AP 6th Class SA1 Maths Question Paper 2026-27 తో సాధన చేయాలనుకునే ఆరో తరగతి విద్యార్థుల కోసం Ganita Prakash పుస్తకంలోని ఐదు SA1 అధ్యాయాలపై 20 ప్రశ్నలు, దశలవారీ జవాబులు ఇక్కడ ఉన్నాయి. FA2 తర్వాత అక్టోబర్‌లో బోధించే Prime Time (ప్రధాన సంఖ్యలు, కారణాంకాలు, గుణిజాలు) అధ్యాయం ఏ పరీక్షలోనూ ఇంకా రాలేదు; ఈ పేపర్‌లో దానికే 14 మార్కులు పెట్టాం.
పేపర్ ఆకారం ఈ ఏడాది FA1, FA2 లాంటిదే: 20 ప్రశ్నలు, 35 మార్కులు, చివరి 8 మార్కుల ప్రశ్నలో A లేదా B. నవంబర్‌లో అసలు SA1 జరిగిన రోజే దాని జవాబులు ఈ పేజీ పైన కలుపుతాం.
AP 6th Class SA1 Maths Question Paper 2026-27 — ఒక్క పట్టికలో
| అంశం | వివరాలు |
|---|---|
| తరగతి, సబ్జెక్టు | ఆరో తరగతి గణితం — Ganita Prakash |
| పరీక్ష తేదీ | 12 నవంబర్ 2026 (గురువారం), మధ్యాహ్నం 1:15 – 4:15 (అధికారిక టైమ్ టేబుల్) |
| SA1 అధ్యాయాలు | 5 — జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4, అక్టోబర్‌లో Prime Time |
| ఇంకా ఏ పరీక్షలోనూ రానిది | Prime Time |
| SA1 పేపర్ (అధికారిక) | 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8) |
| ఈ సాధన పేపర్ | మొత్తం 20 ప్రశ్నలు | 35 మార్కులు | సమయం 1 గం. 15 ని. |
అధికారిక ఉత్తర్వు వచ్చింది: 28-10-2026 పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు (Rc. No. 3475819/SAT-I/2026-27) ప్రకారం 6వ తరగతి SA1 గణితం పరీక్ష 12 నవంబర్ 2026 (గురువారం), మధ్యాహ్నం 1:15 – 4:15. అసలు పేపర్ 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). ఈ పేజీలోని 20 ప్రశ్నల పేపర్ FA ఆకారంలో (35 మార్కులు) ఉంది — పాఠాల వారీ సాధనకు, అసలు పేపర్‌లోని 1, 2, 4 మార్కుల ప్రశ్నలకు సరిపోతుంది. అధికారిక సిలబస్‌లో ఆరో తరగతి గణితానికి Prime Time తో పాటు Integrated AI కూడా (అక్టోబర్) ఉంది.
6 నుంచి 10 తరగతుల SA1 సమాచారం, అన్ని సబ్జెక్టుల పేజీల లింకులు AP SA1 2026-27 – సిలబస్, టైమ్ టేబుల్, ప్రశ్నపత్రాలు లో ఉన్నాయి.
ఆరో తరగతి SA1 గణితం సిలబస్ — ఏ అధ్యాయానికి ఎంత సాధన
5 అక్టోబర్ FA2 పేపర్ (Exam Code 620) లో మొదటి నాలుగు అధ్యాయాల నుంచే ప్రశ్నలు వచ్చాయి — సంఖ్యా అమరికలు, కోణాలు, పాలిండ్రోమ్‌లు, కమ్మీ రేఖాచిత్రం. Prime Time అక్టోబర్ పాఠం కాబట్టి దానికి FA2 లో చోటు లేదు; SA1 లో మాత్రం తప్పకుండా ఉంటుంది.
