AP 10th Class FA2 Telugu Question Paper కోసం వచ్చారంటే మీకు కావాల్సింది ప్రశ్నలు మాత్రమే కాదు — జవాబులు కూడా. ఈ పేజీలో 35 మార్కుల, 14 ప్రశ్నల పూర్తి సాధన ప్రశ్నపత్రం ఉంది, ప్రతి ప్రశ్నకూ జవాబుతో. ఇక్కడే చదువుకోవచ్చు, డౌన్‌లోడ్ అవసరం లేదు.
ఈ పేజీ కొత్తగా మారింది: ఇంతకుముందు ఇక్కడ 20 మార్కుల పేపర్ ఉండేది. SCERT ప్రొసీడింగ్స్ Rc.No.3426774/FA-2/SCERT/2026 (23.09.2026) లో పదో తరగతికి సబ్జెక్టు వారీ నమూనా ఇచ్చారు — తెలుగుకు 7 × 1, 2 × 2, 4 × 4, 1 × 8 = 35 మార్కులు, 14 ప్రశ్నలు. పేపర్ మొత్తం ఆ నమూనాలో తిరగరాశాం; 8 మార్కుల వ్యాస రచన కొత్తగా చేర్చాం.

FA2 తెలుగు సిలబస్ పాఠాలు, ఉపవాచకం, విభాగాల మార్కుల పంపిణీ — ఒకే చిత్రంలో.
ఈ పేజీలో ఏమి ఉంది
- పరీక్ష వివరాలు — తేదీ, సమయం, మార్కులు
- FA2 సిలబస్ పాఠాలు, ఉపవాచకం — పుస్తకంలో ఎక్కడ ఉన్నాయో
- 14 ప్రశ్నల సాధన ప్రశ్నపత్రం, జవాబులతో — 35 మార్కులు
- పాఠాల వారీ మార్కుల పంపిణీ
- తెలుగులో మార్కులు ఎక్కడ ఖాయం, ఎక్కడ జారిపోతాయి
- FAQs
AP 10th Class FA2 Telugu Question Paper 2026-27 — పరీక్ష వివరాలు
| పరీక్ష | Formative Assessment 2 — FA2 (Self Assessment-2 అని కూడా అంటారు) |
| తరగతి | పదో తరగతి |
| సబ్జెక్ట్ | తెలుగు (ప్రథమ భాష) |
| పరీక్ష తేదీ | 05 అక్టోబర్ 2026 — ఉదయం సెషన్ |
| సమయం | ఉదయం 11:00 నుంచి 12:15 (9, 10 తరగతులకు) — 1 గంట 15 నిమిషాలు |
| రాత పరీక్ష మార్కులు | 35 (FA మొత్తం 50) |
| ప్రశ్నల నమూనా | 7 × 1 + 2 × 2 + 4 × 4 + 1 × 8 = 35 — మొత్తం 14 ప్రశ్నలు |
| సిలబస్ | ఆగస్టు, సెప్టెంబర్ 2026లో బోధించిన పాఠాలు |
అన్ని సబ్జెక్టుల టైమ్‌టేబుల్, సిలబస్ ఒకే చోట కావాలంటే AP FA2 Syllabus 2026-27 – Class 6 to 10 పేజీ, పదో తరగతి అన్ని సబ్జెక్టుల FA2 ప్రశ్నపత్రాల కోసం AP 10th Class FA2 Question Papers 2026-27 పేజీ ఉన్నాయి.
