10th Class Chemistry Important Questions with Answers 2026-27 కొత్త సిలబస్ ప్రకారం ఇక్కడ ఉన్నాయి. ఈ సంవత్సరం పదో తరగతి భౌతిక రసాయన శాస్త్రం (AP SCERT ద్విభాషా పుస్తకం) లో రసాయన శాస్త్రం భాగం నాలుగు అధ్యాయాలే: Chemical Reactions and Equations, Acids, Bases and Salts, Metals and Non-metals, Carbon and its Compounds. ఈ నాలుగింటి నుంచి 32 ముఖ్య ప్రశ్నలు, ప్రతి ప్రశ్న కిందే జవాబు, చివర PDF డౌన్‌లోడ్ ఇచ్చాం.
16 నవంబర్ 2026 SA1 (Essay 1) భౌతిక శాస్త్రం పేపర్‌లో 50 మార్కుల్లో 19 మార్కులు ఈ నాలుగు రసాయన శాస్త్ర అధ్యాయాల నుంచే వచ్చాయి. ఆ పేపర్‌లో వచ్చిన అంశాలను ప్రశ్నల పక్కనే గుర్తించాం. Atomic Structure, Chemical Bonding, Periodic Classification, Solutions పాఠాలు పాత పుస్తకానివి; 2026-27 పుస్తకంలో లేవు. అందుకే వాటిని ఈ పేజీ నుంచి తీసేశాం.
ఈ పేజీలో: 4 అధ్యాయాలు | SA1 లో వచ్చినవి | Chapter 1 | Chapter 2 | Chapter 3 | Chapter 4 | మార్కులు ఎక్కడ పోతాయి | PDF | FAQs

2026-27 పదో తరగతి రసాయన శాస్త్రం – నాలుగు అధ్యాయాలు
భౌతిక రసాయన శాస్త్రం పుస్తకంలో 1 నుంచి 4 అధ్యాయాలు రసాయన శాస్త్రం, 9 నుంచి 12 భౌతిక శాస్త్రం (5 నుంచి 8 జీవ శాస్త్రం పుస్తకంలో ఉన్నాయి). ప్రతి అధ్యాయానికి పూర్తి పాఠ్యపుస్తక ప్రశ్నల జవాబులు, తెలుగు నోట్స్ కింది లింకుల్లో ఉన్నాయి:
| అధ్యాయం | పాఠ్యపుస్తక ప్రశ్నల జవాబులు | తెలుగు నోట్స్ |
|---|---|---|
| 1. Chemical Reactions and Equations | Chapter 1 Solutions | Chapter 1 Notes |
| 2. Acids, Bases and Salts | Chapter 2 Solutions | Chapter 2 Notes |
| 3. Metals and Non-metals | Chapter 3 Solutions | Chapter 3 Notes |
| 4. Carbon and its Compounds | Chapter 4 Solutions | Chapter 4 Notes |
భౌతిక శాస్త్రం నాలుగు అధ్యాయాలతో సహా మొత్తం ఎనిమిది అధ్యాయాల జవాబులు AP 10th Class Physical Science Solutions 2026-27 పేజీలో ఉన్నాయి.
SA1 2026 భౌతిక శాస్త్రం పేపర్‌లో వచ్చిన రసాయన శాస్త్ర ప్రశ్నలు
| పేపర్ ప్రశ్న | అంశం | అధ్యాయం | మార్కులు |
|---|---|---|---|
| 1 | హైడ్రోజన్‌తో కాపర్ ఆక్సైడ్ క్షయకరణం | 1 | 1 |
| 2 | పచ్చళ్లను రాగి పాత్రల్లో ఎందుకు ఉంచకూడదు | 3 | 1 |
| 3 | pH తో ఆమ్ల బలం | 2 | 1 |
| 4 | లోహ ఆక్సైడ్లన్నీ క్షారాలేనా (ద్విస్వభావ ఆక్సైడ్లు) | 3 | 1 |
| 5 | ఆల్కేన్‌ను గుర్తించడం | 4 | 1 |
| 9 | C₂H₂ సమజాత శ్రేణి సభ్యులు | 4 | 2 |
| 13 | నలుగురు విద్యార్థుల pH పట్టిక | 2 | 4 |
| 16 A / B | నాలుగు రకాల రసాయన చర్యలు / సబ్బు శుభ్రపరిచే విధానం | 1 / 4 | 8 |
అసలు ప్రశ్నపత్రం, మా పూర్తి జవాబులు AP 10th Class SA1 Physical Science Question Paper 2026-27 Answer Key పేజీలో ఉన్నాయి. అదే రకమైన ప్రశ్నలు SSC పబ్లిక్ పరీక్షలోనూ రావచ్చు కాబట్టి కింది ప్రశ్నల్లో వాటిని ముందుగా చదవండి.
