Mission March SSC 2027 Telugu అధికారిక మెటీరియల్‌ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ విడుదల చేసింది. అందులో తెలుగు (ప్రథమ భాష) కు షెడ్యూల్, పాఠాల వారీ ప్రశ్నల నిధి, లఘు పరీక్షలు (Slip Tests) ఉన్నాయి. తెలుగు లఘు పరీక్షలు అన్నీ సోమవారాల్లో, ఒక్కొక్కటి 20 మార్కులు, 30 నిమిషాలు.
ఈ AP 10th Class Mission March 2027 Telugu Slip Test పేజీలో అధికారిక PDF మొత్తం చదివి ఇచ్చినవి: ప్రతి లఘు పరీక్ష తేదీ, ఏ పాఠం, PDF లో ఏ పేజీ; 9 నవంబర్ SA1 తెలుగుకు ఏ పరీక్షలు చదవాలి; లఘు పరీక్ష 9 (కిష్కింధాకాండ), లఘు పరీక్ష 11 (రాజధర్మం, హనుమంతుడు), లఘు పరీక్ష 13 (23 నవంబర్ — యుద్ధ విజేత, కన్యాశుల్కం), లఘు పరీక్ష 14 (30 నవంబర్ — సూక్తి సుధ, సుందర–యుద్ధ కాండలు) Level-1, Level-2 పూర్తి జవాబులు. లఘు పరీక్ష 7 జవాబులు చేజారిన బాల్యం, అరణ్యకాండ Slip Test పేజీలో ఉన్నాయి.
లఘు పరీక్ష 13, 14 జవాబులు, SA1 తెలుగు (9 నవంబర్) అసలు ప్రశ్నపత్రం జవాబులు వచ్చిన వెంటనే మీ ఫోన్‌కు రావాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి
ఈ పేజీలో: ముఖ్య వివరాలు | 14 పరీక్షల షెడ్యూల్ | SA1 కు ఏవి | లఘు పరీక్ష 9 | లఘు పరీక్ష 11 | లఘు పరీక్ష 13 | లఘు పరీక్ష 14 | PDF | FAQs
Mission March SSC 2027 Telugu — ముఖ్య వివరాలు
| అంశం | వివరం |
|---|---|
| విడుదల చేసింది | బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ |
| కార్యక్రమం | Mission March SSC-2027 Action Plan Phase-I; 13 జూలై నుంచి 30 నవంబర్ 2026; తరగతులు సాయంత్రం 4–5 |
| సబ్జెక్టు | తెలుగు (ప్రథమ భాష) — 10వ తరగతి |
| లఘు పరీక్షలు | PDF లో 1 నుంచి 14 వరకు, లఘు పరీక్ష 12 మాత్రం లేదు (13 పేపర్లు); అన్నీ సోమవారాల్లో |
| ప్రతి పరీక్ష | 20 మార్కులు, 30 నిమిషాలు |
| స్థాయిలు | Level-1 (Rising Star), Level-2 (Shining Star) |
| జవాబులు | అధికారిక PDF లో లేవు; ఈ పేజీలోని జవాబులు పాఠ్యపుస్తకం “తెలుగు పరిమళం” ఆధారంగా మేము రాసినవి |
Mission March 2027 Telugu Slip Test షెడ్యూల్ — 14 పరీక్షలు
Mission March బోధన షెడ్యూల్, లఘు పరీక్షల పేపర్లలోని ప్రశ్నల ఆధారంగా ఏ పరీక్ష ఏ పాఠం మీదో ఈ పట్టికలో ఇచ్చాం. “PDF పేజీ” అంటే అధికారిక తెలుగు పుస్తకంలోని ముద్రిత పేజీ సంఖ్య.
| పరీక్ష | తేదీ | పాఠం / అంశం | PDF పేజీ | జవాబులు |
|---|---|---|---|---|
| 1 | 13.07.2026 | ప్రత్యక్ష దైవాలు | 53, 54 | — |
| 2 | 20.07.2026 | బతుకు గంప | 55, 56 | — |
| 3 | 27.07.2026 | శతక మాధుర్యం, బాలకాండ | 57, 58 | — |
| 4 | 10.08.2026 | ఉపన్యాస కళ, అయోధ్యాకాండ | 59, 60 | — |
| 5 | 17.08.2026 | భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం పునశ్చరణ) | 61, 62 | — |
| 6 | 24.08.2026 | జలియన్ వాలా బాగ్ | 63, 64 | — |
| 7 | 31.08.2026 | చేజారిన బాల్యం, అరణ్యకాండ | 65, 66 | జవాబులు |
| 8 | 07.09.2026 | ప్రకృతి సందేశం | 67, 68 | — |
| 9 | 21.09.2026 | కిష్కింధాకాండ (రామాయణం పునశ్చరణ) | 69, 70 | ఈ పేజీలో |
| 10 | 28.09.2026 | జీవని | 71, 72 | — |
| 11 | 26.10.2026 | రాజధర్మం (హనుమంతుడు, సీతాన్వేషణ ప్రశ్నలు కూడా) | 73 | ఈ పేజీలో |
| 12 | — | అధికారిక PDF లో ఈ పరీక్ష పేపర్ లేదు | — | — |
| 13 | 23.11.2026 | యుద్ధ విజేత, కన్యాశుల్కం | 74 | ఈ పేజీలో |
| 14 | 30.11.2026 | సూక్తి సుధ, సుందరకాండ, యుద్ధకాండ | 75, 76 | ఈ పేజీలో |

లఘు పరీక్ష 11, 13 లకు Level-1, Level-2 రెండూ ఒకే పేజీలో ఉన్నాయి. లఘు పరీక్ష 14 కు రెండు పేపర్లు (పేజీ 75, 76) ఉన్నాయి; రెండింటిపైనా “LEVEL-1 : RISING STAR” అనే ముద్రించారు.
SA1 తెలుగు (9 నవంబర్) కు ఏ లఘు పరీక్షలు చదవాలి
28-10-2026 అధికారిక SA1 సిలబస్‌లో పది పాఠాలు, ఉపవాచకంలో బాలకాండ నుంచి కిష్కింధాకాండ వరకు ఉన్నాయి. కాబట్టి లఘు పరీక్షలు 1 నుంచి 10, లఘు పరీక్ష 11 లోని రాజధర్మం ప్రశ్నలు SA1 కు నేరుగా పనికొస్తాయి. లఘు పరీక్ష 11 లోని సుందరకాండ ప్రశ్నలు (హనుమంతుని పాత్రలో సుందరకాండ భాగం, సీతాన్వేషణ), లఘు పరీక్షలు 13, 14 SA1 సిలబస్‌లో లేవు — అవి మార్చి పబ్లిక్ పరీక్షకు. కన్యాశుల్కం మాత్రం SA1 అధికారిక జాబితాలో ఉంది కాబట్టి లఘు పరీక్ష 13 లోని కన్యాశుల్కం ప్రశ్నలు SA1 కూ చదవండి. SA1 పూర్తి నమూనా పేపర్ AP 10th Class SA1 Telugu Question Paper 2026-27 లో ఉంది.