FA2 సిలబస్ — ఏ పాఠాలు, పుస్తకంలో ఎక్కడ
SCERT ప్రొసీడింగ్స్ Annexure-I లో ప్రథమ భాష తెలుగుకు నాలుగు పాఠాలు ఉన్నాయి — జలియన్ వాలా బాగ్, చేజారిన బాల్యం, ప్రకృతి సందేశం, జీవని. సంయుక్త తెలుగు (Composite Telugu & Sanskrit) చదివే విద్యార్థులకు వీటితో పాటు ఉపవాచకం అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ కూడా ఉన్నాయి. పాఠ్యపుస్తకంలో ఇవి వరుసగానే వస్తాయి — పాఠాలు 5 నుంచి 8, ఉపవాచకం కాండలు 2 నుంచి 4.
| అంశం | పుస్తకంలో స్థానం | రకం |
|---|---|---|
| జలియన్ వాలా బాగ్ | పాఠం 5 | పద్య భాగం |
| ప్రకృతి సందేశం | పాఠం 6 | పాఠ్యభాగం |
| చేజారిన బాల్యం | పాఠం 7 | వ్యాసం |
| జీవని | పాఠం 8 | పాఠ్యభాగం |
| అయోధ్యాకాండ | ఉపవాచకం 2 | రామాయణం |
| అరణ్యకాండ | ఉపవాచకం 3 | రామాయణం |
| కిష్కింధాకాండ | ఉపవాచకం 4 | రామాయణం |
పన్నెండు పాఠాల పూర్తి జాబితా, ఏ పాఠానికి మా సైట్‌లో ఏ మెటీరియల్ ఉందో చూడాలంటే 10th Class Telugu Study Material PDF Download పేజీలో ఉంది. ఆ పేజీలో ఒక ముఖ్య గమనిక కూడా ఉంది — పాఠ్యపుస్తకం మారింది, మాతృభావన, గోరంత దీపాలు లాంటి పాఠాలు ఇప్పుడు లేవు.
AP 10th Class FA2 Telugu Question Paper — 14 ప్రశ్నలు, జవాబులతో
ముందు మీరే ప్రయత్నించండి. ఆగిపోయిన చోట మాత్రమే ‘జవాబు చూడండి’ నొక్కండి. మొత్తం జవాబులు చూసి రాసుకుంటే పరీక్షలో చేయి కదలదు.
విభాగం — అ — 7 × 1 = 7 మార్కులు
పాఠం, భాషాంశాలు — ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ఒకటి రెండు మాటల జవాబు చాలు.
1. ‘జలియన్ వాలా బాగ్’ పాఠ్యభాగ కవి ఎవరు? ఆయన ఏ ఊరిలో జన్మించారు? [1 మార్కు]
జవాబు చూడండి
2. ‘చేజారిన బాల్యం’ పాఠ్య ప్రక్రియ ఏమిటి? ఇది ఏ గ్రంథం నుంచి గ్రహించారు? [1 మార్కు]
జవాబు చూడండి
3. కింది పదాలకు అర్థాలు రాయండి — (అ) ఆవహము (ఆ) ఠావు (ఇ) తులువ [1 మార్కు]
జవాబు చూడండి
(ఆ) ఠావు — స్థానం
(ఇ) తులువ — నీచుడు
4. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి — (అ) రక్తం (ఆ) శత్రువు [1 మార్కు]
జవాబు చూడండి
(ఆ) శత్రువు — వైరి, విరోధి
5. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి — (అ) ప్రాణార్థములు (ఆ) ధ్వజమెత్తి [1 మార్కు]
జవాబు చూడండి
(ఆ) ధ్వజమెత్తి = ధ్వజము + ఎత్తి — ఉత్వ సంధి
6. ‘శౌర్యపరాక్రమములు’ — విగ్రహవాక్యం రాసి సమాసం పేరు తెలపండి. [1 మార్కు]
జవాబు చూడండి
సమాసం — ద్వంద్వ సమాసం
7. కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి — (అ) భాష (ఆ) విద్య [1 మార్కు]
జవాబు చూడండి
(ఆ) విద్య — విద్దె
ప్రకృతి అంటే సంస్కృత రూపం, వికృతి అంటే తెలుగులో మారిన రూపం.
విభాగం — ఆ — 2 × 2 = 4 మార్కులు
అవగాహన, ప్రతిస్పందన. రెండు మూడు వాక్యాల్లో పూర్తి జవాబు రాయండి.
