Mission March SSC-2027 లో 31 ఆగస్టు 2026 న జరిగిన Chejarina Balyam Aranyakanda Slip Test (తెలుగు లఘు పరీక్ష – 7: చేజారిన బాల్యం, అరణ్యకాండ) లోని అసలు ప్రశ్నలు, వాటికి పాఠ్యపుస్తకం ఆధారంగా రాసిన పూర్తి జవాబులు ఈ పేజీలో ఉన్నాయి. Level-1 (Rising Star), Level-2 (Shining Star) రెండు పేపర్లూ ఉన్నాయి. ప్రతి జవాబు “జవాబు చూడండి” బటన్ కింద ఉంది — ముందు మీరే రాసి, తర్వాత సరిచూసుకోండి. అధికారిక Mission March తెలుగు PDF లింక్ కూడా కింద ఉంది.
9 నవంబర్ SA1 తెలుగు అసలు పేపర్ జవాబులు పరీక్ష రోజు సాయంత్రమే మా సైట్‌లో వస్తాయి. వెంటనే తెలియాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి
• తేదీ: 31.08.2026 (Mission March SSC-2027, Phase-I)
• పాఠాలు: 6. చేజారిన బాల్యం (శీలా వీర్రాజు) + ఉపవాచకం రామాయణం – అరణ్యకాండ (అయోధ్యాకాండ పాత్ర ప్రశ్న కూడా వచ్చింది)
• సమయం: 30 నిమిషాలు | గరిష్ఠ మార్కులు: 20
• నమూనా: పరిచిత గద్యం (8 మా.) + చిన్న జవాబు (4 మా.) + వ్యాసరూప / సృజనాత్మక ప్రశ్న (8 మా.)
• SA1 కి కూడా ముఖ్యం: 9 నవంబర్ 2026 న జరిగే పదో తరగతి SA1 తెలుగు పరీక్ష సిలబస్‌లో చేజారిన బాల్యం, ఉపవాచకంలో బాలకాండ నుంచి కిష్కింధాకాండ వరకు ఉన్నాయి. పూర్తి వివరాలు: AP 10th Class SA1 Telugu Question Paper
ఈ పేజీలో: Level-1 జవాబులు | Level-2 జవాబులు | చేజారిన బాల్యం ముఖ్య ప్రశ్నలు | భాషాంశాలు | అరణ్యకాండ ముఖ్య ప్రశ్నలు | PDF |
మిగతా తెలుగు లఘు పరీక్షల (9, 11, 13, 14) జవాబులు, 14 పరీక్షల షెడ్యూల్ కోసం Mission March SSC 2027 Telugu – Slip Tests with Answers చూడండి.
Chejarina Balyam Aranyakanda Slip Test – Level-1 (Rising Star) ప్రశ్నలు, జవాబులు
1. కింది పరిచిత గద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మార్కులు)
అ) రచయితకు సాహిత్య బీజాలు ఎప్పుడు పడ్డాయి? [2]
జవాబు చూడండి
ఆ) రచయిత బాల్యమిత్రులు ఎవరు? [2]
జవాబు చూడండి
ఇ) ఏ పత్రికను చదివి రచనలు చేశామని రచయిత చెప్పారు? [2]
జవాబు చూడండి
ఈ) పై గద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. [2]
జవాబు చూడండి
1. రచయిత, మిత్రులు తయారుచేసిన చేతివ్రాత పత్రికను ఎక్కడ పెట్టేవారు?
2. పత్రికను అందంగా రాసే పని ఎవరిది? ఎందుకు?
3. రామకృష్ణా మిషన్ వారి రీడింగ్ రూం ఎక్కడ ఉంది?
గమనిక: జవాబు గద్యంలోనే దొరికేలా ప్రశ్న ఉండాలి; చివర ప్రశ్నార్థకం (?) తప్పక పెట్టాలి.
2. కింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాల్లో సమాధానం రాయండి. (4 మార్కులు)
2. వ్యాసం ప్రక్రియ గురించి వివరించండి. [4 మా]
జవాబు చూడండి
• వ్యాసంలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు అనేవి ప్రధానమైన అంగాలు.
• వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్త్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు.
• రచయిత తన అనుభవాలను చెప్పే ఆత్మకథాత్మక వ్యాసాలు కూడా ఉంటాయి.
• ఉదాహరణ: మన “చేజారిన బాల్యం” పాఠం శీలా వీర్రాజు గారి వ్యాస సంపుటి “కలానికి ఇటూ అటూ” నుండి గ్రహించిన ఆత్మకథాత్మక వ్యాసం. ఇందులో రచయిత తన బాల్య అనుభవాలను వివరించారు.
(లేదా)
కైక పాత్ర స్వభావం వివరించండి. [4 మా]
జవాబు చూడండి
• మొదట ఆమె మంచి మనసు కలది. శ్రీరామ పట్టాభిషేక వార్త విని ఎంతో ఆనందించి, వార్త చెప్పిన మంథరకు విలువైన బహుమానం ఇచ్చింది. “నాకు రాముడు, భరతుడు ఇద్దరూ సమానమే” అన్నది.
• కానీ దాసి మంథర దుర్బోధతో ఆమె మనసు మారింది. “చెప్పుడు మాటలు చేటుకు కారణం” అనడానికి ఆమె ఉదాహరణ.