ఎలా వాడాలి: ముందు మీరే జవాబు రాసుకోండి. తర్వాత ‘జవాబు చూడండి’ నొక్కి సరిచూసుకోండి. సరైతే ‘నా జవాబు సరైనదే’ టిక్ పెట్టండి; కింద బార్ 92 మార్కులకు మీ స్కోర్ చూపుతుంది. మార్కుల విభజన (1, 2, 4, 8) SA1 2026 భౌతిక శాస్త్రం పేపర్ రకాన్ని బట్టి ఇచ్చాం.
Chapter 1 – Chemical Reactions and Equations (రసాయన చర్యలు, సమీకరణాలు)
1. Why should a magnesium ribbon be cleaned with sandpaper before burning it in air? / మెగ్నీషియం రిబ్బన్‌ను మండించే ముందు గరుకు కాగితంతో ఎందుకు శుభ్రం చేయాలి? [1 మార్కు]
జవాబు చూడండి
2. Why do we balance a chemical equation? / రసాయన సమీకరణాన్ని ఎందుకు తుల్యం చేస్తాం? [1 మార్కు]
జవాబు చూడండి
3. Identify the substance oxidised and the substance reduced: CuO + H₂ = Cu + H₂O (on heating). / ఆక్సీకరణం, క్షయకరణం చెందినవి ఏవి? [1 మార్కు] SA1 2026 Q1 (క్షయకరణ ప్రయోగం) ఇదే అంశం
జవాబు చూడండి
4. Why is respiration considered an exothermic reaction? Write the equation. / శ్వాసక్రియను ఉష్ణమోచక చర్య అని ఎందుకు అంటారు? [2 మార్కులు]
జవాబు చూడండి
C₆H₁₂O₆ + 6O₂ = 6CO₂ + 6H₂O + శక్తి
5. What happens when an iron nail is dipped in copper sulphate solution for about 20 minutes? Write the equation. / ఇనుప మేకును కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఉంచితే ఏమి జరుగుతుంది? [2 మార్కులు]
జవాబు చూడండి
Fe + CuSO₄ = FeSO₄ + Cu
ఇనుము రాగి కంటే ఎక్కువ చర్యాశీలత కలది కాబట్టి రాగిని దాని లవణం నుంచి స్థానభ్రంశం చేస్తుంది (స్థానభ్రంశ చర్య).
6. What is rancidity? Write any three ways to prevent it. / ముక్కిపోవడం (Rancidity) అంటే ఏమిటి? నివారణ మార్గాలు రాయండి. [4 మార్కులు]
జవాబు చూడండి
నివారణ:
1) యాంటీ ఆక్సిడెంట్లు కలపడం.
2) చిప్స్ ప్యాకెట్లలో ఆక్సిజన్‌కు బదులు నైట్రోజన్ వాయువు నింపడం.
3) గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయడం.
4) ఫ్రిజ్‌లో (తక్కువ ఉష్ణోగ్రతలో) ఉంచడం; వెలుతురు పడకుండా ఉంచడం.
7. What is corrosion? Give two examples. How can the corrosion of iron be prevented? / క్షయం (Corrosion) అంటే ఏమిటి? ఇనుము తుప్పు పట్టకుండా ఎలా ఆపవచ్చు? [4 మార్కులు]
జవాబు చూడండి
ఉదాహరణలు: ఇనుము మీద ఎర్రని గోధుమ రంగు తుప్పు; రాగి మీద ఆకుపచ్చ పూత; వెండి మీద నల్లని పూత.