8. భారతీయుల తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ఏది? జలియన్ వాలా బాగ్ మారణకాండకు బాధ్యుడైన అధికారి ఎవరు? ఆ ఘటన ఎక్కడ జరిగింది? [2 మార్కులు]
జవాబు చూడండి
అధికారి — జనరల్ డయ్యర్. ఘటన జరిగిన చోటు — పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరంలో ఉన్న జలియన్ వాలా బాగ్ అనే తోట. (1 మార్కు)
9. “జలియనుబాగులో జనులఁజంపిన రక్తము వర్షపాతముంబలెఁబ్రవహించె” — ఈ పాదంలోని అలంకారం ఏది? దాన్ని ఎలా గుర్తించారో రాయండి. [2 మార్కులు]
జవాబు చూడండి
ఉపమేయం — రక్తం (వర్ణించబడుతున్నది)
ఉపమానం — వర్షపాతం (దానితో పోల్చినది)
సమాన ధర్మం — ప్రవహించడం
ఉపమావాచకం — ‘పలె’ (వలె)
ఈ నాలుగు అంగాలూ ఉన్నప్పుడు అది ఉపమాలంకారం. రక్తం ప్రవాహాన్ని వర్షం కురవడంతో పోల్చి మారణకాండ తీవ్రతను కవి తెలియజేశారు. (1 మార్కు)
విభాగం — ఇ — 4 × 4 = 16 మార్కులు
వ్యక్తీకరణ, ఉపవాచకం. పాఠంలోని వాక్యాలు అలాగే కాకుండా సొంత మాటల్లో రాయండి.
10. రచయిత శీలా వీర్రాజులో చిత్రకళపై ఆసక్తి ఎలా ఏర్పడింది? బాల్యంలో అందే ప్రోత్సాహం ఒక మనిషి జీవితాన్ని ఎలా మలుస్తుందో ఈ సందర్భంలో రాయండి. [4 మార్కులు]
జవాబు చూడండి
ఏమి గీశారు: అలా రచయిత కాగితంపై పెట్టినవి — విమానం, ఇల్లు, కిరసనాయిలు దీపం. మాష్టారు వాటిని చూసి మెచ్చుకున్నారు. (1 మార్కు)
ఆ మెప్పు ఫలితం: ఆ ప్రశంస చిన్నారి మనసులో చిత్రకళ మీద ఇష్టాన్ని నాటింది. అదే ఆయన తర్వాత చిత్రకారుడిగా నిలబడటానికి తొలి మెట్టు అయింది. (1 మార్కు)
మన మాటలో: పిల్లలు చేసిన చిన్న పనిని పెద్దలు గుర్తించి మెచ్చుకుంటే ఆ పిల్లలకు తమ మీద నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకమే వారిని ఆ దారిలో ముందుకు నడిపిస్తుంది. అందుకే బాల్యంలో అందే ప్రోత్సాహం జీవితాన్ని మలిచే శక్తి కలిగి ఉంటుంది. (1 మార్కు)
11. ఆంగ్ల కిరీటాన్ని కాపాడేందుకు భక్తిశ్రద్ధలతో సేవ చేసిన భారతీయ సైనికుడే ఆంగ్లేయులపై పోరాటానికి సిద్ధమయ్యాడు. అందుకు కారణాలు ఏమిటో వివరించండి. [4 మార్కులు]
జవాబు చూడండి
తర్వాత అన్యాయం: అయినా బ్రిటిష్ పాలకులు భారతీయుల పట్ల అన్యాయంగా వ్యవహరించారు; ఆ సేవకు గౌరవం దక్కలేదు. (1 మార్కు)
నిరంకుశ చట్టాలు: స్వాతంత్ర్యోద్యమాలను అణచివేయడానికి రౌలట్ చట్టం లాంటి నిరంకుశ చర్యలు చేపట్టి ప్రజల హక్కులను హరించారు. (1 మార్కు)
ఫలితం: విశ్వాసం స్థానంలో వ్యతిరేకత పెరిగింది. తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి భారతీయులు సిద్ధమయ్యారు — అదే స్వాతంత్ర్య పోరాటానికి బలం అయింది. (1 మార్కు)
12. అయోధ్యాకాండలో శ్రీరాముడు వనవాసానికి వెళ్లడానికి కారణం ఏమిటి? ఆ సందర్భంలో రాముని లక్షణం ఏమిటో రాయండి. [4 మార్కులు]
జవాబు చూడండి
కైకేయి కోరిక: రాముని పట్టాభిషేకం నిర్ణయమైన సమయంలో కైకేయి ఆ వరాలను కోరింది — భరతునికి రాజ్యం, రామునికి పదునాలుగు సంవత్సరాల వనవాసం. (1 మార్కు)
