10th Class Physics Study Material English Medium PDF Download

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ పేజీలో 10th Class Physics Study Material English Medium PDF 2026-27 — ఇప్పటి AP పదో తరగతి Physical Science పుస్తకంలోని నాలుగు భౌతిక శాస్త్ర అధ్యాయాలకు మేము తయారు చేసిన ఇంగ్లీష్ నోట్స్. ప్రతి అధ్యాయానికి ముఖ్యాంశాలు, సూత్రాలు, సాధించిన లెక్కలు, జవాబులతో ముఖ్య ప్రశ్నలు ఒకే PDF లో ఉన్నాయి.

పాత మెటీరియల్ గురించి: ఈ పేజీలో ఇదివరకు Heat, Refraction of Light at Curved Surfaces, Electromagnetism వంటి ఏడు అధ్యాయాల ఫైళ్లు ఉండేవి. అవి పాత పాఠ్యపుస్తకంవి — ఇప్పటి పుస్తకంలో ఆ అధ్యాయాలు లేవు. అందుకే తీసేసి, ఇప్పటి సిలబస్‌కు కొత్త నోట్స్ పెట్టాం.


10th Class Physics Study Material English Medium 2026-27 — నాలుగు అధ్యాయాలు

Physical Science పుస్తకంలో 1 – 4 అధ్యాయాలు రసాయన శాస్త్రం, 9 – 12 భౌతిక శాస్త్రం. తేదీలు BSE Mission March స్లిప్ టెస్టులవి — ఆ వారంలోనే ఆ అధ్యాయం పూర్తవుతుంది.

అధ్యాయంపేరుస్లిప్ టెస్ట్SA1 లోమా సైట్‌లో
9Light – Reflection and Refraction
కాంతి – పరావర్తనం, వక్రీభవనం
30 జూలైఉందిSA1 సాధన పత్రం, సూత్రాలు
10The Human Eye and the Colourful World
మానవ నేత్రం, రంగుల ప్రపంచం
3 సెప్టెంబర్ఉందిస్లిప్ టెస్ట్ పేజీ, FA2 పేపర్
11Electricity
విద్యుత్
1 అక్టోబర్ఉందిFA2, SA1 పేపర్లు
12Magnetic Effects of Electric Current
విద్యుత్ ప్రవాహ అయస్కాంత ప్రభావాలు
26 నవంబర్లేదుఈ పేజీ PDF లో నోట్స్

10th Class Physics Study Material English Medium 2026-27 — అధ్యాయాలు 9 నుంచి 12, SA1 లో ఉన్నవి

నాలుగు అధ్యాయాలు, ఒక్కోదాని ముఖ్య అంశాలు, SA1 లో ఉన్నదీ లేనిదీ.


10th Class Physics Study Material English Medium PDF Download

నాలుగు అధ్యాయాల నోట్స్ (ఇంగ్లీష్ మాధ్యమం): Download PDF. ఇందులో పుటాకార దర్పణం, కుంభాకార కటకం ప్రతిబింబాల పట్టికలు, sign convention, దృష్టి లోపాల పట్టిక, 4 సాధించిన లెక్కలు, 12 ముఖ్య ప్రశ్నలు ఉన్నాయి.

ఇది పునశ్చరణ నోట్స్ మాత్రమే — కృత్యాలు, పాఠం చివరి ప్రశ్నలు పాఠ్యపుస్తకం నుంచే చదవాలి. పదో తరగతి పాఠ్యపుస్తకాలు AP Board Solutions Class 10 Maths and All Textbooks పేజీలో, మిగిలిన సబ్జెక్టుల ఇంగ్లీష్ మెటీరియల్ AP 10th Class English Medium Study Materials పేజీలో ఉన్నాయి.


