AP 6th Class SA1 Telugu Question Paper 2026-27 – Answer Key, జవాబులతో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

9 నవంబర్ 2026 SA1 Telugu Answer Key (Key Paper) – పరీక్షలో వచ్చిన అసలు ప్రశ్నపత్రం, జవాబులు (6వ తరగతి, 80 మార్కులు)

ఆరో తరగతి SA1 తెలుగు పరీక్ష 9 నవంబర్ 2026 న జరిగింది. అందులో వచ్చిన 33 ప్రశ్నలు, వాటి జవాబులు ఇక్కడ ఉన్నాయి. మీ జవాబులతో పోల్చి చూసుకోండి.

10 నవంబర్ హిందీ పరీక్ష జవాబులు కూడా వచ్చేశాయి: 6th Class SA1 Hindi అసలు పేపర్ జవాబులు. మిగతా సబ్జెక్టుల జవాబులు, సాధన పేపర్లు AP SA1 2026-27 పేజీలో ఉన్నాయి.

మన సాధన పత్రం నుంచి వచ్చినవి: ఈ పేజీ కింద ఉన్న నమూనా పేపర్‌లోని పింగళి వెంకయ్య (ప్రశ్న 32 ఎ), పొట్టి శ్రీరాములు త్యాగం (32 బి), ఉభయాక్షరాలు (10), ద్విత్వాక్షరం (12), సంయుక్తాక్షరం (13), అమహద్వాచకం – మహద్వాచకం (5), వచనం (6), విరామ చిహ్నాలు (23), ‘మా తెలుగు తల్లికి’ – శంకరంబాడి, జాతీయ ప్రతిజ్ఞ – పైడిమర్రి (24) అసలు పరీక్షలోనూ వచ్చాయి.

విభాగం A – బహుళైచ్ఛిక ప్రశ్నలు (20 × 1 = 20)

పదజాలం (1 – 8)

1. పిల్లలపై అమ్మ చూపే అనురాగమునకు సాటియైనది మరొకటి లేదు. (అర్థం) A) ప్రేమ B) శాంతి C) క్రోధము D) కరుణ

2. రణంలో ప్రాణాలు కోల్పోవడం కంటే, శాంతియుతంగా యుద్ధమును నివారించడమే శ్రేయస్కరం. (సమానార్థక పదాలు) A) రణం, శాంతి B) ప్రాణం, రణం C) రణం, యుద్ధం D) శాంతి, ప్రాణం

3. మనం ఆహారమును వృథా చేయకూడదు. (వికృతి) A) ఓదనము B) ఓగిరము C) అన్నము D) తినే పదార్థము

4. ఎల్లప్పుడూ సత్యమునే పలకాలి. ____ ను పలకరాదు. (వ్యతిరేక పదం) A) అసత్యము B) నిజము C) యథార్థం D) వాస్తవము

5. మహాత్మా గాంధీజీ అహింసా మార్గంలో పోరాడి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారు. (ఏ లింగం) A) అమహద్వాచకం B) మహతీ వాచకం C) అమహతీ వాచకం D) మహద్వాచకం

6. సాంకేతిక రంగంలో భారతీయులు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారు. (వచనం) A) ఏకవచనం B) నిత్య ఏకవచనం C) బహువచనం D) నిత్యబహువచనం

7. పలితుడు ప్రాణభీతి తో గజగజలాడాడు. (విభక్తి) A) ప్రథమా B) తృతీయా C) పంచమీ D) సప్తమీ

8. ధర్మాన్ని పాటించే ఉత్తములు నేరములెన్నడు చేయక ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. (పదవిభజన) A) నేరము + ఎన్నడు B) నెరములే + ఎన్నడు C) నేరములు + ఎన్నడు D) నేరము + లెన్నడు

జవాబులు చూడండి

1. A) ప్రేమ

2. C) రణం, యుద్ధం. రెండింటికీ ఒకటే అర్థం (పోరు).

3. B) ఓగిరము. ఆహారము (ప్రకృతి) – ఓగిరము (వికృతి).

4. A) అసత్యము

5. D) మహద్వాచకం. పురుషులను తెలిపే పదాలు మహద్వాచకాలు.

6. C) బహువచనం. భారతీయుడు (ఏకవచనం) – భారతీయులు (బహువచనం).

7. B) తృతీయా విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ – తృతీయా విభక్తి ప్రత్యయాలు.

8. C) నేరములు + ఎన్నడు (ఉత్వ సంధి).

వర్ణమాల, సంధి (9 – 16)

9. ఉత్వసంధికి సంబంధించిన పదం. A) పట్టెడన్నమె B) ఏమంటివి C) మాయిల్లు D) ఒకానొక

10. సున్న ( ం), అరసున్న ( ఁ), విసర్గ ( ః) లను ఏమంటారు? A) ఊష్మాలు B) ఉభయాక్షరాలు C) సరళాలు D) పరుషాలు

11. మూర్ధన్యాక్షరం కలిగిన పదం. A) కథ B) చక్రము C) కంఠము D) పింఛము

12. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి రథసారథిగా ఉన్నాడు. ద్విత్వాక్షరం ఉన్న పదం. A) కురుక్షేత్ర సంగ్రామం B) శ్రీకృష్ణుడు C) అర్జునుడు D) ఉన్నాడు

13. అందమైన నెమలి పురివిప్పి నాట్యం చేసింది. సంయుక్తాక్షరం ఉన్న పదం. A) నెమలి B) పురివిప్పి C) నాట్యం D) చేసింది

14. అక్షరదోషం ఉన్న పదం. A) ద్రోహం B) పాణం C) రాట్నం D) పుస్తెలు

15. సొంత లాభం సుంత అయినా మానుకొని పొరుగువారికి తోడుపడాలి. (అర్థం) A) చాలా B) కొంచెం C) పూర్తిగా D) సగం

16. ‘సుధ చెప్పిన వింత కథ అందరికి నచ్చింది.’ ఏ వర్గానికి సంబంధించిన అన్ని అక్షరాలు ఉన్నాయి? A) క B) ప C) త D) ట

జవాబులు చూడండి

9. A) పట్టెడన్నమె = పట్టెడు + అన్నమె. ఉకారానికి అచ్చు పరమైతే సంధి – ఉత్వ సంధి. (ఏమంటివి – ఇత్వ సంధి, మాయిల్లు – యడాగమం.)

10. B) ఉభయాక్షరాలు (సున్న, అరసున్న, విసర్గ).

11. C) కంఠము. ‘ఠ’ – ట వర్గం – మూర్ధన్యాక్షరం (నాలుక చివర అంగిలి పైభాగానికి తాకి పలుకుతుంది).

12. D) ఉన్నాడు. ‘న్నా’ లో ఒకే హల్లు (న) రెండుసార్లు వచ్చింది – ద్విత్వం. క్షే, ష్ణ, ర్జు – సంయుక్తాక్షరాలు.

13. C) నాట్యం. ‘ట్య’ లో ట, య అనే రెండు వేర్వేరు హల్లులు కలిశాయి. (‘ప్పి’ ద్విత్వం.)

14. B) పాణం. సరైన రూపం ‘ప్రాణం’.

15. B) కొంచెం

16. C) ‘త’ వర్గం – త (వింత), థ (కథ), ద (అందరికి), ధ (సుధ), న (చెప్పిన).

అపరిచిత గద్యం – జరద్గవము, దీర్ఘకర్ణము (17 – 20)

17. భాగీరథీ తీరంలో ఏ చెట్టు ఉండేది?