రాముని నిర్ణయం: తండ్రి మాట నిలబెట్టడం కుమారుని ధర్మమని భావించి శ్రీరాముడు రాజ్యాన్ని విడిచి, సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యానికి బయలుదేరాడు. (1 మార్కు)
లక్షణం: ఇక్కడ కనిపించేది పితృవాక్య పరిపాలన. రాజ్యం కంటే తండ్రి మాటకే విలువ ఇచ్చిన రాముని ధర్మనిష్ఠ ఈ ఘట్టంలో స్పష్టమవుతుంది. (1 మార్కు)
13. కిష్కింధాకాండలో శ్రీరామునికి సుగ్రీవునితో స్నేహం ఎలా కలిగింది? ఆ స్నేహం వల్ల ఇద్దరికీ కలిగిన లాభం ఏమిటి? [4 మార్కులు]
జవాబు చూడండి
హనుమంతుని పాత్ర: సుగ్రీవుని ఆదేశంతో హనుమంతుడు వారిని కలిసి, వారి వివరాలు తెలుసుకుని సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్లాడు. (1 మార్కు)
ఒప్పందం: ఇద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నారు — రాముడు సుగ్రీవునికి రాజ్యం ఇప్పిస్తానని, సుగ్రీవుడు సీతను వెతికి పెడతానని మాట ఇచ్చుకున్నారు. (1 మార్కు)
ఫలితం: రాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని ఇచ్చాడు; సుగ్రీవుడు వానర సేనను పంపి సీత జాడ తెలుసుకోవడానికి సాయపడ్డాడు. ఆపదలో కుదిరిన స్నేహం ఇద్దరికీ బలం అయింది. (1 మార్కు)
విభాగం — ఈ — 1 × 8 = 8 మార్కులు
సృజనాత్మక రచన. ఉపోద్ఘాతం, నాలుగైదు అంశాలు, ముగింపు — ఈ క్రమం తప్పకుండా పాటించండి.
14. ‘ప్రకృతిని కాపాడటం మన బాధ్యత’ — ఈ అంశంపై వ్యాసం రాయండి. ఉపోద్ఘాతం, నాలుగు అంశాలు, ముగింపు ఉండేలా రాయాలి. [8 మార్కులు]
జవాబు చూడండి
ఉపోద్ఘాతం: గాలి, నీరు, నేల, అడవులు, జంతుజాలం — వీటన్నింటినీ కలిపి ప్రకృతి అంటాం. మనిషి బతకడానికి కావలసినవన్నీ ప్రకృతి నుంచే వస్తాయి. కానీ ఈ రోజు మనిషి చర్యల వల్లే ప్రకృతి దెబ్బతింటోంది. (2 మార్కులు)
1. అడవుల నరికివేత: ఇళ్లు, పరిశ్రమలు, రోడ్ల కోసం అడవులు తరిగిపోతున్నాయి. చెట్లు తగ్గితే వర్షాలు తగ్గుతాయి, భూమి కోతకు గురవుతుంది, జంతువులకు ఆవాసం పోతుంది. (1 మార్కు)
2. కాలుష్యం: వాహనాల పొగ, పరిశ్రమల వ్యర్థాలు గాలిని, నదులను కలుషితం చేస్తున్నాయి. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు, తాగునీటి కొరత పెరుగుతున్నాయి. (1 మార్కు)
3. ప్లాస్టిక్ వాడకం: ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోదు. అది నేలను నిరుపయోగంగా మారుస్తుంది, మురుగు కాలువలను మూసేస్తుంది, పశువుల ప్రాణాలు తీస్తుంది. (1 మార్కు)
4. నీటి వృథా: ఉన్న నీటిలో తాగడానికి పనికొచ్చేది కొద్ది భాగమే. పంపులు తెరిచి వదిలేయడం, వర్షపు నీటిని ఒడిసిపట్టకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. (1 మార్కు)
మనం ఏమి చేయాలి: ఏటా ఒక మొక్క నాటి బతికించడం, ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచి వాడటం, నీటిని పొదుపుగా వాడటం, చెత్తను వేరు చేసి వేయడం, దగ్గర దూరాలకు నడవడం లేదా సైకిల్ వాడటం.