Mission March Telugu Slip Test 9 (21.09.2026) — కిష్కింధాకాండ జవాబులు
ఈ పరీక్ష రామాయణం ఉపవాచకంపై. Level-1, Level-2 లో రెండో, మూడో ప్రశ్నలు ఒకటే; మొదటి ప్రశ్న మాత్రం వేరు (Level-1: వాలి, Level-2: హనుమంతుడు).
Level-1 (Rising Star)
1. వాలి పాత్ర స్వభావం వివరించండి. [4 మా]
జవాబు చూడండి
• మహాబలశాలి, ఆవేశపరుడు: అర్ధరాత్రి మాయావి అనే రాక్షసుడు యుద్ధానికి పిలిస్తే, వారించినా వినకుండా వెళ్ళాడు. దుందుభి అనే రాక్షసుణ్ణి చంపి విసిరేశాడు; ఆ రక్తబిందువులు మతంగాశ్రమం మీద పడడంతో ముని శపించాడు — అందుకే ఋష్యమూక పర్వతానికి రాలేడు.
• తొందరపాటు: గుహ నుంచి తిరిగి వచ్చి, సుగ్రీవుడు చెప్పింది వినకుండా అతణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు; అతని భార్య రుమను అపహరించాడు.
• హితవు వినడు: సుగ్రీవునికి శ్రీరాముడు అండగా ఉన్నాడని, యుద్ధానికి వెళ్ళవద్దని భార్య తార చెప్పినా పెడచెవిన పెట్టాడు.
• తప్పు తెలుసుకునే గుణం: రాముని బాణానికి పడిపోయాక రాముణ్ణి నిలదీశాడు. తమ్ముడి భార్యను చెరబట్టిన అధర్మానికే ఈ శిక్ష అని రాముడు చెప్పగా తన తప్పు తెలుసుకుని మన్నించమన్నాడు. తార, అంగదుల బాధ్యతను సుగ్రీవునికి అప్పగించి, తన మెడలోని సువర్ణమాలను అతనికి ఇచ్చి, అంగదునికి జీవితంలో ఎలా నడుచుకోవాలో చెప్పి ప్రాణం విడిచాడు.
దీనిని బట్టి వాలి బలశాలి, కానీ ఆవేశం, అహంకారంతో తప్పులు చేసినవాడు; చివరకు పశ్చాత్తాపపడిన వాడు అని తెలుస్తుంది.
2. రామాయణంలోని సంఘటనలు ఏ కాండకు చెందినవో గుర్తించి రాయండి. [8 మా]
జవాబు చూడండి
ఆ) దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీదగుగ్గిలమైనాడు. — బాలకాండ (యాగరక్షణకు రాముణ్ణి పంపలేనని దశరథుడు అన్నప్పుడు)
ఇ) శ్రీరామ పట్టాభిషేకమహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకున్నది. — అయోధ్యాకాండ
ఈ) మారీచుని మాటలను పెడచెవిన పెట్టాడు రావణుడు. — అరణ్యకాండ
గమనిక: 8 మార్కుల ప్రశ్న కాబట్టి కాండ పేరుతో పాటు ఆ సంఘటన ఏ సందర్భంలో జరిగిందో ఒక వాక్యం కూడా రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.
3. శ్రీరామ సుగ్రీవులకు మైత్రి ఎలా ఏర్పడింది? [8 మా]
జవాబు చూడండి
• హనుమంతుడు సన్యాసి రూపంలో వెళ్ళి వారిని పరిచయం అడిగాడు. సుగ్రీవుడు ధర్మాత్ముడని, అన్న వాలి అతణ్ణి వంచించాడని, సుగ్రీవుడు రాముని స్నేహం కోరుతున్నాడని చాకచక్యంగా చెప్పాడు. ఆ మాటతీరుకు రాముడు ముగ్ధుడై, “ఇతడు వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడు” అని లక్ష్మణునితో మెచ్చుకున్నాడు.
• లక్ష్మణుడు తమ వృత్తాంతం చెప్పాడు. హనుమంతుడు సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతానికి తీసుకువెళ్ళాడు; భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి వారి దగ్గరకు తెచ్చాడు.
• శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. “ఇకపై సుఖదుఃఖాల్లో ఒక్కటిగా ఉందాం, వాలి భయం నుంచి నన్ను కాపాడు” అని సుగ్రీవుడు కోరాడు. వాలిని తప్పక వధిస్తానని రాముడు మాట ఇచ్చాడు.
• ఒక రాక్షసుడు స్త్రీని తీసుకుపోతుండగా ఆమె జారవిడిచిన నగల మూటను సుగ్రీవుడు చూపించాడు. లక్ష్మణుడు కాలి అందెలను మాత్రం గుర్తుపట్టాడు — వదినగారి పాదాలకు నిత్యం నమస్కరించడం వల్ల.
• సీతను తెచ్చేందుకు తన శక్తి అంతా వినియోగిస్తానని సుగ్రీవుడు మాట ఇచ్చాడు. తర్వాత వాలి తనకు చేసిన అన్యాయాన్ని వివరించాడు.
• రాముని బలం తెలుసుకోవాలనుకున్న సుగ్రీవుని కోసం రాముడు కాలి బొటనవేలితో దుందుభి అస్థిపంజరాన్ని పది యోజనాల దూరం చిమ్మేశాడు; ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను చీల్చాడు. దాంతో సుగ్రీవునికి పూర్తి నమ్మకం కలిగి, మైత్రి బలపడింది.
(లేదా)
సీతాపహరణం గురించి రాయండి. [8 మా]
జవాబు చూడండి
Level-2 (Shining Star) — మొదటి ప్రశ్న మాత్రమే వేరు
1. హనుమంతుడు పాత్ర స్వభావం వివరించండి. [4 మా]
జవాబు చూడండి
• వాక్చాతుర్యం: సన్యాసి వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళి తడబాటు, తొందరపాటు లేకుండా స్పష్టంగా మాట్లాడాడు. “ఈయన మాట తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు” అని రాముడు మెచ్చుకున్నాడు. రామ సుగ్రీవుల మైత్రికి అతనే కారకుడు.