18. గ్రద్ద పక్షి పిల్లలకు కాపలాగా ఉండడానికి కారణం ఏమిటి?

19. పిల్లి చెట్టు వద్దకు ఎందుకు వచ్చింది?

20. ఈ కథలో పిల్లి పాత్ర ద్వారా రచయిత మనకు ఏ విషయాన్ని తెలియజేస్తున్నాడు? A) ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి B) రూపాన్ని చూసి స్నేహం చేయాలి C) చెడ్డవారు మాయమాటలతో మోసం చేయవచ్చు D) పిల్లలు పక్షులతో స్నేహంగా ఉంటాయి

జవాబులు చూడండి

17. B) జువ్విచెట్టు

18. A) పక్షులు దానికి ఆహారం ఇవ్వడం

19. C) పక్షి పిల్లలను తినడానికి

20. C) చెడ్డవారు మాయమాటలతో మోసం చేయవచ్చు. పిల్లి తాను ధర్మాత్ముడినని మాయమాటలు చెప్పి గ్రద్దను నమ్మించింది.

విభాగం B (4 × 2 = 8)

21. సొంతవాక్యాలు రాయండి. అ) ధరణి ఆ) పాఠశాల [2 మార్కులు]

జవాబు చూడండి

అ) ధరణి (భూమి): ధరణిపై ఉన్న చెట్లను కాపాడితేనే మనకు మంచి గాలి దొరుకుతుంది.

ఆ) పాఠశాల (బడి): మా పాఠశాలలో ప్రతి శనివారం మొక్కలకు నీళ్ళు పోస్తాం.

22. జతపరచండి. అ) తెలుగు బాల శతకం ఆ) తెలుగు పూలు శతకం ఇ) దాశరథి శతకం ఈ) వేమన శతకం – 1) కంచర్ల గోపన్న 2) వేమన 3) కరుణశ్రీ 4) నార్ల చిరంజీవి [2 మార్కులు]

జవాబు చూడండి

అ) తెలుగు బాల శతకం – 3) కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి)

ఆ) తెలుగు పూలు శతకం – 4) నార్ల చిరంజీవి

ఇ) దాశరథి శతకం – 1) కంచర్ల గోపన్న (రామదాసు)

ఈ) వేమన శతకం – 2) వేమన

23. విరామ చిహ్నాలు (, .) ఉంచండి: శ్రవణ కుమారుడు ఉత్తముడు అతని తల్లిదండ్రులు వృద్ధులు చూపులేనివారు కావడం వలన శ్రవణుడే వారి కాళ్ళు చేతులు కళ్ళు అయ్యాడు [2 మార్కులు]

జవాబు చూడండి

శ్రవణ కుమారుడు ఉత్తముడు. అతని తల్లిదండ్రులు వృద్ధులు, చూపులేనివారు కావడం వలన శ్రవణుడే వారి కాళ్ళు, చేతులు, కళ్ళు అయ్యాడు.

వాక్యం పూర్తయితే పూర్ణ విరామం (.), వరుసగా వచ్చే పదాల మధ్య స్వల్ప విరామం (,).

24. ఖాళీలు పూరించండి. అ) ‘మా తెలుగుతల్లికి మల్లెపువ్వు దండ’ గేయ రచయిత ____ ఆ) ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ రచయిత ____ [2 మార్కులు]

జవాబు చూడండి

అ) శంకరంబాడి సుందరాచారి

ఆ) పైడిమర్రి వెంకటసుబ్బారావు

విభాగం C (5 × 4 = 20)

25. ‘సమయస్ఫూర్తి’ పాఠ్యభాగ కవిని గురించి రాయండి. [4 మార్కులు]

జవాబు చూడండి

‘సమయస్ఫూర్తి’ పాఠ్యభాగ రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు.

జననం: 1848 ఏప్రిల్ 16న రాజమహేంద్రవరంలో జన్మించారు. 1919 మే 27న మరణించారు.

సంఘసంస్కర్త: బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాలు జరిపించారు. స్త్రీ విద్య కోసం బాలికల పాఠశాలలు స్థాపించారు. ‘వివేకవర్ధని’ పత్రిక నడిపి మూఢనమ్మకాలపై పోరాడారు.

రచనలు: తెలుగులో తొలి నవల ‘రాజశేఖర చరిత్రము’, తొలి స్వీయ చరిత్ర (ఆత్మకథ) రాశారు. పిల్లల కోసం నీతికథలు రాశారు. ‘సమయస్ఫూర్తి’ కథ అలాంటి నీతికథ.

బిరుదులు: ‘గద్య తిక్కన’, ‘ఆంధ్ర సంఘ సంస్కరణోద్యమ పితామహుడు’ అని పిలుస్తారు.

26. కింది పద్యానికి సొంతమాటలలో భావం రాయండి. సిరిగలవాని కెయ్యెడలఁ జేసిన మేలది నిష్ఫలంబగున్ / నెఱిగుఱి గాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్ఫలంబగున్ / వఱపున వచ్చి మేఘుఁడొక వర్షము వాడిన చేల మీఁదటం / గుఱిసినఁ గాక యంబుధులఁ గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా! [4 మార్కులు]

జవాబు చూడండి

భావం: ఓ భాస్కరా! ధనవంతునికి ఎప్పుడు ఏ సాయం చేసినా అది వ్యర్థమే అవుతుంది. పేదవారికి నేర్పుతో చేసిన సాయం మాత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కరువు కాలంలో మేఘం ఎండిపోతున్న పంట పొలాల మీద వర్షం కురిస్తేనే ప్రయోజనం. నీళ్ళతో నిండి ఉన్న సముద్రంలో కురిస్తే ఏం ప్రయోజనం? అలాగే సాయం అవసరం ఉన్నవారికే చేయాలి. (భాస్కర శతకం – మారద వెంకయ్య)

27. అమ్మ మాటలు పిల్లలకు ఎలా ఉపకరిస్తాయి? [4 మార్కులు]

జవాబు చూడండి

అమ్మ బిడ్డకు మొదటి గురువు. అమ్మ ఒడే మొదటి బడి. మనం మాట్లాడే మొదటి మాటలు అమ్మ దగ్గరే నేర్చుకుంటాం. అమ్మ చెప్పే కథలు, పాటలు, పద్యాలు మనకు మంచి చెడులు నేర్పుతాయి. ‘అబద్ధం చెప్పకూడదు, పెద్దలను గౌరవించాలి, ఇతరులకు సాయం చేయాలి’ అనే అమ్మ మాటలు మనకు మంచి అలవాట్లు నేర్పుతాయి. కష్టం వచ్చినప్పుడు అమ్మ ఇచ్చే ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. అమ్మ మాటల్లోని ప్రేమ మనసుకు హాయినిస్తుంది. అందుకే అమ్మ మాటలు పిల్లల జీవితానికి పునాది.