ముగింపు: ప్రకృతిని కాపాడటం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే. ఇది ప్రభుత్వం ఒక్కదాని పని కాదు; ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం చేయవలసిన పని. ఈ తరం చూపే శ్రద్ధే రాబోయే తరానికి మిగిలే ఆస్తి. (2 మార్కులు)
రాసే పద్ధతి: శీర్షిక రాసి, ఉపోద్ఘాతం ఒక పేరా, నాలుగు అంశాలు వేర్వేరు పేరాలు, చివర ముగింపు. పేరాలుగా విడగొట్టకుండా ఒకే గుంపుగా రాస్తే మార్కులు తగ్గుతాయి.
PDF గా డౌన్‌లోడ్ చేసుకోవడం
ఇంటర్నెట్ లేని చోట సాధన చేయాలంటే, లేదా ప్రింట్ తీసుకుని రాయాలంటే — AP 10th Class FA2 Telugu Question Paper PDF (జవాబులతో) డౌన్‌లోడ్ చేసుకోండి. ఫైలులో భాగం 1 ప్రశ్నపత్రం, భాగం 2 జవాబులు విడిగా ఉన్నాయి.
సాధన చేసేటప్పుడు ఒక సూచన — ముందు భాగం 1 మాత్రమే ప్రింట్ తీసుకోండి. జవాబుల పేజీ పక్కన ఉంటే కన్ను అటే వెళ్తుంది, అప్పుడు అది పరీక్ష కాదు.
పాఠాల వారీ మార్కుల పంపిణీ
| అంశం | రకం | ప్రశ్న సంఖ్యలు | మార్కులు |
|---|---|---|---|
| జలియన్ వాలా బాగ్ (పాఠం 5) | పద్య భాగం | 1, 3, 4, 5, 6, 8, 9, 11 | 13 |
| ప్రకృతి సందేశం — వ్యాస రచన | సృజనాత్మకత | 14 | 8 |
| చేజారిన బాల్యం (పాఠం 7) | వ్యాసం | 2, 10 | 5 |
| అయోధ్యాకాండ (ఉపవాచకం) | ఉపవాచకం | 12 | 4 |
| కిష్కింధాకాండ (ఉపవాచకం) | ఉపవాచకం | 13 | 4 |
| భాషాంశాలు — ప్రకృతి, వికృతి | వ్యాకరణం | 7 | 1 |
ఈ పేపర్‌లో జలియన్ వాలా బాగ్‌కు పదమూడు మార్కులు ఇచ్చాం — ఎందుకంటే అది పద్య భాగం, అందులో నుంచే అర్థాలు, పర్యాయపదాలు, సంధులు, సమాసాలు, అలంకారాలు అన్నీ వస్తాయి. 8 మార్కుల వ్యాసాన్ని ప్రకృతి సందేశం పాఠ భావంతో ఇచ్చాం — ఆ పాఠ్యాంశం చదివినవాళ్లకు ఇది సులభం. జీవని పాఠం నుంచి ప్రశ్న ఇవ్వలేదు; ఆ పాఠ్యాంశం మా దగ్గర లేదు, తెలియనిది ఊహించి రాయడం కంటే చెప్పడమే నయం. ఆ పాఠానికి పుస్తకంలోని అభ్యాసాలే సాధన.