• కర్తవ్యం గుర్తుచేసేవాడు: రాజభోగాల్లో మునిగిన సుగ్రీవునికి సీతాన్వేషణ బాధ్యతను గుర్తుచేశాడు.
• పరాక్రమం, బుద్ధిబలం: సముద్రాన్ని లంఘించాడు. మైనాకుని ఆతిథ్యాన్ని మృదువుగా తిరస్కరించాడు, సురస పరీక్షలో సూక్ష్మబుద్ధి చూపాడు, సింహికను చీల్చాడు, లంకిణిని జయించాడు.
• నిరాశను జయించే ధైర్యం: సీత కనిపించకపోయేసరికి ప్రాణత్యాగం చేయాలనుకున్నా, “బతికి ఉంటే శుభాలు పొందవచ్చు” అని నిర్ణయించుకుని మళ్ళీ వెదికి అశోకవనంలో సీతను కనుగొన్నాడు.
• వినయం: సీత నమ్మేలా రామకథ వినిపించి, ఉంగరం ఇచ్చాడు. తన వీపుపై తీసుకువెళ్తానన్నా సీత నిరాకరిస్తే ఆమె మాటను గౌరవించాడు.
• స్వామిభక్తి: అశోకవనం ధ్వంసం చేసి, లంకను కాల్చి రావణునికి రాముని పరాక్రమాన్ని చాటాడు. యుద్ధంలో హిమాలయాల్లోని సర్వౌషధి పర్వతాన్నే పెకలించి తెచ్చి రామలక్ష్మణుల గాయాలు మాన్పాడు, వానరులను బతికించాడు.
దీనిని బట్టి హనుమంతుడు బుద్ధిబలం, బాహుబలం, వినయం, స్వామిభక్తి అన్నీ కలిసిన ఆదర్శ సేవకుడు అని తెలుస్తుంది.
Level-2 లోని 2, 3 ప్రశ్నలు Level-1 లోనివే — పైన జవాబులు చూడండి.
Mission March Telugu Slip Test 11 (26.10.2026) — రాజధర్మం, హనుమంతుడు జవాబులు
Level-1 (Rising Star)
1. మన స్వప్నం సాకారం కావడానికి బాగా కృషిచేయాలి. (గీత గీసిన పదానికి సరైన అర్థం)
అ) గురువు ఆ) కల ఇ) ప్రణాళిక ఈ) అభిరుచి [1]
జవాబు చూడండి
2. క్షితిని పాలించువాడు రాజు. (సరైన పర్యాయ పదాలు)
అ) నేల, భూమి ఆ) ధరణి, మజ్జగ ఇ) సమూహం, మంద ఈ) ఆజ్ఞ, శాస్త్రం [1]
జవాబు చూడండి
3. భారత దేశము శక్తి అందరికి తెలిసింది. (వికృతి పదం)
అ) సత్తువ ఆ) సుత్తి ఇ) భువి ఈ) కవి [1]
జవాబు చూడండి
4. యుగంధరుడు గొప్ప మంత్రి. (వ్యుత్పత్త్యర్థం)
అ) స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు ఆ) పురమునకు హితము చేయువాడు ఇ) అన్నిటినీ తెలిసినవాడు ఈ) రహస్యమున కార్యాలోచనము కలవాడు [1]
జవాబు చూడండి
5. రాజధర్మం కవి గురించి రాయండి. [4 మా]
జవాబు చూడండి
• సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల్లో పండితుడు. సంస్కృతంలో మదాలస చరిత్ర, సత్యవధూప్రీణనము, జ్ఞానచింతామణి, రసమంజరి అనే కావ్యాలు రాశారు. తెలుగులో రాసినది “ఆముక్తమాల్యద” ప్రబంధం.
• అష్టదిగ్గజ కవులను పోషించారు. ఆయన కాలాన్ని తెలుగు సాహిత్యంలో “ప్రబంధయుగం” అంటారు.
• బిరుదులు: సాహితీసమరాంగణ సార్వభౌముడు, మూరురాయర గండడు, ఆంధ్రభోజుడు.
• చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరిగి వారి జీవితాలను దగ్గరగా చూసినందువల్ల, ఆయన రచనల్లో సామాన్యుల జీవితంలోని చిన్న సంగతులు కూడా అందమైన వర్ణనలుగా కనిపిస్తాయి.
• మన పాఠం ఆముక్తమాల్యద చతుర్థాశ్వాసం నుంచి తీసుకున్నది. ప్రక్రియ: ప్రబంధం.
6. హనుమంతుడు పాత్ర స్వభావం రాయండి. [4 మా]
జవాబు చూడండి
7. యామునాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి. [8 మా]
జవాబు చూడండి
1. ప్రజల రక్షణ: ఎంత కష్టంలో ఉన్నా విసుగు లేకుండా ఆపదలో వచ్చినవారి మొర విని బాధ తీర్చాలి. ముఖ్యమైన బాధ్యతలు దుష్టులకు ఇవ్వకూడదు.
2. సేవకుల విషయం: ఒకసారి గొప్ప స్థానం ఇచ్చినవాడిని తర్వాత తగ్గిస్తే అతను ద్వేషిస్తాడు; అందుకే స్థాయిని క్రమంగా పెంచాలి. చాడీలు విని వెంటనే ఎవరినీ తొలగించకూడదు, నిజానిజాలు పరీక్షించాలి.
3. మంత్రి ఎంపిక: గుణహీనుణ్ణి మంత్రిగా పెట్టుకోవడం గుమ్మడికాయంత ముత్యాన్ని మోసినట్టు — భరించలేని భారం. తగిన మంత్రి దొరకకపోతే రాజే స్వయంగా పనులు చూసుకోవాలి.
4. అధికారులు: ఏ పనీ ధనంతో మాత్రమే కాదు; అధికారులకు తగిన జీతం ఇవ్వాలి, వారిపట్ల పిసినారితనం, క్రూరత్వం చూపకూడదు.
5. ప్రజాసంక్షేమం: దేశాన్ని విశాలం చేసి, చెరువులు, కాలువలు తవ్వించాలి; పేదల పన్నులు తగ్గించాలి. కరువులో దేశం విడిచిన ప్రజలను రప్పించి ఆదుకోవాలి. వాళ్ళ ఆస్తులను దోచుకునే అధికారులు శవాలను పీక్కుతినే నక్కల వంటివారు.
6. జ్ఞానం: తెలుసుకోవలసిన విషయాల్లో ముప్పాతిక భాగం స్వయంగా, మిగిలిన పావు భాగం ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి.