నివారణ: 1) రంగు వేయడం 2) నూనె, గ్రీజు పూయడం 3) జింక్ పూత (గాల్వనీకరణం) 4) క్రోమియం పూత 5) మిశ్రమ లోహాలు (స్టెయిన్‌లెస్ స్టీల్) వాడటం.
8. Explain four types of chemical reactions with one balanced equation for each. / నాలుగు రకాల రసాయన చర్యలను ఒక్కో ఉదాహరణతో వివరించండి. [8 మార్కులు] SA1 2026 Q16 A (8 మార్కులు) ఇదే ప్రశ్న
జవాబు చూడండి
2) వియోగ చర్య: ఒక పదార్థం విడిపోయి రెండు లేదా ఎక్కువ పదార్థాలు ఏర్పడటం. CaCO₃ = CaO + CO₂ (వేడి చేసినప్పుడు, ఉష్ణ వియోగం). 2AgCl = 2Ag + Cl₂ (సూర్యకాంతిలో, కాంతి వియోగం). 2H₂O = 2H₂ + O₂ (విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు).
3) స్థానభ్రంశ చర్య: ఎక్కువ చర్యాశీలత కల మూలకం తక్కువ చర్యాశీలత కల మూలకాన్ని దాని సమ్మేళనం నుంచి తొలగించడం. Zn + CuSO₄ = ZnSO₄ + Cu.
4) ద్విస్థానభ్రంశ చర్య: రెండు సమ్మేళనాల మధ్య అయాన్ల మార్పిడి. Na₂SO₄ + BaCl₂ = BaSO₄ + 2NaCl (తెల్లని అవక్షేపం BaSO₄).
(ఇంకా: రెడాక్స్ చర్య CuO + H₂ = Cu + H₂O.) పరీక్షలో ప్రతి చర్యకు నిర్వచనం, తుల్య సమీకరణం, పరిశీలన రాస్తే పూర్తి మార్కులు.
Chapter 2 – Acids, Bases and Salts (ఆమ్లాలు, క్షారాలు, లవణాలు)
9. What colour does phenolphthalein show in a basic solution? / క్షార ద్రావణంలో ఫినాల్ఫ్తలీన్ ఏ రంగు చూపుతుంది? [1 మార్కు]
జవాబు చూడండి
10. Write the chemical formulae of baking soda and Plaster of Paris. / వంట సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన ఫార్ములాలు రాయండి. [1 మార్కు]
జవాబు చూడండి
11. Solution P has pH 2 and solution Q has pH 5. Which is the stronger acid? / ఏది బలమైన ఆమ్లం? [1 మార్కు] SA1 2026 Q3, Q13 pH పట్టిక ప్రశ్నలు ఇదే అంశం
జవాబు చూడండి
12. Why should we always add acid to water and not water to acid while diluting? / ఆమ్లాన్ని విలీనం చేసేటప్పుడు ఆమ్లాన్నే నీటిలో ఎందుకు కలపాలి? [2 మార్కులు]
జవాబు చూడండి
13. Why does tooth decay start when the pH of the mouth falls below 5.5? How can we prevent it? / నోటిలో pH 5.5 కంటే తగ్గితే దంతక్షయం ఎందుకు మొదలవుతుంది? [2 మార్కులు]
జవాబు చూడండి
14. What is the chlor-alkali process? Name the products formed and write one use of each. / క్లోర్-ఆల్కలీ ప్రక్రియ అంటే ఏమిటి? [4 మార్కులు]
జవాబు చూడండి
2NaCl + 2H₂O = 2NaOH + Cl₂ + H₂
1) Cl₂ ఆనోడ్ వద్ద: నీటి శుద్ధి, బ్లీచింగ్ పౌడర్, PVC తయారీ.
2) H₂ కాథోడ్ వద్ద: ఇంధనం, వనస్పతి (మార్జరీన్), అమ్మోనియా తయారీ.
3) NaOH కాథోడ్ దగ్గర: సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం తయారీ, లోహాల గ్రీజు తొలగింపు.