| అధ్యాయం | బోధించే నెల | FA2 లో | ఈ పేపర్‌లో మార్కులు |
|---|---|---|---|
| Patterns in Mathematics (సంఖ్యా అమరికలు) | జూన్ – సెప్టెంబర్ | వచ్చింది | 2 |
| Lines and Angles (రేఖలు, కోణాలు) | జూన్ – సెప్టెంబర్ | వచ్చింది | 7 |
| Number Play — అంకెలు, పాలిండ్రోమ్‌లు | జూన్ – సెప్టెంబర్ | వచ్చింది | 2 |
| Data Handling and Presentation (దత్తాంశ నిర్వహణ) | జూన్ – సెప్టెంబర్ | వచ్చింది | 2 (20B తో 10) |
| Prime Time (ప్రధాన సంఖ్యలు) | అక్టోబర్ | రాలేదు | 14 (20A తో 22) |

చార్ట్‌లో ముదురు నారింజ రంగు అధ్యాయం Prime Time — పరీక్షకు ముందు మొదటి నాలుగు రోజులు దానికే.
మొదటి నాలుగు అధ్యాయాల అసలు FA2 ప్రశ్నలు AP 6th Class FA2 Maths Question Paper 2026-27 పేజీలో జవాబులతో ఉన్నాయి. పది అధ్యాయాల పూర్తి జాబితా, సాధనలు AP 6th Class Maths Solutions 2026-27 – Ganita Prakash లో చూడండి.
AP 6th Class SA1 Maths సాధన పేపర్ — 20 ప్రశ్నలు
సూచన: పరీక్ష హాల్‌లోలాగే 1 గంట 15 నిమిషాల్లో రాయండి. చివరి ప్రశ్నలో A లేదా B లో ఒకదానికే జవాబు. ప్రతి ప్రశ్న రాసిన తర్వాత మాత్రమే జవాబు బటన్ తెరవండి.
విభాగం A — ఒక మార్కు ప్రశ్నలు (15)
1. అతి చిన్న ప్రధాన సంఖ్య (prime number) ఏది?
(A) 0 (B) 1 (C) 2 (D) 3 [1 మార్కు]
జవాబు చూడండి
2 కి కారణాంకాలు 1, 2 మాత్రమే. 1 కి ఒకే కారణాంకం ఉంది కాబట్టి అది ప్రధానమూ కాదు, సంయుక్తమూ కాదు. 2 ఒక్కటే సరి ప్రధాన సంఖ్య.
2. కింది వాటిలో పరస్పర ప్రధాన సంఖ్యల (co-prime) జత ఏది?
(A) 12, 18 (B) 15, 25 (C) 8, 15 (D) 14, 21 [1 మార్కు]
జవాబు చూడండి
8 = 2 × 2 × 2, 15 = 3 × 5. 1 తప్ప ఉమ్మడి కారణాంకం లేదు. మిగతా జతలకు 6, 5, 7 ఉమ్మడి కారణాంకాలు.
3. 3 యొక్క గుణిజాలకు “ఇడ్లీ”, 5 యొక్క గుణిజాలకు “వడ” అని చెప్పే ఆటలో “ఇడ్లీ-వడ” అని చెప్పాల్సిన మొదటి సంఖ్య?
(A) 8 (B) 10 (C) 15 (D) 30 [1 మార్కు]
జవాబు చూడండి
3 కీ 5 కీ ఉమ్మడి గుణిజాల్లో అతి చిన్నది 15. తర్వాతి “ఇడ్లీ-వడ” 30, 45…
4. 1 నుంచి 20 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి?
(A) 6 (B) 7 (C) 8 (D) 9 [1 మార్కు]
జవాబు చూడండి
2, 3, 5, 7, 11, 13, 17, 19.
5. 36 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం ఏది?
(A) 4 × 9 (B) 2 × 18 (C) 2 × 2 × 3 × 3 (D) 6 × 6 [1 మార్కు]
జవాబు చూడండి
మిగతావాటిలో 4, 9, 18, 6 ప్రధాన సంఖ్యలు కావు. ప్రధాన కారణాంక లబ్ధంలో అన్నీ ప్రధాన సంఖ్యలే ఉండాలి.
6. 4 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏది?
(A) 1234 (B) 5326 (C) 7516 (D) 9102 [1 మార్కు]
జవాబు చూడండి
చివరి రెండు అంకెల సంఖ్య 4 చే భాగించబడాలి: 16 = 4 × 4. 34, 26, 02 భాగించబడవు.
