AP 10th Class Physical Science 1st Lesson Questions and Answers – Chemical Reactions and Equations (రసాయన చర్యలు, సమీకరణాలు)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

10th Class Physical Science 1st Lesson Questions and Answers — పదో తరగతి భౌతిక శాస్త్రం మొదటి పాఠం Chemical Reactions and Equations (రసాయన చర్యలు, సమీకరణాలు) లోని అన్ని పాఠ్యపుస్తకం ప్రశ్నలకు జవాబులు ఇక్కడ ఉన్నాయి. పాఠం మధ్యలో వచ్చే ప్రశ్నలు (In-text), పుస్తకంలోని 11 కృత్యాల (Lab Activities) పరిశీలనలు, పాఠం చివరి 20 అభ్యాస ప్రశ్నలు, అదనంగా పరీక్షకు ముఖ్యమైన 1, 2, 4 మార్కుల ప్రశ్నలు, 10 ప్రశ్నల క్విజ్ ఒకే పేజీలో ఇచ్చాం.

ప్రతి జవాబు పరీక్షలో రాసే విధంగా ఇంగ్లీష్‌లో, దాని కింద తెలుగులో వివరణతో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరూ ఉపయోగించుకోవచ్చు. సమీకరణాలన్నీ సమతుల్యం (balanced) చేసి రాశాం.

పదో తరగతి పరీక్ష పేపర్లు, వాటి జవాబులు వచ్చిన వెంటనే లింక్ రావాలంటే WhatsApp గ్రూప్‌లో చేరండి

ఈ పేజీలో: పాఠంలో ఏముంది | రసాయన చర్యల రకాలు | In-text ప్రశ్నలు | కృత్యాలు (Lab Activities) | అభ్యాస ప్రశ్నలు 1-20 | తెలుగు మీడియం జవాబులు | ముఖ్య ప్రశ్నలు | క్విజ్ | మార్కులు పోయే చోట్లు | FAQs

తర్వాతి పాఠం: 10th Class Physical Science 2nd Lesson Questions and Answers – Acids, Bases and Salts. ఎనిమిది పాఠాల జవాబులు ఒకే చోట AP 10th Class Physical Science Solutions 2026-27 పేజీలో ఉన్నాయి.

10th Class Physical Science 1st Lesson Questions and Answers — పాఠంలో ఏముంది

AP SCERT 2026-27 పదో తరగతి భౌతిక శాస్త్రంలో ఎనిమిది పాఠాలు ఉన్నాయి. ఉపాధ్యాయ కరదీపిక ప్రకారం ఈ పాఠం జూన్‌లో చెప్పే మొదటి పాఠం. మిగతా రసాయన శాస్త్ర పాఠాలన్నింటికీ ఇదే పునాది, అందుకే SA1, SSC రెండు పరీక్షల్లోనూ దీని నుంచి ప్రశ్నలు తప్పకుండా వస్తాయి.

విభాగంఅంశంఈ పేజీలో
1.1రసాయన సమీకరణాలు రాయడం, సమతుల్యం చేయడం, స్థితి సంకేతాలు (s, l, g, aq)In-text 1-3, అభ్యాసం 4-8
1.2రసాయన చర్యల రకాలు: సంయోగం, వియోగం, స్థానభ్రంశం, ద్వంద్వ స్థానభ్రంశం, ఆక్సీకరణ-క్షయకరణంIn-text 4-8, అభ్యాసం 1-3, 9-17
1.3దైనందిన జీవితంలో ఆక్సీకరణ ప్రభావాలు: క్షయం (corrosion), ముక్కిపోవడం (rancidity)అభ్యాసం 18-20

పాఠం నోట్స్ తెలుగులో కావాలంటే 10th Class Chemistry Chapter 1 Notes in Telugu చూడండి. ఈ పాఠంలోని అన్ని సమీకరణాలు ఒకే చోట 10th Class Chemistry Chemical Equations in Telugu లో ఉన్నాయి.

రసాయన చర్యలు, సమీకరణాలు — రసాయన చర్యల రకాలు ఒక్క చూపులో

ఈ పాఠంలో సగం ప్రశ్నలు “ఈ చర్య ఏ రకం?” అనే దాని మీదే ఉంటాయి. కింది పట్టికలోని సాధారణ రూపం గుర్తుంటే ఏ సమీకరణం చూసినా రకం వెంటనే చెప్పగలరు.

రకంసాధారణ రూపంఉదాహరణ
సంయోగం
(Combination)
A + B → ABCaO + H2O → Ca(OH)2
వియోగం
(Decomposition)
AB → A + BCaCO3 → CaO + CO2
స్థానభ్రంశం
(Displacement)
A + BC → AC + BFe + CuSO4 → FeSO4 + Cu
ద్వంద్వ స్థానభ్రంశం
(Double displacement)
AB + CD → AD + CBNa2SO4 + BaCl2 → BaSO4 + 2NaCl
ఆక్సీకరణ-క్షయకరణం
(Redox)
ఒకటి O పొందుతుంది, మరొకటి కోల్పోతుందిCuO + H2 → Cu + H2O

సంయోగంలో కలుస్తాయి, వియోగంలో విడిపోతాయి. స్థానభ్రంశంలో చురుకైన మూలకం తక్కువ చురుకైన మూలకాన్ని బయటకు పంపుతుంది. ద్వంద్వ స్థానభ్రంశంలో రెండు సమ్మేళనాల అయాన్లు స్థానాలు మార్చుకుంటాయి.

10th Class Physical Science 1st Lesson Questions and Answers - Chemical Reactions and Equations, 5 రకాల రసాయన చర్యల చార్ట్

ఉష్ణమోచక చర్య (exothermic) లో వేడి బయటకు వస్తుంది, ఉష్ణగ్రాహక చర్య (endothermic) లో వేడి లోపలికి తీసుకుంటుంది. ఇవి పై ఐదు రకాలతో పాటు అదనంగా చెప్పే లక్షణాలు.

10th Class Physical Science 1st Lesson In-text Questions and Answers

పాఠం మధ్యలో మూడు చోట్ల ప్రశ్నలు వస్తాయి. ఇవి చిన్నవి కానీ FA, SA పేపర్లలో నేరుగా అడుగుతారు.

1. Why should a magnesium ribbon be cleaned before burning it in air?

జవాబు చూడండి
Answer: Magnesium reacts slowly with air and forms a white layer of magnesium oxide on its surface. This layer stops the ribbon from burning. Cleaning with sandpaper removes the layer so that pure magnesium burns easily.
తెలుగులో: మెగ్నీషియం తీగ మీద గాలి వల్ల తెల్లటి ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది. అది మండటాన్ని అడ్డుకుంటుంది. గరుకు కాగితంతో రుద్ది ఆ పొర తీసేస్తే తీగ సులువుగా మండుతుంది.

2. Write balanced equations: (i) hydrogen + chlorine gives hydrogen chloride (ii) barium chloride + aluminium sulphate gives barium sulphate + aluminium chloride (iii) sodium + water gives sodium hydroxide + hydrogen

జవాబు చూడండి
Answer: (i) H2 + Cl2 → 2HCl
(ii) 3BaCl2 + Al2(SO4)3 → 3BaSO4 + 2AlCl3
(iii) 2Na + 2H2O → 2NaOH + H2
తెలుగులో: ప్రతి సమీకరణంలో ఎడమ, కుడి వైపుల్లో ప్రతి మూలకం పరమాణువుల సంఖ్య సమానంగా ఉందో లెక్కపెట్టి చూడండి.

3. Write balanced equations with state symbols: (i) barium chloride and sodium sulphate solutions react to give insoluble barium sulphate and sodium chloride solution (ii) sodium hydroxide solution reacts with hydrochloric acid solution to give sodium chloride solution and water

జవాబు చూడండి
Answer: (i) BaCl2(aq) + Na2SO4(aq) → BaSO4(s) + 2NaCl(aq)
(ii) NaOH(aq) + HCl(aq) → NaCl(aq) + H2O(l)
తెలుగులో: aq = నీటిలో ద్రావణం, s = ఘనం (అవక్షేపం), l = ద్రవం, g = వాయువు. నీటిలో కరగని BaSO4 కి (s) రాయాలి.

4. A solution of substance X is used for whitewashing. (i) Name X and write its formula. (ii) Write the reaction of X with water.

జవాబు చూడండి
Answer: (i) X is calcium oxide (quick lime), CaO.
(ii) CaO(s) + H2O(l) → Ca(OH)2(aq) + heat
తెలుగులో: పొడి సున్నం (CaO) నీటితో కలిసి తడి సున్నం (Ca(OH)2) అవుతుంది, ఎక్కువ వేడి విడుదలవుతుంది. ఈ ద్రావణంతోనే గోడలకు సున్నం వేస్తారు.

5. Why is the amount of gas collected in one test tube during electrolysis of water double that in the other? Name the gas.

జవాబు చూడండి
Answer: Water (H2O) has two hydrogen atoms for every oxygen atom. So on electrolysis, the volume of hydrogen formed is twice the volume of oxygen: 2H2O(l) → 2H2(g) + O2(g). The gas collected in double amount is hydrogen.
తెలుగులో: నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్ 2 : 1 నిష్పత్తిలో ఉంటాయి. అందుకే ఒక పరీక్ష నాళికలో హైడ్రోజన్ రెట్టింపు వస్తుంది.

6. Why does the colour of copper sulphate solution change when an iron nail is dipped in it?

జవాబు చూడండి
Answer: Iron is more reactive than copper. It displaces copper from copper sulphate and forms iron sulphate, which is light green: Fe(s) + CuSO4(aq) → FeSO4(aq) + Cu(s). So the blue colour fades and a brown coating of copper forms on the nail.
తెలుగులో: ఇనుము రాగి కంటే చురుకైనది. నీలి రంగు ద్రావణం లేత ఆకుపచ్చగా మారుతుంది, మేకు మీద గోధుమ రంగు రాగి పూత వస్తుంది.

7. Give an example of a double displacement reaction other than the one in Activity 1.10.

జవాబు చూడండి
Answer: Pb(NO3)2(aq) + 2KI(aq) → PbI2(s) + 2KNO3(aq) (yellow precipitate of lead iodide). Another example: AgNO3(aq) + NaCl(aq) → AgCl(s) + NaNO3(aq)
తెలుగులో: రెండు సమ్మేళనాలు అయాన్లను మార్చుకుంటాయి. పసుపు రంగు అవక్షేపం లెడ్ అయొడైడ్.

8. Identify the substances oxidised and reduced: (i) 4Na(s) + O2(g) → 2Na2O(s) (ii) CuO(s) + H2(g) → Cu(s) + H2O(l)

జవాబు చూడండి
Answer: (i) Sodium is oxidised (gains oxygen); oxygen is reduced.
(ii) Hydrogen is oxidised (gains oxygen to form water); copper(II) oxide is reduced (loses oxygen).
తెలుగులో: ఆక్సిజన్ పొందేది ఆక్సీకరణం చెందుతుంది, ఆక్సిజన్ కోల్పోయేది క్షయకరణం చెందుతుంది.