15. Explain the importance of pH in everyday life with any four examples. / దైనందిన జీవితంలో pH ప్రాముఖ్యతను నాలుగు ఉదాహరణలతో వివరించండి. [4 మార్కులు]
జవాబు చూడండి
2) దంతక్షయం: నోటిలో pH 5.5 కంటే తగ్గితే ఎనామెల్ దెబ్బతింటుంది.
3) నేల: మొక్కలు ఒక నిర్దిష్ట pH పరిధిలోనే బాగా పెరుగుతాయి; నేల ఆమ్లత్వం ఎక్కువైతే సున్నం (క్షారం) కలుపుతారు.
4) కీటకాల కాటు: తేనెటీగ కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లం; వంట సోడా వంటి బలహీన క్షారం పూస్తే ఉపశమనం.
5) మన శరీరం pH 7.0 – 7.8 పరిధిలోనే పనిచేస్తుంది; ఆమ్ల వర్షం (pH 5.6 కంటే తక్కువ) నదుల్లో జలచరాలకు హాని.
16. Describe an activity to show that acids react with metals to produce hydrogen gas. How will you test the gas? / ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ ఇస్తాయని చూపే కృత్యం వివరించండి. [8 మార్కులు]
జవాబు చూడండి
విధానం: 1) పరీక్ష నాళికలో జింక్ ముక్కలు వేసి 5 mL సజల H₂SO₄ పోయాలి. 2) జింక్ ఉపరితలంపై బుడగలు ఏర్పడతాయి. 3) వెలువడిన వాయువును సబ్బు ద్రావణం గుండా పంపితే సబ్బు బుడగలు ఏర్పడతాయి. 4) మండుతున్న కొవ్వొత్తిని బుడగ దగ్గరకు తెస్తే టప్ అనే శబ్దం (pop sound)తో మండుతుంది.
సమీకరణం: Zn + H₂SO₄ = ZnSO₄ + H₂
నిర్ధారణ: ఆమ్లం + లోహం = లవణం + హైడ్రోజన్ వాయువు. టప్ శబ్దమే హైడ్రోజన్ పరీక్ష.
జాగ్రత్తలు: సజల ఆమ్లమే వాడాలి; మంటను నేరుగా పరీక్ష నాళిక మూతికి తేకూడదు.
Chapter 3 – Metals and Non-metals (లోహాలు, అలోహాలు)
17. Name a metal and a non-metal that are liquids at room temperature. / గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే లోహం, అలోహం? [1 మార్కు]
జవాబు చూడండి
18. Why is sodium kept immersed in kerosene oil? / సోడియంను కిరోసిన్‌లో ఎందుకు ఉంచుతారు? [1 మార్కు]
జవాబు చూడండి
19. Are all metal oxides basic? Give an example. / లోహ ఆక్సైడ్లన్నీ క్షార స్వభావం కలవేనా? [1 మార్కు] SA1 2026 Q4 (సురేష్ వాదన) ఇదే అంశం
జవాబు చూడండి
Al₂O₃ + 6HCl = 2AlCl₃ + 3H₂O; Al₂O₃ + 2NaOH = 2NaAlO₂ + H₂O
20. Why should pickles and curd not be stored in copper or brass vessels? / పచ్చళ్లు, పెరుగును రాగి, ఇత్తడి పాత్రల్లో ఎందుకు నిల్వ చేయకూడదు? [2 మార్కులు] SA1 2026 Q2 ఇదే ప్రశ్న
జవాబు చూడండి
21. Write any four properties of ionic compounds. / అయానిక సమ్మేళనాల నాలుగు ధర్మాలు రాయండి. [2 మార్కులు]
జవాబు చూడండి
2) అయాన్ల మధ్య బలమైన ఆకర్షణ వల్ల ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు ఎక్కువ.
3) నీటిలో కరుగుతాయి; కిరోసిన్, పెట్రోల్ వంటి వాటిలో కరగవు.
4) ద్రవ స్థితిలో లేదా జల ద్రావణంలో విద్యుత్ వాహకాలు (అయాన్లు కదలగలవు); ఘన స్థితిలో వాహకాలు కావు. ఉదా: NaCl, MgCl₂.