7. జాగరూకత, సహనం: ఎలుగుబంటిలా ఒక కన్ను తెరిచి నిద్రించేంత అప్రమత్తంగా ఉండాలి. గురి కుదిరేదాకా బాణం వదలని విలుకాడిలా, తగిన సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచి అపరాధిని శిక్షించాలి.
8. అనుచరులు: హితులు, హితాహితులు, అహితులు అనే మూడు రకాల వారిని గుర్తించి నేర్పుగా వ్యవహరించాలి. నిజాయితీగా పనిచేసే సేవకుణ్ణి అతను ఊహించనంతగా అకస్మాత్తుగా సత్కరించాలి.
ఈ నీతులు నేటి పాలకులకూ, ఏ సంస్థ నాయకునికైనా వర్తిస్తాయి.
(లేదా)
సీతాన్వేషణ వృత్తాంతం రాయండి. [8 మా]
జవాబు చూడండి
• త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరి, రాత్రి పిల్లి ప్రమాణంలో శరీరాన్ని కుదించుకుని లోపలికి వెళ్ళాడు. అడ్డగించిన లంకాధిదేవత లంకిణిని ఎడమచేతి దెబ్బతో పడగొట్టాడు. బ్రహ్మ వరం గుర్తుచేసుకుని ఆమె లంకలోకి వెళ్ళమంది.
• రావణుని అంతఃపురంలో మండోదరిని చూసి సీత అనుకుని కొద్దిసేపు సంతోషించాడు; రాముణ్ణి విడిచిన సీత ఇలా ఉండదని వెంటనే తన తప్పు గ్రహించాడు.
• ఎక్కడా సీత కనిపించక నిరాశపడ్డాడు; “బతికి ఉంటే శుభాలు పొందవచ్చు” అని ధైర్యం తెచ్చుకుని అశోకవనానికి వెళ్ళాడు. శింశుపా వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్య కృశించిన స్త్రీని చూసి, ఆమె ఆభరణాలు ఋష్యమూకంపై పడిన నగలతో సరిపోలడం చూసి ఆమె సీతే అని నిశ్చయించుకున్నాడు.
• రావణుడు వచ్చి సీతను బెదిరించి రెండు నెలల గడువు పెట్టాడు. త్రిజట తనకు వచ్చిన కలను చెప్పి రాక్షస స్త్రీలను అదలించింది.
• హనుమంతుడు చెట్టుపై నుంచి రామకథ వినిపించాడు. తాను రామదూతనని చెప్పి, శ్రీరాముని రూపగుణాలు వివరించి, రాముని ఉంగరం ఇచ్చాడు. సీత పరమానందపడింది.
• తన వీపుపై కూర్చుంటే రాముని దగ్గరకు తీసుకువెళ్తానన్నాడు; పరపురుషుని తాకనని, రావణుని సంహరించి రాముడే తీసుకువెళ్ళడం ఆయన స్థాయికి తగినదని సీత నిరాకరించింది. గుర్తుగా కాకాసురుని కథ చెప్పి, తన చూడామణిని ఇచ్చింది.
• తిరిగి వచ్చి “చూశాను సీతమ్మను” అని హనుమంతుడు వానరులకు, తర్వాత శ్రీరామునికి చెప్పి చూడామణిని సమర్పించాడు.
Level-2 (Shining Star)
1. రాజధర్మం కవి గురించి రాయండి. [4 మా] — Level-1 లోని 5వ ప్రశ్నే; పైన జవాబు చూడండి.
ళ్లెఱుఁగక మోచినట్టిపని కిష్టసుహృత్తతి దెల్పఁ నొక్క పా
లెఱుఁగ నగు న్న యాఢ్యమతి నిట్లు నిరాగ్రహుఁడైనఁ జేయు నె
త్తఱి విపదుగ్రదండ పరతంత్రుఁడు గాక చిరంబు రాజ్యమున్
2. పై పద్యానికి ప్రతిపదార్థం రాయండి. (రాజధర్మం, 8వ పద్యం — చంపకమాల) [8 మా]
జవాబు చూడండి
అవనీశుఁడు = రాజు
ఎఱుఁగన్ అగున్ = తెలుసుకోవలసిన విషయాలలో
నాలుగు పాళ్లన్ = నాలుగు భాగాలలో
మూఁడు పాళ్లు = మూడు భాగాలను
స్వశక్తిన్ = తన సొంత శక్తితోనే (తెలుసుకోవాలి)
ఎఱుఁగక మోచినట్టి పనికిన్ = తనకు తెలియక మిగిలిపోయిన విషయంలో
ఇష్ట సుహృత్ తతి = ఆప్తులైన మిత్రుల సమూహం
తెల్పన్ = చెప్పగా
ఒక్క పాలు = ఒక్క భాగాన్ని (పావు భాగాన్ని)
ఎఱుఁగన్ అగున్ = తెలుసుకోవాలి
ఇట్లు = ఈ విధంగా
నయ ఆఢ్యమతి = నీతితో నిండిన బుద్ధి కలవాడై
నిరాగ్రహుఁడు ఐనన్ = పట్టుదల (తన ఇష్టమే జరగాలనే అహం) లేనివాడైతే
ఏ తఱిన్ = ఏ సమయంలోనైనా
విపత్ = ఆపదలకు
ఉగ్రదండ = కఠినమైన దండనలకు
పరతంత్రుఁడు కాక = లోబడకుండా
చిరంబు = చాలాకాలం
రాజ్యమున్ = రాజ్యాన్ని
చేయున్ = పాలిస్తాడు
భావం: రాజు ఎప్పుడూ నీతిమార్గం విడవకూడదు. తెలుసుకోవలసిన విషయాల్లో ముప్పాతిక భాగం స్వయంగా, మిగిలిన పావు భాగం ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. అప్పుడు అతడు నీతిపరుడవుతాడు; తన ఇష్టప్రకారమే అంతా జరగాలనే అహాన్ని విడిచిపెడతాడు. ఆపదలు వచ్చినప్పుడు పారిపోడు, సేవకులను తీవ్రంగా శిక్షించడు. అలాంటి పాలకుడు చాలాకాలం సుఖంగా రాజ్యమేలుతాడు.
గమనిక: ప్రతిపదార్థంలో పదాల క్రమం మీ ఉపాధ్యాయులు చెప్పిన విధంగా కొద్దిగా మారవచ్చు; భావం మాత్రం ఇదే.
3. యామునాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి. [8 మా] — Level-1 లోని 7వ ప్రశ్నే; పైన జవాబు చూడండి.