10th Class Physical Science 1st Lesson Lab Activities – కృత్యాలు 1.1 నుంచి 1.11

2026-27 AP పాఠ్యపుస్తకం (ఇంగ్లీష్, తెలుగు రెండు భాషల్లో) ఈ పాఠంలో 11 కృత్యాలు, ఒక అదనపు కృత్యం, పాఠం చివర ఒక సమూహ కృత్యం ఇచ్చింది. ప్రయోగ రికార్డు రాసేటప్పుడు, “ఈ కృత్యంలో ఏం గమనించారు?” అనే ప్రశ్నలకు ఇవి ఉపయోగపడతాయి. ప్రతి కృత్యం కింద బటన్ నొక్కితే పరిశీలన, సమీకరణం, చర్య రకం కనిపిస్తాయి.

కృత్యంఏం చేస్తారుపుస్తకం పేజీ (English / తెలుగు)
కృత్యం 1.1మెగ్నీషియం రిబ్బన్‌ను గాలిలో మండించడం4 / 5
కృత్యం 1.2లెడ్ నైట్రేట్ ద్రావణానికి పొటాషియం అయోడైడ్ కలపడం6 / 7
కృత్యం 1.3జింక్ ముక్కలపై సజల ఆమ్లం పోయడం6 / 7
కృత్యం 1.4కాల్షియం ఆక్సైడ్ (పొడి సున్నం) మీద నీరు పోయడం14 / 15
కృత్యం 1.5ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాలను వేడి చేయడం18 / 19
కృత్యం 1.6లెడ్ నైట్రేట్ పొడిని వేడి చేయడం18 / 19
కృత్యం 1.7నీటి విద్యుత్ విశ్లేషణ20 / 21
కృత్యం 1.8సిల్వర్ క్లోరైడ్‌ను ఎండలో ఉంచడం20 / 21
అదనపు కృత్యంక్రింది కృత్యాన్ని చేయండి: బేరియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం క్లోరైడ్22 / 23
కృత్యం 1.9కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుప మేకులు22 / 23
కృత్యం 1.10సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ ద్రావణాలు కలపడం24 / 25
కృత్యం 1.11రాగి పొడిని వేడి చేయడం26 / 27
చివర కృత్యంనాలుగు బీకర్లలో ఉష్ణోగ్రత మార్పు34 / 35

కృత్యం 1.1 (Activity 1.1) – మెగ్నీషియం రిబ్బన్‌ను గాలిలో మండించడం

ఏం చేస్తారు: 3-4 cm మెగ్నీషియం రిబ్బన్‌ను గరుకు కాగితంతో రుద్ది శుభ్రం చేసి, పట్టకారుతో పట్టుకుని స్పిరిట్ దీపం మంటలో మండిస్తారు. వచ్చిన బూడిదను వాచ్ గ్లాస్‌లో సేకరిస్తారు. కళ్ళకు దూరంగా పట్టుకోవాలి, ఉపాధ్యాయుల సహాయం తప్పనిసరి.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: The ribbon burns with a dazzling white flame and changes into a white powder, magnesium oxide.
2Mg(s) + O2(g) → 2MgO(s)
Type: combination reaction; heat and light are given out, so it is also exothermic. Magnesium gains oxygen, so magnesium is oxidised.
తెలుగులో: తెలుపు రంగు కాంతితో మండి తెల్లటి పొడి (మెగ్నీషియం ఆక్సైడ్) మిగులుతుంది. రెండు పదార్థాలు కలిసి ఒకే ఉత్పన్నం ఏర్పడింది కాబట్టి ఇది సంయోగ చర్య. పుస్తకం తర్వాత అడిగే “కృత్యం 1.1 లో మెగ్నీషియం ఆక్సీకరణం చెందిందా, క్షయకరణమా?” అనే ప్రశ్నకు జవాబు: ఆక్సిజన్ పొందింది కాబట్టి ఆక్సీకరణం.

కృత్యం 1.2 (Activity 1.2) – లెడ్ నైట్రేట్ ద్రావణానికి పొటాషియం అయోడైడ్ కలపడం

ఏం చేస్తారు: పరీక్ష నాళికలో లెడ్ నైట్రేట్ ద్రావణం తీసుకుని దానికి పొటాషియం అయోడైడ్ ద్రావణం కలుపుతారు.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: A yellow precipitate of lead iodide is formed.
Pb(NO3)2(aq) + 2KI(aq) → PbI2(s) + 2KNO3(aq)
Type: double displacement (precipitation) reaction. This also answers the “Recall Activity 1.2” questions on page 26: (i) yellow, lead iodide (ii) the equation above (iii) yes, it is a double displacement reaction.
తెలుగులో: పసుపు రంగు అవక్షేపం (లెడ్ అయోడైడ్) ఏర్పడుతుంది. రెండు సమ్మేళనాల మధ్య అయాన్లు మారాయి కాబట్టి ఇది ద్వంద్వ స్థానభ్రంశ చర్య. ఇక్కడ రంగు మార్పు రసాయన చర్య జరిగిందని చెప్పే గుర్తు.

కృత్యం 1.3 (Activity 1.3) – జింక్ ముక్కలపై సజల ఆమ్లం పోయడం

ఏం చేస్తారు: శంఖాకార కుప్పెలో (లేదా పరీక్ష నాళికలో) కొన్ని జింక్ ముక్కలు తీసుకుని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లం పోస్తారు. ఆమ్లాన్ని జాగ్రత్తగా వాడాలి.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: Bubbles of hydrogen gas form around the zinc granules and the flask becomes warm.
Zn(s) + H2SO4(aq) → ZnSO4(aq) + H2(g)
Type: displacement reaction (zinc displaces hydrogen from the acid); heat is given out.
తెలుగులో: జింక్ చుట్టూ హైడ్రోజన్ వాయువు బుడగలు వస్తాయి, కుప్పె వేడెక్కుతుంది. వాయువు విడుదల, ఉష్ణోగ్రత మార్పు రెండూ రసాయన చర్య గుర్తులు. కృత్యాలు 1.1, 1.2, 1.3 కలిపి పుస్తకం చెప్పే నాలుగు గుర్తులు: స్థితిలో మార్పు, రంగులో మార్పు, వాయువు విడుదల, ఉష్ణోగ్రతలో మార్పు.

కృత్యం 1.4 (Activity 1.4) – కాల్షియం ఆక్సైడ్ (పొడి సున్నం) మీద నీరు పోయడం

ఏం చేస్తారు: బీకరులో కొద్దిగా కాల్షియం ఆక్సైడ్ (పొడి సున్నం) తీసుకుని నెమ్మదిగా నీరు పోసి బీకరును తాకి చూస్తారు.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: The beaker becomes hot. Slaked lime (calcium hydroxide) is formed.
CaO(s) + H2O(l) → Ca(OH)2(aq) + Heat
Type: combination reaction and exothermic reaction.
తెలుగులో: బీకరు బాగా వేడెక్కుతుంది. రెండు పదార్థాల నుంచి ఒకే ఉత్పన్నం (తడి సున్నం) వచ్చింది, ఉష్ణం విడుదలైంది. కాబట్టి ఇది సంయోగ చర్య, ఉష్ణమోచక చర్య. ఈ తడి సున్నం ద్రావణంతోనే గోడలకు సున్నం వేస్తారు. In-text ప్రశ్న 4 లోని పదార్థం X ఈ కృత్యంలో వాడిన పొడి సున్నమే (CaO).

కృత్యం 1.5 (Activity 1.5) – ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాలను వేడి చేయడం

ఏం చేస్తారు: పొడి బాయిలింగ్ ట్యూబ్‌లో సుమారు 2 g ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాలు తీసుకుని రంగు గమనించి, మంట మీద వేడి చేస్తారు. ట్యూబ్ మూతిని ఎవరి వైపూ తిప్పకూడదు.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: The green crystals lose their water and change colour; a smell of burning sulphur is noticed. The solid left is ferric oxide.
2FeSO4(s) —heat→ Fe2O3(s) + SO2(g) + SO3(g)
Type: thermal decomposition reaction.
తెలుగులో: ఆకుపచ్చ స్ఫటికాలు ముందు నీటిని కోల్పోయి రంగు మారతాయి, మండే గంధకం వాసన వస్తుంది. ఒకే పదార్థం విడిపోయి మూడు ఉత్పన్నాలు వచ్చాయి, వేడి వల్ల జరిగింది కాబట్టి ఇది ఉష్ణ వియోగ చర్య.

కృత్యం 1.6 (Activity 1.6) – లెడ్ నైట్రేట్ పొడిని వేడి చేయడం

ఏం చేస్తారు: బాయిలింగ్ ట్యూబ్‌లో సుమారు 2 g లెడ్ నైట్రేట్ పొడి తీసుకుని పట్టకారుతో పట్టుకుని మంట మీద వేడి చేస్తారు.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: Brown fumes of nitrogen dioxide are given off.
2Pb(NO3)2(s) —heat→ 2PbO(s) + 4NO2(g) + O2(g)
Type: thermal decomposition reaction.
తెలుగులో: గోధుమ రంగు పొగలు (నైట్రోజన్ డయాక్సైడ్) వస్తాయి. ఇది కూడా వేడి వల్ల జరిగే వియోగ చర్య. కృత్యం 1.2 లో లెడ్ నైట్రేట్ ద్రావణం, ఇక్కడ పొడి వాడతారని గుర్తుంచుకోండి.

కృత్యం 1.7 (Activity 1.7) – నీటి విద్యుత్ విశ్లేషణ

ఏం చేస్తారు: ప్లాస్టిక్ మగ్ అడుగున రెండు రంధ్రాలు చేసి కార్బన్ ఎలక్ట్రోడ్లు అమర్చి 6 V బ్యాటరీకి కలుపుతారు. నీటిలో కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపి, ఎలక్ట్రోడ్ల మీద నీటితో నిండిన పరీక్ష నాళికలను బోర్లిస్తారు. వాయువులను మండుతున్న కొవ్వొత్తితో పరీక్షించే దశ ఉపాధ్యాయులే చేయాలి.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: Bubbles form at both electrodes. The volume of gas in one test tube is double that in the other. The gas in larger volume is hydrogen (burns with a pop sound); the other is oxygen (the candle burns more brightly).
2H2O(l) —electricity→ 2H2(g) + O2(g)
Type: decomposition reaction caused by electricity (electrolysis).
తెలుగులో: రెండు ఎలక్ట్రోడ్ల దగ్గరా బుడగలు వస్తాయి. ఒక నాళికలో వాయువు మరో దానికి రెట్టింపు. నీటి అణువులో హైడ్రోజన్, ఆక్సిజన్ 2 : 1 నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి ఎక్కువగా వచ్చేది హైడ్రోజన్ (In-text ప్రశ్న 5). సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపేది నీరు విద్యుత్‌ను బాగా ప్రవహింపజేయడానికి.