28. ఖాళీలు పూరించండి. అ) సంస్కృత, ప్రాకృత భాషలనుండి పుట్టిన పదాలను ____ అంటారు. ఆ) వాక్యంలో ఒక పదానికి మరొక పదానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపి, వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చే పదాలను / ప్రత్యయాలను ____ అంటారు. ఇ) పూర్వ పర స్వరములకు ____ ఏకాదేశంబగుట సంధి యనంబడు. ఈ) వర్గ ద్వితీయాక్షరాలు మరియు వర్గ చతుర్థాక్షరాలను ____ అంటారు. [4 మార్కులు]

జవాబు చూడండి

అ) తత్సమాలు

ఆ) విభక్తులు (విభక్తి ప్రత్యయాలు)

ఇ) పరస్వరం

ఈ) మహాప్రాణాలు (ఉదా: ఖ, ఘ, ఛ, ఝ)

29. విలువల విద్యలోని పద్యము: అన్ని దానములను నన్నదానమె గొప్ప / కన్నతల్లికంటె ఘనము లేదు / ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా / విశ్వదాభిరామ వినురవేమ! అ) దానాలన్నిటి కంటే గొప్ప దానము ఏది? ఆ) పై పద్యంలోని మకుటం ఏది? ఇ) పై పద్యంలో గురువు గురించి ఏం చెప్పారు? ఈ) పై పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారుచేయండి. [4 మార్కులు]

జవాబు చూడండి

అ) దానాలన్నిటి కంటే అన్నదానమే గొప్పది.

ఆ) మకుటం: ‘విశ్వదాభిరామ వినురవేమ!’

ఇ) గురువు కంటే గొప్పవారు (ఎక్కువవారు) ఎవరూ లేరని చెప్పారు.

ఈ) కన్నతల్లి గురించి వేమన ఏమి చెప్పారు?

విభాగం D (4 × 8 = 32) – ప్రతి ప్రశ్నలో ఒకదానికే జవాబు రాయాలి

30. ఎ) ‘సుభాషితాలు’ పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి గుణాలు రాయండి. (లేదా) బి) మీరు ఎప్పుడైనా మీ పాఠశాలలో గాని బయట ఎక్కడైనా (ఆసుపత్రిలో గాని / బ్యాంకులో గాని / పోస్టాఫీస్‌లో గాని) ఎవరికైనా సాయం చేశారా? మీ అనుభవాలను మీ మాటల్లో రాయండి. [8 మార్కులు]

జవాబు చూడండి

ఎ) సుభాషితాల నుంచి నేర్చుకున్న మంచి గుణాలు: సుభాషితాలు అంటే మంచి మాటలు. వేమన, భాస్కర, దాశరథి వంటి శతక పద్యాల ద్వారా నేను ఈ మంచి గుణాలు నేర్చుకున్నాను:

1. దానగుణం: దానాలన్నిటిలో అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి.

2. తల్లిదండ్రుల పట్ల గౌరవం: కన్నతల్లి కంటే గొప్పది లేదు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి.

3. గురుభక్తి: గురువు కంటే గొప్పవారు లేరు. ఉపాధ్యాయులను గౌరవించాలి.

4. అవసరంలో ఉన్నవారికి సాయం: ధనవంతునికి చేసే సాయం వ్యర్థం; పేదవారికి చేసే సాయమే ఫలిస్తుంది – వాడిన పొలంపై కురిసే వాన లాగ.

5. నిజాయితీ, వినయం: ఎప్పుడూ నిజమే మాట్లాడాలి, గర్వం లేకుండా వినయంగా ఉండాలి.

ఈ గుణాలను పాటిస్తే మనం మంచి మనుషులుగా ఎదుగుతాం, సమాజం కూడా బాగుపడుతుంది. (పాఠంలో మీకు నచ్చిన ఒక పద్యాన్ని రాసి జవాబు మొదలుపెడితే ఇంకా బాగుంటుంది.)

బి) నమూనా: గత నెల మా అమ్మతో కలిసి పోస్టాఫీస్‌కు వెళ్ళాను. అక్కడ ఒక ముసలి అవ్వ చదువు రాక, ఫారం నింపలేక ఇబ్బంది పడుతోంది. నేను ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె పేరు, ఊరు, ఖాతా వివరాలు అడిగి ఫారం నింపి ఇచ్చాను. వరుసలో నిలబడలేక అలసిపోతుంటే కుర్చీ తెచ్చి కూర్చోబెట్టాను. ఆమె డబ్బు తీసుకున్నాక సంతోషంగా నా తల నిమిరి దీవించింది. ఆ రోజు నాకు ఎంతో తృప్తి కలిగింది. చదువు మనకే కాదు, ఇతరులకు సాయం చేయడానికీ ఉపయోగపడుతుందని తెలుసుకున్నాను. అప్పటి నుంచి అవసరం ఉన్నవారికి చేతనైన సాయం చేస్తున్నాను.

31. ఎ) ‘సమయస్ఫూర్తి’ కథను సొంతమాటలలో రాయండి. (లేదా) బి) ‘తృప్తి’ కథలో పూర్ణయ్య పాత్ర ద్వారా మీరు తెలుసుకున్న విషయాలను వివరించండి. [8 మార్కులు]

జవాబు చూడండి

ఎ) సమయస్ఫూర్తి కథ: ఒక అడవిలో పెద్ద మర్రిచెట్టు ఉండేది. దాని మొదట్లో ఉన్న కన్నంలో పలితుడు అనే ఎలుక నివసించేది. అదే చెట్టుపై ఒక పిల్లి ఉండేది. ఒకరోజు ఒక వేటగాడు పన్నిన వలలో పిల్లి చిక్కుకుంది. అది చూసి ఎలుక సంతోషంగా ఆహారం కోసం బయటకు వచ్చింది. అంతలో కింద ఒక ముంగిస, చెట్టుపై ఒక గుడ్లగూబ తనను పట్టుకోవడానికి కాచుకొని ఉండటం చూసి ఎలుక ప్రాణభీతితో గజగజలాడింది. వెంటనే సమయస్ఫూర్తితో ఒక ఉపాయం ఆలోచించింది. వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి “నువ్వు నన్ను కాపాడితే నేను నీ వల కొరికి నిన్ను విడిపిస్తాను” అని స్నేహం కోరింది. పిల్లి ఒప్పుకుంది. ఎలుక పిల్లి దగ్గర చేరగానే ముంగిస, గుడ్లగూబ నిరాశతో వెళ్ళిపోయాయి. ఎలుక వలను నెమ్మదిగా కొరుకుతూ, వేటగాడు వచ్చే వరకు ఆగింది. వేటగాడు రాగానే చివరి తాడు కొరికింది. పిల్లి ప్రాణభయంతో చెట్టెక్కింది, ఎలుక తన కన్నంలోకి దూరింది. తర్వాత పిల్లి స్నేహంగా రమ్మని పిలిచినా ఎలుక వెళ్ళలేదు. “అవసరం కోసం కుదిరిన స్నేహం అవసరం తీరగానే ముగుస్తుంది; సహజ శత్రువును నమ్మకూడదు” అని చెప్పింది. నీతి: ఆపద వచ్చినప్పుడు కంగారు పడకుండా తెలివిగా ఆలోచిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు.

