈ గుంపులో ఉన్నాయి.

4. When soap solution is added to red rose extract, the extract turns
(A) red   (B) green   (C) yellow   (D) colourless   [1 మార్కు]

జవాబు చూడండి
(B) green.
ఎర్ర గులాబీ రేకుల సారం ఆమ్లంలో ఎరుపు, క్షారంలో ఆకుపచ్చ రంగు ఇస్తుంది. సబ్బు నీరు క్షారం కాబట్టి ఆకుపచ్చ. ఎర్ర మందార, బీట్‌రూట్, ఊదా క్యాబేజీ, నేరేడు కూడా సూచికలుగా పనిచేస్తాయి.

5. A drop of which liquid will turn turmeric paper red?
(A) Lemon juice   (B) Vinegar   (C) Washing powder solution   (D) Tap water   [1 మార్కు]

జవాబు చూడండి
(C) Washing powder solution.
పసుపు కాగితం క్షార పదార్థం తగిలితేనే ఎరుపు అవుతుంది. ఆమ్ల, తటస్థ పదార్థాలతో పసుపు రంగు మారదు — అందుకే పసుపు సూచిక ఆమ్లాన్ని, తటస్థాన్ని వేరు చేసి చూపలేదు.

6. The acid mainly present in tamarind is
(A) citric acid   (B) tartaric acid   (C) ascorbic acid   (D) formic acid   [1 మార్కు]

జవాబు చూడండి
(B) tartaric acid.
పుస్తకం చూపిన ప్రకారం: నిమ్మ — సిట్రిక్ ఆమ్లం; ఉసిరి — ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ C), సిట్రిక్ ఆమ్లం; చింతపండు — టార్టారిక్ ఆమ్లం. ఫార్మిక్ ఆమ్లం ఎర్ర చీమ కుట్టినప్పుడు చర్మంలోకి వెళ్ళేది.

7. Keerthi was bitten by a red ant. Which of the following will give her relief?
(A) Vinegar   (B) Lemon juice   (C) Moist baking soda   (D) Tamarind water   [1 మార్కు]

జవాబు చూడండి
(C) Moist baking soda.
చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లం చర్మంలోకి వెళ్తుంది. వంట సోడా క్షారం — తడి చేసి రుద్దితే ఆమ్లం తటస్థీకరణ చెంది మంట తగ్గుతుంది. మిగతా మూడూ ఆమ్లాలే, అవి ఉపశమనం ఇవ్వవు.

8. Assertion (A): A farmer adds lime to his field when the soil becomes too acidic. Reason (R): Lime is a base and neutralises the acidic nature of the soil.
(A) Both A and R are true and R is the correct explanation of A.   (B) Both A and R are true but R is not the correct explanation of A.   (C) A is true but R is false.   (D) A is false but R is true.   [1 మార్కు]

జవాబు చూడండి
(A) Both A and R are true and R is the correct explanation of A.
రసాయన ఎరువులు ఎక్కువగా వాడితే నేల ఆమ్లంగా మారి మొక్కలు సరిగ్గా పెరగవు. సున్నం (lime) క్షారం కాబట్టి దాన్ని చల్లి సరిచేస్తారు. నేల క్షారంగా ఉంటే పశువుల ఎరువు, కంపోస్ట్ వేస్తారు — అవి ఆమ్లాలు విడుదల చేస్తాయి.

9. Adolescence is the period of rapid growth that generally occurs between the ages of
(A) 3 and 8 years   (B) 10 and 19 years   (C) 20 and 30 years   (D) 45 and 55 years   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 10 and 19 years.
శరీరం పెద్దయ్యే దశకు సిద్ధమయ్యే కాలం కౌమారదశ. సుమారు 10 – 12 ఏళ్ళ వరకు మార్పులు ఎక్కువగా ఎత్తు, బరువులోనే; తర్వాత ఇతర మార్పులు మొదలవుతాయి. ఈ దశ ఎప్పుడు మొదలై ఎంత కాలం ఉంటుందో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.