కృత్యం 1.8 (Activity 1.8) – సిల్వర్ క్లోరైడ్‌ను ఎండలో ఉంచడం

ఏం చేస్తారు: చైనా డిష్‌లో సుమారు 2 g సిల్వర్ క్లోరైడ్ తీసుకుని రంగు గమనించి, కొంతసేపు ఎండలో ఉంచుతారు.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: White silver chloride turns grey because it decomposes into silver and chlorine in sunlight.
2AgCl(s) —sunlight→ 2Ag(s) + Cl2(g)
Type: decomposition reaction caused by light. Silver bromide behaves the same way; these reactions are used in black and white photography.
తెలుగులో: తెల్లటి సిల్వర్ క్లోరైడ్ ఎండలో బూడిద రంగుకు మారుతుంది. ఇది కాంతి వల్ల జరిగే వియోగ చర్య. గమనిక: పుస్తకం ఇంగ్లీష్ పేజీలో AgCl, AgBr సమీకరణాల బాణం మీద “heat” అని ముద్రించారు. పాఠంలోని వివరణ ప్రకారం, తెలుగు పేజీలోని AgBr సమీకరణంలో ఉన్నట్టు, అక్కడ ఉండాల్సింది సూర్యకాంతి (sunlight). పరీక్షలో sunlight అనే రాయండి.

అదనపు కృత్యం (Carry out the following Activity) – క్రింది కృత్యాన్ని చేయండి: బేరియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం క్లోరైడ్

ఏం చేస్తారు: పరీక్ష నాళికలో 2 g బేరియం హైడ్రాక్సైడ్, 1 g అమ్మోనియం క్లోరైడ్ తీసుకుని గాజు కడ్డీతో కలిపి నాళిక అడుగును అరచేతితో తాకుతారు. ఇది ఉష్ణమోచకమా, ఉష్ణగ్రాహకమా అని పుస్తకం అడుగుతుంది.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: The bottom of the test tube feels cold, and a smell of ammonia may be noticed. Heat is absorbed from the surroundings, so it is an endothermic reaction.
Ba(OH)2(s) + 2NH4Cl(s) → BaCl2(aq) + 2NH3(g) + 2H2O(l)
తెలుగులో: నాళిక అడుగు చల్లగా తగులుతుంది. చుట్టూ ఉన్న ఉష్ణాన్ని చర్య గ్రహిస్తుంది కాబట్టి ఇది ఉష్ణగ్రాహక చర్య. పుస్తకంలో ఈ పెట్టెకు కృత్యం సంఖ్య లేదు.

కృత్యం 1.9 (Activity 1.9) – కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుప మేకులు

ఏం చేస్తారు: మూడు ఇనుప మేకులను శుభ్రం చేసి, A, B అనే రెండు నాళికల్లో 10 mL చొప్పున కాపర్ సల్ఫేట్ ద్రావణం తీసుకుంటారు. రెండు మేకులను దారంతో కట్టి B నాళికలో 20 నిమిషాలు ఉంచుతారు. ఒక మేకును పోలిక కోసం బయట ఉంచుతారు.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: The iron nails become brownish (copper is deposited on them) and the blue colour of the copper sulphate solution fades.
Fe(s) + CuSO4(aq) → FeSO4(aq) + Cu(s)
Type: displacement reaction. Iron is more reactive than copper, so it displaces copper from copper sulphate.
తెలుగులో: మేకులపై గోధుమ రంగు పూత (రాగి) ఏర్పడుతుంది, ద్రావణం నీలం రంగు తగ్గుతుంది. ఇనుము రాగి కంటే చురుకైనది కాబట్టి రాగిని బయటకు పంపింది. ఇది స్థానభ్రంశ చర్య (In-text ప్రశ్న 6).

కృత్యం 1.10 (Activity 1.10) – సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ ద్రావణాలు కలపడం

ఏం చేస్తారు: ఒక నాళికలో 3 mL సోడియం సల్ఫేట్ ద్రావణం, మరో నాళికలో 3 mL బేరియం క్లోరైడ్ ద్రావణం తీసుకుని రెండూ కలుపుతారు.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: A white precipitate of barium sulphate, which is insoluble in water, is formed. Sodium chloride stays in the solution.
Na2SO4(aq) + BaCl2(aq) → BaSO4(s) + 2NaCl(aq)
Type: double displacement reaction; since a precipitate forms, it is also a precipitation reaction.
తెలుగులో: నీటిలో కరగని తెల్లటి అవక్షేపం (బేరియం సల్ఫేట్) ఏర్పడుతుంది. రెండు సమ్మేళనాల మధ్య అయాన్లు మారాయి కాబట్టి ద్వంద్వ స్థానభ్రంశ చర్య. అవక్షేపం వచ్చింది కాబట్టి అవక్షేపణ చర్య కూడా.

కృత్యం 1.11 (Activity 1.11) – రాగి పొడిని వేడి చేయడం

ఏం చేస్తారు: చైనా డిష్‌లో సుమారు 1 g రాగి పొడి తీసుకుని వేడి చేస్తారు.

పరిశీలన, సమీకరణం చూడండి
Observation: The surface of the copper powder becomes coated with black copper(II) oxide, because copper gains oxygen.
2Cu + O2 —heat→ 2CuO
If hydrogen gas is passed over the hot black substance, it turns brown again: CuO + H2 —heat→ Cu + H2O. Here CuO is reduced and hydrogen is oxidised, so it is a redox reaction.
తెలుగులో: రాగి పొడి ఉపరితలం నల్లగా (కాపర్ ఆక్సైడ్) మారుతుంది. రాగి ఆక్సిజన్ పొందింది కాబట్టి ఆక్సీకరణం. దీని మీద హైడ్రోజన్ పంపితే మళ్ళీ గోధుమ రంగు రాగి వస్తుంది. ఒకే చర్యలో ఆక్సీకరణం, క్షయకరణం రెండూ జరిగితే అది ఆక్సీకరణ-క్షయకరణ (redox) చర్య. అభ్యాస ప్రశ్న 17 లోని X ఈ రాగే.

పాఠం చివరి కృత్యం – ఏది ఉష్ణమోచకం, ఏది ఉష్ణగ్రాహకం?

ఏం చేస్తారు: A, B, C బీకర్లలో 25 mL నీరు, D లో కాపర్ సల్ఫేట్ ద్రావణం తీసుకుని ఉష్ణోగ్రత నమోదు చేస్తారు. తర్వాత A లో పొటాషియం సల్ఫేట్, B లో అమ్మోనియం నైట్రేట్, C లో నిర్జల కాపర్ సల్ఫేట్, D లో సన్నని ఇనుప రజను రెండు స్పూన్ల చొప్పున కలిపి మళ్ళీ ఉష్ణోగ్రత కొలుస్తారు.

ఫలితం చూడండి
Result: A (potassium sulphate) – temperature falls slightly: endothermic. B (ammonium nitrate) – temperature falls clearly: endothermic. C (anhydrous copper sulphate) – temperature rises: exothermic. D (iron filings in copper sulphate solution) – temperature rises: exothermic; this is the displacement reaction of Activity 1.9.
తెలుగులో: ఉష్ణోగ్రత తగ్గితే ఉష్ణగ్రాహకం (A, B), పెరిగితే ఉష్ణమోచకం (C, D). A, B, C లలో జరిగేది ఎక్కువగా కరగడం (ద్రావణం ఏర్పడటం); D ఒక్కటే అసలైన రసాయన చర్య. ప్రయోగశాలలో మీకు వచ్చిన ఉష్ణోగ్రత విలువలే నోట్‌బుక్‌లో రాయండి.

Chemical Reactions and Equations Exercise Questions and Answers — అభ్యాస ప్రశ్నలు 1 నుంచి 20

పాఠం చివరి 20 అభ్యాస ప్రశ్నలు. 1 నుంచి 3 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 4 నుంచి 8 సమీకరణాలు, 9 నుంచి 20 వివరణాత్మక ప్రశ్నలు.

1. Which of the following statements about the reaction 2PbO(s) + C(s) → 2Pb(s) + CO2(g) are incorrect?
(a) Lead is getting reduced. (b) Carbon dioxide is getting oxidised. (c) Carbon is getting oxidised. (d) Lead oxide is getting reduced.
(i) (a) and (b)   (ii) (a) and (c)   (iii) (a), (b) and (c)   (iv) all

జవాబు చూడండి
Answer: (i) (a) and (b). Lead oxide (not lead) is reduced, and carbon (not carbon dioxide) is oxidised.
తెలుగులో: PbO ఆక్సిజన్ కోల్పోతుంది కాబట్టి క్షయకరణం చెందేది లెడ్ ఆక్సైడ్. C ఆక్సిజన్ పొంది CO2 అవుతుంది కాబట్టి ఆక్సీకరణం చెందేది కార్బన్. అందుకే (a), (b) తప్పు.

2. Fe2O3 + 2Al → Al2O3 + 2Fe is an example of:
(a) combination (b) double displacement (c) decomposition (d) displacement reaction

జవాబు చూడండి
Answer: (d) Displacement reaction. Aluminium, being more reactive, displaces iron from iron oxide.
తెలుగులో: అల్యూమినియం ఇనుము కంటే చురుకైనది కాబట్టి ఐరన్ ఆక్సైడ్ నుంచి ఇనుమును బయటకు పంపుతుంది. దీన్ని థర్మైట్ చర్య అని కూడా అంటారు.

3. What happens when dilute hydrochloric acid is added to iron filings?
(a) Hydrogen gas and iron chloride are produced. (b) Chlorine gas and iron hydroxide are produced. (c) No reaction. (d) Iron salt and water are produced.

జవాబు చూడండి
Answer: (a) Hydrogen gas and iron chloride are produced: Fe(s) + 2HCl(aq) → FeCl2(aq) + H2(g)
తెలుగులో: ఇనుము ఆమ్లంలోని హైడ్రోజన్‌ను స్థానభ్రంశం చేస్తుంది. బుడగలుగా వచ్చే వాయువు హైడ్రోజన్.

4. What is a balanced chemical equation? Why should chemical equations be balanced?

జవాబు చూడండి
Answer: An equation in which the number of atoms of each element is equal on both the reactant side and the product side is a balanced chemical equation. Equations must be balanced because of the law of conservation of mass: mass can neither be created nor destroyed in a chemical reaction.
తెలుగులో: చర్యకు ముందు, తర్వాత మొత్తం ద్రవ్యరాశి మారదు (ద్రవ్యరాశి నిత్యత్వ నియమం). అందుకే రెండు వైపులా పరమాణువులు సమానంగా ఉండాలి.

5. Translate into chemical equations and balance: (a) hydrogen combines with nitrogen to form ammonia (b) hydrogen sulphide burns in air to give water and sulphur dioxide (c) barium chloride reacts with aluminium sulphate to give aluminium chloride and a precipitate of barium sulphate (d) potassium reacts with water to give potassium hydroxide and hydrogen

జవాబు చూడండి
Answer: (a) 3H2(g) + N2(g) → 2NH3(g)
(b) 2H2S(g) + 3O2(g) → 2H2O(l) + 2SO2(g)
(c) 3BaCl2(aq) + Al2(SO4)3(aq) → 2AlCl3(aq) + 3BaSO4(s)
(d) 2K(s) + 2H2O(l) → 2KOH(aq) + H2(g)
తెలుగులో: (b) లో ముందు సల్ఫర్, హైడ్రోజన్ సమం చేసి చివరగా ఆక్సిజన్ సమం చేయండి.