ప్రతి అధ్యాయంలో తప్పక రావాల్సిన సూత్రాలు

అధ్యాయంఅంశంసూత్రంగుర్తుంచుకోవాల్సింది
9దర్పణ సూత్రం1/v + 1/u = 1/fu ఎప్పుడూ రుణాత్మకం; పుటాకార దర్పణం f రుణాత్మకం
9కటక సూత్రం1/v − 1/u = 1/fకుంభాకార కటకం f ధనాత్మకం
9ఆవర్ధనందర్పణం m = −v/u; కటకం m = v/um రుణాత్మకం అయితే నిజ, తలకిందుల ప్రతిబింబం
9కటక సామర్థ్యంP = 1/f (f మీటర్లలో)ప్రమాణం డయాప్టర్ (D); సెం.మీ.లో ఉన్న f ను ముందు మీటర్లకు మార్చాలి
9వక్రీభవన గుణకంn = c/vc = 3 × 10⁸ m/s; నీరు 1.33, గాజు 1.52, వజ్రం 2.42
11విద్యుత్ ప్రవాహంI = Q/t1 A = 1 C/s; అమ్మీటర్ శ్రేణిలో
11ఓమ్ నియమంV = IRస్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే
11నిరోధంR = ρl/Aρ ప్రమాణం Ω m
11శ్రేణి, సమాంతరంRs = R1 + R2; 1/Rp = 1/R1 + 1/R2ఇళ్లలో వైరింగ్ సమాంతరం
11ఉష్ణ ఫలితం, సామర్థ్యంH = I²Rt; P = VI = I²R = V²/R1 kWh = 3.6 × 10⁶ J

10వ అధ్యాయంలో సూత్రాల కంటే పటాలు, కారణాలు ముఖ్యం — ఆకాశం నీలంగా ఎందుకు, నక్షత్రాలు ఎందుకు మిణుకుమిణుకుమంటాయి, హ్రస్వదృష్టికి పుటాకార కటకం ఎందుకు. తెలుగులో ప్రతి సూత్రానికి వివరణ 10th Class Physics Formulas in Telugu PDF లో ఉంది.


పరీక్షకు సాధన — ఏ పేజీలో ఏముంది


Physics లో మార్కులు జారిపోయే చోట్లు

  • u కి మైనస్ గుర్తు పెట్టకపోవడం. వస్తువు ఎప్పుడూ ఎడమవైపు — u ఎప్పుడూ రుణాత్మకం.
  • దర్పణం, కటకం సూత్రాలు కలిపేయడం. దర్పణానికి 1/v + 1/u, కటకానికి 1/v − 1/u.
  • P = 1/f లో f సెం.మీ.లోనే పెట్టడం. 50 సెం.మీ. = 0.5 మీ.; లేకపోతే జవాబు 100 రెట్లు తప్పు.
  • కిరణ చిత్రంలో బాణం గుర్తులు, F, C గుర్తులు లేకపోవడం. పటం సరిగా ఉన్నా మార్కులు తగ్గుతాయి.
  • సమాంతర నిరోధాల్లో 1/Rp దగ్గరే ఆగిపోవడం. చివరగా దాన్ని తలకిందులు చేసి Rp రాయాలి.
  • జవాబు చివర యూనిట్ లేకపోవడం. Ω, A, V, W, D — ప్రతి లెక్కకూ యూనిట్ తప్పనిసరి.

FAQs


AP 10th Class Physics లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?

Physical Science పాఠ్యపుస్తకంలో భౌతిక శాస్త్రం అధ్యాయాలు నాలుగు: 9 (Light – Reflection and Refraction), 10 (The Human Eye and the Colourful World), 11 (Electricity), 12 (Magnetic Effects of Electric Current). 1 – 4 అధ్యాయాలు రసాయన శాస్త్రం.

ఈ పేజీలో ఇదివరకు ఉన్న Heat, Electromagnetism ఫైళ్లు ఎక్కడ?

అవి పాత పాఠ్యపుస్తకం అధ్యాయాలు. ఇప్పటి పుస్తకంలో Heat, Refraction of Light at Curved Surfaces, Electromagnetism అనే అధ్యాయాలు లేవు. అవి చదివితే సమయం వృథా కాబట్టి తీసేశాం.