Mission March Telugu Slip Test 13 (23.11.2026) — యుద్ధ విజేత, కన్యాశుల్కం జవాబులు
Level-1 (Rising Star)
1. పాటలు అంటే పిల్లలు చెవికోసుకుంటారు. (వాక్యంలో జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి) [2]
జవాబు చూడండి
అర్థం: ఏదైనా అంటే అమితమైన ఇష్టం, ఆసక్తి చూపడం.
ఉదా: క్రికెట్ అంటే మా తమ్ముడు చెవికోసుకుంటాడు.
2. చర్మం చెప్పులు కుట్టించి ఇచ్చినప్పటికీ అతని ఋణం తీరదని రిషిత్ అన్నాడు. (జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి) [2]
జవాబు చూడండి
అర్థం: ఎంత ప్రత్యుపకారం చేసినా తీర్చుకోలేనంత గొప్ప మేలు పొందడం; అపారమైన కృతజ్ఞత చెప్పడానికి వాడతారు.
ఉదా: తల్లిదండ్రులకు చర్మం చెప్పులు కుట్టించి ఇచ్చినా వారి ఋణం తీరదు.
3. యుద్ధ విజేత పాఠ్యభాగ కవిని గురించి వివరించండి. [4 మా]
జవాబు చూడండి
• తల్లిదండ్రులు శాంతకుమారి, సత్యం.
• రచనలు: పాలకంకి, దళితవానీలు, అన్నంగిన్నె, భీంపాలరాగం, పుట్టినరోజు ఒక్కటే, బౌద్ధభాషితాలు, బుద్ధిజం–శాస్త్రీయత, నాభూమికి నేనే, సమతావసంత గానం, పిల్లలకోసం అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర.
• విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు.
• మన పాఠం “సమతావసంతగానం” కవితా సంపుటి నుంచి తీసుకున్నది. ప్రక్రియ: వచన కవిత.
4. కన్యాశుల్కం నాటకం ప్రక్రియ గురించి వివరించండి. [4 మా]
జవాబు చూడండి
• సమస్త సాహిత్య ప్రక్రియల సమాహారం నాటకం. ఇతర ప్రక్రియల లక్షణాలు ఇందులో ఇమిడిపోవడం వల్ల నాటకానికి అగ్రస్థానం వచ్చింది.
• నటుల చేత ప్రదర్శింపబడేది నాటకం. నాటకంలో నాలుగు నుంచి పది వరకు అంకాలు ఉంటాయి.
• సంభాషణలకు, అభినయానికి, నటుల హావభావ ప్రదర్శనకు అవకాశం ఉంటుంది. రసపోషణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
• కన్యాశుల్కం గురజాడ అప్పారావు రాసిన నాటకం; మన పాఠం దాని ద్వితీయాంకం మొదటి భాగం. నిరక్షరాస్యులను సైతం ఆకట్టుకుని ఆలోచింపజేసే ప్రక్రియ నాటకమని భావించి గురజాడ ఈ రూపాన్ని ఎంచుకున్నారు.
5. యుద్ధాల వలన వచ్చే నష్టాలను, శాంతి వలన చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి. [8 మా]
జవాబు చూడండి
| యుద్ధాల వల్ల వచ్చే నష్టాలు | శాంతి వల్ల చేకూరే ప్రయోజనాలు |
|---|---|
| వేలాది మంది ప్రాణాలు పోతాయి; మనిషికి మనిషే శత్రువు అవుతాడు | ప్రాణాలు నిలుస్తాయి; మనుషుల మధ్య సోదరభావం పెరుగుతుంది |
| పసిపిల్లల చిరునవ్వులు చెరిగిపోతాయి; అనాథలు, శరణార్థులు పెరుగుతారు | పిల్లలు భయం లేకుండా చదువుకుని ఎదుగుతారు |
| పచ్చని నేల రక్తపంకిలం అవుతుంది; బాంబులతో భూమి నాశనమవుతుంది | భూమి పచ్చగా, నివాసయోగ్యంగా ఉంటుంది |
| పూలు, పక్షులు, నెమళ్ళు, జింకలు — సకల ప్రకృతి ధ్వంసమవుతుంది | ప్రకృతి, జీవరాశులు సురక్షితంగా ఉంటాయి |
| ధనమంతా ఆయుధాలకు ఖర్చవుతుంది; దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది | ఆ ధనం విద్య, వైద్యం, వ్యవసాయం, అభివృద్ధికి వినియోగమవుతుంది |
| ద్వేషం, భయం, అశాంతి పెరుగుతాయి | ప్రజలు ప్రశాంతంగా, సుఖంగా జీవిస్తారు; దేశాల మధ్య స్నేహం పెరుగుతుంది |
ముగింపు: యుద్ధంలో గెలవడం వీరత్వం కాదు, యుద్ధాన్నే గెలవడం నిజమైన విజయం. కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపపడి యుద్ధాలు మానేసిన అశోకుడు, రాజ్యభోగాలు త్యజించి యుద్ధాన్నే గెలిచిన బుద్ధుడు దీనికి ఉదాహరణలు.
Level-2 (Shining Star)
1. ప్రణాళికా బద్ధంగా చదివితే విజయం తథ్యం. (సరైన అర్థం)
అ) నిజం ఆ) అబద్ధం ఇ) తప్పదు ఈ) నిర్ణయం [1]
జవాబు చూడండి
2. సమరంలో సైనికులు పోరాడుతూ ప్రాణత్యాగం చేశారు. (పర్యాయపదాలు)
అ) మరణం, రణం ఆ) యుద్ధం, రణం ఇ) సామరస్యం, పోరాటం ఈ) శిక్షణ, రక్షణ [1]
జవాబు చూడండి
3. విక్రముడు ఏడుదీవులు దాటి వెళ్ళాడు. (విగ్రహ వాక్యం)
అ) ఏడు అనే దీవులు ఆ) ఏడు సంఖ్య గల దీవులు ఇ) ఏడు కొరకు దీవులు ఈ) ఏడ్చేటు వంటి దీవులు [1]
జవాబు చూడండి
4. ఆ కప్పు ఖాళీగా ఉంది. (వ్యతిరేకార్థక వాక్యంగా మార్చండి) [1]
జవాబు చూడండి
5. యుద్ధ విజేత పాఠ్యభాగ కవిని గురించి వివరించండి. [4 మా]
జవాబు చూడండి
6. కన్యాశుల్కం నాటక నేపథ్యం గురించి వివరించండి. [4 మా]
జవాబు చూడండి
పాఠం నేపథ్యం: అగ్నిహోత్రావధాన్లు, వెంకమ్మల కొడుకు వెంకటేశం ఇంగ్లీష్ చదువు కోసం విజయనగరంలో ఉంటాడు. పరీక్ష తప్పి సెలవుల్లో ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలా అని బాధపడుతుంటే, అతని ప్రైవేట్ మాస్టారు గిరీశం భరోసా ఇస్తాడు. సెలవుల్లో చదువు చెప్పే నెపంతో వెంకటేశంతో పాటు అతని ఊరికి వెళ్తాడు. ఆ తర్వాతి సన్నివేశమే మన పాఠం.