22. Explain the formation of sodium chloride and magnesium chloride by the transfer of electrons. / ఎలక్ట్రాన్ల బదిలీ ద్వారా NaCl, MgCl₂ ఏర్పడటం వివరించండి. [4 మార్కులు]
జవాబు చూడండి
MgCl₂: Mg (2, 8, 2) రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయి Mg²⁺ అవుతుంది. రెండు Cl పరమాణువులు ఒక్కో ఎలక్ట్రాన్ పొంది 2Cl⁻ అవుతాయి. Mg²⁺(Cl⁻)₂.
పరీక్షలో ఎలక్ట్రాన్ చుక్కల (electron dot) పటం గీసి, బదిలీ అయిన ఎలక్ట్రాన్‌ను స్పష్టంగా చూపాలి.
23. Explain the steps involved in the extraction of metals of low, medium and high reactivity. / చర్యాశీలత ఆధారంగా లోహ నిష్కర్షణ సోపానాలు వివరించండి. [4 మార్కులు]
జవాబు చూడండి
2) తక్కువ చర్యాశీలత (Hg, Cu): సల్ఫైడ్ ఖనిజాన్ని గాలిలో వేడి చేస్తేనే లోహం వస్తుంది. 2HgS + 3O₂ = 2HgO + 2SO₂; 2HgO = 2Hg + O₂.
3) మధ్యస్థ చర్యాశీలత (Zn, Fe, Pb): సల్ఫైడ్‌ను గాలిలో వేడి చేయడం (భర్జనం, roasting): 2ZnS + 3O₂ = 2ZnO + 2SO₂; కార్బొనేట్‌ను గాలి లేకుండా వేడి చేయడం (భస్మీకరణం, calcination): ZnCO₃ = ZnO + CO₂; తర్వాత కార్బన్‌తో క్షయకరణం: ZnO + C = Zn + CO.
4) ఎక్కువ చర్యాశీలత (Na, Mg, Ca, Al): కరిగిన క్లోరైడ్‌ల విద్యుత్ విశ్లేషణ (కార్బన్ వీటిని క్షయకరించలేదు).
5) శుద్ధి: విద్యుత్ శోధనం; అశుద్ధ లోహం ఆనోడ్, శుద్ధ లోహం కాథోడ్.
24. What is the reactivity series? Arrange K, Cu, Zn, Fe, Na, Au, Al, Mg in decreasing order of reactivity and explain any two uses of the series. / చర్యాశీలత శ్రేణిని వివరించండి. [8 మార్కులు]
జవాబు చూడండి
క్రమం (ఎక్కువ నుంచి తక్కువ): K, Na, Mg, Al, Zn, Fe, (H), Cu, Au.
ఉపయోగాలు:
1) స్థానభ్రంశం ఊహించడం: శ్రేణిలో పైన ఉన్న లోహం కింది లోహాన్ని దాని లవణ ద్రావణం నుంచి స్థానభ్రంశం చేస్తుంది. Fe + CuSO₄ = FeSO₄ + Cu జరుగుతుంది; Cu + FeSO₄ జరగదు.
2) ఆమ్లాలతో హైడ్రోజన్: హైడ్రోజన్ కంటే పైన ఉన్న లోహాలే సజల ఆమ్లాల నుంచి H₂ విడుదల చేస్తాయి; Cu, Au చేయవు.
3) నిష్కర్షణ పద్ధతి ఎంపిక: పైన ఉన్నవి విద్యుత్ విశ్లేషణతో, మధ్యలోనివి కార్బన్ క్షయకరణంతో, కింద ఉన్నవి వేడి చేయడంతోనే లభిస్తాయి.
4) ప్రకృతిలో లభ్యత: బంగారం, వెండి వంటి తక్కువ చర్యాశీలత లోహాలు స్వేచ్ఛా స్థితిలో దొరుకుతాయి; K, Na ఎప్పుడూ సమ్మేళనాలుగానే ఉంటాయి.