• కోపగృహంలోకి వెళ్ళి, గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను అడిగింది — భరతునికి పట్టాభిషేకం, శ్రీరామునికి పద్నాలుగేళ్ళ దండకారణ్య వనవాసం.
• దశరథుడు చేతులు జోడించి, పాదాలు పట్టుకొని బతిమాలినా ఆమె మారలేదు. “కఠినశిల కన్నీటికి కరుగుతుందా?” అన్నట్లు మొండిగా నిలిచింది. నారచీరలు కూడా తానే తెచ్చి ఇచ్చింది.
• దీనిని బట్టి కైక చెప్పుడు మాటలకు లోనయ్యే స్వభావం, పుత్రప్రేమ, పట్టుదల (మొండితనం) కలదని తెలుస్తుంది. అయినా శ్రీరాముడు ఆమెను నిందించలేదు — విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు.
3. కింది ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానం రాయండి. (8 మార్కులు)
3. వీర్రాజు గారికి ప్రేరణ కలిగించిన సన్నివేశాన్ని గురించి రాయండి. [8 మా]
జవాబు చూడండి
1. రామ్మూర్తి మాస్టారి ట్యూషన్: ఒకరోజు పాఠాలు అయిపోయాక రామ్మూర్తిగారు బొమ్మలు వేయమన్నారు. రచయిత విమానం బొమ్మ, ఇల్లు బొమ్మ, కిరసనాయిలు బుడ్డిదీపం బొమ్మ వేశారు. యుద్ధం రోజుల్లో ఆకాశంలో తరచుగా కనిపించే విమానాలు, నిచ్చెనతో వచ్చి వీధిదీపం వెలిగించే మనిషి ఆయన మనసులో మెదిలిన రూపాలు. ఆ రోజు ఆయనకు ఫస్టు మార్కు వేసి మెచ్చుకున్నారు.
2. ఇంట్లో ప్రోత్సాహం: పలకమీద వేసిన ఆ బొమ్మలను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి అమ్మా నాన్నలకు చూపించారు. వాళ్ళు బాగున్నాయన్నారు. అప్పటినుంచి పక్కింటి క్లాసు పుస్తకాల్లోని బొమ్మలను కాపీ చేయడం, తర్వాత కాగితంమీద పెన్సిలుతో, వాటర్ కలర్‌తో బొమ్మలు వేయడం మొదలుపెట్టారు. కొంతకాలానికి చేయి తిరిగింది. దామెర్ల రామారావు ఆర్ట్ గేలరీవారు హైస్కూలు విద్యార్థులకు నిర్వహించే పోటీల్లో పాల్గొన్నారు.
3. బొమ్మల గది: పెద్దమ్మ అక్క గదినిండా ప్లాస్టిక్కువి, చెక్కవి, ఇత్తడివి, గాజువి, పింగాణీవి ఆటబొమ్మలు ఉండేవి. వాటిని చూసి కలిగిన ఆసక్తే తర్వాత కళాఖండాల సేకరణపై అభిరుచికి కారణమైంది.
4. రంగుటద్దాల కిటికీలు: ఆకుపచ్చ, ఎర్రని అద్దాల రెక్కల కిటికీల గుండా వీధి, ఎండ రంగులు గదినిండా పరుచుకోవడం; గోదావరి, పడవలు, రంగురంగుల ఆకాశం, ఊరిచుట్టూ చెట్లు — ఇవన్నీ చిత్రకళపై ఆసక్తిని పెంచాయి.
5. తొలి బహుమతి: పద్నాలుగో ఏట తూర్పు గోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన మహాసభలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు. అందులో ఆయన చిత్రానికి ప్రథమ బహుమతి వచ్చింది. డాక్టర్ గరికపాటి రాజారావుగారి చేతులమీదుగా అందుకున్న ఆ తొలి బహుమతి ఆయనకు కొత్త అనుభవం.
ఈ సన్నివేశాలన్నీ వీర్రాజు గారిని చిత్రకారుడిగా తీర్చిదిద్దడానికి ప్రేరణ కలిగించాయి. “బాల్యంలోనే మూలబీజాలు పడతాయి” అనే పాఠం సందేశానికి ఇవే నిదర్శనం.
(లేదా)
మీరు చూసిన చిత్రకళా ప్రదర్శన గురించి పత్రికకు ఒక వ్యాసం రాయండి. [8 మా]
నమూనా వ్యాసం చూడండి
శీర్షిక: రంగుల్లో మెరిసిన బాల ప్రతిభ — విద్యార్థుల చిత్రకళా ప్రదర్శన
మా పట్టణంలోని టౌన్ హాలులో గత ఆదివారం జిల్లా స్థాయి విద్యార్థుల చిత్రకళా ప్రదర్శన జరిగింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు వేసిన దాదాపు రెండు వందల చిత్రాలను ప్రదర్శించారు. మా తెలుగు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నేను, నా మిత్రులు ఆ ప్రదర్శనకు వెళ్ళాం.
ప్రదర్శనను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. హాలు ప్రవేశంలోనే పెద్ద రంగవల్లి, పూలతో అలంకరణ ఆకట్టుకున్నాయి. చిత్రాలను విభాగాలుగా అమర్చారు — ప్రకృతి దృశ్యాలు, గ్రామీణ జీవనం, మన స్వాతంత్ర్య సమరయోధులు, పర్యావరణ పరిరక్షణ, పండుగలు.