7. యుద్ధాల వలన వచ్చే నష్టాలను, శాంతి వలన చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి. [8 మా] — Level-1 లోని 5వ ప్రశ్నే; పైన పట్టిక చూడండి.
Mission March Telugu Slip Test 14 (30.11.2026) — సూక్తి సుధ, సుందర–యుద్ధ కాండల జవాబులు
అధికారిక PDF లో లఘు పరీక్ష 14 కు రెండు పేపర్లు ఉన్నాయి. రెండింటిపైనా “LEVEL-1 : RISING STAR” అనే ఉంది. పేజీ 75 పేపర్‌ను “పేపర్ 1” గా, పేజీ 76 పేపర్‌ను “పేపర్ 2” గా ఇచ్చాం. మీ పాఠశాలలో ఏది ఇచ్చినా జవాబులు ఇక్కడే ఉన్నాయి.
పేపర్ 1 (PDF పేజీ 75)
1. విభీషణుడు పాత్ర స్వభావం వివరించండి. [4 మా]
జవాబు చూడండి
• హితవు చెప్పేవాడు: “సీతను అపహరించి తెచ్చావు, పాపం వస్తుంది; కీర్తి, ఆయుష్షు తగ్గుతాయి. సీతను రామునికి అప్పగించడమే మేలు” అని రావణునికి నిర్భయంగా చెప్పాడు. “సుఖాలను దూరం చేసే హితవు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు” అయింది.
• సహనం, ధర్మనిష్ఠ: రావణుడు తీవ్రంగా నిందించినా అన్న, తండ్రితో సమానుడని సహించాడు; కానీ అధర్మ మార్గాన్ని మాత్రం సమర్థించలేదు. ధర్మం కోసం రావణుణ్ణి వీడి నలుగురు అనుచరులతో శ్రీరాముని శరణు కోరాడు.
• సహాయకుడు: రాముడు వెంటనే సముద్రజలం తెప్పించి అతణ్ణి లంకారాజుగా అభిషేకింపజేశాడు. సముద్రుణ్ణి ప్రార్థించమని సూచించాడు; వానర రూపంలో వచ్చిన శుకసారణులను గుర్తుపట్టాడు; ఇంద్రజిత్తు చంపినది మాయాసీత అని తెలిపి అందరినీ ఊరడించాడు; బ్రహ్మాస్త్రానికి వానరసైన్యం కూలినప్పుడు ధైర్యం చెప్పాడు.
• బంధుప్రేమ: రావణుడు మరణించాక బాధపడ్డాడు; రాముని అనుమతితో అన్నకు ఉత్తరక్రియలు చేశాడు.
దీనిని బట్టి విభీషణుడు ధర్మపరుడు, సత్యవాది, శరణాగతుడు, కృతజ్ఞత గలవాడు అని తెలుస్తుంది.
2. అ) మానవులకు సహజంగా ఉండే లక్షణం ఏమిటి? [2]
జవాబు చూడండి
ఆ) ఎలాంటి తత్త్వం మంచిది కాదు? [2]
జవాబు చూడండి
ఇ) మానవులకు సద్గతి ఎలా కలుగుతుంది? [2]
జవాబు చూడండి
ఈ) గద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారుచేయండి. [2]
జవాబు చూడండి
1. ఏది పనికి రాదు?
2. ఈ గద్యంలోని ప్రబోధం ఎవరిది?
3. ఏది అవసరం అని గద్యం చెబుతోంది?
3. లంకాదహనం వృత్తాంతాన్ని వివరించండి. [8 మా]
జవాబు చూడండి
• ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మ వరం వల్ల అది క్షణకాలమే పనిచేస్తుందని తెలిసినా, రావణుని ముందుకు వెళ్ళడానికి కట్టుబడినట్లు నటించాడు.
• రావణుని సభలో తాను రామదూతనని చెప్పి, శ్రీరాముని పరాక్రమాన్ని చాటాడు. రావణుడు చంపమని ఆజ్ఞాపిస్తే, “దూతను చంపడం భావ్యం కాదు” అని విభీషణుడు అడ్డుకున్నాడు.
• హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా తిప్పమన్నాడు రావణుడు. బట్టలు చుట్టి నూనెలో తడిపి నిప్పుపెట్టారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి, విభీషణుని భవనం తప్ప లంకంతా కాల్చేశాడు. అందుకే “సీతను చూసిరమ్మంటే లంకను కాల్చివచ్చాడు” అనే సామెత పుట్టింది.
• తోకలోని మంటను సముద్రంలో చల్లార్చుకున్నాక, లంకతో పాటు సీతమ్మ కూడా కాలిపోయిందేమోనని బాధపడ్డాడు; కోపం అనర్థదాయకమని తనను తాను నిందించుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారణుల మాటల ద్వారా తెలుసుకుని ఊరట చెందాడు.
• మళ్ళీ సీతమ్మకు పాదాభివందనం చేసి, ఆమె అనుమతితో అరిష్ట పర్వతం ఎక్కి తిరుగు ప్రయాణమయ్యాడు.