Chapter 4 – Carbon and its Compounds (కార్బన్, దాని సమ్మేళనాలు)
25. Which of the following is an alkane: C₂H₂, C₂H₄, C₃H₈, C₃H₄? / ఆల్కేన్ ఏది? [1 మార్కు] SA1 2026 Q5 ఇదే అంశం
జవాబు చూడండి
26. What is catenation? / శృంఖలీకరణం (Catenation) అంటే ఏమిటి? [1 మార్కు]
జవాబు చూడండి
27. Write the next two members of the homologous series whose first member is C₂H₂. / మొదటి సభ్యుడు C₂H₂ అయిన సమజాత శ్రేణిలో తర్వాతి రెండు సభ్యులు? [1 మార్కు] SA1 2026 Q9 ఇదే ప్రశ్న
జవాబు చూడండి
28. Why does carbon form covalent bonds and not ionic bonds? / కార్బన్ అయానిక బంధాలు కాకుండా సమయోజనీయ బంధాలు ఎందుకు ఏర్పరుస్తుంది? [2 మార్కులు]
జవాబు చూడండి
29. Write two differences between soaps and detergents. / సబ్బులు, డిటర్జెంట్ల మధ్య రెండు తేడాలు రాయండి. [2 మార్కులు]
జవాబు చూడండి
2) సబ్బులు కఠిన జలంలో (Ca²⁺, Mg²⁺) స్కమ్ (అవక్షేపం) ఏర్పరిచి పని చేయవు; డిటర్జెంట్లు కఠిన జలంలోనూ నురగ ఇచ్చి బాగా పనిచేస్తాయి.
30. What is esterification? Write the equation for the reaction between ethanoic acid and ethanol. Give one use of esters. / ఎస్టరీకరణం అంటే ఏమిటి? [4 మార్కులు]
జవాబు చూడండి
CH₃COOH + C₂H₅OH = CH₃COOC₂H₅ + H₂O (గాఢ H₂SO₄ సమక్షంలో వేడి చేసినప్పుడు)
ఏర్పడిన ఇథైల్ ఇథనోయేట్ తియ్యని (పండ్ల) వాసన కలది. ఉపయోగం: సుగంధ ద్రవ్యాలు, ఆహార రుచి పదార్థాల తయారీ. ఎస్టర్‌ను NaOH తో వేడి చేస్తే మళ్లీ ఆల్కహాల్, ఆమ్ల సోడియం లవణం ఏర్పడతాయి (సబ్బు తయారీ, saponification).
31. Write any four characteristics of a homologous series. / సమజాత శ్రేణి లక్షణాలు నాలుగు రాయండి. [4 మార్కులు]
జవాబు చూడండి
2) వరుస సభ్యుల మధ్య CH₂ తేడా, ద్రవ్యరాశిలో 14 u తేడా.
3) ఒకే ప్రమేయ సమూహం ఉండటం వల్ల రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి.
4) అణు ద్రవ్యరాశి పెరిగేకొద్దీ ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు వంటి భౌతిక ధర్మాలు క్రమంగా మారతాయి.
ఉదా: CH₃OH, C₂H₅OH, C₃H₇OH (ఆల్కహాల్ శ్రేణి).
32. Explain the cleansing action of soap with the formation of micelles. / సబ్బు శుభ్రపరిచే విధానాన్ని (మిసెల్ ఏర్పాటు) వివరించండి. [8 మార్కులు] SA1 2026 Q16 B (8 మార్కులు) ఇదే ప్రశ్న
జవాబు చూడండి
2) మురికి ఎక్కువగా నూనె, గ్రీజు రూపంలో ఉంటుంది; అది నీటిలో కరగదు.
3) సబ్బు నీటిలో కలిపినప్పుడు తోకలు నూనె మురికిలోకి చొచ్చుకుపోతాయి, తలలు బయట నీటి వైపు ఉంటాయి. ఇలా మురికి చుట్టూ గోళాకార సమూహాలు ఏర్పడతాయి. వీటిని మిసెల్‌లు (micelles) అంటారు.
4) మిసెల్‌ల బయటి వైపు ఒకే రకమైన ఆవేశాలు ఉండటం వల్ల అవి ఒకదానినొకటి వికర్షించుకుంటాయి, కలిసిపోవు; నీటిలో తేలుతూ ఉంటాయి (ఎమల్షన్).
5) బట్టలను ఉతికినప్పుడు, నీటితో కడిగినప్పుడు మిసెల్‌లతో పాటు మురికి కొట్టుకుపోతుంది.