బి) పూర్ణయ్య పాత్ర నుంచి నేర్చుకున్నవి: ‘తృప్తి’ శంకరమంచి సత్యం గారి ‘అమరావతి కథలు’ నుంచి తీసుకున్న కథ. పూర్ణయ్య ఇతరులకు కడుపు నిండా పెట్టి, వాళ్ళు తృప్తిగా తింటుంటే చూసి తానే తిన్నంత ఆనందం పొందే మనిషి. ఈ పాత్ర ద్వారా నేను తెలుసుకున్నవి: 1. నిజమైన తృప్తి మనం పొందడంలో కాదు, ఇతరులకు ఇవ్వడంలో ఉంటుంది. 2. చేసే పనిని ప్రేమతో, శ్రద్ధగా చేయాలి. 3. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప పుణ్యం. 4. స్వార్థం లేకుండా ఇతరుల సంతోషాన్ని కోరుకోవాలి. 5. డబ్బు కంటే మనసు గొప్పది. (పాఠంలోని ఒక సంఘటనను ఉదాహరణగా జోడించండి.)

32. ఎ) జాతీయజెండా రూపశిల్పి పింగళి వెంకయ్యగారిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. (లేదా) బి) ఆంధ్రరాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములుగారి త్యాగం గురించి సొంతమాటల్లో రాయండి. [8 మార్కులు]

జవాబు చూడండి

ఎ) పింగళి వెంకయ్య: మన జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు. ఆయన కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో ఆగస్టు 2న జన్మించారు. చిన్న వయసులోనే దేశభక్తి కలిగిన ఆయన గాంధీజీ బాటలో నడిచారు. 1921లో విజయవాడ (బెజవాడ)లో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీకి జాతీయ పతాకం నమూనా అందించారు. ఆ నమూనాయే మన మువ్వన్నెల జెండాకు మూలం. ఆయనకు ఎన్నో భాషలు, విషయాలు తెలుసు. జపాన్ భాషలో ప్రసంగం చేసినందుకు ‘జపాన్ వెంకయ్య’, పత్తి రకాలపై పరిశోధన చేసినందుకు ‘పత్తి వెంకయ్య’, వజ్రాల గనుల గురించి తెలిసినందుకు ‘డైమండ్ వెంకయ్య’ అని పిలిచేవారు. ఆయన 1963లో మరణించారు. 2009లో ఆయన పేరుతో, మొదటి జెండాతో తపాలా బిళ్ళ విడుదలైంది. జెండా ఎగిరిన ప్రతిసారీ ఆయనను గుర్తుచేసుకోవాలి.

బి) పొట్టి శ్రీరాములు త్యాగం: పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న జన్మించారు. ఉద్యోగం వదిలి గాంధీజీ సబర్మతీ ఆశ్రమంలో చేరారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. హరిజనుల ఆలయ ప్రవేశం కోసం నిరాహార దీక్షలు చేశారు. ఆ రోజుల్లో తెలుగువారు మద్రాసు రాష్ట్రంలో ఉండేవారు. తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. 58 రోజులు ఏమీ తినకుండా దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న ప్రాణాలు విడిచారు. ఆయన మరణంతో తెలుగు నేల అంతా ఉద్యమం ఎగసింది. ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలుగు జాతి కోసం ప్రాణాలు అర్పించినందుకే ఆయనను ‘అమరజీవి’ అని గౌరవిస్తాం.

33. ఎ) సమయస్ఫూర్తి కథ ఆధారంగా ఎలుక – పిల్లి మాటలను సంభాషణ రూపంలో రాయండి. (లేదా) బి) ఆంగ్లేయులపై భారతీయుడు చేసిన పోరాటాన్ని ప్రశంసిస్తూ ఒక పేరా రాయండి. [8 మార్కులు]

జవాబు చూడండి

ఎ) ఎలుక – పిల్లి సంభాషణ:

ఎలుక: పిల్లి బావా! వలలో చిక్కుకుని బాధపడుతున్నావా?

పిల్లి: అవును ఎలుకా! ఈ వల నుంచి బయటపడే దారి కనిపించడం లేదు. నన్ను కాపాడవూ?

ఎలుక: కింద ముంగిస, పైన గుడ్లగూబ నన్ను తినడానికి కాచుకుని ఉన్నాయి. నువ్వు నన్ను కాపాడితే నేను ఈ వల కొరికి నిన్ను విడిపిస్తాను.

పిల్లి: తప్పకుండా! ఈ రోజు నుంచి నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నా దగ్గరకు రా.

పిల్లి: త్వరగా కొరుకు మిత్రమా! ఎందుకు ఇంత నెమ్మదిగా కొరుకుతున్నావు?

ఎలుక: తొందర వద్దు. వేటగాడు వచ్చే సమయానికి చివరి తాడు కొరుకుతాను. అప్పుడు నువ్వు నన్ను పట్టుకునే సమయం ఉండదు.

(వేటగాడు రాగానే ఎలుక చివరి తాడు కొరికింది. పిల్లి చెట్టెక్కింది, ఎలుక కన్నంలోకి దూరింది.)

పిల్లి: మిత్రమా! నా ప్రాణం కాపాడావు. ఒకసారి నా దగ్గరకు రా, మాట్లాడుకుందాం.

ఎలుక: వద్దు బావా! అవసరం కోసం కుదిరిన స్నేహం అవసరం తీరగానే తీరిపోతుంది. నువ్వు నా సహజ శత్రువువి. దూరం నుంచే నీకు నమస్కారం.

బి) నమూనా పేరా: వందల ఏళ్ళు ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించి మన సంపదను దోచుకున్నారు. పన్నులతో రైతులను పీడించారు, మన చేతివృత్తులను నాశనం చేశారు. అయినా భారతీయులు తలవంచలేదు. గాంధీజీ అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో దేశాన్ని ఒక్కటి చేశారు. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో లక్షలాది మంది జైళ్ళకు వెళ్ళారు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి వీరులు ప్రాణాలు అర్పించారు. గరిమెళ్ళ సత్యనారాయణ ‘మాకొద్దీ తెల్లదొరతనం’ వంటి గేయాలతో ప్రజల్లో పోరాట స్ఫూర్తి నింపారు. ఈ త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ వీరుల పోరాటం ఎప్పటికీ ప్రశంసనీయం; వారు ఇచ్చిన స్వేచ్ఛను కాపాడుకోవడం మన బాధ్యత.

ఈ జవాబులు 2026-27 పాఠ్యపుస్తకం, ఉపాధ్యాయుల వివరణ ఆధారంగా మేము తయారు చేసినవి. మార్కులు మీ ఉపాధ్యాయుల మూల్యాంకనం ప్రకారమే వస్తాయి. మిగతా తరగతుల జవాబుల కోసం AP SA1 2026-27 పేజీ చూడండి.