పేపర్ 2 (PDF పేజీ 76)
1. అన్నమయ్య తెలుగు పదకవిత్వానికి ఆద్యుడు. (సరైన అర్థం)
అ) మూడవవాడు ఆ) మొదటివాడు ఇ) చివరివాడు ఈ) రెండవవాడు [1]
జవాబు చూడండి
2. మానవ జీవితాన్ని చింత కృంగదీస్తుంది. (పర్యాయపదాలు)
అ) దిగులు, బెంగ ఆ) మనస్సు, హృదయం ఇ) బుద్ధి, మతి ఈ) ఇంద్రియజ్ఞానం, విసుగు [1]
జవాబు చూడండి
3. తిరమయిన ఆలోచనలు జీవితానికి వరముగా మారతాయి. (ప్రకృతి పదం)
అ) స్తిరం ఆ) స్థిరం ఇ) తిమిరం ఈ) తీరం [1]
జవాబు చూడండి
4. పాలకడలిని మథించి సుధ ను పొందారు. (నానార్థాలు)
అ) పాలు, అమృతం ఆ) సముద్రం, సాగరం ఇ) దేవతలు, రాక్షసులు ఈ) నీరు, జలం [1]
జవాబు చూడండి
5. పరమాత్ముడు సర్వాంతర్యామి. (విడదీసి గుర్తించండి)
అ) పర + ఆత్ముడు ఆ) పరమా + అత్ముడు ఇ) పరమ + ఆత్ముడు ఈ) ప + రాత్ముడు [1]
జవాబు చూడండి
6. అవివేకితో స్నేహం తెలివైన శత్రువు కంటే ప్రమాదం. (విగ్రహ వాక్యం)
అ) వివేకం కలవారు ఆ) వివేకం లేనివారు ఇ) వివేక వంతులు ఈ) విజ్ఞానము లేని వారు [1]
జవాబు చూడండి
తన మానినిఁ బ్రేమ? తనకు దక్కితిననుమా
ననుమానక దయ దనరం
దనరంతలు మాని నరసధవు రమ్మనవే.
7. పద్యంలోని అలంకారాన్ని గుర్తించి, పేరు రాయండి. [2 మా]
జవాబు చూడండి
లక్షణం: పద్యంలో ఒక పాదం చివర విడిచిన (ముక్త) పదాన్ని తర్వాతి పాదం మొదట మళ్ళీ గ్రహిస్తే (గ్రస్త) అది ముక్తపదగ్రస్తాలంకారం.
సమన్వయం: మొదటి పాదం చివర “…తనమా”, రెండో పాదం మొదట “తన మా…”; రెండో పాదం చివర “…ననుమా”, మూడో పాదం మొదట “ననుమా…”; మూడో పాదం చివర “దనరం”, నాలుగో పాదం మొదట “దనరం…”.
8. విభీషణుడు పాత్ర స్వభావం వివరించండి. [4 మా]
జవాబు చూడండి
9. అన్నమయ్య సంఘ సంస్కరణాభిలాషను గురించి రాయండి. [8 మా]
జవాబు చూడండి
• కుల, మత భేదాలు వద్దు: కులం, జాతి, మతాలకు ప్రాధాన్యం లేదన్నారు. స్వార్థపరులు భేదాలు కల్పించి సుఖమయ జీవితాల్లో చిచ్చు పెడతారని, నిజాన్ని గుర్తించినవాడే మహాత్ముడని చెప్పారు.
• సర్వసమానత్వం: “నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే, అండనే బంటు నిద్రయు నొకటే” — రాజుకూ బంటుకూ నిద్ర ఒకటే, ఏనుగు మీదా కుక్క మీదా పడే ఎండ ఒకటే అని దేవుని సృష్టిలో అందరూ సమానమే అని చాటారు.
• పరనింద, ఆత్మప్రశంస వద్దు: తనలో దోషాలున్నా ఇతరులను దూషించడం తప్పని, బుద్ధి స్థిరంగా ఉండాలని బోధించారు.
• పరధనాపేక్ష వద్దు: కష్టపడి సంపాదించిన ధనమే మంచిది; దోపిడీ మార్గం తప్పు అన్నారు.
• ఆత్మాభిమానం: పొట్టకూటి కోసం ఇతరులను కొలవడం, యాచించడం కంటే హీనమైనది లేదన్నారు.
• సోమరితనం, అసూయ వద్దు: సోమరులను, పరుల సొమ్ముపై ఆశపడేవారిని గర్హించారు. ఈర్ష్య, ద్వేషం, అసూయ వదిలేయాలని, ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు.
• అరిషడ్వర్గాల జయం: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అంతశ్శత్రువులను ఆత్మనిగ్రహంతో జయించాలన్నారు.
ఇలా సామాన్యులకు అర్థమయ్యే తెలుగు మాటల్లో నీతిని బోధించి, సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలని ప్రయత్నించిన ప్రజాకవి అన్నమయ్య.
(లేదా)
రామ రావణ యుద్ధాన్ని వివరించండి. [8 మా]
జవాబు చూడండి
• చివరి అంకం: కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మరణించాక రావణుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. విభీషణుని చంపడానికి ప్రయోగించిన శక్తిని లక్ష్మణుడు అడ్డుకోగా అది లక్ష్మణుని రొమ్ముకు నాటుకుంది. రాముడు దాన్ని లాగి విరిచేశాడు. హనుమంతుడు తెచ్చిన ఓషధులతో లక్ష్మణుడు లేచాడు.
• ఇంద్రుని రథం: ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో వచ్చాడు. రాముడు ఆ రథం ఎక్కి యుద్ధం చేశాడు. యుద్ధం చూడడానికి వచ్చిన అగస్త్యుడు రామునికి “ఆదిత్య హృదయం” ఉపదేశించాడు.
• రావణ సంహారం: రాముని బాణాలకు రావణుని తలలు తెగిపడుతున్నా వెంటనే మళ్ళీ మొలుస్తున్నాయి. “ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానం” అన్నట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానం. మాతలి సూచనతో రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి రావణుణ్ణి సంహరించాడు.
• ముగింపు: విభీషణుడు రావణునికి ఉత్తరక్రియలు చేశాడు. “వ్యక్తులు జీవించి ఉన్నంతవరకే వైరం” అని రాముడు తన విశాల హృదయాన్ని చాటాడు. లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.
Rising Stars, Shining Stars — ఎవరు ఏది రాయాలి
పుస్తకం ప్రారంభ పేజీ ప్రకారం Rising Stars (Level-1) పేపర్ ప్రతి విద్యార్థీ రాయాల్సినది — ప్రత్యేకంగా C, D గ్రేడ్ల వారికి; Shining Stars (Level-2) పేపర్ A, B గ్రేడ్ల వారికి అదనపు సాధన. తెలుగులో రెండు స్థాయిల్లోనూ చాలా ప్రశ్నలు ఒకటే. తేడా ఎక్కువగా ప్రతిపదార్థం, పద్యం–గద్యం ప్రశ్నల్లో కనిపిస్తుంది. పాత్ర స్వభావం ప్రశ్నలో సంఘటనలతో పాటు చివర “దీనిని బట్టి … స్వభావం కలవాడు” అని ముగిస్తే పూర్తి మార్కులు వస్తాయి.