10th Class Physics Study Material English Medium PDF ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

పై Download PDF లింక్ నొక్కండి. నాలుగు అధ్యాయాల నోట్స్, సూత్రాలు, సాధించిన లెక్కలు, ముఖ్య ప్రశ్నలు ఒకే PDF లో వస్తాయి. లాగిన్ అవసరం లేదు.

SA1 లో ఏ Physics అధ్యాయాలు వస్తాయి?

9, 10, 11 అధ్యాయాలు. 12వ అధ్యాయం Mission March లో 26 నవంబర్, అంటే SA1 (9 – 20 నవంబర్) తర్వాత. రసాయన శాస్త్రంలో 1 – 4 అధ్యాయాలు SA1 లో ఉంటాయి.

ఈ నోట్స్ పాఠ్యపుస్తకానికి బదులుగా సరిపోతాయా?

సరిపోవు. ఇవి పునశ్చరణ కోసం. కృత్యాలు, పటాలు, పాఠం చివరి ప్రశ్నలు పాఠ్యపుస్తకం నుంచే చదవాలి; ఆ తర్వాత ఈ PDF తో త్వరగా తిరగేయవచ్చు.

Sign convention లో u ఎందుకు రుణాత్మకం?

వస్తువును ఎప్పుడూ దర్పణం / కటకం ఎడమ వైపు ఉంచుతాం; పతన కాంతికి వ్యతిరేక దిశలో కొలిచే దూరాలు రుణాత్మకం. అందుకే u కి ఎప్పుడూ మైనస్ గుర్తు.

Telugu Medium విద్యార్థులకు ఈ PDF ఉపయోగపడుతుందా?

ఈ PDF ఇంగ్లీషులో ఉంది. సూత్రాలు, సమీకరణాలు రెండు మాధ్యమాల్లోనూ ఒకటే కాబట్టి లెక్కలకు ఉపయోగపడుతుంది. ఇవే నాలుగు అధ్యాయాల తెలుగు నోట్స్ 10th Class Physics Study Material Telugu Medium PDF పేజీలో ఉన్నాయి.

Physics లో మార్కులు ఎక్కువగా ఎక్కడ పోతాయి?

లెక్కల్లో యూనిట్ మరచిపోవడం, సెం.మీ.ను మీటర్లకు మార్చకుండా P = 1/f వాడడం, కిరణ చిత్రాల్లో బాణం గుర్తులు లేకపోవడం. కింది జాబితా చూడండి.

Human Eye అధ్యాయంలో ఏ పటాలు ముఖ్యం?

మానవ నేత్రం నిర్మాణం, హ్రస్వదృష్టి – దాని సవరణ, దీర్ఘదృష్టి – దాని సవరణ, పట్టకం ద్వారా వర్ణ విక్షేపణం. భాగాల పేర్లు తప్పకుండా రాయాలి.

ఈ పేజీ, AP 10th Class Physical Science FA2 / SA1 పేపర్ల మధ్య తేడా ఏమిటి?

ఈ పేజీ అధ్యాయాల నోట్స్, సూత్రాల కోసం. ప్రశ్నపత్రం రూపంలో సాధన కావాలంటే FA2, SA1 సాధన పత్రాల పేజీలు ఉన్నాయి — లింకులు పైన ఉన్నాయి.


Official Sources

అధ్యాయాల క్రమం, స్లిప్ టెస్ట్ తేదీలు: Board of Secondary Education, Andhra Pradesh Mission March SSC 2027 Phase-I షెడ్యూల్. SA1 తేదీలు: AP SCERT అకడమిక్ క్యాలెండర్ 2026-27. అధ్యాయాల పేర్లు NCERT Science (Class X) పుస్తకంలోని 9 – 12 అధ్యాయాలతో సరిపోతాయి: NCERT Science Textbook Class X.