6. Balance the following equations: (a) HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + H2O (b) NaOH + H2SO4 → Na2SO4 + H2O (c) NaCl + AgNO3 → AgCl + NaNO3 (d) BaCl2 + H2SO4 → BaSO4 + HCl

జవాబు చూడండి
Answer: (a) 2HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + 2H2O
(b) 2NaOH + H2SO4 → Na2SO4 + 2H2O
(c) NaCl + AgNO3 → AgCl + NaNO3 (already balanced)
(d) BaCl2 + H2SO4 → BaSO4 + 2HCl
తెలుగులో: (c) మొదటి నుంచే సమతుల్యంగా ఉంది. బ్రాకెట్ బయటి సంఖ్య బ్రాకెట్ లోపలి ప్రతి పరమాణువుకూ వర్తిస్తుంది.

7. Write balanced equations: (a) calcium hydroxide + carbon dioxide gives calcium carbonate + water (b) zinc + silver nitrate gives zinc nitrate + silver (c) aluminium + copper chloride gives aluminium chloride + copper (d) barium chloride + potassium sulphate gives barium sulphate + potassium chloride

జవాబు చూడండి
Answer: (a) Ca(OH)2 + CO2 → CaCO3 + H2O
(b) Zn + 2AgNO3 → Zn(NO3)2 + 2Ag
(c) 2Al + 3CuCl2 → 2AlCl3 + 3Cu
(d) BaCl2 + K2SO4 → BaSO4 + 2KCl
తెలుగులో: (a) సున్నపు నీటిలో CO2 పంపితే పాలలా తెల్లగా మారడానికి కారణం ఈ CaCO3.

8. Write the balanced equation and identify the type of reaction: (a) potassium bromide(aq) + barium iodide(aq) gives potassium iodide(aq) + barium bromide(s) (b) zinc carbonate(s) gives zinc oxide(s) + carbon dioxide(g) (c) hydrogen(g) + chlorine(g) gives hydrogen chloride(g) (d) magnesium(s) + hydrochloric acid(aq) gives magnesium chloride(aq) + hydrogen(g)

జవాబు చూడండి
Answer: (a) 2KBr(aq) + BaI2(aq) → 2KI(aq) + BaBr2(s) : double displacement
(b) ZnCO3(s) → ZnO(s) + CO2(g) : decomposition
(c) H2(g) + Cl2(g) → 2HCl(g) : combination
(d) Mg(s) + 2HCl(aq) → MgCl2(aq) + H2(g) : displacement
తెలుగులో: పై “రసాయన చర్యల రకాలు” పట్టికలోని సాధారణ రూపంతో పోల్చి రకం గుర్తించండి.

9. What is meant by exothermic and endothermic reactions? Give examples.

జవాబు చూడండి
Answer: Exothermic reaction: heat is released along with the products. Example: CH4(g) + 2O2(g) → CO2(g) + 2H2O(g) + heat (burning of natural gas).
Endothermic reaction: heat (energy) is absorbed. Example: CaCO3(s) → CaO(s) + CO2(g) (on heating); 2AgCl(s) → 2Ag(s) + Cl2(g) (in sunlight).
తెలుగులో: ఉష్ణమోచక చర్యలో వేడి బయటకు వస్తుంది (పాత్ర వేడెక్కుతుంది). ఉష్ణగ్రాహక చర్య జరగాలంటే వేడి, వెలుతురు లేదా విద్యుత్ ఇవ్వాలి.

10. Why is respiration considered an exothermic reaction?

జవాబు చూడండి
Answer: During respiration, glucose combines with oxygen in our cells and releases energy: C6H12O6(aq) + 6O2(g) → 6CO2(g) + 6H2O(l) + energy. Since energy is given out, respiration is an exothermic reaction.
తెలుగులో: మనం తిన్న ఆహారం గ్లూకోజ్‌గా మారి ఆక్సిజన్‌తో చర్య జరిపి శక్తిని ఇస్తుంది. శక్తి విడుదలవుతుంది కాబట్టి ఇది ఉష్ణమోచక చర్య.

11. Why are decomposition reactions called the opposite of combination reactions? Write equations.

జవాబు చూడండి
Answer: In a combination reaction two or more substances form a single product, while in a decomposition reaction a single substance breaks into two or more products. So one is the reverse of the other.
Combination: CaO(s) + CO2(g) → CaCO3(s)
Decomposition: CaCO3(s) → CaO(s) + CO2(g) (on heating)
తెలుగులో: సంయోగంలో కలుస్తాయి, వియోగంలో విడిపోతాయి. ఒకే పదార్థాలతో రెండు దిశల్లో ఉదాహరణ రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.

12. Write one equation each for decomposition reactions where energy is supplied as heat, light and electricity.

జవాబు చూడండి
Answer: Heat: 2Pb(NO3)2(s) → 2PbO(s) + 4NO2(g) + O2(g)
Light: 2AgBr(s) → 2Ag(s) + Br2(g)
Electricity: 2H2O(l) → 2H2(g) + O2(g)
తెలుగులో: వేడితో: ఉష్ణ వియోగం. వెలుతురుతో: కాంతి వియోగం (నలుపు-తెలుపు ఫోటోగ్రఫీలో ఉపయోగం). విద్యుత్‌తో: విద్యుత్ విశ్లేషణ.

13. What is the difference between displacement and double displacement reactions? Write equations.

జవాబు చూడండి
Answer: In a displacement reaction, a more reactive element displaces a less reactive element from its compound: Fe(s) + CuSO4(aq) → FeSO4(aq) + Cu(s)
In a double displacement reaction, two compounds exchange their ions: Na2SO4(aq) + BaCl2(aq) → BaSO4(s) + 2NaCl(aq)
తెలుగులో: స్థానభ్రంశంలో ఒక మూలకం, ఒక సమ్మేళనం చర్య జరుపుతాయి. ద్వంద్వ స్థానభ్రంశంలో రెండూ సమ్మేళనాలే.

14. In the refining of silver, silver is recovered from silver nitrate solution by displacement with copper. Write the reaction.

జవాబు చూడండి
Answer: Cu(s) + 2AgNO3(aq) → Cu(NO3)2(aq) + 2Ag(s)
తెలుగులో: రాగి వెండి కంటే చురుకైనది కాబట్టి వెండిని బయటకు పంపుతుంది. ద్రావణం నీలి రంగుకు మారుతుంది.

15. What is a precipitation reaction? Explain with examples.

జవాబు చూడండి
Answer: A reaction in which an insoluble solid (precipitate) is formed is called a precipitation reaction. Examples: Na2SO4(aq) + BaCl2(aq) → BaSO4(s) + 2NaCl(aq) (white precipitate); Pb(NO3)2(aq) + 2KI(aq) → PbI2(s) + 2KNO3(aq) (yellow precipitate).
తెలుగులో: నీటిలో కరగని ఘనపదార్థం అడుగున పేరుకుంటుంది. చాలా ద్వంద్వ స్థానభ్రంశ చర్యలు అవక్షేప చర్యలే.

16. Explain with two examples each, in terms of gain or loss of oxygen: (a) oxidation (b) reduction

జవాబు చూడండి
Answer: (a) Oxidation is gain of oxygen: 2Cu + O2 → 2CuO ; C + O2 → CO2
(b) Reduction is loss of oxygen: CuO + H2 → Cu + H2O (CuO is reduced); ZnO + C → Zn + CO (ZnO is reduced)
తెలుగులో: ఆక్సిజన్ పొందడం ఆక్సీకరణం, కోల్పోవడం క్షయకరణం. హైడ్రోజన్ విషయంలో ఇది తిరగబడుతుంది: హైడ్రోజన్ కోల్పోవడం ఆక్సీకరణం.

17. A shiny brown-coloured element X turns black on heating in air. Name X and the black compound.

జవాబు చూడండి
Answer: X is copper (Cu). The black compound is copper(II) oxide (CuO): 2Cu(s) + O2(g) → 2CuO(s)
తెలుగులో: మెరిసే గోధుమ రంగు లోహం రాగి. గాలిలో వేడి చేస్తే నల్లటి కాపర్ ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది.

18. Why do we apply paint on iron articles?

జవాబు చూడండి
Answer: Paint covers the iron surface and keeps away air and moisture. This prevents rusting (corrosion) of iron.
తెలుగులో: తేమ, గాలి తగలకపోతే ఇనుము తుప్పు పట్టదు. గేట్లు, కిటికీలకు రంగు వేయడానికి కారణం ఇదే.

19. Oil and fat containing food items are flushed with nitrogen. Why?

జవాబు చూడండి
Answer: Nitrogen is an unreactive gas. Filling the packet with nitrogen removes oxygen, so the oils and fats are not oxidised and the food does not become rancid.
తెలుగులో: చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ నింపుతారు. ఆక్సిజన్ లేకపోతే నూనె పదార్థాలు చెడు వాసన రావు.

20. Explain with an example: (a) corrosion (b) rancidity

జవాబు చూడండి
Answer: (a) Corrosion: a metal is slowly eaten up by moisture, air or acids around it. Example: iron forms reddish-brown rust; silver turns black; copper gets a green coating.
(b) Rancidity: when fats and oils are oxidised, their smell and taste change. Example: fried food kept open for many days smells bad. It is prevented by adding antioxidants, keeping food in airtight containers or flushing with nitrogen.
తెలుగులో: క్షయం (corrosion) వల్ల ఇనుప వంతెనలు, కార్ల భాగాలు పాడవుతాయి. ముక్కిపోవడం (rancidity) వల్ల నూనె పదార్థాల రుచి, వాసన మారుతాయి.

10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం 1వ పాఠం ప్రశ్నలు జవాబులు – తెలుగు మీడియం

తెలుగు మీడియం విద్యార్థుల కోసం: 2026-27 AP పాఠ్యపుస్తకం తెలుగు పేజీల్లో ఉన్న ప్రశ్నలు అదే పదాలతో, పూర్తి జవాబులు తెలుగులో. సమీకరణాల్లో స్థితి సంజ్ఞలు పుస్తకంలో లాగే: (ఘ) ఘనం, (ద్ర) ద్రవం, (వా) వాయువు, (జ.ద్రా) జల ద్రావణం. ఇంగ్లీష్ మీడియం జవాబులు పైన In-text, అభ్యాస ప్రశ్నలు విభాగాల్లో ఉన్నాయి.

పాఠం మధ్యలోని ప్రశ్నలు (పుస్తకం పేజీలు 15, 23, 29)

1. మెగ్నీషియం తీగను గాలిలో మండించుటకు ముందు ఎందుకు శుభ్రం చేయాలి?

జవాబు చూడండి
జవాబు: మెగ్నీషియం గాలిలోని ఆక్సిజన్‌తో నెమ్మదిగా చర్య జరపడం వల్ల దాని ఉపరితలంపై మెగ్నీషియం ఆక్సైడ్ (MgO) అనే తెల్లటి పొర ఏర్పడుతుంది. ఈ పొర తీగ సరిగా మండకుండా అడ్డుకుంటుంది. గరుకు కాగితంతో రుద్ది ఆ పొరను తొలగిస్తే శుద్ధమైన మెగ్నీషియం గాలిలో సులువుగా మండుతుంది.