పరీక్షలో మిసెల్ పటం గీసి తల, తోక, మధ్యలో నూనె మురికి భాగాలను గుర్తించాలి.
రసాయన శాస్త్రంలో మార్కులు ఎక్కడ పోతాయి
- తుల్యం చేయని సమీకరణం: సమీకరణం సరైనదే అయినా పరమాణువుల సంఖ్య సరిపోకపోతే సగం మార్కులు పోతాయి. రాసిన తర్వాత ప్రతి మూలకాన్ని లెక్కించండి.
- చర్య పరిస్థితులు వదిలేయడం: వేడి, సూర్యకాంతి, విద్యుత్, గాఢ H₂SO₄ వంటివి సమీకరణం పైన లేదా పక్కన రాయాలి.
- పరిశీలన రాయకపోవడం: ‘ఏమి జరుగుతుంది?’ ప్రశ్నకు రంగు మార్పు, బుడగలు, అవక్షేపం, టప్ శబ్దం వంటి పరిశీలనలే ముఖ్యం; సమీకరణం ఒక్కటే రాస్తే మార్కులు తగ్గుతాయి.
- ఫార్ములాల్లో తప్పులు: NaHCO₃, CaSO₄.½H₂O, CaOCl₂, CuSO₄.5H₂O వంటి వాటిని పదే పదే రాసి చూసుకోండి.
- పటం లేకుండా జవాబు: మిసెల్, ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణం, విద్యుత్ శోధనం ప్రశ్నలకు భాగాలు గుర్తించిన పటం తప్పనిసరి.
- pH దిశ తారుమారు: pH తక్కువ అంటే ఆమ్లం ఎక్కువ బలమైనది; SA1 లో చాలా మంది ఇక్కడే తప్పు చేశారు.
పాఠాల వారీ ముఖ్య రసాయన సమీకరణాల కోసం 10th Class Chemistry Chemical Equations in Telugu PDF కూడా చూడండి.
10th Class Chemistry Important Questions PDF డౌన్‌లోడ్
ఈ పేజీలోని 32 ప్రశ్నలు, జవాబులు ఒకే PDF లో (ప్రింట్ తీసుకుని చదవడానికి). 2026-27 కొత్త సిలబస్ ప్రకారం.
10th Class Chemistry Important Questions with Answers PDF డౌన్‌లోడ్
FAQs – 10th Class Chemistry Important Questions
2026-27 పదో తరగతి రసాయన శాస్త్రంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
నాలుగు: Chemical Reactions and Equations, Acids, Bases and Salts, Metals and Non-metals, Carbon and its Compounds. ఇవి భౌతిక రసాయన శాస్త్రం పుస్తకంలో 1 నుంచి 4 అధ్యాయాలు.
Atomic Structure, Chemical Bonding, Periodic Classification ఈ సంవత్సరం సిలబస్‌లో ఉన్నాయా?
లేవు. ఇవి పాత AP పుస్తకంలోని పాఠాలు. 2026-27 నుంచి పదో తరగతికి NCERT అధ్యాయాలతో కూడిన AP SCERT ద్విభాషా పుస్తకం అమలులో ఉంది; అందులో ఈ పాఠాలు లేవు.
ఈ పేజీలోని ప్రశ్నలు SSC 2027 పబ్లిక్ పరీక్షకు ఉపయోగపడతాయా?
అవును. ఇవి కొత్త పుస్తకంలోని ముఖ్య అంశాల నుంచే; వాటిలో కొన్ని SA1 2026 పేపర్‌లో నేరుగా వచ్చాయి. SSC 2027 అధికారిక బ్లూప్రింట్ వచ్చిన తర్వాత ఈ పేజీని దాని ప్రకారం అప్‌డేట్ చేస్తాం.
SA1 2026 భౌతిక శాస్త్రం పేపర్‌లో రసాయన శాస్త్రం నుంచి ఎన్ని మార్కులు వచ్చాయి?
50 మార్కుల్లో 19 మార్కులు: 1 మార్కు ప్రశ్నలు ఐదు, 2 మార్కుల ప్రశ్న ఒకటి, 4 మార్కుల ప్రశ్న ఒకటి, 8 మార్కుల ప్రశ్న ఒకటి.