తెలుగులో మార్కులు ఎక్కడ ఖాయం, ఎక్కడ జారిపోతాయి
| విభాగం | మార్కులు ఖాయమా | ఎందుకు |
|---|---|---|
| భాషాంశాలు | ఖాయం | జవాబు నిర్దిష్టం — సంధి, సమాసం, పర్యాయపదం సరైనదా కాదా అంతే |
| ఉపవాచకం | ఖాయం | కథ, పాత్రలు గుర్తుంటే చాలు |
| అవగాహన, ప్రతిస్పందన | దాదాపు ఖాయం | పాఠం చదివితే నేరుగా వచ్చేవి |
| వ్యక్తీకరణ, సృజనాత్మకత | ఆధారపడుతుంది | భాష, విస్తరణ, సొంత మాటలపై మార్కులు మారతాయి |
ఇదే కారణంతో సాధన క్రమం ఇలా ఉండాలి — మొదట భాషాంశాలు, తర్వాత ఉపవాచకం, చివరగా భావ ప్రశ్నలు. మొదటి రెండు పట్టుబడితే ఇరవైలో పన్నెండు మార్కులు నిశ్చయం.
ఈ ప్రశ్నల్లో మార్కులు ఎక్కడ పోతాయి
- అలంకారం ప్రశ్నలో పేరు మాత్రమే రాయడం. ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమావాచకం — నాలుగూ చూపితేనే పూర్తి మార్కులు.
- సంధి పేరు రాయకుండా విడదీయడం మాత్రమే. ప్రశ్నలో రెండూ అడుగుతారు, రెండూ రాయాలి.
- విగ్రహవాక్యం లేకుండా సమాసం పేరు రాయడం. ‘ద్వంద్వ సమాసం’ అని రాసి ఆగిపోతే సగం మార్కే.
- పాఠంలోని వాక్యాలను అలాగే రాయడం వ్యక్తీకరణ ప్రశ్నల్లో. అక్కడ కావాల్సినది మీ సొంత మాటలు.
- ఉపవాచకంలో కథ మొత్తం రాయడం. అడిగినది ఒక సంఘటన అయితే ఆ సంఘటనే రాయండి — పొడవు మార్కులు తేవదు.
ఏ పాఠానికి ఏ మెటీరియల్ ఉంది
FA2 సిలబస్‌లోని పాఠాలకు వివరమైన ప్రశ్నలు, జవాబుల పేజీలు ఇవి — AP 10th Class Telugu 5th Lesson Important Questions – జలియన్ వాలా బాగ్, AP 10th Class Telugu 7th Lesson చేజారిన బాల్యం Important Questions 2026, AP 10th Class Telugu అరణ్యకాండ Important Questions and Answers 2026.
పరీక్షలా సమయం పెట్టుకుని సాధన చేయాలంటే AP 10th Class Mission March 2027 Telugu చేజారిన బాల్యం & అరణ్యకాండ Slip Test PDF with Answers ఉంది.
తెలుగు మాధ్యమం మోడల్ పేపర్ల కోసం AP 10th Class FA2 / Quarterly Exam Model Papers with Answers పేజీ, వార్షిక పరీక్షలో వచ్చే 8 మార్కుల ప్రశ్న గురించి AP 10th Telugu ప్రతిపదార్థం 2027 – 8 మార్కుల ప్రశ్న ఎలా రాయాలి పేజీ చూడవచ్చు.
పదో తరగతి తెలుగు మాధ్యమంలో అన్ని సబ్జెక్టుల అధ్యయన సామగ్రి కోసం AP 10వ తరగతి Telugu Medium Study Material PDF పేజీ ఉంది.