2. క్రింది రసాయన చర్యలకు తుల్య సమీకరణాన్ని వ్రాయండి.
(i) హైడ్రోజన్ + క్లోరిన్ → హైడ్రోజన్ క్లోరైడ్
(ii) బేరియం క్లోరైడ్ + అల్యూమినియం సల్ఫేట్ → బేరియం సల్ఫేట్ + అల్యూమినియం క్లోరైడ్
(iii) సోడియం + నీరు → సోడియం హైడ్రాక్సైడ్ + హైడ్రోజన్

జవాబు చూడండి
జవాబు: (i) H2 + Cl2 → 2HCl
(ii) 3BaCl2 + Al2(SO4)3 → 3BaSO4 + 2AlCl3
(iii) 2Na + 2H2O → 2NaOH + H2
ప్రతి సమీకరణంలో ఎడమ, కుడి వైపుల్లో ప్రతి మూలకం పరమాణువుల సంఖ్య సమానంగా ఉంది. కాబట్టి ఇవి తుల్య సమీకరణాలు.

3. క్రింది చర్యలకు వాటి స్థితి సంజ్ఞలను తెలియజేస్తూ తుల్య సమీకరణాలు రాయండి.
(i) నీటిలో బేరియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్ ద్రావణాలు చర్య పొంది కరగని బేరియం సల్ఫేట్ మరియు సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని ఇస్తాయి.
(ii) సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం (నీటిలో) హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్రావణంతో (నీటిలో) చర్య జరిపి సోడియం క్లోరైడ్ ద్రావణం మరియు నీటిని ఏర్పరుస్తాయి.

జవాబు చూడండి
జవాబు: (i) BaCl2(జ.ద్రా) + Na2SO4(జ.ద్రా) → BaSO4(ఘ) + 2NaCl(జ.ద్రా)
(ii) NaOH(జ.ద్రా) + HCl(జ.ద్రా) → NaCl(జ.ద్రా) + H2O(ద్ర)
స్థితి సంజ్ఞలు: (ఘ) = ఘన స్థితి, (ద్ర) = ద్రవ స్థితి, (వా) = వాయు స్థితి, (జ.ద్రా) = జల ద్రావణం. బేరియం సల్ఫేట్ నీటిలో కరగని అవక్షేపం కాబట్టి దానికి (ఘ) రాయాలి.

4. X అనే పదార్థ ద్రావణాన్ని వెల్ల వేయడానికి ఉపయోగించారు.
(i) X పదార్థం పేరు మరియు ఫార్ములా రాయండి.
(ii) పైన (i) లో చెప్పబడిన పదార్థం X నీటితో జరిపే చర్యను రాయండి.

జవాబు చూడండి
జవాబు: (i) X = కాల్షియం ఆక్సైడ్ (పొడి సున్నం). ఫార్ములా: CaO
(ii) CaO(ఘ) + H2O(ద్ర) → Ca(OH)2(జ.ద్రా) + ఉష్ణం
ఏర్పడిన కాల్షియం హైడ్రాక్సైడ్ (తడి సున్నం) ద్రావణంతోనే గోడలకు వెల్ల వేస్తారు. అది గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌తో నెమ్మదిగా చర్య జరిపి 2-3 రోజుల్లో గోడలపై కాల్షియం కార్బొనేట్ పలుచని పొరను ఏర్పరుస్తుంది. అందుకే గోడలు మెరుస్తాయి: Ca(OH)2(జ.ద్రా) + CO2(వా) → CaCO3(ఘ) + H2O(ద్ర)

5. కృత్యం 1.7 లో ఒక పరీక్షనాళికలో సేకరించబడిన వాయువు పరిమాణం మరొక దానిలో సేకరించబడిన వాయువు పరిమాణం కంటే రెట్టింపు ఎందుకు? ఆ వాయువు పేరు ఏమిటి?

జవాబు చూడండి
జవాబు: నీటి అణువులో (H2O) ప్రతి ఒక ఆక్సిజన్ పరమాణువుకు రెండు హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. విద్యుత్ విశ్లేషణలో నీరు ఇలా వియోగం చెందుతుంది: 2H2O(ద్ర) → 2H2(వా) + O2(వా). రెండు అణువుల హైడ్రోజన్‌కు ఒక అణువు ఆక్సిజన్ వస్తుంది కాబట్టి హైడ్రోజన్ ఘనపరిమాణం ఆక్సిజన్‌కు రెట్టింపు. రెట్టింపు పరిమాణంలో సేకరించబడిన వాయువు హైడ్రోజన్. మండుతున్న కొవ్వొత్తిని దగ్గరకు తెస్తే అది ‘పాప్’ శబ్దంతో మండుతుంది.

6. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుప మేకులు ఉంచినప్పుడు ద్రావణం రంగు ఎందుకు మారుతుంది?

జవాబు చూడండి
జవాబు: ఇనుము రాగి కంటే ఎక్కువ చర్యాశీలత గల లోహం. అందువల్ల అది కాపర్ సల్ఫేట్ నుంచి రాగిని స్థానభ్రంశం చేసి ఫెర్రస్ సల్ఫేట్‌ను ఏర్పరుస్తుంది: Fe(ఘ) + CuSO4(జ.ద్రా) → FeSO4(జ.ద్రా) + Cu(ఘ). నీలి రంగు కాపర్ సల్ఫేట్ తగ్గిపోయి లేత ఆకుపచ్చ రంగు ఫెర్రస్ సల్ఫేట్ ఏర్పడటం వల్ల ద్రావణం నీలి రంగు వెలిసిపోతుంది. మేకులపై గోధుమ రంగు రాగి పూత ఏర్పడుతుంది. ఇది స్థానభ్రంశ చర్య.

7. కృత్యం 1.10 లో ఇవ్వబడింది కాకుండా ద్వంద్వ స్థానభ్రంశ చర్యకు ఒక ఉదాహరణ ఇవ్వండి.

జవాబు చూడండి
జవాబు: లెడ్ నైట్రేట్, పొటాషియం అయోడైడ్ ద్రావణాలను కలిపితే పసుపు రంగు లెడ్ అయోడైడ్ అవక్షేపం ఏర్పడుతుంది: Pb(NO3)2(జ.ద్రా) + 2KI(జ.ద్రా) → PbI2(ఘ) + 2KNO3(జ.ద్రా)
ఇక్కడ రెండు సమ్మేళనాలు తమ అయాన్లను పరస్పరం మార్చుకున్నాయి కాబట్టి ఇది ద్వంద్వ స్థానభ్రంశ చర్య. మరో ఉదాహరణ: AgNO3(జ.ద్రా) + NaCl(జ.ద్రా) → AgCl(ఘ) + NaNO3(జ.ద్రా)

8. క్రింది చర్యలలో ఏ పదార్థాలు ఆక్సీకరణం చెందాయి మరియు ఏ పదార్థాలు క్షయకరణం చెందాయి?
(i) 4Na(ఘ) + O2(వా) → 2Na2O(ఘ)
(ii) CuO(ఘ) + H2(వా) → Cu(ఘ) + H2O(ద్ర)

జవాబు చూడండి
జవాబు: (i) సోడియం ఆక్సిజన్‌ను పొందింది కాబట్టి సోడియం ఆక్సీకరణం చెందింది. ఆక్సిజన్ క్షయకరణం చెందింది.
(ii) హైడ్రోజన్ ఆక్సిజన్‌ను పొంది నీరుగా మారింది కాబట్టి హైడ్రోజన్ ఆక్సీకరణం చెందింది. కాపర్ ఆక్సైడ్ ఆక్సిజన్‌ను కోల్పోయింది కాబట్టి కాపర్ ఆక్సైడ్ క్షయకరణం చెందింది. ఒకే చర్యలో రెండూ జరిగాయి కాబట్టి (ii) ఆక్సీకరణ-క్షయకరణ (రెడాక్స్) చర్య.

అభ్యాసనాలు 1 నుంచి 20 (పుస్తకం పేజీలు 31-35)

1. ఈ చర్య గురించి కింది వాక్యాలలో సరి కానివి ఏవి?
2PbO(ఘ) + C(ఘ) → 2Pb(ఘ) + CO2(వా)
(a) లెడ్ క్షయకరణం చెందింది. (b) కార్బన్ డయాక్సైడ్ ఆక్సీకరణం చెందింది. (c) కార్బన్ ఆక్సీకరణం చెందింది. (d) లెడ్ ఆక్సైడ్ క్షయకరణం చెందింది.
(i) (a) మరియు (b)   (ii) (a) మరియు (c)   (iii) (a), (b) మరియు (c)   (iv) అన్నీ

జవాబు చూడండి
జవాబు: సరైన జవాబు: (i) (a) మరియు (b).
లెడ్ ఆక్సైడ్ (PbO) ఆక్సిజన్‌ను కోల్పోయింది కాబట్టి క్షయకరణం చెందింది లెడ్ ఆక్సైడ్, లెడ్ కాదు. కార్బన్ ఆక్సిజన్‌ను పొంది CO2 గా మారింది కాబట్టి ఆక్సీకరణం చెందింది కార్బన్, కార్బన్ డయాక్సైడ్ కాదు. అందుకే (a), (b) వాక్యాలు సరి కానివి.

2. Fe2O3 + 2Al → Al2O3 + 2Fe పై చర్య దేనికి ఉదాహరణ?
(a) సంయోగ చర్య (b) ద్వంద్వ స్థానభ్రంశ చర్య (c) వియోగ చర్య (d) స్థానభ్రంశ చర్య

జవాబు చూడండి
జవాబు: సరైన జవాబు: (d) స్థానభ్రంశ చర్య.
అల్యూమినియం ఇనుము కంటే ఎక్కువ చర్యాశీలత గలది కాబట్టి ఐరన్ ఆక్సైడ్ నుంచి ఇనుమును స్థానభ్రంశం చేసింది. (గమనిక: తెలుగు పుస్తకంలో చివరి రెండు ఎంపికలకు (c), (c) అని ముద్రించారు; నాలుగో ఎంపిక (d) స్థానభ్రంశ చర్య.)

3. ఇనుప రజనుకు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు ఏమి జరుగును? సరైన సమాధానాన్ని గుర్తించండి.
(a) హైడ్రోజన్ వాయువు మరియు ఐరన్ క్లోరైడ్ ఏర్పడును. (b) క్లోరిన్ వాయువు మరియు ఐరన్ హైడ్రాక్సైడ్ ఏర్పడును. (c) ఏ చర్యా జరగదు. (d) ఐరన్ లవణం మరియు నీరు ఏర్పడును.

జవాబు చూడండి
జవాబు: సరైన జవాబు: (a) హైడ్రోజన్ వాయువు మరియు ఐరన్ క్లోరైడ్ ఏర్పడును.
Fe(ఘ) + 2HCl(జ.ద్రా) → FeCl2(జ.ద్రా) + H2(వా)
ఇనుము ఆమ్లంలోని హైడ్రోజన్‌ను స్థానభ్రంశం చేస్తుంది. బుడగలుగా వచ్చే వాయువు హైడ్రోజన్.