ఒక విద్యార్థిని వేసిన “గోదావరి ఒడ్డున సూర్యోదయం” చిత్రం అందరినీ ఆకట్టుకుంది. నీటిలో ప్రతిబింబించే సూర్యకిరణాలు నిజంగా మెరుస్తున్నట్లే ఉన్నాయి. “ప్లాస్టిక్ వద్దు — ప్రకృతి ముద్దు” అనే చిత్రం మంచి సందేశం ఇచ్చింది. పెన్సిల్ స్కెచ్‌లు, వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్‌లతో పాటు ఆకులు, గింజలతో చేసిన కళాకృతులు కూడా ఉన్నాయి.
ప్రదర్శనలో ఒక చిత్రకారుడు విద్యార్థులకు బొమ్మలు గీయడంలో మెలకువలు నేర్పించారు. రంగుల ఎంపిక, వెలుగు–నీడలు ఎలా చూపాలో చెప్పారు. చివరిలో ఉత్తమ చిత్రాలకు బహుమతులు అందజేశారు.
ఈ ప్రదర్శన చూశాక “చేజారిన బాల్యం” పాఠంలో శీలా వీర్రాజు గారు పద్నాలుగో ఏట చిత్రకళా ప్రదర్శనలో తొలి బహుమతి అందుకున్న సంఘటన గుర్తొచ్చింది. బాల్యంలో దొరికే ఇలాంటి ప్రోత్సాహమే భవిష్యత్తులో గొప్ప కళాకారులను తయారుచేస్తుంది. ప్రతి పాఠశాల ఏడాదికి ఒకసారైనా ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తే విద్యార్థుల్లోని సృజనాత్మకత బయటకు వస్తుంది.
రాసేటప్పుడు గుర్తుంచుకోండి: శీర్షిక, ఎక్కడ–ఎప్పుడు–ఎవరు నిర్వహించారు, ఏమేమి చిత్రాలు ఉన్నాయి, మీకు నచ్చిన చిత్రం, మీ అభిప్రాయం / సూచన — ఈ ఐదు అంశాలు తప్పక ఉండాలి.
లఘు పరీక్ష – 7 Level-2 (Shining Star): ప్రశ్నలు, జవాబులు
1. కింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాల్లో రాయండి. (4 మార్కులు)
1. వ్యాస ప్రక్రియ గురించి వివరించండి. [4 మా]
జవాబు చూడండి
• వ్యాసంలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు అనేవి ప్రధానమైన అంగాలు.
• వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్త్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు.
• రచయిత తన అనుభవాలను చెప్పే ఆత్మకథాత్మక వ్యాసాలు కూడా ఉంటాయి.
• ఉదాహరణ: మన “చేజారిన బాల్యం” పాఠం శీలా వీర్రాజు గారి వ్యాస సంపుటి “కలానికి ఇటూ అటూ” నుండి గ్రహించిన ఆత్మకథాత్మక వ్యాసం. ఇందులో రచయిత తన బాల్య అనుభవాలను వివరించారు.
(లేదా)
మారీచుని పాత్ర స్వభావం గురించి రాయండి. [4 మా]
జవాబు చూడండి
• హితం చెప్పేవాడు: సీతాపహరణానికి సహాయం అడిగిన రావణునితో “ఓ రాక్షసేంద్రా! ఈ ఆలోచన నీకెవరు చెప్పారు? నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు. శ్రీరాముడు సింహం వంటివాడు” అని హెచ్చరించి, శాంతించమని సదుపదేశం చేశాడు.
• రావణుడు రెండోసారి వచ్చి బంగారు లేడిగా మారమన్నప్పుడు కూడా పరిపరివిధాల నచ్చజెప్పాడు. కానీ “మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు.”
• “చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో చావు తప్పదు” అని రావణుడు బెదిరించాడు. ఆశ్రమానికి వెళ్తే రాముని చేతిలో చావు — మారీచుని స్థితి “ముందు నుయ్యి వెనుక గొయ్యి.” చివరకు “నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయం. నా జన్మ తరిస్తుంది” అని అంగీకరించాడు.
• మాయావి: బంగారు లేడిగా మారి సీతను ఆకర్షించాడు. రాముని బాణానికి నిజస్వరూపంతో పడిపోతూ, రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ “అయ్యో సీతా! అయ్యో లక్ష్మణా!” అని అరిచి ప్రాణాలు విడిచాడు.
దీనిని బట్టి మారీచుడు రాముని శక్తి తెలిసినవాడు, వివేకంతో హితవు చెప్పినవాడు, మాయలో నేర్పరి అని తెలుస్తుంది.
2. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. (8 మార్కులు)
అ) నాలుగున్నర దశాబ్దాల్లో ఏయే రంగాలలో మార్పులు వచ్చాయి? [2]
జవాబు చూడండి
ఆ) ఇప్పటికీ, ఏమాత్రం సడలిపోకుండా అలాగే కొనసాగుతున్న స్నేహాలు ఏవి? [2]
జవాబు చూడండి
ఇ) స్నేహం స్నేహం కోసమే చేయడం ఎక్కడ ఉంటుంది? [2]
జవాబు చూడండి
ఈ) పై గద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. [2]
జవాబు చూడండి
1. రచయితకు, ఆయన బాల్యానికీ మధ్య ఎంత దూరం ఉంది?