10. The bump seen in the throat of many adolescent boys, called the Adam’s apple, is due to the growth of the
(A) food pipe   (B) voice box   (C) wind pipe only   (D) tongue   [1 మార్కు]

జవాబు చూడండి
(B) voice box.
మాట్లాడడానికి సాయపడే స్వరపేటిక (voice box) పెరగడం వల్ల గొంతు దగ్గర ఉబ్బు కనిపిస్తుంది — అదే Adam’s apple; గొంతు బొంగురుగా మారుతుంది. అమ్మాయిల్లోనూ స్వరపేటిక పెరుగుతుంది కానీ తక్కువ, అందుకే గొంతులో స్వల్ప మార్పు. ఇది అందరిలో కనిపించాలని లేదు.

11. Pimples (acne) on the face during adolescence mainly occur due to
(A) eating too much sugar   (B) an increase in oily secretions of the skin   (C) lack of sleep only   (D) drinking too much water   [1 మార్కు]

జవాబు చూడండి
(B) an increase in oily secretions of the skin.
కౌమారదశలో చర్మం నుంచి నూనె వంటి స్రావాలు పెరుగుతాయి. అవి చర్మ రంధ్రాలను మూసి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. మొటిమలు (acne) ఒక స్థితి; ఎర్రని చిన్న పొక్కులు దాని లక్షణం.

12. Most changes during adolescence are mainly caused by certain chemicals produced in our body. These are called
(A) enzymes   (B) hormones   (C) vitamins   (D) indicators   [1 మార్కు]

జవాబు చూడండి
(B) hormones.
హార్మోన్లు శరీరంలోని వేర్వేరు భాగాల్లో తయారై, మెదడు నుంచి వచ్చే సంకేతాలకు తగిన సమయంలో విడుదలవుతాయి. పెరుగుదల, అభివృద్ధిని నియంత్రిస్తాయి; కొన్ని హార్మోన్లు మానసిక స్థితి, ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతాయి.

13. The National De-addiction Helpline number launched by the Government of India is
(A) 100   (B) 108   (C) 14446   (D) 1098   [1 మార్కు]

జవాబు చూడండి
(C) 14446.
మత్తు పదార్థాల వ్యసనం నుంచి బయటపడడానికి సాయం చేసే జాతీయ హెల్ప్‌లైన్ 14446. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నడిపే Nasha Mukt Bharat Abhiyaan ప్రత్యేకంగా చిన్న వయసు పిల్లల్లో మత్తు అలవాటును నివారించడంపై దృష్టి పెడుతుంది.

14. The white powder formed on burning a magnesium ribbon is dissolved in warm water. The solution
(A) turns blue litmus red   (B) turns red litmus blue   (C) does not affect any litmus   (D) turns turmeric paper green   [1 మార్కు]

జవాబు చూడండి
(B) turns red litmus blue.
మండిన మెగ్నీషియం రిబ్బన్ తెల్లని పొడి మెగ్నీషియం ఆక్సైడ్. దాని ద్రావణం క్షారం — ఎరుపు లిట్మస్ నీలం అవుతుంది. సాధారణంగా లోహ ఆక్సైడ్లు క్షార స్వభావం, అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావం కలవి.

15. To make an LED glow in a circuit, its longer wire should be connected to the
(A) negative terminal of the cell   (B) positive terminal of the cell   (C) switch only   (D) either terminal; it does not matter   [1 మార్కు]

జవాబు చూడండి
(B) positive terminal of the cell.
LED లో ఫిలమెంట్ ఉండదు. దాని రెండు తీగల్లో పొడవైనది ధన (+), పొట్టిది ఋణ (–) టెర్మినల్. తిప్పి కలిపితే LED వెలగదు — విద్యుత్ దానిలో ఒకే దిశలో ప్రవహిస్తుంది.