7. 1, 4, 9, 16, 25, … తర్వాతి సంఖ్య?
(A) 30 (B) 34 (C) 36 (D) 49 [1 మార్కు]
జవాబు చూడండి
వర్గ సంఖ్యలు: 1², 2², 3², 4², 5², తర్వాత 6² = 36.
8. 1 + 3 + 5 + 7 + 9 విలువ?
(A) 20 (B) 24 (C) 25 (D) 30 [1 మార్కు]
జవాబు చూడండి
మొదటి 5 బేసి సంఖ్యల మొత్తం 5 × 5 = 25 — వర్గ సంఖ్య.
9. 120° కోణం ఏ రకం?
(A) లఘు కోణం (B) లంబ కోణం (C) అధిక కోణం (D) సరళ కోణం [1 మార్కు]
జవాబు చూడండి
90° కంటే ఎక్కువ, 180° కంటే తక్కువ.
10. ఒక సరళ కోణంలో ఎన్ని లంబ కోణాలు?
(A) 1 (B) 2 (C) 3 (D) 4 [1 మార్కు]
జవాబు చూడండి
సరళ కోణం 180° = 90° + 90°.
11. కిరణానికి (ray) ఎన్ని అంత్య బిందువులు ఉంటాయి?
(A) 0 (B) 1 (C) 2 (D) అనంతం [1 మార్కు]
జవాబు చూడండి
కిరణం ఒక బిందువు నుంచి మొదలై ఒక దిశలో అనంతంగా సాగుతుంది. రేఖాఖండానికి 2, రేఖకు 0.
12. 4507 అంకెల మొత్తం (digit sum) ఎంత?
(A) 11 (B) 16 (C) 17 (D) 47 [1 మార్కు]
జవాబు చూడండి
4 + 5 + 0 + 7 = 16.
13. అతి చిన్న నాలుగంకెల పాలిండ్రోమ్ ఏది?
(A) 1000 (B) 1001 (C) 1111 (D) 1221 [1 మార్కు]
జవాబు చూడండి
ముందు నుంచి, వెనుక నుంచి ఒకేలా చదవాలి. మొదటి అంకె 0 కాకూడదు కాబట్టి 1001.
14. చిత్రరేఖాచిత్రంలో ఒక బొమ్మ = 10 పుస్తకాలు. నాలుగున్నర బొమ్మలు ఎన్ని పుస్తకాలు?
(A) 40 (B) 45 (C) 50 (D) 4.5 [1 మార్కు]
జవాబు చూడండి
4 × 10 + 5 = 45. సగం బొమ్మ = 5 పుస్తకాలు.
15. కమ్మీ రేఖాచిత్రంలో స్కేలు 1 యూనిట్ = 5 మంది విద్యార్థులు. ఒక కమ్మీ ఎత్తు 7 యూనిట్లు అయితే విద్యార్థులు?
(A) 12 (B) 30 (C) 35 (D) 75 [1 మార్కు]
జవాబు చూడండి
7 × 5 = 35.
విభాగం B — రెండు మార్కుల ప్రశ్నలు (2)
16. 36 యొక్క అన్ని కారణాంకాలు రాయండి. 36 ప్రధాన సంఖ్యా, సంయుక్త సంఖ్యా? [2 మార్కులు]
జవాబు చూడండి
కారణాంకాలు: 1, 2, 3, 4, 6, 9, 12, 18, 36 (మొత్తం 9)
రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 36 సంయుక్త సంఖ్య (composite).
17. కారణాంక వృక్షం (factor tree) తో 84 ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. [2 మార్కులు]
జవాబు చూడండి
42 = 2 × 21
21 = 3 × 7
∴ 84 = 2 × 2 × 3 × 7. సరిచూడండి: 4 × 21 = 84.
విభాగం C — నాలుగు మార్కుల ప్రశ్నలు (2)
18. 30, 60 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యలన్నీ రాయండి. వాటిలో కవల ప్రధానాల (twin primes) జతను గుర్తించండి. [4 మార్కులు]
జవాబు చూడండి
ప్రధాన సంఖ్యలు: 31, 37, 41, 43, 47, 53, 59 (మొత్తం 7)
తేడా 2 ఉన్న ప్రధాన జత: (41, 43)
(29, 31), (59, 61) కూడా కవల ప్రధానాలే, కానీ 29, 61 ఈ పరిధిలో లేవు.