2. రచయిత ఎవరిని వదులుకోలేదు?
3. ఇన్నేళ్ళలో రచయితలో ఏమేమి మార్పులు వచ్చాయి?
3. కింది ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. (8 మార్కులు)
3. మీరు చూసిన చిత్రకళా ప్రదర్శన గురించి పత్రికకు ఒక వ్యాసం రాయండి. [8 మా]
ఈ ప్రశ్న Level-1 లోని మూడో ప్రశ్న (లేదా) భాగమే. నమూనా వ్యాసం కోసం పైన Level-1 ప్రశ్న 3 లో “నమూనా వ్యాసం చూడండి” బటన్ నొక్కండి. Level-2 లో దీనికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఈ వ్యాస నమూనాను బాగా అభ్యాసం చేయండి.
• పరిచిత గద్యం ప్రశ్నలకు జవాబు గద్యంలోని మాటలతోనే, పూర్తి వాక్యంగా రాయండి — ఒక్క పదంతో ఆపవద్దు.
• “ప్రశ్న తయారు చేయండి” అంటే జవాబు గద్యంలో ఉండే ప్రశ్న రాయాలి; చివర “?” మరచిపోవద్దు.
• 4 మార్కుల ప్రశ్నకు నాలుగైదు వాక్యాలు, 8 మార్కుల ప్రశ్నకు 8–10 వాక్యాలు చాలు. పాత్ర స్వభావం ప్రశ్నలో సంఘటనతో పాటు “దీనిని బట్టి … స్వభావం కలవాడు/కలది” అని ముగించండి.
• 30 నిమిషాల్లో 3 ప్రశ్నలు — గద్యానికి 8, చిన్న ప్రశ్నకు 7, వ్యాసానికి 13 నిమిషాలు, చివర 2 నిమిషాలు సరిచూసుకోవడానికి.
చేజారిన బాల్యం – మరిన్ని ముఖ్య ప్రశ్నలు (SA1 కి కూడా)
లఘు పరీక్షలో రాని, కానీ SA1 లో, తర్వాతి పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఇవి. పాఠం మొత్తం ప్రశ్నల కోసం చేజారిన బాల్యం Important Questions పేజీ చూడండి.
1. శీలా వీర్రాజు గారి గురించి రాయండి. (రచయిత పరిచయం) [4 మా]
జవాబు చూడండి
• రచయితగా, చిత్రకారుడిగా తనదైన ముద్ర వేశారు. “శీలావీ”గా సుపరిచితులు.
• కథా సంపుటాలు: సమాధి, మబ్బుతెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచె.
• కవితా సంపుటాలు: కొడిగట్టిన సూర్యుడు, కిటికీకన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగుపేకల మధ్య జీవితం.
• నవలలు: మైనా, కరుణించని దేవత, వెలుగురేఖలు. 1969 లో “మైనా” నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
• మన పాఠం ఆయన వ్యాస సంపుటి “కలానికి ఇటూ అటూ” నుండి గ్రహించబడింది.
2. రచయితకు కళాఖండాల సేకరణపై అభిరుచి ఎలా కలిగింది? [4 మా]
జవాబు చూడండి
• ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది. ఆ గదినిండా ప్లాస్టిక్కువి, చెక్కవి, ఇత్తడివి, గాజువి, పింగాణీవి చిన్నచిన్న ఆటబొమ్మలు — గోడలమీద, పెట్టెలమీద ఒక్క అరఅంగుళం కూడా ఖాళీ లేకుండా నిండి ఉండేవి.
• పిల్లల్ని ఆ గదిలోకి రానిచ్చేవారు కాదు. కిటికీలోంచి, కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలోంచి ఆ బొమ్మలు చూసి ఆశ్చర్యపోయేవారు.
• ఆ ఆసక్తే ఉత్తరోత్తరా రచయితకు కళాఖండాల సేకరణపై అభిరుచి కలగడానికి కారణమైంది.
3. రచయిత సాహిత్యాభిరుచి ఎలా ఏర్పడింది? [8 మా]
జవాబు చూడండి
• బాల్యమిత్రులు ప్రకాశరావు, అప్పారావుతో కలిసి నెలనెలా చేతివ్రాత పత్రిక తీసుకువచ్చారు. చందమామ, బాల, పాపాయి పత్రికలు చదివి కొత్త రచనలు తయారుచేసే పని ప్రకాశరావుది, రచయితది. ముత్యాల కోవలాంటి దస్తూరీ గల అప్పారావు వాటిని అందంగా రాసేవాడు.
• బొమ్మలు వేసి, అట్టమీద రంగుల బొమ్మ వేసి, పుస్తకంగా కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణా మిషన్ రీడింగ్ రూంలో పెట్టేవారు.
• అందుకోసం “పిచ్చిపుల్లయ్య” కొట్లో అర్ధణాకీ, అణాకీ పాత పిల్లల పత్రికలు కొని చదవవలసి వచ్చేది. ఇదే సాహిత్యాభిరుచికి తొలిమెట్టు.