Section B  —  2 × 2 = 4 మార్కులు

16. Ashwin applied turmeric paste on white paper, dried it and wrote a Guru Purnima message for his teacher with a colourless liquid. The words appeared red. Which liquid could he have used from among lemon juice, soap solution and sugar solution? Give a reason.   [2 మార్కులు]

జవాబు చూడండి
జవాబు: సబ్బు నీరు (soap solution). — 1 మార్కు
కారణం: పసుపు క్షార పదార్థం తగిలితేనే ఎరుపు అవుతుంది. సబ్బు నీరు క్షారం. నిమ్మరసం ఆమ్లం, చక్కెర ద్రావణం తటస్థం — ఈ రెండింటితో పసుపు రంగు మారదు, అక్షరాలు కనిపించవు. — 1 మార్కు
సైన్స్ ఫెయిర్‌లో “Welcome to the Wonderful World of Science” అక్షరాలు కనిపించిన రహస్యమూ ఇదే — కాగితంపై సబ్బు నీటితో రాసి, పసుపు ద్రావణం చల్లి ఉండవచ్చు అని పాఠం చివర్లో చెబుతారు.

17. Suggest any two healthy habits that adolescents should follow, with one reason for each.   [2 మార్కులు]

జవాబు చూడండి
ఏవైనా రెండు రాస్తే చాలు (ఒక్కోదానికి 1 మార్కు):
1. పోషకాహారం: పాలు, పెరుగు, చిరుధాన్యాలు, పనీర్ నుంచి కాల్షియం — ఎముకల పెరుగుదలకు; పాలకూర, రాజ్మా, కిస్మిస్, అంజీర నుంచి ఇనుము — రక్తం తయారీకి. వేగంగా పెరిగే ఈ దశలో పోషణ చాలా అవసరం.
2. వ్యక్తిగత పరిశుభ్రత: రోజూ స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే ఇన్ఫెక్షన్లు రావు.
3. వ్యాయామం, ఆటలు: శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి, శక్తి (stamina) పెరుగుతుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది.
4. మత్తు పదార్థాలకు NO: పొగాకు, గుట్కా, మద్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, వ్యసనంగా మారతాయి — మొదటిసారీ, ప్రతిసారీ వద్దనాలి.

Section C  —  2 × 4 = 8 మార్కులు

18. What is neutralisation? Explain how neutralisation helps in each of the following: (a) a red ant bite (b) acidic soil (c) basic soil.   [4 మార్కులు]

జవాబు చూడండి
తటస్థీకరణ: ఆమ్ల ద్రావణం, క్షార ద్రావణం తగినంత పరిమాణంలో కలిస్తే వచ్చే ద్రావణం ఆమ్లమూ కాదు క్షారమూ కాదు. ఈ చర్యలో లవణం, నీరు ఏర్పడి వేడి విడుదలవుతుంది. ఆమ్లం + క్షారం = లవణం + నీరు + వేడి. — 1 మార్కు
(a) ఎర్ర చీమ కాటు: చీమ ఫార్మిక్ ఆమ్లాన్ని చర్మంలోకి పంపుతుంది. తడి వంట సోడా (క్షారం) రుద్దితే ఆమ్లం ప్రభావం తటస్థమై నొప్పి తగ్గుతుంది. — 1 మార్కు
(b) ఆమ్ల నేల: రసాయన ఎరువుల అధిక వాడకంతో నేల ఆమ్లమైతే మొక్కలు బాగా పెరగవు. క్షారమైన సున్నం (lime) చల్లి సరిచేస్తారు. — 1 మార్కు
(c) క్షార నేల: పశువుల ఎరువు, కంపోస్ట్ చేసిన ఆకుల వంటి సేంద్రియ పదార్థాలు కలుపుతారు. అవి విడుదల చేసే ఆమ్లాలు నేల క్షార స్వభావాన్ని తటస్థం చేస్తాయి. — 1 మార్కు
అదనపు ఉదాహరణ: కర్మాగారాల ఆమ్ల వ్యర్థాలను సరస్సులోకి వదిలే ముందు క్షార పదార్థాలు కలిపి తటస్థం చేస్తే చేపలు బతుకుతాయి.