19. గడియారంలో i) 3 గంటలకు ii) 6 గంటలకు iii) 4 గంటలకు గంటల ముల్లు, నిమిషాల ముల్లు మధ్య కోణం ఎంత? ప్రతి కోణం ఏ రకమో రాయండి. [4 మార్కులు]
జవాబు చూడండి
i) 3 గంటలకు 3 భాగాలు: 3 × 30° = 90° — లంబ కోణం
ii) 6 గంటలకు 6 భాగాలు: 6 × 30° = 180° — సరళ కోణం
iii) 4 గంటలకు 4 భాగాలు: 4 × 30° = 120° — అధిక కోణం
విభాగం D — 8 మార్కుల ప్రశ్న: A లేదా B
20. A) i) ఒక బెల్ (bell) ప్రతి 4 నిమిషాలకు, మరో బెల్ ప్రతి 6 నిమిషాలకు మోగుతాయి. ఉదయం 9:00 కి రెండూ కలిసి మోగాయి. మళ్ళీ కలిసి ఎప్పుడు మోగుతాయి? ii) 35, 36 పరస్పర ప్రధాన సంఖ్యలా? కారణం చెప్పండి. iii) 2310 ను 2, 3, 5, 10 భాగిస్తాయా? విభాజ్యత నియమాలతో చెప్పండి.
(లేదా)
B) 30 మంది విద్యార్థుల ఇష్టమైన పండ్లు: మామిడి 12, అరటి 6, ఆపిల్ 8, జామ 4. i) 1 యూనిట్ = 2 మంది స్కేలుతో కమ్మీ రేఖాచిత్రం గీయండి. ii) ఎక్కువ మంది, తక్కువ మంది ఇష్టపడే పండు ఏది? iii) మామిడిని జామ కంటే ఎంత మంది ఎక్కువ ఇష్టపడతారు? [8 మార్కులు]
జవాబు చూడండి
A) ii) 35 కారణాంకాలు: 1, 5, 7, 35. 36 కారణాంకాలు: 1, 2, 3, 4, 6, 9, 12, 18, 36. ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే — అవును, పరస్పర ప్రధానాలు.
A) iii) చివరి అంకె 0: 2, 5, 10 భాగిస్తాయి. అంకెల మొత్తం 2 + 3 + 1 + 0 = 6, ఇది 3 చే భాగించబడుతుంది కాబట్టి 3 కూడా భాగిస్తుంది. నాలుగూ భాగిస్తాయి (2310 = 2 × 3 × 5 × 7 × 11).
B) i) కమ్మీల ఎత్తులు: మామిడి 12 ÷ 2 = 6, అరటి 3, ఆపిల్ 4, జామ 2 యూనిట్లు. అడ్డ అక్షంపై పండ్లు, నిలువు అక్షంపై విద్యార్థులు; కమ్మీల వెడల్పు, మధ్య ఖాళీ సమానంగా ఉండాలి; శీర్షిక, స్కేలు రాయాలి.
B) ii) ఎక్కువ: మామిడి (12). తక్కువ: జామ (4).
B) iii) 12 − 4 = 8 మంది. సరిచూడండి: 12 + 6 + 8 + 4 = 30.
Prime Time కి మరో 7 సాధన ప్రశ్నలు
కొత్త అధ్యాయం కాబట్టి అదనపు ప్రశ్నలన్నీ దీనిపైనే.