10th Class Chemistry Important Questions PDF ఉచితమా?
అవును, ఈ పేజీలోని PDF పూర్తిగా ఉచితం. అందులో ఈ పేజీలోని అన్ని ప్రశ్నలు, జవాబులు ఉన్నాయి.
రసాయన సమీకరణాల్లో బాణం గుర్తుకు బదులు = ఎందుకు రాశారు?
వెబ్ పేజీ, PDF అన్ని ఫోన్లలో సరిగ్గా కనిపించాలని ఇక్కడ = వాడాం. పరీక్షలో మీరు మీ పుస్తకంలో ఉన్నట్టు బాణం గుర్తుతోనే రాయండి.
ఏ అధ్యాయం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి?
అధికారిక మార్కుల విభజన బ్లూప్రింట్‌లోనే ఉంటుంది. SA1 2026 పేపర్‌లో Acids, Bases and Salts నుంచి 5, Carbon and its Compounds నుంచి 3, Metals and Non-metals నుంచి 2, Chemical Reactions and Equations నుంచి 1 మార్కు ప్రశ్నలు వచ్చాయి; 8 మార్కుల ప్రశ్న 16 లో A (Chapter 1) లేదా B (Chapter 4) ఎంచుకోవచ్చు. నాలుగు అధ్యాయాల నుంచీ ప్రశ్నలు వచ్చాయి కాబట్టి ఒక్క అధ్యాయాన్నీ వదలకండి.
తెలుగు మీడియం విద్యార్థులు ఈ పేజీ వాడవచ్చా?
వాడవచ్చు. ప్రశ్నలు పుస్తకంలాగే ఇంగ్లీష్, తెలుగు రెండింటిలో ఉన్నాయి; జవాబులు తెలుగులో, ముఖ్య పదాలు, ఫార్ములాలు ఇంగ్లీష్‌లో ఉన్నాయి.
8 మార్కుల ప్రశ్నకు ఎంత రాయాలి?
నిర్వచనం, తుల్య సమీకరణాలు, పరిశీలనలు, అవసరమైతే భాగాలు గుర్తించిన పటం. సుమారు ఒకటిన్నర నుంచి రెండు పేజీలు సరిపోతాయి; పాయింట్ల వారీగా రాస్తే మూల్యాంకనం సులభం.
Mission March స్లిప్ టెస్టులు ఎక్కడ దొరుకుతాయి?
పదో తరగతి అన్ని సబ్జెక్టుల స్లిప్ టెస్టులు Mission March SSC 2027 PDF – Slip Test Papers పేజీలో ఉన్నాయి.
పాత సిలబస్ రసాయన శాస్త్రం ప్రశ్నల పేజీలు చదవాలా?
వద్దు. పాత పాఠాలు (Atomic Structure, Chemical Bonding, Solutions) కొత్త పరీక్షల్లో రావు. ఈ పేజీ, అధ్యాయాల వారీ Solutions పేజీలు మాత్రమే చదవండి.
1) Chemical Reactions and Equations Solutions – పాఠ్యపుస్తక ప్రశ్నలు, కృత్యాలు, తెలుగు మీడియం జవాబులు ఒకే చోట.
2) AP SSC Model Papers 2027 – ముఖ్య ప్రశ్నలు చదివాక పూర్తి పేపర్ రాసి సమయం చూసుకోవడానికి.
3) AP SSC Blueprint 2027 – ఏ రకం ప్రశ్నకు ఎన్ని మార్కులో తెలుసుకోవడానికి.
ఆధారాలు: అధ్యాయాల పేర్లు AP SCERT 2026-27 పదో తరగతి భౌతిక రసాయన శాస్త్రం పుస్తకం, 28-10-2026 SA1 సిలబస్ ఉత్తర్వు, 16 నవంబర్ 2026 SA1 పేపర్ ఆధారంగా. పుస్తకాల కోసం cse.ap.gov.in, ncert.nic.in/textbook.php చూడండి. ఈ ప్రశ్నలు, జవాబులు apboardsolutionsclass10.com తయారు చేసినవి.







Comments are closed.