19. Your teacher burns a cleaned magnesium ribbon held with tongs. (a) What do you observe? (b) Name the product and write the word equation. (c) What is the nature of the product’s solution in water, and how will you test it? (d) Is this a physical or a chemical change? Why?   [4 మార్కులు]

జవాబు చూడండి
(a) పరిశీలన: మెగ్నీషియం రిబ్బన్ మిరుమిట్లు గొలిపే తెల్లని మంటతో మండి, తెల్లని పొడిగా మారుతుంది. — 1 మార్కు
(b) ఉత్పన్నం: మెగ్నీషియం ఆక్సైడ్ — గాలిలోని ఆక్సిజన్‌తో చర్య వల్ల. మెగ్నీషియం + ఆక్సిజన్ = మెగ్నీషియం ఆక్సైడ్ + వేడి + కాంతి. — 1 మార్కు
(c) స్వభావం: పొడికి కొద్దిగా గోరువెచ్చని నీరు కలిపి కలియబెట్టి ఎరుపు లిట్మస్ ముంచితే నీలం అవుతుంది — క్షార స్వభావం. లోహ ఆక్సైడ్లు సాధారణంగా క్షారాలు. — 1 మార్కు
(d) రసాయన మార్పు — మెగ్నీషియం ఆక్సైడ్ అనే కొత్త పదార్థం ఏర్పడింది, వేడి, కాంతి విడుదలయ్యాయి; తిరిగి రిబ్బన్‌గా మార్చలేం. — 1 మార్కు
జాగ్రత్త: ఈ ప్రయోగాన్ని ఉపాధ్యాయులే చేసి చూపాలి; రక్షణ కళ్ళద్దాలు పెట్టుకుని దూరంగా ఉండాలని పుస్తకం సూచిస్తుంది.

Section D  —  1 × 8 = 8 మార్కులు

20. A) What is an acid-base indicator? Describe how you would prepare (i) red rose extract and (ii) turmeric paper. Write the colour each shows with an acidic, a basic and a neutral substance.
(OR)
B) What is adolescence? Describe any four physical changes and two emotional changes that occur during adolescence. Why do these changes happen?   [8 మార్కులు]

జవాబు చూడండి
A) జవాబు (నిర్వచనం 1, ఎర్ర గులాబీ తయారీ 2, పసుపు కాగితం తయారీ 2, రంగుల పట్టిక 3):
ఆమ్ల – క్షార సూచిక: ఆమ్ల, క్షార ద్రావణాల్లో వేర్వేరు రంగులు చూపే పదార్థం. ఉదా: లిట్మస్, ఎర్ర గులాబీ సారం, పసుపు.
(i) ఎర్ర గులాబీ సారం: కింద రాలిన ఎర్ర గులాబీ రేకులు గుప్పెడు సేకరించండి (పూలు కోయకూడదు). నీటితో కడిగి రోలు – రోకలితో నూరండి. గ్లాసులో వేసి రేకులు మునిగేలా వేడి నీళ్ళు పోయండి (పెద్దల పర్యవేక్షణలో). మూత పెట్టి 5 – 10 నిమిషాలు ఉంచి, నీరు రంగు మారాక వడకట్టండి — ఆ ద్రవమే సూచిక.
(ii) పసుపు కాగితం: చెంచా పసుపులో కొంచెం నీరు కలిపి ముద్ద చేయండి. వడపోత కాగితాన్ని ఆ ముద్దలో ముంచి పసుపు రంగు పట్టాక తీసి ఆరబెట్టండి. సన్నని ముక్కలుగా కత్తిరించండి.

సూచికఆమ్లంలో (ఉదా: నిమ్మరసం)క్షారంలో (ఉదా: సబ్బు నీరు)తటస్థంలో (ఉదా: చక్కెర ద్రావణం)
ఎర్ర గులాబీ సారంఎరుపుఆకుపచ్చ—
పసుపు కాగితంమార్పు లేదు (పసుపు)ఎరుపుమార్పు లేదు (పసుపు)