AP 6th Class SA1 Telugu Question Paper 2026-27 సాధన కోసం ఆరో తరగతి పిల్లలకు తయారు చేసిన 20 ప్రశ్నల పేపర్ ఇది — ప్రతి ప్రశ్నకు జవాబుతో. 5 అక్టోబర్ FA2 తెలుగు పేపర్ (Exam Code 624) లాగే వర్ణమాల, అర్థాలు, వచనం, విరామ చిహ్నాలు, అపరిచిత గద్యం, మహనీయుల పరిచయం, లేఖ ఉన్నాయి. జవాబు సరిపోతే టిక్ పెట్టండి; పేజీ కింద మీ స్కోర్ కనిపిస్తుంది.

9 నవంబర్ SA1 తెలుగు అసలు ప్రశ్నపత్రం జవాబులు ఈ పేజీ పైభాగంలో ఉన్నాయి. మిగతా పరీక్షల జవాబుల సమాచారం ముందుగా కావాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి

ఈ పేజీలో: పరీక్ష వివరం | 9 పాఠాలు | 20 ప్రశ్నలు | మహనీయులు | PDF | పరీక్షకు ముందు ప్లాన్ | FAQs

AP 6th Class SA1 Telugu Question Paper 2026-27 — పరీక్ష వివరం

అంశంఆరో తరగతి
పరీక్ష తేదీ9 నవంబర్ 2026 (సోమవారం), మధ్యాహ్నం 1:15 – 4:15 (28-10-2026 అధికారిక టైమ్ టేబుల్)
SA1 కి పాఠాలుతొమ్మిది — FA2 లోని ఆరు, అక్టోబర్‌లో వచ్చే మూడు
అక్టోబర్‌లో కొత్తవిసుభాషితాలు, పైడిమర్రి వెంకటసుబ్బారావు, శంకరంబాడి సుందరాచారి
SA1 పేపర్ (అధికారిక)80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8)
ఈ సాధన పేపర్20 ప్రశ్నలు; మొత్తం 35 మార్కులు; స్కోర్ ఆటోమేటిక్

అధికారిక ఉత్తర్వు వచ్చింది: 28-10-2026 పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు (Rc. No. 3475819/SAT-I/2026-27) ప్రకారం 6వ తరగతి SA1 తెలుగు పరీక్ష 9 నవంబర్ 2026 (సోమవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. అసలు పేపర్ 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). అధికారిక సిలబస్‌లోని పాఠాలు ఈ పేజీలోని జాబితాతోనే సరిపోలాయి. ఈ పేజీలోని సాధన పేపర్ FA ఆకారంలో (20 ప్రశ్నలు, 35 మార్కులు) ఉంది — పాఠాల వారీ సాధనకు, అసలు పేపర్‌లోని 1, 2, 4 మార్కుల ప్రశ్నలకు సరిపోతుంది.

అన్ని తరగతుల SA1 సమాచారం ఒకే చోట: AP SA1 2026-27 – సిలబస్, టైమ్ టేబుల్, ప్రశ్నపత్రాలు.

6వ తరగతి SA1 తెలుగు సిలబస్ — తొమ్మిది పాఠాలు

ఆరో తరగతి FA2 సిలబస్‌లో జూన్ నుంచి చెప్పిన ఆరు పాఠాలూ ఉన్నాయి (AP 6th Class FA2 Syllabus 2026-27 చూడండి). కాబట్టి SA1 కి కొత్తగా చదవాల్సింది అక్టోబర్‌లో వచ్చే మూడు పాఠాలే. మిగతా ఆరింటికి FA2 జవాబులు మళ్ళీ చదివితే చాలు.

పాఠంనెలSA1 కోసం
అమ్మఒడిజూన్ – సెప్టెంబర్FA2 లో 20(A) వ్యాసం వచ్చింది
తృప్తిజూన్ – సెప్టెంబర్FA2 లో 20(B) — పూర్ణయ్య
మాకొద్దీ తెల్లదొరతనంజూన్ – సెప్టెంబర్FA2 లో 18 — గరిమెళ్ళ కవి పరిచయం
సమయస్ఫూర్తిజూన్ – సెప్టెంబర్FA2 సిలబస్‌లో ఉంది
అమరజీవి పొట్టి శ్రీరాములుజూన్ – సెప్టెంబర్FA2 సిలబస్‌లో ఉంది
పింగళి వెంకయ్యజూన్ – సెప్టెంబర్FA2 సిలబస్‌లో ఉంది
సుభాషితాలుఅక్టోబర్కొత్త పాఠం
పైడిమర్రి వెంకటసుబ్బారావుఅక్టోబర్కొత్త పాఠం
శంకరంబాడి సుందరాచారిఅక్టోబర్కొత్త పాఠం

AP 6th Class SA1 Telugu Question Paper 2026-27 సిలబస్ — 9 పాఠాలు, అక్టోబర్‌లో కొత్తగా చేరే మూడు

ముదురు నారింజ రంగులోని మూడు అక్టోబర్ పాఠాలు FA2 లో పరీక్షకు రాలేదు; పరీక్షకు ముందు మొదటి మూడు రోజులు వీటికే.

FA2 అసలు ప్రశ్నపత్రం, జవాబులకు AP 6th Class FA2 Telugu Question Paper 2026-27. పాఠ్యపుస్తకం కావాలంటే 6th Class Telugu Textbook పేజీ చూడండి; పాఠాల వరుసను మీ పుస్తకంలోని విషయసూచికతో పోల్చుకోండి.

AP 6th Class SA1 Telugu నమూనా ప్రశ్నపత్రం — 20 ప్రశ్నలు, జవాబులు

ఇలా చేయండి: ఒక తెల్ల కాగితం తీసుకుని ఇరవై ప్రశ్నలకూ జవాబులు రాయండి. తర్వాత ఒక్కో “జవాబు చూడండి” నొక్కి సరిచూసుకోండి. సరిపోయిన వాటికే “నా జవాబు సరైనదే” టిక్ పెట్టండి. చివరి ప్రశ్నలో A, B లలో ఒక్కటి చాలు.

విభాగం 1  —  వర్ణమాల, పదాలు, వ్యాకరణం

1. పింగళి వెంకయ్య మన జాతీయ పతాకం రూపొందించారు. గీతగీసిన పదానికి అర్థం.
(A) జెండా   (B) పుస్తకం   (C) పాట   (D) గుడి   [1 మార్కు]

జవాబు చూడండి
(A) జెండా.
పతాకం = జెండా, ధ్వజం.

2. మనం స్వాతంత్ర్యం కోసం పోరాడాం. గీతగీసిన పదానికి వ్యతిరేక పదం.
(A) స్వేచ్ఛ   (B) పారతంత్ర్యం   (C) స్వరాజ్యం   (D) సంతోషం   [1 మార్కు]

జవాబు చూడండి
(B) పారతంత్ర్యం.
స్వాతంత్ర్యం అంటే మన పాలన మనదే; పారతంత్ర్యం అంటే ఇతరుల పాలనలో ఉండటం.