• కొన్ని నెలలకే పత్రిక ఆగిపోయినా, చదివే అలవాటు కొనసాగింది.
• ఇంట్లో పుస్తకాలు, మేగజైన్లు, దినపత్రిక కొనే అలవాటు లేదు. తల్లిదండ్రులు వానాకాలపు చదువే. అందువల్ల ప్రకాశరావు దగ్గర పుస్తకాలు తెచ్చుకొని, లైబ్రరీకి వెళ్ళి చదివేవారు.
• ఆ చదివే గుణమే తర్వాత రాసే అభిరుచిగా పరిణామం చెందింది. ఇలా బాల్యంలోనే రచయిత సాహిత్యాభిరుచికి పునాదులు పడ్డాయి.
ఏకవాక్య ప్రశ్నలు
4. చేజారిన బాల్యం పాఠం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? [1 మా]
జవాబు చూడండి
5. రచయిత ఎవరి చేతులమీదుగా తొలి బహుమతి అందుకున్నారు? [1 మా]
జవాబు చూడండి
6. రామ్మూర్తిగారు ట్యూషన్‌కు ఎంత ఫీజు తీసుకునేవారు? [1 మా]
జవాబు చూడండి
చేజారిన బాల్యం – భాషాంశాలు (త్వరిత పునశ్చరణ)
ఏడాది = సంవత్సరం, వత్సరం, అబ్దం | హృదయం = మనసు, ఎద, డెందం | వర్షం = వాన, వృష్టి | ఈప్సితము = కోరిక, అభిలాష, ఇచ్ఛ
ప్రకృతి – వికృతి
ఆసక్తి – ఆసత్తి | తంత్రం – తంతు | చిత్రం – చిత్తరువు | ఖండం – కండ
జాతీయాలు
చేయి తిరిగిన = ఒక పనిలో నైపుణ్యం సంపాదించిన | చేజారిపోనీయకూడదు = కోల్పోకూడదు | చీకుచింతా లేని = ఏ బాధా, దిగులూ లేని | మూలబీజాలు = మొదటి కారణాలు, పునాదులు
| సంధి పదం | విడదీయడం / కలపడం | సంధి పేరు |
|---|---|---|
| ప్రత్యేకత | ప్రతి + ఏకత | యణాదేశ సంధి |
| దీపాలు | దీపము + లు | లు, ల, న ల సంధి |
| ఎప్పుడైన | ఎప్పుడు + ఐన | ఉత్వ సంధి |
| దశాబ్దం | దశ + అబ్దం | సవర్ణదీర్ఘ సంధి |
| తల్లి + తండ్రి | తల్లిదండ్రి | గసడదవాదేశ సంధి |
| ఇన్ని + ఏళ్ళు | ఇన్నేళ్ళు | ఇత్వ సంధి |
| పుస్తకము + లు | పుస్తకాలు | లు, ల, న ల సంధి |
| చిన్న + అప్పుడు | చిన్నప్పుడు | అత్వ సంధి |
| సాహిత్య + అభిమానం | సాహిత్యాభిమానం | సవర్ణదీర్ఘ సంధి |
| సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
|---|---|---|
| సాహిత్యాభిరుచి | సాహిత్యము నందు అభిరుచి | సప్తమీ తత్పురుష |
| చేతిరాత | చేతితో రాత | తృతీయా తత్పురుష |
| నిష్కల్మషము | కల్మషము లేనిది | నఞ్ తత్పురుష |
| నాలుగుదిక్కులు | నాలుగు సంఖ్య గల దిక్కులు | ద్విగు సమాసం |
| చిన్నపిల్ల | చిన్నదైన పిల్ల | విశేషణ పూర్వపద కర్మధారయ |
| అబద్ధం | బద్ధం కానిది | నఞ్ తత్పురుష |
| శక్తిసామర్థ్యాలు | శక్తియు, సామర్థ్యమును | ద్వంద్వ సమాసం |
| అమాయకము | మాయకము కానిది | నఞ్ తత్పురుష |
| బాల్యమిత్రులు | బాల్యము నందలి మిత్రులు | సప్తమీ తత్పురుష |
ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చండి: “నేను రాను” అని రవి రాజుతో అన్నాడు. [1 మా]
జవాబు చూడండి
గుర్తుంచుకోండి: పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు (“ ”) తొలగిపోతాయి; “నేను”; “తాను” గా మారుతుంది; “అని” స్థానంలో క్రియకు “-అని / -నని” చేరుతుంది. పాఠ్యపుస్తకంలోని మరో ఉదాహరణ: “వ్యక్తికి బహువచనం శక్తి” అన్నాడు శ్రీశ్రీ; వ్యక్తికి బహువచనం శక్తని అన్నాడు శ్రీశ్రీ.
అరణ్యకాండ – సంఘటనల క్రమం, ముఖ్య ప్రశ్నలు (Slip Test 7 కోసం)
ఉపవాచకం ప్రశ్నల్లో ఎక్కువగా “పాత్ర స్వభావం”, “సంఘటనను వివరించండి” అనే ప్రశ్నలు వస్తాయి. ముందు ఈ క్రమం గుర్తుపెట్టుకుంటే ఏ ప్రశ్నకైనా జవాబు రాయడం సులభం.