Mission March SSC 2027 Telugu PDF Download
| వివరం | లింక్ | |
|---|---|---|
| అధికారిక Mission March తెలుగు మెటీరియల్ (Phase-I) | తెలుగు (ప్రథమ భాష) — షెడ్యూల్, ప్రశ్నల నిధి, లఘు పరీక్షలు; జవాబులు లేవు; సుమారు 10.7 MB | Download PDF — Mission March SSC 2027 Telugu (అధికారిక) |
ఈ మెటీరియల్ LEAP యాప్‌లో, BSE AP (bse.ap.gov.in) లో కూడా దొరుకుతుంది. సబ్జెక్టుల వారీగా అన్ని స్లిప్ టెస్టుల లింకులకు Mission March SSC 2027 Slip Test Papers PDF – జవాబులతో, రోజువారీ గంట ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి Mission March SSC 2027 PDF – Action Plan చూడండి.
తర్వాత ఏం చదవాలి
- AP 10th Class SA1 Telugu Question Paper 2026-27 — 9 నవంబర్ పరీక్షకు 100 మార్కుల నమూనా పేపర్
- Telugu Slip Test 7 – చేజారిన బాల్యం, అరణ్యకాండ — లఘు పరీక్ష 7 పూర్తి జవాబులు
- AP 10th Class FA2 Telugu Question Paper — FA2 అసలు పేపర్, జవాబులు
గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ స్లిప్ టెస్టుల జవాబుల కోసం: Maths, Physical Science, Biology, Social, English, Hindi. పాఠాల వారీ ప్రశ్నలకు 10th Class Telugu Important Questions and Answers చూడండి.
AP 10th Class Mission March 2027 Telugu — FAQs
Mission March SSC 2027 Telugu మెటీరియల్ ఎవరు విడుదల చేశారు?
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్. Mission March SSC-2027 Action Plan Phase-I లో భాగంగా LEAP యాప్ ద్వారా పాఠశాలలకు అందింది.
Mission March తెలుగు PDF లో ఎన్ని స్లిప్ టెస్టులు ఉన్నాయి?
అధికారిక PDF లో 1 నుంచి 14 వరకు సంఖ్యలు ఉన్నాయి కానీ లఘు పరీక్ష 12 పేపర్ లేదు. కాబట్టి PDF లో ఉన్నవి 13 పేపర్లు.
తెలుగు లఘు పరీక్షలు ఏ రోజుల్లో జరుగుతాయి?
అన్నీ సోమవారాల్లో: 13, 20, 27 జూలై; 10, 17, 24, 31 ఆగస్టు; 7, 21, 28 సెప్టెంబర్; 26 అక్టోబర్; 23, 30 నవంబర్ 2026.
తర్వాతి తెలుగు లఘు పరీక్ష ఎప్పుడు?
లఘు పరీక్ష 13, 23 నవంబర్ 2026 (సోమవారం) — యుద్ధ విజేత, కన్యాశుల్కం. చివరిది లఘు పరీక్ష 14, 30 నవంబర్ — సూక్తి సుధ, సుందరకాండ, యుద్ధకాండ. రెండింటి జవాబులు ఈ పేజీలో ఉన్నాయి.
ప్రతి లఘు పరీక్ష ఎన్ని మార్కులు?
20 మార్కులు, 30 నిమిషాలు. సాధారణంగా బిట్లు లేదా పరిచిత గద్యం, ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 8 మార్కుల వ్యాసరూప ప్రశ్న ఉంటాయి.
SA1 తెలుగు పరీక్షకు ఏ లఘు పరీక్షలు ఉపయోగపడతాయి?
లఘు పరీక్షలు 1 నుంచి 10, లఘు పరీక్ష 11 లోని రాజధర్మం ప్రశ్నలు, లఘు పరీక్ష 13 లోని కన్యాశుల్కం ప్రశ్నలు. సుందరకాండ, యుద్ధకాండ, యుద్ధ విజేత, సూక్తి సుధ SA1 సిలబస్‌లో లేవు.
SA1 తెలుగు పరీక్ష ఎప్పుడు?
28-10-2026 అధికారిక ఉత్తర్వు ప్రకారం పదో తరగతి SA1 తెలుగు పరీక్ష 9 నవంబర్ 2026 (సోమవారం), ఉదయం 9:15 నుంచి 12:30 వరకు.
Level-1, Level-2 లో నేను ఏది రాయాలి?
మీ పాఠశాల మీకు ఏ స్థాయి పేపర్ ఇస్తే అదే. సాధనకు మాత్రం ముందు Level-1 (Rising Stars) ప్రశ్నలన్నీ పూర్తి చేయండి — పబ్లిక్ పరీక్షలో ఎక్కువ మార్కులు ఆ తరహా ప్రశ్నల నుంచే. తర్వాత Level-2 (Shining Stars) లోని ప్రతిపదార్థం, పద్య ప్రశ్నలు అభ్యాసం చేయండి.
లఘు పరీక్ష 14 కు రెండు పేపర్లు ఎందుకు?
అధికారిక PDF లో పేజీ 75, 76 లలో రెండు వేర్వేరు పేపర్లు ఉన్నాయి; రెండింటిపైనా Level-1 అనే ముద్రించారు. ఒకటి Level-2 కోసం అయి ఉండవచ్చు. రెండింటి జవాబులూ ఈ పేజీలో ఇచ్చాం.
“సీతను చూసిరమ్మంటే లంకను కాల్చివచ్చాడు” సామెత ఎలా పుట్టింది?
సుందరకాండలో సీత జాడ తెలుసుకోవడానికి వెళ్ళిన హనుమంతుడు, తన తోకకు రాక్షసులు నిప్పంటించగా విభీషణుని భవనం తప్ప లంకంతా కాల్చేశాడు. ఇచ్చిన పనికి మించి చేయడాన్ని ఈ సామెతతో చెబుతారు.
“సుగ్రీవాజ్ఞ” అనే జాతీయం ఎలా వచ్చింది?
కిష్కింధాకాండలో సుగ్రీవుడు పది రోజుల్లోగా రాని వానరులకు మరణదండన తప్పదని ఆజ్ఞాపించాడు. దానికి తిరుగులేదు. అందుకే తిరుగులేని ఆజ్ఞను “సుగ్రీవాజ్ఞ” అంటారు.
ఈ తెలుగు స్లిప్ టెస్ట్ జవాబులు ఎవరు రాశారు?
బోర్డ్ ఇచ్చిన తెలుగు PDF లో ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, జవాబులు ఉండవు. ఇక్కడి ప్రశ్నలు ఆ PDF నుంచి యథాతథంగా తీసుకున్నవి. జవాబులు 2026-27 పదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకం “తెలుగు పరిమళం” లోని పాఠాలు, ఉపవాచకం చదివి మేము రాసినవి.