పసుపు ఆమ్లాన్ని, తటస్థాన్ని వేరు చేసి చూపలేదు — ఈ వాక్యం రాస్తే జవాబు పూర్తవుతుంది.
B) జవాబు (నిర్వచనం 1, శారీరక మార్పులు 4, భావోద్వేగ మార్పులు 2, కారణం 1):
కౌమారదశ: సుమారు 10 – 19 సంవత్సరాల మధ్య వేగంగా పెరుగుదల, అభివృద్ధి జరిగే దశ. ఈ దశలో శరీరం పెద్దవారి దశకు సిద్ధమవుతుంది.
శారీరక మార్పులు (ఏవైనా నాలుగు): (1) ఎత్తు, బరువు, బలం పెరగడం; అబ్బాయిల్లో భుజాలు, ఛాతీ వెడల్పు కావడం. (2) స్వరపేటిక పెరిగి గొంతు మారడం — అబ్బాయిల్లో Adam’s apple. (3) శరీరంలో కొన్ని భాగాల్లో వెంట్రుకలు రావడం; అబ్బాయిలకు మీసం, గడ్డం. (4) చర్మంలో నూనె స్రావాలు పెరిగి మొటిమలు రావడం.
భావోద్వేగ మార్పులు: (1) మనసు తరచుగా మారడం (mood swings) — సంగీతం, నృత్యం, ఆటల్లో పాల్గొంటే సృజనాత్మకత పెరుగుతుంది. (2) బలమైన భావోద్వేగాలు, సున్నితత్వం పెరగడం — సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే కరుణ పెరుగుతుంది.
కారణం: ఈ మార్పులు ప్రధానంగా హార్మోన్ల వల్ల. ఈ మార్పులు ఎప్పుడు, ఎంత జరుగుతాయో ఒక్కొక్కరికి వేరుగా ఉంటుంది — అది పూర్తిగా సహజం.

ఏ పాఠం నుంచి ఎన్ని మార్కులు

పాఠంప్రశ్న సంఖ్యలుమార్కులు
Acids, Bases and Salts1 – 8, 16, 18, 20A14 (20A రాస్తే 22)
Adolescence9 – 13, 17, 20B7 (20B రాస్తే 15)
Metals and Non-metals, Changes Around Us14, 195
Electric Circuits and their Components151
The Wonderful World of Scienceకింది 7 అదనపు ప్రశ్నల్లో 1, 2—

Section D లో A రాసినా B రాసినా 35 లో 27 మార్కులకు పైగా FA2 లో రాని రెండు పాఠాల నుంచే వస్తాయి. విద్యుత్, లోహాలు, మార్పుల కోసం 6 అక్టోబర్ అసలు పేపర్‌ను మరోసారి రాసి చూడండి.

ఏడో తరగతి సైన్స్ — పేపర్‌లో లేని 7 ముఖ్య ప్రశ్నలు

ప్రశ్నజవాబు
“To be a wise person, you must be a whys person” అంటే ఏమిటి?తెలివైనవారు కావాలంటే “ఎందుకు?” అని అడుగుతూ ఉండాలి. గొప్ప శాస్త్రవేత్తలు జవాబులు చెప్పడమే కాదు, అద్భుతమైన ప్రశ్నలు అడుగుతారు — మొదటి పాఠం ముఖ్య సందేశం ఇదే.
Activity 1.1 “Question the Answer” లో ఏం చేయాలి?మామూలుగా ప్రశ్నకు జవాబు రాస్తాం; ఇక్కడ జవాబు ఇచ్చి, దానికి దారితీసే సృజనాత్మక ప్రశ్నను మనమే ఊహించాలి. తప్పు ప్రశ్న అంటూ ఉండదు — “Just add some milk” వంటి జవాబులకు ప్రశ్నలు రాయమంటారు.
ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ (P.C. Ray) ఎవరు?“Father of Modern Indian Chemistry”. 1901 లో భారతదేశపు మొదటి ఔషధ (pharmaceutical) కంపెనీ స్థాపించారు. ప్రాచీన భారతీయ రసాయన శాస్త్రం గురించి రాశారు; మాతృభాషలో విద్యను సమర్థించారు.
హైడ్రేంజియా పూల రంగు ఎందుకు మారుతుంది?హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల చల్లని వాతావరణంలో పెరిగే ఈ మొక్క పూల రంగు నేలను బట్టి మారుతుంది — ఆమ్ల నేలలో నీలం, క్షార నేలలో గులాబీ లేదా ఎరుపు.
వాసన మార్చే సూచికలు (olfactory indicators) అంటే?ఆమ్ల లేదా క్షార మాధ్యమంలో వాసన మారే పదార్థాలు. ఉదా: సన్నగా తరిగిన ఉల్లిపాయలతో రాత్రంతా ఉంచిన గుడ్డ ముక్కలపై చింతపండు నీరు, వంట సోడా ద్రావణం వేసి వాసనలో తేడా చూడడం (Activity 2.6).
డోరతీ హాడ్కిన్ ఎవరు?విటమిన్ B12 నిర్మాణాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్త. 1964 లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మూడో మహిళ. విటమిన్ B12 శరీరం తయారుచేసుకోలేదు — ఆహారం నుంచే రావాలి.
ఢిల్లీ ఇనుప స్తంభం ప్రత్యేకత ఏమిటి?చంద్రగుప్త II కాలంలో 1600 ఏళ్ళకు పైగా క్రితం తయారైంది; సుమారు 8 మీటర్ల ఎత్తు, 6000 కిలోలకు పైగా బరువు. ఇన్నేళ్ళు ఎండ, వాన తట్టుకున్నా దాదాపు తుప్పు పట్టలేదు — ప్రాచీన భారత లోహ నైపుణ్యానికి నిదర్శనం.