3. తల్లి ప్రేమకు సాటి లేదు. గీతగీసిన పదానికి సమానార్థక పదాలు.
(A) అమ్మ, మాత   (B) అక్క, చెల్లి   (C) గురువు, ఒజ్జ   (D) పాప, బిడ్డ   [1 మార్కు]

జవాబు చూడండి
(A) అమ్మ, మాత.
జననీ అనే పదం కూడా తల్లికి సమానార్థకమే.

4. కింది వాటిలో ద్విత్వాక్షరం ఉన్న పదం.
(A) పద్యం   (B) అమ్మ   (C) కలం   (D) భాష   [1 మార్కు]

జవాబు చూడండి
(B) అమ్మ.
“మ్మ” లో ఒకే హల్లు (మ) రెండుసార్లు వచ్చింది — ఇది ద్విత్వం.

5. కింది వాటిలో సంయుక్తాక్షరం ఉన్న పదం.
(A) పక్క   (B) అక్క   (C) సత్యం   (D) చిన్న   [1 మార్కు]

జవాబు చూడండి
(C) సత్యం.
“త్య” లో త, య అనే రెండు వేర్వేరు హల్లులు కలిశాయి — ఇది సంయుక్తాక్షరం. మిగతా మూడూ ద్విత్వాలు.

6. సున్న (ం), విసర్గ (ః) లను వర్ణమాలలో ఏమంటారు?
(A) అచ్చులు   (B) ఉభయాక్షరాలు   (C) ఊష్మాలు   (D) పరుషాలు   [1 మార్కు]

జవాబు చూడండి
(B) ఉభయాక్షరాలు.
సున్న, అరసున్న, విసర్గ — ఈ మూడు ఉభయాక్షరాలు.

7. కింది వాటిలో అల్పప్రాణాక్షరం.
(A) ఖ   (B) ఘ   (C) క   (D) ఛ   [1 మార్కు]

జవాబు చూడండి
(C) క.
తక్కువ గాలితో పలికేది అల్పప్రాణం (క). ఖ, ఘ, ఛ లు ఒత్తి పలికే మహాప్రాణాలు.

8. “పుస్తకాలు” — ఈ పదానికి ఏకవచనం.
(A) పుస్తకం   (B) పుస్తకములు   (C) పుస్తకాలన్నీ   (D) పుస్తకంలో   [1 మార్కు]

జవాబు చూడండి
(A) పుస్తకం.
పుస్తకం (ఏకవచనం) — పుస్తకాలు (బహువచనం).

9. కింది వాటిలో అమహద్వాచక పదం.
(A) అన్న   (B) తమ్ముడు   (C) చెట్టు   (D) రాజు   [1 మార్కు]

జవాబు చూడండి
(C) చెట్టు.
మనుషులు కాని జంతువులు, వస్తువులు, చెట్లు అమహద్వాచకాలు.

10. “నువ్వు బడికి ఎప్పుడు వెళ్తావు” — వాక్యం చివర పెట్టాల్సిన చిహ్నం.
(A) పూర్ణ విరామం (.)   (B) స్వల్ప విరామం (,)   (C) ప్రశ్నార్థకం (?)   (D) ఆశ్చర్యార్థకం (!)   [1 మార్కు]

జవాబు చూడండి
(C) ప్రశ్నార్థకం (?).
“ఎప్పుడు” అని అడుగుతున్నాం కాబట్టి ఇది ప్రశ్న వాక్యం.

కింది పేరా చదివి 11 – 15 ప్రశ్నలకు సరైన జవాబు గుర్తించండి.
కొండాపురం బడిలో వేసవి వస్తే చేతి పంపులో నీళ్ళు వచ్చేవి కావు. ఆరో తరగతి పిల్లలు తమ ఉపాధ్యాయుడు రమణ గారితో కలిసి ఒక పని చేశారు. బడి పైకప్పు మీద పడే వాన నీటిని గొట్టాల ద్వారా ఒక గుంటలోకి మళ్ళించారు. ప్రతి తరగతికి ఒక రోజు ఆ గుంట చుట్టూ శుభ్రం చేసే బాధ్యత పెట్టుకున్నారు. ఆ వర్షాకాలం అంతా గుంట నిండింది. తర్వాతి వేసవిలో చేతి పంపు ఎండిపోలేదు. బడి తోటలోని మొక్కలూ పచ్చగా నిలిచాయి. “చిన్న చేతులు కలిస్తే పెద్ద పని అవుతుంది” అని ప్రధానోపాధ్యాయులు పిల్లలను మెచ్చుకున్నారు.

11. కొండాపురం బడిలో వేసవిలో వచ్చే సమస్య ఏమిటి?
(A) కరెంటు లేదు   (B) చేతి పంపులో నీళ్ళు రావు   (C) పుస్తకాలు లేవు   (D) ఆట స్థలం లేదు   [1 మార్కు]

జవాబు చూడండి
(B) చేతి పంపులో నీళ్ళు రావు.

12. పిల్లలు వాన నీటిని ఎక్కడికి మళ్ళించారు?
(A) చెరువులోకి   (B) బావిలోకి   (C) ఒక గుంటలోకి   (D) పొలంలోకి   [1 మార్కు]

జవాబు చూడండి
(C) ఒక గుంటలోకి.

13. గుంట చుట్టూ శుభ్రం చేసే బాధ్యత ఎలా పంచుకున్నారు?
(A) ఉపాధ్యాయులే చేశారు   (B) ప్రతి తరగతికి ఒక రోజు   (C) ఎవరూ చేయలేదు   (D) ఊరివాళ్ళు చేశారు   [1 మార్కు]

జవాబు చూడండి
(B) ప్రతి తరగతికి ఒక రోజు.

14. తర్వాతి వేసవిలో ఏం జరిగింది?
(A) చేతి పంపు ఎండిపోలేదు   (B) బడి మూసేశారు   (C) మొక్కలు ఎండిపోయాయి   (D) కొత్త పంపు వేశారు   [1 మార్కు]

జవాబు చూడండి
(A) చేతి పంపు ఎండిపోలేదు.

15. “చిన్న చేతులు కలిస్తే పెద్ద పని అవుతుంది” — దీని భావం.
(A) పిల్లలు పని చేయకూడదు   (B) అందరూ కలిసి పనిచేస్తే పెద్ద పనులూ సాధ్యమే   (C) పెద్దవాళ్ళే పని చేయాలి   (D) చేతులు కడుక్కోవాలి   [1 మార్కు]

జవాబు చూడండి
(B) అందరూ కలిసి పనిచేస్తే పెద్ద పనులూ సాధ్యమే.

విభాగం 2  —  సొంత వాక్యాలు

16. “దేశభక్తి” — ఈ పదంతో సొంత వాక్యం రాయండి.   [2 మార్కులు]

జవాబు చూడండి
అర్థం: మాతృదేశం మీద ప్రేమ, గౌరవం.
నమూనా వాక్యం: పింగళి వెంకయ్య గారి దేశభక్తికి మన మువ్వన్నెల జెండా గుర్తు.