| ప్రశ్న | జవాబు |
|---|---|
| 1 ప్రధాన సంఖ్యా? | కాదు. ప్రధాన సంఖ్యకు సరిగ్గా రెండు కారణాంకాలు ఉండాలి; 1 కి ఒక్కటే. |
| 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు? | 25. ఎరటోస్తనీస్ జల్లెడ (Sieve of Eratosthenes) తో 2, 3, 5, 7 గుణిజాలు కొట్టేస్తే మిగిలేవి. |
| అతి చిన్న సంయుక్త సంఖ్య? | 4 (కారణాంకాలు 1, 2, 4). |
| 6, 8 ల మొదటి ఉమ్మడి గుణిజం? | 6, 12, 18, 24; 8, 16, 24. జవాబు 24. |
| 12, 18 ల అతి పెద్ద ఉమ్మడి కారణాంకం? | 12: 1, 2, 3, 4, 6, 12. 18: 1, 2, 3, 6, 9, 18. జవాబు 6. |
| ఒక సంఖ్యను 8 భాగించాలంటే ఏ నియమం? | చివరి మూడు అంకెల సంఖ్య 8 చే భాగించబడాలి. ఉదా: 5120 లో 120 = 8 × 15. |
| రెండు వేర్వేరు ప్రధాన సంఖ్యలు ఎప్పుడూ పరస్పర ప్రధానాలేనా? | అవును. ఒక్కో దానికి 1, అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు; ఉమ్మడిది 1 ఒక్కటే. |
6వ తరగతి SA1 గణితం సాధన పేపర్ PDF
ప్రశ్నలు మొదట, జవాబులు చివరి పేజీల్లో — ప్రింట్ తీసుకుని రాయండి: Download PDF — AP 6th Class SA1 Maths Practice Paper 2026-27
ఆరో తరగతి పిల్లలు ఎక్కువగా చేసే 6 తప్పులు
- 1 ని ప్రధాన సంఖ్యగా లెక్కించడం: 1 ప్రధానమూ కాదు, సంయుక్తమూ కాదు.
- కారణాంకం, గుణిజం తారుమారు: 12 కి 3 కారణాంకం; 3 కి 12 గుణిజం. కారణాంకాలు పరిమితం, గుణిజాలు అనంతం.
- ప్రధాన కారణాంక లబ్ధంలో సంయుక్త సంఖ్యలు: 36 = 4 × 9 అని ఆపేస్తే మార్కు రాదు; 2 × 2 × 3 × 3 వరకు విడదీయాలి.
- కోణం భుజాల పొడవుతో మారుతుందనుకోవడం: కోణం తెరుచుకున్న మేరే ముఖ్యం.
- కమ్మీ రేఖాచిత్రంలో స్కేలు మరవడం: స్కేలు, అక్షాల పేర్లు, శీర్షిక లేకపోతే 8 మార్కుల ప్రశ్నలో కోత.
- పాలిండ్రోమ్‌లో మొదటి అంకె 0: 0110 నాలుగంకెల సంఖ్య కాదు.
12 నవంబర్ గణితం పరీక్షకు ముందు — పది రోజుల ప్లాన్
| రోజు | చదవాల్సింది |
|---|---|
| 1 | Prime Time: కారణాంకాలు, గుణిజాలు, ఉమ్మడి గుణిజాలు (ఇడ్లీ-వడ ఆట) |
| 2 | Prime Time: ప్రధాన, సంయుక్త సంఖ్యలు; ఎరటోస్తనీస్ జల్లెడ 1 – 100 |
| 3 | Prime Time: పరస్పర ప్రధానాలు, ప్రధాన కారణాంకాల లబ్ధం, కారణాంక వృక్షం |
| 4 | Prime Time: 2, 3, 4, 5, 8, 10 విభాజ్యత నియమాలు; పై 7 అదనపు ప్రశ్నలు |
| 5 | Patterns in Mathematics: వర్గ, త్రిభుజ, ఘన సంఖ్యలు; బేసి సంఖ్యల మొత్తం |
| 6 | Lines and Angles: బిందువు, రేఖ, కిరణం, రేఖాఖండం; కోణాల రకాలు, గడియారం కోణాలు |
| 7 | Number Play: అంకెల మొత్తం, పాలిండ్రోమ్‌లు, Kaprekar, Collatz ఆటలు |
| 8 | Data Handling: టాలీ గుర్తులు, చిత్రరేఖాచిత్రం, కమ్మీ రేఖాచిత్రం గీయడం |
| 9 | ఈ పేజీలోని 20 ప్రశ్నల పేపర్ — గడియారం ముందు పెట్టుకుని |
| 10 | తప్పుల సవరణ; FA2 అసలు పేపర్ మళ్ళీ |
FA1 అసలు ప్రశ్నల కోసం AP 6th Class FA1 Maths Answer Key 2026 చూడండి.