4. తుల్య రసాయన సమీకరణం అంటే ఏమిటి? ఎందుకు రసాయన సమీకరణాలను తుల్యం చేయాలి?

జవాబు చూడండి
జవాబు: క్రియాజనకాల వైపు, క్రియాజన్యాల వైపు ప్రతి మూలకం పరమాణువుల సంఖ్య సమానంగా ఉండే రసాయన సమీకరణాన్ని తుల్య రసాయన సమీకరణం అంటారు.
ద్రవ్యరాశి నిత్యత్వ నియమం ప్రకారం రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేము, నశింపజేయలేము. అంటే చర్యకు ముందు, తర్వాత మొత్తం ద్రవ్యరాశి సమానం. అందుకే ప్రతి మూలకం పరమాణువులు రెండు వైపులా సమానంగా ఉండేలా సమీకరణాన్ని తుల్యం చేయాలి.
ఉదాహరణ: Zn + H2SO4 → ZnSO4 + H2

5. క్రింది వాక్యాలను రసాయన సమీకరణాలుగా మార్పు చేయండి మరియు వాటిని తుల్యం చేయండి.
(a) హైడ్రోజన్ వాయువు నైట్రోజన్‌తో కలిసి అమ్మోనియా ఏర్పరచును.
(b) హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు గాలిలో మండి నీరు మరియు సల్ఫర్ డయాక్సైడ్‌లను ఏర్పరచును.
(c) బేరియం క్లోరైడ్, అల్యూమినియం సల్ఫేట్‌తో చర్య జరిపి అల్యూమినియం క్లోరైడ్ మరియు బేరియం సల్ఫేట్ అవక్షేపంను ఏర్పరుచును.
(d) పొటాషియం లోహం నీటితో చర్య జరిపి పొటాషియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువును ఇస్తుంది.

జవాబు చూడండి
జవాబు: (a) 3H2(వా) + N2(వా) → 2NH3(వా)
(b) 2H2S(వా) + 3O2(వా) → 2H2O(ద్ర) + 2SO2(వా)
(c) 3BaCl2(జ.ద్రా) + Al2(SO4)3(జ.ద్రా) → 2AlCl3(జ.ద్రా) + 3BaSO4(ఘ)
(d) 2K(ఘ) + 2H2O(ద్ర) → 2KOH(జ.ద్రా) + H2(వా)
(b) లో ముందు సల్ఫర్, హైడ్రోజన్ సమం చేసి చివరగా ఆక్సిజన్ సమం చేయండి.

6. క్రింది రసాయన సమీకరణాలని తుల్యం చేయండి.
(a) HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + H2O (b) NaOH + H2SO4 → Na2SO4 + H2O (c) NaCl + AgNO3 → AgCl + NaNO3 (d) BaCl2 + H2SO4 → BaSO4 + HCl

జవాబు చూడండి
జవాబు: (a) 2HNO3 + Ca(OH)2 → Ca(NO3)2 + 2H2O
(b) 2NaOH + H2SO4 → Na2SO4 + 2H2O
(c) NaCl + AgNO3 → AgCl + NaNO3 (ఇది మొదటి నుంచే తుల్యంగా ఉంది)
(d) BaCl2 + H2SO4 → BaSO4 + 2HCl
బ్రాకెట్ బయటి సంఖ్య బ్రాకెట్ లోపలి ప్రతి పరమాణువుకూ వర్తిస్తుంది. (తెలుగు పుస్తకంలో (d) లో HCl ను Hcl అని ముద్రించారు.)

7. క్రింది చర్యలకు తుల్య రసాయన సమీకరణాలు రాయండి.
(a) కాల్షియం హైడ్రాక్సైడ్ + కార్బన్ డయాక్సైడ్ → కాల్షియం కార్బొనేట్ + నీరు
(b) జింక్ + సిల్వర్ నైట్రేట్ → జింక్ నైట్రేట్ + సిల్వర్
(c) అల్యూమినియం + కాపర్ క్లోరైడ్ → అల్యూమినియం క్లోరైడ్ + కాపర్
(d) బేరియం క్లోరైడ్ + పొటాషియం సల్ఫేట్ → బేరియం సల్ఫేట్ + పొటాషియం క్లోరైడ్

జవాబు చూడండి
జవాబు: (a) Ca(OH)2 + CO2 → CaCO3 + H2O
(b) Zn + 2AgNO3 → Zn(NO3)2 + 2Ag
(c) 2Al + 3CuCl2 → 2AlCl3 + 3Cu
(d) BaCl2 + K2SO4 → BaSO4 + 2KCl
(తెలుగు పుస్తకంలో ఈ ప్రశ్నలో + గుర్తులు ం గా, బాణం గుర్తు లేకుండా ముద్రించారు. పై విధంగా చదువుకోండి.)

8. క్రింది రసాయనిక సమీకరణాలను తుల్యం చేసి, అవి ఏ రకమైన చర్యలో రాయండి.
(a) పొటాషియం బ్రోమైడ్(జ.ద్రా) + బేరియం అయోడైడ్(జ.ద్రా) → పొటాషియం అయోడైడ్(జ.ద్రా) + బేరియం బ్రోమైడ్(ఘ)
(b) జింక్ కార్బొనేట్(ఘ) → జింక్ ఆక్సైడ్(ఘ) + కార్బన్ డయాక్సైడ్(వా)
(c) హైడ్రోజన్(వా) + క్లోరిన్(వా) → హైడ్రోజన్ క్లోరైడ్(వా)
(d) మెగ్నీషియం(ఘ) + హైడ్రోక్లోరిక్ ఆమ్లం(జ.ద్రా) → మెగ్నీషియం క్లోరైడ్(జ.ద్రా) + హైడ్రోజన్(వా)

జవాబు చూడండి
జవాబు: (a) 2KBr(జ.ద్రా) + BaI2(జ.ద్రా) → 2KI(జ.ద్రా) + BaBr2(ఘ) : ద్వంద్వ స్థానభ్రంశ చర్య
(b) ZnCO3(ఘ) → ZnO(ఘ) + CO2(వా) : వియోగ చర్య (ఉష్ణ వియోగం)
(c) H2(వా) + Cl2(వా) → 2HCl(వా) : సంయోగ చర్య
(d) Mg(ఘ) + 2HCl(జ.ద్రా) → MgCl2(జ.ద్రా) + H2(వా) : స్థానభ్రంశ చర్య

9. ఉష్ణమోచక, ఉష్ణగ్రాహక చర్యలు అనగానేమి? ఉదాహరణలు ఇవ్వండి.

జవాబు చూడండి
జవాబు: ఉష్ణమోచక చర్య: క్రియాజన్యాలతో పాటు ఉష్ణం విడుదలయ్యే చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటారు.
ఉదాహరణ: సహజ వాయువు మండటం CH4(వా) + 2O2(వా) → CO2(వా) + 2H2O(వా) + ఉష్ణం; పొడి సున్నం నీటితో చర్య CaO + H2O → Ca(OH)2 + ఉష్ణం.
ఉష్ణగ్రాహక చర్య: చర్య జరగడానికి ఉష్ణం (శక్తి) గ్రహించబడే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటారు.
ఉదాహరణ: సున్నపురాయిని వేడి చేయడం CaCO3(ఘ) → CaO(ఘ) + CO2(వా); సూర్యకాంతిలో 2AgCl(ఘ) → 2Ag(ఘ) + Cl2(వా).

10. శ్వాసక్రియ ఎందువల్ల ఒక ఉష్ణమోచక చర్య? వివరించండి.

జవాబు చూడండి
జవాబు: మనం తిన్న ఆహారం (బియ్యం, బంగాళాదుంపలు, రొట్టె వంటి కార్బోహైడ్రేట్లు) జీర్ణక్రియలో గ్లూకోజ్‌గా విడిపోతుంది. ఈ గ్లూకోజ్ మన శరీర కణాలలో ఆక్సిజన్‌తో కలిసి శక్తిని విడుదల చేస్తుంది:
C6H12O6(జ.ద్రా) + 6O2(వా) → 6CO2(వా) + 6H2O(ద్ర) + శక్తి
ఈ చర్యలో శక్తి విడుదలవుతుంది కాబట్టి శ్వాసక్రియ ఉష్ణమోచక చర్య.

11. వియోగ చర్యలను, సంయోగ చర్యలకు వ్యతిరేకమని ఎందుకు అంటారు? ఈ చర్యలకు సమీకరణాలు రాయండి.

జవాబు చూడండి
జవాబు: సంయోగ చర్యలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒకే క్రియాజన్యం ఏర్పడుతుంది. వియోగ చర్యలో ఒకే పదార్థం విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఏర్పడతాయి. ఒకటి మరొకదానికి తిరుగు దిశ కాబట్టి వియోగ చర్యలను సంయోగ చర్యలకు వ్యతిరేకం అంటారు.
సంయోగ చర్య: CaO(ఘ) + CO2(వా) → CaCO3(ఘ)
వియోగ చర్య: CaCO3(ఘ) → CaO(ఘ) + CO2(వా) (వేడి చేసినప్పుడు)

12. ఉష్ణం, కాంతి లేదా విద్యుత్ రూపాలలో శక్తి సరఫరా చేయబడిన వియోగ చర్యలకు ఒక్కొక్క సమీకరణం వ్రాయండి.

జవాబు చూడండి
జవాబు: ఉష్ణం (ఉష్ణ వియోగం): 2Pb(NO3)2(ఘ) → 2PbO(ఘ) + 4NO2(వా) + O2(వా)
కాంతి (కాంతి వియోగం): 2AgBr(ఘ) → 2Ag(ఘ) + Br2(వా) (సూర్యకాంతిలో; నలుపు-తెలుపు ఫోటోగ్రఫీలో ఉపయోగం)
విద్యుత్ (విద్యుత్ విశ్లేషణ): 2H2O(ద్ర) → 2H2(వా) + O2(వా)

13. స్థానభ్రంశం మరియు ద్వంద్వ స్థానభ్రంశ చర్యల మధ్య తేడా ఏమిటి? ఈ చర్యలకు సమీకరణాలు రాయండి.

జవాబు చూడండి
జవాబు: స్థానభ్రంశ చర్య: ఎక్కువ చర్యాశీలత గల మూలకం తక్కువ చర్యాశీలత గల మూలకాన్ని దాని సమ్మేళనం నుంచి స్థానభ్రంశం చేస్తుంది. ఇందులో ఒక మూలకం, ఒక సమ్మేళనం చర్య జరుపుతాయి.
ఉదా: Fe(ఘ) + CuSO4(జ.ద్రా) → FeSO4(జ.ద్రా) + Cu(ఘ)
ద్వంద్వ స్థానభ్రంశ చర్య: రెండు సమ్మేళనాలు తమ అయాన్లను పరస్పరం మార్చుకుంటాయి. ఇందులో రెండూ సమ్మేళనాలే.
ఉదా: Na2SO4(జ.ద్రా) + BaCl2(జ.ద్రా) → BaSO4(ఘ) + 2NaCl(జ.ద్రా)

14. వెండిని శుద్ధి చేసేటప్పుడు, సిల్వర్ నైట్రేట్ ద్రావణం నుండి సిల్వర్‌ను సంగ్రహించడంలో కాపర్ చేత స్థానభ్రంశం చెందును. ఇందులో ఇమిడి ఉన్న చర్యను వ్రాయండి.