1. దండకారణ్యంలో మునుల ఆశ్రమాలు; విరాధుడనే రాక్షసుడు సీతారామలక్ష్మణులపై దాడి; రామలక్ష్మణులు అతని భుజాలు నరికి, గోతిలో పాతిపెట్టారు (తుంబురుడనే గంధర్వునికి శాపవిముక్తి).
2. శరభంగ మహర్షి దర్శనం; తన తపఃఫలాన్ని రామునికి ధారపోసి బ్రహ్మలోకం చేరాడు.
3. రాక్షసుల బారి నుండి కాపాడమని మునుల ప్రార్థన; సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం; పది సంవత్సరాలు ఆశ్రమాల్లో గడిపారు.
4. అగస్త్యభ్రాత ఆశ్రమం; అగస్త్య మహర్షి దర్శనం; దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గం బహూకరించాడు; పంచవటి సూచన.
5. దారిలో జటాయువు పరిచయం; పంచవటిలో లక్ష్మణుడు పర్ణశాల నిర్మాణం.
6. శూర్పణఖ రాక; లక్ష్మణుడు ముక్కుచెవులు కోశాడు; ఖరదూషణాదులు, పద్నాలుగు వేల రాక్షసులు రాముని చేతిలో హతం.
7. అకంపనుడు, శూర్పణఖ రావణునికి వార్త; మారీచుడు మొదట హితవు చెప్పాడు; రెండోసారి బంగారు లేడిగా మారాడు.
8. మారీచుని మరణం; “అయ్యో సీతా! అయ్యో లక్ష్మణా!” అనే కేక; సీత పట్టుదలతో లక్ష్మణుడు వెళ్ళాడు.
9. సన్యాసి వేషంలో రావణుడు; సీతాపహరణం; జటాయువు పోరాటం, రెక్కలు తెగి పడిపోయాడు.
10. ఋష్యమూకంపై వానరులను చూసి సీత ఆభరణాలు జారవిడిచింది; లంకలో అశోకవనంలో సీత.
11. రామలక్ష్మణుల సీతాన్వేషణ; జటాయువు వార్త చెప్పి మరణం; రాముడు దహనసంస్కారాలు చేశాడు.
12. క్రౌంచారణ్యంలో కబంధుడు; శాపవిముక్తి, సుగ్రీవ మైత్రి సూచన; పంపాతీరంలో శబరి ఆతిథ్యం, ఊర్ధ్వలోకాలకు; ఋష్యమూక పర్వతం వైపు ప్రయాణం.

1. జటాయువు పాత్ర స్వభావం రాయండి. [4 మా]
జవాబు చూడండి
• రావణుడు సీతను అపహరించుకుపోతుంటే, సీత ఆర్తనాదాలు విని రావణుణ్ణి ఎదిరించాడు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. రావణుడు ఖడ్గంతో అతని రెక్కలు, కాళ్ళు నరికివేశాడు.
• రక్తంతో తడిసి ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నా, సీతను వెదుకుతూ వచ్చిన రామునికి రావణుడు సీతను అపహరించిన విషయం చెప్పి ప్రాణం విడిచాడు.
• శ్రీరాముడు తండ్రికి ఆత్మీయుడైన జటాయువుకు పితృభక్తితో దహనసంస్కారాలు చేశాడు.
దీనిని బట్టి జటాయువు స్నేహధర్మం, త్యాగబుద్ధి, ధైర్యం, కర్తవ్యనిష్ఠ కలవాడని తెలుస్తుంది.
2. శూర్పణఖ వృత్తాంతాన్ని రాయండి. [4 మా]
జవాబు చూడండి
• రాముడు పరిహాసంగా లక్ష్మణుని దగ్గరకు పంపాడు. లక్ష్మణుడు తాను అన్నకు దాసుడినని, తనతో ఉంటే దాస్యం చేయాల్సి వస్తుందని రాముడినే చేరమని చెప్పాడు.
• సీత ఉండడం వల్లే రాముడు తనను నిరాకరిస్తున్నాడని భావించి సీతపై దాడికి దిగింది. “క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు” అని రాముడు ఆమెను విరూపిని చేయమన్నాడు. లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులు కోశాడు.
• ఆమె ఖరుని వద్దకు వెళ్ళగా ఖరదూషణాదులు పద్నాలుగు వేల రాక్షసులతో వచ్చి రాముని చేతిలో హతమయ్యారు. తర్వాత లంకకు వెళ్ళి సీత సౌందర్యాన్ని వర్ణించి రావణునిలో కొత్త ఆశలు రేకెత్తించింది — ఇదే సీతాపహరణానికి దారి తీసింది.
3. సీతాపహరణ సన్నివేశాన్ని వివరించండి. [8 మా]
జవాబు చూడండి
• సీత రక్షణ బాధ్యత లక్ష్మణునికి అప్పగించి రాముడు లేడి వెంట వెళ్ళాడు. బాణం దెబ్బకు మారీచుడు నిజరూపంతో పడిపోతూ రాముని కంఠధ్వనితో “అయ్యో సీతా! అయ్యో లక్ష్మణా!” అని అరిచాడు.