సూచికల రంగుల చార్ట్, ముఖ్య చర్యలు — పరీక్ష ముందు ఒక్కసారి

అంశంఆమ్లంక్షారంతటస్థం
నీలం లిట్మస్ఎరుపు అవుతుందిమార్పు లేదుమార్పు లేదు
ఎరుపు లిట్మస్మార్పు లేదునీలం అవుతుందిమార్పు లేదు
ఎర్ర గులాబీ సారంఎరుపుఆకుపచ్చ—
పసుపుమార్పు లేదుఎరుపుమార్పు లేదు
రుచి, స్పర్శపుల్లగాచేదు, జారుడుగా (సబ్బులా)—
ఉదాహరణలునిమ్మ, ఉసిరి, చింతపండు, వెనిగర్సబ్బు నీరు, వంట సోడా, సున్నపు నీరు, వాషింగ్ పౌడర్కుళాయి నీరు, చక్కెర, ఉప్పు ద్రావణాలు
చర్యపద సమీకరణం
తటస్థీకరణఆమ్లం + క్షారం = లవణం + నీరు + వేడి
మెగ్నీషియం దహనంమెగ్నీషియం + ఆక్సిజన్ = మెగ్నీషియం ఆక్సైడ్ + వేడి + కాంతి
వెనిగర్, వంట సోడావెనిగర్ + వంట సోడా = కార్బన్ డై ఆక్సైడ్ + ఇతర పదార్థాలు (వాయువు సున్నపు నీటిని పాలవలె చేస్తుంది)

7వ తరగతి SA1 సైన్స్ సాధన పేపర్ PDF

ప్రింట్ తీసి పరీక్షలా రాయాలనుకుంటే: Download PDF — AP 7th Class SA1 Science Practice Paper 2026-27. మొదటి పేజీల్లో ప్రశ్నలు మాత్రమే, జవాబులు చివర్లో.

ఏడో తరగతి సైన్స్‌లో తరచూ పోయే 7 మార్కులు

  1. లిట్మస్ రంగులు తారుమారు: ఆమ్లం నీలం లిట్మస్‌ను ఎరుపు చేస్తుంది; క్షారం ఎరుపు లిట్మస్‌ను నీలం చేస్తుంది.
  2. పసుపుతో ఆమ్లాన్ని గుర్తించడం: పసుపు క్షారంతో మాత్రమే ఎరుపు అవుతుంది — ఆమ్లం, తటస్థం రెండింట్లోనూ మారదు.
  3. చేదు అంటే క్షారం అనుకోవడం: కాకరకాయ చేదుగా ఉన్నా క్షారం కాదు అని పుస్తకమే చెబుతుంది.
  4. Lime water ను నిమ్మరసం అనడం: lime water అంటే సున్నపు నీరు (కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం) — క్షారం. నిమ్మ (lime పండు) ఆమ్లం.
  5. చీమ కాటుకు వెనిగర్ రాయడం: కాటులో ఉన్నది ఆమ్లం; ఉపశమనం క్షారం (వంట సోడా) తోనే.
  6. ఆక్సైడ్ల స్వభావం: మెగ్నీషియం ఆక్సైడ్ వంటి లోహ ఆక్సైడ్లు క్షారాలు; సల్ఫర్ వంటి అలోహ ఆక్సైడ్లు ఆమ్లాలు.
  7. LED తీగలు తిప్పి కలపడం: పొడవైన తీగ ధన టెర్మినల్‌కే; లేకపోతే LED వెలగదు.