జవాబు చూడండి
జవాబు: Cu(ఘ) + 2AgNO3(జ.ద్రా) → Cu(NO3)2(జ.ద్రా) + 2Ag(ఘ)
రాగి వెండి కంటే ఎక్కువ చర్యాశీలత గలది కాబట్టి సిల్వర్ నైట్రేట్ నుంచి వెండిని స్థానభ్రంశం చేస్తుంది. కాపర్ నైట్రేట్ ఏర్పడటం వల్ల ద్రావణం నీలి రంగుకు మారుతుంది. ఇది స్థానభ్రంశ చర్య.

15. అవక్షేప చర్య అనగా ఏమి? సోదాహరణంగా వివరించండి.

జవాబు చూడండి
జవాబు: చర్యలో నీటిలో కరగని ఘన పదార్థం (అవక్షేపం) ఏర్పడితే ఆ చర్యను అవక్షేప చర్య అంటారు.
ఉదా 1: Na2SO4(జ.ద్రా) + BaCl2(జ.ద్రా) → BaSO4(ఘ) + 2NaCl(జ.ద్రా) (తెల్లటి బేరియం సల్ఫేట్ అవక్షేపం)
ఉదా 2: Pb(NO3)2(జ.ద్రా) + 2KI(జ.ద్రా) → PbI2(ఘ) + 2KNO3(జ.ద్రా) (పసుపు రంగు లెడ్ అయోడైడ్ అవక్షేపం)
చాలా ద్వంద్వ స్థానభ్రంశ చర్యలు అవక్షేప చర్యలే.

16. ఆక్సిజన్‌ను గ్రహించడం లేదా కోల్పోవడం పరంగా కింది ప్రతిదానిని రెండు ఉదాహరణలతో వివరించండి. (a) ఆక్సీకరణం (b) క్షయకరణం

జవాబు చూడండి
జవాబు: (a) ఆక్సీకరణం: చర్యలో ఒక పదార్థం ఆక్సిజన్‌ను పొందితే అది ఆక్సీకరణం చెందింది అంటారు.
ఉదా: 2Cu + O2 → 2CuO (రాగి ఆక్సీకరణం); C + O2 → CO2 (కార్బన్ ఆక్సీకరణం)
(b) క్షయకరణం: చర్యలో ఒక పదార్థం ఆక్సిజన్‌ను కోల్పోతే అది క్షయకరణం చెందింది అంటారు.
ఉదా: CuO + H2 → Cu + H2O (కాపర్ ఆక్సైడ్ క్షయకరణం); ZnO + C → Zn + CO (జింక్ ఆక్సైడ్ క్షయకరణం)

17. గోధుమ రంగులో మెరుస్తూ ఉండే ‘X’ అనే మూలకాన్ని గాలిలో వేడి చేసినప్పుడు నలుపు రంగులోకి మారుతుంది. ‘X’ అనే మూలకం మరియు నలుపురంగులో ఏర్పడే పదార్థం పేర్లు తెలపండి.

జవాబు చూడండి
జవాబు: X = కాపర్ (రాగి, Cu). నలుపు రంగులో ఏర్పడే పదార్థం కాపర్ (II) ఆక్సైడ్ (CuO).
2Cu(ఘ) + O2(వా) → 2CuO(ఘ)
రాగి గాలిలోని ఆక్సిజన్‌ను పొందింది కాబట్టి ఇది ఆక్సీకరణం (కృత్యం 1.11).

18. ఇనుప వస్తువులకు మనం రంగు ఎందుకు వేస్తాం?

జవాబు చూడండి
జవాబు: ఇనుము తేమ, గాలి (ఆక్సిజన్) తగిలితే తుప్పు పడుతుంది (క్షయం). రంగు ఇనుప ఉపరితలాన్ని కప్పి గాలి, తేమ తగలకుండా అడ్డుకుంటుంది. అందువల్ల ఇనుము తుప్పు పట్టకుండా ఉంటుంది. గేట్లు, కిటికీలు, ఇనుప బీరువాలకు రంగు వేయడానికి కారణం ఇదే.

19. నూనెలు మరియు కొవ్వులు కలిగిన ఆహార పదార్థాలకు నైట్రోజన్ కలుపుతారు. ఎందుకు?

జవాబు చూడండి
జవాబు: నూనెలు, కొవ్వులు గాలిలోని ఆక్సిజన్‌తో ఆక్సీకరణం చెందితే ముక్కిపోయి వాటి రుచి, వాసన మారిపోతాయి. నైట్రోజన్ చర్యాశీలత లేని వాయువు. ప్యాకెట్‌లో నైట్రోజన్ నింపితే ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆహారం ఆక్సీకరణం చెందదు, ముక్కిపోదు. అందుకే చిప్స్ తయారీదారులు ప్యాకెట్లలో నైట్రోజన్ నింపుతారు.

20. క్రింది పదాలను ఒక ఉదాహరణతో వివరించండి. (a) క్షయం (b) ముక్కిపోవడం

జవాబు చూడండి
జవాబు: (a) క్షయం: లోహం చుట్టూ ఉన్న తేమ, గాలి, ఆమ్లాల వంటి పదార్థాల వల్ల నెమ్మదిగా పాడైపోవడాన్ని క్షయం అంటారు. ఉదా: ఇనుముపై ఎరుపు-గోధుమ రంగు తుప్పు పట్టడం. వెండిపై నల్లటి పొర, రాగిపై ఆకుపచ్చ పొర కూడా క్షయమే. క్షయం వల్ల కార్లు, వంతెనలు, ఇనుప కంచెలు, ఓడలు పాడవుతాయి.
(b) ముక్కిపోవడం: నూనెలు, కొవ్వులు ఆక్సీకరణం చెందినప్పుడు వాటి వాసన, రుచి మారిపోవడాన్ని ముక్కిపోవడం అంటారు. ఉదా: ఎక్కువ రోజులు తెరిచి ఉంచిన వేయించిన పదార్థాలు చెడు వాసన రావడం. ప్రతి ఆక్సీకారకాలు కలపడం, గాలి చొరబడని డబ్బాల్లో ఉంచడం, నైట్రోజన్ నింపడం ద్వారా దీనిని నివారించవచ్చు.

10th Class Physical Science 1st Lesson Important Questions — 1, 2, 4 మార్కులు

పాఠ్యపుస్తకం ప్రశ్నలు కాకుండా, ఈ పాఠం నుంచి పరీక్షల్లో తరచూ వచ్చే రూపంలో మేము తయారు చేసిన ప్రశ్నలు ఇవి.

1 మార్కు ప్రశ్నలు

1. Which gas burns with a pop sound?

జవాబు చూడండి
Answer: Hydrogen gas.
తెలుగులో: మండుతున్న పుల్ల దగ్గర పెడితే “పాప్” శబ్దంతో మండుతుంది.

2. What is the colour of the precipitate formed when lead nitrate reacts with potassium iodide?

జవాబు చూడండి
Answer: Yellow (lead iodide, PbI2).

3. What is the chemical formula of rust?

జవాబు చూడండి
Answer: Hydrated iron(III) oxide, Fe2O3·xH2O.

4. What are the products formed when ferrous sulphate crystals are heated?

జవాబు చూడండి
Answer: Ferric oxide, sulphur dioxide and sulphur trioxide: 2FeSO4(s) → Fe2O3(s) + SO2(g) + SO3(g)
తెలుగులో: ఆకుపచ్చ స్ఫటికాలు వేడి చేస్తే రంగు మారి, ఘాటైన వాసన వస్తుంది.

5. Why is silver chloride stored in dark-coloured bottles?

జవాబు చూడండి
Answer: Silver chloride decomposes in sunlight into silver and chlorine. Dark bottles stop light from reaching it.
తెలుగులో: తెల్లటి AgCl వెలుతురులో బూడిద రంగుకు మారుతుంది.

2 మార్కుల ప్రశ్నలు

1. What is a redox reaction? Give an example.

జవాబు చూడండి
Answer: A reaction in which oxidation and reduction take place at the same time is a redox reaction. Example: ZnO + C → Zn + CO (carbon is oxidised, zinc oxide is reduced).
తెలుగులో: ఒక పదార్థం ఆక్సీకరణం, మరొకటి క్షయకరణం ఒకే చర్యలో జరుగుతాయి.

2. Write two differences between exothermic and endothermic reactions.

జవాబు చూడండి
Answer: (1) Exothermic: heat is released; endothermic: heat is absorbed. (2) Exothermic: the container becomes warm (e.g. CaO + water); endothermic: energy must be supplied as heat, light or electricity (e.g. decomposition of CaCO3).

3. What is a skeletal chemical equation? Convert Fe + H2O → Fe3O4 + H2 into a balanced equation.

జవాబు చూడండి
Answer: An equation in which the number of atoms is not equal on both sides is a skeletal (unbalanced) equation. Balanced: 3Fe(s) + 4H2O(g) → Fe3O4(s) + 4H2(g)
తెలుగులో: ముందు ఎక్కువ పరమాణువులు ఉన్న సమ్మేళనం (Fe3O4) తో మొదలుపెట్టి సమం చేయండి.

4. Why do we keep zinc granules and dilute sulphuric acid in a conical flask while testing for hydrogen? Write the equation.

జవాబు చూడండి
Answer: Zinc displaces hydrogen from the acid: Zn(s) + H2SO4(aq) → ZnSO4(aq) + H2(g). The flask also becomes warm, so the reaction is exothermic.

4 మార్కుల ప్రశ్నలు

1. Describe the electrolysis of water. Draw the diagram and write the equation.

జవాబు చూడండి
Answer: Take water in a plastic mug with two carbon electrodes connected to a 6 V battery. Add a few drops of dilute sulphuric acid. Fill two test tubes with water and invert them over the electrodes. When current is passed, bubbles form at both electrodes. The test tube at the negative electrode (cathode) collects hydrogen and the one at the positive electrode (anode) collects oxygen. The volume of hydrogen is double that of oxygen.
2H2O(l) → 2H2(g) + O2(g)
Tests: hydrogen burns with a pop sound; oxygen makes a glowing splinter burn brightly.
తెలుగులో: చిత్రంలో బ్యాటరీ, రెండు ఎలక్ట్రోడ్లు, రెండు పరీక్ష నాళికలు, H2, O2 పేర్లు తప్పకుండా గుర్తించండి. ఈ చిత్రం పాఠ్యపుస్తకం కృత్యం 1.7 లో ఉంది.

2. Iron nails are dipped in copper sulphate solution for 20 minutes. What changes do you observe? Explain with the equation and name the type of reaction.

జవాబు చూడండి
Answer: (1) The blue colour of the solution fades and becomes light green. (2) A brown coating of copper forms on the iron nails. Iron is more reactive than copper and displaces it: Fe(s) + CuSO4(aq) → FeSO4(aq) + Cu(s). This is a displacement reaction.
తెలుగులో: పోలికకు ఒక మేకును బయట ఉంచుతారు. మార్పు రెండింటిలో (ద్రావణం, మేకు) రాయాలి.