• ఆ కేక విని సీత రాముడు ఆపదలో ఉన్నాడని భయపడింది. లక్ష్మణుడు అది మారీచుని మాయ అని చెప్పినా సీత నిష్ఠూరాలాడింది. గత్యంతరం లేక లక్ష్మణుడు వెళ్ళాడు.
• అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో వచ్చాడు. సీత అతిథి మర్యాదలు చేసింది. రావణుడు తన గొప్పలు చెప్పి తనను వరించమన్నాడు. సీత మండిపడి, “నన్ను అపహరించి నీ చావును నీవే కొనితెచ్చుకోకు” అని హెచ్చరించింది.
• రావణుడు నిజస్వరూపంతో సీతను బలవంతంగా రథంలో ఎక్కించుకొని లంకకు బయలుదేరాడు. సీత “రామా! రామా!” అని ఆర్తనాదాలు చేసింది — ఆమె వేదన అరణ్యరోదనమైంది.
• జటాయువు రావణుణ్ణి ఎదిరించి పోరాడాడు; రావణుడు అతని రెక్కలు, కాళ్ళు నరికాడు.
• ఆకాశమార్గంలో వెళ్తూ, పర్వత శిఖరంపై ఉన్న ఐదుగురు వానరముఖ్యులను చూసి సీత తన ఆభరణాలను ఉత్తరీయపు కొంగులో మూటగట్టి జారవిడిచింది — రాముడు వస్తే తన గురించి చెబుతారని చిన్న ఆశ.
• లంకలో రావణుడు సీతను అశోకవనంలో రాక్షసస్త్రీల కాపలాలో ఉంచాడు. పన్నెండు నెలల గడువు ఇచ్చి బెదిరించాడు. సీత అతని వైభవాన్ని తృణప్రాయంగా భావించింది.
4. కబంధుడు ఎవరు? “కబంధహస్తాలు” అనే జాతీయం ఎలా పుట్టింది? [4 మా]
జవాబు చూడండి
• అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరితరమూ కాదు. అందుకే ఎవరూ తప్పించుకోలేని పట్టును “కబంధహస్తాలు” అంటారు.
• రామలక్ష్మణులు అతని భుజాలు నరికారు. శాపం వల్ల తనకు వికృతరూపం వచ్చిందని, శరీరాన్ని దహిస్తే నిజరూపం వస్తుందని చెప్పాడు. దహనం చేయగా దివ్యదేహంతో బయటకు వచ్చి సీతను పొందే ఉపాయంగా సుగ్రీవ మైత్రిని సూచించి స్వర్గానికి వెళ్ళాడు.
5. “అగస్త్యభ్రాత” అనే జాతీయం ఎలా ఏర్పడింది? [2 మా]
జవాబు చూడండి
6. శబరి గురించి రాయండి. [2 మా]
జవాబు చూడండి
7. అగస్త్యుడు శ్రీరామునికి ఏమేమి బహూకరించాడు? ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? [2 మా]
జవాబు చూడండి
• “ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత” — మునుల ఆశ్రమాలను చూడగానే రాముడు ధనుస్సు నుంచి అల్లెతాడు తీసివేసినప్పుడు.
• “ఒక మహాకార్య సాధనలో ఎవరివంతు వారు సహకారమందించాలి” — శరభంగ మహర్షి తన తపఃఫలాన్ని రామునికి ధారపోసినప్పుడు.
• “అహంకరించకుండా తన బాధ్యతను గుర్తించడంలోనే గొప్పదనముంది” — రక్షించమని ప్రార్థించిన మునులతో రాముడు “మీరు ఆజ్ఞాపించాలి” అన్నప్పుడు.
• “క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు” — శూర్పణఖ సీతపై దాడికి దిగినప్పుడు.
• “మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు” — మారీచుని హితవును రావణుడు పెడచెవిన పెట్టినప్పుడు.
Chejarina Balyam Aranyakanda Slip Test PDF Download
| వివరం | లింక్ | |
|---|---|---|
| అధికారిక Mission March తెలుగు మెటీరియల్ | BSE AP విడుదల చేసిన తెలుగు (ప్రథమ భాష) పుస్తకం — లఘు పరీక్షలు 1 నుంచి 14 (జవాబులు లేవు); సుమారు 10.7 MB | Download PDF — Mission March Telugu |
అధికారిక సమాచారం కోసం BSE AP (bse.ap.gov.in) చూడండి. అన్ని సబ్జెక్టుల లఘు పరీక్షల జాబితా Mission March SSC 2027 Slip Test Papers PDF పేజీలో, మొత్తం షెడ్యూల్ Mission March SSC 2027 Action Plan పేజీలో ఉన్నాయి.
Telugu Slip Test 7 (చేజారిన బాల్యం, అరణ్యకాండ) — FAQs
తెలుగు లఘు పరీక్ష – 7 ఎప్పుడు జరిగింది? ఏ పాఠాలపై?
Mission March SSC-2027 షెడ్యూల్ ప్రకారం 31.08.2026 న జరిగింది. పాఠాలు: 6. చేజారిన బాల్యం, ఉపవాచకం రామాయణం – అరణ్యకాండ. Level-1 లో అయోధ్యాకాండలోని కైక పాత్ర ప్రశ్న కూడా ఇచ్చారు.
లఘు పరీక్ష – 7 కు ఎన్ని మార్కులు? సమయం ఎంత?