17. “ప్రతిజ్ఞ” — ఈ పదంతో సొంత వాక్యం రాయండి.   [2 మార్కులు]

జవాబు చూడండి
అర్థం: ఒక పని తప్పక చేస్తానని మనస్ఫూర్తిగా ఇచ్చే మాట.
నమూనా వాక్యం: రోజూ ఉదయం ప్రార్థనలో మేమంతా దేశ ప్రతిజ్ఞ చేస్తాం.

విభాగం 3  —  మహనీయుల గురించి (4 మార్కుల ప్రశ్నలు)

18. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని వివరించండి.   [4 మార్కులు]

జవాబు చూడండి
జననం: 16 మార్చి 1901 న పడమటిపల్లెలో జన్మించారు.
గాంధీజీ బాటలో: ఉద్యోగం వదిలి సబర్మతీ ఆశ్రమంలో చేరారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. హరిజనులకు నెల్లూరులోని ఆలయ ప్రవేశం కోసం కూడా నిరాహార దీక్షలు చేశారు.
ఆంధ్ర రాష్ట్రం కోసం: తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 19 అక్టోబర్ 1952 న మద్రాసులో నిరాహార దీక్ష మొదలుపెట్టారు. 58 రోజుల దీక్ష తర్వాత డిసెంబర్ 1952 లో ప్రాణాలు విడిచారు.
ఫలితం: ఆయన త్యాగం ఫలితంగా 1 అక్టోబర్ 1953 న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అందుకే ఆయనను “అమరజీవి” అని గౌరవిస్తాం.

19. పింగళి వెంకయ్య గారి గురించి రాయండి.   [4 మార్కులు]

జవాబు చూడండి
జననం: భట్లపెనుమర్రు గ్రామంలో ఆగస్టు 2 న జన్మించారు. 1963 లో మరణించారు.
జెండా: 1921 లో విజయవాడ (బెజవాడ) లో గాంధీజీకి జాతీయ పతాకం నమూనా అందించారు. అదే మన జాతీయ జెండాకు మూలం.
బిరుదులు: జపాన్ భాషలో ప్రసంగం చేసినందుకు “జపాన్ వెంకయ్య”, పత్తి రకాలపై పరిశోధన చేసినందుకు “పత్తి వెంకయ్య”, వజ్రాల గనుల గురించి తెలిసినందుకు “డైమండ్ వెంకయ్య” అని పిలిచేవారు.
గౌరవం: 2009 లో ఆయన పేరుతో, మొదటి జెండాతో తపాలా బిళ్ళ విడుదలైంది.

విభాగం 4  —  లేఖ / వ్యాసం (8 మార్కులు)

20. A) “జాతీయ ప్రతిజ్ఞ” రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు గారి గురించి మీ మిత్రురాలికి లేఖ రాయండి.
(లేదా)
B) “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి గారి గురించి రాయండి.   [8 మార్కులు]

జవాబు చూడండి
A కి నమూనా లేఖ:
విశాఖపట్నం,
19 – 10 – 2026.

ప్రియమైన స్నేహితురాలు హారికకు,
నేను క్షేమం. నువ్వూ క్షేమంగా ఉన్నావని అనుకుంటున్నాను. మనం రోజూ బడిలో చెప్పే “భారతదేశం నా మాతృభూమి” ప్రతిజ్ఞను ఎవరు రాశారో ఈ మధ్యే మా తెలుగు పాఠంలో తెలుసుకున్నాను.
ఆ ప్రతిజ్ఞ రాసినవారు పైడిమర్రి వెంకటసుబ్బారావు గారు. వారు 10 జూన్ 1916 న నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో జన్మించారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, అరబిక్ భాషలు నేర్చుకున్నారు.
1962 లో విశాఖపట్నం జిల్లా ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్నప్పుడు ఈ ప్రతిజ్ఞను తెలుగులో రాశారు. 26 జనవరి 1965 నుంచి దేశమంతటా బడుల్లో ఈ ప్రతిజ్ఞ చెప్పడం మొదలైంది. ఒక తెలుగు వ్యక్తి రాసిన మాటలు కోట్లాది పిల్లలు రోజూ చెప్పడం మనకు గర్వకారణం.
ఇకపై ప్రతిజ్ఞ చెప్పేటప్పుడు దాని అర్థం తెలుసుకుని చెబుదాం. మీ ఇంట్లో అందరికీ నా నమస్కారాలు.
ఇట్లు,
నీ స్నేహితురాలు,
కె. దీప్తి.

చిరునామా: ఎన్. హారిక, 6వ తరగతి, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, అనకాపల్లి.
B కి ముఖ్యాంశాలు: జననం — 10 ఆగస్టు 1914, తిరుపతి దగ్గర తిరుచానూరు | 1942 లో “మా తెలుగు తల్లికి” గేయం రాశారు; మొదట “దీనబంధు” సినిమా కోసం రాసినా అందులో వాడలేదు | ఈ గేయం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం అయింది | ఇతర రచనలు: సుందర రామాయణం, సుందర భారతం, బుద్ధగీత | మరణం — 8 ఏప్రిల్ 1977, తిరుపతి | ముగింపు: తెలుగు భాషపై ఆయన ప్రేమ.

ఆరో తరగతి తెలుగు — మహనీయుల పాఠాల సారం

మహనీయులుగుర్తుంచుకోవాల్సినవి
గరిమెళ్ళ సత్యనారాయణ (మాకొద్దీ తెల్లదొరతనం)1893 – 1952; శ్రీకాకుళం జిల్లా గోనెపాడు; దేశభక్తి గీతాలకు జైలుశిక్ష; “జాతీయ కవి”
పొట్టి శ్రీరాములుజననం 1901; 58 రోజుల నిరాహార దీక్ష; 1 అక్టోబర్ 1953 న ఆంధ్ర రాష్ట్రం; “అమరజీవి”
పింగళి వెంకయ్యభట్లపెనుమర్రు; 1921 లో విజయవాడలో గాంధీజీకి జెండా నమూనా; జపాన్ వెంకయ్య, పత్తి వెంకయ్య
పైడిమర్రి వెంకటసుబ్బారావు (అక్టోబర్)1916 – 1988; అన్నెపర్తి, నల్గొండ; 1962 లో జాతీయ ప్రతిజ్ఞ తెలుగులో; 1965 నుంచి బడుల్లో
శంకరంబాడి సుందరాచారి (అక్టోబర్)1914 – 1977; తిరుచానూరు; “మా తెలుగు తల్లికి” — రాష్ట్ర గీతం; సుందర రామాయణం

సుభాషితాలు, సమయస్ఫూర్తి పాఠాల్లోని పద్యాలు, కథ వివరాలు మేము నమ్మదగిన ఆధారంలో సరిచూడలేకపోయాం. ఈ రెండింటికీ పాఠ్యపుస్తకంలోని పద్యాలు, భావాలు, పాఠం చివరి అభ్యాసాలు చదవండి.

6వ తరగతి SA1 తెలుగు పేపర్ PDF — జవాబులతో

ప్రింట్ తీసి రాసుకోవడానికి: Download PDF — AP 6th Class SA1 Telugu Practice Paper 2026-27 (ప్రశ్నలు ముందు, జవాబులు చివర).