7వ తరగతి సైన్స్ — SA1 కి 10 రోజుల ప్లాన్

రోజుకు 45 నిమిషాలు చాలు. ఇంట్లో దొరికే నిమ్మ, సబ్బు, పసుపుతో Chapter 2 ప్రయోగాలు ఒకసారి చేసి చూస్తే రంగులు మర్చిపోరు.

రోజుఏం చదవాలి
1మొదటి పాఠం — సైన్స్ ఒక ప్రక్రియ, Question the Answer; Chapter 2 కథ (సైన్స్ ఫెయిర్)
2లిట్మస్, లైకెన్లు; ఆమ్ల, క్షార, తటస్థ గుంపులు (Activity 2.1); ఆమ్లాల పేర్లు
3ఎర్ర గులాబీ సారం, పసుపు కాగితం తయారీ, రంగులు; హైడ్రేంజియా, ఉల్లి సూచిక
4తటస్థీకరణ (Activity 2.7); చీమ కాటు, నేల, కర్మాగార వ్యర్థాలు; P.C. Ray
5కౌమారదశ — వయసు, శారీరక మార్పులు, స్వరపేటిక, మొటిమలు, హార్మోన్లు
6భావోద్వేగ మార్పులు; పోషణ (Table 6.3), పరిశుభ్రత, వ్యాయామం, సోషల్ మీడియా, మత్తుకు NO, 14446
7విద్యుత్ వలయాలు, LED; లోహాలు – అలోహాలు, మెగ్నీషియం రిబ్బన్ — FA2 అసలు పేపర్‌తో
8భౌతిక, రసాయన మార్పులు; వెనిగర్ – వంట సోడా; దహనం — FA2 పేపర్ జవాబులు మళ్ళీ
9పై 20 ప్రశ్నల పేపర్ — గడియారం పెట్టుకుని 75 నిమిషాల్లో
10తప్పులు దిద్దుకోవడం, సూచికల చార్ట్, 7 అదనపు ప్రశ్నలు, అధ్యాయాలు 2, 6 చివరి ప్రశ్నలు

ఏడో తరగతి పాఠ్యపుస్తకాలు, నోట్స్, వర్క్‌షీట్లు అన్నీ AP 7th Class Textbooks, Notes, Study Material, Question Papers పేజీలో దొరుకుతాయి. ఏ సబ్జెక్టుకు ఏ పాఠాలో తెలుసుకోవడానికి AP SA1 Syllabus 2026-27 – Class 6 to 10 చూడండి.

తర్వాత ఏం చదవాలి

  1. AP 7th Class FA2 Science Question Paper 2026-27 — విద్యుత్, లోహాలు, మార్పుల అసలు పేపర్
  2. AP 7th Class SA1 English Question Paper 2026-27 — Poorvi సాధన పేపర్
  3. AP 7th Class SA1 Telugu Question Paper 2026-27 — తెలుగు సాధన పేపర్
  4. AP Class 7 Maths Important Questions – SA1 2026 — గణితం 20 ప్రశ్నలు

FAQs

ఏడో తరగతి SA1 సైన్స్ పరీక్ష ఎప్పుడు?

SCERT అకడమిక్ క్యాలెండర్ SA1 కి 9 – 20 నవంబర్ 2026 (Tentative) ఇచ్చింది. సైన్స్ ఏ రోజో సబ్జెక్టు వారీ టైమ్ టేబుల్ వచ్చాక తెలుస్తుంది.