20 మార్కులు, 30 నిమిషాలు. పరిచిత గద్యం 8 మార్కులు, చిన్న జవాబు ప్రశ్న 4 మార్కులు, వ్యాసరూప / సృజనాత్మక ప్రశ్న 8 మార్కులు.
Level-1, Level-2 పేపర్లలో తేడా ఏమిటి?
Level-1 (Rising Star) లో 4 మార్కుల ప్రశ్నకు, 8 మార్కుల ప్రశ్నకు రెండేసి ఎంపికలు (లేదా) ఉన్నాయి. Level-2 (Shining Star) లో వేరే గద్యం (స్నేహం గురించి), మారీచుని పాత్ర ప్రశ్న ఉన్నాయి; చివరి వ్యాసానికి ఎంపిక లేదు.
Rising Star, Shining Star అంటే ఏమిటి?
Mission March లో Level-1 ను Rising Stars అని, Level-2 ను Shining Stars అని పిలుస్తారు. Level-1 అందరి కోసం, ముఖ్యంగా C, D గ్రేడ్ విద్యార్థుల కోసం; Level-2 A, B గ్రేడ్ విద్యార్థుల కోసం. Level-1 పూర్తయ్యాక ఎవరైనా Level-2 సాధన చేయవచ్చు.
తెలుగులో మొత్తం ఎన్ని లఘు పరీక్షలు ఉన్నాయి?
అధికారిక Mission March తెలుగు మెటీరియల్‌లో లఘు పరీక్షలు 1 నుంచి 14 వరకు ఉన్నాయి. వాటిలో 7వది ఈ చేజారిన బాల్యం, అరణ్యకాండ పరీక్ష.
చేజారిన బాల్యం, అరణ్యకాండ SA1 పరీక్షలో ఉంటాయా?
ఉంటాయి. 28-10-2026 నాటి అధికారిక SA1 సిలబస్‌లో చేజారిన బాల్యం పాఠం, ఉపవాచకంలో బాలకాండ నుంచి కిష్కింధాకాండ వరకు ఉన్నాయి. పదో తరగతి SA1 తెలుగు పరీక్ష 9 నవంబర్ 2026 న, ఉదయం 9:15 నుంచి 12:30 వరకు.
చేజారిన బాల్యం పాఠం రచయిత ఎవరు?
శీలా వీర్రాజు (1939–2022). రచయిత, చిత్రకారుడు; “శీలావీ”గా సుపరిచితులు. పాఠం ఆయన వ్యాస సంపుటి “కలానికి ఇటూ అటూ” నుండి గ్రహించబడింది.
చేజారిన బాల్యం ఏ ప్రక్రియకు చెందినది?
వ్యాస ప్రక్రియ. ఇది రచయిత తన బాల్య అనుభవాలను చెప్పిన ఆత్మకథాత్మక వ్యాసం.
అరణ్యకాండలో ముఖ్యమైన పాత్రలు ఏవి?
విరాధుడు, శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగస్త్యుడు, జటాయువు, శూర్పణఖ, ఖరదూషణులు, అకంపనుడు, మారీచుడు, రావణుడు, కబంధుడు, శబరి. పరీక్షల్లో ఎక్కువగా మారీచుడు, జటాయువు, శూర్పణఖ, శబరి పాత్రలపై ప్రశ్నలు వస్తాయి.
“కబంధహస్తాలు” అంటే అర్థం ఏమిటి?
ఎవరూ తప్పించుకోలేని పట్టు. అరణ్యకాండలోని కబంధుడి యోజనం పొడవు చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరితరమూ కాదు కాబట్టి ఈ జాతీయం పుట్టింది.
పరిచిత గద్యం ప్రశ్నలో “ప్రశ్న తయారు చేయండి” కు ఎలా రాయాలి?
జవాబు ఆ గద్యంలోనే దొరికేలా ఒక ప్రశ్న రాయాలి. ఏమిటి, ఎవరు, ఎక్కడ, ఎందుకు వంటి ప్రశ్నార్థక పదం వాడి, చివర ప్రశ్నార్థకం (?) తప్పక పెట్టాలి.
ఈ పేజీలోని జవాబులు అధికారికమా?
కాదు. అధికారిక Mission March పుస్తకంలో జవాబులు లేవు. ప్రశ్నలు అధికారిక లఘు పరీక్ష – 7 లో ఉన్నట్లే ఇచ్చాము. జవాబులు 2026-27 పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పాఠం, ఉపవాచకం చదివి మేము రాసినవి.
తర్వాత ఏం చదవాలి
- AP 10th Class SA1 Telugu Question Paper 2026-27 — 9 నవంబర్ పరీక్షకు అన్ని పాఠాల ప్రశ్నలు, జవాబులు
- చేజారిన బాల్యం Important Questions 2026 — పాఠం మొత్తం ప్రశ్నలు
- జలియన్ వాలా బాగ్ Important Questions — ముందటి లఘు పరీక్ష పాఠం
ఇతర సబ్జెక్టుల Mission March లఘు పరీక్షలు, జవాబులు: Maths, Physical Science, Biology, Social, English, Hindi. తెలుగు మిగతా పాఠాల ప్రశ్నలకు 10th Class Telugu Important Questions and Answers, 10th Class Telugu Study Material PDF చూడండి.