ఆరో తరగతి పిల్లలు తెలుగులో ఎక్కువగా చేసే పొరపాట్లు

  1. ద్విత్వం, సంయుక్తం గుర్తించకపోవడం: ఒకే హల్లు రెండుసార్లు (అమ్మ) — ద్విత్వం; రెండు వేర్వేరు హల్లులు (సత్యం) — సంయుక్తం.
  2. అల్పప్రాణ, మహాప్రాణ తారుమారు: ప్రతి వర్గంలో 1, 3 అక్షరాలు అల్పప్రాణాలు (క, గ); 2, 4 మహాప్రాణాలు (ఖ, ఘ).
  3. వచనం మార్చి క్రియ మార్చకపోవడం: “పంట పండుతుంది” బహువచనంలో “పంటలు పండుతాయి” అవుతుంది.
  4. విరామ చిహ్నం మర్చిపోవడం: అడిగే వాక్యానికి (?), ఆశ్చర్యానికి (!), జాబితాలో పదాల మధ్య (,), వాక్యం పూర్తయితే (.).
  5. మహనీయుల తేదీలు కలిపేయడం: పొట్టి శ్రీరాములు దీక్ష 1952, ఆంధ్ర రాష్ట్రం 1953, ప్రతిజ్ఞ 1962 — ఒక చిన్న పట్టిక రాసి గోడకు అతికించుకోండి.
  6. లేఖలో సంబోధన, ముగింపు లేకపోవడం: “ప్రియమైన”, “ఇట్లు” — ఈ రెండూ లేఖకు తప్పనిసరి.

9 నవంబర్ తెలుగు పరీక్షకు ముందు — 6వ తరగతి ప్లాన్

తెలుగు పరీక్ష 9 నవంబర్ 2026 (సోమవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. కింది పది పనులు వరుసగా చేయండి; రోజులు తక్కువగా ఉంటే రెండు వరుసలు ఒకే రోజు చేయండి, చివరి రెండు (సాధన పేపర్, లేఖ / వ్యాసం) మాత్రం వదలకండి.

రోజుపని
1సుభాషితాలు — పద్యాలు కంఠస్థం, భావాలు
2పైడిమర్రి వెంకటసుబ్బారావు — పాఠం, ప్రతిజ్ఞ అర్థం
3శంకరంబాడి సుందరాచారి — “మా తెలుగు తల్లికి” గేయం
4అమ్మఒడి, తృప్తి — FA2 జవాబులు మళ్ళీ
5మాకొద్దీ తెల్లదొరతనం, సమయస్ఫూర్తి
6పొట్టి శ్రీరాములు, పింగళి వెంకయ్య — పై పట్టిక
7వర్ణమాల: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వం, సంయుక్తం
8అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనం, లింగం, విరామ చిహ్నాలు
9ఈ పేజీలోని 20 ప్రశ్నల పేపర్ రాసి స్కోర్ చూసుకోండి
10ఒక లేఖ, ఒక వ్యాసం సొంతంగా రాయడం

తర్వాత ఏం చదవాలి

  1. AP 6th Class SA1 Maths Question Paper 2026-27 — ఆరో తరగతి గణితం సాధన
  2. AP 6th Class FA2 Telugu Question Paper 2026-27 — FA2 అసలు పేపర్ జవాబులు
  3. AP 6th Class FA1 Telugu Answer Key 2026 — FA1 పేపర్

FAQs

6వ తరగతి SA1 తెలుగు పరీక్ష ఎప్పుడు?

28-10-2026 అధికారిక టైమ్ టేబుల్ ప్రకారం 6వ తరగతి SA1 తెలుగు పరీక్ష 9 నవంబర్ 2026 (సోమవారం), మధ్యాహ్నం 1:15 – 4:15. SA1 పరీక్షలు 9 నుంచి 20 నవంబర్ వరకు జరుగుతాయి.

ఆరో తరగతి SA1 తెలుగులో ఏ పాఠాలు వస్తాయి?

అమ్మఒడి, తృప్తి, మాకొద్దీ తెల్లదొరతనం, సమయస్ఫూర్తి, అమరజీవి పొట్టి శ్రీరాములు, పింగళి వెంకయ్య, సుభాషితాలు, పైడిమర్రి వెంకటసుబ్బారావు, శంకరంబాడి సుందరాచారి — తొమ్మిది.

FA2 తర్వాత కొత్తగా చదవాల్సినవి ఏవి?

అక్టోబర్‌లో వచ్చే మూడు: సుభాషితాలు, పైడిమర్రి వెంకటసుబ్బారావు, శంకరంబాడి సుందరాచారి.

ఈ పేపర్ ఎవరు తయారు చేశారు?

మా సైట్ బృందం, FA2 తెలుగు పేపర్ నమూనా ఆధారంగా. ఇది అసలు SA1 పేపర్ కాదు; అసలు పేపర్ జవాబులు ఈ పేజీ పైభాగంలో ఉన్నాయి.

స్కోర్ ఎలా లెక్కిస్తారు?

ప్రతి జవాబు కింది టిక్ పెట్టె నొక్కితే ఆ ప్రశ్న మార్కులు పేజీ కింది బార్‌లో కలుస్తాయి. మొత్తం 35.

ఆరో తరగతి తెలుగు పేపర్‌కు ఎన్ని మార్కులు?

28-10-2026 అధికారిక ఉత్తర్వు ప్రకారం SA1 తెలుగు పేపర్ 80 మార్కులు, 33 ప్రశ్నలు (20 × 1, 4 × 2, 5 × 4, 4 × 8). ఈ పేజీలోని సాధన పేపర్ FA ఆకారంలో 20 ప్రశ్నలు, 35 మార్కులు — అసలు పరీక్షకు ముందు పాఠాల వారీ సాధనకు.

జాతీయ ప్రతిజ్ఞ రాసినది ఎవరు?

పైడిమర్రి వెంకటసుబ్బారావు గారు, 1962 లో తెలుగులో రాశారు.

“మా తెలుగు తల్లికి” గేయం ఎవరిది?

శంకరంబాడి సుందరాచారి గారిది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం.

పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు దీక్ష చేశారు?

58 రోజులు. 19 అక్టోబర్ 1952 న మొదలుపెట్టారు.

ఉభయాక్షరాలు ఎన్ని?

మూడు — సున్న (ం), అరసున్న (ఁ), విసర్గ (ః).

ద్విత్వాక్షరానికి ఉదాహరణ?

అమ్మ, అక్క, చిన్న, పక్క — ఒకే హల్లు రెండుసార్లు.

PDF లో జవాబులు ఉన్నాయా?

ఉన్నాయి. ముందు ఇరవై ప్రశ్నలు, చివరి పేజీల్లో జవాబులు.

Official Sources

SA1 టైమ్ టేబుల్, మార్కుల విధానం, సిలబస్: పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వు Rc. No. 3475819/SAT-I/2026-27, తేదీ 28-10-2026 (SCERT సిలబస్ అనుబంధంతో); AP SCERT. నెలవారీ బోధన క్రమం: High School Academic Calendar 2026-27. అన్ని సబ్జెక్టుల జాబితా AP SA1 Syllabus 2026-27 – Class 1 to 10 లో.