FA2 తర్వాత నవంబర్ SA1 లో తొమ్మిది పాఠాలు, నాలుగు కాండలు వస్తాయి. బోర్డ్ నమూనాలో 100 మార్కుల పూర్తి పేపర్ AP 10th Class SA1 Telugu Question Paper 2026-27 లో ఉంది.
FAQs
FA2 తెలుగు పరీక్ష ఎప్పుడు?
05 అక్టోబర్ 2026, ఉదయం 11:00 నుంచి 12:15 వరకు. 9, 10 తరగతులకు ఉదయం సెషన్ ఇదే — 6, 7, 8 తరగతులకు 9:30 నుంచి 10:45. అదే రోజు మధ్యాహ్నం 2:45 నుంచి 4:00 వరకు గణితం. ఇవి SCERT ప్రొసీడింగ్స్ Rc.No.3426774/FA-2/SCERT/2026 (23.09.2026) లోని సమయాలు; మీ పాఠశాల సర్క్యులర్‌తో ఒకసారి సరిచూసుకోండి.
FA2 తెలుగు సిలబస్‌లో ఏ పాఠాలు ఉన్నాయి?
SCERT Annexure-I ప్రకారం పాఠాలు — జలియన్ వాలా బాగ్, చేజారిన బాల్యం, ప్రకృతి సందేశం, జీవని. సంయుక్త తెలుగు (Composite) విద్యార్థులకు ఉపవాచకం అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ కూడా ఉంది.
ఈ ప్రశ్నపత్రంలో అన్ని పాఠాలూ ఉన్నాయా?
జలియన్ వాలా బాగ్, చేజారిన బాల్యం పాఠాలు, అయోధ్యాకాండ, కిష్కింధాకాండ ఉపవాచకం ఉన్నాయి. ప్రకృతి సందేశం పాఠం భావం ఆధారంగా 8 మార్కుల వ్యాసం ఇచ్చాం. జీవని పాఠం నుంచి ప్రశ్న ఇవ్వలేదు — ఆ పాఠ్యాంశం మా దగ్గర లేదు, తెలియనిది ఊహించి రాయడం మీకు ఉపయోగం కాదు. ఆ పాఠానికి పుస్తకంలోని అభ్యాసాలే సాధన.
పదో తరగతి FA2 తెలుగు పేపర్ ఎన్ని మార్కులు, ఎన్ని ప్రశ్నలు?
అధికారిక ప్రొసీడింగ్స్‌లో పదో తరగతికి సబ్జెక్టు వారీ నమూనా ఉంది. తెలుగుకు — 7 × 1 = 7, 2 × 2 = 4, 4 × 4 = 16, 1 × 8 = 8; మొత్తం 14 ప్రశ్నలు, 35 మార్కులు. FA మొత్తం 50; మిగిలిన 15 మార్కులు నోట్ పుస్తకం, తరగతి పనులు, ప్రాజెక్టుకు. గమనించండి — ఒక్కో సబ్జెక్టుకు ప్రశ్నల సంఖ్య వేరు: గణితం, PS, సోషల్ 15; హిందీ 13 లో 11; English 19; Biology 13.
తెలుగులో ఎక్కడ మార్కులు ఖాయం?
భాషాంశాలు. అర్థాలు, పర్యాయపదాలు, సంధులు, సమాసాలు — వీటికి జవాబు నిర్దిష్టంగా ఉంటుంది, సరైనదైతే పూర్తి మార్కు. ఉపవాచకం కూడా ఖాయమే — కథ, పాత్రలు గుర్తుంటే చాలు. భావ ప్రశ్నల్లో మార్కులు రాసే విధానంపై ఆధారపడతాయి.
సంధులు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది. ఏం చేయాలి?