FAQs
ఆరో తరగతి SA1 గణితం పరీక్ష తేదీ ఎప్పుడు?
28-10-2026 అధికారిక టైమ్ టేబుల్ ప్రకారం 6వ తరగతి గణితం పరీక్ష 12 నవంబర్ 2026 (గురువారం), మధ్యాహ్నం 1:15 – 4:15. SA1 పరీక్షలు 9 నుంచి 20 నవంబర్ వరకు.
6వ తరగతి SA1 గణితంలో ఎన్ని అధ్యాయాలు?
అధికారిక జాబితా ప్రకారం ఐదు అధ్యాయాలు: Patterns in Mathematics, Lines and Angles, Number Play, Data Handling and Presentation, Prime Time. వీటితో పాటు అక్టోబర్‌లో Integrated AI కూడా జాబితాలో ఉంది.
Prime Time ఎందుకు ముఖ్యం?
అది అక్టోబర్ పాఠం — FA1, FA2 లో ఎక్కడా రాలేదు. SA1 లో కొత్త ప్రశ్నలు దీని నుంచే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
Integrated AI పై రాత ప్రశ్నలు ఉంటాయా?
28-10-2026 అధికారిక సిలబస్‌లో ఆరో తరగతి గణితానికి Integrated AI ఉంది. దాని మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఉత్తర్వులో విడిగా చెప్పలేదు — తరగతిలో చెప్పిన AI భాగాన్ని పుస్తకం నుంచి ఒకసారి చదవండి. ఈ సాధన పేపర్‌లో దానిపై ప్రశ్నలు లేవు.
SA1 పేపర్ ఎన్ని మార్కులకు?
28-10-2026 అధికారిక ఉత్తర్వు ప్రకారం 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). ఈ పేజీలోని సాధన పేపర్ FA ఆకారంలో 20 ప్రశ్నలు, 35 మార్కులు — అసలు పేపర్‌కు ముందు పాఠాల వారీ సాధనకు.
ఈ పేపర్ అసలు SA1 పేపరేనా?
కాదు, సాధన కోసం మేము తయారు చేసింది. పరీక్ష రోజు అసలు పేపర్ జవాబులు ఇక్కడే పెడతాం.
ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య తేడా?
ప్రధాన సంఖ్యకు సరిగ్గా 2 కారణాంకాలు (1, అదే సంఖ్య). సంయుక్త సంఖ్యకు 2 కంటే ఎక్కువ.
పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే?
1 తప్ప ఉమ్మడి కారణాంకం లేని రెండు సంఖ్యలు. ఉదా: 8, 15. ఇవి ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు.
కవల ప్రధానాలు (twin primes) అంటే?
తేడా 2 ఉన్న ప్రధాన సంఖ్యల జత: (3, 5), (5, 7), (11, 13), (41, 43).
గడియారంలో ఒక గంట గుర్తుకు ఎన్ని డిగ్రీలు?
360° ÷ 12 = 30°.
కమ్మీ రేఖాచిత్రం గీసేటప్పుడు ఏమేమి రాయాలి?
శీర్షిక, స్కేలు, రెండు అక్షాల పేర్లు; కమ్మీల వెడల్పు, మధ్య ఖాళీ సమానం.
PDF ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
పైన “Download PDF” లింక్ నొక్కండి. Google Docs నుంచి PDF ఫైల్ నేరుగా దిగుతుంది.
ఆరో తరగతి తెలుగుకు 20 ప్రశ్నల పేపర్: AP 6th Class SA1 Telugu Question Paper 2026-27
Official Sources
SA1 టైమ్ టేబుల్, మార్కుల విధానం, సిలబస్: పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు Rc. No. 3475819/SAT-I/2026-27, తేదీ 28-10-2026 (SCERT సిలబస్ అనుబంధంతో); AP SCERT. నెలవారీ బోధన క్రమం: High School Academic Calendar 2026-27. సబ్జెక్టు వారీ SA1 పాఠాలు AP SA1 Syllabus 2026-27 – Class 1 to 10 లో.