7వ తరగతి SA1 Science సిలబస్‌లో ఎన్ని పాఠాలు?

ఆరు: The Wonderful World of Science, Acids Bases and Salts, Electric Circuits and their Components, Metals and Non-metals, Changes Around Us, Adolescence. అక్టోబర్‌లో Integrating AI కూడా ఉంది.

6 అక్టోబర్ FA2 సైన్స్ పేపర్‌లో ఏ పాఠాలు వచ్చాయి?

Exam Code 721 పేపర్‌లో విద్యుత్ వలయాలు, లోహాలు – అలోహాలు, భౌతిక – రసాయన మార్పులు, దహనం మీద ప్రశ్నలు వచ్చాయి.

Acids, Bases and Salts పాఠం పుస్తకంలో ఏ పేరుతో ఉంది?

Curiosity లో అధ్యాయం 2 — “Exploring Substances: Acidic, Basic, and Neutral”. Adolescence అధ్యాయం 6 — “Adolescence: A Stage of Growth and Change”.

ఇది ప్రభుత్వ మోడల్ పేపరా?

కాదు. తేదీలు, పాఠాల జాబితా SCERT క్యాలెండర్ నుంచి; ప్రశ్నలు, జవాబులు మేము Curiosity పుస్తకం ఆధారంగా తయారుచేశాం.

ఏడో తరగతి SA1 సైన్స్ ఎన్ని మార్కులకు?

ఉత్తర్వు వచ్చేవరకు చెప్పలేం. FA2 సైన్స్ 20 ప్రశ్నలు, 35 మార్కులు — ఈ సాధన పేపర్ కూడా అదే నమూనా.

ఆమ్ల – క్షార సూచిక అంటే ఏమిటి?

ఆమ్లంలో ఒక రంగు, క్షారంలో మరో రంగు చూపే పదార్థం. సహజ సూచికలు: లిట్మస్, ఎర్ర గులాబీ, ఎర్ర మందార, ఊదా క్యాబేజీ, బీట్‌రూట్, పసుపు, నేరేడు.

తటస్థీకరణలో ఏం ఏర్పడతాయి?

లవణం, నీరు — వేడి విడుదలవుతుంది. ఆమ్లం + క్షారం = లవణం + నీరు + వేడి.

సున్నపు నీరు ఎలా తయారుచేస్తారు?

సున్నం (చూనా — కాల్షియం ఆక్సైడ్) నీటిలో కలిపి సుమారు గంటసేపు కదలకుండా ఉంచి, ఆ ద్రవాన్ని మరో పాత్రలోకి వడకట్టాలి. అదే సున్నపు నీరు — కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం.

కౌమారదశ మార్పులు అందరికీ ఒకేలా ఉంటాయా?

లేదు. ఎత్తు, గొంతు, వెంట్రుకల పెరుగుదల ఎప్పుడు, ఎంత జరుగుతాయో వ్యక్తిని బట్టి మారుతుంది — ఆ తేడాలు పూర్తిగా సహజం అని పాఠం చెబుతుంది.

సైబర్ బుల్లీయింగ్ ఎదురైతే ఏం చేయాలి?

భయపడకూడదు. తెలివిగా వ్యవహరించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సాయం తీసుకోవాలి. అపరిచితులతో ఫోటోలు, వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదు.

స్కోర్ బార్‌లో మార్కులు ఎలా వస్తాయి?

ప్రతి జవాబు తెరిచాక కనిపించే చెక్‌బాక్స్‌ను మీ జవాబు సరిపోతేనే గుర్తించండి. Section D లో మీరు రాసిన భాగానికి మాత్రమే టిక్ పెట్టండి; బార్ 35 కి మీ మార్కులు చూపిస్తుంది. PDF కావాలంటే పై లింక్ వాడండి.

Official Sources

SA1 తేదీలు, నెలవారీ పాఠాలు: AP SCERT — High School Academic Calendar 2026-27. పాఠ్యాంశాలు: NCERT Curiosity — Textbook of Science for Grade 7 (Reprint 2026-27), అధ్యాయాలు 1 – 6.