మొత్తం జాబితా బట్టీ పట్టవద్దు. పాఠంలో వచ్చిన నాలుగైదు పదాలే తీసుకోండి — ప్రాణార్థములు, ధ్వజమెత్తి, దిగంతం, కవటాకులు. ఒక్కో పదాన్ని విడదీసి ఏ అక్షరాలు కలిశాయి అని చూస్తే నియమం దానంతట అర్థమవుతుంది. పరీక్షలో అడిగేవి పాఠంలోని పదాలే.
అలంకారం ప్రశ్నకు జవాబు ఎలా రాయాలి?
అలంకారం పేరు రాసి ఆగవద్దు. నాలుగు అంగాలు విడిగా చూపండి — ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమావాచకం. పేరు మాత్రమే రాస్తే సగం మార్కులే; అంగాలు చూపితే పూర్తి మార్కులు.
ఉపవాచకం మొత్తం రామాయణం చదవాలా?
అవసరం లేదు. పాఠ్యపుస్తకంలో ఇచ్చిన సంక్షిప్త రూపమే పరీక్షకు ఆధారం. ప్రతి కాండకూ కథా క్రమం, ముఖ్య పాత్రలు, ఒక్క ముఖ్య సంఘటన — ఈ మూడు రాసుకుంటే ఏ ప్రశ్నకైనా జవాబు రాయవచ్చు.
పద్యం, వ్యాసం అని ప్రక్రియ అడుగుతారా?
అడుగుతారు, అది ఒక మార్కు ప్రశ్న. జలియన్ వాలా బాగ్ పద్య భాగం, చేజారిన బాల్యం వ్యాసం. పాఠం చదివేటప్పుడే ప్రక్రియను పక్కన రాసుకోండి.
8 మార్కుల ప్రశ్న ఏ రకంగా వస్తుంది?
సృజనాత్మక రచన — వ్యాసం, లేఖ, కరపత్రం, సంభాషణ వీటిలో ఒకటి. ఈ సాధన పత్రంలో వ్యాసం ఇచ్చాం. ఏది వచ్చినా నిర్మాణం ఒకటే: శీర్షిక, ఉపోద్ఘాతం, నాలుగైదు అంశాలు వేర్వేరు పేరాలుగా, ముగింపు. పేరాలుగా విడగొట్టకుండా ఒకే గుంపుగా రాస్తే మార్కులు తగ్గుతాయి.
FA1 లో తక్కువ మార్కులు వచ్చాయి. FA2 లో మెరుగుపరచుకోవచ్చా?
FA1, FA2 రెండూ విడిగా లెక్కించబడతాయి. FA1 లో ఏ విభాగంలో మార్కులు పోయాయో చూసుకుని ఆ విభాగానికి ఎక్కువ సమయం ఇవ్వండి. చాలామందికి భాషాంశాల్లోనే మార్కులు పోతాయి — అవి సాధనతో పూర్తిగా సరిదిద్దుకోగలిగేవి.
ఈ ప్రశ్నలే పరీక్షలో వస్తాయా?
ఇది సాధన ప్రశ్నపత్రం, అధికారిక పేపర్ కాదు. సిలబస్ ఆధారంగా, పరీక్ష నమూనాకు అనుగుణంగా తయారు చేశాం. అచ్చు ఇవే ప్రశ్నలు రావని హామీ లేదు — కానీ ఈ తరహా ప్రశ్నలకు సిద్ధమైతే పేపర్ కొత్తగా అనిపించదు.
Official Sources
పరీక్ష తేదీలు, సిలబస్, మార్కుల విభజన AP SCERT, Vijayawada ప్రకటన ఆధారంగా. పరీక్షల నిర్వహణ సమాచారం Board of Secondary Education, Andhra Pradesh వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఇది సాధన ప్రశ్నపత్రం, అధికారిక ప్రశ్నపత్రం కాదు — సిలబస్, పరీక్ష నమూనా ఆధారంగా మేము తయారు చేశాం. తేదీలు, సమయాల్లో మార్పులు ఉంటే మీ పాఠశాల సర్క్యులర్ ప్రామాణికం.