3. Explain combination, decomposition, displacement and double displacement reactions with one example each.

జవాబు చూడండి
Answer: Combination: 2Mg + O2 → 2MgO
Decomposition: 2Pb(NO3)2 → 2PbO + 4NO2 + O2
Displacement: Zn + CuSO4 → ZnSO4 + Cu
Double displacement: AgNO3 + NaCl → AgCl + NaNO3
తెలుగులో: ప్రతి రకానికి ఒక లైన్ నిర్వచనం, ఒక సమతుల్య సమీకరణం రాస్తే పూర్తి మార్కులు.

Chemical Reactions and Equations క్విజ్ — 10 ప్రశ్నలు

జవాబు చూసి, మీది సరైతేనే టిక్ పెట్టండి. కింది బార్‌లో 10 కి మీ స్కోర్ కనిపిస్తుంది. 8 దాటితే ఈ పాఠం మీకు బాగా వచ్చినట్టే.

1. Burning of magnesium in air is a:
(A) decomposition reaction   (B) combination reaction   (C) displacement reaction   (D) double displacement reaction   [1 మార్కు]

జవాబు చూడండి
(B) combination reaction — 2Mg + O2 → 2MgO

2. Quick lime reacts with water to form:
(A) calcium carbonate   (B) calcium chloride   (C) slaked lime   (D) lime stone   [1 మార్కు]

జవాబు చూడండి
(C) slaked lime, Ca(OH)2

3. When lead nitrate is heated, the brown gas evolved is:
(A) oxygen   (B) nitrogen dioxide   (C) nitrogen   (D) carbon dioxide   [1 మార్కు]

జవాబు చూడండి
(B) nitrogen dioxide (NO2)

4. In CuO + H2 → Cu + H2O, the substance reduced is:
(A) H2   (B) Cu   (C) CuO   (D) H2O   [1 మార్కు]

జవాబు చూడండి
(C) CuO

5. The reaction used in black and white photography is:
(A) decomposition by light   (B) combination   (C) double displacement   (D) neutralisation   [1 మార్కు]

జవాబు చూడండి
(A) decomposition by light (photolytic decomposition of AgBr)

6. Which metal can displace copper from copper sulphate solution?
(A) silver   (B) gold   (C) zinc   (D) platinum   [1 మార్కు]

జవాబు చూడండి
(C) zinc

7. Respiration is a/an:
(A) endothermic reaction   (B) exothermic reaction   (C) decomposition by light   (D) precipitation reaction   [1 మార్కు]

జవాబు చూడండి
(B) exothermic reaction

8. The white precipitate formed by mixing sodium sulphate and barium chloride is:
(A) NaCl   (B) BaSO4   (C) BaCl2   (D) Na2SO4   [1 మార్కు]

జవాబు చూడండి
(B) BaSO4

9. Food packets are flushed with which gas to prevent rancidity?
(A) oxygen   (B) hydrogen   (C) nitrogen   (D) chlorine   [1 మార్కు]

జవాబు చూడండి
(C) nitrogen

10. In electrolysis of water, the ratio of volumes of hydrogen and oxygen is:
(A) 1 : 2   (B) 2 : 1   (C) 1 : 1   (D) 3 : 1   [1 మార్కు]

జవాబు చూడండి
(B) 2 : 1

ఈ పాఠంలో మార్కులు ఎక్కడ పోతాయి

  1. సమీకరణం సమం చేసేటప్పుడు ఫార్ములా లోపలి చిన్న సంఖ్యలు (subscripts) మార్చడం. గుణకాలు (coefficients) మాత్రమే మార్చాలి.
  2. స్థితి సంకేతాలు (s, l, g, aq) అడిగినప్పుడు రాయకపోవడం. అవక్షేపానికి (s) తప్పనిసరి.
  3. “లెడ్ క్షయకరణం చెందింది” అని రాయడం. క్షయకరణం చెందేది లెడ్ ఆక్సైడ్. సమ్మేళనం పేరు పూర్తిగా రాయాలి.
  4. స్థానభ్రంశం, ద్వంద్వ స్థానభ్రంశం కలిపేయడం. ఒక మూలకం ఉంటే స్థానభ్రంశం, రెండూ సమ్మేళనాలైతే ద్వంద్వ స్థానభ్రంశం.
  5. విద్యుత్ విశ్లేషణ చిత్రంలో కాథోడ్ దగ్గర ఆక్సిజన్ అని రాయడం. కాథోడ్ (ఋణ ధ్రువం) దగ్గర హైడ్రోజన్, అదీ రెట్టింపు పరిమాణంలో వస్తుంది.

తర్వాత ఏం చదవాలి

  1. 10th Class Chemistry Chapter 2 Notes in Telugu — తర్వాతి పాఠం ఆమ్లాలు, క్షారాలు, లవణాలు
  2. AP 10th Class SA1 Physical Science Question Paper 2026-27 — SA1 సాధన పేపర్ జవాబులతో
  3. 10th Class Chemistry Important Questions 2026 — అన్ని రసాయన శాస్త్ర పాఠాల ముఖ్య ప్రశ్నలు
  4. AP 10th Class Chemistry Bits in Telugu — బిట్స్ సాధన

FAQs

AP 10th Class Physical Science లో ఎన్ని పాఠాలు ఉన్నాయి?

2026-27 పుస్తకంలో ఎనిమిది: Chemical Reactions and Equations, Acids Bases and Salts, Metals and Non-metals, Carbon and its Compounds (రసాయన శాస్త్రం), Light – Reflection and Refraction, The Human Eye and the Colourful World, Electricity, Magnetic Effects of Electric Current (భౌతిక శాస్త్రం).

Chemical Reactions and Equations పాఠం ఏ నెలలో చెబుతారు?

AP SCERT ఉపాధ్యాయ కరదీపిక ప్రకారం జూన్‌లో, సంవత్సరంలో మొదటి పాఠంగా.

ఈ పాఠంలో ఎన్ని కృత్యాలు (Activities) ఉన్నాయి?

పుస్తకంలో కృత్యం 1.1 నుంచి 1.11 వరకు 11 కృత్యాలు, బేరియం హైడ్రాక్సైడ్-అమ్మోనియం క్లోరైడ్ అదనపు కృత్యం, పాఠం చివర నాలుగు బీకర్ల సమూహ కృత్యం ఉన్నాయి. అన్నింటి పరిశీలనలు పై కృత్యాలు విభాగంలో ఉన్నాయి.

ఈ పాఠంలో ఎన్ని అభ్యాస ప్రశ్నలు ఉన్నాయి?

పాఠం చివర 20 ప్రశ్నలు, పాఠం మధ్యలో 8 In-text ప్రశ్నలు. అన్నింటికీ జవాబులు ఈ పేజీలో ఉన్నాయి.

రసాయన సమీకరణం సులువుగా ఎలా సమం చేయాలి?

ఎక్కువ పరమాణువులు ఉన్న సమ్మేళనంతో మొదలుపెట్టండి. ఒక్కో మూలకం పరమాణువులు లెక్కించి గుణకాలు మార్చండి. ఆక్సిజన్, హైడ్రోజన్ చివర్లో సమం చేయండి. ఫార్ములాలోని చిన్న సంఖ్యలు ఎప్పుడూ మార్చవద్దు.

ఆక్సీకరణం, క్షయకరణం గుర్తుంచుకునే సులువు మార్గం?

ఆక్సిజన్ పొందితే లేదా హైడ్రోజన్ కోల్పోతే ఆక్సీకరణం. ఆక్సిజన్ కోల్పోతే లేదా హైడ్రోజన్ పొందితే క్షయకరణం.

ఉష్ణమోచక చర్యకు ఇంట్లో కనిపించే ఉదాహరణ?

పొడి సున్నంలో నీళ్లు పోస్తే పాత్ర బాగా వేడెక్కుతుంది. గ్యాస్ స్టవ్ మీద వంట గ్యాస్ మండటం కూడా ఉష్ణమోచక చర్యే.

ఇనుము తుప్పు పట్టకుండా ఎలా కాపాడాలి?

రంగు వేయడం, నూనె లేదా గ్రీజు పూయడం, జింక్ పూత (గాల్వనైజేషన్), క్రోమియం పూత వేయడం.

ఈ జవాబులు తెలుగు మీడియం విద్యార్థులకు పనికొస్తాయా?

అవును. పుస్తకంలోని తెలుగు ప్రశ్నలు అదే పదాలతో, పూర్తి తెలుగు జవాబులతో ప్రత్యేకంగా తెలుగు మీడియం జవాబులు విభాగంలో ఉన్నాయి. ఇంగ్లీష్ జవాబుల కింద కూడా తెలుగు వివరణ ఉంది. సమీకరణాలు రెండు మీడియంలలోనూ ఒకటే.

SA1 లో ఈ పాఠం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?

సమీకరణం సమం చేయడం, చర్య రకం గుర్తించడం, ఆక్సీకరణ-క్షయకరణం, విద్యుత్ విశ్లేషణ చిత్రం, క్షయం, ముక్కిపోవడం ఎక్కువగా వస్తాయి. SA1 అన్ని పాఠాల జాబితా AP SA1 Syllabus 2026-27 లో ఉంది.

మిగతా 7 పాఠాల జవాబులు ఎక్కడ ఉన్నాయి?

ఎనిమిది పాఠాల జవాబులూ ఇదే రూపంలో సిద్ధంగా ఉన్నాయి: 2nd Lesson – Acids, Bases and Salts, 3rd Lesson – Metals and Non-metals, 4th Lesson – Carbon and its Compounds, Light – Reflection and Refraction, The Human Eye and the Colourful World, Electricity, Magnetic Effects of Electric Current. గణితం జవాబులు AP 10th Class Maths Solutions లో ఉన్నాయి.

Official Sources

కృత్యాల వివరాలు, పేజీ సంఖ్యలు: AP SCERT 2026-27 పదో తరగతి భౌతిక శాస్త్రం పాఠ్యపుస్తకం (ఇంగ్లీష్-తెలుగు ద్విభాషా), అధ్యాయం 1, పేజీలు 2-35. ఇక్కడి పరిశీలనలు, వివరణలు మా సొంత మాటల్లో రాసినవి.

పాఠాల జాబితా, నెలవారీ ప్రణాళిక: AP SCERT పదో తరగతి భౌతిక శాస్త్రం ఉపాధ్యాయ కరదీపిక (Teacher’s Handbook), పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్. పాఠ్యపుస్తకాలు పాఠశాల విద్యాశాఖ సైట్‌లో లభిస్తాయి. జవాబులు మా సొంత మాటల్లో రాశాం.

పదో తరగతి అన్ని సబ్జెక్టుల జవాబులు, స్టడీ మెటీరియల్, ప్రశ్నపత్రాలు ఒకే చోట: AP Board Solutions Class 10. SA1 పరీక్షల (9 – 20 నవంబర్ 2026) సాధనకు AP SA1 2026-27; గణితం ఎక్సర్‌సైజ్ జవాబులకు AP 10th Class Maths Solutions; SSC కి AP SSC Model Papers 2027.